పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి కుల్‌సుమ్ నవాజ్ (68) కన్నుమూసిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ తన సతీమణితో గడిపిన చివరి క్షణాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంత దేశ ప్రధాని అయినా ఒకరికే భర్తేకదా.. నవాజ్ షరీఫ్ భావోద్వేగంతో కూడుకున్న ఈ వీడియోలో తన భార్య కోసం ‘కుల్‌సుమ్ ఒక్కసారి కళ్లు తెరవవా.. ఆ అల్లా నీకు శక్తిని ప్రసాదించాలి’ అంటూ ఉర్దూలో ఆయన మాట్లాడిన చివరి మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో అక్రమ ఆస్తుల కేసులో ఆయనపై 11 ఏళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. దీంతో లండన్ నుంచి బయలుదేరుతున్న సమయంలో నవాజ్ షరీఫ్ తన సతీమణితో చివరిసారిగా మాట్లాడారు.