మ్యాచ్‌కు ముందే లవ్‌ ప్రపోజల్‌ | INDIAN JOURNALIST PROPOSES TO COLOMBIAN CHESS STAR IN THE MIDDLE OF A TOURNAMENT | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌కు ముందే లవ్‌ ప్రపోజల్‌

Published Wed, Sep 26 2018 5:10 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

ప్రేమకు కులం, మతం, భాష, సరిహద్దులతో సంబంధం లేదని ,రెండు మనసులు కలిస్తే చాలని మరోసారి నిరూపితమైంది. 2018 చెస్‌ ఒలంపియాడ్‌ టోర్నీ సందర్భంగా ఓ భారత జర్నలిస్ట్‌.. కొలంబియన్‌ చెస్ ప్లేయర్‌కు ప్రపోజ్‌ చేయడం చర్చనీయాంశమైంది. సరిగ్గా టీమ్‌మ్యాచ్‌ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుందనగా.. భారత జర్నలిస్ట్‌ నిక్లేష్‌ జైన్‌.. కొలంబియా చెస్‌ స్టార్‌ విమ్‌ ఎంజెలా లోపెజ్‌కు తన ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో ఎంజెలాతో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. నిక్లేష్‌  మోకాళ్ల పై కూర్చోని రింగ్‌ను బహుమతిగా ఇస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఎంజెలాకు హిందీలో ప్రపోజ్‌ చేయడం విశేషం. తన ప్రపోజల్‌ ముగ్దురాలైన ఎంజెలా అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement