ప్రధాన వార్తలు

మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట.. పలువురు మృతి
Manasa Devi Temple Stampede.. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హరిద్వార్ మన్సాదేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం కారణంగా ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హరిద్వార్‌లోని మన్సాదేవి ఆలయం వద్ద ఆదివారం ఉదయం అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రావణమాసం, ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జులై 23వ తేదీన మాస శివరాత్రి జలాభిషేకం తర్వాత, లక్షలాది మంది కన్వర్ యాత్రికులు, సామాన్య ప్రజలు ఇప్పటికే హరిద్వార్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో అక్కడి చేరుకోవడంతో.. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. हरिद्वार के मनसा देवी मंदिर में भगदड़, 6 लोगों की मौत◆ भगदड़ में 25 से 30 लोग घायल◆ बताया जा रहा है कि ये हादसा सीढ़ियों में करंट उतरने की वजह से हुआ #MansaDeviMandir | Mansa Devi Mandir | #MansaDeviTemple pic.twitter.com/V1pLALBwJC— News24 (@news24tvchannel) July 27, 2025 #WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3— ANI (@ANI) July 27, 2025

ఆగస్టు 23 నాటికి సలహాలు, సూచనలు పంపండి: ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్ స్పేస్ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను వాడుకోవాలన్నారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని మోదీ చెప్పుకొచ్చారు.ప్రధాని మోదీ 124వ మన్‌కీ బాత్ కార్యక్రమం నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో మోదీ.. ఇటీవల కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని.. అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇటీవల శుభాన్షు శుక్లా ఐఎస్ఎస్కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని పేర్కొన్నారు. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్ సైన్స్‌పై ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇన్స్పైర్ మనక్ అభియాన్ గురించి మాట్లాడారు. ఈ పథకం విద్యార్థులను ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించే కార్యక్రమమని తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.ప్రతి విద్యార్థి ఓ కొత్త ఆలోచనతో వస్తారని.. ఇప్పటి వరకు ఇందులో లక్షలాది మంది చేరారన్నారు. భారత్‌లో ఐదేళ్ల క్రితం దేశంలో 50 కంటే తక్కువ స్పేస్ స్టార్టప్స్ మాత్రమే ఉండేవని.. ప్రస్తుతం స్పేస్ రంగంలో 200 కంటే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయని వివరించారు. ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. దీన్ని ఎలా జరుపుకుంటారు? కొత్త ఆలోచనలను నమో యాప్ ద్వారా తనకు తెలియజేయాలని కోరారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారన్నారు.In the 124th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "In Mann Ki Baat, once again, we will talk about the successes of the country, the achievements of the countrymen. Recently, there was a lot of discussion in the country about the return of Shubhanshu Shukla… pic.twitter.com/WcVQa0fXOG— ANI (@ANI) July 27, 2025ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలిచారన్నారు. ముంబైలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరుగునుందని చెప్పారు. ఇది అతిపెద్ద ఒలింపియాడ్ అవుతుందన్నారు. భారత్ ఇప్పుడు ఒలింపిక్స్, ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోందన్నారు.

‘సృష్టి’ కేసు.. డాక్టర్ నమ్రత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నిర్వహణ సాగిస్తుండగా, పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం.. బీహార్ నుంచి పూజారులను పిలిపించిన డాక్టర్ నమ్రత.. 9 రోజుల పాటు.. ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నంలోని పలు ఫెర్టిలిటి సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. మహారాణిపేట పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లోర్లలో అనధికారంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో లైసెన్సు ముగిసినప్పటికీ అనధికారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మోసం బయటపడింది ఇలా..నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు.తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్‌బీలోని టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం.

చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టును డ్రాగా ముగించేందుకు టీమిండియా పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.311 పరుగుల లోటుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే క్రిస్ వోక్స్ బిగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లో వరుస బంతుల్లో యశస్వి జైశ్వాల్(0), సాయిసుదర్శన్(0) పెవిలియన్‌కు పంపాడు. భారత్ సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో నాలుగో రోజే భారత కథ ముగుస్తుందని అంతా భావించారు.కానీ కేఎల్ రాహుల్(87 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్(78 నాటౌట్) తమ అద్బుత బ్యాటింగ్‌తో అడ్డుగోడగా నిలిచారు. వీరిద్దరూ 62 ఓవర్లు పాటు తమ వికెట్‌ను కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్-రాహుల్ జోడీ పలు అరుదైన ఘనతలను తమ పేరిట లిఖించుకున్నారు.తొలి జోడీగాఒక టెస్టు మ్యాచ్‌లో 'సున్నా' పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత థర్డ్ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-రాహుల్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు దిగ్గజాలు మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ పేరిట ఉండేది.1977లో ఆస్ట్రేలియాపై ఇటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ మూడో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే తాజా మ్యాచ్‌లో మూడో వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రాహుల్-గిల్ జంట 49 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్‌ను బ్రేక్ చేసింది.కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్టు సిరీస్‌లో శుబ్‌మన్ గిల్, రాహుల్ ఇద్దరూ 500 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 697 పరుగులు చేయగా.. రాహుల్ 508 రన్స్ చేశాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేయడం గత 54 ఏళ్లలో ఇదే మొదటిసారి. వీరికంటే ముదు 1970-71 విండీస్ పర్యటనలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ ఈ ఫీట్ సాధించారు. ఆ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ (774), దిలీప్ సర్దేశాయ్ (642) పరుగులు చేశారు.చదవండి: IND vs ENG: షాకింగ్.. 'జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే రిటైర్మెంట్'

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే యోచన ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో స్పష్టం చేసింది. రూ.2000 దాటిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఎలాంటి సిఫారసు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వర్షాకాల సమావేశాల్లో చెప్పారు.రూ.2000 మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందా అనే ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, జీఎస్టీ రేట్లు, మినహాయింపులను కేంద్రం, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులతో కూడిన రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని సభకు తెలిపారు. యూపీఐ ట్రాన్సాక్షన్ డేటా ఆధారంగా కర్ణాటకలోని వ్యాపారులకు దాదాపు 6,000 జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి.మరోవైపు యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.

రెండు కోహినూర్ కథలు!
నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్ లైన్లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం మరోసారి సింగపూర్‌ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.సింగపూర్ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్ ఏరియా ఒప్పందంలో సింగపూర్ తరఫున మంత్రి ఈశ్వరన్ కీలక భూమిక పోషించారు. ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్‌కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్ పాత్ర కారణంగా ఉండాలి.ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్ బ్రాండ్ మనకు కోహినూర్ డైమండ్ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్‌పై ఓ కామెంట్ విసిరి ఆయన సింగపూర్ వెళ్ళారు.గతంలో కుదిరిన స్టార్టప్ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్ సిటీ డెవలప్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్ మెంట్ పార్ట్ట్‌నర్స్’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది. ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్ నేతృత్వంలో వచ్చిన సింగపూర్ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.ఇక రెండో కోహినూర్ కథలో నిజంగానే కోహినూర్ డైమండ్ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్ కల్యాణ్ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది. విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంత చిన్న విషయంపై కూడా పవన్ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్‌సింగ్ వశమై లాహోర్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్ వారితో లండన్‌కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్ కోహినూర్‌ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్ చక్రవర్తి. ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్ కల్యాణ్ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు. కానీ, మొఘల్ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్ పవర్‌గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్ అని ఊరికే అనలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్‌వాళ్లే కాని, మొఘల్స్ కాదు. బాబర్ సెంట్రల్ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్‌మహల్ వంటి సంత కాలను చేశారు. బ్రిటిష్ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కాదా? బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్‌లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

విమానం టేకాఫ్ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్‌పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం టేకాప్‌కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్స్టాఫ్ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్‌పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.Landing gear bursts into flames on American Airlines plane at Denver airport. One person was injured. pic.twitter.com/VQlOAkQQwp— Pop Crave (@PopCrave) July 27, 2025విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్‌పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్‌లో టెర్మినల్‌కు తరలించారు. విమానం టైర్‌కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్‌వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.🚨EMERGENCY AT DENVER AIRPORT: An American Airlines Boeing 737 Max 8 was forced to evacuate passengers after its landing gear caught fire during landing.Why always Boeing?pic.twitter.com/FT5tLeqtOr— 𝗗𝗼𝗻𝗮𝗹𝗱𝗼 𝗧𝗿𝘂𝗺𝗽ø 🇺🇲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 (@TrumpUpdateHQ) July 27, 2025There was a plane on fire at Denver airport today.Here's a woman who was nearly in a plane crash yesterday explaining her experience.pic.twitter.com/YCDMPPi4YF— Owen Shroyer (@OwenShroyer1776) July 27, 2025

థాయ్, కంబోడియా శాంతి చర్చలకు గ్రీన్‌సిగ్నల్: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: థాయ్‌ల్యాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పారు. అనంతరం, భారత ప్రధాని మోదీ ప్రకటనతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.Donald J. Trump Truth Social 07.26.25 12:23 PM EST pic.twitter.com/QB03NMNe9G— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 26, 2025ఇదిలా ఉండగా.. థాయ్‌ల్యాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో ఎఫ్-16 విమానాలు, డ్రోన్లను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. గత గురువారం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్‌ల్యాండ్ సైనికులు గాయాలపాలు కావడం ఈ సంఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని ఉపసంహరించాయి. కంబోడియాలో తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ పోరాటాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్)పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్ ఫియాక్ట్రా వెల్లడించారు.

ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్‌ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్‌కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.- చందు డొంకాన

కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్‌యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్‌డీకి గైడ్‌గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
మళ్లీ థియేటర్లలోకి ధనుష్ రొమాంటిక్ మూవీ
చేతులు మారుతున్న హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ
మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఈసీఎం స్కీమ్.. రూ.16 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
సన్నగా అవ్వాలని తిండి మానేశా.. ఆ వ్యాధి వచ్చింది!
సాక్షి కార్టూన్ 27-07-2025
ఆ హీరోయిన్ నాకు బాగా నచ్చింది..అందుకే సినిమాలో పెట్టుకున్నా : నిర్మాత
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
ఓటీటీలో 'తమ్ముడు' సినిమా.. అధికారిక ప్రకటన
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
విశ్వంభరకు బై బై
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
పుట్టబోయే బిడ్డ కోసం మెగా జంట షాపింగ్
సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
విస్కీ ధరలు తగ్గింపు..?
భార్య భర్తలనగానే కలసి తినాలా? నువ్ కాసేపు ఆగి తినొచ్చుగా!!
ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!?
పాడైన కాలేయానికి.. పునరుజ్జీవం
... నిన్నొకరినే కాదమ్మా ఆయన ప్రపంచాన్నే అదోలా చూస్తున్నారు...!!
మళ్లీ థియేటర్లలోకి ధనుష్ రొమాంటిక్ మూవీ
చేతులు మారుతున్న హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ
మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఈసీఎం స్కీమ్.. రూ.16 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే
సన్నగా అవ్వాలని తిండి మానేశా.. ఆ వ్యాధి వచ్చింది!
సాక్షి కార్టూన్ 27-07-2025
ఆ హీరోయిన్ నాకు బాగా నచ్చింది..అందుకే సినిమాలో పెట్టుకున్నా : నిర్మాత
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
ఓటీటీలో 'తమ్ముడు' సినిమా.. అధికారిక ప్రకటన
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!
తల్లి ఏమరపాటు.. బిడ్డ ప్రాణం తీసింది
'హరి హర వీరమల్లు' మొదటిరోజు కలెక్షన్స్.. గట్టిగానే బాయ్‌కాట్ దెబ్బ
'మళ్లీ ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికింది': అనసూయ
బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు
విశ్వంభరకు బై బై
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలు విస్తరిస్తారు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ
భారతీయులను నియమించకుండా కాపలాగా నాడ్యూటీ తనే చేస్తున్నారు!
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
పుట్టబోయే బిడ్డ కోసం మెగా జంట షాపింగ్
సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
వేలాది లేఆఫ్‌లు.. ఎమోషనల్ అయిన మైక్రోసాఫ్ట్ సీఈవో
ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!
విస్కీ ధరలు తగ్గింపు..?
భార్య భర్తలనగానే కలసి తినాలా? నువ్ కాసేపు ఆగి తినొచ్చుగా!!
ఏడ్చేసిన కరుణ్ నాయర్.. ఓదార్చిన కేఎల్ రాహుల్.. ఇక గుడ్‌బై!?
పాడైన కాలేయానికి.. పునరుజ్జీవం
... నిన్నొకరినే కాదమ్మా ఆయన ప్రపంచాన్నే అదోలా చూస్తున్నారు...!!
సినిమా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్, భాగ్యశ్రీ (వీడియో)
విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా భారీ అంచనాలతో జూలై 31న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నాగవంశీ నిర్మించారు. అయితే, సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.ట్రైలర్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలంగా ఆయన భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కింగ్డమ్ విజయం తన కెరీర్‌కు ఎంత ముఖ్యమో చెబుతూ తన మనసులో మాట ఇలా చెప్పాడు. ' మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను. ఈసారి నా సినిమాని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ, వెంకన్నస్వామి దయ, ప్రేక్షకుల ఆశీసులు. ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే' అంటూ ఆయన అన్నారు. సినిమా వేడుక అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీసులు తీసుకున్నాడు. దీంతో విజయ్, భాగ్యశ్రీ, నాగవంశీ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.#KINGDOM team Divine Visit to Tirupathi ✨️❤️@TheDeverakonda and team completed Lord Venkateswara Swamy Darshanam in the early hours today 🙏Gearing up to surprise in theatres on July 31st💥💥#VijayDeverakonda #BhagyashriBorse pic.twitter.com/iLQM5374jB— Eluru Sreenu (@IamEluruSreenu) July 27, 2025

కొన్నేళ్లుగా ఈ ఫోటోలు నా ఫోన్లో ఉన్నాయి.. ఎన్నో జ్ఞాపకాలు: రష్మిక
రష్మిక- విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నారనే వార్తలు గత కొన్నాళ్లుగా టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అటు విజయ్ కానీ, రష్మిక కానీ నేరుగా స్పందించలేదు. అలా అని ఆ వార్తను ఖండించనూ లేదు. పైగా అప్పుడప్పుడు ఇద్దరు కలిసి పార్టీస్‌కి, వెకేషన్స్‌కి వెళ్లడం.. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ప్రేమలో ఉన్నది నిజమనే అంతా నమ్ముతున్నారు. వీరిద్దరు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా ఆ నమ్మకాన్ని మరింత పెంచేస్తుంది.తాజాగా రష్మిక డియర్ కామ్రెడ్ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం రిలీజై ఆరేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..‘ఆరేళ్ల డియర్ కామ్రేడ్.. ఎంతో ప్రేమ, ఆనందం, పాజిటివిటీ నింపిన చిత్రమిది. ఈ ఫోటోలు చాలా ఏళ్ల క్రితం తీసినవి. ఇప్పటికీ నా ముబైల్లో అలాగే దాచుకున్నా. వాటిని తిరిగి చూస్తుంటే.. ఆ మదుర క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మనకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది’ అంటూ రష్మిక విజయ్ దేవరకొండతో పాటు చిత్రబృందంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని టాలీవుడ్ టాక్. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

'హరి హర వీరమల్లు'కు జూనియర్ దెబ్బ
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సినిమా మేకింగ్, గ్రాఫిక్స్ పనితీరుపై తీవ్రమైన విమర్శలు రావడంతో వీరమల్లుపై గట్టిదెబ్బ పడింది. రెండో రోజున బాక్సాఫీస్ వద్ద 85 శాతం వరకు కలెక్షన్స్ పడిపోయాయి. దీంతో చాలా చోట్ల శనివారం నుంచే వీరమల్లును తొలగించి మరో సినిమాను ప్రదర్శించారు. ఈ క్రమంలో వైజాగ్‌లోని లీలామహల్, వెంకటేశ్వర వంటి గుర్తింపు ఉన్న సింగిల్ థియేటర్స్ నుంచి వీరమల్లు చిత్రాన్ని తొలగించేశారు.'లీలామహల్' నుంచి వీరమల్లు ఔట్విశాఖపట్నంలో లీలామహల్ థియేటర్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 600 సీట్లతో నిర్మించిబడిన ఈ థియేటర్‌కు 50 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రీసెంట్గా పెద్ద ఎత్తున అధునీకరణ చేశారు. జనసేన ఎమ్మేల్యేలు కూడా తమ కార్యకర్తలతో జులై 24న ఇక్కడ సినిమా చూశారు. ప్రీమియర్‌తో పాటు మొదటిరోజున అన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. కానీ, రెండోరోజు మొదటి ఆటకు కేవలం 29 టికెట్లు మాత్రమే తెగడంతో శనివారం నుంచే ఈ చిత్రాన్ని తొలగించి 'జూనియర్' సినిమాను ప్రదర్శించారు. వీకెండ్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో సంచలనంగా మారింది. ఆపై వీరమల్లు సినిమాకు వన్ వీక్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే ఆంశమని చెప్పవచ్చు. ఎలాగూ ఒక వారం అగ్రిమెంట్ వుంది కనుక వీరమల్లును అలా రన్ చేయవచ్చు. కానీ, మరీ 30 టికెట్ల లోపు మాత్రమే తెగుతుండటం.. ఆపై సోమవారం నుంచి ఇవీ కూడా వుండవేమో అనే అనుమానంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే విశాఖలోనే వెంకటేశ్వర థియేటర్‌తో కూడా వన్ వీక్ అగ్రిమెంట్ 'వీరమల్లు'కు వుంది. కానీ, అక్కడ కూడా మహావతార్ నరసింహ సినిమాను వేసుకున్నారు. ఇలా హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో వీరమల్లును తొలగించి మహావతార్, జూనియర్ చిత్రాలను ప్రదర్శించడం విశేషం. ఒక స్టార్ హీరో సినిమాను ఇలా పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేని సినిమాలను ప్రదర్శిస్తుండటం నెట్టింట వైరల్ అవుతుంది. వీరమల్లు సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని పవన్ అభిమానులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆపై ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి పవన్ అభిమానులతో కాన్ఫిరెన్స్ కాల్స్ మాట్లాడారు. అందుకు సంబంధించిన సంభాషణ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా
థ్రిల్లర్ సినిమాల్లో మీరు చూసిన బెస్ట్ అంటే ఏం చెబుతారు? తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది 'దృశ్యం' అంటారు! ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ చూపించింది మరి. ఒకవేళ దాన్ని మించిపోయే మూవీ ఉంటే?.. ఏంటి అలాంటి సినిమా ఉందా? ఎక్కడ చూడాలి? ఏ భాషలో ఉంది అని కచ్చితంగా అడుగుతారు. అందుకే మీ కోసం మెంటలెక్కించే ఓ కొరియన్ థ్రిల్లర్‌ని తీసుకొచ్చేశాం. అదే 2017లో వచ్చిన 'ఫర్గాటెన్'. ఇంతకీ దీని సంగతేంటి? అంత బాగుందా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతాడు. కొన్నిరోజులకే కుటుంబమంతా ఇంట్లో సెట్ వాతావరణానికి సెట్ అయిపోతారు. జిన్‌కి మాత్రం ఇంట్లోని ఓ గది నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. పీడకలలు వస్తుంటాయి. ఓ రోజు జిన్ అన్నయ్య యో సూక్(కిమ్ మ్యు యోల్)ని ఇతడి కళ్ల ముందే కొందరు కిడ్నాప్ చేస్తారు. పోలీస్ కేసు పెట్టినా లాభముండదు. కానీ 19 రోజుల తర్వాత యో సూక్ తిరిగి క్షేమంగా ఇంటికొచ్చేస్తాడు. తిరిగొచ్చిన అన్నయ్యతో పాటు తల్లిలోనూ జిన్ కొన్ని మార్పులు గమనిస్తాడు. భయమేసి ఇంట్లో వాళ్ల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. విచారణ మొదలవుతుంది. అసలు ఇంతకీ జిన్ ఎవరు? ఇద్దర్ని హత్య చేసి గతాన్ని ఎందుకు మర్చిపోయాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు అనగానే చాలామందికి ఓ ఐడియా ఉంటుంది. కానీ 'ఫర్గాటెన్' అలాంటి వాటితో పోలిస్తే చాలా డిఫరెంట్. ఎందుకంటే సినిమా మొదలవడమే ఓ ఫ్యామిలీ స్టోరీలా అనిపిస్తుంది. చక్కని కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. ఏం జరుగుతుందా? ఎలాంటి థ్రిల్ ఇస్తుందా అని చిన్న ఆసక్తి. అలా చూస్తుండగానే కాసేపటికి హారర్ మూవీలా చిన్నగా భయపెడుతుంది. హీరో కుటుంబం ఏదో తేడాగా ఉందే అనిపిస్తుంది. దీంతో మన హీరో పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక అక్కడి మొత్తం సీన్ మారిపోతుంది.ఎక్కడైనా సినిమాలో ట్విస్టులు ఉంటాయి. 'ఫర్గాటెన్'లో మాత్రం ట్విస్టులు మధ్య సినిమా ఉందా అన్నట్లు సాగుతుంది. అప్పటివరకు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుడికి.. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ చేస్తుంది. అదే టైంలో హత్యలు చేయడానికి దారితీసిన పరిస్థితులు, ఆ సంఘటనని మర్చిపోవడం.. ఇలా ఒక్కో సీన్ చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సిన థ్రిల్లర్ అని కచ్చితంగా అనిపిస్తుంది.అదే టైంలో తొలుత చూపించిన సన్నివేశాల్ని, చివర్లో ఒక్కొక్కటిగా లింక్ చేసిన విధానం చూస్తే భలే ముచ్చటేస్తుంది. రెండు గంటల్లోపే ఉన్న ఈ సినిమా క్రేజీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం గ్యారంటీ. ఒకవేళ చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కొరియన్ భాషలో మాత్రమే ఆడియో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడొచ్చు. తెలుగు లేదు కదా అని అనుకుని స్కిప్ చేస్తే మాత్రం ఓ మంచి సినిమా మిస్ అవుతారు.ఈ సినిమాలో స్టోరీని చూపించే విధానంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఒకటేమిటి ప్రతిదీ కూడా అద్భుతం అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ అంతా కాస్త నెమ్మదిగా ఉంటుంది గానీ చివరికొచ్చేసరికి అవేం గుర్తుండవు. అదిరిపోయే సినిమా చూశాం ఈ రోజు అనే అనుభూతి మాత్రమే మిగులుతుంది. ఒకటి రెండు సన్నివేశాలు మినహా ఫ్యామిలీతోనూ చూడొచ్చు.- చందు డొంకాన
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

టీమిండియాకు గుడ్ న్యూస్.. పోరాట యోధుడు బ్యాటింగ్‌కు రానున్నాడు?
మాంచెస్టర్ వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తుది అంకానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి టీమిండియా పోరాడుతోంది.311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వోక్స్ వేసిన తొలి ఓవర్లో స్కోరు బోర్డుపై ‘సున్నా’ పరుగులు ఉండగానే యశస్వి జైస్వాల్(0), సాయి సుదర్శన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది.ఈ సమయంలో కేఎల్ రాహుల్(210 బంతుల్లో 8 ఫోర్లతో 87 నాటౌట్), శుభ్‌మన్ గిల్(167 బంతుల్లో 10 ఫోర్లతో 78 నాటౌట్) ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్కోర్‌కు భారత్ ఇంకా 137 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే 8 వికెట్లు కావాలి. మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా ము గించాలంటే ఆఖరి రోజు ఆటలో కనీసం రెండు సెషన్ల పాటు వికెట్లు కోల్పోకుండా ఆడాలి. ఈ క్రమంలో భారత జట్టుకు ఓ గుడ్‌న్యూస్ అందింది. కాలి పాదం ఎముక విరిగిన గాయంతో బాధపడుతున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. ఐదో రోజు ఆటలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. ఆఖరి రోజు ఆటలో బ్యాటింగ్ చేసేందుకు పంత్ సిద్దంగా ఉన్నాడని కోటక్ నాలుగో రోజు అనంతరం కోటక్ పేర్కొన్నాడు.ఆరు వారాల విశ్రాంతి?కాగా మొదటి రోజు ఆట సందర్భంగా పంత్‌కు గాయమైంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి.. బ్యాట్‌కు తగులుతూ అతడి కుడి కాలి పాదానికి తాకింది. దీంతో అతడు మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత అతడికి స్కానింగ్ తరలించగా మెటాటార్సల్ ఫ్రాక్చర్(పాదంలోని ఎముక విరగడం) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి.కానీ రిషబ్ మాత్రం గాయంతో బాధపడుతూనే రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఇప్పుడు కూడా ఆఖరి రోజు ఆట భారత్‌కు కీలకం కావడంతో ఈ పోరాట యోధుడు మరోసారి నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?

ఇంగ్లండ్‌కు టీమిండియా సవాల్ విసురుతుందా? ఆఖరి రోజు ఎవరిది?
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా పోరాడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ సమయంలో జట్టును కెప్టెన్ శుబ్‌మన్ గిల్(167 బంతుల్లో 78 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 87; 8 ఫోర్లు), విరోచిత పోరాటంతో ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడపించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ సేన 137 పరుగులు వెనుకంజలో ఉంది.టీమిండియా సవాల్ విసురుతుందా?కాగా మాంచెస్టర్ టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. కేవలం ఒక్క రోజు ఆట మాత్రమే మిగిలూండడంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందా? లేదా డ్రా ముగిస్తుందా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆఖరి రోజు ఆటలో తొలి సెషన్ టీమిండియాకు చాలా కీలకం కానుంది.ఇంగ్లండ్‌కు టార్గెట్ నిర్దేశించాలని భారత జట్టు భావిస్తే కచ్చితంగా మొదటి సెషన్లో వికెట్లు ఏమీ కోల్పోకుండా కాస్త దూకుడుగా ఆడాలి. ఇంగ్లండ్‌కు 200 పైగా టార్గెట్ ఇవ్వాలన్న టీమిండియా ఖచ్చితంగా టీ బ్రేక్ వరకు అయినా బ్యాటింగ్ చేయాలి. అంటే వన్డే తరహాలో తమ బ్యాటింగ్‌ను కొనసాగించాలి.ఒకవేళ తొలి సెషన్లో టీమిండియా వికెట్లు కోల్పోతే డ్రా కోసం వెళ్తే బెటర్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గాయపడిన రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చినా, క్రీజులో నిలదొక్కకుంటాడో లేదా అన్నది ప్రశ్నార్ధంగా మారింది.అతడు కాలి పాదం గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పంత్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లకు వెళ్లే అవకాశముంది. ఆ ప్రయత్నంతో పంత్ వికెట్ కోల్పోయిన ఆశ్చర్యపోన్కర్లలేదు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ప్రతిఘటించే అవకాశమున్నప్పటికి, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పలేం. కాబట్టి టీమిండియా మొత్తం ఆశలన్నీ క్రీజులో ఉన్న శుబ్‌మన్ గిల్, రాహుల్‌పైనే ఉన్నాయి. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ వీలైనంత త్వరగా భారత్‌ను ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.చదవండి: కివీస్‌దే ముక్కోణపు టోర్నీ

కివీస్‌దే ముక్కోణపు టోర్నీ
ముక్కోణపు టి20 టోర్నమెంట్ ట్రోఫీ దక్కించుకోవాలంటే దక్షిణాఫ్రికా జట్టుకు 18 బంతుల్లో 37 పరుగులుకావాలి. అలాంటి దశలో... డెవాల్డ్ బ్రేవిస్ మూడు సిక్స్‌లతో విజృంభించడంతో సఫారీ సమీకరణం 6 బంతుల్లో 7 పరుగులకు చేరింది. ఇంకేముంది దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటే... ఆఖర్లో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ అద్భుతం చేశాడు. జోరుమీదున్న బ్రేవిస్, హెన్రీలను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు ట్రోపీ కట్టబెట్టాడు. దీంతో సఫారీలకు నిరాశ తప్పలేదు. హరారే: ముక్కోణపు టి20 టోర్నమెంట్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (27 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ సీఫెర్ట్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితం అయింది. డ్రె ప్రిటోరియస్ (35 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశకతంతో రాణించగా... రీజా హెండ్రిక్స్ (37; 4 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రేవిస్ (16 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. బంతి బంతికి సమీకరణాలు మారుతూ దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటున్న సమయంలో హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అప్పటి వరకు ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు ఆఖర్లో ఒత్తిడికి చిత్తై ట్రోఫీని కివీస్‌కు కట్టబెట్టారు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ట్రోఫీ కైవసం చేసుకుంది. మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.

నోరిస్‌కు పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ 1 నిమిషం 40.562 సెకన్లలో ల్యాప్‌ను పూర్తిచేసి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును నోరిస్ పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించనున్నాడు. 2012లో జాన్సన్ బటన్ తర్వాత బెల్జియం గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ దక్కించుకున్న తొలి మెక్లారెన్ డ్రైవర్‌గా నోరిస్ నిలిచాడు. మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 నిమిషం 40.647 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానం దక్కించుకోగా... ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ 1 నిమిషం 40.903 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ (1 నిమిషం 40.903 సెకన్లు) నాలుగో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1 నిమిషం 41.939 సెకన్లు) 16వ స్థానానికి పరిమితమయ్యాడు. అంతకుముందు జరిగిన స్ప్రింట్ రేస్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 24 రేసులో తాజా సీజన్లో ఇప్పటి వరకు 12 రేసులు ముగియగా... డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో పియాస్ట్రి 241 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్ 232 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ 173 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
బిజినెస్

క్రిప్టో సర్వీసులకు హ్యాకర్ల రిస్కులు
న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ ప్రపంచంలో సైబర్ ముప్పులు భారీగా పెరుగుతున్నాయి. గత వారం జరిగిన కాయిన్‌డీసీఎక్స్ హ్యాక్‌లో పోయిన 44 మిలియన్ డాలర్లు సహా క్రిప్టోకరెన్సీ సర్వీసుల కార్యకలాపాలకు సంబంధించి ఈ ఏడాది (2025లో) ఇప్పటివరకు 2.17 బిలియన్ డాలర్ల మేర చోరీలు నమోదయ్యాయి. బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం చెయినాలిసిస్ 2025 నివేదిక ప్రకారం గతేడాది మొత్తంతో పోలిస్తే ఈ ఏడాది చోరీలు మరింతగా పెరిగాయి. 2022 మొత్తం సంవత్సరంలో చోరీకి గురైన దానికన్నా, 2025 జూన్ ఆఖరు నాటికి 17 శాతం ఎక్కువ మొత్తాన్ని హ్యాకర్లు దొంగిలించారు. 1.5 బిలియన్ డాలర్ల బైబిట్ హ్యాక్ అనేది క్రిప్టో చరిత్రలోనే ఏకైక భారీ హ్యాక్‌గా నిల్చింది. అంతేగాకుండా ఈ ఏడాది క్రిప్టోసర్వీసుల్లో చోరీకి గురైన మొత్తంలో ఈ కేసు వాటా దాదాపు 69 శాతం ఉంటుంది. ఇక మిగతా వాటిలో సెటస్ ప్రొటోకాల్ ఈ ఏడాది మే నెలలో 200–260 మిలియన్ డాలర్ల మేర నష్టపోగా, జూలైలో బిగ్వన్ సంస్థ 27 మిలియన్ డాలర్లు పోగొట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికా, జర్మనీ, రష్యా, కెనడా, జపాన్, ఇండొనేషియా, దక్షిణ కొరియాల్లో హ్యాకింగ్ బాధితులు అత్యధికంగా ఉన్నారు. ప్రాంతీయంగా చూస్తే తూర్పు యూరప్, మధ్యప్రాచ్యం–ఉత్తర ఆఫ్రికా, సీఎస్ఏవో (సెంట్రల్, సదరన్ ఆసియా, ఓషియానియా)లో బాధితుల సంఖ్య గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో మరింతగా పెరిగింది. వ్యక్తిగత వాలెట్లను టార్గెట్ చేసే వారికన్నా క్రిప్టోసర్వీసులను హ్యాక్ చేసే వారు మరింత అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గతేడాది క్రిప్టో ఎక్సే్చంజ్ వజీర్ఎక్స్ కూడా 230 మిలియన్ డాలర్ల మేర హ్యాకింగ్‌కి గురైంది.

బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు అవసరం
ముంబై: బలమైన వాణిజ్య భాగస్వామ్యాలు భారత్‌కు వ్యూహాత్మక అవకాశాలను తీసుకొస్తాయని.. అంతర్జాతీయంగా విలువ ఆధారిత సరఫరా వ్యవస్థతో అనుసంధానతను పెంచుకోవచ్చని ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జూన్–జూలై నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. సమగ్ర ఆర్థిక, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్–యూకే గురువారం సంతకం చేయనుండడం గమనార్హం. అమెరికాతోనూ ఈ దిశగా చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై బుధవారం ఆర్బీఐ బులెటిన్ విడుదలైంది. వాణిజ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా జూన్ నుంచి జూలైలో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక వాతావరణం అస్థిరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఈ కాలంలో దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగాయి. ఖరీఫ్ సాగు పరిస్థితులు మెరుగుపడడం, సేవల రంగంలో బలమైన పనితీరు, పారిశ్రామిక పనితీరులో మోస్తరు వృద్ధి మద్దతుగా నిలిచాయి’’అని బులెటిన్ వివరించింది. అమెరికాతో ఆగస్ట్ 1కి ముందుగానే వాణిజ్య ఒప్పందం కోసం తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయంటూ.. అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. సగటు వాణిజ్య టారిఫ్‌లు 1930ల తర్వాత ఎన్నడూలేని స్థాయిలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇతర రంగాలపైనా అదనంగా కొత్త టారిఫ్‌లు విధించే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ఈ అనిశ్చితులు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగించొచ్చని అభిప్రాయపడింది. వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండడం రేట్ల కోత బదిలీకి వీలు కల్పిస్తుందని.. విదేశీ మారకం నిల్వలు సమృద్ధిగా ఉండడం, విదేశీ మారకం రుణభారం మోస్తరుగా ఉండడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి ఆజ్యం చమురు ధరలు 10% పెరిగితే రిటైల్ ద్రవ్యోల్బణం 0.20% అధికమవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. ప్ర త్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు విధానపరమైన చర్యలకు ఆర్బీఐ ఉద్యోగులు విడుదల చేసిన అధ్యయన పత్రం పిలుపునిచ్చింది. ఈ భారం వినియోగదారులపై అధికంగా పడకుండా ఎక్సైజ్ సుంకాలను తగ్గించే వెసులుబా టు ప్రభుత్వానికి ఉన్నట్టు తెలిపింది.

మాల్స్‌లో రిటైల్ లీజింగ్ డౌన్
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో షాపింగ్ మాల్స్, ప్రధాన వీధుల్లోని రిటైల్ స్పేస్ (వ్యాపార సముదాయాలు) లీజింగ్ జూన్ త్రైమాసికంలో బలహీనపడింది. ఏప్రిల్–జూన్ కాలంలో ఎనిమిది నగరాల్లో రిటైల్ స్పేస్ లీజింగ్ 2.24 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 2.39 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. మొత్తం లీజింగ్‌లో 45% మేర, 1.01 మిలియన్ ఎస్ఎఫ్టీ షాపింగ్ మాల్స్‌కు సంబంధించి ఉంది. ప్రధాన మార్గాల్లో (వీధుల వెంట) రిటైల్ సేŠప్స్ లీజింగ్ 55% వాటాతో 1.23 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ 0.76 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. క్రితం ఏడా ది ఇదే త్రైమాసికంలో లీజింగ్ 0.98 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గింది. → బెంగళూరులోనూ లీజింగ్ క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 44% తగ్గి 0.18 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 41 శాతం క్షీణతతో 0.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → అత్యధికంగా అహ్మదాబాద్ మార్కెట్లో రిటైల్ స్పేస్ లీజింగ్ 63 శాతం తగ్గిపోయింది. 0.04 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → కోల్‌కతాలో లీజింగ్ 23 శాతం తగ్గి 0.05 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → చెన్నై నగరంలో మాత్రం 0.16 మిలియన్ ఎస్ ఎఫ్టీకి లీజింగ్ పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 0.10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. → ముంబైలో లీజింగ్ డిమాండ్ రెట్టింపై 0.20 మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 0.52 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో రెండింతలు వృద్ధి చెందింది. 0.09 నుంచి 0.23 మిలియన్ ఎస్ఎఫ్టీకి లీజింగ్ పరిమాణం పెరిగింది. ఆశావహ అంచనా ప్రీమియం షాపింగ్ మాల్స్‌లో ఖాళీలు తగ్గుముఖం పట్టినట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రీసెర్చ్ హెడ్ సువిశేష్ వాల్సన్ తెలిపారు. ‘‘భవిష్యత్తు కాలానికి ఆశావహంగానే ఉన్నాం. 4 మిలియన్ చదరపు అడుగులు మేర గ్రేడ్–ఏ రిటైల్ స్పేస్ అదనంగా ఈ ఏడాది ద్వితీయ 6 నెలల్లో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో కొత్త సరఫరా ఉంటుంది’’అని తమ అంచనాలను వెల్లడించారు.

ఫోన్‌కి వస్తున్న మెసేజ్‌లలో కొత్త మార్పులు.. గమనించారా?
మన ఫోన్లకు రోజూ పదుల సంఖ్యలో వివిధ రకాల ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. వీటిలో ఎక్కువ శాతం వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రమోషనల్ మెసేజ్‌లే ఉంటుంటాయి. వీటి మధ్య ముఖ్యమైన మెసేజ్‌లను చూసుకోకుండా విస్మరిస్తుంటాం. కానీ ఈ మధ్య వస్తున్న వస్తున్న ఎస్ఎంఎస్లను గమనిస్తే కొత్త మార్పులు కనిపిస్తాయి. అదేమీ లేదండి ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో సులువుగా తెలిసేలా ట్రాయ్ ఇటీవల కొత్త ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది.మనకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసేలా ఐడింటిఫికేషన్ అక్షరం ఉంటుంది. ఎస్ఎంఎస్ హెడర్‌లో పీ(P) అని ఉంటే ప్రమోషనల్ అంటే వివిధ కంపెనీలు తమ ప్రచారం కోసం పంపించే మెసేజ్‌లు అన్నమాట. ఎస్(S) అని ఉంటే సర్వేస్ అంటే సాధారణ సమాచారం తెలియజేసేవి అని అర్థం. ఇక టీ(T) అని ఉంటే ట్రాన్సాక్షనల్ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలు, జీ(G) అని ఉంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం. ఇలా.. ఏదైనా ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా తెరిచి చదవకుండానే దాని ఉద్దేశం తెలుసుకోవచ్చు.ఈ మార్పు ఎందుకంటే..దేశంలో 1.1 బిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు తరచూ స్పామ్, అవాంఛిత ఎస్ఎంఎస్ సందేశాలను ఎదుర్కొంటున్నారు. చాలా మంది వినియోగదారులు ఏ సందేశాలు ముఖ్యమైనవి, ఏవి అసంబద్ధమైనవి అని తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వినియోగదారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటానికి ఫిల్టర్‌గా పనిచేసేలా కొత్త అనుబంధ వ్యవస్థను రూపొందించారు.
ఫ్యామిలీ

హిరాకుద్ జలాశయానికి వరదపోటు
ఒడిశా, భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్‌కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం. #ହୀରାକୁଦର_୨୦ଟି_ଗେଟ୍_ଖୋଲା👉ହୀରାକୁଦରୁ ୨୦ଟି ଗେଟ୍ ଦେଇ ବନ୍ୟାଜଳ ନିଷ୍କାସନ ଜାରି👉୬୦୯.୩୯ଫୁଟ୍ ରହିଛି ଜଳଭଣ୍ଡାରର ଜଳସ୍ତର#HirakudDam #Sambalpur #Odisha #GateOpen pic.twitter.com/vR9RNEZh7B— Mukesh Kumar Sahu (@Anchor_Mukesh) July 26, 2025

ప్రపంచంలోని సహజసిద్ధమైన అద్భుతాలేవో తెలుసా?
హలో పిల్లలూం. మనకు ప్రపంచ వింతలంటే ఠక్కున గుర్తొచ్చేవి – ది గ్రే వాల్ ఆఫ్ చైనా, పెట్రా, క్రైస్ట్ ది రిడీమర్, మచ్చు పిచ్చు, చిచెన్ ఇట్జా, రోమన్ కొలోసియం, మనందరికీ ఇష్టమైన తాజ్ మహల్. ఈ ఏడు వింతలు తప్ప మరొకటి జ్ఞప్తికి రావు. ఇవి ఎంతో అందమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, కట్టడాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మాతలు. మనకంటే ముందు జీవించిన మన పితరులు వివిధ కాలాలలో, విభిన్న సందర్భాలలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి. కానీ ఈరోజు మనం, మానవ ప్రమేయం లేకుండా ప్రకతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏడు సహజసిద్ధమైన అద్భుతాలు (seven natural wonders of the World)1. గ్రాండ్ కాన్యన్ (Grand Canyon)అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనాలో ఉంది. కొలరాడో నది సష్టించిన ఈ కాన్యన్ దాదాపు 446 కిలోమీటర్ల ΄÷డవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.6 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.2. గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef ) ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది 2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసం.3. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ (Amazon Rainforest)దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ‘‘ప్రపంచ ఊపిరితిత్తులు’’ గా పిలువబడుతుంది. ఇది అమెజాన్ నది చుట్టూ విస్తరించి ఉండటంతోపాటు భూమ్మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జాతుల జంతుజాలం, వక్షజాలానికి నిలయం.4. విక్టోరియా జలపాతం (Victoria Falls) ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే సరిహద్దులో ఉన్న ఈ జల΄ాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లయితే, ఎత్తు 108 మీటర్లు.5. ఆరోరా బోరియాలిస్ (Aurora Borealis Northern Lights)ఉత్తర ధ్రువ ప్రాంతాలలో (నార్వే, స్వీడన్, ఫిన్లాండ్) కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దశ్యం సౌర కణాలు భూమి వాతావరణంతో సంకర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది. ఈ దశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకతి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ లా ఉంటాయి.6.పారిసెలో రాక్ (Paricutin Volcano)మెక్సికోలోని ఈ అగ్నిపర్వతం 1943లో ఒక రైతు భూమిలో ఏర్పడింది. ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే 424 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణింపబడుతుంది.7. మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest, Mount in Asia )ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాలలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపుతుంటారు.

చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్‌కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్‌ను వెదుక్కున్నాడు.కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్‌కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. 2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్‌కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంఅదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు.

వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా (Harsh Goenka)ఎక్స్‌లో మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలతో నెటిజన్లను ఆలోచింప చేసే ఆయన తాజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. యూకే గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఒక గ్లోబల్ CEO భారతీయ నిపుణుల మేధో సామర్థ్యాలను ఎలా అవమానించారో తెలుపుతూ ట్వీట్ చేశారు. అందుకే నిపుణులంతా భారతీయ కంపెనీలవైపు మొగ్గు చూపుతున్నారంటూ చురకలంటించారు. హర్ష్ గోయెంకా ట్వీట్ ఆన్లైన్లో తీవ్ర చర్చకు దారి తీసింది. హర్ష్‌గోయెంకా ట్వీట్: "భారతీయ అనుబంధ సంస్థ, అత్యంత ప్రగతిశీల సంస్థకు చెందిన గ్లోబల్ CEO నాతో ఇలా అన్నాడు. ‘‘బ్రెయిన్, చేతులు, కాళ్లు అవసరం లేకుండా కేవలం ప్లాన్‌ను అమలు చేసే ఇంజీన్‌లా నా భారతీయ CEO ఉండాలని కోరుకుంటా.. అని అన్నట్టు అని గోయెంకా గుర్తు చేసుకున్నారు. "ఈ విధానం వల్లే ఇప్పుడు భారతీయ కంపెనీలలో పనిచేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు " అని ఆయన పేర్కొన్నారు.ఈపోస్ట్ నెట్టింట చర్చకు దారితీసింది. ముఖ్యంగా, భారతీయ సంతతికి చెందిన టెక్ నిపుణులు ప్రపంచంలోని కొన్ని అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు, నూతన ఆవిష్కరణలతో టాప్‌లో కంపెనీలను నడిపిస్తున్న తరుణంలో హర్ష్ గోయెంకా ట్వీట్ విశేషంగా నిలిచింది."సో నయా వలసవాద వైఖరులు కొనసాగుతూనే ఉన్నాయి అన్నది నిజమన్నమాట అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఈ మనస్తత్వం వల్లే భారతీయ నిపుణులు స్వదేశీ కంపెనీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మెషీన్లలా పనిచేయం కాదు...మెదళ్ళకు విలువ ఇవ్వాలనుకుంటున్నాము" అని మరొకరు రాశారు.చదవండి : కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!బెన్‌హాన్స్ ఫార్మా MD ఎలియా జయరాజ్, “భారత జట్టును చేతులు, కాళ్ళు లేకుండా చేయాలనే UK CEO ప్లానా ఇది? ఒక క్రికెట్ స్టార్‌ను బంతిని అలా ఫెచ్ చేయమని అడిగినంత కామెడీగా ఉంది. TCS వంటి భారతీయ సంస్థల వైపు ఐటీ నిపుణులు పరిగెత్తడంలో ఆశ్చర్యం లేదు , అక్కడ వారు తమ తెలివితేటలను ప్రదర్శించగలరు. 2024లో రిటెన్షన్ (ఉద్యోగుల కొనసాగింపు) 10 శాతం బెటర్‌గా ఉందని నాస్కామ్ చెబుతోంది. భారతీయ CEOలు అవకాశాన్ని వాడుకోండి.. లేదంటే మీకు నష్టం అని వ్యాఖ్యానించారు. “ఇది బహుశా ఫార్మా లేదా ఆర్థిక సేవల సంస్థ అయి ఉండాలి. మరే ఇతర రంగంలోనూ బ్రిటీషోళ్లకి అంత సీను లేదు” అని మరొకరు కమెంట్ చేశారు. ఇది చదవండి: కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు
ఫొటోలు
అంతర్జాతీయం

హెచ్ఐవీకి సూదిమందు ఆమోదించిన ఈయూ
లండన్: హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను అడ్డుకునే సూదిమందు ‘లెనకపవిర్’కు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. ఏడాదిలో రెండు పర్యాయాలు తీసుకునే ఈ ఔషధం వైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడుతుందని పేర్కొంది. యూరప్‌లో దీనిని యెయ్టువో అనే పేరుతో గిలియడ్ సైన్సెస్ విక్రయాలు జరుపుతుంది. దీంతో ఈయూలోని 27 సభ్య దేశాలతోపాటు ఐస్‌ల్యాండ్, నార్వే, లీచిన్స్టెయిన్ల్లోనూ ఇది అందుబాటులోకి వస్తుంది. లెనకపవిర్తో హెచ్ఐవీ బాధిత మహిళలు, పురుషులకు చికిత్స చేయగా 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు గతేడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. హెచ్ఐవీ మహమ్మారిని తరిమికొట్టడంలో లెనకపిర్ కీలక మలుపుగా మారనుందని ఐరాస ఎయిడ్స్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ తెలిపారు. జూన్‌లో అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం లెనకపవిర్‌ను ఆమోదించింది. ఐరాస ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్ఐవీ వైరస్ నివారణలో లెనకపవిర్ ఎంతో సహాయకారికానుందని పేర్కొంది. ఒకసారి ఈ సూది మందు తీసుకుంటే ఆరు నెల్లపాటు హెచ్ఐవీ సోకకుండా ఆపగలుగుతుంది. కాగా, లెనకపవిర్‌ను తక్కువ ధరలో హెచ్ఐవీ కేసులు తీవ్రంగా ఉండే ఆఫ్రికా, ఆసియా, కరీబియన్ ప్రాంతాల్లోని 120 పేద దేశాలకు సరఫరా చేస్తామని గిలియడ్ సైన్సెస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల హెచ్ఐవీ బాధితులుండగా 2024లో సుమారు 6.30 లక్షల మంది చనిపోయినట్లు అంచనా.

పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రాన్ చెప్పారు. ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తానన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధం ఆగిపోవడం, అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మన ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చారు. యూదు వ్యతిరేకతను ఖండించారు. ఆ తరువాతి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, రానురాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన.. తాజాగా పునరుద్ఘాటించారు. నిర్లక్ష్యపూరిత నిర్ణయం: అమెరికాపాలస్తీనా పట్ల ఫ్రాన్స్ తీరును అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. ఇది హమాస్ ప్రచారానికి ఉపయో గపడే నిర్లక్ష్య పూరిత నిర్ణయ మని విదేశాంగ మంత్రి మార్కో రూబి యో అన్నారు. ‘‘యూ ఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని గు ర్తించాలనే మాక్రాన్ ప్ర ణాళికను అమెరికా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్య నిర్ణయం హమా స్ ప్రచా రానికి ఉపయో గపడుతుంది. శాంతిని దెబ్బ తీస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్ తీరు సిగ్గుచేటు: ఇజ్రాయెల్ఇక మాక్రాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని, ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ అన్నారు. గాజా ఇజ్రాయెల్‌ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని, దాని పక్కన శాంతియుతంగా జీవించలేమని తెలిపారు. ఫ్రాన్స్ నిర్ణయం సిగ్గుచేటని ఇజ్రాయెల్ ఉప ప్రధాని యారివ్ లెవిన్ అన్నారు. అది ఫ్రెంచ్ చరిత్రపై ఒక నల్ల మచ్చని, ఉగ్రవాదానికి నేరుగా సహాయమందించడమని చెప్పారు. తాము ఆక్రమించిన వెస్ట్ బ్యాంక్‌కు ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాగతించిన హమాస్.. ఫ్రాన్స్ ప్రకటనను పాలస్తీనియన్ అథారిటీ సీనియర్ అధికారి హుస్సేన్ అల్–షేక్ స్వాగతించారు. ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులకు, రాజ్య స్థాపనకు మద్దతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్‌ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

మాల్దీవులతో బలీయ బంధం
మాలె: భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్రదేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవ్స్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, ద్వీప దేశానికి రూ.4,850 కోట్ల రుణం(లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం మాల్దీవ్స్ రాజధాని మాలెలో ప్రధాని మోదీ, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ నుంచి శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో మొహమ్మద్ ముయిజ్జుతోపాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్‌లో మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇండియా–మాల్దీవ్స్ మధ్య కొన్ని రోజుల క్రితం సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సైనిక సామర్థ్యం పెంపునకు సహకారం మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ అమలు చేస్తున్న ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఒక కొలమానం అని వివరించారు. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి స్వా గతం పలకడం తన హృదయాన్ని హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.రక్షణ శాఖ కార్యాలయం ప్రారంభం ఇండియా–మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాళ బిళ్లను మోదీ, ముయిజ్జు ఆవిష్కరించారు. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవ్స్‌లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మరో ఒప్పందం కుదిరింది. రూ.4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాలె సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, ముయిజ్జు ప్రారంభించారు.

విశ్వానికి అంతముందా!
విశ్వ సిద్ధాంతం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అనంత విశ్వం నిరంతరాయంగా, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ, చెబుతూ వచ్చిన మాట. కానీ అది నిజం కాదని, విశ్వానికి అంతముందని కొత్త సిద్ధాంత వ్యాసం ఒకటి చెబుతోంది. మరో 2,000 కోట్ల ఏళ్లకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని అది అంటోంది. దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి... ఇలా సర్వమూ అంతమైపోతుందట. దీన్ని ‘బిగ్ క్రంచ్’గా సదరు వ్యాసం పేర్కొంది. డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వ చోదక శక్తి స్థిరంగా, సానుకూలాత్మకంగా కొనసాగుతుందన్న సిద్ధాంతంపై విశ్వ నిత్య విస్తరణవాదం ఆధారపడి ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా చెబుతున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే (డీఎన్ఎస్), డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ (డీఈఎస్ఐ) అనే రెండు పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకు తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు సూత్రీకరించారు. డార్క్ ఎనర్జీ కాలక్రమంలో మారుతుందని పేర్కొన్న ఇటీవలి సర్వే ఆక్సియాన్–డార్క్ ఎనర్జీ మోడల్ (ఏడీఈ)ను సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. దీన్ని ప్రస్తుత సూత్రీకరణకు వర్తింపజేస్తే అంతరిక్షం ఎలా ప్రవర్తిస్తుందన్న దాన్ని లెక్కించే విశ్వ స్థిరాంకం నిజానికి ప్రతికూల శక్తి అయి ఉండొచ్చని చెప్పే సంకేతాలను సైంటిస్టులు గమనించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఇదే. ప్రతికూల విశ్వ స్థిరాంకపు ఉనికి అంటే అంతిమంగా దాని విస్తరణను ఆకర్షణ శక్తి అధిగమించేస్తుంది. అప్పటినుంచి విశ్వం వృద్ధి చెందడం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుంది. అంతిమంగా అది అంతమైపోతుంది. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తీ పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో కూడిన బిందువుగా మారుతుంది. ఇదే గనక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుంది.ఆయువు 3,330 కోట్ల ఏళ్లువిశ్వం మొత్తం ఆయుష్షు 3,330 కోట్ల ఏళ్లని ఈ తాజా సిద్ధాంత వ్యాసం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1,380 కోట్ల ఏళ్లు గడిచినట్టు సైంటిస్టులు తేల్చారు. ఆ లెక్కన దాని ఆయుఃప్రమాణంలో సగం ముగిసిపోయినట్టే లెక్క. అయితే దీన్ని పూర్తిగా విశ్వసించాలంటే మరింత కచ్చితమైన గణాంకాలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా కచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాల్సి ఉంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

శత్రు పీచమణచే రుద్ర!
ద్రాస్(కార్గిల్): మన సైన్యం మరింత శక్తిసామర్థ్యాలు సంతరించుకోబోతోంది. బహుముఖ అవసరాలను తీర్చేలా అత్యాధునిక పూర్తిస్థాయి సాయుధ దళా (బ్రిగేడ్) లను ఏర్పాటు చేసుకోనుంది. ఈ స్పెషల్ ఫోర్స్ యూనిట్లకు ‘రుద్ర’గా నామకరణం చేసినట్టు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అలాగే సరిహద్దుల వద్ద శత్రువులకు కోలుకోలేని షాకిచ్చే ‘భైరవ్’లైట్ కమెండో బెటాలియన్లు కూడా రానున్నట్టు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో పాక్ పీచమణచిన చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా జరుపుకుంటున్న విజయ్ దివస్‌కు 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ‘‘భావి అవసరాలకు దీటుగా ఎదిగే తిరుగులేని శక్తిగా సైన్యం బలోపేతం అవుతోంది. రుద్ర బ్రిగేడ్ల ఏర్పాటు అందులో భాగమే’’అని తెలిపారు. ఇందుకు శుక్రవారమే కేంద్రం నుంచి అనుమతులు లభించినట్టు వెల్లడించారు. ‘‘అలాగే ప్రతి పదాతి బెటాలియన్‌లోనూ డ్రోన్ ప్లటూన్లు ఏర్పాటు కానున్నాయి. ఆర్టీలరీ విభాగాల విధ్వంసక శక్తిని ‘దివ్యాస్త్ర’, లాయిటర్ మ్యునిషన్ బ్యాటరీలతో మరింతగా బలోపేతం చేశాం. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలతో వాయుసేనను దురి్నరీక్ష్యంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది మన సైనిక పాటవాన్ని చెప్పలేనంతగా పెంచేస్తోంది’’అని పేర్కొన్నారు. 1999లో కిరాయి మూకల ముసుగులో పాక్ సైన్యం కశ్మీర్లో సరిహద్దుల గుండా చొచ్చుకొచ్చి మన భూభాగంలో పాగా వేయడం తెలిసిందే. మంచుకొండల్లోని తోలోలింగ్, టైగర్‌హిల్స్ వంటి శిఖరాలపై అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మూడు నెలల పాటు జరిపిన ముమ్మర పోరులో పాక్ మూకలను మన సైన్యం తిప్పికొట్టడం తెలిసిందే. అందుకు గుర్తుగా ఏటా జూలై 26న విజయ్ దివస్ జరుపుకుంటూ వస్తున్నాం. ఏమిటీ ‘రుద్ర’? ఆర్మీ చీఫ్ ప్రకటించిన రుద్ర బ్రిగేడ్ అత్యాధునిక యుద్ధ విభాగం (బ్రిగేడ్). దీని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... → ఇది త్రివిధ దళాలతో కూడిన బ్రిగేడ్ → ఇందులో పదాతి, సాయుధ విభాగాలు, ఆర్టిలరీ, స్పెషల్ ఫోర్సెస్, మానవ రహిత యుద్ధ విమాన వ్యవస్థలు తదితరాలు ఉంటాయి. → ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సాయుధ, మద్దతు వ్యవస్థలు వీటికి వెన్నుదన్నుగా నిలుస్తాయి. → రెండు సైనిక పదాతి దళ విభాగాలను ఇప్పటికే రుద్ర బ్రిగేడ్లుగా ఆధునీకరించారు. మరిన్ని బ్రిగేడ్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. → ఇప్పటిదాకా సైనిక బ్రిగేడ్లు ఏక తరహా వ్యక్తిగత ఆయుధాలతో కూడినవిగా మాత్రమే ఉన్నాయి.కార్గిల్ వీరగాథలు విన్పించే ‘ఇ–శ్రద్ధాంజలి’ యాప్ బతాలిక్ సెక్టర్లో ఇండస్ వ్యూ పాయింట్ కార్గిల్ వీరుల గౌరవార్థం మూడు ప్రాజెక్టులు కార్గిల్ యుద్ధ అమరవీరులను గౌరవార్థం మూడు కొత్త ప్రాజెక్టులను ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ‘ఇ–శ్రద్ధాంజలి’పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కార్గిల్ వీరులకు పౌరులు శ్రద్ధాంజలి తెలపవచ్చు. అలాగే ఓ ఈ క్యూఆర్ ఆధారిత ఆడియో గేట్‌వే యాప్ కూడా రూపొందించారు. ఇది కార్గిల్ యుద్ధానికి సంబంధించిన రోమాంఛిత గాథలను వినిపిస్తుంది. దీన్ని అమరవీరులకు అంకితమిచ్చారు. అలాగే నియంత్రణ రేఖ సమీపంలోని బతాలిక్ సెక్టర్‌ను సందర్శించే వారి కోసం వ్యూ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కార్గిల్, ఇండస్ లేహ్, బల్టిస్తాన్ మధ్య భాగంలో 10 వేల అడుగుల ఎత్తున ఉండే కీలక వ్యూహాత్మక పాయింట్. అక్కడ విధులు నిర్వహించే సైనికుల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసి అర్థం చేసుకునేందుకు ఈ వ్యూ పాయింట్ వీలు కలి్పస్తుంది. ‘‘ఇది మ్యూజియంల వంటి కాన్సెప్టు. ఇయర్‌ఫోన్స్ ద్వారా ఆడియో ద్వారా కార్గిల్ యుద్ధ విశేషాలను వినవచ్చు. మన సైనికుల శౌర్యం, ధైర్యస్థైర్యాలు, త్యాగాలను తెలుసుకుని పొంగిపోవచ్చు’’అని సైనికాధికారి ఒకరు వివరించారు.ఉగ్ర భూతాన్ని సహించేదే లేదు ‘సిందూర్’తో పాక్‌కు హెచ్చరికదాయాదికి ఆర్మీ చీఫ్ చురకలు‘‘ఉగ్ర భూతానికి దన్నుగా నిలిచే దుష్టశక్తులను భారత్ ఏ మాత్రమూ సహించే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మన త్రివిధ దళాలు తిరుగులేని సమన్వయంతో జరిపిన పెను దాడులు పాకిస్తాన్‌కు పంపిన తిరుగులేని హెచ్చరిక సంకేతాలవే. అంతమాత్రమే కాదు, దేశం హృదయానికి తీరని గాయం చేసిన పహల్గాం ఉగ్ర దాడికి మన సమష్టి ప్రతిస్పందన కూడా. గత ఉగ్ర దాడుల మాదిరిగా ఈసారి మన దేశం కేవలం శోకించి సరిపెట్టుకోలేదు. అలాంటి ఘాతుకాలకు మన స్పందన నిర్ణయాత్మకంగా, ప్రత్యర్థి కోలుకోలేని రీతిలో ఉంటుందని నిరూపించాం. తద్వారా అలాంటి మతిలేని ఉగ్రోన్మాదానికి, దానికి దన్నుగా నిలిచే ధూర్త దేశాలకు మన స్పందన విషయంలో సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించాం’’అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాక్‌పై మన విజయానికి ప్రతీకగా జరుపుకుంటున్న విజయ్ దివస్‌కు శనివారంతో 26 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని ద్రాస్‌లో కార్గిల్ యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. అక్కడి సైనిక సిబ్బంది తదితరులను ఉద్దేశించి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మే 7న పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ఉగ్ర సంస్థకు చెందిన ముష్కరులు విచక్షణారహిత కాల్పులకు తెగబడి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. అందుకు ప్రతిగా ఆపరేషన్ సైన్యంపై దేశ ప్రజలు చూపిన తిరుగులేని విశ్వాసం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే ఉన్మాదానికి తిరుగులేని రీతిలో సమాధానం చెప్పగలిగాం. మన దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి, ప్రజలకు హాని తలపెట్టే ముష్కర శక్తులకు తగిన సమాధానం ఇస్తామని నిరూపించాం’’అని ప్రకటించారు. సిందూర్ ఆపరేషన్‌లో పాక్ గడ్డపై స్వేచ్ఛగా చెలరేగుతున్న 9 మంది అత్యున్నత స్థాయి ఉగ్రవాదులను మట్టుబెట్టిందని గుర్తు చేశారు. మనకు అణుమాత్రం కూడా నష్టం కలగకుండా పని పూర్తి చేశామన్నారు. ‘‘పీఓకే, పాక్‌లోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచి్చతత్వంతో నేలమట్టం చేశాం. తద్వారా దాయాదిపై నిర్ణాయక విజయం సాధించాం. వాటిపై మన బాంబు, క్షిపణి దాడులను అడ్డుకునేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నాం. ప్రతిగా మే 8, 9 తేదీల్లో పాక్ సైన్యం మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై తలపెట్టిన దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిచ్చాం. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూసేందుకు ప్రయత్నం చేశాం. కానీ పాక్ మాత్రం ఎప్పట్లాగే ఉగ్ర మూకలను ప్రేరేపించడం ద్వారా మరోసారి పిరికిపంద చర్యకు దిగింది. మన గగనతల రక్షణ వ్యవస్థ దుర్భేద్యమైన కవచంలా నిలిచి కాపాడింది. ఒక్క క్షిపణి, డ్రోన్ కూడా సరిహద్దులు దాటి చొచ్చుకురాకుండా అడ్డుకుంది’’అని ఆర్మీ చీఫ్ గుర్తు చేశారు. భారత సైన్యం ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు.
అపురూపాలు.. మళ్లీ మన చెంతకు!
ఇతర దేశాల్లో ఉండిపోయిన మన పురాతన వస్తువులను రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. వివిధ దేశాలకు తరలి వెళ్లిన ఈ అపురూప కళాఖండాలను.. సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడం, జాతీయ గౌరవాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా తిరిగి సొంతం చేసుకుంటోంది. వీటిని సంరక్షించడం, అధ్యయనం కోసం అందుబాటులో ఉండేలా చూడటం కూడా ఈ ప్రయత్నాల ముఖ్య ఉద్దేశం.⇒ సీతా రామ లక్ష్మణుల లోహ విగ్రహాలను 2020లో యూకే నుంచి తెప్పించగలిగాం.⇒ సంతానలక్ష్మి విగ్రహం... 2021లో అమెరికా నుంచి తిరిగి రప్పించగలిగాం.⇒ మహిషాసుర మర్దిని విగ్రహాన్ని 2022లో ఆస్ట్రేలియా నుంచి తీసుకురాగలిగాం.⇒ సూర్య భగవానుడి రాతి శిల్పాన్ని 2023లో యూకే నుంచి సాధించుకున్నాం.13 మాత్రమే..2021 అక్టోబరులో అమెరికా సుమారు 15 మిలియన్ డాలర్ల విలువైన 248 అపురూప దేవీ దేవతా విగ్రహాలు, పురాతన వస్తువులను మనదేశానికి అప్పగించింది. ‘ప్రపంచంలోని ఏ మ్యూజియం కూడా అనైతికంగా సంపాదించిన ఏ కళాకృతిని కలిగి ఉండకూడదు. స్వాతంత్య్రానికి ముందు, తరువాత విగ్రహాలను మన దేశం నుంచి అనైతిక రీతిలో బయటకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరుగుతున్నందున వివిధ దేశాలు మన వారసత్వాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయ్‌లాండ్, యూకే, యూఎస్ఏ నుంచి భారీ ఎత్తున పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 640 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి వచ్చాయి. 1947 నుంచి 2014 మధ్య కేవలం 13 పురాతన వస్తువులను మాత్రమే మన దేశం స్వాధీనం చేసుకోగలిగింది.⇒ ఇలా.. 2020–24 మధ్య 610 పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అమెరికా నుంచి వెనక్కి వచ్చినవే ఎక్కువ కావడం గమనార్హం. సగం వస్తువులను దౌత్య మార్గాల ద్వారా భారత్ తిరిగి అందుకుంది. ఈ భారతీయ కళాఖండాలు, వాటి పునరుద్ధరణ గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. భారత పురావస్తు శాఖ తన అధికార పరిధిలోని రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, మ్యూజియాలలో దొంగతనానికి గురైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తోంది.సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడంవలసవాద కాలంలో భారత్ నుంచి అనేక కళాఖండాలు తరలిపోయాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలు, ప్రైవేట్ సేకరణ సంస్థలకు విక్రయం లేదా బహుమతిగా చేరాయి. ఈ వస్తువులను తిరిగి పొందడం జాతీయ గుర్తింపు, గౌరవంగా భారత్ భావిస్తోంది. అలాగే వలసవాద పాలనలో భారతీయ కళాఖండాలను క్రమబద్ధంగా దోచుకోవడం దేశ చరిత్రపై ఒక మచ్చను మిగిల్చింది. ఈ వస్తువులను తిరిగి పొందడం చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి, ఎదుర్కొన్న సాంస్కృతిక నష్టాలను గుర్తించడానికి సహాయపడుతుంది.అక్రమ రవాణాను అరికట్టడంపురాతన వస్తువుల అక్రమ వ్యాపారాన్ని కొందరు లాభదాయకంగా మల్చుకున్నారు. దొంగిలించిన కళాఖండాలను తిరిగి పొందడం, చట్టపరమైన చట్రాలను బలోపేతం చేయడం ద్వారా భారత్ ఈ వ్యాపారంపై ఉక్కుపాదం మోపేందుకు చురుకుగా పనిచేస్తోంది.సంరక్షణ–పరిశోధనరికవరీ తరువాత ఈ కళాఖండాలను మ్యూజియాలు, ఇతర సంస్థలలో భద్రపరుస్తున్నారు. అక్కడ వాటిని సంరక్షణ, అధ్యయనంతోపాటు ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచుతున్నారు.అంతర్జాతీయ సహకారందొంగతనానికి గురైన కళాఖండాలను దౌత్య మార్గాలు, ఒప్పందాల ద్వారా స్వదేశానికి తిరిగి రప్పించడానికి భారత్ ఇతర దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో చురుగ్గా వ్యవహరిస్తోంది.

ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!
సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోబెట్టాహ్ జిల్లాలోని వెస్ట్ చాంపరన్‌లో చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు. ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోలు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని సౌత్ వెస్ట్ రీజియన్‌లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.కాగా, జూలై 18న భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భద్రతా బలగాలకు ఎదురుపడ్డ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరపడానికి యత్నించారు. అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.మావోయిస్టుల వేరివేతే లక్ష్యంగా భదత్రా బలగాలు పలు ఆపరేషన్లు చేపట్టాయి. మావోయిస్టులు లొంగిపోవడం ఒకటైతే, ఇంకోటి ఏరివేతే అనే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం చర్చలకు అంగీకరించలేదు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులనే ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఆపరేషన్ల పేరుతో మావోయిస్టుల ఉన్న ఏరియాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంచ్
అమెరికాలోని డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీ లాంఛ్ అయింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిపోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి.. పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు.. ప్రవాసులకు అండగా.. మరింత చేరువగా.. సరికొత్తగా ఆవిష్కృతం అయింది సాక్షి టీవీ నార్త్ అమెరికా. టెక్సాస్, ఫెయిర్‌వ్యూ లోని సౌత్విండ్ ఎల్ఎన్ వేదికగా ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. అమెరికా, భారత జాతీయగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా, సాక్షి టీవీ స్టాప్, యాడ్ అమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ AAA నుంచి రఘు వీరమల్లు , పవన్ కుమార్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్టు మేటర్ ఎక్స్పర్ట్స్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా AVని ప్రవాసులు ఎంతో ఆకసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ USA కి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికాకు నలుదిక్కుల వ్యాప్తి చెంది.. US లో నెంబర్ 1 నెట్వర్క్ గా రూపాంతరం చెంది.. ప్రవాసుల గొంతుకగా Sakshi TV USA నిలుస్తోందని కె.కె. రెడ్డి పెర్కొన్నారు. డల్లాస్ లో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ అవటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. ఇక సాక్షి టీవీ ఎన్నారై ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహా వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తోన్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్నారై కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీ లాంఛ్ ఈవెంట్ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె. రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ నార్త్ అమెరికాను అందరూ ఆదరించాలని కోరారు.

అమెరికా నాసా ఎన్ఎస్ఎస్ ఐఎస్డీసిలో సత్తా చాటిన విద్యార్థులు
బంజారాహిల్స్: అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరెక్టర్ సీమ తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో నాసా ఏర్పాటు చేసిన ఐఎస్‌డీఎస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి 475 మంది విద్యార్థులు హాజరైతే అందులో 67 మంది భారత దేశం నుంచి పాల్గొనగా 45 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉండటం తమకు గర్వకారణంగా ఉందని అన్నారు. అమెరికా నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయిలో 60 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకొని తాము వరల్డ్ నెం1.గా నిలిచామని తెలిపారు. వీటిలో వరల్డ్ ఫస్ట్ ప్రైజ్ 3 ప్రాజెక్టులు, వరల్డ్ సెకండ్ ప్రైజ్ 4 ప్రాజెక్టులు, వరల్డ్‌లో మూడో ప్రైజ్ కింద 10 ప్రాజెక్టులు గెలుచు కోవడంతో పాటు 43 ప్రాజెక్టులకు హానరబుల్ మెన్షన్స్ సాధించాయని తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి మరే ఏ ఇతర పాఠశాల నుంచి విద్యార్థులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనలేదన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో ఆర్టిస్టిక్ కేటగరిలో 500 డాలర్ల బహుమతి అందుకున్న ఏకైక టీం తమదేనని ఆమె వెల్లడించారు.

అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో నాట్స్ సేవా కార్యక్రమాలు
డాలస్, టెక్సాస్ : భాషే రమ్యం .. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేలా అడాప్ట్ ఏ స్ట్రీట్ పేరుతో కార్యక్రమాన్నిచేపట్టి వీధులను శుభ్రం చేసింది. ఫ్రిస్కో నగరంలో ఫీల్డ్స్ పార్క్‌వేలో చెత్తను తీసేసి.. అక్కడ వీధిని శుభ్ర పరిచింది. దాదాపు 20 మందికి పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 పౌండ్లకు పైగా చెత్తను సేకరించి ఆ వీధిని బాగుచేసింది. ఈ కార్యక్రమం ద్వారా యువతలో పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతను, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే లక్ష్యాలు నెరవేరుతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులకు సామాజిక బాధ్యతను నేర్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకీ , పెద్దలకీ మరియు మద్దతు అందించిన దాతలకు నాట్స్ డాలస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ. శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహ కోశాధికారి రవి తాండ్ర , మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె,డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ తరహా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డాలస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నాట్స్ ముందడుగు
డాలస్, టెక్సాస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. ఆకలితో ఆలమటిస్తున్న పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు రంగంలోకి దిగింది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్లు కలిసి పేద పిల్లలకు ఆహారం అందించేందుకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధం చేశాయి. రిచర్డ్సన్ నగరంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ, యువకులు, పెద్దలు.. 133 బాక్సుల పౌష్టికాహారాన్ని ప్యాక్ చేశారు. ఇందులో 28,728 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించేలా ఫుడ్ ప్యాకింగ్ చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల మార్గదర్శకత్వంలో పలువురు నాట్స్ యువ వాలంటీర్లు కుటుంబ సమేతంగా పాల్గొని వేల సంఖ్యలో ఆహార కిట్లను సిద్ధం చేశారు నాట్స్ డాలస్ చాప్టర్ యువతను ప్రోత్సహిస్తూ, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలా పేద పిల్లలకు పౌష్టికాహారం సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని బాపు నూతి అన్నారు. సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులను భాగస్వామ్యులను చేయటం చాలా సంతోషంగా ఉందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అని రాజేంద్ర మాదల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డాలస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి సహకోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, డల్లాస్ చాప్టర్ జట్టు నుండి పావని నున్న తదితరులు పాల్గొన్నారు. డాలస్ చాప్టర్ టీం, నాట్స్ సలహాదారు బృందం సభ్యుల సహకారంతో ఇంత మంచి సేవా కార్యక్రమం చేపట్టినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి నాట్స్ డాలస్ విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
క్రైమ్

నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు..!
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా’అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల వేణుగోపాల్ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న అన్న, వదినలతో కలిసి రాజమహేంద్రవరానికి వెళ్లారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడగా, 25న ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్‌మెన్‌కు ఫోన్ చేశారు. వాచ్‌మన్ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమార్తె చనిపోయింది.. వరకట్నం వెనక్కివ్వండి
మంచిర్యాల జిల్లా: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో మహిళ అంత్యక్రియల విషయంలో అనిశ్చితి ఏర్పడింది. ప్రమాదంలో గాయపడి మృతిచెందగా.. కట్నం డబ్బుల విషయమై తలెత్తిన వివాదం అందుకు కారణమైంది. శుక్ర, శనివారాల్లో మృతదేహం ఏరియా ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. పోలీసుల రంగప్రవేశం, పెద్దల పంచాయితీతో వివాదం సమసిపోయింది. వివరాలిలా ఉన్నాయి. రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు గాండ్ల సత్యం, ఆయన కూతురు ముద్దసాని లావణ్య ఇటీవల పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సత్యం అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన లావణ్య (29) హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయింది. మృతదేహాన్ని శుక్రవారం ఇక్కడికి తరలించగా.. అంత్యక్రియల సమయంలో అనిశ్చితి నెలకొంది. కాగా, లావణ్యకు రామకృష్ణాపూర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ముద్దసాని సురేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహామైంది. కొన్నేళ్లుగా వీరి మధ్య కుటుంబ కలహాలతో లావణ్య తల్లిగారింటి వద్ద ఉంటుంది. కట్నం డబ్బుల విషయమై..లావణ్య తల్లిగారింటి వద్దే ఉంటుండడంతో ఆమె కుటుంబ సభ్యులు సురేష్‌కు ఇచ్చిన కట్నం డబ్బులు ఇవ్వాలని గతంలో నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. లావణ్య, ఆమె తండ్రి ఇద్దరు మరణించడంతో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం రూ.50లక్షలు, బంగారం ఇస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని, లేదంటే అత్తారింటి ఎదుట మృతదేహంతో బైఠాయిస్తామని చెప్పడంతో వివాదం తలెత్తింది. మృతదేహాన్ని తమ ఇంటి వద్దకు తీసుకువచ్చే అవకాశం ఉందని గ్రహించిన సురేష్ తండ్రి ముందే సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి అంబులెన్స్‌లోని ఫ్రీజర్‌లో భద్రపర్చారు. శుక్రవారం నుంచి శనివారం వరకు ఈ ప్రతిష్టంభన కొనసాగింది. పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. రూ.50 లక్షల కట్నంలో రూ.20 లక్షలు తిరిగి ఇవ్వడానికి అంగీకారం కుదరడంతో వివాదం సమసిపోయింది. అనంతరం లావణ్య బంధువులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

రూ. 22,845 కోట్లు కొల్లగొట్టారు!
భారత్‌లో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకూ చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 36.36 లక్షలకు పెరిగింది.ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు, బ్యాంకులు, పోలీసు విభాగాలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పుణ్యమా అని జనంలో సైబర్ నేరాలపట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గకపోవడం గమనార్హం. సైబర్ మోసాలే కాదు.. బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తమూ ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బాధితులు నష్టం జరిగిపోయాక.. పోలీసు స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టళ్లు, టోల్ ఫ్రీ నంబర్ల వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. –సాక్షి, స్పెషల్ డెస్క్లొకేషన్ ఇట్టే పట్టేస్తారుసైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలకు సమాచారం చేరవేసేందుకు ’ప్రతిబింబ్’ మాడ్యూల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. 63,019 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగలిగారు.కట్టడికి కలిసికట్టుగా..న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని (సీఎఫ్ఎంసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు.. సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్‌ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు.. ఐటీ సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు ‘సహ్యోగ్’ పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్) రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఐఆర్) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్‌లో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది.సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది రూ.22,845.73 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం రూ.7,465.18 కోట్లు.2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్ సీఆర్పీ) 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు.. మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు.రూ.10 వేల కోట్లకుపైగా కాపాడారు!కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా వచ్చిన 17.8 లక్షల ఫిర్యాదులకుగాను రూ.5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్–1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. తద్వారా రూ.4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు.

యువతి అనుమానాస్పద మృతి
రాయగడ: రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో గల చంద్రశేఖర్‌పూర్ పోలీసులు చంద్రశేఖర్‌పూర్ సమీపంలో గల ఒక అద్దె ఇంటిలో ఒక యువతి మృతదేహాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలిని జిల్లాలోని కాశీపూర్ సమితి గొరఖ్‌పూర్ ప్రాంతానికి చెందిన అనుపమ నాయక్ (24)గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతురాలి కుటుంబానికి పోలీసులు సమాచారం తెలిపారు. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం తన కూతురు ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని దీనిపై దర్యాప్తు చేయాలని మృతురాలి తండ్రి జొయల్ నాయక్ చంద్రశేఖర్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలైన తన కూతురు చదువుకునేందుకు చంద్రశేఖర్‌పూర్ ప్రాంతంలో ఒక అద్దె ఇంటిలో ఉంటోంది. నాలుగు నెలలుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన కుమార్తెను బెదిరిస్తున్నాడని, ఈ సంగతిని ఆమె ఫోన్లో చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.