ప్రధాన వార్తలు

చంద్రబాబు.. ఇంక మీ డ్రామాలు ఆపండి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రైతుల పక్షాన మేము నిలబడితే ఎల్లో మీడియా దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గు ఉండాలి?. చంద్రబాబు.. రైతులకు నిజంగా మీరు మేలు చేస్తే.. మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిన్నటి బంగారుపాళ్యం పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రైతుల విషయమై.. చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. ఇదే సమయంలో పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1.చంద్రబాబు.. మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు?. దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?5. వైయస్సార్సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే CM APP ఏమైంది?8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.1.@ncbn గారూ, మీరు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా,… pic.twitter.com/9WFD13951r— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2025

వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన సక్సెస్.. కడుపు మంటతో ఎల్లో మీడియా..
సాక్షి,తిరుపతి: కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. రైతన్నకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ చేపట్టిన బంగారుపాళ్యం మార్కెట్ యార్డు పర్యటన విజయవంతమైందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.మామిడి రైతులకు అండగా నిలిచేందుకు జగన్ చేసిన బంగారుపాళెం పర్యటన విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఈటీవీలు విషపు రాతలతో ఆయనపై ఉన్న ద్వేషాన్ని మరోసారి చాటుకున్నామని భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ కోసం వచ్చిన మామిడి రైతులను క్రూరమైన దొంగలు, అసాంఘిక శక్తులు, దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఉచ్ఛం, నీచం మరిచి పతాకశీర్షికల్లో దూషించడం ద్వారా తమ కడుపుమంటను ఎల్లో మీడియా బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును మోసేందుకు, నిత్యం భజన చేసేందుకు ఆ ప్రతికలు, మీడియా ఇంతగా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ..వైఎస్ జగన్ పర్యటనకు చిత్తూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తమ కష్టాలను చెప్పుకోవాలని తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం రెండు వేల మంది పోలీసులతో భద్రత పేరుతో అనేక ఆటంకాలు కల్పించింది. లాఠీచార్జీతో అభిమానులు, రైతులపై విరుచుకుపడింది. రహదారులను బారికెట్లతో మూసివేశారు. అయినా కూడా రైతులు గుట్టలు, పుట్టలు, కాలువలు, పొలాలు, తోటలను దాటుకుంటూ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఇటువంటి అశేష జనవాహినిని చూసి కూటమి ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. ..ఈ పర్యటన విజయవంతం అవ్వడంతో తట్టుకోలేక చంద్రబాబు, ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీన్, ఈటీవీలు మామిడి రైతులపై ఇష్టారీతిగా ద్వేషాన్ని, విషాన్ని కుమ్మరించాయి. రైతులను రౌడీలు, దోపిడీదారులు, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ పతాక శీర్షికల్లో రాతలు రాశారు. ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో 'బంగారుపాళెంలో దండుపాళ్యం' అంటూ వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అభిమానులను, రైతులు అరాచకం సృష్టించడానికి ప్రయత్నించారంటూ ఒక విషపు కథనాన్ని అచ్చేశారు. ..అదే పత్రికలో జగన్ పర్యటనకు అసలు జనాలే రాలేదంటూ మరో ఏడుపుగొట్టు కథనాని రాశారు. హెలిప్యాడ్ వద్దకు మూడువేల మంది జనం తోసుకువచ్చారంటూ అదే పచ్చ పత్రిక ఆంధ్రజ్యోతి మరో కథనం రాసింది. ఇలా ఏ రాస్తున్నారో కనీస స్పృహ కూడా లేకుండా ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలను ప్రచురించారు.గిట్టుబాటు రేటు ఇస్తే రైతులు రోడ్డుపై పంట పారేస్తారా?.. బంగారుపాళెంకు వచ్చింది రైతులే కాదు, ఎవరో రైతులకు చెందిన మామిడి కాయలను రోడ్డుపైన పారేశారంటూ ఇదే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. వైయస్ జగన్ వస్తున్నారని కాదు, కనీసం కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడం, ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా కొనుగోలు చేసేవారు లేక, మామిడి కాయలు కుళ్ళిపోతుండటంతో కడుపుమండిన రైతులు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు మామిడి కాయలను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయిన ఘటనలు అనేక ఉన్నాయి. రైతులను ఆదుకోవడంతో, గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం అవ్వడం వల్లే రైతులు తమ పంటను రోడ్డుపై పారేసి వెళ్ళిపోయారు. దీనిని ఈనాడు పత్రిక తనకి నచ్చినట్లుగా వక్రీకరణ కథనాలు రాశారు. అలాగే రైతులు కానీ కొందరితో జగన్మోహన్రెడ్డి ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలేదంటూ కూడా మరో విషపు కథనాన్ని రాశారు.ఎల్లో మీడియాలో దుర్మార్గమైన థంబ్‌నెయిల్స్.. వైఎస్ జగన్‌ను ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణను అణువంతైనా తగ్గించలేరు. ఇక టీవీ5, ఏబీఎన్ చానెల్స్‌లో అయితే 'పోలీసులా...నరికేయండ్రా', 'డీఎస్సీని నరికేయండ్రా...' జగన్ పబ్లిక్‌గా దొరికాడు అంటూ థంబ్‌నెయిల్స్ పెట్టి మరీ దుర్మార్గమైన వీడియో కథనాలను ప్రసారం చేశారు. ..ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన నాయకుడు ఎక్కడైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఇలా కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆదేశాలు ఇస్తారా? 'పోలీసులపై రప్పా...రప్పా.. అంటూ రెచ్చిపోయిన జగన్', 'పరామర్శా... పొలిటికల్ ఈవెంటా?' 'పోలీసులను నరికేస్తారా...సర్కార్ ఏం చేస్తోంది' ఇలాంటి థంబ్ నెయిల్స్‌తో ఎల్లో మీడియా తన కడుపుమంటను, జగన్‌పై ఉన్న ధ్వేషాన్ని చాటుకునేందుకు సిగ్గూ,శరం లేకుండా దిగజారుడు కథనాలను ప్రచురించింది. ..గతంలో కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి వంటి రుషులు లోకకళ్యాణం కోసం ప్రజలకు, పాలకులకు మంచిని బోధించేవారు. కానీ నేడు ఎల్లో మీడియా ఈ రుషులుగా భావించుకుని చంద్రబాబుకు తప్పుడు సలహాలు, విషపు కథనాలను ప్రచారం చేస్తూ అశాంతిని ఎలా రగిలించవచ్చో బోధిస్తున్నాయి. అలాగే ఈ ఎల్లో మీడియాకు టీడీపీ, జనసేన వారంతా సత్పురుషులు, వేదపండితులుగా కనిపిస్తున్నారు. వీరి నుంచి మాత్రమే ప్రజలు ఆశీస్సులను పొందాలని ఈ ఎల్లో మీడియా రుషులు చెబుతున్నారు. మిగిలిన వారంతా వారికి రాక్షసులతో సమానం.కూటమి ప్రభుత్వ సూచనల మేరకే పోలీస్ కేసులు..కూటమి ప్రభుత్వ నిర్భందాలు బద్దలు కొడుతూ రైతులు వైఎస్ జగన్ రాకను స్వాగతించారు. ఈ రైతులను మేం తీసుకురాలేదు, జన సమీకరణ అసలే చేయలేదు. పోలీసులు చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారమే పర్యటన సాగినా కూడా మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. రైతులు తమ మామిడి పంటను రోడ్డుపైన పారేస్తే, దానికి కూడా వైఎస్ జగన్ కారణమని పార్టీ నేతలపై కేసులు బనాయిస్తున్నారు. ..వైఎస్ జగన్‌పై కక్షసాధించాలనే తలంపుతోనే ఇలా చేస్తున్నారు. చివరికి వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తే రౌడీషీట్లు కూడా తెరుస్తామని కూడా బెదిరించారు. మామిడి రైతులను కలుసుకునేందుకు వైయస్ జగన్ వస్తున్నారని తెలియగానే చంద్రబాబు హుటాహుటిన పల్ప్ ఫ్యాక్టరీ యజమానులుతో సమావేశం నిర్వహించారు. కేజీ రూ.6 కి కొనుగోలు చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇస్తుందని ప్రకటించింది. ..అప్పటి వరకు బయట ఉన్న వందల లారీలకు స్పీడ్‌గా టోకెన్లు జారీ చేసింది. ఇవ్వన్నీ వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసిన తరువాత చేసినవే. గత ఏడాది వైఎస్ జగన్ హయాంలో మామిడికి మద్దతుధర కేజీకి రూ.29 రూపాయలు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో వస్తున్న ధర రూ.2 మాత్రమే. పొరుగురాష్ట్రం కర్ణాటకలో రెండున్నల లక్షల టన్నుల మామిడిని కేజీ రూ.16కి కొనుగోలు చేస్తామని కేంద్రాన్ని ఒప్పించుకోగలిగితే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అలా చేయలేక పోయారు? గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించే పొగాకు, మిర్చి, ధాన్యం రైతులు కూడా ఈ ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వ దృష్టిలో సంఘ విద్రోహులేనా? ఆఖరి అరగంట తరువాత జగన్‌కు భద్రతను లేకుండా చేశారు..వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆఖరి అరగంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి, తరువాత భద్రతను ఎందుకు పూర్తిగా వదిలేశారు. అంటే వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనే కుట్ర దీనిలో దాగుందా? ఎక్కడా వైఎస్ జగన్‌కు పోలీస్ రక్షణ లేకుండా చేసేశారు. జెడ్‌ప్లస్ కేటగిరిలో ఉన్న నాయకుడి విషయంలో ఇలాగేనా చేసేది? రెండు వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లలో ఉంటే, మార్కెట్ యార్డ్‌లో మూడు వందల మంది పోలీసులను మోహరింపచేశారు. కానీ ఆఖరి క్షణంలో ఆయన పక్కన ఎవరూ లేకుండా పోవడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది.

లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది.బంతిని తీసుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్‌స్ట్యూట్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవ్రమైనది కాకుడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(37), పోప్(24) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

మా చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం?: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణమన్నారు కేటీఆర్. ఇలా తమ చరిత్రను తొలగిస్తే ఇక మేమెవరం? అని నేరుగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు కేటీఆర్. ఈ మేరకు పలు పశ్నలు సంధించారే కేటీఆర్. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని మాత్రమే చూపించడం దారుణం. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది. భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?, ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?, లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై మీరు వెంటనే స్పష్టత ఇవ్వాలి. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.Honourable PM @narendramodi ji,We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position - TELANGANAToday, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i— KTR (@KTRBRS) July 10, 2025

స్టాలిన్ చాణక్యం.. ఏకమైన మారన్ బ్రదర్స్!
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మరోసారి చక్రం తిప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలనొప్పిగా మారిన కుటుంబ వివాదాన్ని చక్కదిద్దారు. డీఎంకే పార్టీకి ఇబ్బందికరంగా మారిన మారన్ సోదరుల ఆస్తి గొడవకు ముగింపు పలికారు. సరైన సమయంలో కల్పించుకుని అన్నదమ్ముల వివాదాన్ని పరిష్కరించారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ద్రవిడర్ కజగం అధ్యక్షుడు కె వీరమణి, హిందూ దినపత్రిక మాజీ సంపాదకుడు ఎన్ రామ్ సహాయంతో మారన్ సోదరుల మధ్య సయోధ్య కుదిర్చారు. మారన్ కుటుంబంతో పాటు డీఎంకేలోనూ అలజడి రేగకుండా కాచుకున్నారు.భారీగా దయా'నిధి'ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా కోసం అన్న కళానిధి మారన్‌పై కోర్టుకెక్కిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌కు భారీగానే నిధి దక్కినట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 800 కోట్ల నగదు.. అంతే విలువైన చెన్నైలోని ఎలైట్ బోట్ క్లబ్ ప్రాంతంలో ఎకరం భూమిని పొందారని మారన్ కుటుంబం, డీఎంకే ఉన్నత వర్గాలు వెల్లడించినట్టు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' తెలిపింది. మొత్తానికి దయానిధి మారన్ (Dayanidhi Maran) తాను అనుకున్నది సాధించారని సన్నిహిత వర్గాలు గుసగసలాడుతున్నాయి. ఎందుకంటే ఆస్తుల వివాద పరిష్కారానికి తనకు రూ. 1500 కోట్లు ఇవ్వాలని అంతకుముందు ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది.అసలేంటి గొడవ?తన అన్నయ్య కళానిధికి జూన్ ప్రారంభంలో దయానిధి లీగల్ నోటీసు పంపడంతో మారన్ సోదరుల వివాదం బయట ప్రపంచానికి తెలిసింది. సన్ టీవీ నెట్వర్క్ షేర్లను అక్రమంగా తన పేరు మీద బదలాయించుకున్నారని దయానిధి ఆరోపించారు. సన్ టీవీ నెట్వర్క్ ఒక ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు.. మోసపూరిత వాటా కేటాయింపులు, కార్పొరేట్ దుష్పరిపాలన, ఏకపక్ష నిర్ణయాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అన్నపై దావా వేశారు. అయితే దయానిధి రూ.1500 కోట్లు చెల్లించాలని కోరగా, కళానిధి రూ.500 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతోనే ఆస్తుల గొడవ రచ్చకెక్కిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా, తనపై తమ్ముడు చేసిన ఆరోపణలను కళానిధి కొట్టిపారేశారు. జూన్ 20న స్టాక్ ఎక్స్ఛేంజ్కు అధికారికంగా వివరణ ఇచ్చారు. పబ్లిక్ లిస్టింగ్‌కు ముందు సన్ నెట్వర్క్ కంపెనీకి చెందిన లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని తెలిపారు. వ్యక్తిగతంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.స్టాలిన్ చొరవ.. సమసిన గొడవమారన్ సోదరుల మధ్య ఆస్తుల వివాదం ముదిరి పాకాన పడక ముందే పరిష్కరించాలని భావించిన సీఎం స్టాలిన్.. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి స్వయంగా రంగంలోకి దిగారు. తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఆయన రూటు మార్చారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వీరమణి, ఎన్. రామ్‌లతో మంత్రాంగం నడిపించారు. ఇందులో భాగంగా మూడు దఫాల చర్చలు జరిగాయని.. వాటిలో రెండు వ్యక్తిగతంగా, ఒకటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగాయి. అయితే అన్నదమ్ముల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఈ చర్చలు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'మొదట మారన్ కుటుంబానికి వీరమణి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఇతరులు కూడా చేరారు. జూన్ చివరి వారం నుంచి జూలై మొదటి వారం వరకు మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. వివాదం గురించి ఇరు వర్గాలు మీడియాతో మాట్లాడకుండా ఉండాలని, సమస్య పరిష్కార దిశగా ముందుకు సాగాలని మధ్యవర్తులు సూచించార'ని ఆ వర్గాలు తెలిపాయి. ఈ వివాదం కారణంగా డీఎంకే, మారన్ కుటుంబానికి ప్రతిష్టకు కలిగే భంగం.. ఎక్కువ కాలం వ్యాజ్యం కొనసాగడం వల్ల కలిగే నష్టం, కోర్టు ఖర్చుల గురించి కూడా చర్చల్లో పెద్దలు ప్రస్తావించినట్టు సమాచారం.వారిద్దరే ఎందుకు?మారన్ సోదరుల ఆస్తుల గొడవ పరిష్కారానికి ఎంకే స్టాలిన్ (MK Stalin) వ్యూహాత్మకంగా రాజకీయ కురువ`ద్ధుడైన వీరమణి, ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎన్. రామ్‌లను ఎంచుకున్నారు. ఈ డిసెంబర్లో 93వ ఏట అడుగుపెట్టనున్న వీరమణి తమిళ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. అంతేకాదు ద్రవిడ ఉద్యమంలో గౌరవనీయమైన వ్యక్తిగా ఆయన గుర్తింపు ఉంది. ఇంకో కీలక అంశం ఏమిటంటే సన్ నెట్‌వర్క్‌తో ఆయన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. స్టాలిన్ కుటుంబానికి మాత్రం ఇందులో 20 శాతం వాటా ఉంది. మారన్ కుటుంబానికి బంధువైన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ (N Ram) సైద్ధాంతికంగా డీఎంకేకు దగ్గరగా ఉన్నారు. మీడియాలో విశ్వసనీయత ఆధారంగా మధ్యవర్తిత్వానికి ఆయనను స్టాలిన్ ఎంచుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న భావనతో పరిస్థితిని చక్కదిద్దడానికి స్టాలిన్ జోక్యం చేసుకున్నారని డీఎంకే నేత ఒకరు వెల్లడించారు.వేర్వేరు రంగాల్లో..కళానిధి, దయానిధి తండ్రి దివంగత మురసోలి మారన్ (Murasoli Maran) కరుణానిధి మేనల్లుడు. డీఎంకే పార్టీ అండతో ఆయన పలు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన బతికున్నంత కాలం మారన్ కుటుంబంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. ఇద్దరు కుమారులు వేర్వేరు రంగాల్లోకి ప్రవేశించి ముందుకెళ్లారు. కళానిధి 1993లో సన్ టీవీని ప్రారంభించి ప్రాంతీయ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దయానిధి మారన్ తండ్రి వారసత్వాన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లోకి ప్రవేశించి 2000లో కేంద్ర టెలికాం మంత్రి అయ్యారు.అక్కడి నుంచే మొదలు..మారన్ కుటుంబ వార్తాపత్రిక దినకరన్ కార్యాలయంపై 2007లో డీఎంకేలోని ఎంకే అళగిరి (MK Alagiri) మద్దతుదారులు దాడికి పాల్పడడం అప్పట్లో సంచలనంగా మారింది. స్టాలిన్‌ను కరుణానిధి రాజకీయ వారసుడిగా పేర్కొంటూ దినకరన్ పేపర్లో రావడంతో కోపోద్రిక్తులైన అళగిరి మద్దతుదారులు హింసాత్మకంగా స్పందించారు. పెద్ద కొడుకునైన తనను కాదని స్టాలిన్‌ను రాజకీయ వారసుడిగా వర్ణించడంతో అళగిరి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం కొనసాగుతోంది. తాజాగా మారన్ సోదరులు ఆస్తుల కోసం కోర్టుకెక్కడం తమిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. చదవండి: ఇందిరా గాంధీపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

ట్రంప్ పొగిడినా కష్టాలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనుషుల్ని మెచ్చడం అత్యంత అరుదు. అందునా తనకు నచ్చని దేశాల అధ్యక్షులను వైట్‌హౌజ్‌కు పిలిపించుకుని మరీ అవమానించడం ఆయనొక అలవాటుగా మార్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓ దేశ అధ్యక్షుడ్ని మెచ్చుకుంటే.. అది కూడా బెడిసి కొట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ , దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమక్షంలోనే డిక్టేటర్(నియంత) అంటూ తిట్టిపోశారు. అలాగే.. రామఫోసా ముందు ఓ వీడియో ప్రదర్శించి.. సౌతాఫ్రికాలో తెల్లవాళ్లను ఊచకోతలు కోస్తున్నారంటూ ఏకంగా ఓ తప్పుడు వీడియోను ప్రదర్శించి మరీ విమర్శలు గుప్పించారు.ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మినహా ఆయన ప్రత్యేకంగా ఎవరినీ ప్రశంసించింది లేదు. తాజాగా లిబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయ్పై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇప్పటిదాకా వైట్‌హౌజ్‌కు వచ్చిన ఏ నేత కూడా ఇంత అందంగా ఆంగ్లంలో మాట్లాడలేదంటూ.. Such good English అని ట్రంప్ వ్యాఖ్యానించారు. Where did you learn to speak so beautifully? అంటూ ఆరా తీశారు. తనకు తెలిసిన అమెరికన్ల కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడారంటూ కితాబిచ్చారు.Trump to Liberia’s President “Your English is beautiful better than some Americans I know.” 🇱🇷😂FYI: English is Liberia’s official language.#Trump #Liberia #JosephBoakai #Politics pic.twitter.com/WidIjSWA3N— A.S (@DHAS013) July 10, 2025అయితే ఈ పొగడ్త వివాదాస్పదంగా మారింది. లిబీరియా అధికార భాష ఆంగ్లమే. పైగా బొకాయ్ లిబీరియాలోనే విద్యనభ్యసించారు. దీంతో ఆఫ్రికా అంతటా ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆఫ్రికన్ యూత్ యాక్టివిస్ట్ ఆర్చీ హారిస్ స్పందిస్తూ.. మా దేశం ఆంగ్ల భాష మాట్లాడే దేశం. ఈ ప్రశ్నను ప్రశంసగా కాక, అవమానంగా భావించాను అని అన్నారు.దక్షిణాఫ్రికా రాజకీయ నాయకురాలు వెరోనికా మెంటే స్పందిస్తూ.. ట్రంప్ అలా అన్నాక కూడా బొకాయ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోలేదు? అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యను హృదయపూర్వక ప్రశంసగా, ట్రంప్ ఆఫ్రికా దేశాలకు మిత్రుడిగా అభివర్ణించింది. లిబీరియా.. 1822లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా స్థాపించబడింది. 1847లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆంగ్ల భాష అధికార భాషగా ఉంది, కానీ అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి.

వందేళ్లయినా AI ఈ పని చేయలేదు: బిల్‌గేట్స్
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్‌కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ఇటీవల ఎకనమిక్ టైమ్స్‌తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్‌లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్‌గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు.

యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను
ఉదయభాను (Udaya Bhanu).. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఆవిడ హడావుడే కనిపించేది. బుల్లితెరపై సెటిలవ్వడానికి ముందు సినిమాలు కూడా చేసింది. అప్పట్లో టాలీవుడ్లో తోపు యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తర్వాత సడన్‌గా తెరపై కనుమరుగైపోయింది.తొక్కేశారంటూ భావోద్వేగంగతేడాది ఓ సభలో తన కెరీర్‌ను తొక్కేశారని ఎమోషనలైంది. టీవీలో కనిపించి ఐదు సంవత్సరాలైందని పేర్కొంది. అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే ఇంకా నిలబడ్డానంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది ఉదయభాను. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది. టీవీ ఇండస్ట్రీలో సిండికేట్ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల.. యాంకర్‌ను చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అదే విషయం మైక్ అందుకుని మాట్లాడుతూ.. చాలారోజుల తర్వాత ఉదయభాను మళ్లీ ఈవెంట్స్ చేస్తున్నారు. థాంక్యూ అన్నాడు. వెంటనే ఉదయభాను కలగజేసుకుంటూ.. ఇదొక్కటే చేశానండి. మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్ ఉంది, చేయాలనుకుంటాం. కానీ, ఆరోజు వచ్చాక ఈవెంట్ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది.ఉన్నదున్నట్లు చెప్తా..నా మనసులో ఉన్న నిజమే చెప్పాను. సుహాస్ మా బంగారం కాబట్టి చేయగలిగాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదయభానుకు యాంకరింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ తనకు ఈవెంట్లు ఇవ్వడం లేదా? తనవరకు అవకాశాలను వెళ్లనివ్వడం లేదా? అని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. సిండికేట్ అన్న పెద్ద పదం వాడిందంటే తనను కావాలనే టీవీ ఇండస్ట్రీ నుంచి సైడ్ చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: మాజీ డిప్యూటీ కలెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి

శశిథరూర్ ‘చిలక పలుకుల’పై కాంగ్రెస్ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై.. ఆ పార్టీ తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేరు ప్రస్తావించడకుండా సెటైర్లు వేశారు. ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో 1975-77 మధ్య విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ ప్రాజెక్ట్ సిండికేట్‌లో ఎంపీ శశిథరూర్ గెస్ట్‌కాలమ్ రాశారు. అందులో ఇందిరా గాంధీ పాలనలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్, స్లమ్ తొలగింపు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ ‘పక్షి చిలుకైందే’ అంటూ శశి థరూర్ బీజేపీ లైన్‌ను అనుసరిస్తున్నారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.When a Colleague starts repeating BJP lines word for word, you begin to wonder — is the Bird becoming a parrot? 🦜Mimicry is cute in birds, not in politics.— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 10, 2025 ‘పక్షి చిలుకైందే’ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి.. ఇతరుల మాటలు యథాతథంగా పలికే చిలుకలా మారింది. పక్షులు ..చిలుకల్ని అనుకరిస్తే అందంగా ఉండొచ్చేమో.. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా పేర్కొన్న శశిథరూర్ నాటి దుర్భుర పరిస్థితుల్ని గెస్టు కాలంలో ప్రస్తావించారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు నిర్వహించారు.పేదలు నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారిపై దాడులు చేయడం, న్యూఢిల్లీలాంటి నగరాల్లో మురికి వాడల్లో నివాసాల్ని కూల్చివేయడం, అక్కడ నివసించే వారిని ఖాళీ చేయించారు. ఫలితంగా వేలాది మంది నిట్ట నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు. వారి సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని గుర్తు చేశారు. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2025ఇలా ఇప్పుడే గతంలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ శశిథరూర్ పలు కామెంట్లు చేశారు. రెక్కలు నీవీ.. ఎగిరేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. ఆకాశం ఏ ఒక్కరిది కాదని ట్వీట్ చేశారు.అందుకు మాణిక్యం ఠాకూర్ మరో ట్వీట్లో ఎగిరేందుకు అనుమతి అడగొద్దు.‘పక్షులు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు.. కానీ ఈ రోజుల్లో, స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. గద్దలు, రాబందులు, ఈగల్స్ ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ ఉచితం కాదు. ముఖ్యంగా వేటగాళ్లు దేశభక్తిని రెక్కలుగా ధరించినప్పుడు’బదులిచ్చారు. Don’t ask permission to fly. Birds don’t need clearance to rise…But in today even a free bird must watch the skies—hawks, vultures, and ‘eagles’ are always hunting.Freedom isn’t free, especially when the predators wear patriotism as feathers. 🦅🕊️ #DemocracyInDanger… pic.twitter.com/k4bNe8kwhR— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 26, 2025

ప్రియురాలిని రూమ్‌లో లాక్ చేసి.. ఆపై ప్రియుడు..
ఏ బంధమైనా నమ్మకం మీదే నడుస్తుంది. అది వైవాహిక బంధమైనా, లివింగ్ రిలేషన్ షిప్ బంధమైనా ఉండాల్సింది నమ్మకం. అటువంటి నమ్మకం చెల్లా చెదురై పోతే జీవితాల్లో అలజడి తప్పదు. ఓ జంట విషయంలో అదే జరిగింది. కలిసి జీవించాలనుకున్నారు. కానీ వారి బంధాన్ని ఏడాదికే ముగించేశారు. ఈ జంటలో ఒకరు మృత్యుఒడికి చేరితే, మరొకరు చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ ఘటన లివింగ్ రిలేషన్ అనేది ఫ్రెండ్ షిప్ చేసినంత ఈజీ కాదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. గువాహటిలోని కహిలిపారాలోని కళ్యాణి నగర్లో ఓ లివింగ్ రిలేషస్ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇందులో ప్రియుడు చనిపోతే, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. నవ్‌జ్యోతి తలుక్దార్- సుస్మితలు ఏడాది కాలంగా లివ్-ఇన్ రిలేషన్ షిప్లో ఉన్నారు. దీనిలో భాగంగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఏమైంది ఏమో కానీ ఇందులో తలుక్దార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో సుస్మితను వేరే రూమ్‌లో బంధించి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటున్నాడనే సమాచారాని పోలీసులకు చేరవేసింది సుస్మిత. పోలీసులు వచ్చే సరికి తలుక్దార్ విగతజీవిలా కనిపించగా, మరో రూమ్‌లో ఉన్న సుస్మిత.. చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను హుటాహుటీనా స్థానిక హయత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి మధ్య తరుచు జరుగుతున్న ఘర్షణలే దీనికి కారణమని గువాహటికి చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారువీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో బాగానే ఉన్నారని, ఆపై కొంతకాలానికి వీరి మధ్య ఎప్పుడూఆపార్థాలు చోటు చేసుకుని గొడవలు జరిగేవని స్థానికులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
‘బాగుందిరా మావ’.. నితీష్ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన గిల్! వీడియో
కమెడియన్ కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు.. వీడియో వైరల్!
రూ.5.6 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈవో.. ఎవరీ ప్రియా నాయర్?
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలన్నారు.. ఏమైంది’
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
అన్నదాత అరిగోస
ఫ్లాట్‌లో విగత జీవిగా యువ నటి.. అంత్యక్రియలకు తండ్రి నిరాకరణ!
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్
ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. రూ.200 లోపే అన్లిమిటెడ్..
‘ఆ అవకాశం కేసీఆర్‌కు ఎప్పుడో వచ్చింది.. కానీ వదిలేశారు’
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
టెక్సాస్‌లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
పెట్రోబాదుడులో ఇండియా టాప్
వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
‘బాగుందిరా మావ’.. నితీష్ రెడ్డిని తెలుగులో ప్రశంసించిన గిల్! వీడియో
కమెడియన్ కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు.. వీడియో వైరల్!
రూ.5.6 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈవో.. ఎవరీ ప్రియా నాయర్?
‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలన్నారు.. ఏమైంది’
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
అన్నదాత అరిగోస
ఫ్లాట్‌లో విగత జీవిగా యువ నటి.. అంత్యక్రియలకు తండ్రి నిరాకరణ!
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు రిమాండ్
ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. రూ.200 లోపే అన్లిమిటెడ్..
‘ఆ అవకాశం కేసీఆర్‌కు ఎప్పుడో వచ్చింది.. కానీ వదిలేశారు’
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
'ఫిష్ వెంకట్' కోసం రూ. 2 లక్షలు పంపిన సినీ హీరో
తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
టెక్సాస్‌లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
పెట్రోబాదుడులో ఇండియా టాప్
వావివరుసలు మరిచి మామతో వివాహేతర సంబంధం
Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
మస్క్ అమెరికా పార్టీ అమెరికన్ల స్వేచ్ఛ కోసమేనని వ్యాఖ్యలు
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసిన టీమిండియా యువ సంచలనం
ఈ రాశి వారికి వ్యాపారాలలో మార్పులు
ఒక్క నిమిషంలో నీ జబ్బేంటో ఇప్పుడే చెప్పేస్తా!
సినిమా

‘ది 100’ మూవీ రివ్యూ
టైటిల్ : ది 100నటీనటులు: ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ, తారక్ పొన్నప్ప తదితరులునిర్మాణ సంస్థలు : కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పూశడపుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్విడుదల తేది : జులై 11, 2024‘మొగలి రేకులు’, ‘చక్రవాకం’ సీరియళ్లతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు. సీరియళ్లతో వచ్చిన ఫేమ్‌తో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. మాన్ అఫ్ ది మ్యాచ్, సిద్ధార్థ, షాది ముబారక్ సినిమాలలో హీరోగా నటించి, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ‘ది 100’ మూవీతో జులై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘ది 100’ కథేంటంటే..విక్రాంత్(ఆర్కే సాగర్).. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగరంలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్ హత్య కేసు టేకాప్ చేస్తాడు. అదే సమయంలో తను ఇష్టపడిన యువతి ఆర్తి(మిషా నారంగ్) కూడా వీరి బాధితురాలిగా మారినట్లు తెలుస్తుంది. దీంతో విక్రాంత్ ఈ కేసుని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. తనదైన శైలీలో విచారించగా అతనికో సంచలన నిజం తెలుస్తుంది. అదేంటి? ఆ గ్యాంగ్ ఆర్తి(మిషా నారంగ్) ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేసింది? సాఫ్ట్వేర్ ఉద్యోగి మధు ( విష్ణు ప్రియ) ఆత్మహత్య వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప)తో ఈ కేసు ఉన్న సంబంధం ఏంటి? స్నేహితురాలు విద్యా(ధన్య బాలకృష్ణ) సహాయంతో విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలన్ ఒక క్రైమ్ చేయడం.. పోలీసు అధికారి అయిన హీరో అతన్ని పట్టుకోవడం.. మధ్యలో ఓ ట్విస్ట్, ప్లాష్ బ్యాక్ స్టోరీ.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అన్ని దాదాపు ఇలానే ఉంటాయి. అయితే దీంట్లో క్రైమ్ జరిగిన తీరు.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్, హీరో ఎంత తెలివిగా విలన్‌ను పట్టుకున్నాడనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుడి ఊహించని ట్విస్టులు, కట్టుదిట్టమైన స్క్రీన్‌ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. అప్పుడే ప్రేక్షకుడు చూపు తిప్పుకోకుండా కథలో లీనమవుతాడు. ఈ విషయంలో ‘ది 100’ కొంతవరకు మాత్రమే సఫలం అయింది. దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ తెరపై దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. అమ్మాయి ఆత్మహత్య సీన్‌తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విక్రాంత్‌గా హీరో ఎంట్రీ సీన్‌ని చక్కగా ప్లాన్ చేశాడు. హీరో ఏసీపీగా బాధ్యతలు చేపట్టి రాబరీ గ్యాంగ్ కేసుని టేకాప్ చేసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. రాబరీ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ఓ ట్విస్ట్.. కథనంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. రాబరీ గ్యాంగ్ బంగారం మాత్రమే ఎందుకు ఎత్తుకెళ్తడం వెనుక ఉన్న రహస్యం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయిగే ఆ గ్యాంగ్ దొరికిన తర్వాత వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్త వల్లభ(తారక్ పొన్నప్ప) ఎంట్రీ తర్వాత కథనం మరో మలుపు తిరుగుతుంది. మధు ప్లాష్‌బ్యాక్ ఎమోనల్కి గురి చేస్తుంది. అయితే ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం స్లోగా, ఊహకందేలా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి సందేశం ఇచ్చారు.ఎవరెలా చేశారంటే..మొగలి రేకులు సీరియల్లో పోలీసు పాత్రలో నటించి ఫేమస్ అయిన ఆర్కే సాగర్.. ఈ చిత్రంలోనూ అదే పాత్రే పోషించి మెప్పించాడు. ఐపీఎస్ అధికారి విక్రాంత్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన మాట, నడక, మాట..ప్రతిదీ అచ్చం పోలీసు ఆఫీసర్లాగానే అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక ఆర్తిగా మిషా నారంగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి మధుగా విష్ణు ప్రియ, హీరో స్నేహితురాలు విద్యాగా ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. సెకండాఫ్‌లో వీరిద్దరి పాత్రల నిడివి ఎక్కువగా ఉంటుంది. తారక్ పొన్నప్ప విలనిజం బాగా పండించాడు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కల్యాణి నటరాజన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

ఫిష్ వెంకట్‌కు సాయం చేసిన మరో హీరో..
సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో కచ్చితంగా ఒక కిడ్నీ అయినా మార్చాలని వైద్యులు చెప్తున్నారు. ఇందుకోసం రూ.50 లక్షలు అవసరమవుతాయన్నారు. అంత డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తమకు లేదని వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ మీడియా ముందుకు వచ్చారు.విశ్వక్ సాయంఈ క్రమంలో హీరో ప్రభాస్ పేరు చెప్పి కొందరు ఆకతాయిలు వారికి సాయం చేస్తామని మాటిచ్చారు. తీరా అది ఫేక్ కాల్ అని తెలియడంతో వెంకట్ ఫ్యామిలీ మరోసారి సాయం కోసం అర్థించింది. నటుడి అనారోగ్యం గురించి తెలుసుకున్న హీరో విశ్వక్ సేన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు.ముందుకొచ్చిన మరో హీరోతాజాగా మరో హీరో.. వెంకట్ పరిస్థితి చూసి చలించిపోయాడు. జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కృష్ణ మానినేని ఆధ్వర్యంలో, ఆయన స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. వెంకట్ కూతురు స్రవంతికి ఆమేర డబ్బు అందించాడు.అవయవదానం..ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. 100 Dreams Foundationలో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు.. అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితాన్నే మార్చేస్తుంది" అని తెలిపాడు.చదవండి: ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్‌బాస్ టీమ్

ప్రముఖ నటి షోలో చనిపోయేందుకు ట్రై చేసింది: బిగ్‌బాస్ టీమ్
చాలామంది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు పాపులారిటీ, డబ్బు కోసమే వెళ్తుంటారు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాక పూర్తిగా అందులోనే లీనమవుతారు. కొన్నిసార్లు ప్రేమలో పడి బయట ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా ఓ నటి నిజంగానే లవ్‌లో పడింది. కానీ అవతలి వ్యక్తి ఫుటేజీకోసం, పాపులారిటీ కోసం ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు. ఈ విషయం తెలిసి సదరు నటి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.బ్రేకప్ అయ్యాక హౌస్‌లోకి..ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రియుడితో బ్రేకప్ అయి విపరీతమైన బాధలో ఉన్న ఓ ప్రముఖ నటి బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశ్యంతో రియాలిటీ షోకి వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ హౌస్‌లోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడు కూడా ప్రేమిస్తున్నట్లు నటించాడు. అది ఆమె గుర్తించలేకపోయింది. అతడు మోసం చేస్తున్నాడని గ్రహించిన రోజు బాధ తట్టుకోలేకపోయింది.అదే వారం ఎలిమినేట్తను షోలో ఉన్న విషయం కూడా మర్చిపోయి తెల్లవారుజామున మూడుగంటలకు బాత్రూమ్కి వెళ్లి చనిపోయేందుకు ప్రయత్నించింది. ఆమె చేస్తున్న పనిని గ్రహించి మేమంతా సెట్లోకి పరిగెత్తి తనను అడ్డుకున్నాం. మా లక్ ఏంటంటే సైకియాట్రిస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ముంబై నుంచి వచ్చేవరకు తనతో మాట్లాడుతూ కూర్చున్నాం. పొద్దున ఏడింటివరకు తనతోనే ఉన్నాం. అదే వారం ఆమెను ఎలిమినేట్ చేసి పంపించేశాం అని చెప్పుకొచ్చాడు. ఆ నటి పేరు మాత్రం వెల్లడించలేదు.బిగ్‌బాస్ ఎన్ని భాషల్లో?డచ్ రియాలిటీ షో బిగ్‌బ్రదర్ నుంచి పుట్టిందే బిగ్‌బాస్. ఇండియాలో బిగ్‌బాస్.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ప్రసారమవుతోంది. తెలుగులో బిగ్‌బాస్ 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదో సీజన్ ప్రారంభం కానుంది. మూడో సీజన్ నుంచి నాగార్జునే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభానుముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్‌పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ గడ్డపై టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్‌లక్ వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యా టింగ్ ఎంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం.ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో టాస్ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్‌తో విండీస్‌ను మెన్ ఇన్ బ్లూ అధిగమించింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, భారత జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రాగా.. టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(27), పోప్(19) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్‌కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.

ఆ భారత ఆటగాడికి ఇదే ఫేర్వెల్ టెస్టు?
'డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ఇవ్వు' అంటూ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కరుణ్ నాయర్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన నాయర్.. 77 పరుగులు మాత్రమే చేశాడు.ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఈ విధర్బ ఆటగాడు.. రీ ఎంట్రీ ఇన్నింగ్స్‌లోనే డౌకటయ్యాడు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ అద్బుతమైన విజయం సాధించినప్పటికి కరుణ్నాయర్ ఆటపై మాత్రం సర్వాత్ర విమర్శల వర్షం కురిసింది. దీంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టుకు అతడిపై ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ వేటు వేస్తుందని అంతా భావించారు.ఇదే ఆఖరి ఛాన్స్.. ?కానీ గంభీర్ అండ్ కో కరుణ్ నాయర్‌కు మరో అవకాశమిచ్చారు. లార్డ్స్ టెస్టు భారత తుది జట్టులో నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కీలకమైన మూడో స్దానంలో బ్యాటింగ్ వస్తున్న నాయర్.. తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిస్తే అతడికి ఇదే ఫేర్వెల్ టెస్టు అయ్యే అవకాశముంది. ఎందుకంటే జట్టులో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు వేచిచూస్తున్నారు. సాయిసుదర్శన్ వంటి యువ సంచలనంపై కేవలం ఒక్క మ్యాచ్‌కే టీమ్‌మెనెజ్‌మెంట్ వేటు వేసింది. తొలి టెస్టులో మూడో స్దానంలో ఆడిన సాయిసుదర్శన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించి మూడో స్ధానంలో కరుణ్‌కు అవకాశమిచ్చారు. కరుణ్ కూడా ఫెయిల్ అవడంతో సుదర్శన్‌కు మరో అవకాశాన్ని ఇవ్వాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. సుదర్శన్‌తో పాటు బెంగాల్ దేశవాళీ క్రికెట్ దిగ్గజం అభిమాన్యు ఈశ్వరన్ కూడా జట్టులో చోటు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.రంజీల్లో అదుర్స్..భారత జట్టులోకి పునరాగమానికి ముందు దేశవాళీ క్రికెట్లో నాయర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.చదవండి: Nitish Kumar Reddy: అతడు ఎందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే అద్భుతం

T20 WC 2026: వార్మప్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్ చేసింది. కార్డిఫ్స్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్ జూన్ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్ 21, క్వాలిఫయర్ జట్టుతో జూన్ 25, ఆస్ట్రేలియాతో జూన్ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్

అతడు ఎందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి ఓవర్లోనే అద్భుతం
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ బంతి(Nitish Kumar Reddy)తో అద్బుతం చేశాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఒకే ఓవర్లో ఇంగ్లీష్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీని పెవిలియన్‌కు పంపాడు. తొలి సెషన్లో 13 ఓవర్ వరకు డకెట్, క్రాలీ తమ వికెట్‌ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు.జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లు సైతం వీరిని ఔట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 14 ఓవర్ వేసిన నితీశ్.. మూడో బంతికి బెన్ డకెట్(23), ఆఖరి బంతికి జాక్ క్రాలీ(18) ఔట్ చేశాడు. దీంతో భారత్ మళ్లీ గేమ్‌లోకి తిరిగొచ్చింది. అయితే రెండో టెస్టులో మాత్రం నితీశ్ బ్యాట్‌తో, బంతితో రాణించలేకపోయాడు. దీంతో అతడిని లార్డ్స్ టెస్టుకు పక్కన పెట్టాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.కానీ హెడ్ కోచ్ గంభీర్, గిల్ అతడిపై నమ్మకంతో తుది జట్టులో కొనసాగించారు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీశ్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడుతోంది. 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేసింది. క్రీజులో రూట్(12), పోప్(1) ఉన్నారు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు
బిజినెస్

మస్క్ కంపెనీకి భారత్‌లో అనుమతులు
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్‌లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్‌లింక్ భారత్‌లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్‌లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్‌లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్‌లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్‌లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్‌లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్‌వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్‌లింక్ వెంటనే భారత్‌లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్‌వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్‌లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం.

‘మెటాలో పని.. క్యాన్సర్ అంత ప్రమాదం’
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సూపర్ ఇంటలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్‌లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైట్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు.

తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!
ఇంట్లో నాన్న తీసుకొచ్చిన కిడ్డీబ్యాంక్ గుర్తుందా.. అమ్మ, నాన్న, ఎప్పుడైనా బంధువులు వస్తూపోతూంటే ఇచ్చే చిల్లర డబ్బులు దాచుకునేందుకు కిడ్డీబ్యాంకు ఉపయోగిస్తారు. ఏదైనా అత్యవసర సమయాల్లో పిల్లలు ఆ డబ్బును వాడుకుంటారు. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోయాలని అలా చేస్తారు. స్కూల్‌కు వెళ్లే దారిలోనో..సండే అలా పేరెంట్స్‌తో సరదాగా బయటకు వెళ్లే సమయంలోనే ఎస్బీఐ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఐసీఐసీఐ బ్యాంక్ అని పేర్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఉన్న కిడ్డీబ్యాంకు గురించి తెలుసుకానీ.. ఇవేం బ్యాంకులని చిన్నారుల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి.ఈ బ్యాంకులు కూడా ఇంట్లోని కిడ్డీ బ్యాంకుల్లాగే పని చేస్తాయి. పిల్లలు నిత్యం ఎలాగైతే డబ్బు పొదుపు చేసి అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటారో.. అదే మాదిరిగా సేవింగ్స్, ఎఫ్డీ వంటి ఖాతాలో డబ్బు దాచుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. కాదంటే.. కిడ్డీ బ్యాంకులో ముందుగా ఎంతైతే డబ్బు వేస్తామో చివరిదాకా అంతే మొత్తం ఉంటుంది. కానీ బయట చూసే బ్యాంకుల్లో డబ్బు దాస్తే కొంత అధిక మొత్తం కలిపి ఇస్తారు. ఇలా బ్యాంకువారు కలిపి ఇచ్చే మొత్తాన్నే వడ్డీ అంటారు. కాబట్టి ప్రాథమికంగా కిడ్డీబ్యాంకులో డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకొని, తర్వాత బ్యాంకుల్లో దాచుకోవడం నేర్చుకోవాలి. దాన్నివల్ల అదనంగా వడ్డీ సమకూరుతుంది కదా!పిల్లలే నేరుగా బ్యాంకు ఖాతాను తెరిచేందుకు వెళ్తే పాటించాల్సినవి..బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు గేట్వద్దే తుపాకీ పట్టుకొని బారుమీసాలతో గంభీరంగా ఒక వ్యక్తి ఉంటాడు. చిన్నారులూ.. అతడిని చూసి భయపడకండి. ఆ మీసాల మామ మనోడే.. మీ ఇంట్లోనీ కిడ్డీ బ్యాంకును ఎలాగైతే జాగ్రత్తగా ఒకచోట దాస్తారో.. అలాగే ఆ బ్యాంకుకు తాను నిత్యం భద్రత అందిస్తూ కాపలాకాస్తాడు. కాబట్టి మీరు వేసే డబ్బులు మరింత భద్రంగా ఉంటుంది.మామకు గుడ్‌మార్నింగ్ చెప్పి బ్యాంకులోకి వెళితే చాలామంది ఉంటారు. వారిలో చాలావరకు బ్యాంకులో ఏదోఒక పని కోసం వచ్చినవారే. కంగారు పడకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబిన్లో కూర్చున్నవారిని గమనించండి. వారే బ్యాంకు సిబ్బంది.బ్యాంకులో డిపార్ట్మెంట్ల వారీగా చాలా మంది సిబ్బంది పని చేస్తారు. అంటే.. డబ్బులు మన నుంచి తీసుకునే వారు కొందరు ఉంటే.. ఇప్పటికే బ్యాంకులో డబ్బు వేస్తే తిరిగి ఇచ్చేవారు ఇంకొందరుంటారు. దాంతోపాటు ప్రత్యేకంగా లోన్లు ఇచ్చే వారుంటారు. మీ తరగతిలో లీడర్ ఎలాగైతే ఉంటాడో.. బ్యాంకులోనూ వీరందరినీ మ్యానేజ్ చేసే లీడర్ ఉంటారు. అతడే మేనేజర్.ప్రతి బ్యాంకులో ‘మే ఐ హెల్త్ యూ’ అని లేదా ‘ఎంక్వైరీ’ సైన్ బోర్డుతో ఒక క్యాబిన్ ఉంటుంది. అందులో ఉన్న అంకుల్ దగ్గరకు వెళ్లి.. ‘బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయానుకుంటున్నాను.. ప్రాసెస్ ఏంటి’ అని అడిగితే తాను ఖాతా ఓపెన్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి చెబుతారు. దాంతోపాటు ఎలాంటి రకాల ఖాతాలున్నాయో వివరిస్తారు.పిల్లల కోసం బ్యాంకులు అందిస్తున్న కొన్ని ఖాతాలు..యూత్ లేదా మైనర్ అకౌంట్: ఇది మైనర్ల కోసం రూపొందించిన ప్రామాణిక పొదుపు ఖాతా. ఇది సాధారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు ఖాతాకు జోడించబడి ఉంటుంది. ఈ ఖాతాలను చిన్న మొత్తాలను నిర్వహించవచ్చు.కస్టోడియల్ అకౌంట్: ఈ ఖాతా పిల్లల పేరు మీదే ఉంటుంది. కానీ తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు పిల్లల వయసు (సాధారణంగా 18 లేదా 21) వచ్చే వరకు ఖాతాను నిర్వహిస్తాడు.జాయింట్ అకౌంట్: కొన్ని బ్యాంకులు తల్లిదండ్రులు తమ పిల్లలతో జాయింట్ అకౌంట్ తెరిచేందుకు అనుమతిస్తాయి. ఈ ఖాతాలో పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి నిర్వహించవచ్చు.బ్యాంకు ఎంచుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..అన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలకు ఒకే రకమైన ప్రయోజనాలు అందించవు. ఆన్లైన్ సహాయంతో పిల్లల ఖాతాలు తెరిచేందుకు అనువైన బ్యాంకులను సెర్చ్ చేయాలి.నెలవారీ రుసుము లేకుండా.. నెలవారీ రుసుము వసూలు చేయని బ్యాంకులను ఎంచుకోవాలి. ఎందుకంటే దీని వల్ల పిల్లల చిన్నపాటి పొదుపు హరించుకుపోతుంది.తక్కువ లేదా నో మినిమమ్ డిపాజిట్.. కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కనీస డిపాజిట్ అవసరం ఉంటుంది. కాబట్టి తక్కువ లేదా ఎలాంటి డిపాజిట్ అవసరంలేని బ్యాంకులను ఎంచుకోవాలి.ఆన్లైన్ బ్యాంకింగ్.. చాలా బ్యాంకులు యువ ఖాతాదారుల కోసం మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ బ్యాంకింగ్‌ను అందిస్తున్నాయి. అలాంటి సదుపాయం ఉన్న బ్యాంకుల తలుపు తట్టండి.ఎడ్యుకేషనల్ టూల్స్.. కొన్ని బ్యాంకులు పిల్లలకు పొదుపు, బడ్జెట్, డబ్బు నిర్వహణ గురించి నేర్పడానికి రూపొందించిన సాధనాలను అందిస్తాయి. అలాంటి ఆర్థిక అక్షరాస్యత నేర్పే వాటిని ఎంచుకోవాలి.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఐడీకార్డులు (డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ మొదలైనవి).చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు, లీజు ఒప్పందం మొదలైనవి).పిల్లల జనన ధ్రువీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ (వయసును ధ్రువీకరించడానికి అవసరం)చిరునామా రుజువు (పిల్లవాడి పేరు మీద శాశ్వత చిరునామా ఉంటే ఇవ్వాలి)కొన్ని బ్యాంకులు అదనపు డాక్యుమెంట్లను అడగవచ్చు. కాబట్టి ఆయా బ్యాంకు వెబ్సైట్లలో ముందుగా వివరాలు తనిఖీ చేయడం మంచిది.
ఫ్యామిలీ

‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్
ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో మన ముందుంటుంది. కింగ్ కోబ్రా అయినా పులులు, సింహాలైనా, ఏనుగులైనా ఆకర్షణీయమైన వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. వర్షాలకు పరవశంతో ఆటుకుంటున్న పిల్ల ఏనుగుల వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది."మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే" అని శ్రీశ్రీ అన్నట్టు పిల్లలు ప్రకృతిలోని అందాలను స్వచ్ఛమైన మనసుతో ఆస్వాదిస్తారు. ఆడిపాడతారు. పసితనం అనేది మనుషులకైనా.. జంతువులకైనా ఒకటే నిరూపించే ఘటన ఇది. ఒక జోరు వాన పడుతోంది. దీంతో గజరాజులతో కలిసి పిల్ల ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి. ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ అన్నట్టు, ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ తొండంతో కొట్టుకుంటూ అల్లరి చేశాయి. బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్‌గఢ్ అటవీ శాఖ డ్రోన్ కెమెరా బంధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని ధరమ్‌జైగఢ్ ఫారెస్ట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం! #WATCH | Chhattisgarh: Raigarh Forest Department's drone captured a herd of elephants with their calves playing in the mud in the monsoon season. Visuals from Dharamjaigarh Forest Division. (08.07.2025)(Video Source: Chhattisgarh Forest Department) pic.twitter.com/BheMJESyxs— ANI (@ANI) July 9, 2025కాగా వర్షాకాలంలో ఏనుగులు బురదలో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అవి గుంపులుగా చేరి, ఒకదానితో ఒకటి బురదను చల్లుకుంటూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!
వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాల వల్ల చాలామంది నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కకపోవడం ఎవరికైనా మనస్తాపం కలిగిస్తుంది. పనిచేసే చోట రాజకీయాల వల్ల తరచుగా నష్ట΄ోతూ ఉన్నట్లయితే విరక్తిలో కూరుకుపోతారు. ఇలాంటి దుస్థితిని ఎలా అధిగమించాలంటే... అసూయాపరుల కారణంగా ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించాలంటే, శుక్రవారం రాత్రివేళ కిలో మినుములను నీట్లో నానబెట్టండి. శనివారం ఉదయం స్నానాదికాల తర్వాత ముందురోజు నానబెట్టిన మినుములను ఒక పళ్లెంలోకి తీసుకోండి. ఆ మినుములను మూడు సమ భాగాలుగా చేయండి. ఒక భాగాన్ని గుర్రానికి, ఒక భాగాన్ని గేదెకు, ఒక భాగాన్ని ఆవుకు తినిపించండి.ప్రభుత్వోద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ జీవితంలో అవరోధాలు తొలగిపోవాలంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. ప్రతి ఆదివారం ఒక చిన్న బెల్లంముక్కను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. ఉద్యోగ జీవితంలో కుట్రలు కుతంత్రాలకు బాధితులు బలి కాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం ఉపవాసం చేయండి. శుక్రవారం ఉదయం స్నానాదికాల తర్వాత దేవీ ఆర్గళ స్తోత్రాన్ని మూడుసార్లు ఏకాగ్రతతో పఠించండి. అనాథ బాలికలకు కొత్త దుస్తులు ఇవ్వండి.ఉద్యోగ జీవితంలో పురోగతికి ఏర్పడుతున్న అవరోధాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానాదికాలు, నిత్యపూజ తర్వాత రావిచెట్టు మొదట్లో గుప్పెడు నానబెట్టిన మినుములు, ఒక చిన్న బెల్లం ముక్క నివేదనగా ఉంచి, నీలిరంగు పూలతో పూజించాలి. గాయత్రీ హోమం చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.– సాంఖ్యాయన విజయం కోసం... జయ శ్లోకంజయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలఃరాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితఃదాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణఃహనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజఃన రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీంసమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్జయశ్లోకం అనే పేరుగల ఈ శ్లోకాన్ని మన కోరికను లేదా సమస్యను బట్టి శుచిగా ఉండి 5/11/21/40 రోజులపాటు నిత్యం భక్తిశ్రద్ధలతో చదువుకుంటూ హనుమంతుడికి అరటిపండ్లు నివేదించడం వల్ల ఎంతటి క్లిష్ట సమస్యలైనా తీరిపోతాయని ప్రతీతి. మంచి మాటలు మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటపుడు మనం కనపడాల్సిన అవసరం లేదు. మంచితనం కనపడితే చాలు.చిరునవ్వును మించిన అలంకరణ లేదు. వినయాన్ని మించిన ఆభరణం లేదు. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది. కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది.మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు’.చెడుని ప్రశ్నించడం, మంచిని ప్రశంసించడం నేర్చుకున్నప్పుడు అది మనలో మంచిని పెంచి చెడుని తొలగిస్తుంది’.

ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..
క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్బెంచ్లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్బెంచ్లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి. సెకండరీ హయ్యర్స్కూల్కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఎందుకు?ఆ సినిమా కథ ఏమిటి?కె.ఆర్.నారాయణన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్ సి సెక్షన్లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్’. శ్రీకుట్టన్ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లంతా అల్లరి గ్యాంగ్ అని క్లాస్‌లో ఫ్రంట్ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్ స్కూల్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.1996లో కేంద్రం చెప్పినా...క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. (చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు! )

ఆకర్షణ అశాశ్వతం... కుటుంబ బంధమే శాశ్వతం!
డాక్టరు గారు! నేను కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నాను. అతనికి కూడా వివాహం అయింది. పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాలనుండి మా ఈ బంధం కొనసాగుతోంది.. శారీరకంగా కన్నా మానసికంగా మేము ఎక్కువ దగ్గర అయ్యాము. కానీ ఈ మధ్య కాలంలో అతను వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం, నన్ను అంతగా పట్టించుకోకపోవటం నన్ను చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. ఆకలి, నిద్ర బాగా తగ్గిపోయాయి. మనసంతా చికాకుగా, ఏడుపు వస్తుంది. అశాంతితో నరకం అనుభవిస్తున్నాను. అతను నాకు ఏమీ కాడు అని తెలిసినా తట్టుకోలేకపోతున్నాను! ఆఖరికి ఆత్మహత్మ ఆలోచనలు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను! – ఒక సోదరి, గుంటూరుమీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు తీవ్రమైన మనోవేదన (డిప్రెషన్)కు లోనయినట్లుగా అర్థం అవుతోంది. జీవితంలో ఒక్కోసారి తప్పటడుగులు వేయడం సహజం. మీకు మంచి భర్త, పిల్లలు ఉన్నా, ఆ వ్యక్తికి భార్య పిల్లలున్నారని తెలిసి కూడా సంబంధం పెట్టుకున్నారు! ఒక్కొక్కసారి భార్యా భర్తల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి అసంతృప్తికి లోనయినవారు, ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశ ముంటుంది! ఇప్పుడా వ్యక్తి తన భార్యను, మిమ్మల్ని కాదని ఇంకా మూడోవ్యక్తితో, కొత్తగా రిలేషన్ షిప్ పెట్టుకున్నాడంటే అతని వ్యక్తిత్వమేంటో మీకీపాటికి తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా మించియిందేం లేదు, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలోనే మనిషి ఔన్నత్యం బయటపడుతుంది. ఒక వేళ మీ విషయం మీ భర్తకు తెలిస్తే మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అంతా ‘మన మంచికే ’ అని ‘ఆత్రేయ’ గారు అన్నట్లు, ఆ మూడో వ్యక్తి వల్ల ఒక విధంగా మీకు, మీ కుటుంబానికి, మంచి జరిగినట్లయింది. మీరు మీ మనోవేదనలోంచి త్వరగా బయటపడేందుకు మీ దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ని కలిసి మీ కుంగుబాటును తగ్గించేందుకు కొన్ని మందులు అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’, మీ భార్య భర్తల మధ్య ఏదైనా అంతరాలుంటే సరిదిద్దుకునేందుకు ‘కపుల్ థెరపీ’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా మీ సమస్యలోంచి త్వరగా బయటపడి మీలో మానసిక ప్రశాంతత, సమస్యను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వచ్చేలా చేయవచ్చు. కాలమే మనసుకు తగిలిన గాయాలను మాన్పుతుంది! మనసైనా, మనిషైనా, మనది కానిది, ఎన్నటికీ మనది కాబోదనే జీవిత సత్యాన్ని గుర్తుంచుకోవాలి! ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: 'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..)
ఫొటోలు
అంతర్జాతీయం

ఎఫ్–1 వీసాలు తగ్గాయ్!
యూఎస్‌లో చదువుకోవాలని, అక్కడ స్థిరపడాలన్న భారతీయ విద్యార్థుల కలలపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని ఫలితంగానే భారతీయ విద్యార్థులకు వీసాలు భారీగా తగ్గాయి. 2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వలసలపై కఠిన చర్యలు తీసుకోవడం, అలాగే అభ్యర్థుల సామాజిక ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే అనుమతించడం ఇందుకు ప్రధాన కారణాలు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలు కష్టాల్లో పడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీలు ఏటా ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. భారతీయ విద్యార్థులు సాధారణంగా ఆగస్టు–డిసెంబర్ సెమ్నే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. దీని కోసం 6 నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. అలా సాధారణంగా ఏటా మార్చి–జూలై మధ్య వీసాల సందడి ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదేకాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. కోవిడ్–19 తర్వాత 2025 మార్చి–మే నెలల్లో అత్యల్ప స్థాయిలో వీసాలు మంజూరు అయ్యాయని అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదిక తెలిపింది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం మార్చి–మే నెలల్లో 2022లో 10,894, 2023లో 14,987 వీసాలు జారీ చేసింది. ఏప్రిల్ నాటికి యూఎస్ అధికారులు అక్కడి కనీసం 32 రాష్ట్రాల్లో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశారని ఎన్బీసీ న్యూస్ తెలిపింది. వీసా దరఖాస్తుదారుల పరిశీలన కోసం యూఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తోంది.ప్రాసెసింగ్‌కు సమయం.. విద్యార్థుల దరఖాస్తులు తగ్గడం, తిరస్కరణలు పెరగడం, ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడంలో జాప్యం వీసాల తగ్గుదలకు కారణం అయి ఉండొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం చెబుతోంది. ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందన్న అంచనాతో దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే నాన్–ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల షెడ్యూలింగ్ ప్రారంభం అయిందని, దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం సంబంధిత ఎంబసీ, కాన్సులేట్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ‘ప్రపంచవ్యాప్తంగా వీసా జారీ ప్రక్రియ అత్యున్నత ప్రమాణాలకు లోబడి ఉందని నిర్ధారించుకోవడానికి, దరఖాస్తుల పూర్తి పరిశీలనకు తగినంత సమయం ఇవ్వడానికి కాన్సులర్ విభాగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వీసా దరఖాస్తుదారులకు యూఎస్‌కు లేదా మా ప్రయోజనాలకు హాని కలిగించే ఉద్దేశం లేదని, వారు కోరిన వీసా కోసం వారి అర్హతను విశ్వసనీయంగా వెల్లడించారని నిర్ధారించుకోవడానికి అనునిత్యం పని చేస్తున్నాం’ అని యూఎస్ ఎంబసీ ప్రతినిధులు చెబుతున్నారు.మనవాళ్లే ఎక్కువ.. వీసా జారీలో ఇటీవల తగ్గుదల ఉన్నప్పటికీ.. వాస్తవానికి అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య వృద్ధి గణనీయంగా ఉంది. ఓపెన్ డోర్స్ 2024 డేటా ప్రకారం 2023–24 విద్యా సంవత్సరంలో యూఎస్‌లో అడ్మిషన్స్ తీసుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం కావడం విశేషం. గత ఏడాది జనవరి–సెపె్టంబర్లో భారతీయ విద్యార్థులు 64,008 ఎఫ్–1 వీసాలు అందుకున్నారు. ఇదే కాలంలో 2023లో 1.03 లక్షలు, 2022లో 93,181 వీసాలు జారీ అయ్యాయి. తనిఖీలు కఠినం ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల గురించి లోతుగా పరిశీలించడం ప్రారంభించిన తరుణంలో ఈ తగ్గుదల నమోదు కావడం గమనార్హం. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు, ప్రభుత్వ వ్యతిరేక చర్యలతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులతో సహా అనేక మంది వ్యక్తులకు వీసాల రద్దు కూడా జరిగింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలపై మరింత కఠినమైన తనిఖీలను ప్రవేశపెట్టడానికి మే 27 నుంచి జూన్ 18 వరకు కొత్త దరఖాస్తులను నిలిపివేశారు. విద్యార్థి వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడాన్ని నిలిపివేయాలని రాయబార కార్యాలయాలు, కాన్సులర్ విభాగాలను మే నెలలో యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. అంతర్జాతీయ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయాలని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్, ఎం, జే విభాగాల వీసాల స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి సోషల్ మీడియా ఖాతాల అయిదు సంవత్సరాల వివరాలను బహిరంగపరచాలని న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం దరఖాస్తుదారులకు ఆదేశించింది.

కలిసి సాగుదాం..ప్రగతి సాధిద్దాం.. నమీబియాకు ప్రధాని మోదీ పిలుపు
విండోహెక్: అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రను భారత్ గుర్తిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అధికారం, ఆధిపత్యం ద్వారా కాకుండా, భాగస్వామ్యం, దౌత్యంతో భవిష్యత్తును నిర్ణయించేందుకు భారత్, నమీబియా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రిపబ్లిక్ ఆఫ్ నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా ఖండం కేవలం ముడి సరుకులకు వనరుగా మిగిలిపోవద్దని.. విలువ సృష్టి, సుస్థిరాభివృద్ధిలో నాయకత్వ పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.రక్షణ రంగంలో ఆఫ్రికాతో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇండియా అభివృద్ధి అనుభవాలను నమీబియాతో, ఆఫ్రికాతో పంచుకోవడం గర్వకారణమని చెప్పారు. ‘‘ఆఫ్రికాతో బంధానికి 2018లో 10 సూత్రాలు ప్రతిపాదించా. వాటికి కట్టుబడి ఉన్నాం. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఆ సూత్రాలు రూపొందాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడడం కాదు.. ఒకరికొకరం సహకరించుకోవాలి. కలసికట్టుగా ఎదగడం మన లక్ష్యం కావాలి’’ అని స్పష్టంచేశారు. ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ భారత్, నమీబియా మధ్య బలమైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. నమీబియాతో స్నేహ సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టంచేశారు. ఇండియాలో చీతాల పునరుద్ధరణ ప్రాజెక్టుకు నమీబియా ఎంతగానో సహకరించిందని అన్నారు. నమీబియాలో తదుపరి తరం శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నాయకులకు సహకారం అందిస్తామని ప్రకటించారు. రేడియో థెరఫీ మిషన్లు సరఫరా చేయబోతున్నామని వివరించారు. ఇండియా–నమీబియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 800 మిలియన్ డాలర్లకు చేరిందని, ఇది క్రికెట్ గ్రౌండ్లో వార్మప్ మాత్రమేనని, ఇకపై మరింత వేగంగా పరుగులు చేయాలని పిలుపునిచ్చారు. నమీబియాకు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు నెటుంబో నంది–ఎన్‌డైత్వాను ప్రధాని మోదీ అభినందించారు. భిన్న నేపథ్యం కలిగిన పౌరుల ఎదుగుదలకు నమీబియా రాజ్యాంగం చక్కటి తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయాన్ని బోధిస్తోందన్నారు. ఒక నిరుపేద గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారంటే అది భారత రాజ్యాంగం గొప్పతనమేనని వ్యాఖ్యానించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన తాను ప్రధానమంత్రి అయ్యానంటే అందుకు తమ రాజ్యాంగమే కారణమన్నారు. సంబంధాలు బలోపేతం చేసుకుందాం ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని, కీలక రంగాల్లో కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని భారత్, నమీబియా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నమీబియా చేరుకున్నారు. అధికార లాంఛనాలతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తొలుత స్టేట్‌హౌస్‌లో నమీబియా అధ్యక్షురాలు నెటుంబో నంది–ఎన్‌డైత్వాతో మోదీ సమావేశమయ్యారు. డిజిటల్ సాంకేతికత, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, అరుదైన ఖనిజాలు, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.నాలుగు ఒప్పందాలపై సంతకాలు నాలుగు ముఖ్యమైన ఒప్పందాలపై భా రత్, నమీబియా సంతకాలు చేశాయి. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో సహకారంతోపాటు నమీబియాలో ఆంట్రప్రెన్యూ ర్షిప్ డెవలప్మెంట్ సెంటర్, సీడీఆర్ఐ ఫ్రేమ్‌వర్క్, గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయెన్స్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు కోసం రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాలు కుదిరాయి. మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీని నమీబియా ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియెంట్ వెలి్వవిషియా మిరాబిలిస్’తో సత్కరించింది. నమీబియా అధ్యక్షురాలు నెటుంబో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. భారత్, నమీబియా మధ్య చెదిరిపోని స్నేహానికి ఈ అవార్డు ఒక ప్రతీకగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించిన తొలి భారతీయ నాయకుడిగా మోదీ రికార్డుకెక్కారు.

అప్పులే అప్పులు
అనుకుంటాంగానీ.. అప్పులేనిదే అమెరికాకూ గడవదు. ప్రపంచంలోసంపన్నదేశం, అగ్రరాజ్యం అని చెప్పుకొనే అమెరికానే.. ప్రపంచంలో అత్యంత ఎక్కువ అప్పు చేసిన దేశం కావడం విశేషం. ఐక్యరాజ్యసమితివాణిజ్యం, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన ‘అప్పులప్రపంచం 2025’ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేనంతగా 102 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో దాదాపు సగం అమెరికా, చైనాలదే. 2010 నుంచి చూస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు భారీగా పెరుగుతోంది. దీంతో ఆ దేశాలకు వడ్డీల భారం తడిసి మోపెడవుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ప్రపంచంలో అత్యధిక అప్పు ఉన్న దేశం అమెరికా. దాని అప్పు 35 ట్రిలియన్ డాలర్లు. ఆ తరువాతి స్థానంలో చైనా ఉంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. మొత్తం ప్రపంచ అప్పులో సుమారు 70 శాతం అభివృద్ధి చెందిన దేశాలదే అయితే అందులో అమెరికా, చైనాలదే సగభాగం. ఆ తరువాత సుమారు 25 శాతం ఆసియా, ఓషనియా దేశాలది. అభివృద్ధి చెందుతున్న దేశాల అప్పు మొత్తం ప్రపంచ అప్పులో 31 శాతం. ఐక్యరాజ్యసమితి వాణిజ్యం, అభివృద్ధి విభాగం (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన ‘అప్పుల ప్రపంచం 2025’ నివేదికలో ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో ప్రపంచ దేశాల అప్పు రికార్డు స్థాయిలో 102 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. వడ్డీల భారం తడిసిమోపెడు అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024లో రికార్డు స్థాయిలో 921 బిలియన్ డాలర్లు కేవలం వడ్డీల కోసమే చెల్లించాయి. 2017తో పోలిస్తే ఇది రెట్టింపుకాగా, 2023తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 61 దేశాలు.. ప్రభుత్వ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ కేవలం తీసుకున్న రుణానికి వడ్డీకింద చెల్లిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు విరివిగా ఖర్చు చేయాలి. కానీ, వడ్డీల భారం అందుకు అవకాశం ఇవ్వడం లేదు. 2011–13 నుంచి 2021–23 మధ్య విద్య కోసం ఈ దేశాలు చేసిన వ్యయం 52 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఆరోగ్యం కోసం చేసిన ఖర్చు 77 శాతం పెరిగింది. కానీ, తీసుకున్న అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల భారం ఏకంగా 84 శాతం ఎగబాకింది. ఇలా విద్య, ఆరోగ్యం కంటే వడ్డీలకే ఎక్కువ వ్యయం చేస్తున్న దేశాల్లో నివసిస్తున్న జనాభా దాదాపు 340 కోట్లు. జీడీపీలో 60 శాతం!అభివృద్ధి చెందుతున్న సుమారు 60 దేశాల్లో.. జీడీపీలో అప్పు వాటా ఏకంగా 60 శాతానికి చేరిపోయింది. 2020లో ఆఫ్రికా, ఆసియా, ఓషనియా, లాటిన్ అమెరికా, కరీబియన్‌లో ఇలాంటి దేశాల సంఖ్య 67 కాగా.. తరువాత స్వల్పంగా తగ్గుతూ 2024 నాటికి 58కి చేరింది. 2010లో ఈ సంఖ్య 35. 2013తో పోలిస్తే ప్రైవేటు సంస్థల నుంచి దేశాలు తీసుకునే అప్పు రెండింతలకుపైగానే పెరిగింది. ఆఫ్రికా దేశాల్లో ఇది 42 శాతం, ఆసియాలో 61, లాటిన్ అమెరికా, కరీబియన్‌లో ఏకంగా 71 శాతం.8.6 శాతం అప్పుల కోసమే..అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగానికిపైగా దేశాల మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయంలో.. ఆయా దేశాల బహిరంగ రుణం విలువ దాదాపు 88 శాతం. అంటే.. దాదాపుగా వస్తు, సేవల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయమంత అప్పు అన్నమాట! ఈ దేశాలు తమ మొత్తం ఆదాయంలో 8.6 శాతాన్ని అప్పు కోసమే (అసలు, వడ్డీ ) కేటాయిస్తున్నాయి. 2010తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. దీనివల్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు, మూలధన వ్యయానికి సరిపడా నిధులు ఉండటం లేదు. వడ్డీ కూడా ఎక్కువేఅభివృద్ధి చెందిన దేశాలు అప్పులపై చెల్లించే వడ్డీ కంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు అమెరికా చెల్లించే వడ్డీ కంటే ఇతర దేశాలు దాదాపు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. మరి ఈ దేశాలకు ఆర్థిక సహాయం రావడం లేదా అంటే.. వస్తోంది. కానీ.. రాయితీ రుణాల రూపంలో! గతంలో గ్రాంట్ల రూపంలో వచ్చేది కాస్తా ఇప్పుడు మారిపోయింది. 2011–13 మధ్య అధికారిక అభివృద్ధి సాయం కింద వచ్చే మొత్తంలో 28 శాతంగా ఉన్న ఈ రుణం 2021–23 మధ్య 33 శాతానికి పెరిగింది.

‘ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్కడ?’.. ట్రంప్‌పై మస్క్ కొత్త దాడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్ తాజాగా మరోమారు ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన కీలక ఫైల్స్‌ను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదంటూ ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను నిలదీశారు.How can people be expected to have faith in Trump if he won’t release the Epstein files?— Elon Musk (@elonmusk) July 8, 2025దీంతో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం తాజాగా అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాను కొత్తగా స్థాపించిన అమెరికా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని మస్క్ పేర్కొన్నారు.ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) జెఫ్రీ ఎప్స్టీన్ సంబంధించిన కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలలో సోదాలు చేసినా ఎటువంటి క్లయింట్ లిస్ట్ దొరకలేదని, ఇకపై ఈ కేసులో ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. దీనిపై మస్క్ తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఒక విలేకరి ఇదే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానాన్ని దాటవేశారు. మీరు ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా? అని తిరుగు ప్రశ్నవేశారు. Will exposing the Epstein files rank high on the America Party’s list?— Community Notes & Violations (@CNviolations) July 8, 2025న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ సాగించిన దుర్మర్గాల జాబితాను గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల పేర్లతో పాటు మైకెల్ జాక్సన్ తదితరుల పేర్లు బయటికొచ్చాయి.
జాతీయం

ఉత్తరాదిన భూకంపం.. భయంతో జనం పరుగులు
న్యూఢిల్లీ: దేశారాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. కొన్ని క్షణాలపాటు బలమైన భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రత నమోదయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్లో భూకంప తీవ్రత కనిపించింది. హర్యానాలోని రోహతక్ వద్ద భూకంపకేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూకంపాన్ని గుర్తించినంతనే జనం భయాందోళనలకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే జనం రోజువారీ కార్యకలాపాల్లో మునిగివున్న సమమంలో ఈ భూకంపం సంభవించింది.యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి భూకంపం సమయంలో తన అనుభవాన్ని వివరిస్తూ, అప్పుడే తాను నిద్రలేచానని, భూ ప్రకంపనలు చూసి భయపడ్డానని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇలానే భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. #WATCH | An earthquake with a magnitude of 4.4 on the Richter Scale hit Jhajjar, Haryana today at 9.04 am IST. Strong tremors felt in Delhi-NCR. A man in Ghaziabad, UP says, "...I had woken up just at the time when there was a jolt. I was scared. There was another earthquake… pic.twitter.com/YHDyGq7Oaa— ANI (@ANI) July 10, 2025ఢిల్లీ-హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్‌లోనూ బలమైన భూకంపం సంభవించింది. దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. జనం భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉదయం 9.04 గంటలకు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, భివానీ, బహదూర్గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది.జజ్జర్లో రెండు నిమిషాల్లో రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 9:07 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉదయం 9:10 గంటలకు తిరిగి స్వల్పంగా భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్)తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం జజ్జర్‌కు ఉత్తరాన 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. #earthquakeOnly elvish Bhai can save Delhi ncr from Earth quake ☠️❤️🔥😭👀 pic.twitter.com/TQTqSqtAbI— Yash Pratap (@yash_pst) July 10, 2025

ఎమ్మెల్యే ‘పాచిపోయిన పప్పు’ వివాదం.. క్యాంటీన్ లైసెన్స్ సస్పెండ్
ముంబై: ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న క్యాటరర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)సస్పెండ్ చేసింది. పాచిపోయిన పప్పు వడ్డించారనే ఆరోపణలతో శివసేన శాసనసభ్యుడు సంజయ్ గైక్వాడ్ క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన దరిమిలా ఎఫ్‌డీఏ చర్యలు చేపట్టింది.ఎఫ్‌డీఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్- 2006లోని కీలక నిబంధనలను, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్- 2011ను ఎమ్మెల్యే హాస్టల్ క్యాంటీన్ ఉల్లంఘించించింది. హాస్టల్లో నిర్వహించిన తనిఖీలలో పలు ఉల్లంఘనలు బయటపడినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. పన్నీర్, చట్నీ, నూనె, కంది పప్పు నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపుతామని, 14 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. జూలై 10 నుండి హాస్టల్ ప్రాంగణంలో అన్ని ఆహార సేవల కార్యకలాపాలను నిలిపివేయాలని ఆహార నియంత్రణ సంస్థ ఆదేశించింది. #WATCH | Mumbai: Food and Drug Administration (FDA) officials took food samples from the Akashvani MLA canteen. Shiv Sena MLA Sanjay Gaikwad thrashed a canteen employee here yesterday, alleging poor quality of food"Samples of paneer, Schezwan chutney, oil and toor dal have been… pic.twitter.com/SZw4hhBRuS— ANI (@ANI) July 9, 2025శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఎమ్మెల్యేల హాస్టల్ క్యాంటీన్లో ఒక నిర్వాహకునిపై చేయిచేసుకున్న ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. గైక్వాడ్ ఎమ్మెల్యే హాస్టల్లోని తన గదికి భోజనం ఆర్డర్ చేయగా, వచ్చిన ఆహారంలో పప్పు దుర్వాసన వస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన క్యాంటీన్లోని సిబ్బందిపై చేయిచేసుకుని, బిల్లు చెల్లించడానికి నిరాకరించారు. తరువాత ఆయన తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, ఈ విషయంలో ఎటువంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. హోటల్‌పై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. బిహార్‌లో అలా జరగనివ్వం
పట్నా: 2024లో మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను పునరావృతం చేయాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ఈసీ చేపట్టిన ఓటరు జాబితా (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సవరణ ద్వారా ప్రజల నుంచి ఓటు హక్కును లాగేసుకునేందుకు కుట్ర పన్నిందన్నారు. పట్నాలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బుధవారం ఇండియా కూటమి పార్టీలు ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. బీజేపీ మహారాష్ట్రలో బోగస్ ఓట్లను భారీగా చేర్పించడం ద్వారా ఫలితాలను అనుకూలంగా మార్చుకుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని విమర్శించారు. బీజేపీ నామినేట్ చేసిన ఎన్నికల కమిషనర్లు, ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ప్రజల ఓట్లు, ముఖ్యంగా యువత నుంచి ఓటు హక్కును దొంగిలించేందుకు ఈసీ చేసే ప్రయత్నాలను తాము కొనసాగనీయబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగ ప్రతిని చూపుతూ రాహుల్ ప్రసంగించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు చేపట్టిన జాతీయ స్థాయి నిరసనల్లో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీ మాదిరిగా తయారైందని దుయ్యబట్టారు. ఓటర్ల జాబితా నుంచి ఇప్పుడు పేర్లు తీసేస్తున్నారు..ఆ తర్వాత రేషన్, పింఛను కూడా రాకుండా చేస్తారంటూ నితీశ్ సర్కార్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్కార్‌కు ఘోర పరాజయం తప్పదన్నారు. అనంతరం సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ, దీపాంకర్ భట్టాచార్య కూడా మాట్లాడారు.

‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్‌లో ద్వారాలు తెరచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలు అందించేందుకుగాను సంస్థకు కీలక అనుమతులు వచ్చాయి. భారత్‌లో వాణిజ్యపరంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టేందుకు అవసరమైన అనుమతులను భారత అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ అయిన ‘ఇండియన నేషనల్ స్పేస్ అథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ మంజూరు చేసింది. 2022 నుంచి వాణిజ్య లైసెన్స్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఈ సంస్థకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. టెలికాం విభాగం నుంచి గత నెలలో స్టార్‌లింక్ అనుమతులు పొందిన విషయం తెల్సిందే. తాజాగా అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్ లింక్‌కు మార్గం సుగమమైంది.
ఎన్ఆర్ఐ

న్యూజిలాండ్‌లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్‌రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు.

లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో లండన్లోనిని ఈస్టమ్లో దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.యూకే నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ లో పాల్గొని వేడుకల్లో భాగస్వాములైన వారిని అభినందించారు. వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖరరెడ్డి జీవి తాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకో వడం సంతోషంగా ఉందన్నారు. మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నార న్నారు. నేతలందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఓబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ యూకే కో-కన్వీనర్ మలిరెడ్డి కిశోర్‌రెడ్డి, కీలక కమిటీ సభ్యులు శ్రీనివాస్ దొంతిబోయిన, ఎస్ఆర్ నందివెలుగు, సురేందర్ రెడ్డి అలవల, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ కల్చరల్ సొసైటీ 12వ సర్వ సభ్య సమావేశం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదకొండవ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన తరువాత పద్దులను ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల ఆమోదించారు. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ , గర్రెపల్లి శ్రీనివాస్, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకట రమణ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్‌గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2024‐2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పద్దుల తనిఖీ దారులుగా సేవలు అందించిన కైలాసపు కిరణ్, తెల్లదేవరపల్లి కిషన్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ రాజ్యాంగానికి ప్రతిపాదించిన కొన్ని ముఖ్యమైన సవరణలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. 2025 నుంచి 2026 గాను పద్దుల తనిఖీ దారులుగా నీలం సుఖేందర్, కిరణ్ కుమార్ ఎర్రబోయిన గార్లను ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు సాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీ ని ఆస్వాదించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ గార్ల తోపాటు ఇతర జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)

ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైఎస్సార్సీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్‌ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, అరే శ్యామల, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు.
క్రైమ్

తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్‌లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్‌లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్‌లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్‌పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్‌లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్‌కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్‌పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్‌పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

850 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి/సూళ్లూరుపేట: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో 850 కిలోల గంజాయిను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పదిమందిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిపోలీస్ స్టేషన్ పరిధి వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటకకు బొలేరో వాహనంలో తరలిస్తున్న 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్కపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ కె.కుమారస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీచేస్తుండగా, ఒక బొలెరో వాహనంలో 20 బ్యాగుల్లో 840 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దాని విలువ రూ.42 లక్షలు ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మామిడిపాలేనికి చెందిన సుక్రీ అర్జున్, డేగలపాలేనికి చెందిన వంతల సురేశ్, పెద్దపేటకు చెందిన కొదమ నాగరాజు, పాంగి అర్జునరావు కలిసి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా అటవీప్రాంతాల్లో గంజాయి కొనుగోలుచేసి «డౌనూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులను తప్పించుకుని నర్సీపట్నం తీసుకొచ్చారని తెలిపారు. అక్కడ నుంచి కర్ణాటకకు తరలించేందుకు పెద్దపేటకు చెందిన పాంగి అర్జునరావు, చింతపల్లికి చెందిన వంతల సురేశ్, రోలుగుంటకు చెందిన కైసర్ల దివాకర్, నక్కపల్లికి చెందిన యలమంచిలి రమణ సిద్ధమవుతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. సుక్రీ అర్జున, కొదమ నాగరాజులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సూళ్లూరుపేటలో ఆరుగురు అరెస్ట్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ షార్కు వెళ్లే మార్గంలోని చెంగాళమ్మ లేఅవుట్‌కు చెందిన కంపా చంద్రకాంత్ (28), విజయవాడ ఆర్ఆర్ పేటకు చెందిన అంకాల భరత్ కౌశల్ అలియాస్ కౌశిక్ (28), తడమండలం వెండ్లూరుపాడుకు చెందిన బూరగ తేజ (23), సూళ్లూరుకు చెందిన మొండెం శైలేష్ (21), తడమండలం అనపగుంటకు చెందిన పరింగి నరేంద్ర (30), సూళ్లూరు నాగరాజపురానికి చెందిన వేనాటి శ్రీ (20)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు.

KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదంగా మారింది. కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి మొత్తంగా 31మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో పలువురు నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు.