ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్‌ షరీఫ్‌ | Panama case verdict: Pakistan SC disqualifies PM Nawaz Sharif | Sakshi
Sakshi News home page

ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్‌ షరీఫ్‌

Published Fri, Jul 28 2017 2:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. షరీఫ్తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్న పనామా గేట్‌ కుంభకోణం కేసులో ఈమేరకు తుది తీర్పు ప్రకటించింది. ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం జిట్‌ జూలై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చింది. షరీఫ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిలు ... తక్షణమే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement