ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌ | RP Thakur shunted, Gautam Sawang is new DGP of AP | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

Published Fri, May 31 2019 9:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా(డీజీపీ) పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతారు. నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement