Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Cockpit exchange of Ahmedabad Air India pilots before crash1
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే

ఢిల్లీ: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్‌ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్‌ ఎందుకు స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్‌ ఆఫ్‌ చేయలేదని మరో పైలట్‌ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్‌ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్‌ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్‌ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట​్‌ వాయిస్‌లో పైలట్‌ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్‌అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగెంట్‌ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్‌ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్‌ 12న ఎయిర్‌ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో, హస్టల్‌లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025

Netizens Satirical Comments On Pawan Kalyan Over Hindi2
పవన్ @పెద్దమ్మ భాషా పితామహ..

రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు. వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.-సిమ్మాదిరప్పన్న.

Cant Comment Investigation Air India Initial Crash Report3
‘నో కామెంట్‌’.. ప్రాథమిక నివేదికపై ఎయిర్ ఇండియా మౌనం

న్యూఢిల్లీ: జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి, 260 మంది మరణించిన ఘటనపై చురుకుగా దర్యాప్తు సాగుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను వెలువరించించి. దీనిపై ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ, ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు సంఘీభావం తెలిపింది. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని పేర్కొంది. అలాగే విచారణ ఇంకా కొనసాగుతున్నందున ఇప్పుడే దీనిపై ఎటువంటి కామెంట్‌ చేయలేమని స్పష్టం చేసింది.ఎయిర్‌లైన్‌కు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక జూలై 12న అందింది. విమాన ప్రమాదం దర్యాప్తులో ఎయిర్ ఇండియా ఏఏఐబీ, ఇతర అధికారులకు నిరంతరం సహకారం అందిస్తోంది. క్యారియర్ నియంత్రణ సంస్థలు, భాగస్వాములకు పలు వివరాలు అందిస్తోంది. ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక వివరాలపై ఎయిర్‌ ఇండియా స్పందిస్తూ దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదని, అందుకే దీనిపై ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించబోమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక వివరాలను మేము అంగీకరిస్తున్నామని ‘ఎక్స్‌’ పోస్టులో తెలిపింది.ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం, జూన్ 12న అహ్మదాబాద్ సమీపంలో విమానం కూలిపోయి 260 మంది మరణించడానికి కొద్దిసేపటి ముందు విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆపివేసివున్నాయి. తరువాత ఆన్‌ చేశారని తేలింది. కాగా బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లు తక్షణ భద్రతా చర్యలు చేపట్టలేదని ఏఏఐబీ తన నివేదికలో చెప్పకపోయినా, విమానంలో ఇంధన నియంత్రణలను మార్చడం దర్యాప్తులో కీలకమైన అంశంగా పేర్కొంది. దీనిపై లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

Radhika Yadav Case Another Twist Full Details4
రాధికా యాదవ్‌ హత్యకు కారణం అదేనా?

గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ (25)ను తండ్రి దీపక్‌ యాదవ్‌ (49) హత్య చేసిన కేసు మిస్టరీగా మారింది. రాధిక హత్య కేసులో తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తమ వర్గానికి చెందని వ్యక్తిని రాధిక ప్రేమిస్తోందని.. అది తన తండ్రికి ఇష్టం లేకపోవడంతోనే హత్య చేసినట్టు దీపక్‌ యాదవ్‌ సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు. ఇక, ఆమె ప్రియుడు.. రాధిక క్లాస్‌మేట్‌ అని తెలుస్తోంది.అయితే, ఇప్పటికే రాధిక హత్యకు సంబంధించి వివిధ రకాలుగా వార్తలు బయటకు వచ్చాయి. రాధిక సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మొదట వార్తలు వచ్చాయి. అనంతరం, రీల్స్‌ చేయడం కారణంగా హత్య చేసి ఉంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం ఆ కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక హత్యకు ఆమె ప్రేమ వ్యవహారమే ముఖ్య కారణమని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తండ్రి, కూతురు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, రాధిక హత్య కేసులో దీపక్‌ యాదవ్‌ను శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, ఒకరోజు పోలీసు కస్టడీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న రాధిక తల్లి ఏం చేస్తున్నారన్నది కూడా విచారిస్తున్నట్లు గురుగ్రామ్‌ పోలీసు అధికారి సందీప్‌సింగ్‌ తెలిపారు. రాధికా యాదవ్‌ గురుగ్రామ్‌లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటోంది. గురువారం ఆమె ఇంట్లో వంట చేస్తుండగా.. తండ్రి దీపక్‌ యాదవ్‌ వెనుక నుంచి తుపాకీతో కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయింది. దీపక్‌ యాదవ్‌కు గురుగ్రామ్‌లో చాలా ఆస్తులు ఉన్నాయి. అద్దెలు కూడా వస్తాయి. ఈ కారణంగానే టెన్నిస్‌ అకాడమీ నడపాల్సిన అవసరం ఏముందని ఆయన కుమార్తెతో తరచూ వాదన పడుతుండేవారని తెలిసింది. #RadhikaYadav | Tennis Player Radhika Yadav Shot Dead By Father In GurugramInam Ul Haque, co-actor in Radhika Yadav’s music video, opens up about their time filming together amid the shocking murder investigation@akankshaswarups | #RadhikaYadav pic.twitter.com/HdWJhmNJ7Q— News18 (@CNNnews18) July 11, 2025అలాగే, రాధిక గతేడాది ఓ కళాకారుడితో కలిసి మ్యూజిక్‌ రీల్స్‌ చేసింది. ఈ ఉదంతం వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లుగా తెలుస్తోంది. ఓ పాటలో రాధిక నటించింది. ఈ వీడియోతో రాధికతో పాటు ఇనాముల్ అనే వ్యక్తి నటించాడు. ఇక, ఈ పాటలో వారిద్దరూ ఎంతో సన్నిహితంగా కూడా ఉన్నారు. అయితే, ఈ పాటకు వీడియో అయిపోయిన తర్వాత ఆమెతో తాను ఎలాంటి కాంటాక్ట్‌లో తాను లేనని ఇనాముల్‌ చెప్పుకొచ్చాడు. What will people say? This thinking took his daughter’s lifeTennis player Radhika Yadav was shot dead by her own father over her independence, tennis academy, and appearance in a music video. pic.twitter.com/U4jQTB1h4z— Why Crime (@WhyNeews) July 12, 2025

Prakash Raj Counter To Pawan Kalyan On Hindi controversy5
ఛి…ఛీ.. అంటూ 'పవన్‌'పై ప్రకాష్ రాజ్ ఫైర్‌.. లక్షల్లో ట్వీట్లు

'మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ' అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. ఒకప్పుడు హిందీ గో బ్యాక్‌ అనే నినాదాన్ని ఇచ్చిన పవన్‌ ఇప్పుడు 'ఏ మేరా జహా' అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు. హిందీ అందరినీ ఏకం చేస్తుందంటూ పాఠాలు చెప్పాడు. ఆయన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ వర్గాల నుంచి మాత్రమే కాకుండా అందరి నుంచి తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పీకేను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలను సమర్ధించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కిందా మీదా అవుతోంది. #POLITICALJOKERPK అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. కేవలం కొన్ని గంటల్లోనే పవన్‌కు కౌంటర్‌గా పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి. తాజాగా ప్రముఖ సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌ కూడా స్పందించారు.గచ్చిబౌలి స్టేడియంలో ‘రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ మండిపడ్డారు. తన ఎక్స్‌ పేజీలో పవన్‌ చేసిన కామెంట్స్‌ను చేర్చి 'ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking' అంటూ ఆయన ఫైర్‌ అయ్యారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు కూడా చాలామంది సపోర్ట్‌గా ఆయన చేసిన పోస్ట్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో హిందీ బాషపై గతంలో పవన్ వేసిన ట్వీట్‌లు, మాట్లాడిన మాటలను వైరల్‌ చేస్తున్నారు. అప్పడేమో హిందీ గో బ్యాక్‌ అని పిలుపునిచ్చిన పవన్‌ ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?హిందీ మింగేసిన భాషలు ఎన్నో తెలుసా..?1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్‌ భయపడి నట్టే ఇప్పుడు జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్‌ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది. అందుకే హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ విశ్లేషకులు కోరుతున్నారు.ఈ range కి అమ్ముకోవడమా ….ఛి…ఛీ… #justasking https://t.co/Fv9iIU6PFj— Prakash Raj (@prakashraaj) July 11, 2025

Chirag Paswan gets a death threat through social media6
Bihar: ‘లేపేస్తామంటూ..’ చిరాగ్‌ పాశ్వాన్‌కు హెచ్చరిక?

పట్నా: బీహారీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ సన్నాహాల్లో మునిగితేలుతూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇంతలో బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)వెల్లడించింది.రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సంచలనంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రకారం ‘టైగర్ మెరాజ్ ఈడీసీ’ అనే యూజర్‌నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఎల్‌జేపీకి నాయకత్వం వహిస్తున్న పాశ్వాన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయనకు ఈ బెదిరింపు వచ్చింది. పాశ్వాన్‌కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ నేపధ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.‘ఈ హెచ్చరిక తీవ్రతను వెంటనే గ్రహించి, సత్వర చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతనికి కఠినమైన శిక్ష విధించండి’ అని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు వచ్చిందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా మీడియాకు తెలిపారు. పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. చట్టపరమైన చర్యలు చేపట్టామని ధరియా పేర్కొన్నారు. బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.

New World screwworm disease is an infestation cases in usa7
అమెరికాను హడలెత్తిస్తున్న ఈగ

న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌.. అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈగ. ముఖ్యంగా పాడి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ఈ ఎగిరే జీవుల సంతతిని నియంత్రించడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి స్టెరిలైజ్‌ చేసిన మగ ఈగలను వదలడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌ను సైన్స్‌ పరిభాషలో కొష్లియోమియా హొమినివోరక్స్‌ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు. అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపై ఆవాసం ఏర్పర్చుకుంటాయి. వాటి శరీరంపై గాయాలు చేసి, మాంసాన్ని భక్షిస్తాయి. దాంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతోపాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్‌ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్వా, హోండూరస్, గ్యాటెమాలా, ఎల్‌సాల్వెడార్‌ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటునుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు 35,000 న్యూవరల్డ్‌ స్క్రూవార్మ్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి మరెన్నో ఉన్నాయి. ఎలా నియంత్రిస్తారు? స్క్రూవార్మ్‌ ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. మగ ఈగలను సేకరించి, ప్రయోగశాలలో స్టెరిలైజ్‌ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దాంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే, అమెరికాలో స్టెరిలైజేషన్‌ కేంద్రం ప్రస్తుతం ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్‌ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ‘ఫ్లై ఫ్యాక్టరీ’ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్‌–మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్తమాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలు ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన ద్వారా లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మనుషులకు ముప్పు స్వల్పమే పూర్తిగా ఎదిగిన స్క్రూవార్మ్‌ పశువులపై గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇదే మొదటిసారి కాదు. 1960, 1970వ దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతికష్టంమీద, ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. స్క్రూవార్స్మ్‌ మృత పశువుల కంటే బతికి ఉన్న పశువులపై ఉండడానికే ఇష్టపడతాయి. ఇంట్లో పెంచుకొనే శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పమే. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

India Vs England 3rd Test Day 2 Match Highlights And Full Scorecard8
బుమ్రా కూల్చాడు... ఇక బ్యాటర్లే నిలబెట్టాలి

మూడో టెస్టు రెండో రోజు రసవత్తర ఆటకు తెరలేచింది. తొలిరోజంతా కష్టపడినా బుమ్రా ఒక వికెట్‌ మాత్రమే తీస్తే... రెండో రోజు తొలి సెషన్‌లోనూ వైవిధ్యమైన బంతులతో ఇంగ్లండ్‌ ప్రధాన బ్యాటింగ్‌ బలగాన్ని కూల్చేశాడు. అయితే భారత బ్యాటింగ్‌ మాత్రం తడబడింది. ఆరంభంలోనే విలువైన వికెట్లను కోల్పోయింది. మొదటి రోజు 4 వికెట్లు పడితే... రెండో రోజు ఆటలో 9 వికెట్లు కూలాయి. ఇరుజట్లు బ్యాటింగ్‌ కంటే కూడా బౌలింగ్‌తోనే సత్తా చాటుకున్నాయి. లండన్‌: భారత ప్రీమియర్‌ బౌలర్‌ బుమ్రా తానెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. తొలిరోజు శ్రమించినా దక్కని సాఫల్యం రెండో రోజు ఆరంభంలోనే సాధ్యమైంది. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్లను తొలి సెషన్‌ మొదలైన కొద్దిసేపటికే అవుట్‌ చేశాడు. భారత్‌ పట్టుబిగించేలా చేశాడు. నింపాదిగానే పరుగులు చేద్దామనుకున్న ఇంగ్లండ్‌ బ్యాటర్లపై నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్‌ భారీ స్కోరుకు బాట వేసినా... బుమ్రా బాధ్యతగా అడ్డుకట్ట వేశాడు. అయితే టీమిండియా ఇన్నింగ్సే సానుకూల దృక్పథంతో మొదలవలేదు.ఆతిథ్య బౌలర్లు కీలక వికెట్లను తీసి మ్యాచ్‌ను రసపట్టుగా మార్చేశారు. ముందుగా ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జో రూట్‌ (199 బంతుల్లో 104; 10 ఫోర్లు) ‘శత’క్కొట్టగా... వికెట్‌ కీపర్‌ జేమీ స్మిత్‌ (56 బంతుల్లో 51; 6 ఫోర్లు), బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌ (83 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత స్పీడ్‌స్టర్‌ బుమ్రా 5 వికెట్లు తీశాడు. సిరాజ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (113 బంతుల్లో 53 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (62 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. ఆర్చర్, వోక్స్, స్టోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇంగ్లండ్‌ స్కోరుకు ఇంకా 242 పరుగుల దూరంలో ఉంది. బుమ్రా పేస్‌... స్టోక్స్, రూట్‌ క్లీన్‌బౌల్డ్‌ రెండో రోజు ఆరంభాన్ని భారత పేస్‌ స్టార్‌ బుమ్రా దెబ్బతీశాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 251/4తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ కాసేపటికే కెప్టెన్‌ స్టోక్స్‌ (44) వికెట్‌ను కోల్పోయింది. సెంచరీ మురిపెం పూర్తవగానే రూట్‌ వికెట్‌ పడింది. ఈ ఇద్దరూ క్లీన్‌ బౌల్డయ్యారు. రూట్‌ అవుటైన మరుసటి బంతికే క్రిస్‌ వోక్స్‌ (0) డకౌట్‌ అయ్యాడు! ముగ్గుర్ని బుమ్రానే అవుట్‌ చేశాడు. బుమ్రా పేస్‌కు విలవిలలాడిన ఇంగ్లండ్‌కు స్మిత్‌ క్యాచ్‌ నేలపాలవడం వరమైంది. సిరాజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ చేజార్చినపుడు అతని స్కోరు 5 మాత్రమే.ఈ లైఫ్‌లైన్‌తో కార్స్‌తో కలిసి ఇంగ్లండ్‌ పోటీ స్కోరుకు స్మిత్‌ బాట వేశాడు. ముందుగా ఇద్దరు జట్టు స్కోరును 300 దాటించారు. తర్వాత క్రీజులో పాతుకుపోయి ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఫిఫ్టీ పూర్తయ్యాక మళ్లీ సిరాజ్‌కే అతని వికెట్‌ దక్కింది. బుమ్రా... ఆర్చర్‌ (4)ను ఎక్కువసేపు నిలువనీయలేదు. అయితే కార్స్‌ అడపాదడపా బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 387 వద్ద సిరాజ్‌ అతన్ని అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.యశస్వి, గిల్‌ విఫలం ఆరంభం నుంచే దూకుడుగా ఆడుదామనుకున్న యశస్వి జైస్వాల్‌ (13; 3 ఫోర్లు) జోరుకు ఆర్చర్‌ ఆదిలోనే అడ్డుకట్ట వేశాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌తోనే అంతర్జాతీయ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఆర్చర్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వికెట్‌తో సత్తా చాటుకున్నాడు. ఈ దశలో రాహుల్‌కు కరుణ్‌ నాయర్‌ జతయ్యాడు. ఇద్దరు ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్ని నింపాదిగా పరుగులు రాబట్టారు. ఈ జోడీ క్రీజులో పాగా వేస్తున్న సమయంలోనే నాయర్‌ వికెట్‌ తీసిన స్టోక్స్‌ రెండో వికెట్‌కు 61 పరుగులు భాగస్వామ్యానికి తెరదించాడు.తర్వాత ఈ సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (44 బంతుల్లో 16; 2 ఫోర్లు)ను వోక్స్‌ అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆనందాన్ని నింపాడు. ఇలా 107 పరుగులకే టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోంది. దీంతో రాహుల్‌ బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా... గాయంతో కీపింగ్‌ చేయలేకపోయినా రిషభ్‌ పంత్‌ (19 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) బ్యాటింగ్‌లో కుదురుగా ఆడాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) పంత్‌ (బి) నితీశ్‌ 18; డకెట్‌ (సి) పంత్‌ (బి) నితీశ్‌ 23; పోప్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) జడేజా 44; జో రూట్‌ (బి) బుమ్రా 104; బ్రూక్‌ (బి) బుమ్రా 11; స్టోక్స్‌ (బి) బుమ్రా 44; స్మిత్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) సిరాజ్‌ 51; వోక్స్‌ (సి) సబ్‌–జురేల్‌ (బి) బుమ్రా 0; కార్స్‌ (బి) సిరాజ్‌ 56; ఆర్చర్‌ (బి) బుమ్రా 4; బషీర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (112.3 ఓవర్లలో ఆలౌట్‌) 387.వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172, 5–260, 6–271, 7–271, 8–355, 9–370, 10–387.బౌలింగ్‌: బుమ్రా 27–5–74–5, ఆకాశ్‌దీప్‌ 23–3–92–0, సిరాజ్‌ 23.3–6–85–2; నితీశ్‌ కుమార్‌ 17–0–62–2, జడేజా 12–1–29–1, సుందర్‌ 10–1–21–0. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (బ్యాటింగ్‌) 53; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; గిల్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ (బ్యాటింగ్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (43 ఓవర్లలో 3 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107.బౌలింగ్‌: వోక్స్‌ 13–1–56–1, ఆర్చర్‌ 10–3–22–1, కార్స్‌ 8–1–27–0, స్టోక్స్‌ 6–2–16–1, బషీర్‌ 6–1–22–0. ⇒ 37 టెస్టుల్లో జో రూట్‌ సెంచరీల సంఖ్య. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్‌ ఐదో స్థానానికి చేరుకున్నాడు. సచిన్‌ టెండూల్కర్‌ (51), జాక్వస్‌ కలిస్‌ (45), రికీ పాంటింగ్‌ (41), కుమార సంగక్కర (38) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.⇒ 211 టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా జో రూట్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 210 క్యాచ్‌లతో రాహుల్‌ ద్రవిడ్‌ (భారత్‌) పేరిట ఉన్న రికార్డును రూట్‌ సవరించాడు.⇒ 11 భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా స్టీవ్‌ స్మిత్‌ (11) పేరిట ఉన్న రికార్డును జో రూట్‌ (11) సమం చేశాడు.⇒ 4 లార్డ్స్‌ మైదానంలో వరుసగా మూడు సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రూట్‌ గుర్తింపు పొందాడు. గతంలో మైకేల్‌ వాన్, జాక్‌ హాబ్స్, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఈ ఘనత సాధించారు.

Luxury Home Sales Down in Hyderabad9
హైదరాబాద్‌లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్‌ఈ, అసోచామ్‌ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్‌–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్‌ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్‌కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్‌.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్‌ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్‌లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్‌ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్‌ కుమార్‌ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్‌ బూమ్‌కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ మనీష్‌ సింఘాల్‌ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు.

Director Shankar finally breaks silence about his next Movie10
రూ.వెయ్యి కోట్లతో శంకర్‌ కొత్త సినిమా!

దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రెండు చిత్రాలు భారీ డిజాస్టర్లుగా ముగిశాయి. దీంతో ఈ చిత్రాల​​‍కు సంబంధం ఉన్న వారందరికీ భారీ నష్టాలు వచ్చాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు శంకర్ ఈ రెండు చిత్రాల ఫలితం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా మంది నెటిజన్లు కూడా ఈ వైఫల్యాలకు శంకర్‌ బాధ్యత వహించాలని భావించారు. కానీ, ఆయన ఎక్కడా కూడా ఇంతవరకు నోరెత్తలేదు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు వంటి ఇతర సినీ ప్రముఖులు పరోక్షంగా దర్శకుడు శంకర్‌ను తప్పుబట్టారు. పేలవమైన అవుట్‌పుట్‌తో పాటు శంకర్‌లో సరైన ప్లానింగ్‌ లేకపోవడం వల్ల ఎక్కువ నష్టపోయినట్లు చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో అతనిపై మరింత ట్రోలింగ్‌ పెరిగింది. అయితే, ఆయన తాజాగా మరో సినిమా గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.శంకర్ తన తదుపరి చిత్రం తమిళ ఎపిక్‌ నవల ‘వెల్పరి’ ఆధారంగా తెరకెక్కిస్తానని చెప్పారు. అయితే, వరుసగా రెండు భారీ చిత్రాలతో ఆర్థిక నష్టాలను మిగిల్చిన ఆయనతో మరో సినిమా చేసేందుకు ఎవరు ముందుకొస్తారని అందరూ ఆలోచించారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో 'వెల్పరి' సినిమా గురించి శంకర్‌ మాట్లాడారు. కొద్దిసేపటికే అవి ట్రోల్‌ కావడం జరిగింది. శంకర్‌ మాట్లాడుతూ.. ' రోబో సినిమా నా మునుపటి కలల ప్రాజెక్ట్. ఇప్పుడు, 'వెల్పరి' కూడా నా కలల చిత్రం. హాలీవుడ్‌ చిత్రాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవతార్ వంటి కొత్త టెక్నాలజీలను భారతీయ సినిమాలకు పరిచయం చేసే అవకాశం దీనికి ఉంది. 'వెల్పరి' ప్రాజెక్ట్‌ తమిళ సినిమాతో పాటు భారతీయ సినిమాకు గర్వకారణంగా మారే అవకాశం ఉంది. ఇది ప్రపంచ గుర్తింపును పొందగలదు. నా కల నిజమవుతుందని ఆశిస్తున్నాను.' అని ఆయన అన్నారు.(ఇదీ చదవండి: ఛి…ఛీ.. అంటూ 'పవన్‌'పై ప్రకాష్ రాజ్ ఫైర్‌.. లక్షల్లో ట్వీట్లు)అయితే, శంకర్‌ మాటలపై ట్రోల్స్‌ కూడా వస్తున్నాయి. ఒకప్పుడు దూరదృష్టి గల దర్శకుడిగా ఉన్నప్పటికీ, శంకర్ ఇప్పుడు వాస్తవికతకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడని చెబుతున్నారు. ఇండియన్‌2, గేమ్‌ ఛేంజర్‌ సినిమాలను చూస్తే గతంలో అనేక ఐకానిక్‌ చిత్రాలను అందించిన దర్శకుడు ఇతనేనా అనే సందేహం వస్తుంది. కోట్ల నష్టాలను మిగిల్చిన ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తారా..? హీరోలు శంకర్‌కు ఛాన్స్‌లు ఇస్తారా..? అనే కామెంట్లు చేస్తున్నారు. శంకర్ ఇకనుంచైనా పాటల కోసం అధికంగా ఖర్చు చేయడం మానేసి.. కథ, స్క్రీన్‌ప్లేపై ఎక్కువ దృష్టి పెట్టాలని చాలామంది సూచిస్తున్నారు. గేమ్ ఛేంజర్ , ఇండియన్ 2 సినిమాల వల్ల కమల్ హాసన్‌తో పాటు రామ్ చరణ్ వంటి స్టార్ల ఖ్యాతి కూడా తీవ్రంగా దెబ్బతింది. అలాంటప్పుడు భారీ ఖర్చుతో కూడిన వల్పరి వంటి ప్రాజెక్ట్‌కు ఖచ్చితంగా ఒక స్టార్ హీరో అవసరం. కానీ శంకర్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే, ఏ అగ్ర నటుడు అతనితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడో లేదో చూడాలి.హీరో, నిర్మాతలు 'వెల్పరి' సినిమా కోసం కన్నడ స్టార్‌ యశ్‌ను శంకర్‌ సంప్రదించారని తెలుస్తోంది. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం ఉంటుందని టాక్‌ వైరల్‌ అవుతుంది. అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, పెన్‌ మీడియా సంస్థలు కలిసి నిర్మించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సు.వెంకటేశన్‌ రాసిన 'వెల్పరి' నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. అత్యంత ప్రజాదరణ పొందిన నవలగా గుర్తింపు పొందింది. అందుకే శంకర్‌ ఈ చిత్రంపై ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement