తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ శుక్రవారం కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా వేదికపైన ఆటపాటలతో కళాకారులు, ప్లీనరీకి వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. పార్టీ ప్లీనరీకి అనుకున్నట్లుగానే వేల సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ప్లీనరీ ప్రాంగణమంతా అంతా గులాబీమయం అయింది. ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేదికపైకి వచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు.
అట్టహాసంగా ప్రారంభమైన టీఆర్‌ఎస్ ప్లీనరీ
Published Fri, Apr 27 2018 12:09 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement