Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Pulivendula And Vontimitta ZPTC Elections: YSRCP Letters To SEC1
పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్‌ సమాచారం ఇవ్వండి: వైఎస్సార్‌సీపీ

సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, అత్యంత దారుణంగా, ఏకపక్షంగా నిర్వహించిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తోంది. ఆ దిశలోనే ఆ రెండు ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి.. ‘‘పోలింగ్‌ స్టేషన్లు, ఆయా ప్రాంగణాల సీసీ కెమెరా ఫుటేజ్‌, పలు ఘటనలకు సంబంధించిన వీడియో కవరేజ్‌, పోలింగ్‌కు సంబంధించిన వెబ్‌కాస్టింగ్‌, ఆ రోజు పోలింగ్‌ బూత్‌ల్లో కూర్చున్న ఏజెంట్ల పేర్లు జాబితా....పోలింగ్‌ ఆఫీసర్‌ (పీఓ) డైరీ, ఫామ్‌–12. ఫామ్‌–32 ఈ ఏడు అంశాల పూర్తి వివరాలు, సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్‌ఈసీ)కి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వేర్వేరుగా రెండు (పులివెందుల, ఒంటిమిట్ట) వినతిపత్రాలు పంపించారు. వీలైనంత త్వరగా ఆ వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలి’’ అని లేఖల్లో లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధికార పక్షం చేసిన అరాచకాలు, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ ప్రత్యక్షంగానూ, లేఖల ద్వారానూ మొత్తం 35 పర్యాయాలు ఎస్‌ఈసీకి వినతిపత్రాలు అందజేసింది. ఫిర్యాదు చేసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దానిపై ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వైయస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. అయినా ఎస్‌ఈసీ పట్టించుకోలేదు.ఇక ఎన్నికల రోజున ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, తెల్లవారుజాము నుంచే అన్ని పోలింగ్‌ బూత్‌లు స్వాధీనం చేసుకున్న అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు.. చివరకు ఏ పోలింగ్‌ బూత్‌లోకి వైఎస్సార్‌పీపీ ఏజెంట్లను అడుగు కూడా పెట్టనీయలేదు. వారి నుంచి ఏజెంట్‌ అధీకృత ఫామ్స్‌ లాగేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులెవ్వరూ ఓటు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చివరకు పులివెందులలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంతరెడ్డిని కూడా ఓటు వేయనీయలేదు.ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు కదలనీయలేదు. ప్రతిచోటా పోలీసు బలగాలను ఉపయోగించారు. యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసుకున్నారు. దీనిపై అప్పటికప్పుడు ఆధారాలతో సహా, ఎస్‌ఈసీకి వినతిపత్రం అందజేసినా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఉప ఎన్నికల పూర్తి వివరాలు, సమాచారం, వీడియోలు ఇవ్వాలంటూ వైఎస్సార్‌సీపీ రెండు లేఖల ద్వారా ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేసింది.

Modi Sudarshan Chakra Mission: A Celestial Weapon A Divine Mystery2
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం

వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్‌కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది.

EPFO Eases Aadhaar UAN Linking3
ఈపీఎఫ్ఓ కొత్త అప్డేట్.. ఇకపై ఆలస్యానికి చెక్

లక్షలాది మంది చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ఆధార్‌ను యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో అనుసంధానించడంలో ఉన్న ఇబ్బందులను సరళీకృతం చేస్తూ.. ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసింది.ఆగస్టు 13, 2025 నాటి EPFO సర్క్యులర్ ప్రకారం.. UANలో సభ్యుని పేరు, లింగం, పుట్టిన తేదీ ఆధార్‌తో సరిగ్గా సరిపోలితే, యజమాని పోర్టల్‌లోని కేవైసీ ఫంక్షనాలిటీ ద్వారా నేరుగా ఆధార్‌ను సీడ్ చేయవచ్చు. దీనికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. అన్నీ సరిగ్గా ఉంటే ఆలస్యానికి ఆస్కారం లేదు.UAN & ఆధార్ సీడింగ్యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ప్రతి సభ్యునికి ఈపీఎఫ్ఓ కేటాయించిన 12 అంకెల ఐడెంటిఫైయర్. వ్యక్తి ఉద్యోగాలు మారినప్పటికీ నెంబర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆధార్‌ను UANకి లింక్ చేయడం వలన సభ్యులు నేరుగా సేవలను పొందగలుగుతారు. కానీ ఆధార్ డేటా.. యూఐడీఏఐ ద్వారా ధృవీకరణ పొందాల్సిన అవసరం ఉందని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఆధార్‌ లింక్ ఎలా?ఉమాంగ్ యాప్ ఉపయోగించి ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ఈ కింద దశలను అనుసరించి.. ఆధార్ లింక్ చేసుకోవచ్చు.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయలి.➤తరువాత యూఏఎన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ వెరిఫై చేయాలి. ➤ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ➤ఆధార్ వివరాలను ఎంటర్ చేసిన తరువాత.. ఆధార్ నెంబరుకు లింక్ అయిన మొబైల్ & ఈమెయిల్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ➤ఇవన్నీ పూర్తిగా తరువాత ఆధార్ UANతో లింక్ అవుతుంది.

India Welcomes Trump-Putin Summit in Alaska4
ట్రంప్‌-పుతిన్‌ల భేటీపై భారత్‌ స్పందన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌-రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్‌ను భారత్‌ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్‌ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్‌ ఉపయోగపడుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఆశాభావం ‍వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్‌ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్‌ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్‌ చివరలో ట్విస్ట్‌ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. తాను మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్‌స్కీకి సూచిస్తానని ట్రంప్‌ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్‌-జెలెన్‌స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్‌.

Dont Believe in Billionaires CEO Donates Most of​ his Fortune5
రూ.14 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?

యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) భారీ విరాళాన్ని ప్రకటించారు. 2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని (రూ. 14,036.64 కోట్లు)ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశాననివెల్లడించారు. ప్రపంచమంతా కోట్లకు పడలెత్తాలని, రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్లుగా, బిలియనీర్లుగా ఎదగాలని కలలుకంటోంటే.. ఈయన మాత్రం తనకు బిలియనీర్ల మీద పెద్దగా మోజులేదని చెప్పుకురావడం విశేషం.ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసంకేవలం 100 మిలియన్ డాలర్ల సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: గ్రాండ్‌మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గాఅంతేకాదు తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్‌గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనేదే తనఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు.న్న నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందంటా రాయాన.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్‌ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ ప్రస్తుతం సప్లయ్‌ ఉద్గారాలను ట్రాక్ చేయడంపై దృష్టి సారించిన కొత్త స్టార్టప్, స్కోప్3కి నాయకత్వం వహిస్తున్న ఓ'కెల్లీ, తన తదుపరి వెంచర్ విజయవంతమైనా, తనకు బిలియనీర్ అయ్యే ప్రణాళికలు లేవనిప్రకటించడం గమనార్హం.

Found Concrete Evidence That Youtuber Jyoti Malhotra Spied For Pak6
పక్కా ఏవిడెన్స్‌.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బాగోతం బట్టబయలు

హర్యానాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేసినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. యూట్యూబర్‌పై 2,500 పేజీల ఛార్జ్‌షీట్‌ను హిసార్ కోర్టులో దాఖలైంది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్థారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సిట్ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.జ్యోతి మల్హోత్రాపై అఫిషియల్ సీక్రెట్స్ చట్టంలోని సెక్షన్లు 3, 5తో పాటు బీఎన్ఎస్‌లోని సెక్షన్ 152 కింద కేసు నమోదైంది. ఈ చార్జ్‌షీట్‌ను పరిశీలించిన అనంతరం న్యాయపరంగా స్పందిస్తామంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఆగస్టు 18న జరగనుంది. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ పేరిట ట్రావెల్ వ్లాగ్‌ నడిపేంది. ఆమెపై పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో.. మూడు నెలల పాటు సిట్‌ అధికారులు విచారణ చేశారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్‌లోని అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేశారన్న తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో హర్యానా పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 2,500 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను హిసార్ కోర్టులో సిట్ శనివారం దాఖలు చేసింది. ఆమె గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిర్ధారించేందుకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని సిట్ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.ఆమె ఐఎస్‌ఐ ఏజెంట్లు షాకిర్, హసన్ అలీ, నాసిర్ ధిల్లన్‌లతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 2024లో పాకిస్తాన్, చైనా, నేపాల్ దేశాలకు ఆమె ప్రయాణించిన వివరాలను పోలీసులు చార్జ్‌షీట్‌లో నమోదు చేశారు. పాకిస్తాన్‌లో ఆమె మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మేరియం షరీఫ్‌ను కలిసినట్లు సమాచారం. ఆమె మొబైల్ ఫోన్, డిజిటల్ డేటా ద్వారా గూఢచర్యానికి సంబంధించిన పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.కాగా, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే పాకిస్తాన్‌ సైనిక నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హై కమిషన్‌లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకోగా.. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్‌ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది.హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్‌ విత్‌ జో’పేరిట ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను నడిపేది. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. ట్రావెల్‌ బ్లాగర్‌గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్‌చేశారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌కు వెళ్లింది.అక్కడ ఎహ్సాన్‌ ఉర్‌ రహీమ్‌ అలియాస్‌ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్‌ ఆదేశానుసారం అలీ అహా్వన్‌ అనే వ్యక్తి ఈమెకు పాక్‌లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్‌లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్‌ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్‌బాజ్‌లతో పరిచయం పెంచుకుంది. షహ్‌బాజ్‌ ఫోన్‌నంబర్‌ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో జాట్‌ రంధావా అనే వేరే పేరుతో సేవ్‌చేసింది.వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాప్‌ యాప్‌లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్‌ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్‌కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్‌ అనుకూల వీడియోలు తీసి పోస్ట్‌చేసింది. పాక్‌లో కతాస్‌ రాజ్‌ టెంపుల్‌ సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్‌ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది.

BCCI forcefully retired Rohit Sharma And Virat Kohli from Test cricket7
విరాట్, రోహిత్ రిటైర్మెంట్‌ వెనుక కుట్ర..? మాజీ ప్లేయర్‌ సంచలన కామెంట్స్‌

భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో రాహుల్ ద్ర‌విడ్‌, వీవీఎస్ లక్ష్మణ్ త‌మ‌కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. భారత క్రికెట్‌కు డాదాపు 16 ఏళ్ల పాటు త‌మ సేవ‌ల‌ను అందించిన ఈ ఇద్ద‌రి లెజెండ‌రీ క్రికెట‌ర్ల‌కు స‌రైన వీడ్కోలు మాత్రం ల‌భించింది.ఈ కోవ‌కు చెందిన వారే టీమిండియా దిగ్గ‌జాలు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు. వారిద్ద‌రూ కూడి ఎటువంటి వీడ్కోలు లేకుండా త‌మ టెస్టు కెరీర్‌ల‌ను ముగించారు. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నకు ముందు రోహిత్‌, కోహ్లిలు వారం రోజుల వ్య‌వ‌ధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అందిరికి షాకిచ్చారు.ఈ సీనియ‌ర్ ద్వ‌యం లేకుండానే ఇంగ్లండ్‌కు వెళ్లిన భార‌త జ‌ట్టు ఐదు మ్యాచ్‌ల‌ సిరీస్‌ను 2-2తో స‌మంగా ముగించింది. అయితే తాజాగా రోహిత్‌, కోహ్లి రిటైర్మెంట్‌ల‌పై భారత మాజీ ఆల్ రౌండర్ కర్సన్ ఘావ్రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీసీసీఐలో రాజ‌కీయాల వ‌ల్లే వారిద్ద‌రూ త్వ‌ర‌గా రిటైర‌య్యార‌ని ఆయ‌న ఆరోపించాడు."వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ప్ర‌స్తుతం అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లి ఒక‌డు. మ‌రో మూడేళ్ల‌ పాటు భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడే స‌త్తా కోహ్లికి ఉంది. అటువంటిది ఆకస్మికంగా కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌కటించ‌డం వెన‌క కొన్ని శక్తులు ఉన్నాయ‌ని నేను అనుకుంటున్నాను.అంతేకాకుండా సుమారు 14 ఏళ్ల పాటు భార‌త జ‌ట్టుకు త‌న సేవ‌లను అందించిన విరాట్‌కు బీసీసీఐ క‌నీసం ఫేర్‌వెల్ కూడా ఏర్పాటు చేయ‌లేదు. కోహ్లి, రోహిత్ వంటి ఆట‌గాళ్లు ఘన‌మైన వీడ్కోలుకు ఆర్హులు. ఇది బీసీసీఐలోని అంతర్గత రాజకీయాల కారణంగా జ‌రిగింది.దీనిని మ‌నం అర్థం చేసుకోవడం చాలా క‌ష్టం. ఈ కారాణాల‌తోనే కోహ్లి త్వ‌రగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. రోహిత్ శ‌ర్మ కూడా కావాల‌నుకుంటే మ‌రి కొన్నాళ్ల పాటు ఆడేవాడు. కానీ కొంత మంది బీసీసీఐ పెద్ద‌లు అత‌డిని జ‌ట్టు నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని చూశారు. వారు కోరుకున్న విధంగానే రోహిత్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడని" విక్కీ లాల్వానీ షోకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఘావ్రీ పేర్కొన్నాడు.

Trump Says Russia Lost Major Oil Client India New Delhi Reaction Is8
రష్యా చమురుకి భారత్‌ దూరమైంది: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ‍వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్‌ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్‌పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ట్రంప్‌ ఉక్రెయిన్‌ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్‌న్యూస్‌కు ట్రంప్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్‌ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్‌ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్‌పై ట్రంప్‌ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్‌ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్‌ రష్యా ఆయిల్‌ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్‌ 50 శాతం సుంకాలను భారత్‌ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్‌ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్‌లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) చైర్మన్‌ ఏఎస్‌ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్‌ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్‌ 50 శాతం టారిఫ్‌ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్‌​ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్తాన్‌ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్‌ ఆయిల్‌ను స్పాట్‌ మార్కెట్‌ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్‌, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్‌ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం.

Asian Paints intraduces Lotus Effect Technology Apcolite All Protect9
కోహ్లీ కొత్త క్యాంపెయిన్‌.. ఎందుకంటే..

ఇంట్లో గోడలకు సాధారణంగా మరకలు పడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కవ కష్టపడాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఏషియన్‌ పెయింట్స్‌ కొత్త టెక్నాలజీ ఉపయోగించి నూతన రంగులను తయారు చేస్తున్నట్లు తెలిపింది. తన రంగుల్లో లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో పని చేసే ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ అనే సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేస్తున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ చెప్పింది.ఈ అత్యాధునిక ప్రీమియం ఇంటీరియర్ పెయింట్స్ మెరుగైన స్టెయిన్ రిపెల్లెన్సీ, ఫ్లేమ్ రెసిస్టెన్స్‌, మెరుగైన సౌందర్యాన్ని అందిస్తాయని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. దీన్ని వినియోగదారుల ఆధునిక జీవనం కోసం రూపొందించిన్నట్లు పేర్కొంది. గతంలో ఏషియన్‌ పెయింట్స్‌ అల్టిమా ప్రోటెక్ట్‌ ద్వారా గోడల లామినేషన్ ప్రొటెక్షన్ కోసం గ్రాఫీన్‌ను ఉపయోగించింది. రాయల్‌ వేరియంట్‌లో టెఫ్లాన్ ఆధారిత స్టెయిన్ రెసిస్టెన్స్‌ను ప్రవేశపెట్టింది. తాజాగా ఏషియన్‌ పెయింట్స్‌ ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్‌లో అధునాతన లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు తెలిపింది.సహజంగా శుభ్రపరుచుకునే సామర్థ్యాలు కలిగిన తామర ఆకు నుంచి ప్రేరణ పొంది లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని రూపొందించినట్లు ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇంటి గోడలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రోజువారీ మరకలు కనిపించకుండా లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీ పని చేస్తుంది. కాఫీ, సాస్‌, క్రేయాన్లు.. వంటి మరకలు గోడపై ఉన్నప్పుడు చాలా తక్కువ శ్రమతోనే వాటిని శుభ్రం చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇది సమకాలీన భారతీయ గృహాలకు అనువైన పరిష్కారంగా ఉంది. ఈ పెయింట్ ఫ్లేమ్ రెసిస్టెన్స్‌ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇంట్లో సువాసనలను సైతం వ్యాపింపజేస్తుంది. మాట్, షైన్ ఫినిషింగ్ రెండింటిలోనూ ఈ రంగులు లభిస్తాయి. ఆరు సంవత్సరాల వారంటీతోపాటు మన్నిక, సంరక్షణ అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ..‘ఏషియన్ పెయింట్స్‌లో గృహాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి మేము చాలా సమయం వెచ్చిస్తాం. నేటి వినియోగదారులకు నిజంగా అవసరమైన వాటి చుట్టే మా ఆవిష్కరణలు ఉంటాయి. వేడుకలు, పిల్లలు, పెంపుడు జంతువులు, దైనందిన కార్యక్రమాలతో నేడు ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ దాని లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో మేము ఈ వాస్తవికతకు సరిపోయే పరిష్కారాన్ని సృష్టించాం. ఇది గోడలను శుభ్రంగా ఉంచి ఒత్తిడిని తొలగిస్తుంది. దాని ఉత్తమ స్టెయిన్ రిపెల్లెన్సీకి ధన్యవాదాలు. ఇది తెలివైన, మరింత అప్రయత్నమైన జీవనం వైపు సాగే అడుగు. ఇక్కడ గృహాలు సొగసైనవి. రోజువారీ దుస్తులను సులభంగా హ్యాండిల్ చేస్తాయి’ అని చెప్పారు.ఏషియన్‌ పెయింట్స్‌ బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ దీనికి మద్దతు ఇస్తుంది. ఈ యాడ్‌లో అతను ఉత్పత్తుల ఆకర్షణ, శక్తితో జీవం పోస్తాడు. ఈ యాడ్ ఉల్లాసకరమైన, సాపేక్షమైన సెట్టింగ్‌ను చూపిస్తుంది. ఇక్కడ కోహ్లీ అందంగా డిజైన్ చేసిన ఇంటిని జ్యూస్, మిల్క్ షేక్స్ మరెన్నో పదార్థాలతో ఒక పిల్లవాడిలా పరీక్షిస్తాడు. ప్రతి పరీక్షలో ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ థీమ్స్‌ను సులభంగా నిర్వహిస్తుంది. ఆ పదార్థాల మరకలు స్థిరపడకముందే నిలుపుదల చేస్తుంది. ఈ లాంచ్‌తో ఏషియన్ పెయింట్స్ సూపర్ ప్రీమియం ఇంటీరియర్ పెయింట్ విభాగంలో మరోసారి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. పెయింట్స్, అలంకరణ విషయానికి వస్తే బ్రాండ్ పరిశ్రమలో పాల్గొనడమే కాకుండా దాని భవిష్యత్తును రూపొందిస్తోందని చూపిస్తుంది.

Chashoti Villager Asks CM Omar Abdullah Over Rescue Hurdles Viral10
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?

జమ్ము కశ్మీర్ కిష్తవాడ్‌ జిల్లా ‌చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్‌ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్‌ ఒమర్‌ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్‌ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్‌.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్‌ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement