మా నాయకుడుకి న్యాయం జరగాలి | attack on ys jagan-ysrcp 48hrs deeksha in visakhapatnam | Sakshi
Sakshi News home page

మా నాయకుడుకి న్యాయం జరగాలి

Published Mon, Nov 5 2018 11:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

వైఎస్సార్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై థర్డ్‌ పార్టీతో విచారణ చేపట్టాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి శరత్‌చంద్ర 48 గంటల నిరహారదీక్ష చేపట్టారు. జీవీఎంసీ గాంధీ పార్కులో ఆదివారం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ హాజరై సంఘీభావం తెలిపారు. మళ్ల మాట్లాడుతూ హత్యాయత్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీబీఐతో విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసలు నిందితులను తక్షణమే బయటపెట్టాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నీచ రాజకీయాలు చేయడానికి చంద్రబాబు వెనుకాడడని అన్నారు. సిట్‌పై తమకు నమ్మకంలేదని, థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు స్వలాభం కోసం కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడం దారుణమన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement