ప్రధాన వార్తలు

తప్పుడు కేసులకు భయపడం మేమెప్పుడూ ప్రజాపక్షం
ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు ఎలాగూ చేయడని తెలిసే ఆయన్ను ఎవ్వరూ కలవడం లేదు. మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే అని మా తలుపులు తడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ప్రజలు వాళ్లకు జరిగిన అన్యాయాలు, సమస్యల గురించి చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిచంద్రబాబూ.. మాపై నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. నువ్వు పెట్టే తప్పుడు కేసులకు నీతోపాటు నీకు పావులుగా మారిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తూ వేసిన విత్తనమే రేపు విష వృక్షమవుతుంది. రేపు మేం అధికారంలోకి వచ్చాక మీతోపాటు టీడీపీ నేతల పరిస్థితి ఏమిటి? ఈ రోజు దెబ్బతిన్న వారు రేపు ఊర్కోరు కదా.. నేను చెప్పినా సరే మావాళ్లు వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలిన వాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంగా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలను సమీకరించడం.. ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం.. ప్రజలకు తోడుగా నిలబడి వారి పక్షాన పోరాటం చేయడం ప్రతిపక్షం ధర్మం. విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్షంగా మా ధర్మాన్ని మేం నిర్వర్తిస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చి న 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను అడ్డగోలుగా మోసం చేసి పరిపాలన సాగిస్తున్నారని ఎత్తి చూపారు. ‘చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది.. ఏ సమస్య వచ్చి నా చంద్రబాబు పరిష్కరించండని, ఆయన్ను కలిసినా వృథాయేనని ప్రజలకు బాగా అర్థమైంది. గట్టిగా మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ఓడిపోతాడు. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని ప్రజలు మా తలుపులు తడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలు, సమస్యల గురించి ప్రజలు మాకు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు ఫిర్యాదులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలతో వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని పద్ధతి మార్చుకోకపోతే, రేపు తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే మూడేళ్లు ఉంటుంది.నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు.. ఇద్దరికీ వార్నింగ్ ఇస్తున్నా.. వడ్డీతో మీరంతా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో పరిస్థితిపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని కడిగి పారేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ » చంద్రబాబు చేసే ప్రతిపని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనతో చేస్తున్నారు. నా పర్యటనల తర్వాత చంద్రబాబు దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. » మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో క్వింటా మిర్చి ధర రూ.21వేలు–రూ.27 వేలు పలికితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది రూ.8–11వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతు ఇస్తూ మిర్చి యార్డుకు వెళ్లింది జగనే. అది తప్పా? అలా వెళ్లినందుకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాకు సెక్యూరిటీని విత్‌డ్రా చేశాడు. ఆయనకు మూడ్ వచ్చి నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు సహకరించకపోగా, మాపైనే కేసు పెట్టారు. » ఏప్రిల్ 8న శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల చేతిలో హత్యకు గురైన మా పార్టీ బీసీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. హెలిప్యాడ్ దగ్గర సరైన భ్రదత లేదు. జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. తిరిగి మాపైనే తప్పుడు ప్రచారం చేశారు. పైలట్ల పైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యాటన తర్వాత మా పార్టీ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాశ్‌పై కూడా కేసు పెట్టారు. ఇది ధర్మమేనా? » జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలిలో ధరలేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్లాను. 40–50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చారు. అదే సమయంలో చంద్రబాబు ఓ 40 మందితో 200 మంది పోలీసుల సెక్యూరిటీ ఇచ్చి రాళ్లు వేయించి, టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడికీ రైతులు చాలా సమ్యమనంతో వ్యవహరించారు. 50 వేల మంది.. చంద్రబాబు పంపిన 40 మందిపై పడి ఉంటే బతికేవాళ్లా? అయినా ఆ తర్వాత మూడు కేసులు పెట్టి, 15 మంది రైతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మేము రైతులకు అండగా నిలబడితే చంద్రబాబుకు వచ్చి న నష్టమేంటి? ఇదీ చంద్రబాబు శాడిజం! » గత ఏడాది పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లాను. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నా కార్యక్రమాలకు ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకోవడం.. నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం.. ఇళ్లల్లోనే నిర్బంధించేలా చెక్‌పోస్టులు పెట్టడం.. లాఠీచార్జీలు చేయించడమే చంద్రబాబు పని. అక్కడ పోలీసులు నాకు భ్రదత కల్పించడానికి లేరు.. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా చూసుకోవడానికి నిలబడ్డారు. మాపై ఐదు కేసులు పెట్టారు. చంద్రబాబు కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. పొలిటికల్ గవర్నెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరుతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రంలో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న పార్టీ కూడా వైఎస్సార్‌సీపీనే. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్సార్‌సీపీనే స్పందిస్తోంది. ప్రతిపక్షంగా మేము ఏడాదిగా అదే చేస్తున్నాం. -వైఎస్ జగన్ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అయిన బీసీ మహిళ హారికకు ఆత్మగౌరవం లేదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. చేతిలో అధికారం ఉంది కదా అని చంద్రబాబు శాడిజం ప్రదర్శిస్తున్నారు. ఇంతటి హేయమైన దాడి చేసి, సిగ్గులేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను పట్టుకుని మహానటి అని టీడీపీ వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మీరు తప్పు చేసి, కారు అద్దాలు పగలగొట్టి.. తిరిగి ఆమెను మహానటి అంటారా? (దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ప్రదర్శిస్తూ). ఎవరు మహా నటులు? దాన వీర శూర కర్ణ కంటే గొప్పగా యాక్టింగ్ చేస్తున్న చంద్రబాబు కాదా! చంద్రబాబు లైవ్ యాక్టింగ్ చూసి ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోవాలి. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను దారుణంగా కొట్టారు. - వైఎస్ జగన్ విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యం» చంద్రబాబు ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ, రైతులకు గిట్టుబాటు ధరరాని దుస్థితిని లేవనెత్తుతూ, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరిస్థితుల్లో ప్రశ్నిస్తూ, సమయానికి ఇచ్చి న ఇన్‌పుట్ సబ్సిడీని నీరుగార్చిన విధానాన్ని ఎండగడుతూ గత ఏడాది డిసెంబర్ 13న అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలిచింది. » డిసెంబర్ 24న కరెంట్ చార్జీల బాదుడుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. ఎన్నికలప్పుడు చార్జీలు తగ్గిస్తానన్న పెద్దమనిషి తగ్గించకపోగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది తిరగక మునుపే రూ.15 వేల కోట్లు బాదడాన్ని నిరసిస్తూ పోరుబాట నిర్వహించాం. » పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం ఆడుతూ వారికి ఇవ్వాల్సిన విద్యా, వసతి దీవెన బకాయిలు ఇవ్వకపోగా, చివరికి పిల్లల చదువులు ఆపేసి పనులకు వెళ్తున్న పరిస్థితుల మధ్య వారికి తోడుగా నిలబడుతూ మార్చి 12న యువత పోరు చేపట్టాం. నిరుద్యోగ భృతి సంగతి ఏమిటని.. గత ఏడాదికి సంబంధించి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.36 వేలు ఎగ్గొట్టిన తీరుపై యువతకు తోడుగా పోరాటం చేశాం. » జూన్ 4న చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్, సెవన్ హామీలను ఎత్తి చూపించాం. ఏడాదిగా ప్రజలకు చంద్రబాబు ఇవ్వాల్సిన బాకీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల సంగతి ఏమిటని నిలదీస్తూ వెన్నుపోటు దినం చేశాం. » ఇప్పుడు బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తి చూపిస్తున్నాం. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ.. చంద్రబాబు ఇచ్చిన బాండ్ల గురించి ప్రజలకు తెలియజేస్తూ.. ఆ బాండ్లను టీడీపీ నాయకులకు చూపిస్తూ ఏడాదిలో ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని లెక్కించి చంద్రబాబును అడిగేట్టుగా జూన్ 25న కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో జోరుగా సాగుతోంది. » జూలై 21 నుంచి గ్రామ స్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు గతంలో అన్న మాటలు.. గతంలో ఇచ్చిన బాండ్లు.. మేనిఫెస్టో .. చంద్రబాబు చేస్తున్న మోసం.. ఏడాదిగా ఎంత బాకీ ఉన్నాడు.. అన్ని వివరాలు ఒక్కచోటే తెలుస్తాయి. తద్వారా గ్రామ స్థాయిలో చంద్రబాబును నిలదీసేట్టుగా చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. మేము చేసే ప్రతి పనిలో విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయించడమే మా బాధ్యత. మాట వినకుంటే వేధింపులే » మా ప్రభుత్వ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరుతో తలెత్తుకుని సేవలందించారు. మా సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది. స్పందన కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమస్యల కంటే పోలీసులు, కలెక్టర్లు టీడీపీ వారి సమస్యలనే ఎక్కువగా పరిష్కరించే వారు. వివక్ష చూపించకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసింగ్ అనేది పరిష్కరించడంలో ముందుండేది. ఈ రోజు అలాంటి అధికారులు చంద్రబాబు మాట వినకుంటే.. వాళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. » డీజీ స్థాయి అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులను సైతం వేధింపులకు గురి చేశారు. చంద్రబాబు మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్, అడిషనల్ డీజీ సంజయ్‌లను దళిత ఆఫీసర్లు అని కూడా చూడలేదు. బీసీ ఆఫీసర్ ఐజీ కాంతిరాణా టాటాను, ఎస్సీ అధికారి, డీఐజీ విశాల్ గున్నీపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణల పేరుతో వేధిస్తున్నారు. » నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయిస్తున్నారు. ఎనిమిది మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. 80–100 మంది ఇన్‌స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్‌లో ఉన్నారు. చంద్రబాబు మాట విననివారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తుందో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. డీఐజీ ఓ మాఫియా డాన్ » చంద్రబాబు తన మోచేతి నీళ్లు తాగే అధికారులను పెట్టుకుని, వాళ్లను అవినీతిలో భాగస్వాములను చేసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే.. డీఐజీ అనే వ్యక్తి ఓ మాఫియా డాన్. ఆ జోన్‌లో ఆయన కింద సీఐలు, ఓ డీఎస్పీ ఉంటారు. అదే ఆయన ఆర్మీ. సదరు నియోజకవర్గంలో ఇసుక, మద్యం, బెల్టుషాపుల అనుమతులు, పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లు, పేకాట క్లబ్బులు నడిపే విషయంలో డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేయడమే పని. » ఇక్కడ పోలీసులు వసూలు చేసి రివర్స్‌లో ఎమ్మెల్యేలకు ఇవ్వడం విచిత్రం. సగం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మిగిలిన సగ భాగం పైన ఉన్న పెద్దబాబు, చిన్నబాబుకు తీసుకెళ్తున్నారు. ఇలా వసూళ్ల దందాను డీఐజీలతో నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసి భరించలేక కొంత మంది ఐపీఎస్ అధికారులు.. సిద్ధార్థ కౌశల్ యంగ్‌స్టర్ రాజీనామా చేసి వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఢిల్లీకి పోవడానికి చంద్రబాబు రిలీవ్ చేయడు.. ఇక్కడే ఉండి వేధింపులు ఎందుకని రాజీనామాలు చేస్తున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీకి మౌలిక హక్కులు తెలియవా? » చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీలో రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో తెలీదా? ఈ పెద్ద మనిషి ఇన్నాళ్లు రాజకీయాలు ఎలా చేశాడు? మీటింగులు పెట్టుకోవడం, ప్రజల దగ్గరకు వెళ్లడం.. వాళ్లను చైతన్య వంతులు చేయడం.. ఇవన్నీ రాజకీయ పార్టీల హక్కులు కావా? ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, నష్టం జరిగినా, ప్రభుత్వం మోసం చేసినా, ఆ ప్రభుత్వాన్నిప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటన కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. » గుడివాడలో అక్కడి స్థానిక (గుడ్లవల్లేరు) జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బీసీ మహిళ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? దుర్భాషలాడుతూ.. నోటికొచ్చి నట్టు ఎందుకు తిట్టారు? చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే తప్పేముంది? కారులో వెళ్తుంటే దారి మధ్యలో అడ్డగించారు. సాయంత్రం 5 గంటలకు దాడి మొదలైంది. 6.30 గంటల వరకు హారికను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ.. కొడుతూ.. కారు అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతున్నా, వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. » ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసినట్టు స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుంటే ఎంత మందిపై కేసులు పెట్టారు? ఎంత మందిని అరెస్టు చేశారు? పై నుంచి ఫోన్లు చేసి దాడికి పంపించారు. 8న పేర్ని నాని ఓ డైలాగ్ గురించి మాట్లాడితే.. 11న మూడు రోజుల తర్వాత గుడివాడ ప్రోగ్రాంకు వెళ్తుంటే పథకం పన్ని, దారికాచి దాడి చేశారు. కళ్లముందు కనిపిస్తున్న ఈ వీడియోను పక్కనపెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన తన కారుతో గుద్దారని కేసు. హారిక, రాము ముందర సీటులో కాదు.. వెనుక సీటులో కూర్చున్నారు. హారిక జెడ్పీ చైర్‌పర్సన్.. అది ప్రభుత్వ కారు. డ్రైవర్‌ను ప్రభుత్వం ఇచ్చి ంది. ఒక బీసీ మహిళకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాతారు? సిగ్గుండాలి. ఎక్కడైనా దూకిచావాలి వీళ్లంతా? » మరుసటి రోజు పేర్నినాని, కైలే అనిల్ కుమార్.. పెడనలో సభ పెట్టిన వారందరిపై మరో కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు చేసిన మోసాలను క్యాడర్ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ .. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కనపెడితే పోలీసుల సమక్షంలోనే చేస్తున్న దాడులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు దగ్గరుండి పోలీసులే బాధితులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా? » సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపారు. నీకు అ డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డుకు చెప్పి వాటిని తీసేయించొచ్చు కదా? నిజానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు ఇంకా దారుణంగా ఉంటాయి. సినిమాల్లో డైలాగులు, మంచి పాటలు సహజంగానే పాపులర్ అవుతాయి. మంచి పాట పాడితే తప్పు అంటావ్.. మంచి డైలాగు పోస్టర్లు పెట్టినా, మాట్లాడినా తప్పంటావ్.. సినిమా వాళ్లు చేసే హావభావాలు చేస్తే తప్పంటావ్.. బయట ఎవరైనా సరే.. ఇలా అన్నా తప్పే.. అలా అన్నా తప్పే.. అంటే ఎలా? అలాంటప్పుడు సినిమాలను ఆపేయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? ఆలోచన చేసుకోవాలి. » ఎవరో ఏదో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన, పోస్టర్లు ప్రదర్శించిన మాత్రాన మీకొచ్చే నష్టమేమిటి? గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం అన్నట్టుగా ఉంది వీళ్ల తీరు.. 131 మందికి నోటీసులు ఇచ్చారు. సినిమా డైలాగులు పోస్టర్లు పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్‌కు పంపించారు. చంద్రబాబు పేరు ఎవరు చెబితే వాళ్లను పిలిపించుకోవడం.. రోజంతా కూర్చోబెట్టుకోవడం.. వేధించడం చేస్తున్నారు. చార్జిషీట్లు చూస్తే ‘అండ్ అదర్స్’ అని ఖాళీగా పెట్టి.. వాళ్లు టార్గెట్ చేసిన వాళ్లను ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో చేరుస్తున్నారు. » స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ‘అండ్ అదర్స్’లో అందర్నీ చేర్చి ఎత్తి లోపలేయడం.. ఎందుకింత కుట్రలో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకొనేలా పాలన చేయాలి. అదీ సత్తా. అంతే కానీ ఓ పక్క అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాడు ఇట్టా అన్నాడు.. అట్టా అన్నాడంటూ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం? పోలీసుల దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కొడుకును కోల్పోయిన ఆ పెద్దాయనను పరామర్శించేందుకు నేను వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి మా పార్టీకి చెందిన సర్పంచ్. పోలీసుల వేధింపులు వల్ల ఆయన చనిపోతే బెట్టింగ్ వలన చనిపోయాడంటూ దొంగ కేసులు పెట్టడం దుర్మార్గం.రైతులు రౌడీషీటర్లా? » మరొక వైపు ధరల్లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే.. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో ఇదే తోతాపురి మామిడి ధర కిలో రూ.25–29 ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.2–3కు పడిపోయింది. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ, 3వ వారమైనా తెరవలేదు. ఫ్యాక్టరీలు నెల ఆలస్యంగా తెరవడం, ఒకేసారి పంట మార్కెట్‌కు రావడం, సప్లయి ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. ఇది మానవ తప్పిదం కాదా? » చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలు.. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వంటి వాటికి మేలు చేసేందుకే ఇదంతా చేశారు. మీరు ప్రకటించిన ధర ప్రకారం ఎంత మంది రైతులకు కిలోకు రూ.12 వచ్చి ంది. ఇది కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని ధర. పొరుగునున్న కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాస్తే కిలో రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తోంది. నువ్వు మాత్రం ఇక్కడ కిలో రూ.12కు కొనిపిస్తానని చెబుతున్నావు. » 2.20 లక్షల ఎకరాల్లో 6.50 లక్షల టన్నుల పంట అమ్ముకునే దారి లేక 76 వేల రైతు కుటుంబాలు చంద్రబాబు పుణ్యమా అని అల్లాడిపోతున్నాయి. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను అక్కడకు వెళ్తే.. తప్పా? నేను వెళ్లడం ఏమైనా నేరమా? బంగారుపాళ్యం పర్యటనలో రైతులు పాలుపంచుకోవడం తప్పా? ఈ పర్యటనలో వందల మందిని నిర్బంధించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 2 వేల మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. » ముగ్గురు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 2 వేల మంది పోలీసులు, ప్రతి గ్రామానికి, ప్రతి సందుకు చెక్ పోస్టులు పెట్టారు. వీళ్లంతా నాకు సెక్యురిటీ కోసం కాదు.. నా కార్యక్రమానికి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. బైకులకు పెట్రోల్ పోయకూడదని చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయినా సరే కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం, దేశం దృష్టికి సమస్య వెళ్లాలని మామిడి కాయలను రోడ్లపై పారబోసి నాతో కలిసి వచ్చారు. ఈ పర్యటనపై ఐదు కేసులు పెట్టారు. 20 మందిని అరెస్ట్ చేశారు.ఈనాడు.. అదీ ఒక పేపరేనా? » రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన కార్యక్రమం అది. ఇదేదో నేరమన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈనాడు.. అదీ ఒక పేపరేనా? ఈనాడు పేపరు చూస్తుంటే ‘టాయిలెట్ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ’ అన్నట్టుగా ఉంది. ఏమిటా రాతలు? ఓ పక్క ధర లేక రైతులు రోడ్డు మీదకు వస్తుంటే రైతులందరూ బ్రహ్మాండంగా కేరింతలు కొడుతున్నారని రాస్తున్నారు. » మామిడి పండ్లను రోడ్లపై వేసినందుకు వాళ్లపై కేసులు పెట్టారు. తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు. రోడ్డెక్కి నిలదీయకూడదన్నట్టుగా ఉంది చంద్రబాబు పాలన తీరు. ఎన్నికల్లో ఇచ్చి న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌తో సహా 143 హామీలన్నీ నెరవేర్చేశామని ప్రజలంతా భావించాలట! వారంతా ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టుగా భావించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. కాదు.. కుదరదు అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం. పాలకుడని చెప్పుకునేందుకు చంద్రబాబుకు, మీడియా అని చెప్పుకునేందుకు ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. ఇది పైశాకత్వం కాదా?» రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పాలంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి తాను వెళ్లలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆయన ఎప్పుడు అక్కడకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఐ ఏకంగా గన్ చూపిస్తున్నాడు. (వీడియో చూపిస్తూ).. అసలు బీహార్‌లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలు, పచ్చ శాడిస్ట్‌లు పోలీసుల సమక్షంలోనే ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేసిన ఘటన చేశాం. » ప్రసన్న నిజంగా ఇంట్లో ఉండి ఉంటే చంపేసి ఉండేవారు. (పోలీస్ సైరన్ మోగుతూ వాహనం ఇంటి బయటే ఉండగానే ఇంట్లోకి చొరబడుతున్న ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ). అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఇంట్లో ఉండి ఉంటే మనిషే లేకుండా చేసే వారు. దాడి చేయించిన, ధ్వంసం చేయించిన ఎమ్మెల్యేపై కానీ, వాళ్ల మనుషులపై కానీ ఎలాంటి చర్యలు.. కేసులుండవు. ఎలాంటి అరెస్ట్‌లు చేయరు. తిరిగి ప్రసన్నపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఇక ఎవరికి రక్షణ ఉన్నట్టు? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కుట్రలతో రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చి , దాన్ని కొనసాగిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా » ఒక కేతిరెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్‌లే కాదు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళితో సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వీరితో పాటు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి వంటి జీవితంలో మచ్చలేని రిటైర్డ్ అధికారులపై.. ఇలా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా. తమకు కావాల్సినట్టుగా వాంగ్మూలాలు తీసుకోవడం, వాటి ఆధారంగా ఇష్టమొచ్చి నట్టు అరెస్టులు చేయడం. » ఇదే మోడస్ ఆపరండాతో దేశంలో ఎవరినైనా, ఎక్కడైనా.. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు చూపిస్తున్నాడు. ప్రధాని మోదీ, అమిత్‌షాలను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎలాంటి మినహాయింపు లేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడైన నాతో పాటు మా పార్టీకి చెందిన గ్రామ, రాష్ట్ర స్థాయి నాయకులు, చివరికి సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా ఇదే మోడస్ ఆపరండాతో తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారు. » ఇదే సంప్రదాయాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగిస్తే.. దెబ్బలు తిన్న వీళ్లు ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నా. మీరు ప్రారంభించిన ఈ తప్పుడు సంప్రదాయం విష వృక్షంగా మారుతుంది. ఎల్లకాలం రోజులన్నీ ఒకేలా ఉండవు. అధికారం ఎవరి చేతుల్లోనూ శాశ్వతంగా ఉండదు. ఈరోజు పైన మీరు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత మేము పైకి వస్తాం. మీరు కిందకు వస్తారు. అప్పుడు పరిస్థితి ఏమిటి? తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఆ ముచ్చటే లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘బనకచర్ల ప్రాజెక్టును కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తే కదా.. మేము ఆపమంటూ అభ్యంతరం తెలిపేది..’ అని సీఎం అన్నారు. అయినా బనకచర్లపై ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు తెలియజేసిందని, ఆ ప్రాజెక్టుపై పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అభ్యంతరాలు తెలిపాయని చెప్పారు.ఇది కేవలం అనధికార (ఇన్‌ఫార్మల్) భేటీ మాత్రమే అన్న రేవంత్‌రెడ్డి.. ఇద్దరు సీఎంలతో ఈ భేటీని నిర్వహించేలా చేయడం, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసేలా చేయడం.. తెలంగాణ సాధించిన విజయంగా అభివర్ణించారు. ముఖ్యమంత్రుల సమావేశం పూర్తిగా ఇన్‌ఫార్మల్‌గానే సాగిందని, కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, కేవలం ఒక వేదికను ఏర్పాటు చేసి మధ్యవర్తిలా మాత్రమే వ్యవహరించిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు, నీటిపారుదల శాఖల మంత్రులు, అధికారుల సమావేశం అనంతరం..రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు ‘జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. కేవలం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగిన ఒక అనధికార సమావేశం. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. పార్లమెంటులో చేసిన రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాల అమలు నిబద్ధతకే దిక్కు లేదు. ఏ విషయంలోనైనా నమ్మకంతో ముందుకు పోవాలి తప్ప, అనుమానించుకుంటూ పోతే ఏ సమస్యలూ పరిష్కారం కావు..’ అని ముఖ్యమంత్రి (విలేకరుల ప్రశ్నకు జవాబు) అన్నారు. యుద్ధ ప్రాతిపదికన టెలీమెట్రీ ‘కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాలకూ అనుమానాలున్నాయి. అందుకే టెలీమెట్రీ పరికరాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఎవరెన్ని నీళ్లు వాడుతున్నారోనన్న రాష్ట్రాల సందేహాలకు ఇది శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి అవసరమైతే తెలంగాణ నిధులతోనే యుద్ధ ప్రాతిపదికన అన్ని పాయింట్లలో టెలీమెట్రీ ఏర్పాటు చేస్తాం. గోదావరి బోర్డు హైదరాబాద్‌లో, కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. శ్రీశైలం డ్యాం మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు ఏపీ అంగీకరించింది. ఈ నాలుగు అంశాలపైనే ఈసారి చర్చ సాగింది. టెలీమెట్రీ ఏర్పాటుతో పాటు శ్రీశైలం డ్యాం మరమ్మతులకు ఏపీని ఒప్పించడం కూడా రాష్ట్రం సాధించిన విజయమే. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు. కమిటీ ఏర్పాటు అయిన 30 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ రాష్ట్ర హక్కులు ఏపీకి ధారాదత్తం చేశారు ‘గత సీఎం కేసీఆర్ తెలంగాణ హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయలేకపోయారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం సాధించారు? కనీసం బోర్డుల కార్యాలయాలు ఎక్కడ ఉండాలో కూడా నిర్ణయించలేకపోయారు. కానీ మేము సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. మా హయాంలో పలు అంశాలు చర్చల స్థాయికి రావడం, నాలుగు అంశాలపై స్పష్టమైన నిర్ణయాలు రావడం తెలంగాణ సాధించిన విజయం. కానీ కొందరు అధికారం కోల్పోయిన బాధతో ఈ చర్చలు సఫలమవ్వకూడదని చూస్తున్నారు..’ అని సీఎం విమర్శించారు. ఈ సమావేశంలో కేంద్రం కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించిందని, జలశక్తి మంత్రి ఈ విషయంలో ఎవరి పక్షాన నిలబడకుండా ఒక న్యాయమూర్తిలా వ్యవహరించారని కితాబు ఇచ్చారు. సమావేశం ఫలప్రదం: ఏపీ మంత్రి నిమ్మల కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఫలప్రదమైనట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. భేటీ స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందని అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపారు.

13 నెలల్లోనే రూ.1.75 లక్షల కోట్ల అప్పా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని మా మీద బండలు వేశారు. మా ప్రభుత్వం ఐదేళ్లలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ.. నాడు–నేడు కింద రూపు రేఖలు మార్చేలా పాఠశాలలను అభివృద్ధి చేస్తూ.. కొత్తగా మూడు పోర్టులు నిర్మిస్తూ.. గొప్పగా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేస్తూనే మేము చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 13–14 నెలల కాలంలోనే చేసిన అప్పులు రూ.1,75,112 కోట్లు. అంటే మా ఐదేళ్లలో మేము చేసిన అప్పుల్లో 52.43 శాతం తొలి ఏడాదిలోనే చంద్రబాబు చేసేశాడు. ఏ ఒక్కరికీ ఒక్క స్కీమ్ ఇచ్చింది లేదు.. ఒక్క హామీ అమలు చేసిందీ లేదు. మరి ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ఎన్ని తప్పులు చేసినా, ఎవరూ ప్రశ్నించకూడదట.. ఎందుకిలా చేశారని అడగరాదట.. అలా ఎవరైనా అడిగితే వారిపై కక్షగట్టి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు’ అని మండిపడ్డారు. ‘కరెంట్ చార్జీలు తగ్గించడం మాట దేవుడెరుగు.. ఇష్టమొచ్చినట్టు పెంచేశారు. విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసినప్పుడు రూ.15 వేల కోట్లు ఉండగా, ఈరోజుకు అది రూ.18,272.05 కోట్లకు ఎగబాకింది. ఫ్యూయిల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ ఎడ్జెస్ట్‌మెంట్ కింద ఆయన బాదుడే బాదుడు. అయినా ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడితే గొంతు నొక్కడమే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అమరావతిలో ఏమైనా బంగారంతో కడుతున్నారా? అమాంతం కాంట్రాక్టు రేట్లు పెంచేసి, రాజధాని ప్రాంతంలో చదరపు అడుగుæ రూ.9 వేలు, రూ.10 వేలు పెట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. ఏమైనా బంగారంతో కడుతున్నారేమో అర్థం కావడం లేదు. ఇంతకు ముందు లేనిది మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం. 10 శాతం ఇవ్వడం.. 8 శాతం నొక్కడం. నాణ్యత లేని పనులు జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు. లూలూ, ఉర్సా లాంటి సంస్థలకు రూపాయికే కారుచౌకగా భూములు ఇస్తున్నా ఎవరూ మాట్లాడ కూడదు. మేము యూనిట్ రూ.2.49 చొప్పున గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ పీపీఏలు చేస్తే నానా యాగీ చేసిన వీళ్లు నేడు రూ.4.60తో పీపీఏలు చేసుకుంటున్నా ఎవరూ మాట్లాడ కూడదు. ప్రశ్నించకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకూడదు. ప్రశ్నించకూడదు.పరిశ్రమలను వెళ్లగొట్టడమే లక్ష్యం కరేడు రైతుల విషయంలో కూడా అంతే. గతంలో ఇండోసోల్ సంస్థ డబ్బు రూ.500 కోట్లతో చేవూరు, రేవూరు గ్రామాల్లో 5 వేల ఎకరాలు భూ సేకరణ పూర్తి చేసి ఆ కంపెనీకి అప్పగించాం. అందులో 114 ఎకరాల్లో రూ.1,200 కోట్లతో వన్ గిగా బైట్‌కు సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడ రైతులు సంతోషంగా ఉన్నారు. 8 వేల ఉద్యోగాలు వస్తున్నాయి. అక్కడ సంతోషంగా జరుగుతున్న దాన్ని.. ఆ సంస్థకు పొగపెట్టి వెళ్లిపోమన్నట్టుగా వాళ్ల కోసం సేకరించిన భూములను వాళ్లకు ఇవ్వకుండా కరేడు ప్రాంతానికి వెళ్లమన్నారు. ఎక్కడైతే రెండు పంటలు పండే భూములున్నాయో.. ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తున్నారో అక్కడ భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. అక్కడ భూములు అడగడం ధర్మం కాదు. ఇలాంటప్పుడు ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా.. పొగబెట్టి వెళ్లిపొమ్మనడమే కదా? 42 వేల కోట్ల పెట్టుబడులు, 8 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకుండా చేçస్తున్నారు. ప్రాజెక్టులు రావాలని చూస్తున్నారా? రాకూడదని చూస్తున్నారా? ఇదే బీపీసీఎల్‌కు భూమి ఇవ్వాలనుకుంటే వేరే ల్యాండ్ లేదా? గవర్నమెంట్ ల్యాండ్ అదే జిల్లాలోనూ, పక్క జిల్లాలోనూ ఉంది. ఇదే కృష్ణపట్నంలోనే ఈనాడు రామోజీరావుకు సమీప బంధువుకు 10 వేల ఎకరాల భూములున్నాయి. ఇవ్వొచ్చు కదా.. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వానికి వేల ఎకరాలున్నాయి. అక్కడ ఇవ్వొచ్చు కదా.. అక్కడ బీపీసీఎల్‌కు భూమి ఇవ్వకుండా వాళ్లను తీసుకొచ్చి, ఇండోసోల్‌కు సేకరించిన భూములను కేటాయించడం, ఇండోసోల్‌ను వివాదాస్పదమైన చోటుకు పంపాలనుకోవడం ఎంతవరకు సమంజసం? జూలై 13న ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ఇచ్చి దాని ప్రకారం 20 వేల ఎకరాలు ఈ రెండేళ్లలో ఏపీఐఐసీ ద్వారా కానీ, మారిటైమ్ బోర్డు ద్వారా సేకరించాలని జీవో ఇచ్చారు. అందుకోసం ఐదుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నారంటే.. సింగరాయకొండ నుంచి కావలి వరకు హైవే పక్కన 30 కి.మీ పొడవునా సముద్ర తీరంలో భూములన్నీ కబళించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రను త్వరలోనే బయట పెడతాం. బ్లాక్ మెయిల్ చేసి సొమ్ములు చేసుకోవడమేచంద్రబాబుకు పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి లేదు. పారిశ్రామికవేత్తలను బెదిరించి సొమ్ము చేసుకునేందుకే ఈ మనిషి ఉన్నాడు. ఈయన పుణ్యమా అని కుమార మంగళం బిర్లా... అల్ట్రాటెక్ సిమెంట్స్.. కడపలో వారం పది రోజులుగా ఫ్యాక్టరీని ఆపేశారు. వీళ్లకు కావాల్సిన కాంట్రాక్టులు ఇవ్వడం లేదని అడ్డుకున్నారు. కర్నూలులో అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ కడుతున్నారు. దీనికి కాంట్రాక్టు ఎవరిదంటే మంత్రి జనార్ధన్‌రెడ్డిది. వాళ్ల మంత్రికి కాంట్రాక్టు ఇవ్వకపోతే పనులు జరగవు. దాల్మియా సిమెంట్స్ పరిస్థితి అంతే. కాంట్రాక్టర్లందర్నీ వీళ్ల మనుషులుగా అక్కడకు తీసుకొచ్చి పెట్టారు. అలా పెడితేనే పనులు జరుగుతాయి. జిందాల్ వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. అరబిందో వాళ్లు నమస్కారం పెడుతున్నారు. బెదిరించడం.. సొమ్ములు చేసుకోవడానికే చంద్రబాబు ఉన్నాడు. పరిశ్రమలు రావాలని, వాటి ద్వారా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశం చంద్రబాబుకు ఎక్కడా లేదు.వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదట!షాక్ కొట్టేలా కరెంట్ చార్జీలు.. మూత పడే స్థితికి అమూల్.. పాడి రైతులకు తగ్గిన గిట్టుబాటు ధరలు.. మార్కెట్‌లో పెరిగిన హెరిటేజ్ పాల ధరలు.. అమాంతంగా పెరిగిన స్కూల్ ఫీజులు.. స్కూళ్లలో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలిచిన నాడు–నేడు పనులు.. స్కామ్‌లు చేస్తూ తమ వాళ్లకు తెగనమ్మడానికి సిద్ధమైన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు.. అమ్మకానికి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. ఇసుక మాఫియా ఇష్టారాజ్యం.. బెల్టుషాపులు, లిక్కర్ మాఫియా.. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పింఛన్లు ఎగరగొట్టడం.. గతేడాది ఎగ్గొట్టిన రైతు భరోసా.. ఈ ఏడాది జూన్ 21న రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇంత వరకు అతీగతి లేకపోవడం.. ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇస్తామని గతేడాది ఎగ్గొట్టడం.. ఈ ఏడాది ఇచ్చే పరిస్థితి లేకపోవడం.. ఏటా 3 ఉచిత సిలెండర్లు.. గతేడాది రెండు సిలెండర్లు ఎగ్గొట్టడం.. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తానని.. రూ.13 వేలే అనడం.. అదీ 30 లక్షల మందికి ఎగ్గొట్టడం.. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున గత ఏడాదికి రూ.36 వేలు భృతి ఇవ్వక పోవడం.. ఈ ఏడాదీ అతీగతీ లేక పోవడం.. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్.. గత ఏడాది రూ.48 వేలు ఎగవేత.. ఈ ఏడాదీ ఎగ్గొట్టే కార్యక్రమం.. ఇలా వీటన్నింటి గురించి ఎవరూ అడక్కూడదు.. ఎవరూ ప్రశ్నించకూడదు.ఉచిత బస్సు రానంటోంది..ఎన్నికలప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. రాయలసీమ వాళ్లు వైజాగ్‌కు షికారుకు పోవచ్చన్నాడు. శ్రీకాకుళం వాళ్లు తిరుపతి పోవచ్చన్నాడు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చన్నాడు. ఈరోజు ఫ్రీ బస్సు హామీ కాస్తా గాలికిపోయింది. పండుగులు వచ్చి పోతున్నాయి కానీ ఉచిత బస్సు మాత్రం రావడం లేదు. అయినా ఏ ఒక్కరూ మాట్లాడకూడదు. చంద్రబాబు పుణ్యమా అని 6 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.4,200 కోట్లు పెండింగ్‌లో ఉంది. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండు ఏప్రిల్‌లు గడిచిపోయాయి. రూ.2,200 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే రూ.6,400 కోట్లు బకాయిలు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. వీటి గురించి కూడా ఎవరూ ప్రశ్నించకూడదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద బకాయిలు రూ.4,500 కోట్లు దాటాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేసిన పరిస్థితి కన్పిస్తుంది. ఇళ్ల నిర్మాణంతో సహా ఆయన ఇచ్చిన 143 హామీల కోసం ఎవరూ నిలదీయకూడదు. 2.66 లక్షల మంది వలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డుపాల్జేశాడు. బేవరేజెస్ కార్పొరేషన్‌లో మరో 15 వేల మందిని రోడ్డున పడేశాడు. ఇంటింటికి రేషన్ అందిస్తూ ఎండీయూలపై ఆధారపడి జీవించే మరో 20 వేల మందిని రోడ్డున పడేశాడు. ఇలా 3 లక్షల మందిని రోడ్డున పడేసినా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు వస్తూనే ఐఆర్ అన్నాడు. ఎగర గొట్టేశాడు. అంతవరకు ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీని ఇప్పటి వరకు వేయలేదు. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారంలోకి వస్తూనే జీపీఎస్‌ను తీసేసి ఓపీఎస్‌ను తీసుకొస్తా అన్నాడు. అదీ మోసమే. ఉద్యోగస్తుల బకాయిలే దాదాపు రూ.20 వేల కోట్లు దాటాయి. గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యమైపోయాయి. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రూ.1,000 కోట్లకు పైగా బకాయిలున్నాయి. కాదు.. కూడదని ఎవరైనా వీటి గురించి మాట్లాడితే, వీటి గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కు కోపమొస్తుంది. ఫలితంగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలు.. తుదకు జైలుకు పంపడాలు.

ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.సప్తమి సా.6.16 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: రేవతి రా.3.35 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: సా.4.18 నుండి 5.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.48 వరకు, తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు, అమృతఘడియలు: రా.7.11 నుండి 8.41 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.38, సూర్యాస్తమయం: 6.34. మేషం: రుణయత్నాలు సానుకూలం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.మిథునం: శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తిలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అంతంతగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.సింహం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి సమస్యలు. ఆరోగ్య సమస్యలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.కన్య: నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనయోగం. చర్చల్లో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.తుల: మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.వృశ్చికం: ప్రయాణాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు: శ్రమ మరింతగా పెరుగుతుంది. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.మకరం: కొత్త పనులకు శ్రీకారం. సంఘంలో గౌరవం పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.కుంభం: మిత్రులు, బంధువులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

పోరాటయోధుడు
రెప్ప పాటులో దూసుకొచ్చే బంతులను ఒడిసి పట్టాలంటే అతడు ఉండాలి...పాయింట్, కవర్స్, మిడాన్, మిడాఫ్ ఇలా ఎక్కడైనా నమ్మశక్యం కాని క్యాచ్‌లు అందుకోవాలంటే అతడు కావాలి...అవుట్‌ఫీల్డ్ నుంచి నేరుగా వికెట్లను గురిచూసి గిరాటేయాలంటే బంతి అతడికి చేతికి చిక్కాలి!పిచ్ నుంచి కాస్త సహకారం లభిస్తుందంటే చాలు ప్రత్యర్థిని చుట్టేయడానికి అతడు కావాలి...ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకున్నారంటే భాగస్వామ్యాన్ని విడదీయడానికి అతడు రావాలి...స్లో ఓవర్‌రేట్ బారిన పడకుండా చకచకా ఓవర్లు ముగించాలంటే అతడికి బౌలింగ్ ఇవ్వాలి!!టాపార్డర్ బ్యాటర్లకు సరైన సహకారం లభించాలంటే నాన్‌స్ట్రయికర్‌గా అతడు ఉండాలి...లోయర్ ఆర్డర్‌ను కాచుకుంటూ విలువైన పరుగులు చేయాలంటే క్రీజులో అతడు ఉండాలి...గడ్డు పరిస్థితుల్లో జట్టును గట్టెక్కించాలంటే అతడు బ్యాట్‌తో ‘కత్తిసాము’ చేయాలి!!ఇలా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నిట్లో అతి ముఖ్యమైన ఆ అతడు మరెవరో కాదు... రవీంద్ర సింగ్ జడేజా. పుష్కర కాలానికి పైగా భారత టెస్టు జట్టులో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్ తాజాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తన విలువ చాటుకుంటున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలతో మెరిసిన ‘జడ్డూ’... లార్డ్స్‌లో ఓటమి అంచున నిలిచిన జట్టును దాదాపు విజయానికి చేరువ చేశాడు. ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అనే విమర్శల నుంచి... పరిపూర్ణ ఆల్‌రౌండర్ అనిపించుకును స్థాయికి ఎదిగిన జడేజాపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ విజయానికి 193 పరుగులు అవసరం కాగా... 82 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయింది. ఇంకేముంది మరో పది, ఇరవై పరుగుల వ్యవధిలో మిగిలిన మూడు వికెట్లు కూలడం ఖాయమే అనే ఊహగానాల మధ్య భారత జట్టు చివరకు 170 పరుగులు చేయగలిగింది. చివరి ముగ్గురు బ్యాటర్లు వీరోచిత పోరాటం చేసిన మాట వాస్తవమే అయినా... దానికి నాయకత్వం వహించింది మాత్రం ముమ్మాటికీ రవీంద్ర జడేజానే. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇలా నమ్ముకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుంటే జడేజా మాత్రం మొక్కవోనిసంకల్పంతో బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో కట్టిపడేశాడు. మరో ఎండ్‌లో వికెట్ కాపాడుకోవడం కూడా ముఖ్యమైన తరుణంలో నితీశ్ కుమార్ రెడ్డి, బుమ్రా, సిరాజ్ అండతో జట్టును గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అతడు స్టోక్స్, ఆర్చర్, వోక్స్, కార్స్ వేసిన బౌన్సర్లకు ఎదురు నిలిచిన తీరు... పోరాట యోధుడిని తలపించింది. స్కోరు బోర్డు పరిశీలిస్తే జడేజా పేరిట అర్ధశతకం మాత్రమే కనిపిస్తుంది కానీ... లార్డ్స్‌లో అతడు చేసిన పోరాటం సెంచరీకి తీసిపోనిది. కఠిన క్షణాలు, పరీక్ష పెడుతున్న బంతులు, బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన పరిస్థితులు... వీటన్నిటితో పోరాడిన జడ్డూ క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నాడు. వరుసగా నాలుగు ఫిఫ్టీలు... 11, 25 నాటౌట్, 89, 69 నాటౌట్, 72, 61 నాటౌట్... తాజా ఇంగ్లండ్ సిరీస్‌లో జడేజా గణాంకాలివి. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తప్ప అతడు విఫలమైంది లేదు. లీడ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున జైస్వాల్, గిల్, రాహుల్ ఒక్కో సెంచరీ చేస్తే పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. దీంతో జడేజాకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అనితరసాధ్యమైన బ్యాటింగ్ ప్రదర్శనకు సంపూర్ణ సహకారం అందించిన ఘనత జడేజాదే. తొలి ఇన్నింగ్స్‌లో ఆరో వికెట్‌కు గిల్‌తో కలిసి 203 పరుగులు జోడించి జట్టుకు కొండంత స్కోరు అందించిన ‘జడ్డూ’... రెండో ఇన్నింగ్స్‌లోనూ సారథితో కలిసి ఐదో వికెట్‌కు 175 పరుగులు జతచేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో కెపె్టన్‌కు అండగా నిలుస్తూ స్ట్రయిక్ రొటేట్ చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ ఓ మాదిరిగా రాణించిన సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అతడు... రెండో ఇన్నింగ్స్‌లో అసాధారణంగా పోరాడాడు. ఇంగ్లండ్ బౌలర్లంతా ఒకదశలో జడేజాను అవుట్ చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకొని అవతలి ఎండ్‌లో వికెట్ పడగొట్టేందుకే ప్రయత్నించారంటే అతడు ఎంత పట్టుదలగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు. వికెట్ విలువ గుర్తెరిగి... గత ఏడాది భారత జట్టు టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు జడేజా కూడా వీడ్కోలు పలికాడు. తదనంతరం ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించగా... ‘జడ్డూ’ మాత్రం కొనసాగుతున్నాడు. జైస్వాల్, గిల్, సుదర్శన్, సుందర్, నితీశ్ వంటి యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో... రాహుల్, పంత్ కన్నా ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఉన్న జడేజా ఈ సిరీస్‌లో తన వికెట్ విలువ గుర్తెరిగి బ్యాటింగ్ చేస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు తన బ్యాటింగ్‌ను మార్చుకుంటూ ప్రతి కెప్టెన్ తన జట్టులో ఇలాంటి ప్లేయర్ ఉండాలనుకునే విధంగా ఆడుతున్నాడు. గతంలో కేవలం తన బౌలింగ్, ఫీల్డింగ్‌తోనే జట్టులో చోటు దక్కించుకున్న ‘జడ్డూ’... ఇప్పుడు నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు. ఒకప్పుడు ‘బిట్స్ అండ్ పీసెస్’ క్రికెటర్ అని విమర్శలు ఎదుర్కొన్న అతడు... వాటికి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. భారత గడ్డపై మ్యాచ్‌ల్లో ఎక్కువ వికెట్లు తీసిన జడేజా... విదేశాల్లో బౌలింగ్‌తో అద్భుతాలు చేయలేకపోయినా... నిఖార్సైన బ్యాటర్‌గానూ జట్టులో చోటు నిలుపుకునే స్థాయికి ఎదిగాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో పేసర్లు వికెట్ల పండగ చేసుకుంటుండగా... ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్‌కు ముందు చివరి ఓవర్‌లో స్టోక్స్ అవుట్ కావడం వెనక ‘జడ్డూ’ కృషి ఉంది. అంతకుముందు ఓవర్ వేసిన అతడు కేవలం 90 సెకన్లలోనే ఆరు బంతులు వేయడంతో మరో అదనపు ఓవర్ వేసే అవకాశం దక్కగా... అందులో సుందర్ బౌలింగ్‌లో స్టోక్స్ పెవిలియన్ చేరాడు. ఎప్పుడూ తెరవెనుకే! జడేజా టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి చూసుకుంటే... అతడి కంటే ఐదుగురు బౌలర్లు మాత్రమే ఎక్కువ బంతులు వేశారు. 2018 తర్వాతి నుంచి అతడు 42.01 సగటుతో పరుగులు రాబట్టాడు. 83 టెస్టుల్లో జడ్డూ 4 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో 3697 పరుగులు చేయడంతో పాటు... 326 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. అయితే ఇందులో అధిక శాతం ఉపఖండ పిచ్‌లపైనే నమోదవడం... జడేజా మంచి స్కోరు చేసిన మ్యాచ్‌ల్లో టాపార్డర్ భారీగా పరుగులు రాబట్టడంతో ఎప్పుడూ అతడి పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. పదకొండేళ్ల క్రితం 2014లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులో ధనాధన్ హాఫ్ సెంచరీతో పాటు ఆఖర్లో చక్కటి త్రోతో అండర్సన్‌ను రనౌట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా ఈసారి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాలని విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయితే ఈ క్రమంలో తన పోరాటంతో మాత్రం అందలమెక్కాడు. ఇకపై కూడా అతడు ఇదే నిలకడ కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఆరు బంతులను ఒకే ప్రాంతంలో వేయగల నైపుణ్యంతో పాటు... వేర్వేరుగా సంధించగల వైవిధ్యం గల జడేజా... నోబాల్స్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది!

నిధులు ముద్దు... జాప్యం వద్దు!
ప్రభుత్వం ఇటీవల ఒక లక్ష కోట్ల రూపాయల నిధితో ఒక నూతన పరిశోధన, అభివృద్ధి, నవీకరణ(ఆర్డీఐ) పథకానికి ఆమోదం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వంటి ప్రగాఢమైన సాంకేతిక రంగాల్లో నవీకరణ, వాణిజ్యపరమైన పరి శోధన–అభివృద్ధి (ఆర్–డి)లో ప్రైవేటురంగ పెట్టుబడులను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిధిని నెలకొల్పింది. దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు లేదా తక్కువ వడ్డీ రేట్లపై రీఫైనాన్సింగ్‌కు ఈ నిధులను వినియోగిస్తారు. జాతీయ లక్ష్యమైన స్వావలంబన సాధనకు చేయూతనందించదలచుకున్న ప్రైవేటు కంపెనీలు ఆర్–డి, టెక్నాలజీ అభివృద్ధి స్థాయిని పెంచాలనుకున్నప్పుడు వృద్ధి, రిస్క్ క్యాపిటల్ రూపంలో ఈ నిధులు అందుతాయి. కీలకమైన లేదా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న టెక్నాలజీల సమీకరణతో ప్రమేయం ఉన్నవాటితోపాటు, ‘టెక్నాలజీ సంసిద్ధత స్థాయి’ని హెచ్చుగా కనబరచిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తారు. పరిశోధనలో ఎక్కడున్నాం?‘ఆర్–డి’లో పెట్టుబడులు తక్కువగా ఉండటం, ప్రైవేటు రంగ వాటా పేలవంగా ఉండటంతో నూతన నిధిని సృష్టించవలసిన అవసరం ఏర్పడింది. ఆర్–డిపై స్థూల వ్యయాన్ని (జీఈఆర్డీ)గా పిలుస్తారు. ఇది ఎంత ఉందనేదానిని బట్టే పరిశోధనల పట్ల సదరు దేశపు నిబద్ధతను అంచనా వేస్తారు. భారతదేశపు జీఈఆర్డీ అత్యల్పంగా 0.64 శాతంగా ఉంది. ఎదుగు బొదుగు లేకుండా ఉండి పోయిన ఈ సంఖ్య, వాస్తవానికి, 2019–20 నుంచి ఇంకా తగ్గిపోవడం ప్రారంభించింది. అయితే, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పెరుగు దలతోపాటు ఆర్–డి కాసుల మూట కూడా కాస్తోకూస్తో బరువు పెరుగుతూ రావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఆర్–డిపై వ్యయంలో భారత్ స్థానం ఎక్కడా చెప్పుకోతగినదిగా లేదు. ఈ విషయంలో అమెరికా 784 బిలియన్ల డాలర్లతో 2023లో మొదటి స్థానంలో నిలిచింది. చైనా (723 బిలియన్ల డాలర్లు), జపాన్ (184 బిలియన్ల డాలర్లు), జర్మనీ (132 బిలియన్ల డాలర్లు), దక్షిణ కొరియా (121 బిలియన్ల డాలర్లు), బ్రిటన్ (88 బిలియన్ల డాలర్లు), ఇండియా (71 బిలియన్ల డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయని ‘వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్’ వెల్లడిస్తోంది. చైనాతో సహా ఆర్–డిపై అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో ప్రైవేటు రంగమే దానికి సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలో మాత్రం జీఈఆర్డీకి ప్రభుత్వ రంగమే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది. మన దేశంలో ఆర్–డిపై మొత్తం వ్యయంలో ప్రైవేటు రంగ వాటా 36.4 శాతంగానే ఉంది. ప్రభుత్వ ఊతంతోనే ఎదుగుదల!ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడిని నష్ట ప్రమాదం లేకుండా మార్చేందుకు ఈ రకమైన ప్రోత్సాహక చర్యకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారేమీ కాదు. ప్రపంచీకరణ యుగంలో సాఫ్ట్‌వేర్, బయోటెక్నాలజీ విప్లవాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి విజయవంతమైన ఉదాహరణలుగా నిలవడం వెనుక ప్రభుత్వ ప్రాయోజిత పథకాల మూల నిధులు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) అనే కొత్త ఐడియానే తీసుకుందాం. ఉపగ్రహ డాటా–లింక్ సదుపాయాలు పంచుకోవడం, సరసమైన ధరలకు కార్యాలయాల స్థలాన్ని పొందడం, పన్నుల్లో భారీ వెసులుబాట్ల రూపంలో ఔత్సాహిక సాఫ్ట్‌వేర్ సంస్థలకు ఎంతో అవసరమైన సహాయం ఎస్టీపీ ద్వారా లభించింది. అలా ఉత్సాహం చూపిన చాలా సంస్థలు కోట్లాది డాలర్ల బృహత్ సంస్థలుగా రూపాంతరం చెందాయి. ఆర్–డి, ప్రాడక్ట్ డెవలప్‌మెంట్ ఔట్‌సోర్సింగ్ లోకి అవి విస్తరించాయి. భారతదేశపు జి.డి.పి.లో సాఫ్ట్‌వేర్ రంగ వాటా ప్రస్తుతం సుమారు 8 శాతంగా ఉంది.శాంతా బయోటెక్నిక్స్, భారత్ బయోటెక్ మొట్టమొదటి బయో టెక్నాలజీ, వ్యాక్సీన్ కంపెనీలు అదే కోవలో లబ్ధి పొందినవే. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో నెలకొల్పిన టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి.డి.బి.) ఆ రెండు సంస్థలకు ఉదారంగా నిధులు అందించింది. అవి కూడా నిధులను సద్వినియోగం చేసుకుని, హైదరాబాద్‌ను భారతదేశపు వ్యాక్సీన్ రాజధానిగా అవతరించేటట్లు చేశాయి. విద్యాసంస్థలతో కలిసి నడిస్తేనే...ఆర్–డిపై ఆసక్తి ఉన్న ప్రైవేటు రంగాన్ని తీసుకురావడంలోఇంతవరకు గడించిన అనుభవాన్ని ఆధారం చేసుకుని ఇంకా పైకెద గడం, ఇంతకుముందు తెచ్చిన పథకాల్లోని లోటుపాట్లను సరిదిద్దు కోవడం తెలివైన పని అనిపించుకుంటుంది. మొట్టమొదటగా, అటు వంటి పథకాల అమలులో, అధికార యంత్రాంగం నుంచి ఎదు రయ్యే జాప్యాలను తలచుకుని ప్రైవేటు రంగం ఎప్పుడూ జంకుతూ ఉంటుంది. కనుక, పాలనాపరమైన జోక్యం వీలైనంత తక్కువగాఉండేటట్లు చూడాలి. కొత్త ఆర్డీఐ పథకం పాలనాపరంగా పీడకలకు కారణమయ్యే దిగా కనిపిస్తోంది. ఈ పథకానికి ‘వ్యూహాత్మక దిశా నిర్దేశం’ చేసేందుకు ప్రధాన మంత్రి అధ్యక్షతన గల ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ (ఎ.ఎన్.ఆర్.ఎఫ్.) గవర్నింగ్ బోర్డ్ పెద్ద తలకాయలా ఉంటుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించి, నిధులు ఇవ్వదగిన ప్రాజెక్టుల పరిధి, తరహాలపై సిఫార్సు చేస్తుంది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల సాధికార బృందం ఒకటి ఉంటుంది. ఏయే రంగాల్లో, ఏయే తరహా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చవచ్చునో ఈ బృందం సిఫార్సు చేస్తుంది. వాటి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ అధికార యంత్రాంగపు పిరమిడ్‌కు అట్టడుగున వైజ్ఞానిక, సాంకేతిక శాఖ ఉండి ఈ పథకాన్ని అమలుపరుస్తుంది. రెండు అంచెల వ్యవస్థ ద్వారా నిధుల ప్రవాహం సాగుతుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. లోపల స్పెషన్ పర్పస్ ఫండ్ (ఎస్.పి.ఎఫ్.) అని ఒకటుంటుంది. అలాగే, ద్వితీయ స్థాయి ఫండ్ మేనేజర్లు కొందరుంటారు. కొల్లేటి చాంతాడు లాంటి అధికార యంత్రాంగాన్ని అలాఉంచితే... రూ. 10,000 కోట్ల నిధులతో డీప్ టెక్ ఫండ్ ఆఫ్ పంఢ్స్ పేరుతో ఆర్డీఐ లాంటి పథకం ఇప్పటికే ఒకటి ఉంది. అయినా, కొత్త దానికి ఎందుకు రూపకల్పన చేశారో అర్థం కాదు. స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో, ఏఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూ టింగ్ వంటి రిస్క్ ఎక్కువ ఉన్న రంగాల్లో వ్యాపారాల తొలి అభివృద్ధి దశల్లో పెట్టుబడులకు డీప్ టెక్ ఫండ్ సాయపడాల్సి ఉంది. బహుశా, ఒకే రకమైన పథకాలు రెండింటికి రూపకల్పన చేశామని గ్రహించినందువల్లనే కాబోలు, డీప్ టెక్ ఫండ్‌కు ఆర్డీఐ నిధులు తరలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక నిధి మరో నిధికి నిధులిస్తే, ఇక అది ఏ ప్రయోజనాలను నిర్వర్తించనున్నట్లు? టెక్నాలజీ అభివృద్ధిని ప్రైవేటు రంగం చేపట్టాలని మనం కోరు కుంటున్నట్లయితే, విద్యా సంస్థలతో కలసి పనిచేయడమనే ప్రాథ మిక సూత్రం ఉండనే ఉంది. వాటితో కలసి అడుగులు వేస్తే, ఐడి యాలలో పురోగతిని త్వరగా అందిపుచ్చుకునేందుకు కంపెనీలకు వీలవుతుంది. పీహెచ్‌డీ హోల్డర్లు, సుశిక్షితులైన రిసెర్చర్లు, ఇంజనీర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంటారు. పరిశోధనా దశనుంచే సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటే, వస్తువులను అభివృద్ధిపరచ గల సమయాన్ని కంపెనీలు కుదించుకోగలుగుతాయి. దీనికి, విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల్లో ముందడుగులో ఉన్న దేశాలు అదే చేశాయి.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-దినేశ్ సి. శర్మ

ట్రంప్ కొత్త రాగం!
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు. అంతేకాదు... ఉక్రెయిన్ కోసం నాటో దేశాలకు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థనూ, ఇతరేతర ఆయుధాలనూ విక్రయిస్తారట. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు రిపబ్లికన్ పార్టీ వైఖరికీ, ట్రంప్ అప్పట్లో చేసిన ప్రకటనలకూ తాజా హెచ్చరికలు పూర్తి విరుద్ధం. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారంటూ తమ పార్టీకి చెందిన అప్పటి స్పీకర్ కెవిన్ మెకార్తీకి ఉద్వాసన పలికింది రిపబ్లికన్‌లే. అటు తర్వాత వచ్చిన మైక్ జాన్సన్‌ను సైతం ఇబ్బంది పెట్టారు. చిత్రమేమంటే అప్పట్లో ఉక్రెయిన్‌కు సాయం అందించటాన్ని గట్టిగా వ్యతిరేకించినవారంతా ఇప్పుడు ట్రంప్ మాదిరే అభిప్రాయాలు మార్చుకుని ఆయనకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ విధానం అద్భుతమైనదంటూ పొగుడుతున్నారు. ఉక్రె యిన్‌కు అందించదల్చుకున్న ఆయుధాలను ట్రంప్ నాటోకు విక్రయిస్తున్నారని, అందువల్ల అమె రికా నష్టపోయేదేమీ వుండదని వీరి వాదన. యూరప్ దేశాలు ఇటీవల రక్షణ బడ్జెట్లను విపరీతంగా పెంచాయి. ఆ డబ్బంతా అమెరికా ఖజానాకు చేరుతుందన్నది రిపబ్లికన్ల అంచనా. ట్రంప్ అన్నంత పనీ చేస్తారని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న వైఖరి సెప్టెంబర్ నాటికి వుంటుందనటానికి లేదు. తాను అధ్యక్షుడయ్యాక కలవటానికొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వైట్‌హౌస్‌లో తీవ్రంగా అవమానించి, యుద్ధోన్మాదిగా చిత్రించిన ట్రంప్ ఆర్నెల్లయ్యేసరికి ఆ పాత్ర తానే పోషించటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ చెబుతున్న ప్రకారం రష్యా దారికి రాకపోతే ఆ దేశంతో వాణిజ్యం నెరపే దేశాలపై కూడా వంద శాతం సుంకాలు విధించాలి. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంతోపాటు ఏటా 25,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్న చైనాపై కూడా చర్యలుండాలి. మన మాటెలావున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో వున్న చైనాతో నేరుగా యుద్ధానికి దిగటంతో సమానం. పిపీలక ప్రాయమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ ఇంత వివాదానికి దిగుతారా అన్నది ప్రశ్నార్థకం. పైగా అమెరికా మిత్ర దేశాలైన ఈయూ, జపాన్ సైతం రష్యాతో ఇప్పటికీ గణనీయంగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తున్నాయి. లక్ష్మణ రేఖల్ని గీయటంలో ట్రంప్‌ను మించినవారు లేరు. అధికసుంకాల విధింపు హెచ్చరిక ఏమైందో కనబడుతూనే వుంది. దాన్ని వరసగా పొడిగించుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 1వ తేదీ తాజా డెడ్‌లైన్. అసలు పదవిలోకి వచ్చేముందే ‘నేను అధ్యక్షుడినైన రెండు వారాలకల్లా రష్యా–ఉక్రెయిన్ లడాయి ఆగితీరాలి’ అని హెచ్చరించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని ఏదోవిధంగా రష్యాను అదుపు చేయటానికి శ్రమిస్తున్న నాటో కూటమి ఎలాగైతేనేం ట్రంప్ అంతరంగాన్ని పట్టుకుని, ఆయన అభిప్రాయాన్ని మార్చగలిగింది. మొన్నటివరకూ తిట్టిన నోరే మెచ్చుకునేలా చేసింది. కానీ ఇదెంత కాలం? నిజానికి ‘వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు నాటోకు అందిస్తాం. మొండికేస్తున్న రష్యాను దారికి తెస్తాం’ అంటూ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన నాటోను లోలోన వణికిస్తోంది. కొత్తగా తాము పెంచుకున్న రక్షణ కేటాయింపులన్నీ అమెరికా ఆవిరి చేస్తుందన్న భయం వాటిని వేధిస్తోంది. పైగా అవసరమైన ఆయుధాలు అందించటం రోజుల్లో, నెలల్లో పూర్తయ్యేది కాదు. అమెరికా, యూరప్ దేశాల దగ్గ రున్న ఆయుధాలన్నిటినీ వినియోగించినా రష్యాపై తక్షణ ఆధిక్యత అసాధ్యం. కొత్తగా ఆయుధాల ఉత్పత్తి మొదలై నాటో కూటమికి చేరటానికి సంవత్సరాలు పట్టొచ్చు. యూరప్ దేశాల్లో వున్న ఆయుధ పరిశ్రమ పరిమాణం చిన్నది. అమెరికా ఒక్కటే లక్ష్యాన్ని పూర్తి చేయటం అంత సులభం కాదు. వాణిజ్యం వరకూ చూస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువేమీ కాదు. అవి 300 కోట్ల డాలర్లు మించవని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అమెరికాకు ఎంతో అవసరమైన ఎరు వులు, ఇనుము, ఉక్కు, యురేనియంలున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా కొత్తగా నష్టపోయేది కూడా వుండదు. కానీ రష్యాతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలను గణనీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యలన్నీ అమలైతే రష్యా స్పందన గురించి ట్రంప్ ఆలోచించినట్టు లేరు. ఆ పర్యవసానా లను ఎదుర్కొనగలిగే శక్తిసామర్థ్యాలు అమెరికాకు లేవు. ఇప్పటికే పీకల్లోతు రుణ భారంతో కుంగు తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంలో వేలుపెడితే మరింత దిగజారుతుంది. ఏరికోరి ఈ విపత్తు తెచ్చుకోవటానికి ట్రంప్ సిద్ధపడకపోవచ్చు. అయితే రష్యాకు ఆయన విధించిన గడువులో ఒక మతలబుంది. మరో యాభై రోజులకల్లా వేసవి ముగిసి, హిమ పాతం మొదలై రష్యాకు ఇబ్బందులెదురవుతాయి. ఇప్పటికే స్వాధీనమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు నిలబెట్టుకోవటం మినహా అది చేయగలిగేది వుండదు. ఎటూ యుద్ధం జోరు తగ్గుతుంది గనుక దాన్ని తన ఘనతగా చెప్పు కోవటమే ట్రంప్ ఆంతర్యమని నిపుణులంటున్న మాట కొట్టివేయదగ్గది కాదు. యుద్ధాన్ని అంతం చేయటానికి దాన్ని మరింత తీవ్రతరం చేస్తామనటం తెలివితక్కువైనా కావాలి... మూర్ఖత్వమైనా కావాలి. ట్రంప్ వ్యవహార శైలి దేనికి దగ్గరగా వున్నదో త్వరలో తేలిపోతుంది.

కొలువుల పండుగ!
ముంబై: ఈసారి పండుగ సీజన్‌లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే కొలువులు 15–20 శాతం పెరగనున్నాయి. రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య, ట్రావెల్, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయి. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివిధ వేదికల్లో తమ క్లయింట్లు పోస్ట్ చేసే ఖాళీలు, పరిశ్రమ నివేదికలు మొదలైన డేటా ఆధారంగా అడెకో ఇండియా దీన్ని రూపొందించింది. రాఖీ, దసరా, దీపావళిలాంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఉద్దేశంతో నియామకాలు పుంజుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. సాధారణం కంటే ఈసారి పండుగ సీజన్ మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను కాస్తంత ముందుగానే మొదలుపెట్టాయని వివరించింది. వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడటం, సానుకూల వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక పరిస్థితులపై ఆశావహ అంచనాలు నెలకొనడం, సీజనల్ అమ్మకాల విషయంలో కంపెనీలు దూకుడుగా ప్రచారం చేస్తుండటం వంటి అంశాలు ఈసారి హైరింగ్‌కి దన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ‘ఈ పండుగ సీజన్‌లో డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా పరిశ్రమ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో కంపెనీలు సంఖ్యాపరంగా ఎంత మందిని తీసుకున్నాం అనేదే చూసేవి. కానీ ఇప్పుడు, అభ్యర్థ్ధులు ఎంత త్వరగా ఉద్యోగంలో చేరగలరు, ఎంత సన్నద్ధంగా ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో పరిస్థితులకు ఎంత వేగంగా సర్దుకోగలరులాంటి అంశాలపై కూడా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేశ్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెలాంటి పెద్ద నగరాల్లో సీజనల్ హైరింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే అవకాశాలు 19% అధికం. → లక్నో, జైపూర్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, మైసూరు, వారణాసిలాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా డిమాండ్ 42% పెరిగింది. విజయవాడ, కాన్పూర్, కొచ్చిలాంటి వర్ధమాన హబ్‌లలోనూ హైరింగ్ అంచనాలు మెరుగ్గా న్నాయి. → మెట్రో మార్కెట్లలో వేతనాలు 12–15%, వర్ధ మాన నగరాల్లో 18–22% స్థాయిలో పెరగవచ్చు. → స్వల్పకాలిక ఈ ఏడాది సీజనల్ హైరింగ్‌లో మహిళల వాటా 23 శాతం పెరగనుంది. → పండుగ సీజన్‌లో డిమాండ్ భారీగా ఉన్న సమయాల్లో కంపెనీలు లాస్ట్–మైల్ కార్యకలాపాలను (కస్టమర్ల ఇంటి దగ్గరకే ఉత్పత్తులను చేర్చడం) కూడా పటిష్టపర్చుకోనుండటంతో లాజిస్టిక్స్, డెలివరీల్లో హైరింగ్ 30–35% ఎగబాకనుంది. → బీఎఫ్‌ఎస్‌ఐ రంగాన్ని తీసుకుంటే .. క్రెడిట్ కార్డుల అమ్మకాలు, పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) ఇన్‌స్టాలేషన్ల కోసం (ముఖ్యంగా ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో) కంపెనీలు పెద్ద స్థాయిలో నియామకాలు చేపడుతున్నాయి. ఈ విభాగంలో డిమాండ్ 30 శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. → హాస్పిటాలిటీ, ట్రావెల్ సెగ్మెంట్లలో రిక్రూట్‌మెంట్ డిమాండ్ 20–25% ఉండొచ్చు. → మొత్తం సీజనల్ ఉద్యోగాల కల్పనలో 35–40% వాటాతో రిటైల్, ఈ–కామర్స్ విభాగాల ఆధిపత్యం కొనసాగనుంది. → డిజిటల్‌పై పట్టు, బహుభాషా సామర్థ్యాలు, కస్టమర్లను హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యాలకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నా యి. ఇన్–స్టోర్ సేల్స్, క్రెడిట్ కార్డ్ ప్రమోషన్లు, డెలివరీ ఉద్యోగాల కోసం ఈ నైపుణ్యాలను చూస్తున్నాయి.

45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ ఉండాలి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేస్తేనే గోదావరి మిగులు జలాలు ఇతర నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)కు మళ్లించడానికి అవకాశం ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టులో నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు రాజీపడ్డారని గుర్తు చేశారు. దీని కారణంగా కృష్ణా నదికి గోదావరి జలాలను తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘గోదావరికి ప్రాణహిత, ఇంద్రావతి ప్రధాన ఉప నదులు. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలు ప్రాణహిత జలాలను గరిష్ఠ స్థాయిలో వాడుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. తాజాగా ఇంద్రావతి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి ఛత్తీస్‌గఢ్ బోద్‌ఘాట్ బహుళార్ధ సాధక ప్రాజెక్టును చేపట్టింది. దీనికి రూ.50 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో తొలుత పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు. అందుకు భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని పేర్కొన్నారు. కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.15 వేల కోట్లను సమీకరించి.. భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించి పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతికి అడ్డుకట్ట వేస్తే.. పోలవరంలో మిగులు, వరద జలాల లభ్యత ఏ స్థాయిలో ఉంటుందన్నది అంచనా వేయాలన్నారు. మిగులు, వరద జలాల లభ్యత ఉంటుందని తేల్చిన తర్వాత పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని వైఎస్ జగన్ సూచించారు. నీళ్లు లేకుండా ఆ ప్రాజెక్టును చేపడితే రూ.80 వేల కోట్లు వృథా అవుతాయన్నారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా
బనకచర్లపై ఏపీ ప్రస్తావన తేలేదు అసలు బనకచర్లను ఏపీ వాళ్లు కడతామని ప్రస్తావిస్తేనే కదా? ఆపమని మేం అభ్యంతరం తెలిపేది? ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనధికార భేటీ మాత్రమే. – తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిబనకచర్లపై సానుకూలం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైంది. చర్చలు ఫలప్రదమయ్యాయి. – రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుసాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల నుంచి తీవ్ర వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై ఢిల్లీ వేదికగా చంద్రబాబు ప్రభుత్వ కపటత్వం బట్టబయలైంది. బనకచర్ల ఏ ఎజెండాగా బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో తెలంగాణ సీఎంతో సమావేశం అవుతున్నట్లు బీరాలు పలికినా... అసలు ఆ ప్రాజెక్టు చర్చకే రాలేదని తేలింది. దీంతో బనకచర్లపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. కేంద్ర మంత్రి వద్ద జరిగిన భేటీలో బనకచర్ల ప్రస్తావనే రాలేదంటూ మీడియా సమావేశంలో సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో... చంద్రబాబు సర్కారు హైడ్రామా బయటపడింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనధికార భేటీ మాత్రమేనని రేవంత్ పేర్కొనడం, అసలు బనకచర్ల కడతామని ఏపీ వాళ్లు ప్రస్తావిస్తేనే కదా? ఆపమని తాము అభ్యంతరం తెలిపేది అనడం... కేంద్రం ఎలాంటి ఎజెండా పెట్టుకోకుండా, వేదిక అందించిందని స్పష్టం చేయడంతో చంద్రబాబు ప్రభుత్వ బండారం వెలుగులోకి వచ్చింది.బనకచర్లపై చర్చించలేదని కేంద్రమూ చెప్పింది...కేంద్ర మంత్రితో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడగా, చంద్రబాబు మాత్రం మొహం చాటేశారు. తమది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని, సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార (ఇన్‌ఫార్మల్) సమావేశమని కూడా రేవంత్ పేర్కొన్నారు. అయితే, ఏపీ జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఏకంగా బనకచర్లపై నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారని ప్రకటించేశారు. కానీ, సమావేశంలో చర్చించిన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బుధవారం రాత్రి 7.27 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో బనకచర్ల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. తాము సాధారణ అంశాలే చర్చించామంటూ రేవంత్ కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో బనకచర్ల సింగిల్ పాయింట్ అజెండా అంటూ బీరాలు పోతూ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా ఆ ప్రాజెక్టుపై చర్చనే జరగలేదని తేలిపోయింది.సింగిల్ పాయింట్ అజెండాగా వెళ్లినా...అసలు బనకచర్ల ప్రతిపాదనలోనే చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సాగునీటి నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఎర్త్ వర్క్‌లు చేసి భారీఎత్తున కమీషన్లను కొట్టేసేందుకే బనకచర్లను తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బనకచర్ల అసాధ్యం అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తేల్చి చెప్పింది. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచర్లకు గోదావరి జలాలను తరలించే వీలుంటుందని, 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర జల్‌శక్తి శాఖకు స్పష్టం చేస్తూ లేఖ రాసింది. ఇదిలాఉంటే పోలవరంలో 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచర్లకు తరలిస్తామని కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదించారు. కానీ, పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు పరిమితమైతే.. 42 మీటర్లలో నీళ్లే నిల్వ ఉండవు. లేని నీటిని తరలించేందుకు బనకచర్ల ప్రతిపాదన తేవడం చూస్తుంటే.. చంద్రబాబుకు గోదావరి వరద జలాలను కరువు పీడిత ప్రాంతాలకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధి లేదని బహిర్గతమైంది. బనకచర్ల ఏకైక ఎజెండాగా ఢిల్లీ వెళ్లి ఆ ప్రాజెక్టుపై చర్చే లేకుండా వెనుదిరగనుండడం కూడా దీనిని బలపరుస్తోంది.డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే...సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన 143 హామీల అమలు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా బనకచర్లను చంద్రబాబు పావుగా వాడుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీఎంల సమావేశంలో పరిష్కారం కుదిరిందని చెబుతున్న నాలుగు అంశాలు కూడా కృష్ణా–గోదావరి బోర్డుల స్థాయిలోనే పరిష్కారం అయ్యేవేనని స్పష్టం చేస్తున్నారు.బనకచర్లపై ఏపీ ప్రస్తావన తేలేదు: రేవంత్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశమే ప్రస్తావనకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘అసలు బనకచర్లను ఏపీ వాళ్లు కడతామని ప్రస్తావిస్తేనే కదా...? ఆపమని మేం అభ్యంతరం తెలిపేది..? ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలే అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనధికార భేటీ మాత్రమే’’ అని తేల్చి చెప్పారు. కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోకుండా, వేదికను అందించి మధ్యవర్తిలా వ్యవహరించిందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ, ఏపీ సీఎంలు, నీటి పారుదల శాఖల మంత్రుల సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఇది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదని... సమస్యలపై సీఎంల స్థాయిలో జరిగిన అనధికార సమావేశమని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయనున్న కమిటీ అన్ని అంశాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందన్నారు. బనకచర్లపై సానుకూలం చర్చలు ఫలప్రదం: మంత్రి నిమ్మలపోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సానుకూల స్పందన వ్యక్తమైందని మంత్రి రామానాయుడు తెలిపారు. బనకచర్లతో అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. సోమవారంలోగానే బనకచర్లపై కమిటీ నియామకం జరుగుతుందన్నారు. గోదావరి నది నుంచి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 3 వేల టీఎంసీలపై కూడా కమిటీ ఆరా తీసి నివేదికలో పొందుపరుస్తుందని చెప్పారు. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వాలకు నివేదిస్తుందన్నారు. తర్వాత మరోసారి సీఎంలు సమావేశమై జల వివాదాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో సమావేశం స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణంలో జరిగిందన్నారు. కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు రామానాయుడు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, తెలంగాణ కలిసి కాపాడుకోవాలని, మరమ్మతులు, ప్లంజ్‌పూల్ రక్షణ విషయంలో సీడబ్ల్యూసీ సిఫార్సులు, నిపుణుల సూచనలు పాటించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు.జల వివాదాలపై సాంకేతిక కమిటీసాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి.. కేంద్ర ప్రభుత్వ, రెండు రాష్ట్రాల అధికారులు, నిపుణులు, ఇంజనీర్లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలపై సమావేశం జరిగింది. భేటీలో నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించాం. ప్రాజెక్టులపై టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు, శ్రీశైలం నిర్వహణ, రక్షణ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణా యాజమాన్య బోర్డు ఏపీలో, గోదావరి బోర్డు తెలంగాణలో ఉండేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగిలిన సమస్యలను సమగ్రంగా, సాంకేతికంగా పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ అపరిష్కృత సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు సమర్థవంతమైన నీటి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆచరణీయమైన పరిష్కారాలను సూచిస్తుంది. వారంలోగా కమిటీ ఏర్పాటవుతుంది. రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను సులభతరం చేసేందుకు జలశక్తి శాఖ నిబద్ధతతో ఉంది..’ అని పేర్కొంది. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సుమారు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో పాటు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, నీటి పారుదల శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, రెండు రాష్ట్రాల సీఎస్‌లు, నీటి పారుదల శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
సెమిస్టర్ స్టూడెంట్ 72 లక్షల జీతం
ఎరువు కరువు
బెజవాడలో జంట హత్యలు
జనాభా ఆధారంగా పంచాయతీల వర్గీకరణ
రాష్ట్రానికి ‘మళ్లీ’ వర్షసూచన!
రైతన్నల సంక్షేమానికి ధన్–ధాన్య కృషి యోజన
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
నాటోకు ఆ అధికారం ఎక్కడిది?
హారిక, రాము దంపతులపై.. పక్కా పథకం ప్రకారమే దాడి
ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
42 ఏళ్ల లారీడ్రైవర్‌తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్‌కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
సాక్షి కార్టూన్ 16-07-2025
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్‌ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు.. ఇటు
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
సెమిస్టర్ స్టూడెంట్ 72 లక్షల జీతం
ఎరువు కరువు
బెజవాడలో జంట హత్యలు
జనాభా ఆధారంగా పంచాయతీల వర్గీకరణ
రాష్ట్రానికి ‘మళ్లీ’ వర్షసూచన!
రైతన్నల సంక్షేమానికి ధన్–ధాన్య కృషి యోజన
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
నాటోకు ఆ అధికారం ఎక్కడిది?
హారిక, రాము దంపతులపై.. పక్కా పథకం ప్రకారమే దాడి
ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా
సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
42 ఏళ్ల లారీడ్రైవర్‌తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్‌కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
సాక్షి కార్టూన్ 16-07-2025
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్‌ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు.. ఇటు
రష్యాకు 10 లక్షల మంది భారత కార్మికులు
సినిమా

ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
అనసూయ తొలుత 'జబర్దస్త్' షోతో యాంకర్‌గా పరిచయమైంది. మధ్యలో ఓసారి కొన్నాళ్ల పాటు షోలో కనిపించలేదు. తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అలా 2022 వరకు షోలో కొనసాగింది. ఏమైందో ఏమో గానీ సడన్‌గా షో నుంచి తప్పుకొంది. అప్పటినుంచి ఒకటి రెండు షోలు, ఒకటి రెండు మూవీస్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త ప్రాజెక్టులేం లేనట్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'జబర్దస్త్' 12 ఏళ్ల సెలబ్రేషన్స్ కోసం వచ్చింది. హైపర్ ఆదిపై రెచ్చిపోయి కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)'బాబుగారు, ఇంద్రజగారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లేముందు వద్దు ఆది, నాకు కొన్ని.. మైక్‌లోనే చెప్పేస్తా నేను అన్నీ.. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్‌క్లూజివిటీ యాడ్ అవలేదు. అది నా ఏడుపు' అని అనసూయ చెప్పింది.మరోవైపు ఆది మాట్లాడుతూ.. 'ఒరేయ్ నువ్వు అమెరికా వెళ్లినా సరే నీకు లింకులు పంపించా. అది రా మన లింక్. ఏమనుకుంటున్నావ్ రా నువ్వు' అని అన్నాడు. బదులిచ్చిన అనసూయ.. 'ఇదిగోండి ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్లిపోయింది' అని ఆవేశంగా చెప్పుకొచ్చింది.'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో బట్టి చూస్తే హైపర్ ఆదితో అనసూయ కాస్త గట్టిగానే మాట్లాడింది. చూస్తుంటే చాలావరకు నిజాలే చెప్పినట్లు ఉంది గానీ చివరలో ఇదంతా స్కిట్ అని కామెడీ చేసేస్తారేమో! ఎందుకంటే షోలో ఉన్నప్పుడు ఆది.. అనసూయని టార్గెట్ చేస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలానే వేసేవాడు. కానీ అనసూయ పెద్దగా రెస్పాండ్ అయ్యేది కాదు. ఇప్పుడు కూడా స్కిట్లో భాగంగా తన మనసులో ఉన్నదంతా బయటపెట్టేసిందేమో అనిపిస్తోంది. ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే అసలు విషయం ఏంటో తేలుతుంది.(ఇదీ చదవండి: ఇది గమనించారా? స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు)

చనిపోయేలోపు న్యాయం జరుగుతుందా? ఆస్పత్రిలో నటుడి మాజీ భార్య
నటుడు బాలా (Actor Bala) పర్సనల్ విషయాలతో ఎప్పుడూ వివాదాల్లో నానుతూనే ఉంటాడు. చిన్న వయసులో చందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. తర్వాత నటి అమృతా సురేశ్‌ను వివాహం చేసుకోగా కొంతకాలానికి వీరు కూడా విడిపోయారు. అయితే డివోర్స్ తర్వాత తనతోపాటు, తన కూతుర్ని కూడా వేధించారని అమృత పోలీసులను ఆశ్రయించడం, వారు బాలను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలోనే డాక్టర్ ఎలిజబెత్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు. నాకేదైనా జరిగితే తనదే బాధ్యతఆమెను కూడా వదిలేసి గతేడాది కోకిలను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇలా నాలుగు పెళ్లిళ్లతో బాలా సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ అయ్యాడు. తాజాగా డాక్టర్ ఎలిజబెత్ (Elizabeth Udayan) షేర్ చేసిన వీడియోతో మరోసారి బాలా పేరు తెరపైకి వచ్చింది. అందులో ఆమె ఆస్పత్రి బెడ్‌పై ఉంది. ఎలిజబెత్ ఏమందంటే.. నాకేదైనా జరిగితే నా మాజీ భర్త, అతడి కుటుంబానిదే పూర్తి బాధ్యత. అతడి గురించి ఏళ్లతరబడి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. చనిపోయేలోపు న్యాయం?సోషల్ మీడియాలో గోడు వెల్లబోసుకున్నా, సీఎంను కలిసినా, కోర్టు మెట్లెక్కినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. పైగా నన్నే బెదిరిస్తున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. నాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. అదే చాలా బాధగా ఉంది. నాకేదైనా జరిగితే అతడి(బాలా)తోపాటు అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొంది. ఈ వీడియోకు 'నేను చనిపోయేలోపు నాకు న్యాయం జరుగుతుందా?' అని క్యాప్షన్ జోడించింది.నీ ఉసురు ఊరికే పోదుఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడదాని కన్నీళ్ల ఉసురు ఊరికే పోదని శాపనార్థాలు పెడుతున్నారు. వీలైతే జరిగినదాన్ని మర్చిపో, కౌన్సెలింగ్ తీసుకో.. అతడి చెర నుంచి తప్పించుకోవడమే ఒక వరంలా భావించు, నువ్వు అతడిని చాలా ప్రేమించావు. కానీ, ఈరోజు కాకపోయినా రేపయినా అతడికి తగిన శాస్తి జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.డాక్టర్వి అయ్యుండి ఇలా..మరికొందరేమో.. నువ్వు ఒక డాక్టర్వి.. గతాన్ని మర్చిపోయి నీ వృత్తికి పూర్తి స్థాయి సమయం కేటాయించు, వైద్యురాలివయ్యుండి చనిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించు. అది వీలుకాకపోతే మీ జీవితంలోనే పెద్ద సమస్య అయిన వ్యక్తి మీకు దూరంగా వెళ్లిపోయాడని మీకు మీరు భరోసా ఇచ్చుకోండి అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నా సినిమాకు రూ.600 కోట్ల కలెక్షన్స్, అందుకే రెట్టింపు తీసుకుంటున్నా

రాష్ట్రపతి భవన్‌లో కన్నప్ప.. మంచు విష్ణుపై ప్రముఖుల ప్రశంసలు!
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన చిత్రం కన్నప్ప. శివభక్తుడైన కన్నప్ప కథగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలంతా నటించారు. ముఖ్యంగా మన పిల్లలు కచ్చితంగా చూడాల్సిన సినిమా అని మంచు విష్ణు రిలీజ్‌కు ముందే చెప్పారు. మన ఆధ్యాత్మిక చరిత్ర వారికి తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచింది. ఈ షోకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరయ్యారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు. ఈ సినిమా అనంతరం అద్భుతంగా ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు.కన్నప్ప చిత్రంలోని భావోద్వేగాలు, విజువల్స్, ఆధ్యాత్మిక భావనల్ని ప్రశంసించారు. ‘కన్నప్ప’లోని చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. క్లైమాక్స్‌లో మంచు విష్ణు నటన అందరికీ గుర్తుండిపోతుంది. అతని నటన, స్క్రీన్ ప్రజెన్స్ మీద దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ విష్ణు నటన గురించి ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులు, విమర్శకులు, సినీ ప్రముఖులు ఇలా అందరూ విష్ణు నటనను కొనియాడారు.

తిరుమలలో హీరోయిన్ ప్రణీత.. మొదటిసారి అంటూ పోస్ట్!
అత్తారింటికి దారేది మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త, కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రణీత తన ఇన్‌స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్‌వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది. Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025 View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

రాణించిన జెమీమా, దీప్తి
సౌతాంప్టన్: ఇంగ్లండ్ మహిళలతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌లో శుభారంభంపై దృష్టి పెట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... కడపటి వార్తలందేసరికి 45 ఓవర్లలో 6 వికెట్లకు 232 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (54 బంతుల్లో 48; 5 ఫోర్లు), దీప్తి శర్మ (57 బంతుల్లో 57 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 86బంతుల్లో 90 పరుగులు జోడించారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ‘బర్త్‌డే గర్ల్’ సోఫియా డంక్లీ (92 బంతుల్లో 83; 9 ఫోర్లు), అలైస్ డేవిడ్సన్ (73 బంతుల్లో 53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శతక భాగస్వామ్యం... భారత పేసర్, మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. తన తొలి ఓవర్లోనే ఎమీ జోన్స్ (1)ను బౌల్డ్ చేసిన ఆమె, తన తర్వాతి ఓవర్‌లో బీమాంట్ (5)ను ఎల్బీగా పంపడంతో ఇంగ్లండ్ స్కోరు 20/2 వద్ద నిలిచింది. ఈ దశలో నాట్ సివర్ బ్రంట్ (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమా ల్యాంబ్ (50 బంతుల్లో 39; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 87 బంతుల్లో 71 జత చేశారు. అయితే ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టింది. తన వరుస ఓవర్లలో ఆమె ల్యాంబ్, నాట్ సివర్లను పెవిలియన్‌కు పంపించడంతో భారత్ పైచేయి సాధించింది. అయితే డంక్లీ, అలైస్ చక్కటి బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఐదో వికెట్‌కు 23.4 ఓవర్లలో 106 పరుగులు జోడించారు. ఎట్టకేలకు అలైస్‌ను అవుట్ చేసి ఆంధ్ర బౌలర్ శ్రీచరణి ఈ జోడీని విడగొట్టింది. చివర్లో సోఫీ ఎకెల్‌స్టోన్ (19 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడటంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 49 పరుగులు సాధించింది. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చింది. కెప్టెన్ విఫలం... ఛేదనను భారత ఓపెనర్లు ధాటిగా మొదలు పెట్టారు. తొలి వికెట్‌కు ప్రతీక రావల్ (51 బంతుల్లో 36; 3 ఫోర్లు)తో కలిసి 8 ఓవర్లలోనే 48 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన (24 బంతుల్లో 28; 5 ఫోర్లు) వెనుదిరిగింది. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో ప్రతీక, హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 27; 4 ఫోర్లు) పెవిలియన్ చేరారు. నిర్లక్ష్యంగా పరుగెత్తిన హర్లీన్ అనూహ్యంగా రనౌటైంది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) విఫలమైంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బీమాంట్ (ఎల్బీ) (బి) క్రాంతి 5; ఎమీ జోన్స్ (బి) క్రాంతి 1; ఎమా ల్యాంబ్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) రాణా 39; నాట్ సివర్ (సి) జెమీమా (బి) రాణా 41; డంక్లీ (బి) అమన్‌జోత్ 83; అలైస్ డేవిడ్సన్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) శ్రీచరణి 53; ఎకెల్‌స్టోన్ (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–8, 2–20, 3–91, 4–97, 5–203, 6–258. బౌలింగ్: అమన్‌జోత్ 10–0–58–1, క్రాంతి గౌడ్ 9–0–55–2, దీప్తి శర్మ 10–0–58–0, శ్రీచరణి 10–0–46–1, స్నేహ్ రాణా 10–0–31–2, ప్రతీక 1–0–7–0.

రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సౌతాంప్టన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.ఓపెనర్లు టామీ బ్యూమాంట్(5), అమీ జోన్స్(1)ను బారత పేసర్ క్రాంతి గౌడ్ పెవిలియన్ పంపింది. ఈ క్రమంలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(41), లాంబ్(39) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక సోఫీ డంక్లీ(83), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్(53) జట్టు స్కోర్ బోర్డును నడిపించారు.వీరిద్దరూ ఐదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. చరణి, అమన్‌జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తుది జట్లుఇంగ్లండ్: టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఎమ్మా లాంబ్, నాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్, షార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలర్, లారెన్ బెల్భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్

చెలరేగిన హెన్రీ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో సౌతాఫ్రికాను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.కివీస్ ఓపెనర్లు సీఫర్ట్(22), కాన్వే(9) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ డార్లీ మిచెల్(5), వికెట్ కీపర్ హే(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ సమయంలో టిమ్ రాబిన్సన్(75), డెవాన్ జాకబ్స్(44).. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 105 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాక రెండు, ఎంగిడీ, ముత్తుసామి, కోట్జీ తలా వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బ్యాటర్లలో బ్రెవిస్(35) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లిండే(30), ప్రిటోరియస్(27) పర్వాలేదన్పించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోధీ రెండు, శాంట్నర్ ఓ వికెట్ సాధించారు.చదవండి: Virat kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్‌టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్‌ను అప్డేట్ చేసింది.కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్‌గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఓవరాల్‌గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్‌తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.కోహ్లి తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి'
బిజినెస్

డాలీ చాయ్‌వాలా ఫ్రాంచైజీలకు 1600 దరఖాస్తులు
పక్కవీధిలోని చిన్న కొట్టులో చాయ్ అమ్ముకునే వ్యక్తి క్రమంగా ఎదుగుతూ, అందరూ ఆదరించేలా చాయ్ తయారు చేస్తూ.. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తే.. ఆహా అనాల్సిందే కదా. నాగ్‌పూర్‌కు చెందిన డాలీ బతుకుతెరువు కోసం చిన్న కొట్టులో చాయ్ అమ్ముతుండేవాడు. ఒక్కసారి తన చాయ్ తాగినవారు మళ్లీ తాగాలనిపించేలా తయారు చేయడం తన ప్రత్యేకత. దాంతో నగరంలోని చాలా ప్రదేశాల నుంచి తన టీస్టాల్ వద్దకు కస్టమర్లు వచ్చేవారు. క్రమంగా నాగ్‌పూర్‌లో డాలీ చాలా ఫేమస్ అయ్యారు.ఒకనొక సందర్భంలో డాలీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు తన చాయ్ రుచి చూపించే అవకాశం కూడా వచ్చింది. దాంతో డాలీ చాయ్‌వాలా మరింత ఫేమస్ అయ్యారు. ఇటీవల డాలీ చాయ్‌వాలా ‘డాలీ కీ తప్రి’ పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ఏకంగా రెండు రోజుల్లో 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందుకోసం ప్రత్యేకంగా ధరలు కూడా నిర్ణయించారు. కార్ట్ స్టాల్ కోసం రూ.4.5 లక్షలు-రూ.6 లక్షలు, స్టోర్ మోడల్ రూ.20 లక్షలు-రూ.22లక్షలు, రూ.ఫ్లాగ్షిప్ కేఫ్ రూ.39 లక్షలు-రూ.43 లక్షలు వరకు ఫ్రాంచైజీ ధరలున్నాయి.ఒక వీడియోలో డాలీ తన విజయం గురించి మాట్లాడుతూ..‘నాకు పాఠశాలకు వెళ్లే అవకాశం రాలేదు. కానీ నేనెప్పుడూ అవకాశాలను వదులుకోలేదు. చాయ్‌తో ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నాను. నాతో పాటు ఇతరులు ఎదగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఫ్రాంచైజీ ప్రకటనలో భాగంగా డాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇది భారతదేశపు మొదటి వైరల్ స్ట్రీట్ బ్రాండ్. ప్రస్తుతం ఇది నిజమైన అభిరుచి ఉన్న వ్యక్తులను ఒక వ్యాపార అవకాశం’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ‘బర్గర్లు తింటారా అని అడిగే స్థాయి నుంచి వాటిని విక్రయించే స్థాయికి చేరారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొకరు వార్నింగ్ ఇస్తూ ‘ఏ ఫ్రాంచైజీ తీసుకోకండి’ అంటూ రిప్లై ఇచ్చాడు.

వీధి వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఒకప్పటిలాగా పర్సుల్లో క్యాష్ ఉంచుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. అయితే చిరువ్యాపారుల పట్ల ఈ డిజిటల్ లావాదేవీలు శాపంగా మారుతున్నాయి. ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ వ్యవస్థల్లో రికార్డు అవుతుండడంతో రోజువారీ లావాదేవీలను పరిగణలోకి తీసుకుని చిరువ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందుతున్నాయి. గతంలో ఫిజికల్ క్యాష్ ద్వారా వస్తు మార్పిడి జరిగేదికాస్తా డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని వారి చేతిలో జీఎస్టీ నోటీసులు దర్శనమిస్తున్నాయి. దాంతో చేసేదీమీ లేక యూపీఐ చెల్లింపులకు నో చెబుతూ.. కస్టమర్లను క్యాష్ ఇమ్మంటున్నారు.బెంగళూరులో ఈమేరకు చాలా మంది వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. దాంతో యూపీఐ క్యూఆర్ స్కానర్లు పక్కన పడేసి, క్యాష్ ఇవ్వాలని కస్టమర్లను కోరుతున్నారు. చాలా షాపుల ముందు ‘నో యూపీఐ.. ఓన్లీ క్యాష్’ అనే బోర్డులు వెలుస్తున్నాయి. ‘రోజుకు సుమారు రూ.3,000 వ్యాపారం చేసి వచ్చే కొద్దిపాటి లాభంతో జీవిస్తున్నాను. నేను ఇకపై యూపీఐ చెల్లింపును అంగీకరించలేను’ అని హోరమావులోని ఓ దుకాణదారుడు తెలిపాడు.స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు, తోపుడు బండ్లు, కార్నర్ షాపులు సహా అధికారికంగా నమోదు కాని వేలాది చిన్న వ్యాపారాలకు జీఎస్టీ నోటీసులు అందాయని వ్యాపారులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు చెబుతున్నారు. కొందరికి రూ.లక్షల్లో డిమాండ్లు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బెంగళూరు స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినయ్ కె.శ్రీనివాస మాట్లాడుతూ..‘చాలా మంది విక్రేతలు జీఎస్టీ అధికారుల వేధింపులు, పౌర అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని భయపడుతున్నారు. దాంతో చాలామంది ఇప్పటికే కస్టమర్ల నుంచి నగదు కోరుతున్నారు’ అని చెప్పారు. ప్రస్తుత జీఎస్టీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం వస్తువులను సరఫరా చేసే వ్యాపారులు తమ వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లకు పరిమితి రూ.20 లక్షలుగా ఉంది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డే దిక్కు!ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ స్పందిస్తూ 2021-22 నుంచి యూపీఐ లావాదేవీల డేటా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే టర్నోవర్ స్థాయులను చేరిన వారికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అటువంటి వ్యాపారులు వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని, పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్‌ను వెల్లడించాలని తెలిపింది. ఇదిలాఉండగా, జీఎస్టీ అధికారులు యాదృచ్ఛిక గణాంకాలను టర్నోవర్‌గా పేర్కొనలేరని కర్ణాటక వాణిజ్య పన్నుల మాజీ అదనపు కమిషనర్ హెచ్డీ అరుణ్ కుమార్ అన్నారు.

క్రెడిట్ కార్డే దిక్కు!
తక్కువ ఆదాయ వర్గాల వారికి క్రెడిట్ కార్డులు ఆధారంగా మారుతున్నాయి. రూ.50,000లోపు ఆదాయం ఉన్న వేతన జీవుల్లో 93 శాతం మంది అవసరాల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నట్టు థింక్ 360.ఏఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. స్వయం ఉపాధిపై ఉన్న వారిలో 85 శాతం మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగం, స్వయం ఉపాధిలో ఉన్న 20,000 మంది వ్యక్తుల ఏడాది కాల ఆర్థిక తీరును అధ్యయనం చేసి థింక్ 360 ఈ వివరాలను విడుదల చేసింది.బై నౌ పే లేటర్ (బీఎన్‌పీఎల్/ఇప్పుడు కొని తర్వాత చెల్లించే సదుపాయం) సేవలను సైతం వీరు వినియోగిస్తున్నారు. స్వయం ఉపాధిలోని వారిలో 18%, వేతన జీవుల్లో 15% మంది బీఎన్పీఎల్ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఆకాంక్షలుగానే ఉన్న క్రెడిట్ కార్డులు, బీఎన్‌పీఎల్ సేవలు నేడు నిపుణుల నుంచి తాత్కాలిక ఉద్యోగుల వరకు.. ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారాయని థింక్360 వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌దాస్ తెలిపారు. డిజిటల్ రుణాల్లో ఫిన్‌టెక్‌లు పోషిస్తున్న ముఖ్య పాత్రను కూడా ఈ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది.ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుక్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని ఇటీవల పీడబ్ల్యూసీ అంచనా వేసింది. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు.

సిటీలో పెరిగిన నిరుద్యోగ రేటు
జూన్‌లో నిరుద్యోగిత (నిరుద్యోగం రేటు) ఫ్లాట్‌గా నమోదైంది. ఈ ఏడాది మే నెలలో మాదిరే జూన్‌లోనూ 5.6 శాతం వద్దే (అన్ని వయసుల వారికి సంబంధించి) కొనసాగింది. ఏప్రిల్‌లో ఉన్న 5.1 శాతం కంటే కొంచెం ఎక్కువ. కానీ, పట్టణాల్లో నిరుద్యోగ రేటు వరుసగా మూడో నెలలోనూ పెరిగింది. జూన్‌లో 7.1 శాతంగా నమోదైంది. ఈ మేరకు పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. పనిచేయగల అర్హతలు ఉండీ, పనిదొరక్క ఖాళీగా ఉన్న వారి గురించి ఈ గణాంకాలు తెలియజేస్తాయి. ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుపట్టణాల్లో అన్ని వయసుల వారికి సంబంధించిన నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. మేలో 6.9 శాతం, ఏప్రిల్‌లో 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. పట్టణాల్లో 15.29 సంవత్సరాల వారిలో నిరుద్యోగ రేటు జూన్‌లో 18.8 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 17.9 శాతంగా ఉంటే, ఏప్రిల్‌లోనూ 17.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు జూన్‌లో 5.6 శాతానికి తగ్గింది. మేలో ఇది 5.8 శాతంగా ఉంది. 15–29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగిత మే నెలలో 15 శాతంగా ఉంటే, జూన్‌లో 15.3 శాతానికి పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (15 ఏళ్లకు మించిన వారిలో) మే నెలలో ఉన్న 54.8 శాతం నుంచి జూన్‌లో 54.2 శాతానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50.4 శాతం చొప్పున జూన్‌లో నమోదైంది.పురుష కార్మికుల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 78.1 శాతం, పట్టణాల్లో 75 శాతం చొప్పున ఉంది. మే నెలతో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జూన్‌లో 35.2 శాతానికి తగ్గింది.గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల నిరుద్యోగ రేటు పెరగడానికి.. సొంత పనులపై ఆధారపడడం వల్లేనని ఈ సర్వే నివేదిక తెలిపింది.
ఫ్యామిలీ

చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్‌లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్‌లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్‌లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..)

అటు ఉల్లి ఒరుగులు, ఇటు మునగ పొడి : విదేశాల్లో గిరాకీ!
ఏ పంట పండించినా రైతులకు నికరంగా ఎంత ఆదాయం వస్తోంది అన్నదాన్ని బట్టే ఆ పంట మేలైనదా కాదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. రైతుకు నికరాదాయం పెరగాలంటే ఏ పంటలు పండించాలి? పొట్టపో΄సుకోవటానికి ఎంతోచ్చినా చాల్లే అని అందరూ పండించే సాధారణ పంటలు పండిస్తే లాభం లేదు. విదేశాలకు అవసరమైన పంటలేవో గ్రహించి పండించి, ఎగుమతి చెయ్యాలి. ఈ విషయంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. వాళ్లు పండించి ఎగుమతి చేస్తున్నవి ఇవీ: 1. తెల్ల ఉల్లిపాయ ఒరుగులు 2. మునగ ఆకుల పొడి!తెల్ల ఉల్లిపాయల ఒరుగులు అనాదిగా ఎగుమతి అవుతున్న సరుకు కాదు. ఇటీవల కాలంలోనే దీనికి విదేశాల్లో గిరాకీ వచ్చింది. ఆ అవకాశాన్ని అందరికన్నా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది గుజరాత్ రైతులే. ఆ తర్వాత మహారాష్ట్ర. విదేశాల్లో రెస్టారెంట్లు, హోటళ్లలో తెల్ల ఉల్లిపాయల ఒరుగుల్ని వాడుతున్నారు. అమెరికా, కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లో ఈ ట్రెండ్ నడుస్తోంది. తెల్ల ఉల్లి పాయలకు ఎర్ర ఉల్లి పాయల కన్నా 30% అధిక ధర ఇచ్చి వ్యాపారులు కొంటున్నారు. అందుకే ఇవి పండిస్తున్నా అంటున్నారు గుజరాత్ భావ్‌నగర్ జిల్లా రైతు రాహుల్. తెల్ల ఉల్లి ఒరుగులు మన దేశంలో కిలోకి రూ. 130 ధర ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో 2.5–3 డాలర్లు (రూ. 215–255) పలుకుతోంది. సరుకు నాణ్యత, దేశాన్ని బట్టి ధరల్లో మార్పుంటుంది. కొనే వారుంటే పండించే వారూ ఆసక్తి చూపుతారు. అలాగే తెల్ల ఉల్లి సాగు విస్తీర్ణం పెరుగుతూ వెళ్తోంది. మొత్తం ఉల్లి సాగు విస్తీర్ణంలో 40% తెల్ల ఉల్లిదే. గత ఏడాది గుజరాత్లో 81,011 హెక్టార్లు సాగైన ఉల్లి ఈ ఏడాది 93,500 హెక్టార్లకు పెరిగింది.ఇక రెండోది మునగ ఆకుల పొడి సంగతి. ప్రపంచంలో 80% మునగ సాగుతో భారత్ ముందుంది. మునగ సాగు, ఎగుమతిలో తమిళనాడు రైతులు అగ్రగామిగా ఉన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లో రైతులు కూడా దీనిపై దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకు పంజాబ్ రైతు పంకజ్ కుమార్. తోటి రైతులంతా వరి, గోధుమ పండిస్తుంటే ఆయన మాత్రం పదేళ్ల క్రితమే 1.5 ఎకరాల్లో మునగాకు పండించటం మొదలు పెట్టి, ఇప్పుడు పదెకరాలకు విస్తరించారు. జర్మనీ తదితర దేశాల్లో మునగాకు పొడికి గిరాకీ ఉంది. అందుకే మూడేళ్ల నుంచి అధిక సాంద్రతలో మునగాకును సాగు చేస్తున్నా అంటున్నారాయన. మునగ కొద్దిపాటి నీటి వసతితోనే వేగంగా పెరిగే పంట. అయితే, 6–10 ఏళ్ల తర్వాత పంట మార్పిడి చేయటం తప్పనిసరి అంటున్నారు సీనియర్ రైతులు. ఇంతకీ, ఇతర రాష్ట్రాల్లో రైతులు ముందున్నారా? అక్కడి ప్రభుత్వాలే రైతులచేత ముందడుగు వేయిస్తున్నాయా?? అని మనం ఆలోచించుకోవాలి. మనం ముందంజలో ఉండే పంటలు చాలా ఉన్నా.. ఈ రెండు పంటల విషయంలో ఇతర రాష్ట్రాలను చూసి మనమూ నేర్చుకుంటే మేలు!

పుట్టగొడుగులకు డిమాండ్, కిలో రూ. 1400
కొరాపుట్: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ ప్రారంభమైంది. వీటిని సేకరిస్తున్న వ్యక్తులు విక్రయించేందుకు జయపూర్ మార్కెట్‌కు మంగళవారం భారీగా తీసుకొని వచ్చారు. ఇప్పుడిప్పుడే పుట్టగొడుగులు లభ్యమవుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కిలో 1400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.చదవండి: ఇషా-ఆనంద్ లవ్, ప్రపోజల్ స్టోరీని రివీల్ చేసిన పాపులర్ సింగర్పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలుమష్రూమ్స్ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో అద్భుత లాభాలు ఉన్నాయి. విటమిన్ డి,డి2, పుష్కలంగా లభిస్తాయి.ఎముకలు, కండలకి బలంరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఇక్సిడెంట్స్ కారణంగా స్ట్రెస్ తగ్గుతుంది.మష్రూమ్స్లోయాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటితో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. దీంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.పుట్టగొడుగులు తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో పొటాషియం, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బీపిని అదుపులో పుంచుకునేందుకు సాయ పడతాయి. పుట్టగొడుగులతో కార్డియోవాస్క్యులర్ సమస్యలు తగ్గుతాయి. పుట్టగొడుగుల్లోని ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్ రక్తనాళాలని మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. సోడియం లెవల్స్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించిన వివరాలివి. అలాగే ఆరోగ్యకరమైన పుట్ట గొడుగులను మాత్రమే ఎంచుకోవాలి. కొన్ని విషపూరితమైన పుట్ట గొడుగులతో ప్రాణాలకు ముప్పు అని గమనించగలరు. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులు

తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
హిరమండలం: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అకస్మాత్తుగా కన్నుమూయడం తీరని విషాదాన్ని నింపింది. కొడుకు అయినా, కూతురైనా తానే అనుకుంటూ పుట్టెడు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. అలా తన తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది ఆ కుమార్తె. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం శ్యామలాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి జగదీష్ (49) కోళ్లఫారం నడుపుతున్నారు. కోళ్లఫారంలో ఉండగా ఆదివారం రాత్రి పాముకాటు వేయడంతో మృతి చెందారు. ఈయన కుమారుడు రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమార్తె లావణ్య లండన్‌లో ఉంటోంది. తండ్రి మరణంతో హుటాహుటిన బయలుదేరి స్వగ్రామానికి మంగళవారం చేరుకుంది. అన్నీ తానై అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇదీ చదవండి: Soumyashree అలసిపోయిన ప్రాణం: పాడె మోసిన గ్రామస్తులుబెల్ట్ షాపులపై గిరిజన మహిళల దాడి కొరాపుట్: బెల్ట్ షాపులపై గిరిజన మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బెనరా గ్రామ పంచాయతీ కాలిబెడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని స్థానిక మహిళలు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకపోవడంతో విసుగెత్తిపోయిన మహిళలు భారీ సంఖ్యలో వెళ్లి ఆ గ్రామంలోని బెల్టుషాపులు తనిఖీ చేసి మద్యం సీసాలు పగలగొట్టారు.
ఫొటోలు
అంతర్జాతీయం

Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారుయాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు.

జిన్‌పింగ్‌తో జైశంకర్ భేటీ.. కీలక అంశాలివే..
బీజింగ్: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుసుకుని, భారత్-చైనాల మధ్య సంబంధాలపై చర్చించారు. 2020లో భారత్- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత జైశంకర్ మంగళవారం తొలిసారి చైనాలో పర్యటించారు.జిన్‌పింగ్‌తో సమావేశానికి సంబంధించిన ఒక ఫొటోను జైశంకర్ ‘ఎక్స్’లో పంచుకుంటూ, భారత్- చైనా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిపై జిన్‌పింగ్‌తో మాట్లాడానని, దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. జిన్‌పింగ్‌ను జైశంకర్ కలిసినప్పుడు ఆయనతోపాటు ఎస్సీఓ సభ్య దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. 2020లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి గాల్వాన్ లోయలో తలెత్తిన ఘర్షణల కారణంగా సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తాయి. Called on President Xi Jinping this morning in Beijing along with my fellow SCO Foreign Ministers. Conveyed the greetings of President Droupadi Murmu & Prime Minister @narendramodi. Apprised President Xi of the recent development of our bilateral ties. Value the guidance of… pic.twitter.com/tNfmEzpJGl— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2025జైశంకర్ బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలుసుకున్నారు. భారత్- చైనాల మధ్య చర్చలు జరగాలని కోరారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి భారత్- చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడుతూ వస్తున్నాయి. 2024 అక్టోబర్‌లో కజాన్‌లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. అనంతరం లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్లలో సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రణాళికను భారత్-చైనాలు ప్రకటించాయి.

ట్రంప్ సర్కార్‌కు భారీ ఊరట.. ఆ 1,400 మంది తొలగింపునకు లైన్ క్లియర్
తీవ్ర ఉత్కంఠ నడుమ.. అమెరికా సుప్రీం కోర్టులో ట్రంప్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఆ దేశ విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆ శాఖకు సంబంధించిన 1,400 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ముమ్మురం చేయనున్నారు.ఎన్నికల ప్రచారం నుంచే విద్యాశాఖను మూసివేయాలని ట్రంప్ భావిస్తూ వస్తున్నారు. మార్చి 11వ తేదీన విద్యాశాఖలో సగానికి పైగా ఉద్యోగుల భారం తగ్గించుకోనున్నట్లు కార్యదర్శి లిండా మెక్ మహోన్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. 21వ తేదీన విద్యాశాఖ(Department of Education) మూసివేత ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. నాలుగు దశాబ్దాలుగా భారీగా ఖర్చు చేస్తున్నా అమెరికాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదని, ఇంకా యూరప్ దేశాలు.. చైనా కంటే వెనుకబడే ఉన్నామని, కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారాయన. అయితే.. విద్యార్థులకు ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలు మాత్రం కొనసాగిస్తామని అన్నారాయన.మార్చి-మే మధ్యలో.. మొత్తం 1,400 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించారు. ఇది మొత్తం ఉద్యోగుల్లో సగానికి సగం. మిగతా సగాన్ని పెయిడ్ లీవ్‌లో ఉంచి.. ఇతర విభాగాల్లోకి సర్దుబాట చేయడం ముమ్మరం చేశారు. ఈలోపు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై డెమెక్రట్స్తో పాటు మసాచుసెట్స్ పబ్లిక స్కూల్ సిస్టమ్స్ & యూనియన్స్ పిటిషన్లు వేశాయి.అయితే మే 22వ తేదీన బోస్టన్ ఫెడరల్ కోర్టు ఉద్యోగుల తొలగింపును నిలిపివేయాలని ఆదేశించింది. తొలగించిన వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిందేనని జడ్జి యోంగ్ జోన్ ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ యూఎస్ సర్క్యూట్ కోర్టు(బోస్టన్)ను ట్రంప్ ప్రభుత్వం ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. ఈ క్రమంలో..సుప్రీం కోర్టు జులై 14న కింది కోర్టు ఇచ్చిన నిలుపుదల ఆదేశాలను పక్కనపెడుతూ.. విద్యాశాఖను రద్దు చేసే ప్రక్రియ కొనసాగించవచ్చని 6-3 తేడాతో ఎమర్జెన్సీ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి వివరణను తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు చదివి వినిపించకపోవడం గమనార్హం. కోర్టు నిర్ణయాన్ని అమెరికకా విద్యాశాఖ కార్యదర్శి లిండా మెక్ మహో స్వాగతించారు. అయితే ఈ తీర్పు రాజ్యాంగానికి ముప్పు కలిగించొచ్చని, విద్యా రంగానికి హాని కలిగించే అవకాశం ఉందని తీర్పును వ్యతిరేకించిన ముగ్గురు న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.లిండా.. ఫస్ట్ అండ్ లాస్ట్ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. మార్చి 3వ తేదీన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సీఈవో లిండా మెక్ మహోన్(Linda McMahon) విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. మార్చి 3వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే.. విద్యాశాఖ రద్దు ఫైల్‌పై సంతకం చేసే సమయంలో అమెరికాకు లిండా మెక్ మహోన్నే చివరి విద్యాశాఖ కార్యదర్శి కావొచ్చని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఎందుకీ నిర్ణయమంటే..అమెరికాలో 1979 నుంచి విద్యాశాఖ విభాగాన్ని ఫెడరల్ గవర్నమెంట్ చూసుకుంటోంది. విద్యాశాఖ నిర్వహణలో పరిమితమైన పాత్రే పోషిస్తున్నప్పటికీ.. ఫండింగ్ విషయంలో మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకు విద్యాశాఖ రద్దు నిర్ణయానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారు. ఎన్నికల సమయంలో తన ప్రచారంలోనూ ట్రంప్ ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించడం తెలిసిందే. అయితే.. తాజా ట్రంప్ ఆదేశాలతో ఇక నుంచి స్టేట్స్(రాష్ట్రాలు) ఆ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇటు డెమోక్రట్లు, అటు విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇది ట్రంప్ తీసుకున్న మరో వినాశకార నిర్ణయమని డెమోక్రట్ సెనేటర్ చుక్ షూమర్ అభిప్రాయపడుతున్నారు.

Donald Trump: ‘అణు యుద్ధాన్ని ఆపాను’: భారత్- పాక్‌లపై అదే మధ్యవర్తిత్వ వాదన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్- పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించానని వాదించారు. తన చొరవతో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన ఘర్షణను ఆపానని పేర్కొన్నారు. ‘యుద్ధాలను పరిష్కరించడంలో మేము విజయవంతం అయ్యాం. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ ఉన్నాయి. ఇవి నాడు మరో వారంలోనే అణు యుద్ధనికి దిగేవి, అది చాలా ఘోరంగా జరిగివుండేది. దానిని మేము ఆపాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. #WATCH | US President Donald Trump says, "We have been very successful in settling wars. You have India, Pakistan...India and Pakistan would have been a nuclear war within another week, the way that was going. That was going very badly. We did that through trade. I said, we're… pic.twitter.com/GPDA6ObK0B— ANI (@ANI) July 15, 2025వాణిజ్యాన్ని పరపతిగా ఉపయోగించుకుని, తన వ్యూహాన్ని అమలు చేశానని.. సంఘర్షణను పరిష్కరించే వరకు మీతో వాణిజ్యం గురించి మాట్లాడబోమని చెప్పడంతో భారత్- పాక్ మధ్య యుద్ధం ముగిసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా ట్రంప్ గత జూన్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారత్- పాకిస్తాన్ మధ్య తలెత్తబోయే అణు యుద్ధాన్ని పరిష్కరించానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్, భారత్‌లతో మాట్లాడానని, అక్కడి నేతలు అణ్వాయుధాలతో దాడి చేసుకోగలిగే సమర్థత కలిగినవారని ట్రంప్ పేర్కొన్నారు.అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన వాదనలను భారతదేశం ఇంతకుముందే తోసిపుచ్చింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి కాల్పుల విరమణ, సైనిక చర్యపై అవగాహన కుదిరే వరకు భారత్- అమెరికా నేతల మధ్య సంభాషణలు జరిగాయని, దేనిలోనూ ఇటువంటి మధ్యవర్తిత్వ ప్రస్తావన లేదని భారత్ స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది.
జాతీయం

‘టిట్ ఫర్ టాట్’: చలానా వేసిన పోలీసులు.. వాహనదారుడి అదిరిపోయే కౌంటర్!
ఫిరోజాబాద్: ఒకరు మనతో ఎలా వ్యవహరిస్తారో వారితో అదే మాదిరిగా వ్యవహరించడాన్ని ‘టిట్ ఫర్ టాట్’(దెబ్బకు దెబ్బ) అని అంటారు. దీని అర్థం ఎవరైనా మనకు దొంగ దెబ్బ తీసినప్పుడు వారికి అదే రీతితో సమాధానం ఇవ్వడం అన్నమాట. లౌక్యం కలిగిన వారు ఈ మాట తరచూ చెబుతుంటారు. అయితే దీనిని ఒక ఎలక్ట్రీషియన్ ఆచరించి చూపారు. ఇప్పుడు ఈ ఉదంతం వైరల్‌గా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషియన్ తనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎదురైన చేదు అనుభవాకి టిట్ ఫర్ టాట్ రీతిలో సమాధానం ఇచ్చారు. ఒకరోజు శ్రీనివాస్ తన ఉద్యోగ విధుల్లో అత్యవసరంగా బైక్‌పై వెళుతున్న సమయంలో, హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతనికి రూ. 500 జరిమానా విధించారు. తన అత్యవసర పని గురించి వారికి చెప్పినప్పకీ, వారు ఏమాత్రం వినకుండా శ్రీనివాస్ చేతిలో జరిమానా రసీదు పెట్టారు. Fearless man☠️ pic.twitter.com/Y458CvTLHc— Aditya Tiwari ❤️👻 (@aditiwari9111) July 15, 2025దానిని ఆన్లైన్లో చెల్లించిన శ్రీనివాస్ తన ఇబ్బందిని గుర్తించని ట్రాఫిక్ పోలీసులకు తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. తనకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2016 నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని శ్రీనివాస్ కనుగొన్నారు. అది రూ. 6.6 లక్షలకు చేరుకున్న విషయాన్ని శ్రీనివాస్ గుర్తించారు. వెంటనే అతను ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఐదు గంటలపాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది చీకటిలో ఉండేలా చేశాడు. పెండింగ్‌లో ఉన్న బకాయిల కారణంగానే ఈ పనిచేశామని, ఇది ప్రతీకారం కాదని శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బందికి తెలియజేశారు. కాగా శ్రీనివాస్‌కు నెలల తరబడి జీతం రావడంలేదని, అతని జీతం నెలకు రూ. 6,000 మాత్రమేనని, అందుకే అతనికి ట్రాఫిక్ జరిమానా చెల్లించడం భారంగా మారిందని అతని స్నేహితులు చెబుతున్నారు.

మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ మృతి కేసు.. ఎన్ఆర్ఐ అరెస్ట్
ఛండీగఢ్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత దిగ్గజ మారథాన్ అథ్లెట్ ఫౌజా సింగ్ కేసులో ఎన్ఆర్ఐ అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్(30)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన అమృత్‌పాల్ సింగ్‌ను కర్తార్‌పుర్‌లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అతడు కెనడా నుంచి భారత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు నడిపిన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరికాసేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంతరం రిమాండ్‌కు తరలించనున్నారు.ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏళ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచిన ఈ పంజాబ్ పుత్తర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేళ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజాసింగ్ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్ కెరీర్ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్.. ‘టర్బన్ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేళ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏళ్ల అథ్లెటిక్స్ కెరీర్లో తొమ్మిది మారథాన్ రేసుల్లో పోటీపడటం విశేషం.The world's oldest marathon runner, Fauja Singh, has died at the age of 114. He was involved in a hit-and-run near Jalandhar, India.Singh began running at 89 and ran nine full marathons - and was one of the 2012 London Olympic torchbearers. pic.twitter.com/kvevQ84FaD— Channel 4 News (@Channel4News) July 15, 2025తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్ను 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్ మారథాన్.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్‌లో డ్రగ్స్ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్ అకాల మృతి అందరినీ కలిచివేసింది.

రాహుల్.. ప్రధాని అవుతారని మీకు తెలుసా?: బాంబే హైకోర్టు
ముంబై: హిందూత్వ నాయకుడు వీర్ సావర్కర్ గురించి చదివి అవగాహన పెంచుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. సావర్కర్ గురించి రాహుల్‌గాంధీ చేసిన బాధ్యతారహిత ప్రకటనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పిటిషనర్, అభినవ్ భారత్ కాంగ్రెస్ అనే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పంకజ్ కుముద్‌చంద్ర ఫడ్నిస్ ఆరోపించారు. ఆయన ప్రధానమంత్రి అయితే, అప్పుడు విధ్వంసం సృష్టిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ‘మీ పిటిషన్లో అధ్యయనం చేయమని ఆదేశించాలంటూ మీరు కోరారు. కోర్టు చదవమని అతన్ని ఎలా బలవంతం చేస్తుంది?’ అని ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి సందీప్ మార్నేలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాదు.. ఆయన ప్రధాని అవుతారని మాకు తెలియదు.. మీకు తెలుసా? అని ప్రశ్నించింది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసుకునే చట్టపరమైన మార్గం పిటిషనర్‌కు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో వీర్ సావర్కర్ మవనడు పుణే కోర్టును ఆశ్రయించారని, విచారణ జరుగుతోందని ధర్మాసనం వెల్లడించింది.

ఐదు నెలలు.. 7000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం 5 నెలల వ్యవధిలో అక్షరాలా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. దీనిని బట్టి చూస్తే మే– జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ ఫ్రాడ్ మొదలు డిజిటల్ స్కాం వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్న నేరగాళ్లు లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని నిఘా విభాగం స్పష్టం చేసింది.ఐ4సీ ఏం చెబుతోందంటే.. దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని వివిధ దేశాలకు చెందిన సైబర్ నేరాలకు వివిధ దేశాలకు చెందిన వారు పాల్పడుతున్నారని హోంశాఖ గుర్తించింది. వివిధ మార్గాల్లో డబ్బు కొట్టేస్తున్న వాళ్లంతా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు చెందిన వారేనని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) డేటా తేలి్చంది. వీరి వెనుక ఉన్నది మాత్రం చైనీయులేననేది ఐ4సీ స్పష్టం చేస్తోంది. నెలకు రూ. వెయ్యి కోట్ల వసూళ్లే లక్ష్యంగా వీరు అమాయకులను ఉచ్చులోకి దించుతున్నట్లు తెలిపింది.డబ్బంతా వెళ్లేది అటే.. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) డేటా ప్రకారం దేశంలో జనం నుంచి కొట్టేసిన డబ్బంతా ఆగ్నేయాసియా దేశాలకు వెళుతున్నట్లు వెల్లడైంది. జనవరిలో రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ స్కాం, పోలీసులమని చెప్పి కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం, క్రిప్టో కరెన్సీ, లాటరీ స్కాం, క్రెడిట్ కార్డు పాయింట్స్ క్లెయిం, ఈ నెంబర్‌పై ఆఫర్ ఉంది కారు గిఫ్ట్‌గా వస్తుందని చెప్పడం, పెళ్లి చేసుకోవడానికి యూఎస్ నుంచి వస్తున్నట్లు నమ్మబలకడం, లింకులు పంపి డబ్బు కొట్టేయడం తదితర మార్గాల్లో జనం నుంచి లాగేస్తున్నారు.మన వాళ్లే ఏజెంట్లు సైబర్ నేరాల పేరుతో అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకోవడం గమనార్హం. ఇటీవల ఈ విషయాలు వివిధ రాష్ట్రాల పోలీసుల దర్యాప్తులు తేలాయి. మహారాష్ట్ర, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఏజెంట్లు సైబర్ నేరగాళ్ల సహకరిస్తున్నారు. చైనా నుంచి కీలక వ్యక్తుల సూచనలు.. మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌లకు దేశాల నేరగాళ్ల ఆదేశాలతో మనవాళ్లు నేరాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, వీరి ఉచ్చులో పడొద్దని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా కేటుగాళ్లఉచ్చులో జనం పడుతుండటం గమనార్హం.
ఎన్ఆర్ఐ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!

లండన్‌లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

గండికోట బాలిక కేసులో మరో కొత్త మలుపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: గండికోటలో బాలిక హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ప్రియుడు లోకేష్.. బాలికను హత్య చేయలేదని కర్నూలు రేంజ్ డీఐజీ తేల్చి చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. మరో వైపు బాలిక సోదరుడే హత్య చేశాడంటూ చేస్తున్న ప్రచారం దారుణమని తల్లిదండ్రులు అన్నారు. ఎవరైనా చెల్లిని వివస్త్రను చేసి హత్య చేస్తాడా అంటూ ప్రశ్నించారు. బాలిక సోదరుడు సురేంద్ర పరువు కోసం హత్య చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్రను తల్లిదండ్రులు కొట్టి పారేస్తున్నారు.లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి: వైష్ణవి తల్లితన బిడ్డను హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ వైష్ణవి తల్లి పసుపులేటి దస్తగిరమ్మ అన్నారు. నా బిడ్డను కోల్పోయిన బాధలో నేనున్నా.. కొన్ని మీడియా ఛానళ్లు మా పై పనిగట్టుకొని వార్తలు రాస్తున్నాయి. మేమి చెప్పినవి వేయడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నారు. పాప కనిపించడం లేదని తెలిస్తే వెతుకులాడటం మేము చేసిన తప్పా.సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? సొంత చెల్లెలిని అన్న చంపుతాడా? మరీ ఇంత క్రూరంగా వివస్త్రను చేసి చంపుకుంటామా...? అత్యాచారం జరగలేదంటే పాప ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయి.?పోలీసులు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలి. నిజానిజాలు తెలియపరచాలి. మాకు న్యాయం జరగాలి. అనుమానితున్ని తెలియపరిచాం. లోకేషే నా బిడ్డను చంపాడు. మాకు న్యాయం జరగాలంటే లోకేష్‌ని ఎన్కౌంటర్ చేయాలి. నాకు జరిగిన అన్యాయం ఇంకో తల్లికి జరగకూడదు’’ అంటూ వైష్ణవి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూల్ రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న గండికోటలో విద్యార్థి వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని.. బాలికపై ఎటువంటి హత్యాచారం జరగలేదన్నారు. మాకు ఇవాళ కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయి. రాత్రి 9.00 గంటలకు జిల్లా ఎస్పీ, జమ్మలమడుగు డీఎస్పీ పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తారు’’ అని ఆయన తెలిపారు.

‘అయ్యోపాపం.. గణేశ్ ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’
పెద్దపల్లిరూరల్: ‘అయ్యోపాపం.. అన్నెంపున్నెం ఎరగని గాండ్ల గణేశ్(37) ప్రాణం గాలిలో కలిసి పోయిందా?’ అని రాఘవాపూర్ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు, గ్రామ స్తుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్క్రాప్ వ్యాపారం చేసే పస్తం జంపయ్య వద్ద గాండ్ల గణే శ్ పదేళ్లకుపైగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జంపయ్య కుటుంబంలోనూ ఆ యన ఒకడిగా ఉంటున్నాడు. మంగళవారం జంపయ్య సోదరి లక్ష్మి, బావ మారయ్య పంచాయితీకి ఇతను కూడా సుగ్లాంపల్లి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. గతంలో మాదిరిగానే ఇదికూడా సా ధారణ పంచాయితీగానే ఉంటుందని భావించా డు. అనూహ్యంగా జరిగిన కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.జీతమే ఆధారం..నిరుపేద కుటుంబీకుడైన గాండ్ల గణేశ్ రాఘవాపూర్ గ్రామంలో అందరితో మర్యాదగా ఉంటాడు. యజమాని ఇచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. భార్య రజిత, కూతురు రిత్విక(4) ఉన్నారు. స్క్రాప్ వ్యాపారం సాగించే పస్తం జంపయ్య వద్ద సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తుంటాడు.మాకు దిక్కెవరు?‘అయ్యో.. వివాదంతో ఏసంబంధం లేనితన భర్త ను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు.. ఇక మాకు దిక్కెవర’ని మృతుడు గణేశ్ భార్య రజిత రోదించిన తీరు కలచివేసింది. నాలుగేళ్ల పాపతో ‘నువు లేకుండా ఎలా బతికేద’ని విలపిస్తున్న తీరు స్థానికులను చలింపజేసింది.పరిహారం చెల్లింపు!జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న గాండ్ల గణేశ్ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఏ ఆధారం లేకుండా పోయిందని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని గ్రామపెద్దలు, బంధువులు డిమాండ్ చేశారు. ఇరువర్గాల మధ్య జరిపిన చర్చల్లో అంత్యక్రియల కోసం రూ.లక్షతో పాటు కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం.పెగడపల్లిలో విషాదంకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సుగ్లాంపల్లిలో జరిగి న భార్యాభర్తల పంచాయితీ ఘర్షణలో మోటం మల్లేశం మృతి చెందడంతో పెగడపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. మల్లేశం బతుకుదెరువు కోసం సుమారు 15 ఏళ్ల క్రితం పెగడపల్లి గ్రామానికి వలస వచ్చాడు. బోళ్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓదెల, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ముత్తారం మండలాల్లో వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం చేపట్టిన సొంతింటి నిర్మాణం చివరి దశలో ఉంది. గృహప్రవేశం చేయాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు హతాశులయ్యారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, మాజీ సర్పంచ్ సుజాత, కాంగ్రెస్ నాయకులు మియాపురం సతీశ్ తదితరులు సంతాపం ప్రకటించారు.

బామ్మర్ది భార్యతో బావ వివాహేతర సంబంధం..!
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: భర్త వేధింపులతో విసిగిపోయిన మహిళ తన సోదరుడు, ప్రియుడితో కలిసి అతడిని కారుతో ఢీకొట్టించి చంపి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు ఈ ఘటనపై అనుమానంతో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ మంగళవారం యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. అసలు జరిగింది ఇదీ..ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు. స్వామి భార్య స్వాతి కూడా భువనగిరి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఎస్ఎన్ మోటార్స్‌లో పనిచేసేది. ఆ పక్కనే మార్బుల్ దుకాణంలో పనిచేసే తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్‌తో స్వాతికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత స్వాతి పనిచేసే ఎస్ఎన్ మోటార్స్ మూతపడింది. ఈ క్రమంలో స్వాతి పల్లెర్ల గ్రామానికి వచ్చి ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల తర్వాత స్వామికి భువనగిరి నుంచి మోత్కూరుకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో స్వామి తన భార్య స్వాతిని తాను పనిచేసే ట్రాక్టర్ షోరూంలోనే ఉద్యోగంలో చేర్పించాడు. గొడవలు ఇలా..స్వాతి సోదరుడు మహేశ్‌కు ఇద్దరు భార్యలు. మహేష్ మొదటి భార్యతో స్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మహేష్‌కు తెలియడంతో తన బావ స్వామిపై కోపం పెంచుకున్నాడు. స్వామికి వరుసకు సోదరి అయిన తన భార్యతో సంబంధం పెట్టుకున్న విషయాన్ని మహేష్ స్వాతితో చెప్పాడు. దీంతో స్వాతి తన భర్త స్వామిని నిలదీసింది. నన్నే నిలదీస్తావా అంటూ స్వామి స్వాతిని మానసికంగా, శారీరకంగా వేధించడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో స్వామి, స్వాతి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఫిబ్రవరిలో పని నిమిత్తం మోత్కూరుకు వెళ్లిన సాయికుమార్‌కు అక్కడ స్వాతి కలిసింది. తన భర్త వేధిస్తున్న విషయాన్ని స్వాతి సాయికుమార్‌కు వివరించింది. సాయికుమార్ స్వాతిని ఓదార్చాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అక్క స్వాతి, సాయికుమార్ వివాహేతర సంబంధానికి మహేష్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్వాతి, మహేష్ నిర్ణయించుకున్నారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటుస్వామిని హత్య చేయడానికి సాయికుమార్, స్వాతి, మహేష్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలుగా వాట్సాప్ గ్రూపులోనే మాట్లాడుకుని తర్వాత కాల్స్ డిలీట్ చేసేవారు. స్వాతి తన ప్రియుడు సాయికుమార్ నంబర్‌ను కూడా సెల్ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు. కారు అద్దెకు తీసుకుని..ఈ నెల 13న తన భర్త స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేష్‌కు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై భువనగిరిలో నిఘా పెట్టారు. స్వామిని హత్య చేయడానికి పథకం ప్రకారం సాయికుమార్.. తన స్నేహితుడైన భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును సెల్ప్ డ్రైవింగ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ తన స్నేహితుడు మద్దికుంట వీరబాబుతో కలిసి బైక్‌పై పల్లెర్ల గ్రామానికి బయల్దేరాడు. స్వామిని సాయికుమార్ కారులో వెంబడించాడు. రాత్రి 11.15 గంటల సమయంలో మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ శివారులోకి రాగానే కారుతో బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును ఢీకొట్డడంతో స్వామి అక్కడిక్కడే మృతిచెందగా.. బైక్‌పై వెనుక కూర్చున్న వీరబాబుకు గాయాలయ్యాయి. కారు అతివేగంగా వెళ్లి బైక్‌ను ఢీకొట్టిన అనంతరం కంట్రోల్ కాలేదు. రోడ్డు కిందకు 50 మీటర్ల వరకు దూసుకుపోయింది. అక్కడ ఫెన్సింగ్ కడీలకు తగిలి ముందుకు కదలకుండా ఆగిపోయింది. సాయికుమార్‌కు çస్వల్పంగా గాయాలయ్యాయి. స్వామిని హత్య చేసేందుకు ప్లాన్ అమలు చేస్తున్న సమయంలో మహేష్, స్వాతి, సాయికుమార్ వాట్సాప్ గ్రూప్ కాల్లో మాట్లాడుకున్నారు. వాట్సాప్ కాల్లో స్వామిని కారుతో ఢీకొట్టి చంపేశామన్న విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న స్వాతి తమ్ముడు మహేశ్ ద్విచక్ర వాహనంపై ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాయికుమార్, రామలింగస్వామిని బైక్‌పై ఎక్కించుకుని భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు. ఆస్పత్రికి వచ్చిన భార్య, బావమరిది ఘటనా స్థలంలో స్వామి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా ఫోన్లో విషయం తెలుసుకున్న స్వాతి, మహేష్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.నిందితుల అరెస్ట్గుంటి సాయికుమార్, స్వాతి, పొట్టెపాక మహేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు భునగిరి డీసీపీ ఆకాం„Š యాదవ్ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ శంకర్‌గౌడ్, మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్‌యాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కారుతో.. కదిలిన డొంకరోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న మోటకొండూర్ ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారులో ముందు భాగం దెబ్బతినడంతో కారు నంబర్ ఆధారంగా కారు యజమానికి ఫోన్ చేసి విచారించగా.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకెళ్లాడని సమాచారం ఇచ్చాడు. దీంతో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. సాయికుమార్ సెల్‌ఫోన్ చెక్ చేయగా స్వాతి నంబర్ కనిపించింది. దీంతో స్వాతిని తీసుకొచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నిందితులు స్వామి కాళ్లు, చేతులు విరిచి దివ్యాంగుడిని చేయాలనుకున్నారని తెలిసింది. అయితే అదికాస్త వికటించి అతడు మృతిచెందాడు.

భర్తకు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి..
వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.