pan link
-
పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్‌తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్‌కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్‌గా మారిపోయాయి. -
‘లింక్’ కోసం డబ్బులా?
పాన్ కార్డును ఆధార్‌కు అనుసంధానం (లింక్) చేయనందుకు కేంద్ర ప్రభుత్వం జరిమానా విధించడం న్యాయం కాదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ జూన్ నెలాఖరు వరకు ఈ లింక్‌ను చేయించుకోవడానికి అనుమతిస్తూ రూ. 1,000 జరిమానాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికితోడు.. లింక్ చేయడానికి వంద, రెండు వందల రూపాయలు ‘మీ సేవా’ కేంద్రాలలో తీసుకొంటున్నారు. పాన్ కార్డు అంటేనే సామాన్యులలో అత్యధికులకు తెలియదు. పాన్ కార్డు ఆధార్‌కు లింకు చేయక పోతే జూలై నుంచి తమ బ్యాంకు ఖాతా రద్దవుతుందని ఇంకా ఎక్కువ మందికి తెలియదు. ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి రానివారి పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం ఏమిటని చాలామంది మధ్యతరగతివారు ప్రశ్నిస్తున్నారు. అనేక మంది సామాన్యుల దగ్గర ఈ విషయాలను ప్రస్తావిస్తే తమకు ఈ విషయాలేవీ తెలియవన్నారు. ఈ సంగతి సామాన్యులకే కాదు. నిత్యం పేపర్లు చదివేవారికి, టీవీ వార్తలు చూసేవారికి కూడా తెలియక పోవడం గమనార్హం. అంటే ఆధార్‌కు పాన్‌ను లింక్ చేయాలనే విషయంపై తగిన ప్రచారం జరగలేదన్నమాట. విస్తృత ప్రచారం చేయకుండా జరిమానా వేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకోవడం గర్హనీయం. జీరో ఎకౌంట్ వల్ల, డ్వాక్రా గ్రూపుల వల్ల ప్రతి కుటుంబానికి కనీసం రెండు బ్యాంకు ఎకౌంట్లు ఉన్నాయి. బ్యాంకులలో జీరో ఎకౌంటు తెరిచి లావాదేవీలు జరిపితే పది వేల రూపాయల వరకు అప్పు ఇస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది అమలుకు నోచుకోలేదు. జీరో ఎకౌంట్లో కూడా కనీస నగదు ఉంటేనే లావాదేవీలు జరుగుతాయని బ్యాంకు అధికారులు అనడంతో ఖాతాదారులు కనీస నగదును ఎకౌంట్లో ఉంచవలసి వచ్చింది. దీంతో బ్యాంకులకు కోట్లాది రూపాయలు చేరినట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు మాత్రం 10 లక్షల కోట్ల రూపాయల పైగా రుణమాఫీ చేశారు. కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచీ 22 శాతానికి తగ్గించారు. కాకులను కొట్టి గద్దలకు వేయడమంటే ఇదే! సామాన్యుని పాన్ కార్డ్‌ను ఆధార్‌కు లింకు చేయాలనే నిబంధనను రద్దు చేయాలి. లేదా జరిమానా రద్దు చేయాలి. – బి.బి. రామకృష్ణారావు; సామర్లకోట, కాకినాడ జిల్లా -
పాన్ లింక్ చేయకపోతే ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుందా?
పాన్ నంబర్ అప్డేట్ చేయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) యోనో అకౌంట్లు బ్లాక్ అవుతాయని, వెంటనే అప్డేట్ చేసుకోవాలంటూ లింక్‌తో కూడిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఎస్బీఐ ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఇవి పూర్తిగా ఫేక్ అని తేల్చింది. ఒక వేళ అకౌంట్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉన్నా ఎస్బీఐ అలాంటి లింక్‌లను పంపదని పేర్కొంది. ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడానికి ఎస్బీఐ అనేక సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. దీని ద్వారా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను చేసుకోవచ్చు. అయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్ కార్డ్ నంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్ చేయకూడదని కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ నేరాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచార భద్రత గురించి ఎస్బీఐ కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్ల ద్వారా పంపిన లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, తెలియని కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించి ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయకూడదని సూచించింది. తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌ను నమ్మొద్దని, ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. (ఇదీ చదవండి: అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?) -
ఆధార్-పాన్ అనుసంధానం గడువు పెంపు
-
60సెకన్లలో పాన్-ఆధార్ అనుసంధానం
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ కొత్త నిబంధనల ప్రకారం పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీచేసిన ఆదేశాల ప్రకారం ఆధార్‌తో పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను లింకు చేయడం జులై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. జులై 1, 2017లోపు పాన్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఆధార్‌తో లింకు చేయాల్సిందేనని ఆదాయ శాఖ స్పష్టంచేసింది. ఇప్పటికే 2 కోట్ల 7 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ తమ పాన్‌ను ఆధార్‌తో లింకు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ లింకింగ్ ప్రక్రియ ఎలాగో ఒకసారి చూద్దాం. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారయితే ఇన్ కమ్ టాక్స్ కట్టే వాళ్లు అయితే..మీరు ఇదివరకే రిజిస్టర్డ్ యూజర్ అయితే.. www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ హియర్ (Registerd User Login Here).. అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. యూజర్ ఐడి, పాస్ వర్డ్ తోపాటు అక్కక డిస్ప్లే అయ్యే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్ తో పాన్ ను లింక్ చేసే ఫారమ్ ఓపెన్ అవుతుంది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే .. సక్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ అనే మెసేజ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.. ఒకవేళ మీరు రిజిస్టర్డ్ యూజర్స్ కాకపోతే... www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ (New to e-filling Register yourself) అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. మీ వివరాలు ఎంటర్ చేయండి. మీకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. తర్వాత ఆ వివరాలతో లాగిన్ అయి.. ఆధార్, పాన్ ను లింక్ చేయండి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారికి వీరికి ఈ ప్రక్రియ మరింత సులువు..మొత్తం కేవలం 60 సెకన్లలో పూర్తవుతుంది. ముందుగా www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ లో కి వెళ్లాలి. ఆధార్ లింకింగ్ విత్ పాన్ మేడ్సింపుల్..క్లిక్ హియర్ (Aadhaar Linking With Pan Made Simple.. Click Here) అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.. తర్వాత త్రి కాలమ్స్‌తో ఉన్న టేబుల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వున్న ప్రకారం నిర్దేశిత కాలమ్ లో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు (ఆధార్ లో ఉన్న విధంగా), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అంతే... స్క్రీన్ పై సక్సెస్ ఫుల్లీ ఆధార్ లింక్ డ్ విత్ పాన్ (Successfully Aadhaar Linked with Pan) అనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్ రాకపోతే మనం ఎంట్రీ చేసిన వివరాలను మళ్లీ ఒకసారి సరి చూసుకుంటే..చాలు. ఆధార్ ను పాన్ తో లింక్ పూర్తవుతుంది.