ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ’సాక్షి’ 10వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కావూరు శివారులో కేక్ కట్ చేశారు. విలువలకు కట్టుబడి.. పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్న సాక్షికి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాభినందనలు అని ఆయన తెలిపారు.