Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Ysrcp Pac Meeting: Ys Jagan Comments On Chandrababu1
నువ్వు ఏదైతే విత్తావో అదే చెట్టవుతుంది చంద్రబాబూ: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని.. సీనియర్‌ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మిథున్‌రెడ్డి అరెస్ట్‌ బాధాకరమన్నారు.‘‘మిథున్‌ను, గౌతం రెడ్డిని రాజకీయాల్లో నా ద్వారా వచ్చారు. నన్ను చూసి ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారు. వారి తండ్రులతో కన్నా, వీరితోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. నన్ను చూసి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలోని అంశాలకు మిథున్‌కు ఏం సంబంధం?. మిథున్‌ తండ్రి పెద్దిరెడ్డిగారు ఆ శాఖను కూడా చూడలేదు. కేవలం వేధించాలన్న ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారు. చంద్రగిరి చంద్రబాబు సొంత నియోజకవర్గం. గతంలో చంద్రబాబు మంత్రిగా పనిచేసి చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాడు. తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు...కుప్పం బీసీల నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్లిపోయాడు. చంద్రబాబు కంట్లో భాస్కర్‌రెడ్డి కంట్లో నలుసులా మారాడు. భాస్కర్‌ కొడుకును కూడా జైలులో పెట్టాలని కుట్రపన్నాడు. భాస్కర్‌ కొడుకు లండన్‌లో చదువుకుని వచ్చాడు. అలాంటి వారిమీద కూడా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు. నందిగం సురేష్‌, ఒక సాధారణ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగాడు. గట్టిగా తన స్వరాన్ని వినిపిస్తున్నాడని 191 రోజులు జైల్లో పెట్టారు. కేసు మీద కేసు పెట్టి వేధిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌ మీద కూడా కేసులు మీద కేసులు పెట్టారు...టోల్‌గేట్ల వద్ద ఫీజుల వద్దకూడా వసూలు చేశారని తప్పుడు కేసు. లేని అక్రమాలు చూపించి.. తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మళ్లీ మరో మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. దీని కోసం తప్పుడు వాంగ్మూలం చెప్పించే ప్రయత్నంచేశారు. మెజిస్ట్రేట్‌ వద్ద తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి చెప్పాడు. పార్టీలో ఇలా ముఖ్యమైన, క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారు. ప్రజల తరఫున గొంతు వినిపించనీయకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబు పాలన ఘోరంగా ఉంది. అసలు పరిపాలనే కనిపించడంలేదు..సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ సహా ఏ హామీలు నిలబెట్టుకోలేదు. ఘోరంగా వైఫల్యం చెందాడు కాబట్టే… ఈ తప్పడు కేసులు. మాజీ మంత్రి రోజామీత తీవ్రంగా దుర్భాషలాడారు. మన పార్టీలో ఉన్న మహిళలకు ఆత్మగౌరవం ఉండదా?. బీసీ మహిళ, కృష్ణాజడ్పీ ఛైర్మన్‌ హారిక మీద నేరుగా దాడులు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిమీద హత్యాయత్నమే లక్ష్యంగా దాడులు చేశారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి?. రాడ్లతో, కర్రలతో దాడులు చేశారు. తాడిపత్రి నియోజకవర్గ హెడ్‌ క్వార్టర్‌కు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్లలేకపోతున్నాడు...ఏకంగా సీఐ గన్‌ చూపించి మనుషులను భయపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కొంతమంది డీఐజీలు, పోలీసు అధికారులు అవినీతిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ కొంతమంది పోలీసులు కలెక్షన్‌ ఏజెంట్లుగా మారారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కలెక్షన్లు పంచుతున్నారు. ముఖ్య నేతకు, ముఖ్య నేత కొడుక్కి.. కలెక్షన్లు పంచుతున్నారు. వ్యవస్థీకృతంగా అవినీతి జరుగుతోంది. బెల్టుషాపులకు వేలం పాటలు వేస్తున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్‌ మాఫియా, ర్వార్ట్జ్‌, సిలికా, లెటరైట్‌ మాఫియాలు జరగుతున్నాయి. కొంతమంది పోలీసు అధికారుల సహాయంతో అవినీతిపై పంచాయతీలు చేయిస్తున్నారు. మనం ఎప్పుడూ చూడని విధంగా అవినీతి జరుగుతోంది..రేషన్‌ బియ్యం మాఫియా కొనసాగుతోంది. పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. కొంతమంది డీఐజీలు కలెక్షన్‌ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని, ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు, ఇంతకన్నా పచ్చిమోసం ఉంటుందా?. ఫీజురియింబర్స్‌ మెంట్‌ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు మానేస్తున్న పరిస్థితులు వచ్చాయి. రూ.4200 కోట్లు పీజు రియింబర్స్‌ మెంట్‌ బకాయలు ఉన్నాయి, ఆరు క్వార్టర్లనుంచి పెండింగ్‌. వసతీ దీవెన కింద రూ.2200 కోట్లు బకాయిలు ఉన్నాయి...ఆరోగ్యశ్రీ బిల్స్‌ నెలకు రూ.300 కోట్ల చొప్పున, రూ.4200 కోట్లు పెండింగ్‌. ఆరోగ్య ఆసరా కింద ఒక్క పైసా ఇవ్వడంలేదు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులు చేతులు ఎత్తివేశాయి. ఏ రైతుకూ, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెడుతున్నారు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలు, ఇ- క్రాప్‌ నిర్వీర్యం. నాడు-నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు మూసేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పాలన ఎక్కడుంది?. రెండేళ్లపాటు కోవిడ్‌ ఉన్నా.. మనం ప్రజలకు మెరుగైన సంక్షేమం అందించాం...ఐదేళ్లలో మనం చేసిన అన్నిరకాల అప్పులు రూ.3.32 లక్షల కోట్లు చేశాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు అందులో 52 శాతం వెళ్లాడు. ఏ పథకం లేదు. ఏ స్కీమూ లేదు. కేవలం దోచుకున్న డబ్బులు దాచుకోవడానికి మాత్రమే సింగపూర్‌ పర్యటన. పోర్టులు, హార్బర్లు కట్టాం, స్కూళ్లు బాగుచేశాం, ఆర్బీకేలువ కట్టాం, సచివాలయాలు కట్టాలం, విలేజ్‌ క్లినిక్స్‌ కట్టాం, మెడికల్‌ కాలేజీలు కట్టాం. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలేదు, అంతా దోచుకుంటున్నారు. దేశం ఆదాయం సగటున 12 శాతం పెరిగితే, రాష్ట్రం ఆదాయాలు 3శాతంకూడా పెరగడంలేదు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు ఆయన జేబులోకి పోతున్నాయి...పార్టీ తరఫున త్వరలో యాప్‌ విడుదలచేస్తాం. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చు. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు. ఆ ఆధారాలన్నీకూడా అప్‌లోడ్‌ చేయొచ్చు. ఆ కంప్లైంట్‌ ఆటోమేటిగ్‌గా మన డిజిటల్‌ సర్వర్లోకి వచ్చేస్తోంది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తాం. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు...ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్‌లోడ్‌ చేయొచ్చు. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు ఏదైతో విత్తారో అదే చెట్టవుతోంది. రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో.. కార్యక్రమం కింద బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ.. కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. మండలాల్లో కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. 90 నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలోకూడా ప్రారంభమై ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమం ఉద్ధృతంగా చేయాలి. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, ప్రతి కుటుంబానికీ ఎంత బాకీ పడ్డాడో చెప్పాలి..పీఏసీ సభ్యులు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనాలి. పీఏసీ సభ్యులంతా సీనియర్‌ లీడర్లు. మీ అనుభవాన్ని పార్టీ కార్యక్రమాలకు జోడించాలి. పార్టీని క్రియాశీలంగా నడిపే బాధ్యతను తీసుకోవాలి. గ్రామ స్థాయిలో మనం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రచ్చబండ కార్యక్రం ద్వారా కమిటీల ఏర్పాటు కూడా ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని నాయకులంతా పర్యవేక్షణ పరిశీలన చేయాలి. గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్తా పార్టీ సంస్థాగత నిర్మాణంలోకి రావాలి. బాబుష్యూరిటీ, మోసం గ్యారంటీ కింద గ్రామస్థాయిలో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమం చాలా పగడ్బందీగా జరగాలి...ప్రతి గ్రామంలోనూ జరగాలి, అక్కడే గ్రామ కమిటీల నిర్మాణం జరగాలి. ఇది కచ్చితంగా నూటుకు నూరుశాతం జరగాలి. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న భావన ప్రజల్లో బాగా వెల్లడవుతోంది. ఇస్తానన్న బిర్యానీ లేదు. ఉన్న పలావూ పోయింది. అందుకే మన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పీఏసీ సభ్యులంతా భాగస్వాములు కావాలి. పీఏసీ సభ్యులంతా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పెద్దరికంతో కలుపుగోలుగా ఉండాలి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాలి. అందరం ఐక్యతతో పనిచేయాలి...పార్టీ పరంగా ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న విభేదాలను రూపుమాపి అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకు రావాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశం. పార్టీకోసం కష్టపడేవారు ఎవరన్నది ఇప్పుడే బయటకు వస్తుంది. పార్టీలో మంచి గుర్తింపు పొందడానికి ఇదొక అవకాశం. గ్రామ కమిటీలు అయ్యాక బూత్‌ కమిటీలు వేయాలి. ఈసారి కార్యకర్తలకు పెద్దపీట. మరో 30 ఏళ్లు పార్టీ బలంగా సాగేలా కార్యకర్తలకు తోడుగా, అండగా ఉంటాం. కోవిడ్‌ కారణంగా ఆశించినంతగా మనం వారికి చేయలేకపోయాం. రెండేళ్లపాటు కోవిడ్‌ సంక్షోభంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వందేళ్లకు ఒకసారి వచ్చే కోవిడ్‌ లాంటి మహమ్మారిని చాలా ప్రభావంతంగా హేండిల్‌ చేశాం. ప్రజలను బాగా ఆదుకున్నాం...కార్యకర్తల విషయంలో గతంలోలా కాదు. కచ్చితంగా వారికి పెద్ద పీట ఉంటుంది. ప్రస్తుతం గ్రామ కమిటీల మీద దృష్టిపెట్టాలి. తర్వాత బూత్‌కమిటీల మీద దృషిపెట్టాలి. ప్రతి గ్రామంలోనూ సోషల్‌మీడియా ఉండాలి. అలాగే గ్రామాల వారీగా అనుబంధ విభాగాలు ఉండాలి. కమిటీల ఏర్పాటు వల్ల క్రియాశీలక కార్యకర్తలను చైతన్యం చేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తారు, పార్టీ నిర్మాణంలో, కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటారు. పార్టీ కమిటీల్లో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.వైఎస్‌ జగన్‌ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళనవైఎస్‌ జగన్‌ భద్రతపై పీఏసీ సమావేశంలో ఆందోళన వ్యక్తమమైంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉందని పీఏసీ సభ్యులు తెలిపారు. ‘‘మీరు భద్రంగా ఉంటేనే మేం, ప్రజలు బాగుంటాం. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే వైయస్‌.జగన్‌ భద్రతపై సమస్యలు సృష్టిస్తోంది. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భద్రత విషయంలో ఉపేక్షించడం కరెక్టు కాదు. మీ భద్రత విషయంలో కొత్త కొత్త వార్లు వింటున్నాం. మా అందరికీ చాలా ఆందోళన కరంగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఇందులో రాజీ వద్దని పీఏసీ సభ్యులు.. జగన్‌కు సూచించారు. బంగారుపాళ్యం సహా ఇతర పర్యటనల్లో భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం కావాలనే రాజీ పడిందన్నారు.

 Russia is not Israel or even Iran Former PresidentDmitry Medvedev2
‘ ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిల్‌, ఇరాన్‌ కాదు’

వాషిం‍గ్టన్‌: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇచ్చిన డెడ్‌లైన్‌పై ఇప్పుడు ఆ రెండు(అమెరికా-రష్యా) దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌లో రష్యా సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన గడువును యూఎస్‌ రిపబ్లిక్‌ సెనేటర్‌ లిండే గ్రాహం గుర్తు చేశారు. ట్రంప్‌ గడువును రష్యా సీరియస్‌గా తీసుకున్నట్లు కనబడుటం లేదు. గడువు సమీపిస్తోంది. దీనిపై రష్యా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి మెద్వెదేవ్‌ తీవ్రంగా స్పందించారు. లిండే గ్రాహం చేసిన ట్వీట్‌ను కోడ్‌ చేస్తూ మెద్వెదేవ్‌ కౌంటరిచ్చారు. To those in Russia who believe that President Trump is not serious about ending the bloodbath between Russia and Ukraine:You and your customers will soon be sadly mistaken. You will also soon see that Joe Biden is no longer president.Get to the peace table. https://t.co/IRWk9I0Ljf— Lindsey Graham (@LindseyGrahamSC) July 28, 2025 ఇక్కడ అమెరికా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రష్యాతో ట్రంప్‌ అల్టిమేటం గేమ్‌ ఆడుతున్నారు. ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిలో లేక ఇరాన్‌ దేశమో కాదు. 50 రోజులు లేదా 10... అని కాదు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి అల్టిమేటం ముప్పు యుద్ధం వైపు అడుగు అనే విషయం ట్రంప్‌ గుర్తుంచుకోవాలి. ట్రంప్‌ చేస్తున్నది రష్యాపైనో, ఉక్రెయిన్‌ పైనో యుద్ధం కాదు. వేరే పరిణామాలకు దారి తీయొచ్చు(మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని సంకేతాలిస్తూ) ’ అంటూ ఘాటుగా స్పందించారు మెద్వెదెవ్‌.రష్యాకు 50 రోజుల సమయమేఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారీ సుంకాలు ముప్పుతో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్‌ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. వైట్‌ హౌస్‌లో నాటో చీఫ్‌ మార్క్‌ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్‌ కాస్త ఘాటుగా స్పందించారు.

PM Modi speaks on Operation Sindoor in Lok Sabha3
ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ

సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్‌ ఇచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపుతో భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్‌ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి ప్రతీకగా విజయ్‌ ఉత్సవ్‌. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్‌ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌లోని ఉగ్రవాదుల హెడ్‌ క్వార్టర్స్‌ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్‌ సిందూర్‌. భారత్‌ ప్రతీకార చర్యలను చూసి పాక్‌ బిత్తర పోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ ముందు పాక్‌ తేలిపోయింది.ఆపరేషన్‌ సిందూర్‌ ముందుకు బ్లాక్‌ మెయిల్స్‌ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు హెడ్‌లైనే గతి56 ఇంచ్‌ల చెస్ట్‌ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్‌ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్‌ను కాదు.. దేశాన్ని సపోర్ట్‌ చేసింది. కాంగ్రెస్ హెడ్‌లైన్స్‌లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. ‌మాస్టర్‌ మైండ్‌కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్‌ ఎయిర్‌ బేస్‌లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన ఎయిర్‌ఫోర్స్‌ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్‌ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మాస్టర్‌ మైండ్‌కు నిద్ర కరువైంది. పాక్‌ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్‌ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్‌ లక్క్ష్యం. మన మిస్సైల్స్‌ పాక్‌ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్‌ సిందూర్‌తో స్పందిస్తామని పాక్‌ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్‌ సిందూర్‌తో సైనికులు పాక్‌ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్‌ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్‌ సిందూర్‌: ట్రంప్‌ ప్రమేయం లేదుఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్‌ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాకు ఫోన్‌ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్‌ చాలాసార్లు నాకు ఫోన్‌ చేశారు. పాక్‌ భారత్‌పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్‌ నాకు చెప్పాడు. పాక్‌ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్‌ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉంది. పాక్‌ అజెండాను ఇంపోర్ట్‌ చేసుకునే పనిలో కాంగ్రెస్‌ ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్‌ అడుగుతోంది. పాక్‌ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదుఅధమ్‌ పూర్‌ బేస్‌పై దాడి అంటూ పాక్‌ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. పాక్‌ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్‌ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్‌ మిసైల్‌ కూడా భారత్‌ను టచ్‌ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్‌ మహాదేవ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్‌లో భాగంగా భారత్‌ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్‌ మహాదేవ్‌ చేపట్టారని అఖిలేష్‌ యాదవ్‌ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్‌ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్‌ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్‌ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్‌ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్‌ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్‌ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగు‌ల భూభాగాన్ని భారత్‌ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్‌గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్‌కు నీళ్లు అప్పగించి భారత్‌లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్‌లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్‌కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్‌ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్‌ బ్యాంక్‌కు అప్పగించారు.

Latham To Miss 1st Test Against Zimbabwe Due To Shoulder Injury4
న్యూజిలాండ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

రేపటి నుంచి (జులై 30) జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. లాథమ్‌ గైర్హాజరీలో మిచెల్‌ సాంట్నర్‌ న్యూజిలాండ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సాంట్నర్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ జట్టుకు 32వ కెప్టెన్‌ అవుతాడు.లాథమ్‌ ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు. జింబాబ్వేతో తొలి టెస్ట్‌ సమయానికి లాథమ్‌ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయంగా సాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.సాంట్నర్‌ ఇటీవల జింబాబ్వేలోనే జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ మొత్తంలో అజేయ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్‌.. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్‌ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఫైనల్‌ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్‌ హెన్రీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, సిరీస్‌ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌..జులై 30 నుంచి ఆగస్ట్‌ 3- తొలి టెస్ట్‌ (బులవాయో)ఆగస్ట్‌ 7 నుంచి 11- రెండో టెస్ట్‌ (బులవాయో)జింబాబ్వేతో టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు..హెన్రీ నికోల్స్‌, విల్‌ యంగ్‌, రచిన్‌ రవీంద్ర, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, నాథన్‌ స్మిత్‌, మిచెల్‌ సాంట్నర్‌, డారిల్‌ మిచెల్‌, డెవాన్‌ కాన్వే, టామ్‌ బ్లండెల్‌, విలియమ్‌ ఓరూర్కీ, అజాజ్‌ పటేల్‌, జేకబ్‌ డఫీ, మాథ్యూ ఫిషర్‌, మ్యాచ్‌ హెన్రీ

Vijay Sethupathi faces serious casting couch allegations by Ramya Mohan5
ఆ పని కోసం రూ. 2 లక్షలు ఆఫర్‌.. స్టార్‌ హీరోపై యువతి ఆరోపణలు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతిపై ఓ అమ్మాయి చేసిన ఆరోపణలు ఇప్పుడు తమిళనాడులో దుమారం రేపాయి. ఓ యువతిని విజయ్‌ చాలా ఏళ్లుగా ఇబ్బంది పెట్టాడని, క్యారవాన్‌ ఫేవర్‌ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్‌ కోసం రూ. 50 వేలు ఆఫర్‌ చేశాడని ఆరోపించింది. అంతేకాదు సదరు యువతి ప్రస్తుతం రిహబిలేషన్ సెంటర్‌ చికిత్స పొందుతోందని సోషల్‌ మీడియాలో ద్వారా వెల్లడించి.. కాసేపటికే ఆ పోస్ట్‌ని డిలీట్‌ చేసింది.అసలేం జరిగింది?కోలీవుడ్‌లో డ్రగ్స్‌, క్యాస్టింగ్‌ కౌచ్‌ కొనసాగుతుందంటూ రమ్యా మోహన్‌ అనే యువతి నిన్న(జులై 28) మధ్యాహ్నం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది .అందులో తనకు తెలిసిన ఓ యువతికి జరిగిన అన్యాయం గురించి వివరిస్తూ..దానికి కారణం విజయ్‌ సేతుపతే అని ఆరోపించింది.‘తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్‌, క్యాస్టింగ్‌ కౌచ్‌ కల్చర్‌ ఎక్కువైంది. ఇది జోక్‌ కాదు. నాకు తెలిసిన, మీడియాకు బాగా పరిచయం ఉన్న ఓ యువతి ఇప్పుడు ఊహించని ఒక ప్రపంచంలోకి లాగబడింది. ఆమె ఇప్పుడు రిహాబిలేషన్‌ సెంటర్‌లో ఉంది. క్యారవాన్‌ ఫేవర్‌ కోసం రూ. 2 లక్షలు, డ్రైవ్స్‌ కోసం రూ. 50 వేలను స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఆఫర్‌ చేశాడు. ఆమెను అతను చాలా ఏళ్లుగా వేధించాడు. ఇదొక్కటే కాదు.. ఇండస్ట్రీలో ఇలాంటి స్టోరీస్‌ చాలా ఉన్నాయి. బాధితులను విస్మరిస్తూ... ఇలాంటి వ్యక్తులను మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది’అంటూ రమ్య విమర్శించింది. అంతేకాదు నిజాన్ని గుర్తించకుండా.. బాధితురాలిపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరీ, ఫోన్ చాట్‌ల ద్వారా ఆ యువతి అనుభవించిన బాధ బయటకు వచ్చిందని, ఇది కట్టు కథకాదని, ఆమె జీవితం..ఆమె బాధ..అంటూ మరో ట్వీట్‌ చేసింది.అందుకే డిలీట్‌ చేశావిజయ్‌ని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను కాసేపటికే ఆమె డిలీట్‌ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు వచ్చాయి. నిజమే అయితే ఎందుకు డిలీట్‌ చేశావంటూ నెటిజన్స్‌ రమ్యపై మండిపడ్డారు. దీంతో దానికి వివరణ ఇస్తూ రమ్య మరో ట్వీట్‌ చేసింది. కోపంతో ఆ ట్వీట్‌ పెట్టానని, అది అంత వైరల్‌ అవుతుందని ఊహించలేదని, బాధితురాలి గోప్యత , శ్రేయస్సు కోసం తన పోస్ట్‌ను తొలగించినట్లు ఆ ట్వీట్‌లో పేర్కొంది.I shared that tweet out of frustration and to vent. Didn’t expect it to get this much attention. Getting too many enquiries about it now. Out of concern for her privacy and wellbeing I’ve decided to take it down. Hope that’s respected.— Ramya Mohan (@_Ramya_mohan_) July 28, 2025

Dharamsthal case Geo tagging of Burial and Cremation sites6
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!

ధర్మస్థళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఆసక్తికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. దేవాలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు తాను ధర్మస్థళ పరిసరాల్లో వందలాది శవాల అంత్యక్రియలు నిర్వహించానని, ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (ఎస్‌ఐటీ)ని ఏర్పాటు చేసింది కూడా. ఈ నేపథ్యంలో.. ఫిర్యాదుదారు తాజాగా తాను శవాలను కాల్చిన, పూడ్చిన 15 ప్రాంతాలను విచారణ అధికారులకు చూపించారు. వీటిల్లో ఒకటి హైవే పక్కనే ఉండగా మిగిలినవన్నీ నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇతర కార్యకలాపాలు జరక్కుండా సిట్‌ అధికారులు వాటికి జియో ట్యాగింగ్‌ చేశారు. అంతేకాకుండా ఫొటోలు తీసి కాపలా కోసం సాయుధ పోలీసులను ఏర్పాటు చేశారు. 1998 -2014 మధ్య కాలంలో తాను కొందరి ఒత్తిడి కారణంగా వందలాది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని, వీరిలో చాలామంది మహిళలు, మైనర్‌ బాలికలు ఉన్నారని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసింది. జూలై నాలుగున ఫిర్యాదు ఇచ్చిన సందర్భంగా అతడు ఒక పుర్రెను సాక్ష్యంగా అందించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం జూలై 19న డీజీపీ ప్రణబ్‌ మహంతి నేతృత్వంలో ఒక ఎస్‌ఐటీని ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు తరువాత ఫిర్యాదుదారుణ్ణి రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ఆ వివరాలను రికార్డు చేశారు. ఆ తరువాత సోమవారం ఫిర్యాదుదారుడితో కలిసి ఆన్‌సైట్‌ పరిశీలనలను జరిపింది. మొత్తం 15 అనుమానిత ప్రాంతాలను గుర్తించింది. ఈ కార్యకలాపాల్లో ఫోరెన్సిక్స్, ఆంత్రోపాలజీ, రెవెన్యూ విభాగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లో త్వరలో తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మరోవైపు ఈ దర్యాప్తును ధర్మస్థళ మంజునాథేశ్వర ఆలయం స్వాగతించింది. విచారణ పారదర్శకంగా జరగాలని కోరింది. ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కొందరు ఎస్‌ఐటీ విచారణపై న్యాయ వ్యవస్థ పర్యవేక్షణ అవసరమని కోరారు. అలాగే నిస్పక్షికత కోసం ఫోరెన్సిక్స్‌ సాయం తీసుకోవాలని సూచించారు.

New York Shooting: Immigrant Super Cop How Furniture Saved Lives7
ఆఫీస్‌ ఫర్నీచర్‌ అడ్డుపెట్టుకుని.. శరణార్థి కాస్త సూపర్‌ హీరోగా!

అగ్రరాజ్యపు ప్రముఖ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. న్యూయార్క్ మిడ్‌టౌన్ మాన్‌హటన్‌ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్‌ అధికారి సహా నలుగురు మృతి చెందారు. అయితే.. ఉద్యోగులు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే పెను ప్రాణ నష్టమే సంభవించి ఉండేదని తెలుస్తోంది. 345 పార్క్ అవెన్యూలో.. పలు ప్రముఖ సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాల్పుల ఘటన చోట చేసుకుంది. ఆ సమయంలో కాల్పుల శబ్దాలు విన్న మిగతా ఉద్యోగులు.. బయట ఏం జరుగుతుందో అనే ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని తలుపులను బిగించుకున్నారు. సోఫాలు, కుర్చీలు, చేతికి దొరికిన ఫర్నీచర్‌ను తలుపులకు అడ్డుగా పెట్టుకున్నారు. కొంత మంది తమ డెస్కులను లాక్కెళ్లి అడ్డంగా పెట్టారు. BREAKING: Photo from inside the Blackstone office pic.twitter.com/8DeVVbX5CD— Exec Sum (@exec_sum) July 29, 2025మేము పని ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పబ్లిక్ అడ్రస్ ద్వారా ‘shelter in place’ అని హెచ్చరించారు అని షాద్ సాకిబ్ అనే ఉద్యోగి తెలిపారు. జెస్సికా చెన్ అనే ఉద్యోగి మాట్లాడుతూ.. మేము ప్రెజెంటేషన్ చూస్తున్న సమయంలో, ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే టేబుళ్లను తలుపు దగ్గర బారికేడ్ చేశాం అని తెలిపింది. ‘‘ఇది భయంకరమైన అనుభం.. దాడి చేస్తూ అతను(దుండగుడు)పైకి వెళ్లాడు. ప్రాణాలు అరచేతపట్టుకుని వణికిపోయాం’’ అని ఓ మహిళా ఉద్యోగి తెలిపారు. మరో 9/11 దాడి జరుగుతుందేమోనని వణికిపోయాం అని మరికొందరు చెప్పడం గమనార్హం.దుండగుడు ఎవరంటే.. కాల్పుల్లో పోలీస్‌ అధికారి సహా నలుగురిని దుండగుడు హతమార్చాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత 33వ అంతస్తులోకి వెళ్లిన దుండగుడు.. తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దుండగుడిని లాస్‌ వెగాస్‌ నెవెడాకు చెందిన షేన్ తమురా(27)గా గుర్తించారు. గ్రెనాడా హిల్స్ హై స్కూల్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్నాడు. లాస్ వెగాస్‌లోనే ఒక క్యాసినోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. 2022 జూన్ 14న గన్‌ లైసెన్స్‌ పొందాడు. దాడి సమయంలో AR-15 రైఫిల్, బుల్లెట్ రెసిస్టెంట్ వెస్ట్ ధరించి ఉంచడం గమనార్హం. నిందితుడికి సంబంధించిన నెవాడా నంబర్ ప్లేట్ ఉన్న BMW కారులో రైఫిల్, రివాల్వర్, మందులు, మ్యాగజైన్లు లభించాయి. న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన ప్రకారం.. తమురాకు మానసిక సమస్యలు ఉన్నాయి. అయితే ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సూపర్‌ హీరో దిదారుల్‌ ఇస్లాం షేన్ తమురా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి.. ఎన్‌వైపీడీ పోలీస్‌ అధికారి దిదారుల్‌ ఇస్లాం. దుండగుడిని అడ్డుకునే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే మూడేళ్ల కిందటి దాకా ఈయన బంగ్లాదేశ్‌ శరణార్థి. విధుల్లో చేరినప్పటి నుంచి నిబద్ధతతో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భవతిగా ఉంది. దిదారుల్‌ నిజమైన న్యూయార్కర్‌. దేవుడిని నమ్మే వ్యక్తి. ఆయన రియల్‌ హీరో అంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. దిదాఉల్‌ నగరాన్ని రక్షించేందుకు ప్రాణ త్యాగం చేశారు. ఆయన సేవలను ఎప్పటికీ గౌరవిస్తాం అని NYPD కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. తాజా ఘటన.. ఈ సంవత్సరం అమెరికాలో జరిగిన 254వ సామూహిక కాల్పుల ఘటనగా కావడం గమనార్హం.

Audrey Crews, first woman to get Elon Musks Neuralink chip8
ఆలోచనలతో కంప్యూటర్‌ని కంట్రోల్‌ చేస్తున్న తొలి మహిళ!

సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్‌ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్‌కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్‌ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్‌ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్‌ ట్రయల్‌ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్‌ చిప్‌ను పొందింది ఆడ్రీక్రూస్‌ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆ‍డ్రీ కూస్‌ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్‌ ట్రయల్‌లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్‌ చిప్‌ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్‌ బ్రెయిన్‌ ఇంప్లాట్‌ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్‌ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్‌ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేసుకున్నారామె. ఆ పోస్ట్‌లో ఆండ్రీ డిజిటల్‌ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ ఫోటోని షేర్‌ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్‌ సింబల్‌, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్‌ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్‌గా, కర్సర్‌గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్‌ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్‌తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్‌ క్లినికల్‌ ట్రయల్‌లో తొమ్మిదొ పేషెంట్‌గా ఈ చిప్‌ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్‌లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్‌ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్‌ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్‌ చిప్‌ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్‌ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్‌ అంటే..​ 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్‌లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్‌లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్‌ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్‌ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్‌..సొంతంగా జిమ్‌..ఇంతలో ఊహకందని మలుపు..!)

Big Relief to YS Jagan In NCLT Details here9
‘సరస్వతీ’ షేర్ల వ్యవహారం.. వైఎస్‌ జగన్‌కు బిగ్‌ రిలీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. షేర్ల బదిలీ ప్రక్రియను నిలుపుదల చేస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(NCLT) హైదరాబాద్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తన కుటుంబ సభ్యులు అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిలిపివేయాలంటూ కిందటి ఏడాది సెప్టెంబర్‌లో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు. రిజిస్టర్‌లో వాటాదారుల పేర్లను సవరించి, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ కోరారాయన. జగన్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘గిఫ్ట్‌’ పూర్తికాకుండానే మోసపూరితంగా వాటాల బదలాయింపు జరిగిందని తెలిపారు. వాటాల పత్రాలు, వాటాల బదలాయింపు ఫారాలు సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా కంపెనీ వాటాలను బదలాయించిందన్నారు. పిటిషన్‌లపై తుది తీర్పు వెలువడేవరకు బదలాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని జగన్‌ తదితరులు కోరారు. వైఎస్‌ జగన్‌ పిటిషన్‌పై పది నెలలపాటు విచారణ జరిగింది. ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్‌ సభ్యులు రాజీవ్‌ భరద్వాజ్, సాంకేతిక సభ్యుడు సంజయ్‌ పురీ విచారణ జరిపి రెండు వారాల కిందట తీర్పు రిజర్వ్‌ చేశారు. చివరకు.. జగన్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్‌.. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉండగా బదిలీలు సాధ్యం కాదంటూ ఇవాళ తీర్పు వెల్లడించారు.

Zoho CEO Vembu said AI enhancing productivity not eliminating jobs10
‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’

టెక్ రంగంలో ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుందనే భయాలు నెలకొంటున్న తరుణంలో జోహో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఆశలు రేకెత్తిస్తోంది. జోహోలో ఇంజినీర్లను ఏఐ భర్తీ చేయగలదా అని కంపెనీ సీఈఓ మణి వెంబును అడిగినప్పుడు ప్రస్తుతానికి దాని ప్రభావం లేదని సమాధానం చెప్పారు. ఇటీవల ఓ సమావేశంలో వెంబు మాట్లాడారు.‘కృత్రిమ మేధ కారణంగా జోహోలో ఉద్యోగాల్లో కోత లేదు. మీరు ఏఐ వ్యవస్థను ఒక కంటెంట్‌ను సృష్టించమని అడిగితే అది చాలా మెరుగ్గా కంటెంట్‌ను ఇస్తుంది. అయితే కేవలం ఈ ఫీచర్‌ మా కంపెనీలో ఉద్యోగాలను తొలగించలేదు. ఇప్పటివరకు కృత్రిమ మేధ కారణంగా మేము సిబ్బందిని తగ్గించలేదు. వాస్తవానికి మరికొందరు ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం’ అని చెప్పారు.ఇటీవల బెంగళూరులో జరిగిన జోహోలిక్స్‌ కార్యక్రమంలో వెంబు ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జియా అని పిలువబడే కంపెనీ సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించారు. ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ భారతదేశపు మొట్టమొదటి ఎంటర్ప్రైజ్ ఏఐ అని చెప్పారు. ఇది సాధారణ ప్రజల కోసం ఉద్దేశించింది కానప్పటికీ, ఈ నమూనా వ్యాపారాలకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. దీన్ని జోహో ఉత్పాదకత, ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్‌ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలుకృత్రిమ మేధ కంపెనీ వర్క్ ఫ్లోలో భాగమవుతోందని వెంబు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులకు మరింత సహాయపడుతుందని నమ్ముతున్నారు. ‘ఇప్పటివరకు (జోహోలో) మేము కంపెనీలో ఏఐ కచ్చితంగా ఉద్యోగులను భర్తీ చేయడాన్ని చూడలేదు. దానికి బదులుగా ఇది ఉద్యోగులకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక సపోర్ట్ రిప్రజెంటేటివ్ సాధారణంగా రోజుకు 20 టిక్కెట్లను హ్యాండిల్ చేస్తాడనుకోండి.. ఏఐ సాయంతో 25 టిక్కెట్లను నిర్వహించే అవకాశం ఉంది. ఇది 20 శాతం వరకు ఉత్పాదకతను పెంచుతుంది’ అని చెప్పారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement