న్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి రూ.13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథాకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం ఉదయం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అన్నదాతలకు అండగా ఉంటానని ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాతలకు చేయూతనిచ్చే రైతు భరోసా పథకాన్ని మాట ఇచ్చిన నెల్లూరు జిల్లా నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి అన్నదాతల విశ్వసనీయతను సీఎం వైఎస్ జగన్ చూరగొన్నారు.