రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్‌ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది.