Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

KSR Comment: How Kutami Prabhutvam Increase YS Jagan Charisma1
జగన్‌ చరిష్మాను మరింత పెంచుతున్న కూటమి సర్కారు!

మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం టూర్ అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించినట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు చూసిన తర్వాత.. కచ్చితంగా జగన్ అంటే వీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లుంది. బంగారుపాళ్యంలో మామిడి రైతుల సమస్య ఏమిటి? కూటమి ప్రభుత్వం శ్రద్ద దేనిమీద ఉంది? ఎంతసేపు జగన్ మామిడి మార్కెట్ యార్డ్‌కు వెళుతున్నారే! ఈ సమస్య ప్రజలలోకి బాగా వెళ్లిపోతుందే! అన్న గొడవ తప్ప, రైతులను ఆదుకోవడం ద్వారా వారికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎందుకు కనిపించలేదు!. పైగా జగన్ టూర్‌ను ఎలా విఫలం చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. జగన్ మామిడి రైతుల పరామర్శకు వెళ్ళడం వల్ల ప్రభుత్వం కొంతైనా కదిలి వారికి రూ.260 కోట్లు ఇస్తామని ప్రకటించక తప్పలేదు. ఇది జగన్ వల్లే అయిందని రైతులు అనుకునే పరిస్థితిని కూటమి నేతలే స్వయంగా సృష్టించుకున్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు సరిగా లేక, ధరలు దారుణంగా పడిపోయి రెండు నెలలుగా రైతులు నానా బాధలు పడుతున్నారు. మామిడి పండ్లతో రైతులు రోజుల కొద్దీ ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్న విషయం చిత్తూరు జిల్లా కూటమి నేతలు ఎవరూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదా!. ఇంటిలెజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదా? ఒకవేళ సమాచారమిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా?. కిలో మామిడి ధర చివరికి రెండు రూపాయలకు పడిపోయి కూలీ, రవాణా ఖర్చులు సైతం గిట్టుబాటు కాక, పలువురు రైతులు మామిడి పళ్లను రోడ్ల పక్కన పారబోసింది నిజం కాదా?అదేదో జగన్ టూర్లో కావాలని పోసినట్లు మంత్రులు, తెలుగుదేశం మీడియా గగ్గోలు పెడుతోంది. టీడీపీ మీడియా అయితే మరీ నీచంగా దండుపాళెం బ్యాచ్ అని, జగన్నాటకం అంటూ శీర్షికలు పెట్టి రైతులను అవమానిస్తూ, తమ అక్కసు తీర్చుకున్నాయి. జగన్‌కు మద్దతుగా కాని, తమ బాధలు చెప్పుకోవడానికి గాని రైతులు వస్తే ఇలా తప్పుడు కథనాలు రాయడం ఘోరం. టమోటాలు, ఇతర ఉత్పత్తులకు సరిగా ధర లేకపోతే రైతులు పలు సందర్భాల్లో కింద పారబోసి నిరసనలు తెలిపిన ఘటనలు ఎన్ని జరగలేదు? అసలు జగన్ టూర్ ప్రకటన వచ్చినప్పటి నుంచి పోలీసుల ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం తలపెట్టింది! ఎన్ని ఆంక్షలు పెట్టింది!.. ఎక్కడైనా ఇంతమందే రావాలని చెబుతారా? ఒకవేళ స్థలాభావం ఉంటే దానిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ నేతలతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా 500 మంది మాత్రమే రావాలని, ఐదుగురితోనే మాట్లాడాలని, రైతులను ఆటోలలో ఎక్కించుకోకూడదని, మోటార్ బైక్‌లకు పెట్రోల్ పోయరాదని.. ఇలాంటి పిచ్చి ఆంక్షలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ టూర్ పై క్యూరియాసిటీ పెంచారు. జగన్ బంగారుపాళ్యం వచ్చిన రోజున మూడు జిల్లాల ఎస్పీలు, పెద్ద సంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. సుమారు రెండువేల మందిని నియమించారట. వీరు జనాన్ని రెగ్యులేట్ చేయడానికి కాకుండా, ప్రజలు అటువైపు రాకుండా చేయడం కోసం నానా పాట్లు పడ్డారట. బంగారుపాళ్యం చుట్టూరా పాతిక చెక్ పోస్టులు పెట్టారట. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు టూర్లలో ఇలా ఎప్పుడైనా చేశారా? అనపర్తి వద్ద భద్రతాకారణాల రీత్యా చంద్రబాబును అడ్డుకోకపోతే, మద్దతు దారులను వెంట బెట్టుకుని నడుచుకుంటూ వెళ్లారే? అప్పుడు పోలీసులు ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారే తప్ప ఆపలేదే! చంద్రబాబు అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించినా పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టించలేదు. చివరికి కందుకూరు వద్ద ఇరుకు రోడ్డులో సభ పెట్టిన ఫలితంగా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినా చంద్రబాబుపై పోలీసులు కేసు పెట్టలేదు. అదే.. జగన్ సత్తెనపల్లి సమీపంలోని రెంటపాళ్లకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తికి కారు తగిలి గాయపడి మరణిస్తే, డ్రైవరుతోపాటు జగన్‌, ఇతర ప్రయాణీకులపై కేసులు పెట్టి సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఘనత కూటమి సర్కార్ పొందింది. ఎక్కడ సభ పెట్టినా చంద్రబాబు ఈ ఘటనను ప్రస్తావించి జగన్‌కు మానవత్వం లేదని, ప్రమాదం జరిగినా కారు ఆపలేదని అన్యాయంగా ఆరోపణ చేస్తున్నారు. అదే తను పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణిస్తే ఏమన్నారో మర్చిపోయారు. ప్రమాదాలు జరగవా! జగన్నాధ రథోత్సవంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగడం లేదా? అంటూ మాట్లాడిన విషయం మాత్రం మానవత్వంతో కూడినదని జనం అనుకోవాలా? ఇలా ప్రతిదానిలో డబుల్ టాక్ చేయడం వల్ల అంత సీనియర్ నేత అయిన చంద్రబాబుకు ఏమి విలువ పెరుగుతుందో తెలియదు. బంగారుపాళ్యం వద్ద కొన్ని చోట్ల అవసరం లేకపోయినా పోలీసులు లాఠీలు ఝళిపించడంతో కొందరు గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి తలకు గాయమైంది. అతనిని పరామర్శకు కూడా జగన్‌ కారు దిగడానికి పోలీసులు అనుమతించలేదు. కర్ణాటకలో కిలో రూ.16లకు కేంద్రం మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే, ఏపీలో ఎందుకు చేయడం లేదో కూటమి నేతలు ప్రశ్నించాలి కదా? అలా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న కిలోకు రూ.నాలుగు సబ్సిడీని కేంద్రం భరించాలని అడిగారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన ప్రాంతాల రైతుల గురించి వేరే చెప్పాలా? జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్లి మిర్చి రైతులను పరామర్శిస్తే తప్ప, వారికి సాయం చేయాలని కూటమి సర్కార్ కేంద్రాన్ని కోరడానికి అంతగా చొరవ తీసుకోలేదు. పొదిలి వద్ద పొగాకు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వెళ్లుతున్నారు అన్నప్పుడుగాని వారికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంటే ఏమిటి దీని అర్థం? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నేత యాక్టివ్‌గా ఉంటే అది ప్రజలకు మేలు చేస్తుందనే కదా! ఇదే కదా ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో లేకపోయినా, తన వెంట జనం ఉన్నారని జగన్ పదే, పదే రుజువు చేస్తున్న తీరు సహజంగానే చంద్రబాబు బృందానికి కలవరం కలిగిస్తుంది. అందుకే జగన్ వద్దకు జనం రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యత్నించింది. కాని ప్రజాస్వామ్యంలో అణచివేత విధానాల వల్ల ఉపయోగం ఉండదని అనుభవ పూర్వకంగా తెలియ చేసినట్లయింది. బంతిని ఎంత వేగంగా నేలకేసి కొడితే, అంతే వేగంగా అది పైకి లేస్తుందన్న సంగతి మరోసారి స్పష్టమైంది. పోలీసులు మెయిన్ రోడ్డుపై ప్రజలను అడ్డుకోవడానికి యత్నిస్తుంటే అనేక మంది కొండలు, గుట్టలు దాటుకుంటూ, అడవుల గుండా కూడా తరలిరావడం కనిపించింది. కొందరు యువకులు మోటార్ సైకిళ్తపై చిన్న, చిన్న డొంకల ద్వారా తరలివచ్చిన తీరుకు సంబంధించిన వీడియోలు అందరిని ఆకర్షించాయి. జగన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అదే తీరుగా ఉంది. ఇంత జనాభిమానం ఉన్న నేత గత ఎన్నికలలో ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదన్నది పలువురి భావన. అందుకే కూటమి సూపర్ సిక్స్‌తో పాటు ఈవీఎంలు, ఓట్ల మాయాజలం వంటి అనుమానాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఏది ఏమైనా ప్రభుత్వంలో కదలిక తీసుకు రావడానికి జగన్ యాత్రలు ఉపయోగపడుతుండడం హర్షించవలసిందే. ఆయన ప్రభావంతో ఆయా వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు కొంతైనా మేలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. వైయస్సార్‌సీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలి. జగన్‌కు టూర్లకు ఏదో విధంగా అంతరాయం కల్పించి ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ అందరికి తెలిసేలా చేస్తున్నందుకు, ఆ ప్రజాకర్షణను ప్రభుత్వమే రోజురోజుకు మరింతగా పెంచుతున్నందుకు!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

TDP leaders clash in Singanamala Over mandal conveners2
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!

శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్‌ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్‌ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్‌ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్‌ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్‌స్టాప్‌ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

Pak Balochistan Province Bus Passengers Incident3
బలూచిస్తాన్‌: ఐడీ కార్డు చూసి ప్రయాణికుల్ని కాల్చేశారు!

బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోరం జరిగింది. బస్సుల్లో వెళ్తున్న కొందరిని తుపాకులతో వచ్చిన దుండగులు అపహరించారు. ఆపై సమీపంలోని కొండల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు తనిఖీలు చేసి మరీ కిరాతకంగా కాల్చి చంపారు.బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో దారుణం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పలు బస్సుల నుంచి ప్రయాణికులను తుపాకులు చూపించి బెదిరించి ఎత్తుకెళ్లారు. సమీపంలోని కొండ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఐడీ కార్డులు పరిశీలించి కాల్చి చంపారు. శరీరం నిండా తుట్లతో 9 మంది ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారి ఒకరు ప్రకటించారు. ఘటనకు కారకులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది. దుండగుల కోసం భద్రతాల బలగాలు రంగంలోకి దిగాయి.ఇదిలా ఉంటే.. బలూచ్‌ వేర్పాటువాద మిలిటెంట్‌ గ్రూపులు గతంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డాయి. ఇందులో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ(BLA) అత్యంత బలమైంది. అఫ్గనిస్తాన్‌-ఇరాన్‌ సరిహద్దుల గుండా ఇది స్థావరాలను ఏర్పాటు చేసుకుని ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే పాక్‌ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. Pakistan Bus Attack: Gunmen Kill 9 Punjabi Passengers in Balochistan After Checking ID Cards#Balochistan #Pakistan https://t.co/seQhPWzqLJTo get epaper daily on your whatsapp click here: https://t.co/Y9UVm2LHAx— Free Press Journal (@fpjindia) July 11, 2025బలూచిస్తాన్‌ అత్యంత అరుదైన ఖనిజాలకు మూలం. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ వనరులను పంజాబ్‌ ప్రావిన్స్‌కు దోచిపెడుతోందని బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌ ప్రావిన్స్‌ నుంచి వాహనాలను, ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తూ వస్తోంది.గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో వరుస హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ గురైంది. బొలాన్ జిల్లాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ సుమారు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్‌ చేసింది. అందులో 30 మందిని కాల్చి చంపింది. మరో 215 మందిని బందీలుగా తీసుకుంది. బందీలలో ఎక్కువ మంది సైనికులు, పోలీసు, ISI, యాంటీ టెర్రరిజం ఫోర్స్ సభ్యులుగా ఉండడం గమనార్హం. పాక్ సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి.. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా దాడులు జరిపింది. అంతకు ముందు.. 2024 ఆగస్టులో ముసాఖేల్ జిల్లాలో 23 మంది ప్రయాణికులను ఐడెంటిటీ కార్డులు అడిగి కాల్చి చంపింది బీఎల్‌ఏ.

what is bitchat,Jack Dorsey new messaging app functions without Internet4
వాట్సప్‌కు పోటీగా త్వరలో బిట్‌చాట్‌

ట్విటర్‌ మాజీ సీఈవో జాక్‌ డోర్స్‌ టెక్‌ ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సోషల్‌ మీడియా మెసేజింగ్‌ యాప్‌ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. వాట్సప్‌ తరహా మెసేజింగ్‌ యాప్‌ను.. అందునా ఆఫ్‌లైన్‌లో పనిచేసేలా త్వరలో జనాలకు అందుబాటులోకి తేనున్నారు. దీనిపేరు.. బిట్‌చాట్‌. ఇంటర్నెట్‌తో అవసరం లేకుండా మెసేజ్‌లు పంపించుకునే ఈ యాప్‌ ఎలా పని చేస్తుందో ఓ లుక్కేద్దాం..బిట్‌చాట్‌ అంటే అనే బ్లూటూత్‌తో పనిచేసే పీర్-టు-పీర్ వ్యవస్థ. సర్వర్లతో దీనికి పని ఉండదు. బ్లూటూత్‌ ఆన్‌లో ఉంటే సరిపోతుంది. బిట్‌చాట్‌ యూజర్లు ఏదైనా మెసేజ్‌ చేయాలంటూ బ్లూటూత్‌ ఆన్‌ చేసి మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సమస్యలు, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఘర్షణ వాతావారణ నెలకొన్న సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. సర్వర్లు, అకౌంట్లు, ట్రాకింగ్ విధానాలు ఇందులో లేకపోవడంతో.. యూజర్లను విపరీతంగా ఆకట్టుకోవచ్చనే అంచనా వేస్తున్నారు.ప్రైవసీకి ది బెస్ట్‌?బిట్‌చాట్‌ అనే పేరుతో అందుబాటులోకి వచ్చిన ఆఫ్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌లో యూజర్లు అవతల వ్యక్తికి పంపే ప్రతి మెసేజ్‌ ఎన్క్రిప్ట్ అవుతుంది. మెసేజ్‌ టూ మెసేజ్‌ మధ్యలో ఎలాంటి సర్వర్‌ వ్యవస్థ ఉండదు కాబట్టి యూజర్లకు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని డోర్స్‌ అంటున్నారు. సింపుల్‌గా.. డివైజ్‌ టూ​ డివైజ్‌ కనెక్షన్‌. ఫోన్‌లో బ్లూటూత్‌ ద్వారా బిట్‌చాట్‌ పనిచేస్తోంది నో సెంట్రల్‌ సర్వర్‌: వాట్సప్‌,టెలిగ్రాం తరహా ఒక యూజర్‌కు పంపిన మెసేజ్‌ సర్వర్‌లోకి వెళుతుంది. సర్వర్‌ నుంచి రిసీవర్‌కు మెసేజ్‌ వెళుతుంది. బిట్‌చాట్‌లో అలా ఉండదు.. నేరుగా సెండర్‌నుంచి రిసీవర్‌కు మెసేజ్‌ వెళుతుంది. మెష్ నెట్‌వర్కింగ్: బ్లూట్‌తో పనిచేసే ఈ బిట్‌చాట్‌ యాప్‌ ద్వారా రిసీవర్‌ సమీపంలో లేనప్పటికీ మెసేజ్‌ వెళుతుంది. ఈ టెక్నిక్‌ను మెష్ రూటింగ్ అంటారు ఇది మెసేజ్‌ బ్లూటూత్ పరిధికి మించి 300 మీటర్లు (984 అడుగులు) వరకు పంపడానికి వీలవుతుంది. ప్రూప్స్‌ అవసరం లేదు: ఈ యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు ఎలాంటి వ్యక్తిగత యూజర్‌ వివరాలు అవసరం లేదు. అంటే ఫోన్‌ నెంబర్‌,ఈమెయిల్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలతో పనిలేదు. డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ : బిట్‌చాట్‌ కొన్నిసార్లు పీట్‌ టూ పీర్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేస్తుంది. అంటే సర్వర్‌ లేకుండా నెట్‌వర్క్‌లోని యూజర్‌ టూ యూజర్‌ల మధ్య డేటా మార్పిడి జరుగుతుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్: గ్రూప్ చాట్స్‌ను ‘రూమ్‌లు’ అని పిలుస్తారు. ఇవి పాస్‌వర్డ్‌తో రక్షితంగా ఉంటాయియూజర్ ఇంటర్‌ఫేస్: యాప్‌ను ఇన్‌ స్టాల్‌ చేసి, అకౌంట్‌ క్రియేట్‌ చేస్తే చాలు. తర్వాత మీ కాంటాక్ట్‌ లిస్ట్‌ నుంచి ఎవరితోనైనా చాట్‌ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్స్ అండ్‌ రూమ్స్: హ్యాష్‌ట్యాగ్‌లతో పేర్లు పెట్టి, పాస్‌వర్డ్‌లతో సెక్యూర్ చేయవచ్చు. ఉపయోగపడే సందర్భాలు: రద్దీ ప్రదేశాల్లో నెట్‌వర్క్ సరిగ్గా పనిచేయని సమయంలో విపత్తుల సమయంలో (disaster zones). సెన్సార్ ఉన్న ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం బిట్‌చాట్‌ బీటా వెర్షన్‌లో టెస్ట్‌ఫ్లైట్‌ మోడ్‌లో ఐఓఎస్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.టెస్ట్‌ ఫ్లైట్‌ మోడ్‌ అనేది యాపిల్‌ అందించే బీటా టెస్టింగ్ ప్లాట్‌ఫారమ్. యాప్‌లను విడుదలకు ముందు దీని ద్వారా iOS, iPadOS, watchOS, tvOS పరీక్షించేందుకు డెవలపర్లు ఉపయోగించుకుంటారు. తద్వారా ఫీడ్‌బ్యాక్‌తో సంబంధిత యాప్‌ను ఎలా అంటే అలా మార్పులు చేర్పులు చేస్తారు.

Nitish Reddy Asked Pat Cummins For Advice On England Tour Reply Was5
ప్యాట్‌ కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటే..: నితీశ్‌ రెడ్డి

లార్డ్స్‌ టెస్టులో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి తొలిరోజు సత్తా చాటాడు. ఒకే ఓవర్లో ఇంగ్లండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే (18), బెన్‌ డకెట్‌ (23) వికెట్లు కూల్చి భారత్‌కు శుభారంభం అందించాడు. తద్వారా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ కోసమంటూ నితీశ్‌ (Nitish Kumar Reddy)ను ఎంపిక చేయడం సరికాదన్న విమర్శకులకు ఆటతోనే బదులిచ్చాడు.కమిన్స్‌ని సలహా అడిగితే ఏమన్నాడంటేఈ నేపథ్యంలో లార్డ్స్‌ టెస్టు మొదటి రోజు పూర్తయిన అనంతరం నితీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘ఇక్కడికి వచ్చే ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ పిచ్‌ పరిస్థితులలో ఎలాంటి వైరుధ్యాలు ఉంటాయని ప్యాట్‌ (ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ Pat Cummins)ను అడిగాను.నాకిదే తొలి ఇంగ్లండ్‌ పర్యటన కాబట్టి సలహాలు ఇవ్వమన్నాను. అందుకు బదులుగా.. ‘పిచ్‌ స్వభావంలో పెద్దగా తేడా ఉండదు. అయితే, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు బౌలింగ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు’’ అని నితీశ్‌ రెడ్డి తెలిపాడు.కాగా ఐపీఎల్‌లో నితీశ్‌ రెడ్డి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ప్యాట్‌ కమిన్స్‌ గత రెండేళ్లుగా కెప్టెన్‌గా ఉన్నాడు. అతడి సారథ్యంలోనే వరుస అవకాశాలు దక్కించుకున్న ఈ ఆంధ్ర పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. టీమిండియాలోనూ ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకుంటున్నాడు.మా కోచ్‌ వల్లే ఇదంతా..ఇక... టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మోర్నీతో కూడా నా ఆట గురించి చాలానే చర్చించాను. ముఖ్యంగా సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో నిలకడగా బౌలింగ్‌ చేయడంపై దృష్టి సారించాము. గతేడాది కాలంగా ఈ విషయమై కఠినంగా శ్రమించాను.అందుకు ప్రతిఫలంగా నా బౌలింగ్‌లో రోజురోజుకీ పరిణతి కనిపిస్తోంది. ఇలాంటి కోచ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి ప్రయాణం చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా’’ అని నితీశ్‌ రెడ్డి కోచ్‌ పట్ల కృతజ్ఞతాభావం చాటుకున్నాడు.లార్డ్స్‌లో అమీతుమీకాగా ఆండర్సన్‌-టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్‌ సేన ఈ ఓటమికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. స్టోక్స్‌ బృందాన్ని ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ వేదికపై తొలిసారి గెలుపు నమోదు చేసింది.ఇక ఇరుజట్ల మధ్య లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో గురువారం (జూలై 10) మూడో టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ మొదటి రోజు ఆట ముగిసేసరికి.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నస్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్‌ 99, బెన్‌ స్టోక్స్‌ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో నితీశ్‌ రెడ్డి రెండు వికెట్లు కూల్చగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గావాట్ రా రెడ్డి, బాగుంది రా మామ👌 #SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/cH9KYukrVX— Sony Sports Network (@SonySportsNetwk) July 10, 2025

Kuberaa Movie OTT Streaming Details Latest6
ఓటీటీలోకి 'కుబేర'.. అధికారిక ప్రకటన

రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ 'కుబేర'. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. యునానిమస్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. అయితేనేం ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై ఉండగానే డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: విశాఖలో 'అల్లు అర్జున్‌' మల్టీఫ్లెక్స్‌ పనులకు శ్రీకారం)విడుదలకు ముందు 'కుబేర' ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. 4 వారాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇప్పుడు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో మిస్ కావొద్దు.'కుబేర' విషయానికొస్తే.. దీపక్ (నాగార్జున) సీబీఐ ఆఫీసర్. అక్రమ కేసు కారణంగా జైలులో ఉంటాడు. దేశంలో సంపన్నుడైన నీరజ్ మిత్రా(జిమ్ షర్బ్) ఇతడిని బయటకు తీసుకొస్తాడు. ఓ ఆయిల్ డీల్ విషయమై లక్ష కోట్ల రూపాయలని ప్రభుత్వంలో పెద్దలకు ఇవ్వడంలో భాగంగా దీపక్‌ని వాడుకోవాలనేది నీరజ్ ప్లాన్. ఈ క్రమంలోనే దేవా (ధనుష్)తో పాటు మరో ముగ్గురు అనాథల పేరుపై బినామీ కంపెనీలు సృష్టిస్తాడు దీపక్. వాళ్ల అకౌంట్స్ నుంచి ప్రభుత్వ పెద్దలకు డబ్బులు చేరవేయాలనేది ఆలోచన. అయితే... దీపక్, నీరజ్ మిత్రా గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న నీరజ్ మిత్రాని ఓ బిచ్చగాడు ఎన్ని ఇబ్బందులకు పెట్టాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సినిమా టికెట్‌ లాటరీ.. ఐఫోన్ గెలుచుకున్న యువకుడు)

UPI impact India now makes faster payments than any other country says IMF7
యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్‌ఫాస్ట్‌

యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్‌లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్‌టెక్‌ నోట్‌లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్‌ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్‌ చేస్తోందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. వివిధ పేమెంట్‌ ప్రొవైడర్స్‌ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్‌ చేసేందుకు క్లోజ్డ్‌ లూప్‌ సిస్టమ్‌లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్‌ఆపరబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్‌ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Man Breaks Down After Losing Phone In Water Video Viral8
రేయ్ తమ్ముడూ.. ఎందుకురా ఏడుస్తున్నావ్‌?

సెల్‌ఫోన్‌ పోయిందని ఓ యువకుడు నీళ్లలో వెతకడం.. అది దొరక్క చివరకు ఏడుస్తూ కూర్చోవడం.. ఆ వీడియో కాస్త వైరల్‌ కావడం.. నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. రాజస్తాన్‌ జైపూర్‌లో స్థానిక సుభాష్‌ చౌక్‌లో నివాసం ఉంటున్నాడు హల్దార్‌ అనే యువకుడు. తన స్కూటీ మీద వెళ్తుంటే రామ్‌ నివాస్‌ బాఘ్‌ వద్ద రోడ్డు మీద వానకు నిలిచిపోయిన నీటిలో పడిపోయాడు. దెబ్బలేం తాకలేదు. అయితే ఆ పడడమే అతని జేబులోని సెల్‌ ఫోన్‌ ఎగిరి నీళ్లలో పడింది. ‘అయ్యో నా ఫోన్‌..’ అనుకుంటూ కంగారుగా నీళ్లలోకి దిగాడు. పాపం.. ఆ ఫోన్‌ కోసం ఆ బురద నీటిలో చాలాసేపు వెతికాడు.అటుగా వెళ్లేవాళ్లు.. ‘‘ఎవడ్రా.. వీడు’’ అన్నట్లుగా చూస్తూ పోతున్నారే తప్ప, ఆగి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఒక్కడు తప్ప!. చాలాసేపైనా దొరక్కపోవడంతో చివరకు ఆ నీళ్లోనే కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా ఆ ఒక్కడు తన ఫోన్‌లో బంధిస్తూనే ఉన్నాడు. ఈలోపు.. ఆ వీడియో తీసే వ్యక్తి ఏమైందని అడిగాడు.. రోడ్లు గుంతలు లేకుండా సరిగ్గా ఉంటే.. మున్సిపల్‌ వాళ్లు సరిగా​ పని చేసి ఉంటే.. ఈ నీరు ఇలా ఆగేదా?. నా ఫోన్‌ పోయేదా?.. ఇలాంటి వాళ్ల వల్లే వ్యవస్థలో నాలాంటి వాళ్లు విఫలం అవుతూనే ఉన్నారు అంటూ ఆ యువకుడు భారీ డైలాగులే కొట్టాడు.ఈలోపు ఈ వీడియో సోషల్‌ మీడియాకు ఎక్కింది. చాలామంది పోయింది ఫోనే కదా.. అంటూ తామూ ఫోన్‌లను పొగొట్టుకున్న సందర్భాలను ప్రస్తావించారు. మరికొందరు అధికారులను తిట్టిపోశారు. ఇంకొందరు అటుగా వెళ్లేవాళ్లు సాయం చేసి ఉండొచ్చు కదా అంటూ సలహా పడేశారు. ఇంకొందరు బహుశా అదే అతని జీవనాధారం అయి ఉండొచ్చని.. అతని వివరాలు ఇస్తే కొత్త ఫోన్‌ కొనిస్తామని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా..! ప్చ్‌.. ఎవరేమనుకున్నా ఆ కన్నీళ్లకు మాత్రం ఓ అర్థం ఉంది. రేయ్‌ హల్దార్‌.. ఎందుకురా ఏడుస్తున్నావ్‌?. ఫోన్‌ పోయిందనా?.. ఇంట్లో వాళ్లు తిడతారనా?. కష్టపడి సంపాదించుకున్నావనా?. లేకుంటే సాయం చేయకుండా జనాలు ఎవరిమానాాన వాళ్లు వెళ్లిపోయారనా?. రోడ్లు సవ్యంగా లేవనా? నీళ్లలో పడిపోయావనా? అధికారులు.. సిబ్బంది సవ్యంగా పని చేయలేదనా?.. రేయ్‌ తమ్ముడూ జీవితం అంటే ఇంతేనా?.. పైకి లేవు!!. సాయానికి జనం ముందుకొస్తున్నారుగా.. చూద్దాం! A viral video shows a young man breaking down in tears after his mobile phone reportedly slipped into rainwater in Jaipur.#JaipurRains #Rajasthan #Viral #ViralVideo #HeavyRainfall #Trending pic.twitter.com/KwDtwoYaAj— TIMES NOW (@TimesNow) July 10, 2025

Ex Malaysian PM Dr Mahathir shares 6 habits For His longevity secrets 9
నిండు నూరేళ్లు.. వందేళ్లయినా మలేషియా మాజీ ప్రధానిలో అదే జోష్‌!

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడం అనేది ఈ రోజుల్లో అత్యంత కష్ట సాధ్యమైన పనే. పెరిగిన సాంకేతికత మనిషిపై పెత్తనం చేస్తుందేమో అనేలా..దానికి బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ మలేషియా ప్రధాని డాక్టర్ మహతిర్ ముహమ్మద్ ఒత్తిడితో కూడిన రాజకీయ వాతావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన మంత్రిగా పేరు తెచ్చుకోవడమే గాక ఈ నెల పదితో ఆయనకు నూరేళ్లు నిండాయి. ఈ అద్భుత మైలు రాయిని ఈ నెల జూలై 10, 2025న చేరుకున్నారు. ఆయన వయస్సు పరంగా..ఇప్పటికీ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. వృద్ధులలో ఉండే తడబాటు, ఒణుకు అవేమి ఆయనలో కనిపించావు..40 లేదా 50 ఏళ్ల వాడిలా అత్యంత హుషారుగా ఉంటారు. అంతేగాదు ఈ వయసులో కూడా యువతతో పోటీ పడేలా బ్రెయిన్‌కి పదను పెట్టగల సామర్థ్యం ఆయన సొత్తు. ఐతే అందుకు ఎలాంటి మ్యాజిక్‌ ఉండదని క్రమశిక్షణాయుతమైన జీవనశైలి ఒక్కటే తోడ్పడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఆరు అలవాట్లు తప్పనిసరి అంటూ తన దీర్ఘాయువు రహస్యాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.అధిక వ్యాయామం వద్దు..చురుకుగా ఉందాం..అధిక వ్యాయామాలు జోలికి పోవద్దన్నారు. ఇది వృద్ధాప్యం కండరాల నష్టం (సార్కోపెనియా), హృదయనాళ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు మహాతిర్‌. దాని బదులు, నడవడం, రోజు వారి పనులపై ఎవ్వరిపై ఆధార పడకుండా చేసుకోవడం తదితరాలు శరీరంలో మంచి కదలికను ప్రోత్సహింస్తుందని అన్నారు. తాను తీవ్రంగా చేసే జిమ్‌ జోలికి కూడా పోనననారు. ఈ వయసులో తేలికపాటి వ్యాయమాలే బెస్ట్‌ అని చెప్పారు. బాడీ తోపాటు మనసుకి కూడా వ్యాయామం..మొదడు ఉపయోగించకపోతే..మతిమరుపు వంటి సమస్యలు వస్తాయన్నారు. అందుకోసం మహతిర్‌ చదవడం, రాయడం, మాట్లాడటం వంటి పనులు చేస్తారు. ఆయన ఎక్కువగా స్పీచ్‌లు ఇస్తుంటారట. ఇది తన మెదడుని చురుకుగా ఉండేలా చేస్తుందట. మేధోపరమైన పనులతోనే చిత్త వైకల్యం వంటి సమస్యలను అధిగమించగలమని చెప్పారు. ఇది పరిశోధనల్లో కూడా వెల్లడైందని అన్నారు. పదవీ విరమణ అంటే బ్రేక్‌ కాదు..రిటైర్మెంట్‌ తీసుకున్న తదనంతర కూడా తన కార్యకలాపలను వదులుకోలేదట మహతీర్‌. అది తాను విశ్రాంతి తీసుకునే సమయంగా అస్స్లు ఫీల్‌ కాలేదట. మరింతగా తనపై తాను ఏకాగ్రత చిత్తంతో ఆలోచించుకునే విరామ సమయంగా భావించానని చెబుతున్నారు. తాను ఈ ఖాళీ సమయంలో రాయడం, సలహాలు ఇవ్వడం, బహిరంగ చర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాల్లో మునిగిపోతారట. ఇది మెరుగైన మానసిక ఆరోగ్యం తోపాటు అకాల మరణ ప్రమాదాన్ని నివారిస్తుందట. సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుందట.భావోద్వేగ పరంగా బీ స్ట్రాంగ్‌..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడి వంటి రాజకీయ సవాళ్లను చాలానే ఎదుర్కొన్నారట. దాన్ని అధిగమించేందుకు ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్‌ టెక్నిక్‌లపై దృష్టిసారించేవారట. తనలోకి తాను అవలోకనం చేసుకున్నప్పుడూ ఎలాంటి ఒత్తుడులు మనల్ని ఏం చేయలేవని ధీమాగా చెబుతున్నారు. అందువల్ల భావోద్వేగ పరంగా బలంగా ఉంటే వృద్ధాప్యం దరిచేరే ప్రమాదం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందట. ఈ భావోద్వేగ నియంత్రణ దీర్ఘాయువుకి అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.హానికరమైన అలవాట్లకు దూరం..ఆహారంలో నియంత్రణ, చక్కటి జీవనశైలి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు. అలాగే ఎలాంటి ఫ్యాషన్‌ డైట్‌లు, అధిక పోషకాహార డైట్‌లు వద్దని సూచించారు. బదులుగా సమతుల్య భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వమని కోరారు. దీర్ఘాయువు అనేది మితంగా తినడంపైనే ఆధారపడి ఉంటుందని నొక్కి చెప్పారు. ముఖ్యంగా 60వ దశకంలో జీవక్రియ నెమ్మదించి వ్యాధులు అటాక్‌ చేసే సమయం అని..అందువల్ల మితాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని సూచించారు.ఉరకలు వేసే ఉత్సాహం..దీన్ని ఓ అభ్యాసంలా చేస్తే..ఉత్సాహం మన నుంచి దూరం కాదని చెబుతున్నారు. ఇది ఆరోగ్యంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తే..యువకుడిలా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. ఈ ఉత్సాహమే సకలం నేర్చుకోవడానికి దోహద పడుతుందని అన్నారు. అందుకోసం అసరం అనుకుంటే యువతరంతో మమేకం కండి, వారితో మీ అనుభవాలు పెంచుకండి మీ ఆయుష్షు పెరగడమే గాక యంగ్‌గా ఉంటారని అంటున్నారు. నిత్య యవ్వనంగా ఉండటం అంటే..నెరిసిన జుట్టుతో ఉన్నా..శరీరం ఒణకకుండా..మాట తీరు అత్యంత స్పష్టంగా ఉండటమేనని చెబుతున్నారు మహతీర్‌. ఇంకెందుకు ఆలస్యం ఆయనలా ఆ ఆరు అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుని దీర్ఘాయుష్షుతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దామా...(చదవండి: బెల్లం ఫేస్‌ వాష్‌..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం..!)

BRS Harish Rao Satirical Comments On CM Revanth Reddy10
‘అయ్యా రేవంత్‌.. 400 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్‌లు నీవేనా?’

సాక్షి, బీఆర్‌కే భవన్‌: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు బీఆర్‌కే భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్‌కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.చంద్రబాబుకు ‍గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారా..శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.నిజాం కట్టినవీ నీవేనా..సీఎం రేవంత్‌కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement