దక్షిణ చైనాపైనా టైఫూన్‌ ప్రభావం | Typhoon Mangkhut hits southern China | Sakshi
Sakshi News home page

దక్షిణ చైనాపైనా టైఫూన్‌ ప్రభావం

Published Mon, Sep 17 2018 7:44 AM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

శక్తిమంతమైన టైఫూన్‌ మంగ్‌ఖుట్‌ ఫిలిప్పీన్స్‌లో పెను విధ్వంసం సృష్టించింది. మంగ్‌ఖుట్‌ ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో 64 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గల్లంతయ్యారు. ప్రస్తుతం ఈ టైఫూన్‌ క్రమంగా చైనా, హాంకాంగ్‌లపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో చైనాలోని గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్షీ, హైనన్, గ్వెజో ప్రావిన్సులతో పాటు హాంకాంగ్‌లో గంటకు 162 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు కుంభవృష్టి కురుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement