Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

YSR Jayanthi 2025: YS Jagan Pays Tributes YSR at YSR Ghat Tweet Updates1
YSR Jayanthi: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.వైఎస్‌ జగన్‌ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్‌ వద్దకు పోటెత్తారు.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మిస్‌ యూ డాడ్‌.. వైఎస్సార్‌ జయంతిని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మిస్‌ యూ డాడ్‌ అంటూ ఎక్స్‌ ఖాతాలో ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ఫొటోలను పంచుకున్నారు.Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025ఆందోళన వద్దు.. అండగా ఉంటాంకడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్‌ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.

Hyderabad City Court Mail Related Stoty Full Details2
హైదరాబాద్‌లో వరుస బాంబు బెదిరింపులు.. రాజ్‌భవన్‌, కోర్టు సహా..

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో, పోలీసుల తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. తాజాగా రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. వరుసు బాంబు బెదిరింపుల ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వివరాల ప్రకారం.. సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్‌ మెయిల్‌ వచ్చింది. బెదిరింపు మెయిల్‌ పంపిన ఆగంతకుడు. నాలుగు ఆర్డీఎక్స్‌ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్‌ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటుగా నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్టు హెచ్చరిక. సిటీ సివిల్‌ కోర్టు, జడ్జి చాంబర్స్‌, జింఖానా క్లబ్‌, జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు అమర్చినట్టు మెయిల్‌. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్‌ పేలిపోతుందంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడి మెయిల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు చోట్ల బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

CM Revanth And KTR Political Challenge Security At Press Club3
కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ కౌంటర్‌

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల సవాల్‌ అప్‌డేట్స్‌.. కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ కౌంటర్‌..కేటీఆర్ నీకు దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా..దళిత ముఖ్యమంత్రి ఏమైందో ఎందుకు చెప్పడం లేదు..కేసీఆర్‌ను తొక్కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు..రేవంత్ రెడ్డి దమ్ము ఏంటో కేసీఆర్‌ను అడుగు కేటీఆర్..కేటీఆర్ ఓక బచ్చా..వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా ఉండాలో కనీసం అవగాహన లేని నేత కేటీఆర్.కేటీఆర్ అహాంకారం అంతా లక్ష కోట్ల దోపిడీతో వచ్చింది.సాగరహారంలో మీరెక్కడ ఉన్నారు కేటీఆర్...దోచుకుంటరు.. జై తెలంగాణ అంటరు..బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరాం, మందకృష్ణ మాదిగ లాంటి ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.దోపిడీ చేసిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తప్పేంటి?.కల్వకుంట్ల కుటుంబంలో రన్నింగ్ రేస్ నడుస్తోంది.బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్‌కు వంద సీట్లు వచ్చేవి.రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేసీఆర్‌, కేటీఆర్‌ది కాదు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్‌ కామెంట్స్‌..ముఖ్యమంత్రికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదు.18 నెలలుగా రైతులను మోసం చేశారు.ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారు.రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదు.రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తే చర్చకు ఆయన రాలేదు.రేవంత్‌ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించాం.సీఎం కాకపోయినా మంత్రి అయినా వస్తారని అనుకున్నాం.తెలంగాణ నిధులు ఢిల్లీకి పారిపోతున్నాయి.రైతులపై సీఎం రేవంత్‌ రెడ్డి గౌరవం లేదు.ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసం అని చెబుతున్నారు.రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు.కొడంగల్‌లో ఎంత మంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్‌ రెడీగా ఉంది.రైతుల మరణాల లిస్ట్‌ కూడా తీసుకొచ్చాం.ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పటికైనా మరోసారి సవాల్‌ చేస్తున్నా. రేవంత్‌తో చర్చకు సిద్ధం.. ప్లేస్‌ ఎక్కడో డిసైడ్‌ చేయాలని సవాల్‌ చేస్తున్నా. డేట్‌ కూడా మీరే ఫిక్స్‌ చేయండి.. ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తాం. చర్చ కోసం రేవంత్‌ ఇంటికి రమ్మనా వెళ్తాం. రేవంత్‌ స్థాయికి కేసీఆర్‌ అవసరం లేదు.. మేము చాలు. మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి. లేదంటే క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలీ కేటీఆర్చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దురేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది యూరియా బస్తాల కోసం కాదుఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసురేవంత్ రెడ్డికి రచ్చ చేయటమే తెలుసు. చర్చ చేయటం రాదుఏ బేసిన్ ఎక్కడుందో తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరేవంత్ హాయాంలో నీళ్ళు ఆంధ్రకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు రేవంత్ తొత్తులకుగురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళను ఆంధ్రకు పంపుతున్నారునాలుగు రోజులు మోసాలు చేసి రేవంత్ తప్పించుకోవచ్చు. ప్రజలు క్షమించరుసవాల్ విసిరి మాట తప్పటం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు2018లో కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పాడు అసెంబ్లీకి కాంగ్రెస్‌ నేతలు..అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.అసెంబ్లీకి రమ్మంటే బీఆర్‌ఎస్‌ నేతలు పారిపోతున్నారు.సభ పెట్టేందుకు కేసీఆర్‌తో లేఖ రాయించండి.9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.బీఆర్‌ఎస్‌ మాటలపై చర్చ పెడదాం. ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ప్రెస్‌కబ్ల్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసిన కేటీఆర్‌. తెలంగాణ భవన్‌ నుంచి ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరిన కేటీఆర్‌భారీ కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌. ప్రెస్‌క్లబ్‌ వద్ద టెన్షన్‌ టెన్షన్‌.. కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ సవాల్‌ సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోనున్నారు. ఇక, ఇప్పటికే సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ వద్దకు బీఆర్‌ఎస్‌ నేతలు చేరుకుంటున్నారు. దీంతో, ప్రెస్‌క్లబ్‌ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు.. తెలంగాణ భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ సవాల్‌ చేశారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నేతలు మర్చిపోయారు. హామీలు అమలు చేయాలని 18 నెలలుగా కోరుతున్నాం. అడ్డగోలు హామీలతో రైతులతో పాటు అందరినీ మోసం చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరు.. పెట్టినా మాకు మైక్‌ ఇవ్వరు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నాను. రేవంత్‌ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు అయిన వస్తారేమో చేస్తాం. మంత్రులతోనైనా మేం చర్చలకు సిద్దం అని అన్నారు.

Gambhir Once In A Blue Moon Act Surprises Ravi Shastri: Not often That4
అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!.. గంభీర్‌ రియాక్షన్‌ వైరల్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ Gautam Gambhir)కు చాలా కాలం తర్వాత గొప్ప ఊరట లభించింది. ఇంగ్లండ్‌ (IND vs ENG)తో రెండో టెస్టులో భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించడంతో అతడిపై విమర్శలకు అడ్డుకట్ట పడింది. కాగా గౌతీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా బాగానే రాణిస్తోంది.వరుస పరాజయాలుముఖ్యంగా ఇటీవల చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ ట్రోఫీ గెలవడం గంభీర్‌ కోచింగ్‌ కెరీర్‌లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే, టెస్టుల్లో మాత్రం గౌతీ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌పై విజయం మినహా.. టీమిండియా వరుసగా దారుణ పరాజయాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్‌ చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని కోల్పోయింది. ఈ క్రమంలో స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ట్రోఫీ మధ్యలోనే రిటైర్మెంట్‌ ప్రకటించగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా టెస్టులకు స్వస్తి పలికారు.ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. ఇంగ్లండ్‌ పర్యటనలోనూ ఆరంభంలో చేదు అనుభవమే మిగిలింది. తొలి టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక సంప్రదాయ ఫార్మాట్లో భారత్‌ ఇలా వరుసగా మ్యాచ్‌లు ఓడటంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురిసింది. అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.తొలిసారి ఈ వేదికపై గెలిచిఇలాంటి తీవ్ర ఒత్తిడి నడుమ టీమిండియా తమకు అచ్చిరాని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికపై ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుకు ఊహించని రీతిలో షాకిచ్చి.. ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా టెస్టుల్లో కెప్టెన్‌గా గిల్‌కు.. విదేశీ గడ్డపై కోచ్‌గా గంభీర్‌కు తొలి విజయమే మధురానుభూతిని మిగిల్చింది.ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించిన తర్వాత గంభీర్‌ చిరునవ్వులు చిందించాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఇరుజట్ల ఆటగాళుల​ పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో గిల్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న గౌతీ.. ఎంతో సంతోషంగా కనిపించాడు.అతడు తరచూగా నవ్వడు.. ఈసారి మాత్రంఇందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్‌ ఒడిసిపట్టగా.. కామెంటేటర్‌ రవిశాస్త్రి గంభీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘అతడు తరచూగా నవ్వడు. అయితే, ఈసారి మాత్రం చిరునవ్వులు చిందించేందుకు పూర్తిగా అర్హుడు.ఒక ఓటమి తర్వాత జట్టు తిరిగి పుంజుకోవడం.. అది కూడా ఈ స్థాయిలో బౌన్స్‌ బ్యాక్‌ అవ్వడం.. సిరీస్‌ ఆశలను సజీవం చేసుకోవడం కంటే ఓ కోచ్‌కు గొప్ప సంతోషం మరేదీ ఉండదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!ఇక రవిశాస్త్రి కామెంట్స్‌ వైరల్‌ కాగా.. ‘‘అమాసకు.. పున్నానికి (అమావాస్యకు.. పౌర్ణమికి) ఓసారి నవ్వే గంభీర్‌.. ఈసారి మనస్ఫూర్తిగా చిరునవ్వులు చిందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. బర్మింగ్‌హామ్‌లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య జూలై 10-14 వరకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో మూడో టెస్టుకు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్‌ గిల్‌🎙️ Ravi Shastri on-air: Don't see him smile too often but Gautam Gambhir deserves every bit of it. #ENGvsIND pic.twitter.com/avyTsSTv5t— KKR Vibe (@KnightsVibe) July 6, 2025

MNS Workers Language row Protest Rally in Thane5
మహారాష్ట్రలో ఉద్రిక్తత.. పోలీసులు అదుపులో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు

థానే: మహారాష్ట్రలో భాషా వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్రంలోని థానేలో చోటుచేసుకున్న ఒక బాషా వివాదంపై రాజ్‌థాక్రే సారధ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్‌) కార్యకర్తలు థానేలో నిరసన ప్రదర్శనలు చేపట్టగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎంఎన్‌ఎస్‌ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ, వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసన తెలుపుతున్నందున వారిని అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే ఈ సమయంలో నిరసనల్లో పాల్గొన్న ఎంఎస్‌ఎన్‌ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం మరాఠీ ప్రజల మార్చ్‌కు అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎంఎస్‌ఎన్‌కు నిరసన ప్రదర్శనలకు ఒక నిర్ధిష్ట మార్గాన్ని కేటాయించారని, అయితే అది కాదని, వారు వేరే మార్గంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారి మార్చ్‌ను అడ్డుకున్నారని వివరించారు.మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించినందుకు దుకాణ యజమానిపై ఇటీవల ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు చేయిచేసుకున్నారు. దీనికి నిరసనగా వ్యాపారుల నిర్వహించిన ఆందోళనను తిప్పికొట్టేందుకు ఎంఎన్‌ఎస్‌ ఈ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఎంఎస్‌ఎస్‌ కార్యకర్తల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీనిపై ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు మాట్లాడుతూ మీరా రోడ్దులో వ్యాపారులు మార్చ్ నిర్వహించారని, తమకు ఇదే ప్రాంతంలో నిరసన నిర్వహించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. ఇక్కడ తమకు మార్చ్‌కు అనుమతించే వరకు విశ్రమించేది లేదని ఎంఎన్‌ఎస్‌ ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్‌పాండే పేర్కొన్నారు.ఇటీవల మరాఠీలో మాట్లాడేందుకు నిరాకరించిన ఒక దుకాణ యజమానిపై ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన దరిమిలా వ్యాపారులు నిరసన చేపట్టారు. దీనిని ఖండిస్తూ ఈరోజు(మంగళవారం) ఎంఎన్‌ఎస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే దీనికిముందు స్థానిక ఎంఎన్‌ఎస్‌ నేత అవినాష్ జాదవ్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కాగా రాష్ట​ంలోని ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడవ భాషగా చేస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు బాషా వివాదాన్ని మరింతగా పెంచాయి. ప్రతిపక్షాలతో పాటు వివిధ భాషా సంఘాల నుండి వ్యతిరేకత వచ్చిన దరిమిలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Maremma Movie First Look Unveiled6
రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది

హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మారెమ్మ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మంచాల నాగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపా బాలు కథానాయిక. మోక్ష ఆర్ట్స్‌ బ్యానర్‌పై మయూర్‌ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘మారెమ్మ’ టైటిల్‌ ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘పవర్‌ఫుల్‌ రూరల్‌ గ్రామీణ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మారెమ్మ’. మాధవ్‌ను ఫెరోషియస్‌ రగ్డ్‌ లుక్‌లో ప్రజెంట్‌ చేస్తున్నారు నాగరాజ్‌. ఈ పాత్ర కోసం ఆయన పూర్తీగా మేకోవర్‌ అయ్యారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉమేష్‌ విలాసాగరం, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కుశాల్‌ రెడ్డి కందాలా, కెమెరా: ప్రశాంత్‌ అంకిరెడ్డి, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి.

Dr YS Rajasekhara Reddy 76th Birth Anniversary7
జన్మ సార్థకత వైఎస్‌కే చెల్లింది!

‘పుట్టిన రోజు పండగే ప్రతి ఒక్కరికి.. పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే’’ పాత సినిమా పాట ఇది. కాకపోతే... దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అతికినట్లు సరిపోతుంది ఇది. వచ్చిన అవకాశాలను ప్రజల కోసం వినియోగించిన తీరు గమనిస్తే పుట్టింది ఎందుకో తెలిసిన వ్యక్తులలో వైఎస్సార్‌ అగ్రభాగాన ఉంటారు. సంపన్న కుటుంబంలో జన్మించినా సామాన్యుల ప్రగతి కోసం తాపత్రయపడడం ఆయన ప్రత్యేకత. ఎంబీబీఎస్‌ చదివిన తర్వాత ఆ విద్యకు సార్థకత తేవడానికి జమ్మలమడుగులో పేదల కోసం వైద్యశాల నిర్వహించారు. రూపాయి డాక్టర్‌గా సేవలందించి ప్రజల మన్నన చూరగొన్నారు. రాజకీయాలలోనూ ఆయన తన విధానాలను వదులుకోలేదు. ఎన్నో ఎగుడు దిగుడులు చూశారు. సవాళ్లు ఎదుర్కున్నారు. అయినా ఓటమి ఎరుగని నేతగా రికార్డు సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు... విభజిత ఏపీలోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఈ రికార్డు దక్కింది వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌కు మాత్రమే. ఎమ్మెల్యేగా పోటీచేసినా, ఎంపీగా ఎన్నికల బరిలో దిగినా ప్రజలు మాత్రం వారికే పట్టం కట్టారు. 1996లో కడప లోక్‌సభ సీటు నుంచి పోటీచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ గెలవడం ఒక సంచలనం. 1999లోనే ఆయన ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కాని అప్పట్లో టీడీపీ బీజేపీతో అవకాశవాద పొత్తు పెట్టుకోవడం, కార్గిల్ యుద్ద ప్రభావం, ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వాన్ని కోల్పోయారన్న సానుభూతి వంటి కారణాలు కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేశాయి. ఆ దశలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వైఎస్ నాయకత్వం వహించారు. అప్పట్లోనూ చంద్రబాబు నాయుడు తన సహజశైలిలో వైఎస్ వ్యక్తిత్వ హననం నానా ప్రయత్నాలూ చేశారు. బ్యానర్లు కట్టారని, ఎన్నికల నిబంధనలు సరిగా పాటించలేదని, ర్యాలీలు తీశారన్న చిన్న చిన్న కారణాలపై కూడా కేసులు పెట్టించి వ్యతిరేక ప్రచారం చేసేవారు. వాటిని బూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగేది. ఇందుకు టీడీపీ మీడియా తోడు ఉండనే ఉంది.1999లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా వైఎస్‌ దానిని ఛాలెంజ్ గా తీసుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. తదుపరి పాదయాత్రను ప్లాన్ చేసుకుని జనంలోకి వెళ్లినప్పుడు కాంగ్రెస్ లోని ఇతర వర్గాలు వ్యతిరేకించాయి. సొంతంగా ఎదగడానికి యత్నిస్తున్నారని, భవిష్యత్తులో సోనియా గాంధీని కూడా ధిక్కరిస్తారని పితూరీలు చెప్పేవారు. అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహిస్తూండేది. దాంతో వైఎస్ కొన్నిసార్లు ఇబ్బందులు పడేవారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వద్ద అనారోగ్యానికి గురయ్యారు. సోనియా గాంధీని అక్కడకు తీసుకురావాలని కొంతమంది నేతలు యత్నించారు కాని ఎందువల్లో ఆమె రాలేదు. అయినా వైఎస్ తన పాదయాత్రను వదలి పెట్టలేదు. 2003లో చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ దాడి చేసినప్పుడు వైఎస్ తిరుపతి వెళ్లి పరామర్శ చేసి దాడికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద దీక్ష నిర్వహించారు. అప్పట్లో చంద్రబాబు సానుభూతి వస్తుందని ఆశించి శాసనసభను రద్దు చేశారు. కాని వివిధ కారణాల వల్ల ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సానుభూతిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూశారు. పాదయాత్ర ద్వారా ప్రజలలో వచ్చిన ఆదరణను నిలబెట్టుకునేందుకు వైఎస్‌ యత్నించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ గ్రూపులను సైతం కలుపుకుని వెళ్లడానికి సిద్దపడ్డారు. అక్కడ నుంచి ఆయన రాష్ట్ర చరిత్రను ,గతిని మార్చేశారని చెప్పాలి. 2004లో కాంగ్రెస్‌ను విజయపథంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆయనకు సీఎం పదవి దక్కరాదని కొన్ని యత్నాలు జరగకపోలేదు. అయినా ఆయన తొణకలేదు. చివరికి వైఎస్ కాకుండా మరెవరికైనా సీఎం పదవి ఇస్తే ప్రభుత్వం నడవడం కష్టమని తెలుసుకుని, అధిష్టానం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం మొదలు అనేక హామీల అమలుకు కృషి చేశారు. అంతకుముందు ఒకసారి ఎంపీల సమావేశంలోకాని, ఇతరత్రాకాని నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టకపోతే చరిత్ర హీనులవుతారని ఆనాటి పాలకులను రాజశేఖరరెడ్డి హెచ్చరించే వారు. వైఎస్‌కు భయపడి ఎన్నికలకు ముందు అప్పట్లో చంద్రబాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాని 2004 వరకు ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. ఆ సమయంలో వైఎస్ ఒక కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన శిలాఫలకాల వద్ద పూలు పెట్టివచ్చారు. ఆ సంగతులు అన్నిటిని గుర్తుంచుకున్న వైఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే ప్రాజెక్టులపై సమీక్ష చేసి వాటిని ఎలా పరుగు పెట్టించాలా అని ఆలోచన చేశారు. వైఎస్‌ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు. ఉమ్మడి ఏపీలో ప్రాంతాలకు అతీతంగా ఆయన చేపట్టిన ప్రాజెక్టులు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తాయి. రాయలసీమకు ఉపయోగపడే పోతిరెడ్డిపాడు విస్తరణతో సహా హంద్రీ నీవా, గాలేరు-నగరి, గండికోట ఇలా పలు ప్రాజెక్టులను చేపట్టారు. తెలంగాణలో ఎల్లంపల్లి, కల్వకర్తి, బీమా, ప్రాణహిత-చేవెళ్ల మొదలైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోస్తాంద్రలో పోలవరం, పులిచింతల, వంశధార, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలైవని ఉన్నాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ సమయంలో తెలంగాణ వారితో పాటు ఆంధ్రకు చెందిన టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు, నిరసనలు ఎదుర్కున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలు తవ్వుతుంటే టీడీపీ ఎన్నో ఆటంకాలు కల్పించింది. అయినా ఆయన ఆగలేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కావల్సిన అనుమతులు తేవడంలో వైఎస్ చూపిన శ్రద్ద నిరుపమానం. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ఒప్పుకున్నదంటే ఆ ఘనత ఆయనదే. పులిచింతల నిర్మాణం దశాబ్దాల తరబడి స్తంభించిపోతే వైఎస్సార్‌ దానిని చేసి చూపించారు. దానిని వ్యతిరేకించే తెలంగాణ కాంగ్రెస్ నేతలను సైతం ఒప్పించి మరీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారు. ఒక నేత ఈ భారీ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కావని భావిస్తే, వైఎస్ మాత్రం మనం మొదలుపెడితే ఎవరో ఒకరు పూర్తి చేస్తారంటూ విశాల దృక్పథంతో ఆరంభించారు. ఈ రోజు విభజిత ఆంధ్ర ఈ మాత్రమైనా నిలబడిందంటే అది వైఎస్ గొప్పదనమని అంగీకరించక తప్పదు. ఇది మాబోటివాళ్లం ఇప్పుడు చెప్పడం లేదు. 2009 నుంచే చెబుతున్నాం. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనం కట్టిన ఒక సీఎం హైదరాబాద్ తానే నిర్మించానని ప్రచారం చేసుకుంటారు. కాని వైఎస్ ప్రచారం లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఒక రూపం తెచ్చారు. అదంతా ఒక ఆధునిక నగరంగా మారిందంటే బీపీ ఆచార్య అనే ఐఎఎస్ అధికారిని నియోగించి వైఎస్ చేసిన కృషే అని చాలామందికి తెలియక పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని ప్రచారం చేసుకోలేకపోయింది. టీడీపీ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకతను భరిస్తూ ఔటర్‌ రింగ్ రోడ్డు నిర్మాణం మూడువంతులు పూర్తిచేశారు. హైదరాబాద్ దశ, దిశను మార్చిన గొప్ప ప్రాజెక్టు అది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణమే కాకుండా, అక్కడకు వెళ్లడానికి వీలుగా ఎక్స్‌ప్రెస్‌ వంతెనను 13 కిలోమీటర్ల దూరం నిర్మించడం ద్వారా ఆయనకు ఉన్న విజన్‌ను ప్రజలకు తెలియ చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన నేతగా, విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ ను ప్రవేశపెట్టి పేదలకు విద్యాదానం చేసిన వ్యక్తిగా చరిత్రపుటలలోకి ఎక్కారు. 2009లో ఆయనను ఓడించడానికి టీడీపీ ఏకంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసిందంటేనే వైఎస్ ఎంత శక్తిమంతుడుగా అవతరించారో అర్థం చేసుకోవచ్చు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన టీడీపీ, టీఆర్‌ఎస్‌(నేటి బీఆర్‌ఎస్‌), సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కూటమి కట్టినా 2009లో వైఎస్‌ను ఓడించలేకపోయాయి. మొత్తం బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం మరోసారి రావడానికి కూడా వైఎస్ కారణభూతులయ్యారు. అయినా ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. వైఎస్ జీవించి ఉన్నా, వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌ను సీఎంగా చేసినా ఉమ్మడి ఏపీ భవిష్యత్తు మరోలా ఉండేదని చాలామంది నమ్ముతారు. ఏది ఏమైనా వైఎస్ సీఎంగా చేసింది ఐదేళ్ల మూడునెలల కాలమే అయినా, ఒక శతాబ్దానికి సరిపడా పేరు తెచ్చుకుని గొప్పనేతగా ప్రజల మదిలో నిలిచిపోయారు.వైఎస్ రాజశేఖరరెడ్డికి జయంతి సందర్భంగా ఇదే నివాళి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Tata Motors rolled out the Ace Pro mini trucks8
టాటా మోటార్స్‌ నుంచి మినీ ట్రక్‌లు.. ధర ఎంతంటే..

వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా కార్గో రవాణా కోసం ఏస్‌ ప్రో పేరిట 4–వీల్‌ మినీ ట్రక్కులను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 750 కేజీల పేలోడ్‌ సామర్థ్యంతో, పెట్రోల్, బై–ఫ్యుయెల్, ఎలక్ట్రిక్‌ వేరియంట్లలో ఈ వాహనాలు లభిస్తాయని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ పినాకి హల్దార్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఒకసారి చార్జ్‌ చేస్తే సుమారు 125 కి.మీ. నుంచి 155 కి.మీ. వరకు మైలేజి ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో తేలికపాటి వాణిజ్య వాహనాల పరిశ్రమ వృద్ధి ప్రస్తుతం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ మధ్యకాలికం, దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుందని హల్దార్‌ చెప్పారు.క్యూ1లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు డౌన్‌ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) హోల్‌సేల్, రిటైల్‌ అమ్మకాలు తగ్గాయి. డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) వార్షికంగా 11 శాతం క్షీణించి 87,286 యూనిట్లకు పరిమితమయ్యాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్‌లో హోల్‌సేల్‌ అమ్మకాలు వరుసగా 12 శాతం, 14 శాతం, 25 శాతం తగ్గినట్లు జేఎల్‌ఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: రూ.100తో చోటాసిప్‌!ఇక రిటైల్‌ అమ్మకాలు 15 శాతం క్షీణించి 94,420 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వారసత్వంగా వస్తున్న మోడల్స్‌ను క్రమంగా నిలిపివేసి కొత్త జాగ్వార్‌ మోడల్‌సను ప్రవేశపెట్టనుండటం, అమెరికాలో దిగుమతి సుంకాల వ్యవహారం కారణగా ఏప్రిల్‌లో ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడం తదితర అంశాలు విక్రయాలు తగ్గడానికి కారణమని వివరించింది.

Bihar Businessman Gopal Khemka Case Shocking Details9
జైలు నుంచే స్కెచ్‌ గీసి.. గోపాల్‌ ఖేమ్కా కేసులో షాకింగ్‌ విషయాలు

ఎన్నికల వేళ.. బీహార్‌లో రాజకీయంగానూ కలకలం రేపిన గోపాల్‌ ఖేమ్కా హత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు వికాస్‌ అలియాస్‌ రాజా పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మరోవైపు.. గోపాల్‌ హత్యకు జైలు నుంచే కుట్ర జరిగిందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందక్కడ. గోపాల్ ఖేమ్కా హత్య (Businessman Murder in Bihar) కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్‌ బృందం.. కీలక నిందితుడైన వికాస్‌ (ఆయుధం సరఫరా చేసింది ఇతనే) కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే పాట్నాలోని ఓ ప్రాంతంలో సోదాలు జరుపుతుండగా.. పోలీసులను చూసి కాల్పులు జరిపాడతను. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఆయుధాల తయారీ, విక్రయాలతో నిందితుడికి సంబంధాలున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోపాల్ ఖేమ్కా హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.గోపాల్ ఖేమ్కా.. బీహార్‌లోనే అతి పురాతన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒకటైన మగధ హాస్పిటల్ యజమాని. పాట్నా గాంధీ మైదాన్‌ పీఎస్‌ పరిధిలోని రాంగులాం చౌక్‌ పనాష్‌ హోటల్‌ సమీపంలో శుక్రవారం రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. హోటల్‌ నుంచి బయటకు వస్తుండగా నిందితులు బైక్‌ మీద వచ్చి అతి సమీపం నుంచి గోపాల్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారాయన. 2018లో ఆయన తనయుడు గుంజన్‌ ఖేమ్కా కూడా ఇదే తరహాలో బైకర్‌ల కాల్పులలో మరణించడం గమనార్హం. అయితే ఆ కేసులో నిందితులను ఇప్పటిదాకా పోలీసులు పట్టుకోలేకపోయారు.గోపాల్‌ ఖేమ్కా కేసులో.. అశోక్‌ కుమార్‌ సాఫ్‌ అనే వ్యాపారవేత్త ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కోసం సుపారీ గ్యాంగ్‌కు 3.5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉమేష్‌యాదవ్‌ అనే షూటర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. గోపాల్‌ అంత్యక్రియలకు హాజరైన రోషన్‌ కుమార్‌ అనే మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఇక వికాస్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పాట్నాలోని బీర్‌ సెంట్రల్‌ జైలు నుంచే గోపాల్‌ ఖేమ్కా హత్యకు కుట్ర జరిగినట్లు భావిస్తున్నామని బీహార్‌ డీజీపీ వినయ్‌ కుమార్‌ తెలియజేశారు. ఇప్పటికే జైలు నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. జైల్లోని నిందితులు.. బయట ఉన్నవాళ్ల సాయంతో ప్లాన్‌ అమలు చేశారని అన్నారాయన. ఈ సంచలన కేసుకు సంబంధించిన మిగతా వివరాలను మీడియా సమక్షంలో వెల్లడిస్తామని స్థానికంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.గోపాల్‌ ఖేమ్కాకు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నీతీశ్‌కుమార్‌ పాలనలో బిహార్‌ నేర రాజధానిగా మారిందని లోక్‌సభలో విపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని.. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు.

Ram Kapoor weightloss journey Issues New Statement On Using OZEMPIC10
అవును ఒజెంపిక్‌ తీసుకున్నా.. తప్పేంటి? నటుడు రామ్‌కపూర్‌ ఆగ్రహం

ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫేమ్‌ రామ్‌ కపూర్‌ (Ram Kapoor) అనూహ్యంగా బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపర్చాడు. ఏకంగా 55 కిలోల బరువు తగ్గి నెట్టింట తెగ హల్‌చల్‌ చేశాడు. దీంతో ఓజెంపిక్ , మౌంజారో ( Ozempic and Mounjaro)వంటి మందులు వాడి ఉంటాడనే చర్చ మొదలైంది. తాజాగా దీనిపై రామ్‌ సంచలన ప్రకటన చేశాడు. బరువు తగ్గడానికి ఓజెంపిక్ వాడితే తప్పేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బరువు తగ్గిన తీరును బట్టి, వారిని జడ్జ్‌ చేయొద్దని కోరాడు.అంతేకాదు ఎవరైనా డ్రగ్స్ వాడితే జనానికేంటి బాధ అని వ్యాఖ్యానించాడు. ‘‘అవును ఓజెంపిక్ ,మౌంజారో డ్రగ్స్‌ తీసుకున్నాను. అయితే తప్పేంటి? దయచేసి ఎ వరైనా సమాధానం చెప్పండి? దీనికెవరు సమాధానం చెప్పరే..ఎవరైనా ఒజెంపిక్‌ తీసుకుంటే అందులో తప్పేంటి? ఆ మనిషి చేసిన నేరం ఏంటి? దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే, అసలు సమాధానమే లేదు.’’ అంటూ ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.బరువు తగ్గడానికి తాను చాలా కష్టపడ్డానని, తన వైద్యుడు మౌంజారో వాడమని ఎందుకుచెప్పాడో రామ్ కపూర్ వెల్లడించాడు. బరువు తగ్గడానికి శారీరక శిక్షణపై దృష్టి పెట్టినట్టు తెలిపాడు. అప్పట్లో ఆయన 140 కిలోల భారీ బరువతో అత్యంత అనారోగ్యకరమైన స్థితితోపాటు చక్కెర అదుపులో ఉండేది కాదు, దీంతో రోజుకు మూడు సార్లు ఇన్సులిన్ తీసుకునేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇదీ చదవండి: జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గిందిమరోపక్క పని ఒత్తిడి, రెస్ట్‌ లేదు దీంతో ఇంత వర్క్‌ చేస్తూ, అనారోగ్యంగా ఉంటే డయాబెటిక్ స్ట్రోక్ రావచ్చు, తక్షణమే బరువు తగ్గించుకోవాలని డాక్టర్‌ సూచించారు అయితే ఇంకా రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ఉన్ననేపథ్యంలో మరో ఆరు-ఎనిమిది నెలల తర్వాత చూద్దామని చెప్పాను.కానీ డాక్టర్‌ ససేమిరా అన్నారు. కచ్చితంగా ఇపుడే ఏదైనా మొదలు పెట్టాలని హెచ్చరించారు. మూడు నుండి నాలుగు నెలలు తీసుకోమని కూడా చెప్పారు. కానీ మొదట్లో తన డాక్టర్ మాట వినాలని అనుకున్నా, కానీ తర్వాత భుజం ప్రమాదం, శస్త్రచికిత్స కారణంగా, వెయిట్‌ లాస్‌ ఎక్స్‌ర్‌సైజులు, బాడీబిల్డింగ్ పై దృష్టి పెట్టానని తెలిపాడు. అయితే ఓజెంపిక్‌ తీసుకోవద్దని, కావాలంటే మోంజరో తీసుకోవచ్చని సూచించాడు.కాగా ఓజెంపిక్ అనేది వాస్తవానికి మధుమేహం చికిత్సకు ఉపయోగించే ఔషధం. కానీ ఇపుడు దీర్ఘకాలికంగా ఊబకాయంతో తీవ్రంగా బాధపడే వారికి కూడా ఉపయోగపడుతోంది. అనేక మంద్రి సెలబ్రిటీలతోపాటు దీనిని ఆశ్రయిస్తున్నారనే అంచనాలు భారీగానే ఉన్నాయి. సెమాగ్లుటైడ్ (ఒజెంపిక్ ప్రాథమిక భాగం) దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఉపయోగపడుతుందంటున్నారు వైద్య నిపుణులు.ఓజెంపిక్ (GLP-1 డ్రగ్స్) ఆకలిని తగ్గించి, క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.సెమాగ్లుటైడ్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది.ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మనం తినే ఆహారం నుండి గ్లూకోజ్ (లేదా రక్తంలో చక్కెర)ను మన కణాలలోకి రవాణా చేయడానికి బాడీకి ఇన్సులిన్ అవసరం.దీనిని శక్తిగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.అయితే జాగ్రత్త వైద్యుల పర్యవేక్షణ అవసరమని, ఓజెంపిక్ వంటి డ్రగ్స్‌కారణంగా, వికారం, వాంతులు, విరేచనాలు , తదితర సమస్యలతో సహా దుష్ప్రభావాలను కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement