Ration dealers strike
-
జూలై 4 నుంచి రేషన్ డీలర్ల నిరసనబాట
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు జాతీయ రేషన్ డీలర్ల ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘వన్ నేషన్–వన్ కమీషన్’ విధానంలో ప్రతి క్వింటాల్‌కు కమీషన్‌ను రూ.250 నుంచి రూ.300కు పెంచాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 4న మండల కేంద్రాల్లో, జూలై 11న జిల్లా కేంద్రాల్లో, జూలై 18న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధానుల్లో ఆందోళనలు నిర్వహించాలని తీర్మానించారు. ఆగస్ట్ 2న దేశవ్యాప్తంగా ఉన్న ఐదు లక్షల మంది డీలర్లతో ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజు పేర్కొన్నారు. (క్లిక్: జూన్ 26న జాతీయ లోక్ అదాలత్) -
ఆందోళన.. అంతలోనే ఆనందం!
ప్రతిపక్ష టీడీపీ నేతలు, వారికి వత్తాలు పలుకుతున్న పత్రికలు వండి వార్చిన కథనాలతో అభద్రతా భావానికి లోనైన రేషన్ డిపో డీలర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపడదామని బయలుదేరారు. ర్యాలీగా వెళ్లి స్పందన కార్యక్రమంలో తమ గోడు చెప్పుకుందామని భావించారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా డీలర్లు తరలివచ్చారు. అంతా కలెక్టరేట్కొచ్చేసరికి డీలర్లను తీసే ప్రతిపాదన లేదని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆందోళన చేద్దామని వచ్చిన డీలర్లంతా మంత్రి ప్రకటన విని ఆనందంతో గంతులు వేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వారిని ఎగతోద్దామని భావించిన టీడీపీ నేతలకు అనుకున్నదొకటి...అయ్యిందొకటి అని పలువురు పెదవి విరిచారు. సాక్షి, శ్రీకాకుళం: ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా టీడీపీ నేతల తీరు మారలేదు. వారి ప్రజాకంటక పాలనతో విసిగివేసారిన ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. ఓటమి పొందామన్న అక్కసుతో లేనిపోని వార్తలను ప్రచారం చేస్తూ వివిధ వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రేషన్ డిపో డీలర్లను ఎగదోసే పనిలో పడ్డారు. అయితే రేషన్ డీలర్లను తొలగించే ప్రతిపాదన లేదని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో స్పష్టం చేయడంతో టీడీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. గత ఐదేళ్లలో టీడీపీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న డీలర్లపై అక్రమ కేసులు, అన్యాయంగా ఫిర్యాదులు చేసి తొలగించిన సందర్భాలున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి మరికొందరిపై వేటు వేసిన దాఖలాలు ఉన్నాయి. అలా ఖాళీ అయిన డీలర్ల పోస్టుల్లో టీడీపీ నేతలు పాగా వేశారు. గత ఐదేళ్లలో డీలర్లు అనేక వేధింపులకు గురయ్యారు. నెలవారీ ముడుపులు తీసుకున్నారు. తమ జేబులను నింపని వారిపై కక్షపూరితంగా వ్యవహరించారు. ఇవన్నీ డీలర్లకు తెలియనివి కావు. కాకపోతే అడ్డదారిలో డీలర్ల పోస్టులను దక్కించుకున్న వారి సాయంతో టీడీపీ నేతలు రెచ్చగొట్టే కార్యక్రమాన్ని తలపెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీలర్లను తొలగిస్తుందని దుష్ప్రచారం చేయించే పనిలో పడ్డారు. తమ ద్వారా రేషన్ డీలర్లుగా నియమితులైన వారి ద్వారా విషప్రచారం చేయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు ఉసిగొల్పారు. అందులో భాగంగా సోమవారం డీలర్లంతా కలెక్టరేట్‌కు ర్యాలీగా వచ్చారు. తమకు న్యాయం చేయాలని, తమను ఇబ్బంది పెట్టొద్దని మొర పెట్టుకునేందుకు వచ్చిన వారికి తీపి కబురు అందడంతో తెరవెనకున్న టీడీపీ నేతలను పట్టించుకోకుండా ఆనందంతో గంతులేసి, కలెక్టరేట్ బయట బాణసంచా కాల్చి తమ హర్షధ్వానాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఏం సాధించారని ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారని టీడీపీ ముసుగేసుకున్న కొందరు రెచ్చగొట్టినా అత్యధిక డీలర్లు వారి మాటను లెక్క చేయకుండా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మంత్రి ప్రకటనతో ఆనందం 40 ఏళ్లుగా దీన్నే ఉపాధిగా భావించి బతుకుతున్నాం. కానీ మా డీలర్షిప్ తీసేస్తున్నారని కొందరు చెప్పడంతో ఆందోళనకు లోనై మా గోడు విన్పించుకుందామని కలెక్టరేట్‌కు వచ్చాం. ఇంతలోనే మంత్రి కొడాలి నాని ప్రకటన చేయడంతో మాకెంతో ఊరట కలిగింది. వైఎస్ కుటుంబానిది అన్నం పెట్టే మనసేగానీ కడుపు కొట్టే బుద్ధి కాదు –వి.కృష్ణదాస్, జిల్లా రేషన్ డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆందోళనకు లోనయ్యాం గత కొన్ని రోజులుగా ఆందోళనకు లోనవుతున్నాం. డీలర్లను తొలగిస్తారన్న వార్తలతో మానసిక క్షోభకు గురవుతున్నాం. ఇంతవరకు ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే, సోమవారం అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని స్పందిస్తూ డీలర్లను తీసే ప్రతిపాదన లేదని స్పష్టం చేయడంతో టెన్షన్ తీరింది. – బుగత వెంకటేశ్వరరావు, రేషన్ డిపో డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటుతో అభివృద్ధి బీసీల అభ్యున్నతికి శాశ్వత కమిషన్ ఏర్పాటు నిజంగా సాహాసోపేతమైన చర్య. ఎప్పటి నుంచో వెనుకబడిన తరగతికి చెందిన కులాలు అణగారి ఉన్నాయి. వైఎస్ జగన్ నిర్ణయంతో సామాజిక న్యాయం జరుగుతుంది. వెనుకబడిన తరగతుల్లో ఎన్నో కులాలకు చెందిన ప్రజలు పేదరికంతో ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వారికి న్యాయం జరుగుతుంది. – జుత్తు పాపారావు, భేతాళపురం, మందస మండలం బెడిసికొట్టిన టీడీపీ నేతల కుట్రలు రేషన్ డిపో డీలర్లను టీడీపీ నేతలు భయాందోళనకు గురి చేస్తున్నారు. వారికి వంతపాడుతున్న పత్రికలు అందుకు తగ్గ రాతలు రాస్తున్నాయి. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి డీలర్లకు అన్యాయం చేయరని మంత్రి తాజా ప్రకటనతో స్పష్టమైంది. – సముద్రపు రామారావు, రాష్ట్ర రేషన్ డిపో డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
మార్చి నుంచి రేషన్ డీలర్ల దేశవ్యాప్త సమ్మె
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఒకే విధమైన పారితోషికం లేక ఒకే కమీషన్ చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వచ్చే నెల 1 నుంచి రేషన్ డీలర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. డీలర్లకు నెలకు రూ.50 వేల వేతనం లేని పక్షంలో, క్వింటాల్ ధాన్యానికి రూ.300 కమీషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర డీలర్ల సంఘం కేంద్ర కమిటీ సన్నాహాలు చేస్తుండగా, చేపట్టబోయే కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. రేషన్ డీలర్లకు 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద క్వింటాల్ బియ్యానికి రూ.70 కమీషన్ కింద ఇస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు కమీషన్ కేవలం రూ.20 మాత్రమే ఉండగా, దాన్ని ఆగస్టులో రూ.70కి పెంచారు. రూ.500 కోట్లు ఉన్న బకాయిల్లో కొన్నింటిని సైతం ప్రభుత్వం చెల్లించింది. మిగతా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం.. బియ్యంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా కమీషన్ విధానం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బియ్యంపై క్వింటాల్‌కు రూ.180 వరకు చెల్లిస్తున్నారు. కేరళలో రేషన్ డీలర్లకు కనీస వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల నిర్వహణ భారంగా మారుతుండటం, వచ్చే కమీషన్ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో కనీస వేతనాలు చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. ఒక్కో రేషన్ దుకాణానికి సగటున రూ.3,700 మేర నికరంగా ఆదాయం నెలకు వస్తుంది. కొన్ని దుకాణాలకు రూ.6 వేల వరకూ ఉంటుంది. షాపు అద్దె, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించి దుకాణ నిర్వహణ కష్టసాధ్యంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కమీషన్ బదులుగా కనీస వేతనం చెల్లించాలన్నది డీలర్ల వాదన. దీంతో తమకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని డీలర్లు చెబుతున్నారు. లేనిపక్షంలో క్వింటాల్‌పై రూ.300 కమీషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చిన కేంద్ర కమిటీ, మార్చి నుంచి సమ్మెకు దిగేందుకు సమాయత్తమవుతోంది, ఇక రాష్ట్రంలోనూ శనివారం రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్వహించి సమ్మె అంశమై కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయ్కోటి రాజు తెలిపారు. - సాంకేతిక కారణాల రీత్యా రెండు రైళ్లను పూర్తిగా, మరో రెండింటిని పాక్షి కంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సి.హెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నంబర్ 57657 మణుగూరు–కాజీపేట, 57658–కాజీపేట–మణుగూరు రైళ్లను 15,16,17 తేదీల్లో, 12967 చెన్నై సెంట్రల్–జైపూర్ సూపర్‌ఫాస్ట్ రైలును 17న పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 67245 విజయవాడ–భద్రా చలం, 67246 భద్రాచలం–విజయ వాడ రైలును భద్రాచలం–డోర్నకల్ మధ్య 15,16,17వ తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రేషన్ డీలర్ల సమ్మెపై ఉక్కుపాదం!
సాక్షి, విజయవాడ/అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన రేషన్ డీలర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రేషన్ డీలర్లు ఈ నెల 16వ తేదీ నుంచి మూకుమ్మడి సెలవుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేషన్ డీలర్లు రోడ్డెక్కితే నిత్యావసర వస్తువుల పంపిణీ జరగదని, చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం ఏకంగా అత్యవసర సేవల చట్టం(ఎస్మా) ప్రయోగించింది. ఈ మేరకు డీలర్లకు నోటీసులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ సిబ్బంది డీలర్ల చేతికి నోటీసులు ఇచ్చి, సంతకాలు చేయించుకుంటున్నారు. డ్రాక్వా గ్రూపులకు కేటాయింపు పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఈ నెల 11న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. డీలర్లు 18వ తేదీలోగా సరుకులకు బిల్లులు చెల్లించి గోదాముల నుంచి తీసుకువెళ్లి కార్డుదారులకు అందచేయాలని సూచించారు. డీలర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వారి డీలర్‌షిప్‌ను రద్దు చేసి సమీపంలోని స్వయం సహాయక సంఘాలకు (డ్రాక్వా) కేటాయించాలని ఆదేశించారు. రెండు రోజులుగా పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లు రేషన్ డీలర్లను వ్యక్తిగతంగా పిలిచి సమ్మె చేస్తారా? లేక బిల్లులు కడతారా? అంటూ ఒత్తిడి చేస్తున్నారు. సమ్మెకు సిద్ధమైతే వెంటనే వారి వద్ద ఉన్న ఈ–పాస్ యంత్రం, ఎలక్ట్రానిక్ కాటాను తెచ్చి తమకు అప్పగించాలని ఆదేశిస్తున్నారు. సమ్మె చేయమని చెప్పి... సరుకు తీసుకోకుండా తాత్సారం చేసినా సమ్మె చేస్తున్నట్లుగానే భావించి డీలర్షిపు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరుకు తీసుకోవాలని, సమ్మె విరమించుకోవాలని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బెదిరిస్తున్నారని డీలర్ల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రేషన్ డీలర్ల డిమాండ్లు ఇవే.... తమకు గౌరవ వేతనం ఇవ్వాలని, చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకల కమీషన్‌ను రూ.10–20కు పెంచాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. గోదాముల నుంచి రేషన్ డిపోలకు రవాణ చేసే సరుకులను ఉచితంగా దిగుమతి చేయించాలని, పెండింగ్ బిల్లులు రూ.100 కోట్లను తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం బకాయిలు చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. గౌరవ వేతనం ఊసే ఎత్తడం లేదు. డీలర్ల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి వారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దుకాణాల అద్దె కూడా చెల్లించలేకపోతున్నాం.. ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా అందాల్సిన ప్రయోజనాలతోపాటు ఆహార భద్రతా చట్టం ప్రకారం తమకు చెల్లించాల్సిన కమీషన్లో కోత విధించకుండా మొత్తం చెల్లించాలని డీలర్లు కొన్నాళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇస్తున్న సరుకుల్లో కోత విధించడంతో డీలర్లకు ఆశించిన మేర కమీషన్ రావడం లేదు. దీనికితోడు అరకొరగా వచ్చే కమీషన్‌లోనూ ఈ–పాస్ మిషన్ల నిర్వహణ ఖర్చుల పేరిట ప్రతినెలా క్వింటాల్‌కు రూ.17 చొప్పున కమీషన్లో కోత విధిస్తున్నారు. దీంతో కుటుంబ జీవనం సంగతి అటుంచితే కనీసం రేషన్ దుకాణాల అద్దె కూడా చెల్లించలేకపోతున్నామని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె తప్పదని రేషన్ డీలర్ల జేఏసీ నేతలు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతిఏటా పండుగల సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకను సైతం పంపిణీ చేయకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరికి గాను పంపిణీ చేయాల్సిన బియ్యం తదితర సరుకులు తీసుకోకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 వేల మంది డీలర్లకు జేఏసీ నేతలు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. న్యాయం కోరితే బెదిరిస్తారా? ప్రభుత్వం జారీ చేసే నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని రేషన్ డీలర్ల జేఏసీ నేతలు చెప్పారు. ఈ నెల 15న విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. చర్చలకు పిలవకుండా డీలర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని జేఏసీ నాయకులు దివి లీలామాధవరావు, బుగతా వెంకటేశ్వరరావు, పి.చిట్టిరాజు, ఎం.వెంకటరావు తదితరులు గురువారం ప్రకటించారు. 36 నెలలుగా బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోకుండా నోటీసులు జారీ చేయడాన్ని వారు తప్పుపట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, అందుకుగాను ప్రభుత్వానికి జాతీయస్థాయిలో 9 అవార్డులు వచ్చాయని గొప్పగా చెప్పుకునే టీడీపీ సర్కారు ఇప్పుడు తమ సమస్యలను పరిష్కరించాలని కోరితే బెదిరించడం ఏమిటని రేషన్ డీలర్లు మండిపడుతున్నారు. -
సమ్మె విరమించిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్స్ సంఘం నేత రమేష్ ప్రకటించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిల విడుదల, కనీస వేతనంపై హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మెకు వెళతామని రమేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ.. మాకు ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వాజీర్ ఖాన్ కుటుంబాన్ని అదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. డిప్యూటీ స్పీకర్, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. డీలర్ల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ స్పీకర్, మంత్రులకు డీలర్లు ధన్యవాదాలు తెలిపారు. -
‘300 సార్లు చర్చలు; మాట తప్పిన ఈటల’
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో 300 సార్లు చర్చించినా తమ సమస్యల పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా రేషన్ డీలర్ల సమస్యలు సరిష్కారిస్తానని హామినిస్తూ వచ్చిన ఈటల రాజేందర్ తమను మోసం చేశాడని మండిపడ్డారు. జాతీయ ఆహార భద్రత హామీ చట్టం అమలుకు కృషి చేయాల్సిన మంత్రి వైఖరి సరిగా లేదని విమర్శించారు. 2017లో సమ్మె చేయగా.. 10 రోజుల్లో సీఎంతో మాట్లాడించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ఈటలను ప్రశ్నించారు. రేషన్ డీలర్ల సంక్షేమానికి మంత్రి స్పష్టమైన హామినిచ్చినందునే ఈ-పాస్ మిషన్లను స్వాగతించామని అన్నారు. వాటి సాయంతో పౌర సరఫరాల వ్యవస్థలో అక్రమాలు తగ్గి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా అవుతున్నా తమ బతుకుల్లో మాత్రం ఏ వెలుగూ లేదని వాపోయారు. ఇప్పటికైనా డీలర్ల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె విరమించేది లేదనీ, డీడీలు కట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. -
గడువు పొడిగిస్తున్నా స్పందన కరువు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో గ్రామాల్లో పేదలకు ప్రజాపంపిణీ సరుకులు పంపిణీ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గడువు పొడిగిస్తున్నా రేషన్ డీలర్లు డీడీలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఈ నెలలో ఇబ్బందులు తప్పేలా లేవు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించి డీడీలు కట్టాలని పలు పర్యాయాలు కోరినా, గడువు పొడిగించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లే దిక్కుగా మారాయి. పేదలకు అసౌకర్యం కలుగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృమవుతాయోననే ఆందోళన అధికారులను వెంటాడుతోంది. నేటి నుంచి సమ్మె ప్రజాపంపిణీలో భాగమైన రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జూలై 1 నుండి రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ గడువులు ఇస్తున్నా రేషన్ డీలర్లు మెట్టు దిగకపోవడం, ప్రజాపంపిణీ సరుకులకు డీడీలు చెల్లించకపోవడంతో ఐకేపీ సంఘాలను అప్రమత్తం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రజాపంపిణీపై శిక్షణ ఇవ్వడం, పంపిణీకి గ్రామాల్లో ప్రదేశాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఐకేపీ సంఘాలకు ఆర్వోలు జారీ చేయాలని సంబంధిత తహసీల్దార్లకు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుండి ఈ నెల 5వ తేదీ వరకు గ్రామాలకు సరుకులు చేరవేస్తామని తెలిపారు. అయితే ప్రజాపంపిణీ సరుకులను ఈ నెల ఈ–పాస్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా డీలర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు డీడీలు చెల్లించేందుకు గడువు ఇస్తూ మీ–సేవా కేంద్రాల ద్వారా డీడీలు చెల్లించి ఆర్వోలు పొందేలా డీలర్లకు అవకాశం కల్పించింది. కాగా, జిల్లా వ్యాప్తంగా 804 రేషన్ షాపులకు గాను శనివారం సాయంత్రం వరకు 27 మంది డీలర్లు డీడీలు చెల్లించారు. కాగా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డీలర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయొద్దని జేసీ తహసీల్దార్లకు సూచించారు. మట్టి తిని బతకాలా? జడ్చర్ల: ‘ప్రజలు భోజనం చేసేలా బియ్యం అందజేసే చేతులకే అన్నం కరువైతే ఎలా.. తాము మట్టి తిని బతకాలా.. ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ రేషన్ డీలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసు ఇవ్వగా.. పరిష్కరించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ శనివారం జడ్చర్ల రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లలో మట్టి పోసుకుని భోజనం చేస్తున్న మాదిరిగా కూర్చున్నారు. న్యాయమైన సమస్యలు పరిశ్కరించాలని కోరితే సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.250 పైగా ఇస్తున్నారని.. అంతకంటే అధ్వానంగా తమ పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని డీలర్లు వాపోయారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సమస్యల సాధన సమితి అధ్యక్షులు పాలాది రమేశ్, బాధ్యులు కొంగలి నాగరాజు, శ్రీనువాసులు, కృష్ణయ్య, నగేశ్, చెన్నయ్య ,తుంగ రఘు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇక డీలర్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిక్ షాకీర్, పరమటయ్య, ఎంపీటీసీ సభ్యులు బాలవర్దన్‌గౌడ్ తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. -
రేషన్ డీలర్ల సమ్మెలో అపశ్రుతి
సాక్షి, సిద్ధిపేట : వేతనాలు డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు చేస్తున్న సమ్మెలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని వజీర్ ఖాన్ అనే రేషన్ డీలర్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతనికి గాయాలు కావడంతో యశోదా ఆసుపత్రికి తరలించారు. రేషన్ డీలర్లపై ప్రభుత్వ వైఖరితో వజీర్ మనస్తాపం చెందాడని అతని బంధువులు చెబుతున్నారు. వజీర్ ఖాన్ గజ్వేల్‌లో రేషన్ డీలర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. -
రేషన్ డీలర్ల సమ్మెలో అపశ్రుతి
-
రేషన్ డీలర్లకు బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష
-
‘అలాంటిది ఏదైనా ఉంటే గుండు కొట్టించుకుంటా’
లక్డీకాపుల్ : వచ్చే నెల(జూలై) 5వ తేదీ వరకు రేషన్ డీలర్లకు రావాల్సిన బాకీలు చెల్లించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్డీకాపుల్‌లో శుక్రవారం జరిగిన రేషన్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతూ... సమ్మె నోటీసులు ఇచ్చిన చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించారని, కానీ రాష్ట్రంలో డీలర్ల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఒకవేళ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తే కేసీఆర్‌కు లారీలతో పాలాభిషేకం చేస్తామని తెలిపారు. ఆల్ ఇండియా రేషన్ డీలర్ల అసోసియేషన్ తమకు మద్దతుగా ఉందని.. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది డీలర్లు తమతో పాటు సమ్మెలో పాల్గొనేందుకు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు శాంతియుతంగా దీక్ష చేశామని, ఇకపై జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓఆర్ కట్టకుండా సహకరించిన ప్రతీ ఒక్క డీలర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కడుపు కాలినా పట్టించుకోరా.. రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్స్ సప్లై విభాగంలో అవార్డులు రావడానికి కారణం మేము కాదా అంటూ రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటువంటి డీలర్లను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడం దారుణమన్నారు. కడుపు కాలి బాధను వెళ్లగక్కుతూ సమ్మె చేసినా తమను ప్రభుత్వం పట్టించుకోలేవడం లేదని ఆరోపించారు. నకిలీ వేలి ముద్రలు, బ్లాక్ మార్కెట్‌తో డీలర్లకు ఎటువంటి సంబంధం లేదన్న రాజు.. అలాంటిది ఏమైనా ఉందని తేలితే గుండు కొట్టించుకుంటానంటూ వ్యాఖ్యానించారు. 35 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నామని.. 2015 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పోరాటం చేస్తామన్నారు. డీలర్లను సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. సరుకులు సరఫరా చేసేందుకు మహిళ సంఘాలు 80శాతం వరకు ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాలు తమకు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. డీలర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ముఖం చూసైనా తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు. ఈ విషయంలో ఆమె చెప్పినట్లుగా నడుచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
రేషన్ డీలర్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
-
డీలర్లే ప్రభుత్వాన్ని తొలగిస్తారు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కమీషన్ పెంచాలని డీలర్లు సమ్మె చేస్తే వారిని తొలగించాలని చూస్తున్న ప్రభుత్వాన్ని ఆరునెలల తర్వాత అధికారంలో నుంచి డీలర్లే తొలగిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా రూ.410 కోట్ల బకాయిలను తక్షణం చెల్లించాలని, డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 17 వేల మంది రేషన్ డీలర్లు సమస్యల పరిష్కారం కోసం ఎంతో కాలంగా పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సమస్యలు పరిష్కరించకుండా రేషన్ డీలర్లకు నోటీసులు పంపడం నియంత పోకడలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేషన్‌డీలర్ల సమ్మెపై సీరియస్
కరీంనగర్ సిటీ: కనీస గౌరవ వేతనంతోపాటు సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెకు పూనుకుంటున్న రేషన్ డీలర్లపై సర్కారు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సరుకులు డీడీలు కట్టకుండా జూలై 1 నుంచి సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. 48 గంటల్లో సరుకులకు డీడీలు చెల్లించకుంటే డీలర్లను సస్పెన్షన్ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ జిల్లా డీలర్లతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ‘పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం ప్రభుత్వానికి ఎంతయితే ఉందో రేషన్‌డీలర్లపై కూడా అంతే ఉంది. అది ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరువొద్దు. సరుకుల పంపిణీకి ఆటంకం కలిగించే డీలర్లపై కఠిన చుర్యలు తీసుకోక తప్పదు’ అని హెచ్చరించారు. ఈనెల 28వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్వో(రిలీజ్) తెలుసుకుని ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం డీలర్లకు విజ్ఞప్తి చేసిందన్నారు. నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వం కలిగి ఉందన్నారు. కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున ప్రతినెలా ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తూ అవసరమైన ఆహార భరోసా కల్పిస్తుందన్నారు. సమ్మె పేరుతో పేద ప్రజల నోటికాడి ముద్దను అడ్డుకోవద్దన్నారు. పేద ప్రజల ఆహారభద్రత దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని ప్రభుత్వం మరోమారు రేషన్ డీలర్లకు విజ్ఞప్తి చేసిందన్నారు. ఆందోళన వద్దు.. రేషన్ సరుకులు అందుతాయో లేదో అని పేద ప్రజలు ఆందోళన చెందవద్దని, సకాలంలో సరుకులు అందించడానికి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టిందని జేసీ అన్నారు. ప్రత్యామ్నాయ చర్యల ద్వారా సరుకుల పంపిణీకి పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. అయితే.. ఇటు డీలర్లు భీష్మించడం.. అధికార యంత్రాంగం హెచ్చరించడం చూస్తుంటే పేద ప్రజల్లో సరుకుల పంపిణీపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం చెబుతున్న ప్రత్యామ్నాయ చర్యలతో రేషన్ సరుకుల పంపిణీ సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుభవమున్న డీలర్లతోనే సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొత్తగా పంపిణీ చేసేవారితో ఎలా సాధ్యమనే ప్రశ్న వ్యక్తమవుతోంది. సమ్మెకు వెనుకాడేది లేదు ప్రభుత్వం ఎన్ని బెదిరింపు చర్యలకు పాల్పడినా సమ్మెకు వెనుకాడేది లేదని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ స్పష్టం చేశారు. న్యాయమైన సమస్యల పరిష్కారం జరిగే వరకు రాష్ట్రశాఖ పిలుపు మేరకు డీడీలు కట్టకుండా సమ్మె చేపడతామని పేర్కొన్నారు. ‘వస్తే గౌరవ వేతనం.. పోతే రేషన్ షాపు’ నినాదానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ చర్చలకు పిలిచి ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారని, డీడీలు కట్టకపోతే తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. అయితే.. ఇప్పటివరకు జిల్లాలోని 487 మంది డీలర్లు ఎవరూ డీడీలు కట్టలేదన్నారు. కేవలం కొన్ని సొసైటీలు మాత్రమే డీడీలు చెల్లించాయన్నారు. ప్రభుత్వం ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము సమ్మెకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
రేషన్ డీలర్ల భిక్షాటన
జనగామ: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రేషన్ డీలర్లు జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు మురళీధర్‌రావు ఆధ్వర్యంలో ప్రిస్టన్ కళాశాల మైదానం నుంచి భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, రైల్వే స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలకు రేషన్ సరుకులు అందజేస్తున్నారని తెలిపారు. తక్కువ కమీషన్ ఇచ్చినా సేవే పరమావధిగా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పనిచేస్తున్న తమను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూడడం బాధగా ఉందన్నారు. ఈ పాస్ విధానాన్ని సక్సెస్ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, జూలై 1 వరకు ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు రూ.30 వేల వేతనం అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అబ్బాస్, సింగపురం మోహన్, పుణ్యవతి, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీధర్, కిరణ్ ఉన్నారు. -
దారికి రాని డీలర్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రేషన్ సరుకులు తీసుకోవడానికి డీడీలు చెల్లించని, సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే పనిలో పౌరసరఫరాల శాఖ నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు శనివారం వరకు వెసులుబాటు కల్పించింది. అప్పటికీ దారికిరాని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. 3వ తేదీ నుంచి వారి స్థానంలో కొత్తవాళ్ల నియామక ప్రక్రియను చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు సూచించారు. డీడీలు కట్టకుండా సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలను, డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయని డీలర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళ్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం: సీవీ ఆనంద్ రేషన్ డీలర్ల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితిని సమీక్షించారని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ‘డీలర్లకు విధించిన తుది గడువులోగా డీడీలు చెల్లించాలి. లేదంటే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా వారు ఇలా చేయడం పద్ధతి కాదు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఊ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి సీఎంకు రేషన్ డీలర్ల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్‌తో బతుకుతున్నారని, సరిపడ ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేషన్‌డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఈ మేరకు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, సభ్యుడు ఆనంద్ సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో డీడీలు కట్టామని, మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌తో జరిపిన చర్చల తర్వాత సమ్మెను విరమించామని తెలిపారు. దేశంలోనే తక్కువ కమీషన్‌తో రేషన్ డీలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. -
మహిళా సంఘాలకు రేషన్ షాపులు!
► ఐకేపీ సభ్యుల వివరాల సేకరణ ►ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పౌరసరఫరాల శాఖ ► డీలర్ల సమ్మె ప్రకటన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు పౌరసరఫరాల చౌకధరల దుకాణాలను అప్పజెప్పేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ధాన్యం సేకరణలో విజయవంతమైన మహిళా సంఘాలకు రేషన్ షాపుల డీలర్‌షిప్‌లు అప్పగిస్తే మంచిందన్న భావనకు వచ్చిందని సమాచారం. ఇప్పటికే జిల్లాలు, మండలాల వారీగా ఐకేపీ గ్రూపు సభ్యుల వివరాలను సేకరించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే రేషన్ డీలర్ షాపులను మహిళా సంఘాలకు అప్పగించే నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 1 నుంచి కొందరు రేషన్ డీలర్లు సమ్మెకు దిగుతామని ప్రకటిం చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. ఒకవైపు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాలతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రజలకు అందాల్సిన సరుకుల పంపిణీని అడ్డుకుంటే నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం డీలర్లకు నోటీసులు జారీ చేసి, తక్షణమే సస్పెండ్ చేసే అంశాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకున్న స్థానిక నిరుద్యోగ యువతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కూడా చర్చ జరుగుతోందని తెలిసింది. ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు విజయవంతమైన పాత్ర పోషించాయి. వారికున్న ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని వారికి డీలర్‌షిప్‌లు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల డీసీఎస్ఓలతో సమీక్ష జరిపారని తెలిసింది. అంతేకాదు డీడీలు కట్టకుండా రేషన్ సరుకులు పంపిణీ చేయని డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 30 వరకు డీడీలు కట్టని డీలర్లను సస్పెండ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళుతున్నారనే సమాచారాన్ని ఇప్పటికే సేకరించారని సమాచారం. సమ్మెకు దూరంగా ఉండాలని కమిషనర్ చేసిన విజ్ఞప్తికి గ్రేటర్ హైదరాబాద్ యూనియన్లు సానుకూలంగా స్పందించాయి. నాయకోటి రాజు నేతృత్వంలోని యూనియన్ సమ్మెకు వెళ్లట్లేదని ప్రకటించింది. అయినా మరో మూడు సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నాయి.