ఆధార్ గుర్తింపు కార్డుతో పాన్ కార్డు అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న ఈ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2018)మార్చి 31 వరకు పొడగిస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు గడువును మార్చి 31, 2018 వరకు పొడిగించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.