ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కొత్త ఇసుక విధానం
Published Fri, Jul 5 2019 7:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement