మమ్మల్ని మాత్రం అరెస్ట్‌ చేస్తారా? | YSRCP MLA RK Roja Arrested in Tirupati | Sakshi
Sakshi News home page

మమ్మల్ని మాత్రం అరెస్ట్‌ చేస్తారా?

Published Tue, Jul 24 2018 2:17 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

బీజేపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న ఆమెను పుత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మట్లాడుతూ... చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచ రాజకీయమని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement