Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YSRCP MP Avinash Reddy Key Statement On Pulivendula Repolling1
ఈసీ డ్రామా.. పులివెందులలో రీపోలింగ్‌ బహిష్కరిస్తున్నాం: అవినాష్‌ రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌: పులివెందులలో ఈరోజు జరుగుతున్న రీపోలింగ్‌ను వైఎ‍స్సార్‌సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్‌ను చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ వారు ఎలా బూత్‌లు ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు తెల్లవారు జామున 2 గంటలకు కేవలం 2 బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్‌లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నిక జరపాలని మేము కోరాం. కేవలం తప్పించుకునేందుకు రాత్రికి రాత్రి కేవలం రెండు బూత్‌లలో రీపోలింగ్ అంటున్నారు. అసలు ఏజెంట్లను కూడా బూత్‌లోకి రానివ్వలేదు. అన్ని ఆధారాలు బయటకు వచ్చాయి.మహిళల ఓట్లను కూడా మగవాళ్లు వేసేశారు. కోర్టుకు ఆశ్రయిస్తామని ఈ రీపోలింగ్ డ్రామాను తెర మీదకు తెచ్చారా?. మా స్టాండ్ 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలి. ఈ రెండు బూత్‌లలో నేడు జరుగుతున్న రీపోలింగ్ మేము బహిష్కరిస్తున్నాం. మొత్తం 15 బూత్‌లలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. నిన్న మీడియాను కూడా అడ్డుకుని కెమెరాలు లాక్కున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. పులివెందులలో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు.ఒక గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోడానికి జిల్లాలో ఉన్న టీడీపీ కేడర్ మొత్తాన్ని గ్రామంలో దించారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్‌పై ఉంది. నిన్న జరిగిన అరాచకాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు రీపోలింగ్ పెడుతున్నారు. అన్ని సెంటర్లలో పోలీసుల సంపూర్ణ సహకారంతో మా ఏజెంట్స్‌ను బయటకు నెట్టేశారు. 15 ఊరులో ప్రజలను అడిగితే నిజానిజాలు తెలుస్తాయి. మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.. నిజమైన ఓటర్లను, ప్రజలను ప్రశ్నించి చూడండి. నిజాలు బయటకు వస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Ys Jagan Demanded Election Commission Conduct Repolling In Vontimitta And Pulivendula2
రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్ జగన్ ఫైర్

సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో రౌడీ రాజ్యంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలలో జరిగిన అరాచకాలపై మంగళవారం ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు.‘పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని,పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారు.ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్‌ డే.పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలి’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న… pic.twitter.com/aXclpoCv77— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2025‘చంద్రబాబు సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైంది. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి. కాని, చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్‌ చేయించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతాం? చంద్రబాబుగారు.. ఓట్లను రిగ్గింగ్‌ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదు...ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్‌ నిర్వహించడం గతం వరకూ నుంచో పాటిస్తున్న విధానం. కాని చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పులివెందుల ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్‌ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడింది. మరోవంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలాకాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబుగారి తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్‌, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావుగారి సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం?’అని ప్ర శ్నించారు.‘అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? ఆయన ఏం మంచి చేశాడని ఓట్లేస్తారు. 15నెలల ఆయన పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత, పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది. ప్రతి కుటుంబం తన కాళ్లమీద తాను నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ, ఆ స్కీములు అన్నిటినీ రద్దుచేయడమే కాదు, తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లనూ మోసాలతో, అబద్ధాలతో ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఏగ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా చంద్రబాబునాయుడును, ఆ పార్టీకి చెందిన వారికి, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుమారు రూ.19వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు. మరోవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్‌, లెటరైట్‌, లిక్కర్‌, చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు, లంచాల కోసం శెనక్కాయలకు, బెల్లాలకు భూములు అప్పనంగా ఇవ్వడం మొదలు, మొబలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట పనులు జరక్కుండానే, రేట్లు పెంచి ఇవ్వడం మొదలు, రాజధాని నిర్మాణాల పేరిట విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు, విద్యాదీవెన, వసతి దీవెన లేదు, ఆస్పత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకూ ఆరోగ్యశ్రీ లేదు. స్కూళ్లలో నాడు-నేడు లేదు, ట్యాబుల్లేవు, టోఫెల్‌ పీరియడ్స్‌తో పాటు ఇంగ్లిషు మీడియం లేదు. మరి ఇలాంటి అబద్ధాలు, మోసాలు, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుగారికి ప్రజలు ఓట్లెందుకు వేస్తారు?’ ..పోనీ తనకే ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబుగారు, ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకే ఓట్లేస్తారని అనుకున్న‌ప్పుడు, ఆ ధైర్యం, నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా? ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్‌ బూత్‌లు పెట్టేవాడు కదా? ఆ నమ్మకం లేదు కాబట్టే చంద్రబాబుగారు ఈ అరాచకాలన్నీ చేశారు. రెండు చిన్న ZPTC స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వాడుకుని, ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేది ఏముంటుంది?..2017 నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చంద్రబాబుగారు ఇదే తరహా కుట్రతో అరాచకాలు చేశారు. ప్రతి వీధికో ఎమ్మెల్యేను పెట్టారు, ప్రతి వార్డుకో మంత్రిని పెట్టి, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో 27వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు, మా పార్టీ పనైపోయిందని, జగన్‌ పని అయిపోందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు. ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 34,560 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చంద్రబాబుగారి పార్టీ పూర్తిగా క్లీన్‌బౌల్డ్ అయ్యింది. అవ్వాళ్టి ఎన్నికతో పోలిస్తే ఇవాళ పులివెందుల ఈ రెండు ZPTC ఉప ఎన్నికల్లో అంతకుమించి అరాచకాలు చేశారు. 2019 తరహాలోనే భవిష్యత్తులోకూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు కచ్చితంగా స్పందించి, చంద్రబాబుకు బుద్ధిచెప్తారు...పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఇవాళ ఇన్ని అక్రమాలు జరిగినా, అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం. అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో, ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు, ఆధారాలతో న్యాయస్థానాల‌ దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో, వారి భద్రత నడుమ తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతాం’ అని చంద్రబాబు రౌడీ రాజ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi may Visit US for UNGA Session Next Month3
ఐరాస సమావేశానికి ప్రధాని మోదీ .. ట్రంప్‌తో ముఖాముఖీ?

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి(ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) వార్షిక ఉన్నత స్థాయి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశం ఉందని పీటీఐ తెలిపింది. ఇదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించనున్నారని పేర్కొంది.భారత దిగుమతులపై ట్రంప్ పరస్పర సుంకాలు విధించడంతో భారత్‌- అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రధాని మోదీ యూఎన్‌జీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనుంది. సెప్టెంబర్ 23 నుండి 29 వరకు జరిగే ఈ సదస్సును సాంప్రదాయకంగా బ్రెజిల్ ప్రారంభించనుంది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెషన్‌ ఉంటుందని సమాచారం. భారత ప్రతినిధి సెప్టెంబర్ 26న ఉదయం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పీటీఐ పేర్కొంది. అదే రోజున ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రతినిధులు కూడా ప్రసంగించే అవకాశం ఉంది.గత ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలోని వైట్ హౌస్‌లో ట్రంప్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య చర్చలు నడుస్తున్న తరుణంలోనే ట్రంప్ భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో మొత్తం విధించిన సుంకం 50 శాతంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యను అన్యాయమైనదిగా పేర్కొంది. కాగా సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలు దేశాధినేతలతో మోదీ భేటీ కానున్నారని తెలుస్తోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ , అధ్యక్షుడు ట్రంప్‌ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది.

Due To Heavy Rain Forecast School Holidays In Telangana4
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా, భారీ వర్ష సూచన దృష్ట్యా తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పాఠశాలలకు బుధ, గురువారాల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ, గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. INSANE RAINFALL IN MANCHERIAL, ASIFABAD, MULUGU, BHUPALAPALLY, PEDDAPALLI The first round of LPA rains turned MASSIVE as North East TG got extremely heavy rainfall in few places. Bheemini, Kannepalli in Mancherial recorded highest rainfall of 207mm. Other parts too got VERY…— Telangana Weatherman (@balaji25_t) August 13, 2025భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంఐటీ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుండపోత వానలతో నగరంలోని రోడ్లు జలమయమై, ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందనే అంచనాలతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.5:00 AM Update 🌧️🌧️Scattered Rains across - Adilabad, Asifabad, Nirmal, Mancherial, Nizamabad, Jagtial, Kamareddy, Sircilla, Karimnagar, Peddapalli, Siddipet, Sangareddy, Medak, Hanumakonda, Nalgonda, Suryapet, Nagarkurnool, Mahabubnagar, Wanaparthy, Gadwal districts next 3hrs— Weatherman Karthikk (@telangana_rains) August 12, 2025

The Hundred 2025: Liam Livingstone Humiliates Rashid Khan With 4,6,6,6,4 In One Over 5
విధ్వంసం.. రషీద్‌ ఖాన్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన లివింగ్‌స్టోన్‌

హండ్రెడ్‌ లీగ్‌లో ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ లీగ్‌లో బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. నిన్న (ఆగస్ట్‌ 12) ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 69 పరగులు చేసి తన జట్టును గెలపించాడు.ఈ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్‌ ఇన్విన్సిబుల్స్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌పై విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. వరుసగా ఐదు బంతుల్లో 4,6,6,6,4 (26 పరుగులు) బాదాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 20 బంతులు వేసిన రషీద్‌.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. 4,6,6,6,4 BY LIAM LIVINGSTONE AGAINST RASHID KHAN 🥶- 26 runs from just 5 balls by the Captain. pic.twitter.com/DioUvlipWk— Johns. (@CricCrazyJohns) August 13, 2025హండ్రెడ్‌ లీగ్‌లో ఇదే అత్యంత ఖరీదైన స్పెల్‌. రషీద్‌ టీ20 కెరీర్‌లోనూ (హండ్రెడ్‌ మ్యాచ్‌లు టీ20లుగా పరిగణించబడతాయి) ఇవే అత్యంత చెత్త గణాంకాలుగా (20-3-59-0) నిలిచాయి. దీనికి ముందు రషీద్‌ చెత్త టీ20 గణాంకాలు 2018 ఐపీఎల్‌లో (పంజాబ్‌ కింగ్స్‌పై 4 ఓవర్లలో 55 పరుగులు) నమోదయ్యాయి.తాజాగా రషీద్‌ నమోదు చేసిన అత్యంత చెత్త గణాంకాలు మ్యాచ్‌ స్వరూపానే మార్చేశాయి. 25 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన తరుణంలో లివింగ్‌స్టోన్‌ విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్‌ ఫీనిక్స్‌వైపు తిరిగింది. చివరి ఓవర్‌ (5 బంతులు) తొలి రెండు బంతులకు వికెట్లు కోల్పోయినా బెన్నీ హోవెల్‌ బౌండరీని బాది ఫీనిక్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇన్విన్సిబుల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 180 పరుగుల భారీ స్కోర్‌ చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. లివింగ్‌స్టోన్‌కు ముందు విల్‌ స్మీడ్‌ (29 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జో క్లార్క్‌ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఫీనిక్స్‌ గెలుపుకు పునాది వేశారు.ONE OF THE CRAZIEST SHOT EVER - THIS IS RASHID KHAN..!!! 🫡 pic.twitter.com/EozpYLhjD2— Johns. (@CricCrazyJohns) August 12, 2025అంతకుముందు ఇన్విన్సిబుల్స్‌.. డొనొవన్‌ ఫెరియెరా (29 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపుల అనంతరం నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జోర్డన్‌ కాక్స్‌ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడగా.. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఇందులో ఓ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

Pakistan PM Shehbaz Sharif Threatens India Over Indus Waters Treaty6
‘భారత్‌కు ఒక్క చుక్క నీటినీ ఇవ్వం’.. మళ్లీ పాక్‌ తాటాకు చప్పుళ్లు

న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలోని ఒక్క చుక్క నీటిని కూడా భారత్‌కు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ శత్రు దేశం.. సింధునదిలోని ఒక్క చుక్కనీటిని లాక్కున్నా సహించేది లేదన్నారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత ఏప్రిల్ 23న భారత్‌ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్యూటీ)నిలిపివేసింది. ఈ నేపధ్యంలో ఇదే నీటిపై ఆధారపడిన పాక్‌.. సింధు ప్రవాహాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పేర్కొంది. తాజాగా ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘మీరు మా నీటిని నిలిపివేస్తామని బెదిరిస్తే, పాకిస్తాన్ నుండి ఒక్క చుక్క నీటిని కూడా లాక్కోలేరని గుర్తుంచుకోండి.అలాంటి చర్యకు ప్రయత్నిస్తే, మీకు మళ్లీ గుణపాఠం చెబుతామని, అప్పుడు మీరు మీ చెవులు పట్టుకోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. Shehbaz Sharif warns India of “serious consequences” if the Indus Water Treaty is touched… because in Pakistan’s worldview, water is off-limits but exporting militants is fair game.Four threats in 48 hrs from 4 men reading the same ISI script. Islamabad’s version of water… pic.twitter.com/DwXV9hbsPn— Mariam Solaimankhil (@Mariamistan) August 12, 2025షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్‌ ఇంకా స్పందించలేదు. కాగా పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల.. సింధు జలాల ఒప్పందం రద్దును సింధు నాగరికతపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ విషయంలో భారత్‌.. పాకిస్తాన్‌ను యుద్ధ పరిస్థితుల్లోకి నెట్టివస్తే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇదే అంశంపై స్పందించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసే ఏ ఆనకట్టనైనా ఇస్లామాబాద్‌ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్యానించారు.భారత్‌ ఆనకట్ట నిర్మించే వరకు వేచి చూస్తామని, తరువాత దానిని నాశనం చేస్తామని హెచ్చరించినట్లు డాన్ వార్తాపత్రిక పేర్కొంది.

Manchu Lakshmi Appears Infront Of Enforcement Directorate7
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష‍్మీ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ సాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. అలా ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా.. ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. గంటల పాటు సాగిన విచారణకు సహకరించారు. ఇప్పుడు బుధవారం(ఆగస్టు 13) నాడు మంచు లక్ష‍్మీ.. ఈడీ అధికారుల ముందు హాజరుకానుంది.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)ఈ రోజు 11 గంటలకు వ్యక్తిగతంగా మంచు లక్ష‍్మీ.. ఈడీ కార్యాలయానికి రానుంది. ఇ‍ప్పటికే సంబంధిత వివరాలు తీసుకురావాలని ఈమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు? ప్రమోషన్‌తో ఎంత లాభం చేకూరింది? తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగించనున్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు కోసం ముగ్గురు హీరోయిన్లు?)

Bihar Voter Roll Revision can be set Aside Supreme Court8
Bihar: ఓటరు జాబితా సవరణపై సుప్రీం సీరియస్‌.. ఈసీకి వార్నింగ్‌

న్యూఢిల్లీ: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే, ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించేందుకు సమయం కూడా ఉండదని పేర్కొంది.బీహార్‌లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటుచేసుకున్నట్లు తేలితే. ఎన్నికలు సమీపించే సెప్టెంబర్‌లో అయినా ఆ జాబితాను పక్కనపెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈసీ గతంలో.. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి, ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిని నిర్ణయించేది ఐదు కోట్ల మంది ఓటర్లని, ఈసీ కాదని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయ. ఈ నేపధ్యంలో ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.దీనిపై స్పందించిన ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్‌ కావడం ప్రతిపక్షాలను ఊరటనిచ్చింది.

how tariffs effects on india imposed by US9
టారిఫ్‌ ఒడిదుడుకులు ఇంకెన్ని రోజులు!

అమెరికా టారిఫ్‌ల వల్ల నెలకొన్న ఒడిదుడుకుల ప్రభావం మనపై స్వల్పకాలికంగానే ఉంటుందని యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎండీ మధు నాయర్‌ చెప్పారు. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, భారీ రుణభారం ఉన్న అమెరికా, ప్రస్తుతంతో పోలిస్తే కాస్త బలహీనపడొచ్చని ఆయన చెప్పారు. పరిస్థితులు క్రమంగా స్థిరపడి భారత్‌లాంటి దేశాలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. మన మార్కెట్లలో తీవ్ర స్థాయిలో కరెక్షన్‌ రాకపోవచ్చన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల సంగతి అలా ఉంచితే, భారత ఆర్థిక మూలాలు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీయంగా మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహం పటిష్టంగా ఉంటోందని నాయర్‌ చెప్పారు. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు, ఈపీఎఫ్‌ నిధులు, రిటైల్‌ ఇన్వెస్టర్లు, యులిప్స్‌ వంటి మార్గాల్లో ప్రతి నెలా రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రూ.లక్ష కోట్ల ఏయూఎం లక్ష్యంరాబోయే అయిదేళ్లలో రూ. లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) స్థాయిని సాధించాలని నిర్దేశించుకున్నట్లు నాయర్‌ చెప్పారు. ప్రస్తుతం ఇది సుమారు రూ. 23,000 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రస్తుత పథకాలపై మరింతగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నట్లు నాయర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 1న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఆల్‌ క్యాప్‌ యాక్టివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టెలికాం టారిఫ్‌లు పెంపు?అర్థయ పేరిట స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌ఐఎఫ్‌)ను నవంబర్‌లో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం కన్జూమర్‌ డిస్క్రిషనరీ, టెలికం, క్యాపిటల్‌ గూడ్స్‌/ఇండస్ట్రియల్స్‌ రంగాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండగా ఇంధన, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాలు కాస్త ప్రతికూలంగా ఉన్నాయని నాయర్‌ చెప్పారు.

US designation Balochistan Liberation Army10
మునీర్‌ మంతనం.. పాక్‌ మద్దతుగా అమెరికా సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ), మజీద్‌ బ్రిగేడ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్‌టీఓ)లుగా అమెరికా ప్రకటించింది. బీఎల్‌ఏని 2019లోనే.. స్పెషల్లీ డెజిగ్నేటెడ్‌ గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (ఎస్‌డీజీటీ) జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్‌ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి ఆ రెండు సంస్థలు చేసిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఎఫ్‌టీవోలుగా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.ఈ సంస్థల హింసాత్మక చర్యలు పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ‘ఉగ్రవాద సంస్థలను ఇలా గుర్తించడం వల్ల వాటికి లభించే సహాయాన్ని, నిధులను నిరోధించవచ్చు. ఈ సంస్థలకు ఆర్థికంగా, భౌతికంగా లభించే మద్దతును చట్టపరంగా నిలిపివేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం’అని ఆయన పేర్కొన్నారు. పాక్‌పై ఔదార్యం.. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ అమెరికా పర్యటనలో ఉండగానే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆయన చేసిన విజ్ఞప్తితోపాటు బలమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జూన్‌లో అమెరికా అధ్యక్షుడితో ము నీర్‌ ఒక ప్రైవేట్‌ విందుకు హాజరైనప్పటి నుంచి పాకిస్తాన్‌ పట్ల అమెరికా అమితమైన ఔదా ర్యం చూపుతోంది. బీఎల్‌ఏని విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం అందులో భాగం. మునీర్‌ అమెరికా పర్యటన సందర్భంగానే ఈ ప్రకటన రావడం అతనికి దౌత్యపరమైన విజయాన్ని అందించింది. అయితే.. తమ దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి బీఎల్‌ఏను భారత్‌ రెచ్చగొడుతోందని పాకిస్తాన్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. 1970 నుంచి.. బీఎల్‌ఏ ఖనిజ సంపన్న ప్రావిన్స్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పాకిస్తాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది. 1970వ దశకంలో బీఎల్‌ఏ ప్రారంభమైంది. పాక్‌ మాజీ ప్రధాని జులి్ఫకర్‌ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచి్చనపుడు బలూచిస్తాన్‌లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. సైనిక నియంత జియావుల్‌ హక్‌ అధికారం చేజిక్కించుకోవడంతో చర్చల తరువాత సాయుధ తిరుగుబాటు ముగిసింది. బీఎల్‌ఏ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ పాలనలో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు చేసింది. 2006లో పాకిస్తాన్‌ ప్రభుత్వం బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థ చైనా–పాకిస్తాన్‌ ఎకనామిక్‌ ట్రాన్సిట్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో చైనా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బీఎల్‌ఏ బషీర్‌ జేబ్‌ నాయకత్వంలో కొనసాగుతోంది. మజీద్‌ బలూచ్‌ అనే మిలిటెంట్‌ పేరుతో మజీద్‌ బ్రిగేడ్‌ ఏర్పడింది.హింసాత్మక దాడులు.. అమెరికా నిఘా నేత్ర బీఎల్‌ఏను చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. అయితే బీఎల్‌ఏ 2019 తర్వాత అనేక హింసాత్మక దాడులకు పాల్పడింది. మజీద్‌ బ్రిగేడ్‌ పేరుతో అనేక దాడులను నిర్వహించింది. 2024లో కరాచీ విమానాశ్రయం సమీపంలో, అలాగే గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీయే బాధ్యత వహించింది. 2025 మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్‌ వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేసింది. ఈ దాడిలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోగా>.. 300 మందికి పైగా రైలు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement