సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఒకే విధమైన పారితోషికం లేక ఒకే కమీషన్ చెల్లించే విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వచ్చే నెల 1 నుంచి రేషన్ డీలర్లు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. డీలర్లకు నెలకు రూ.50 వేల వేతనం లేని పక్షంలో, క్వింటాల్ ధాన్యానికి రూ.300 కమీషన్ ఇవ్వాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర డీలర్ల సంఘం కేంద్ర కమిటీ సన్నాహాలు చేస్తుండగా, చేపట్టబోయే కార్యాచరణపై శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. రేషన్ డీలర్లకు 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద క్వింటాల్ బియ్యానికి రూ.70 కమీషన్ కింద ఇస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల ముందు వరకు కమీషన్ కేవలం రూ.20 మాత్రమే ఉండగా, దాన్ని ఆగస్టులో రూ.70కి పెంచారు. రూ.500 కోట్లు ఉన్న బకాయిల్లో కొన్నింటిని సైతం ప్రభుత్వం చెల్లించింది. మిగతా బకాయిలు ఇవ్వాల్సి ఉంది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం..
బియ్యంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా కమీషన్ విధానం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బియ్యంపై క్వింటాల్‌కు రూ.180 వరకు చెల్లిస్తున్నారు. కేరళలో రేషన్ డీలర్లకు కనీస వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల నిర్వహణ భారంగా మారుతుండటం, వచ్చే కమీషన్ కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో కనీస వేతనాలు చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. ఒక్కో రేషన్ దుకాణానికి సగటున రూ.3,700 మేర నికరంగా ఆదాయం నెలకు వస్తుంది. కొన్ని దుకాణాలకు రూ.6 వేల వరకూ ఉంటుంది. షాపు అద్దె, విద్యుత్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించి దుకాణ నిర్వహణ కష్టసాధ్యంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కమీషన్ బదులుగా కనీస వేతనం చెల్లించాలన్నది డీలర్ల వాదన. దీంతో తమకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని డీలర్లు చెబుతున్నారు. లేనిపక్షంలో క్వింటాల్‌పై రూ.300 కమీషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చిన కేంద్ర కమిటీ, మార్చి నుంచి సమ్మెకు దిగేందుకు సమాయత్తమవుతోంది, ఇక రాష్ట్రంలోనూ శనివారం రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్వహించి సమ్మె అంశమై కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయ్‌కోటి రాజు తెలిపారు.
- సాంకేతిక కారణాల రీత్యా రెండు రైళ్లను పూర్తిగా, మరో రెండింటిని పాక్షి కంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సి.హెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్ నంబర్ 57657 మణుగూరు–కాజీపేట, 57658–కాజీపేట–మణుగూరు రైళ్లను 15,16,17 తేదీల్లో, 12967 చెన్నై సెంట్రల్–జైపూర్ సూపర్‌ఫాస్ట్ రైలును 17న పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. 67245 విజయవాడ–భద్రా చలం, 67246 భద్రాచలం–విజయ వాడ రైలును భద్రాచలం–డోర్నకల్ మధ్య 15,16,17వ తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment