కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి | Father murders Daughter in hyderabad | Sakshi
Sakshi News home page

కూతురిని గొంతుకోసి చంపిన తండ్రి

Published Thu, Aug 23 2018 10:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యక్తి తన కూతురి గొంతుకోసి దారుణంగా చంపాడు. నాలుగేళ్ల క్రితం వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విజయ అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె అత్త చనిపోవడంతో ఈ నడుమ తిరిగి ఇంటికి వచ్చింది.

వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుని తన పరువు తీశావంటూ తండ్రి ఆమెను గొంతు కోసి చంపి అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement