రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, రైతుల పొలాల్లోకి నీరు ఎప్పుడు పారుతుందో తెలియదు గానీ, ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి కమీషన్ల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అందినంత మింగేస్తున్నా రు. ఇందుకోసం కొత్తకొత్త వ్యూహాలను తెరపై కి తెస్తున్నారు. 2014 తర్వాత దక్కించుకున్న ప్రాజెక్టుల పనులు చేయకుండా మొండి కేస్తున్న కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సి న ప్రభుత్వం అందుకు భిన్నంగా అంతులేని మమకారం ప్రదర్శిస్తోంది. ధరల సర్దుబాటు కింద కాంట్రాక్టర్లకు అదనపు నిధులు కట్టబెట్టేందుకు సిద్ధమైంది.