ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక హోదాతో ఏం వస్తుంది? అని పలుమార్లు ప్రశ్నించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రత్యేక హోదా డిమాండ్‌తో న్యూఢిల్లీకి 30వ సారి రావడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి అన్నారు.
పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అవినీతి, బంధుప్రీతి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని భూములు, ఇసుక దందా, దేవాలయ భూములు, పట్టిసీమ, సెక్స్ రాకెట్ వంటి పది అంశాల్లో చంద్రబాబుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చంద్రబాబు లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.