సొంత ఖజానాకే కన్నం.. | TDP Government taken Rs 1,53,435 crores loan in Four years | Sakshi
Sakshi News home page

సొంత ఖజానాకే కన్నం..

Published Fri, Nov 9 2018 10:45 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

రెండంకెల వృద్ధి దేవుడెరుగు అప్పులు చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రథమ స్థానంతో దూసుకెళుతోంది. చేసిన అప్పులను టీడీపీ సర్కారు జల్సాలు, కమీషన్ల ద్వారా జేబులు నింపుకోవడానికి వాడుకోవడంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం నాలుగేళ్లలో భారీగా పెరిగిపోయింది. సాధారణంగా ప్రభుత్వమైనా, వ్యక్తులైనా ఇళ్లు, పొలం లేదంటే వాహనం కొనేందుకు అప్పు చేస్తారు. తీసుకున్న సొమ్మును సక్రమంగా వినియోగించుకుని ముందుచూపుతో ఆస్తులను సమకూర్చుకుంటారు. అయితే టీడీపీ సర్కారు ఇందుకు పూర్తి విరుద్ధంగా అప్పులు చేసి కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌ పేరుతో భారీగా డబ్బులు చెల్లిస్తూ కమీషన్లు రాబట్టుకునేందుకు అలవాటు పడిపోయింది. అప్పులు చేయడంలో తప్పు లేకున్నా దీన్ని అనుత్పాదక రంగాలకు వ్యయం చేయడాన్నే అధికార యంత్రాంగం తప్పుబడుతోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement