petiton
-
గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం పిటీషన్.. సుప్రీం కోర్టు స్పందన ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు నోటీసులు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వద్దకు పంపిన పలు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారంటూ రాష్ట్ర గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే తరహా అంశాన్ని విచారణకు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సెక్రటరీ, కేంద్రానికి నోటీసులు జారీచేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే గవర్నర్‌కు నోటీసులు ఇవ్వబోమని, ప్రస్తుతం కేంద్రానికి మాత్రమే జారీచేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. సాధారణంగా గవర్నర్‌కు నోటీసులు జారీచేయమని తెలిపారు. గవర్నర్‌కు కాకుండా సెక్రటరీకి జారీచేయాలని దవే మరోసారి కోరారు. తెలంగాణ గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో ఉంచారని దాఖలైన ఈ పిటిషన్లో నోటీసులు జారీ చేయొచ్చా అని సీజేఐ ప్రశ్నించగా, అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని మెహతా స్పష్టం చేశారు. దీంతో గవర్నర్‌కు నోటీసులు జారీ చేయడంలేదని జస్టిస్ పీఎస్ నరసింహా పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉన్నందున పిటిషన్ కాపీని తనకు సర్వ్ చేయాలని మెహతా ధర్మాసనాన్ని కోరారు. అనంతరం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ
Raghu Rama Krishna Raju.. సాక్షి, న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. తన సెక్యూరిటీ, తనయుడిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని వేసిన రఘురామ పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. శుక్రవారం డిస్మిస్ చేసింది. కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో రఘురామ.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ అదనపు సమాచారం కోసం సమయం కోరారు. ఈ క్రమంలో ధర్మాసనం.. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కదా.. విచారణ కానివ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇదిలా ఉండగా... రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైన విషయం తెలిసిందే. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. అయితే, రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల -
రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది అంత ముఖ్యమైన విషయమా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. అరెస్ట్‌పై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇలా స్పందించింది. ఇదంతా ముఖ్యమైన విషయమా ? అని ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు కూడా విచారణ చేపడతాం కదా అని నొక్కి చెప్పింది. ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని పిటిషనర్ తరపు న్యాయవాదికి గుర్తు చేసింది ధర్మాసనం. ఇదిలా ఉండగా.. రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆయన తనయుడు భరత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు పంపింది. దానికి మరో రెండు వారాల్లో దానికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. -
మైనర్ బాలిక రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ కోర్టు మెట్లెక్కింది
చత్తీస్‌గఢ్: సాధారణంగానే మైనర్ల వివాహం చట్ట విరుద్ధం, పైగా చెల్లదు కూడా. అలాంటిది ఓ మైనర్ బాలిక వివాహం చేసుకోవడమే గాక రక్షణ కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందున ఆమెకు వారి నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. బాలిక ఇంకా మైనర్ కాగా తనకు ఇది రెండో వివాహమని పిటిషన్లో పేర్కోవడం గమనార్హం. అయితే బాలిక పిటిషన్‌ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. కాగా బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. ఇదీ గాక సదరు బాలిక తనకిది రెండో వివాహం అని పిటిషన్లో పేర్కొనడంపై విచారణ జరపాలని తెలుపుతూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ బాలికకు, వివాహం చేసుకున్న యువకుడికి ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ స్పష్టం చేసింది. బాలిక నివాసానికి సమీపంలోని నారి నికేతన్‌లో ఉంచి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే క్రమంలో ప్రభుత్వం పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి' అని ధర్మాసనం తీర్పునిచ్చింది. మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్‌పై హైకోర్టు తుది తీర్పుపై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: గొడవతో మహానదిలో దూకిన దంపతులు.. అంతలోనే.. -
సుప్రీంకోర్టులో రెంట్ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను లాయర్ పవన్ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు. లాక్డౌన్ పిటిషన్ తిరస్కరణ లాక్డౌన్లో ప్రభుత్వాధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం వంటి కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఐపీసీ సెక్షన్ కింద నమోదై ఉంటే వాటిని కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 188 ప్రకారం ఏదైనా చర్య మానవ జీవితానికి హని కలిగిస్తే అతనికి రూ. 1000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది. దీన్ని జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. అసలు ఎఫ్ఐఆర్ ఉండకూడదని కోరుకుంటున్నారా అని సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయన్ను కోర్టు ప్రశ్నించింది. ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
ఎన్ఐఏ కోర్టులో విచారణ ఆపాలని పిటిషన్
-
రేవంత్‌కు బెయిలా...కస్టడీనా?
హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా ఇవాళే విచారణకు రానుంది. దీంతో ఆయనను కోర్టు... ఏసీబీ కస్టడీకి అనుమతిస్తుందా, లేక బెయిల్ ఇస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రేవంత్‌రెడ్డిని కోర్టు కస్టడీకి అప్పగిస్తే ఆయన్ని ప్రశ్నించడానికి ఏసీబీ ప్రశ్నావళిని రూపొందించింది. వాటికి రేవంత్ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే, ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అవసరమైన ఆధారాలను కూడా సిద్ధం చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్నట్లు చెబుతున్న నాలుగో నిందితుడు మత్తయ్యను కూడా అరెస్టు చేసి మిగతా నిందితులతో కలిపి విచారించే అవకాశముంది. ఇక రేవంత్ కస్టడీ గడువు ముగిసిన తర్వాతే చంద్రబాబును విచారించవచ్చని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. -
కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే ఢిల్లీ ఎన్నికలు?
-
కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల తర్వాతే ఢిల్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి..ఏ తేదీల్లో ఎన్నికలు జరపాలీ అనేది ఎన్నికల సంఘమే చూసుకుంటుందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలంటూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సిఫారసు చేస్తూ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికను యథాతథంగా కేంద్ర కేబినెట్ ఆమోదించి...రాష్ట్రపతికి పంపింది.దాంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఆ ఎన్నికల తర్వాత ఢిల్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షమైన అకాలీదళ్‌కు వచ్చిన ఒక స్థానాన్ని కలుపుకొని బీజేపీ 32 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌కు 28 స్థానాలు రాగా కాంగ్రెస్‌కు 8 లభించాయి. కొంత ఊగిసలాట తర్వాత అదే నెలలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైనా అది రెండు నెలలుకూడా మనుగడ సాధించలేకపోయింది. పదవి నుంచి వైదొలగుతూ కేజ్రీవాల్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు.