దేశంలో మూక హత్యలు ఆగడం లేదు. తాజగా మణిపూర్‌లో చోటుచేసుకున్న మూకహత్య ఆ ప్రాంతంలో మతఘర్షణలకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. తౌబాల్ జిల్లాలో లిలాంగ్ చెందిన 26 ఏళ్ల ఫరూఖ్ ఖాన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఫరూఖ్ ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో థరోజమ్ గ్రామానికి చేరుకోంది. అయితే ఫరూఖ్‌ను, అతని స్నేహితులను వాహనాల దొంగలుగా భావించిన ఆ గ్రామస్తులు వారిపై దాడికి దిగారు. వారిపైనే కాకుండా వారు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు.