ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని, ఈ కుట్రలో ఆయనే కర్త, కర్మ, క్రియా అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రతో వైఎస్ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర చేశారని వారు ఆరోపించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు పెద్దలు భాగం కాబట్టి వారు జరిపే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే నిజాలు బయటకొస్తాన్నారు. ఇదే విషయమై శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ లోక్‌సభ పక్షనేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాష్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో దోషులు ఎవరన్నది తేలాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ రాసిన లేఖను పార్టీ నేతలు రాష్ట్రపతికి అందజేశారు.
కుట్రదారుడు చంద్రబాబే
Published Wed, Nov 14 2018 7:30 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement