లలితా జ్యువెల్లర్స్‌లో చోరీ | Two Woman Theft Neckles In Lalitha Jewellers By Duping Staff | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లర్స్‌లో చోరీ

Published Sat, Dec 9 2017 6:32 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

'డబ్బులు ఊరికే రావు' అనే మాటతో మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు పొందిన లలితా జ్యువెల్లర్స్‌లో శనివారం చోరీ జరిగింది. ఈ మేరకు జ్యువెల్లర్స్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు నగలు దోచుకెళ్లినట్లు జ్యువెల్లర్స్‌ సిబ్బంది సీసీటీవీ ఫుటేజిలో గుర్తించారు. రూ. 6 లక్షలు విలువైన బంగారు హారం స్థానంలో నకిలీ హారాన్ని పెట్టి ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా విచారణ ప్రారంభించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement