Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YS Jagan tweet on the deteriorating economic situation of AP1
మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్‌ జగన్‌ ఆందోళన

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్‌ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్‌ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్‌ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్‌టీ, సేల్స్‌ టాక్స్‌ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్‌ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్‌టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్‌ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్‌ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.

KSR Comments On CBN And Amaravati Lands2
బాబుకు టెన్షన్‌!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?

అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్‌లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్‌ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ‍ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్‌ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్‌, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్‌ ఇస్తామని పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ‍ప్రకటించిన ల్యాండ్‌ పూలింగ్‌ ప్యాకేజీని పంజాబ్‌తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్‌ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్‌ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్‌లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్‌ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్‌గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్‌ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్‌సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్‌ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్‌లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Protest Against MLA Nandamuri balakrishna vasundhara At Hindupur3
వివాదంలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. వసుంధరకు నిరసన సెగ!

సాక్షి, చిలమత్తూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామ రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కోడూరు పంచాయతీ పరిధిలోని మధురేపల్లి గ్రామస్తులు ఆమెను అడ్డుకున్నారు.కేవలం భూమిపూజలేనా.. పనులు కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ గ్రామ రహదారి నిర్మాణం కోసం 2014 సంవత్సరంలో భూమి పూజ చేశారని, పదకొండేళ్లయినా ఇంత వరకూ రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రోడ్డు లేకపోవడంతో కోడూరు తోపులోని ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏడాదికోసారి నాయకులు రావడం, భూమి పూజ చేయడం, వెళ్లిపోవడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు సరిగా లేని కారణంగా వర్షాకాలం గ్రామం నుంచి రావాలంటే ఇబ్బందిగా మారిందన్నారు. అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారమన్నారు. వెంటనే తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో వసుంధర స్పందిస్తూ విషయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివాదంలో బాలకృష్ణ..మరోవైపు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీరు వివాదంగా మారింది. హిందూపురంలో బాలకృష్ణ సతీమణి వసుంధర షాడో ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల స్థానికులు, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం బాలకృష్ణ సతీమణి వసుంధర నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగుల్లో బిజీ బిజీగా ఉండటం.. అధికారిక కార్యక్రమాల్లో వసుంధర భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Trump urges Israel to finish the job in Gaza4
ఇక చాలు.. గాజాలో పని ముగించండి

గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్‌ను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్‌ సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామంతో రగిలిపోయిన ట్రంప్‌.. ఆ సంస్థ కథ ముగించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్కాట్లాండ్‌ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘మా ప్రతిపాదనే తిరస్కరిస్తారా?. వాళ్లకు(హమాస్‌) ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన నిజంగా లేనట్లు ఉంది. వాళ్లు చావాలనుకుంటున్నారేమో. గాజాలో దాడులను ఉధృతం చేయండి. ప్రక్షాళన చేయండి​’’ అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన.హమాస్ ఒప్పందానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారు శాంతికి కాకుండా హింసకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు చివరి బంధీల వద్దకు వచ్చాం. వాళ్లు ఒప్పందం చేయాలనుకోవడం లేదు. వాళ్లను వేటాడాల్సిందే అని ట్రంప్‌ అన్నారు.ట్రంప్‌ తరఫున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్‌ విట్కాఫ్‌.. ఇజ్రాయెల్‌- హమాస్‌ చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే ట్రంప్‌ విరుచుకుపడడం గమనార్హం. విట్కాఫ్‌ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ చర్చల నుంచి అమెరికా వెనక్కి తగ్గుతోంది. శాంతి ఒప్పందం పట్ల హమాస్‌ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త ‍వ్యూహాం కోసం దోహా నుంచి తిరిగి వాషింగ్టన్‌ వెళ్తునట్లు తెలిపారాయన.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ పాలనను ముగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. హమాస్ నేత బాసెమ్ నైమ్ మాత్రం, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి అని పేర్కొన్నారు. విట్కాఫ్ వ్యాఖ్యలు కేవలం ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఒత్తిడి కలిగించేందుకు చేసినవని విమర్శించారు. మరోవైపు.. మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ కూడా చర్చలు సానుకూలంగానే సాగుతున్నట్లు చెబుతున్నాయి. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, చర్చలు నిలిపివేయడం సాధారణ ప్రక్రియ అని, అమెరికాతో కలిసి కాల్పుల విరమణ కోసం కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు.ఇక.. గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార కొరత, బాలలలో పోషకాహార లోపం, వందల మంది ఆకలితో మరణించడంలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. UNICEF, UNRWA వంటి సంస్థలు తక్షణ సహాయం అవసరం అని హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం సరిపడా పంపించామని, ఐరాసనే సరైన పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తోంది.

Hari Hara Veera Mallu 2nd Day Collection5
'హరి హర వీరమల్లు'.. రెండోరోజు భారీగా తగ్గిన కలెక్షన్స్‌

పవన్‌ కల్యాణ్‌ నటించిన 'హరి హర వీరమల్లు' భారీ అంచనాలతో జులై 24న విడుదలైంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, ప్రీమియర్‌ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా 'వీరమల్లు' విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు, ప్రీమియర్‌ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 47 కోట్ల నెట్‌ వరకే పరిమితం అయింది. రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ. 56.29 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌కు చేరుకుంది. అయితే, డే-2 మరింత దారుణమైన కలెక్షన్స్‌ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిల్క్ పేర్కొంది.చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు, రెండోరోజు అంటూ కలెక్షన్స్‌ మేకర్స్‌ ప్రకటిస్తారు. కానీ, 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్‌ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్‌ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే, బాక్సాఫీస్‌ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే 'సాక్నిల్క్' మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో పేర్కొంది. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 8.79 కోట్ల నెట్‌ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది. బెనిఫిట్‌ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్‌, మొదటిరోజు రూ. 34.75 కోట్ల నెట్‌, రెండో రోజు రూ. 8.79 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56.29 కోట్ల నెట్‌ మాత్రమే రాబట్టింది. గ్రాస్‌ కలెక్షన్స్‌ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ. 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్‌ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.

BRS Cadre Confused With KTR, Kavitha Meeting6
ఒకేరోజు రెండు.. అయోమయంలో బీఆర్‌ఎస్‌ కేడర్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. అటు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, ఇటు కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం ఇవాళ శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో పాలుపోక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ‘‘అన్నా.. ఎటు పోదామే’’ అంటూ నగరంలోని బీఆర్‌ఎస్‌ క్షేత్రస్థాయి నేతలు ఒకరితో ఒకరు ఫోన్లలో చర్చించుకుంటున్నారు. ఇవాళ.. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వీ కార్యక్రమాలు నిర్వహించడమే అందుకు కారణం. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్‌లో జాగృతి తరఫన లీడర్‌ కార్యక్రమం జరగనుంది. ఈ మీటింగ్‌ను ఆసరాగా చేసుకుని జాగృతిని బలోపేతం చేయాలని.. గ్రామ స్థాయి దాకా కమిటీలు వేయాలని ఆమె నిర్ణయించారు కూడా. వాస్తవానికి ఈ మీటింగ్‌ను గత నెల 15వ తేదీనే కవిత ఫిక్స్‌ చేశారు. అయితే.. ఈలోపు బీఆర్‌ఎస్వీ తరఫున రాష్ట్ర సదస్సు నిర్వహణ ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో నష్టాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను విద్యార్థుల స్థాయి నుంచే ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించిది. ఈ నెల 19 నుంచి విద్యాసంస్థల్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేస్తోంది కూడా. ఉదయం సెషన్‌ను మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సాయంత్రం కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు మీటింగ్‌లు పార్టీ కేడర్‌లో మాత్రం గందరగోళానికి తెరదీశాయి. తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్థాపించగా, బీఆర్ఎస్‌కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు కార్యక్రమాలకు వేదికలు, ప్రాంతాలు వేర్వేరు అయినప్పటికీ.. ఒకే తేదీన నిర్వహిస్తుండడం గులాబీ దండులో చర్చనీయాంశమైంది. ఇద్దరిలో ఎవరికి జై కొట్టాలా? అని చర్చించుకుంటున్నారు.

Ravindra Jadeja Blasts India Debutant As Fielding Blunder7
ఏయ్.. అక్క‌డేమి చేస్తున్నావ్‌? యువ ఆట‌గాడిపై జ‌డేజా ఫైర్‌! వీడియో వైర‌ల్‌

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా త‌డ‌బడుతోంది. వ‌రుస‌గా రెండు రోజుల పాటు భార‌త్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్ర‌స్తుతం 186 ప‌రుగుల లీడ్‌లో కొన‌సాగుతోంది. ఇంగ్లండ్ సీనియ‌ర్ బ్యాట‌ర్ జో రూట్‌(150) అద్బుత‌మైన సెంచ‌రీతో క‌దం తొక్కాడు. త‌న సూప‌ర్ బ్యాటింగ్‌తో భార‌త బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. ఆఖ‌రికి ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో రూట్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అయితే సెంచ‌రీతో మెరిసిన జో రూట్‌కు మూడో రోజు ఆట ఆరంభంలోనే భార‌త ఫీల్డ‌ర్లు ఓ లైఫ్‌లైన్ ఇచ్చేశారు. రూట్ 23 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ భార‌త ఫీల్డ‌ర్ల త‌ప్పిదం వ‌ల్ల ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. ఈ క్ర‌మంలో ర‌వీంద్ర జ‌డేజా త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు అన్షుల్ కాంబోజ్‌పై కోపంతో ఊగిపోయాడు.ఏమి జ‌రిగిందంటే?ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 54 ఓవ‌ర్ వేసిన మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతిని రూట్ గ‌ల్లీ దిశ‌గా ఆడాడు. గ‌ల్లీ పొజిషేన్‌లో ఉన్న జైశ్వాల్ ఆ బంతిని ఆపేందుకు ప్ర‌య‌త్నించాడు. జైశ్వాల్ చేతికి తాకి కాస్త దూరంగా వెళ్లిన బంతిని జ‌డేజా అందుకున్నాడు. అయితే బంతిని చూస్తూ ఉండిపోయిన రూట్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లేందుకు ఆల‌స్యం చేశాడు.ఈ క్రమంలో బంతిని అందుకున్న జ‌డేజా నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు త్రో చేశాడు. కానీ బంతి మాత్రం స్టంప్స్‌కు తాక‌లేదు. అయితే జ‌డేజా విసిరిన బంతిని అందుకోవడ‌నికి కూడా క‌నీసం స్టంప్స్ ద‌గ్గ‌ర ఎవ‌రూ లేరు. జడేజా విసిరిన బంతిని మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కాంబోజ్ అందుకున్నాడు.కానీ కాంబోజ్ ముందే బంతిని తీసుకోవ‌డానికి స్టంప్స్ దగ్గ‌రకు రాక‌పోవ‌డంతో జ‌డేజా సీరియ‌స్ అయ్యాడు. అక్క‌డ ఏమిచేస్తున్నావు? ఇక్క‌డ‌కు రావాలి కాదా అంటూ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఒకవేళ రూట్ రనౌట్ అయ్యింటే ఇంగ్లండ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. ఈ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.చదవండి: IND vs ENG: టీమిండియాకు డేంజర్‌ బెల్స్‌.. పేస్‌ గుర్రానికి ఏమైంది?pic.twitter.com/Fh7dXQIX4S— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 25, 2025

Big Relief for YSRCP Leaders Jolt For TDP Leaders in Eluru Court8
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్‌ షాక్‌

సాక్షి, ఏలూరు జిల్లా: వైయస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన దెందలూరు ఎమ్మెల్యేకి బిగ్‌ షాక్‌ తగిలింది. వైయస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించిన ఏలూరు కోర్టు.. విడుదలకు ఆదేశాలిచ్చింది. వైయస్సార్‌సీపీ నేతలపై వేధింపులకు దిగిన కూటమి నేతలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. గతంలో టీడీపీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని జైలుకు పంపుతానంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కామిరెడ్డి నానితో పాటు, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరులు తేజ, ప్రదీప్‌లను ఏలూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన రూరల్‌ పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. అయితే వీళ్లను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్‌ చేశారో కూడా పోలీసులు చెప్పలేకపోయారు. దీంతో నిన్నంతా ఏలూరులో హైటెన్షన్‌ నెలకొంది. అయితే.. బెయిల్‌ మీద వ్యక్తిగత పూచీపై వీళ్ల విడుదలకు ఏలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. అదే సమయంలో.. సిద్ధం సభ కేసు అంటూ పేర్కొనడాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో అక్రమంగా నిర్బంధించినందుకుగానూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రామకృష్ణకు మెమో జారీ చేసింది. సమన్లు ఇచ్చాకే కోర్టులో హాజరుపర్చాలని తీర్పు ఇచ్చింది. చింతమనేని సవాల్‌ నేపథ్యంలోనే ఈ అరెస్ట్‌ జరిగిందనే చర్చ జోరుగా నియోజకవర్గంలో నడుస్తోంది.

YSRCP Bhumana Serious On SP Manikanta9
వివాదాస్పదంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహార శైలి.. భూమన ఆగ్రహం

సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ కాలేశా తొలగింపుపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ మణికంఠ ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్‌ కాదని వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘రెండు నెలలు క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయికి ఫ్యాక్చర్‌ అయ్యింది. చేయి గాయం కారణంగా గన్ మెన్ కాలేశా ఔదార్యపూరితమైన పెద్దిరెడ్డికి సహాయం చేశాడు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరిని అనుమతించరు. అందుకే పెద్దిరెడ్డితో పాటుగా గన్‌మెన్‌.. మిథున్‌ రెడ్డి ఉన్న జైలుకు వెళ్లారు. మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును పెద్దిరెడ్డి మోయలేకపోవడంతో.. దాన్ని గన్‌మేన్‌ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ మణికంఠ.. కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. ఇలా చేయడం సరికాదు.ఎస్పీ ఆఫీసు, బంగ్లాలో అనధికారికంగా ఎంతో మంది పని చేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించనని చెప్పిన ఎస్పీ మణికంఠ.. ఆదర్శంగా నిలవాలి. అనాధికారికంగా కానిస్టేబుల్స్‌తో ఎస్పీ కార్యాలయం, బంగ్లాతో పనిచేయిస్తున్నారు. ఎస్పీ వెంటనే వారిని తొలగించి ఆదర్శంగా ఉండాలి. ఆత్మ న్యూనత భావంతో పనిచేయకండి. కాలేశా సస్పెండ్ కరెక్ట్ అయినప్పుడు.. మిగతా వారిని కూడా సస్పెండ్ చేస్తారా?.ఇదిలా ఉండగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహారశైలి మరోమారు వివాదస్పదమయ్యింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ రూట్‌ మ్యాప్‌ అప్పటికప్పుడు మారుస్తూ, ఆంక్షలు విధించిన ఎస్పీ.. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్‌ చేశారు. పెద్దిరెడ్డి గన్‌మేన్‌ కాలేషాను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రాజమండ్రి జైల్లో ఉండగా, రెండు రోజుల క్రితం ఆయనను పరామర్శించడానికి రామచంద్రారెడ్డి వెళ్లారు.ఇటీవల పెద్దిరెడ్డి చేయి విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును ఆయన మోయలేకపోవడంతో.. దాన్ని గన్‌మేన్‌ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ, కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. మానవతాదృక్పథంతో బ్యాగు తీసుకున్నందుకు తనను సస్పెండ్‌ చేయడం తగదని కాలేషా వేడుకున్నా.. అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఇక గతేడాది జూలైలో ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంలో అక్కడ టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడి, కార్లకు నిప్పంటించారు. మిథున్‌రెడ్డిపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటడంతో మిథున్‌రెడ్డి గన్‌మేన్‌ గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ నాడు మిథున్‌రెడ్డి గన్‌మేన్‌ను సైతం సస్పెండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా ఎస్పీ మణికంఠ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

HMDA Layout Permission Delays in Telangana become major concern10
హైదరాబాద్‌లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..

హెచ్‌ఎండీఏ లే అవుట్‌ల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ సర్కార్‌ నుంచి అనుమతి లభించకపోవడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఆరు నెలల క్రితమే భూముల విక్రయం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అప్పట్లో రియల్‌ఎస్టేట్‌ రంగంలో స్తబ్దత నెలకొనడం వల్ల విరమించుకున్నారు. కొద్ది రోజులుగా ‘రియల్‌’ రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. ఇటీవల హౌసింగ్‌బోర్డు స్థలాల అమ్మకాలకు సముచితమైన స్పందన లభించింది. మరోవైపు నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో నిర్మాణరంగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ భూములకు సైతం డిమాండ్‌ బాగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారుల ఆసక్తి..ప్రైవేట్‌ వెంచర్‌ల కంటే హెచ్‌ఎండీఏ లే అవుట్‌లలో కొనుగోలు చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, పారిశుద్ధ్య, మంచినీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించడం, ఎలాంటి వివాదాలు లేని స్థలాలు కావడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకుని సంపన్నులు, బిల్డర్‌లు, రియల్టర్లు తదితర అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కూడా హెచ్‌ఎండీఏ భూములను, స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. గతంలో వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ విక్రయించిన స్థలాలకు భారీ ఎత్తున స్పందన లభించడమే ఇందుకు నిదర్శనం. కాలయాపన ఎందుకు.. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్ముల్‌నెర్వా, లేమూరు, కుర్మల్‌గూడ, తొర్రూరు, ప్రతాప్‌సింగారం తదితర ప్రాంతాల్లో స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల హెచ్‌ఎండీఏ సొంత స్థలాల్లో లేఅవుట్‌లను అభివృద్ధి చేయగా, ప్రతాప్‌సింగారం, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములను అభివృద్ధి చేశారు. ఈ వెంచర్‌లలో రైతులకు 60 శాతం ప్లాట్‌లు కేటాయించగా చెందిన మిగతా 40 శాతం స్థలాల్లో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా స్థలాలను విక్రయించవచ్చు. ‘ప్రస్తుతం అన్ని విధాలుగా సానుకూలంగా ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటేనే కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తుంది’ అని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.బుద్వేల్, మోకిల వంటి చోట్ల గతంలో హెచ్‌ఎండీఏ స్థలాలకు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం అక్కడ ఇంకా కొన్ని స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట్‌లో ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైంది. బుద్వేల్‌లోనూ భారీ ఆదాయం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఎన్నారైలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించే మధ్యతరగతి వర్గాలు సైతం హెచ్‌ఎండీఏ స్థలాలను కొనుగోలు చేశాయి.ఇదీ చదవండి: ‘జీఎస్‌టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి’కాసులుంటేనే పరుగులు.. సికింద్రాబాద్‌ నుంచి డెయిరీఫాం, శామీర్‌పేట్‌ మార్గాల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌లతో పాటు ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి రీజినల్‌ రింగ్‌రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. డెయిరీఫాం ఎలివేటెడ్‌కు, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లకు టెండర్‌లు కూడా ఖరారయ్యాయి. దీంతో నిధుల కేటాయింపు హెచ్‌ఎండీఏకు ఒక సవాల్‌గా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూములను, ప్లాట్‌లను విక్రయించడం వల్ల కనీసం రూ.5000 కోట్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement