ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్‌ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించేసింది.