Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Govt Lands Scam: Public anger over land allocations1
కొలుసుకు భూ గొలుసు

బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు? హైదరాబాద్‌లో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్‌ రేటుకే లీజుకు.. ఏపీలో మాత్రం రూ.వేల కోట్ల ఖరీదైన ప్రభుత్వ భూములు నామమాత్రపు లీజుకు అప్పగింత హైపర్‌ మార్కెట్‌ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకోనున్న లులు ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లిగవ్వ కూడా దక్కదు! హైపర్‌ మార్కెట్‌ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలేఅయినవారికి అడ్డంగా కట్టబెట్టడం... కావాల్సినవారికి నిలువునా దోచిపెట్టడంలో కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరి స్తోంది...! అత్యంత విలువైన భూములను పప్పుబెల్లాలు మాదిరి కారుచౌకగా పంచేస్తోంది..! ఉర్సా నుంచి లులు వరకు... సత్వ మొదలు కపిల్‌ చిట్‌ ఫండ్‌ దాక.. పట్టపగ్గాల్లేకుండా భూ పందేరానికి పాల్పడుతోంది..! కూటమి పార్టీల నేతలకు కట్టబెట్టేస్తోంది...! ఈ క్రమంలో నిన్న జనసేన ఎంపీ బాలశౌరి సంస్థకు 115 ఎకరాలు ధారాదత్తం చేయగా. నేడు మంత్రి కొలుసు పార్థసారథికి చెందిన కంపెనీకి ఏకంగా 845 ఎకరాలు రాసిచ్చేసింది..! ఆ కథాకమామీషు ఇదిగో...!సాక్షి, అమరావతి: ‘‘అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజ­నాలకు వినియోగించను’’ అంటూ... దైవసాక్షిగా మంత్రులు ప్రమాణం చేస్తారు. కానీ, దాన్ని పక్కకుపెట్టి సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన నియోజకవర్గంలోని విలువైన భూములను సొంత సంస్థకు దక్కించుకున్నారు. పరిశ్రమల కోసం అంటూ వందల ఎకరాలను నితిన్‌ సాయి కన్‌స్ట్రక్షన్స్‌కు కూటమి ప్రభుత్వం ధారదత్తం చేసింది. ఈ సంస్థ మంత్రి పార్థసారథి సతీమణి కమలాలక్ష్మి, ఆయన డ్రైవర్‌ కొలుసు ప్రసాద్‌ పేరిట ఏర్పాటైనదే..! కన్‌స్ట్రక్షన్, టెలికాం, కేబుల్స్‌ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తోంది.⇒ తాజాగా రూ.150 కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద 20 టీపీడీ (టన్స్‌ పర్‌ డే) సామర్థ్యంతో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్‌కు ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా ఏకంగా రూ.845.60 ఎకరాల భూమిని అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం శరవేగంగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ⇒ మొత్తం భూమిలో రూ.5 లక్షల చొప్పున 45.60 ఎకరాలను నితిన్‌ సాయి కన్‌స్ట్రక్షన్స్‌కు పూర్తిగా విక్రయించేలా, సీబీజీ ప్లాంట్‌ పక్కనే ఖాళీగా ఉన్న మరో 800 ఎకరాలను నైపర్‌ గడ్డి పెంపకం కోసం లీజు విధానంలో కూటమి ప్రభుత్వం కేటాయించింది. దీనికి ఏడాదికి రూ.15 వేల వంతున.. 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ లీజు మొత్తాన్ని 5 శాతం చొప్పున పెంచుతారు.అమ్మిన భూమి విలువే రూ.31 కోట్లుప్రస్తుతం ఆగిరిపల్లి మండలంలో ఎకరం భూమి ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పైనే పలుకు­తోంది. అదే రోడ్డు పక్క భూములైతే రూ.కోటి పైమాటే. అంటే, ప్రభుత్వ ధర ప్రకారమే రూ.590 కోట్లకు పైగా విలువైన భూమి అన్నమాట. ఇందులో ఎకరం రూ.5 లక్షలు చొప్పున 45.60 ఎక­రా­లను అమ్మేసింది. దీని విలువే రూ.31.50 కోట్లు. ఇక రూ.15 వేలు లీజు చొప్పున 800 ఎకరా­లను మంత్రి సంస్థకు కూటమి ప్రభుత్వం కానుకగా కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ ప్లాంట్‌ ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం భూములే కాకుండా ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ కింద మరిన్ని రాయితీలతో పాటు కేంద్ర గ్రాంట్‌లను కూడా అందించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.రిలయన్స్‌ ప్లాంట్‌కు మించి..వాస్తవానికి మంత్రి పార్థసారథి సంస్థకు కేటాయించిన భూములు.. దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఏర్పాటు చేస్తున్న సీబీజీ ప్లాంట్‌కు కూడా ఇవ్వ­లేదు. ఈ స్థాయిలో కేటాయింపు అంటే.. దీనివె­నుక ఏదో అర్థం ఉందని అధికారులు అనుమానం వ్య­క్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా కంపెనీలుపార్థసారథి సతీమణి కమలా లక్ష్మి పేరిట నితిన్‌­సాయి కన్‌స్ట్రక్షన్స్, మరో 4 కంపెనీలు ఉన్నాయి. 2006లో రూ.3.47 కోట్ల మూలధనంతో 301, స్వర్ణ ప్యాలెస్‌ 13, శ్రీనగర్‌ కాలనీ, హైదరా­బాద్‌ చిరునా­మాతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కారుణ్య పవర్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, హరిత పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు నేరుగా కొలుసు పార్థసా­రథి పేరును సూచించేలా కేపీఆర్‌ టెలీ ప్రొడక్ట్స్‌ పేరిట మరో కంపెనీ ఉంది. ఈ కంపెనీ­లతో తన అధి­కారాన్ని ఉపయోగించు­కుని కన్‌­స్ట్రక్షన్, సబ్‌ స్టేషన్లు, టెలికాం కేబుల్స్‌ నిర్మా­­ణం వంటి కాంట్రాక్టులను దక్కించుకుంటున్నారు.బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు?హైదరాబాద్‌ లులు మాల్‌కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం రూ.100 చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్‌కార్న్‌ కొందామంటే తక్కువలో తక్కువ రూ.250 వరకు వదిలించుకోవాలి. ఆ మాల్‌లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్‌ ఔట్‌ లెట్స్‌లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే. సీఎం చంద్రబాబుతో లులు గ్రూపు చైర్మన్‌ యూసఫ్‌ ఆలీ కేవలం బడాబాబులు విలాసాల కోసం మాల్‌లు నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమంటే... కేరళ, హైదరాబాద్‌లో మాల్స్‌ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకుని రూ.1,500 కోట్ల పెట్టుబడితో నిర్మించింది. లులూ హైపర్‌ మార్కెట్‌ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఒకరు.. లులుకు భూ కేటాయింపులపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కే లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అయితే.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు పప్పుబెల్లాల్లా భూములను పంచిపెట్టాడాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. విజయవాడలో ఏపీఎస్‌­ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తక్షణం ఈ జీవో ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త బంద్‌కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు. అలాకాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తు­లను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణం అని పేర్కొంటున్నారు. లులు గ్రూపు చైర్మన్‌ యూసఫ్‌ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే.. అలా రెండు రోజుల్లోనే జీవో వచ్చిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైనదో అర్థం అవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.ఎంపీ బాలశౌరి తనయుడి కంపెనీకి మల్లవల్లిలో 115 ఎకరాల భూమిజనసేన ఎంపీ బాలశౌరి తనయుడు అనుదీప్‌ వల్లభనేనికి చెందిన అవిశా ఫుడ్స్‌ అండ్‌ ఫ్యూయల్స్‌కు మల్లవల్లి వద్ద ఎకరం రూ.16.5 లక్షలు చొప్పున 115.65 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి చేసిన భూమి ఎకరం ధర రూ.90 లక్షలుగా ఉంది. అంటే రూ.104 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.19 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మల్లవల్లి ఫుడ్‌ పార్కులో 13.85 ఎకరాల్లో అవిశాఫుడ్స్‌.. 83.50 ఎకరాల్లో 500 కేఎల్‌పీడీ సామర్థ్యంతో బయో ఇథనాల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

Nimisha Priya death sentence abolished2
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!

సనా: భారతీయ నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమెకు మరణశిక్ష రద్దుచేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్‌ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్‌ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Trump Calls London Mayor Sadiq Khan Nasty Person3
‘లండన్ మేయర్‌ దుష్టుడు’.. సాదిక్ ఖాన్‌పై ట్రంప్‌ మాటల దాడి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు నోరు పారేసుకున్నారు. లండన్‌ మేయర్‌ను దుష్టుడు అని, అతను చేయకూడని పనిచేశాడని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో లండన్‌కు రావాలనుకుంటున్నారా? అని ట్రంప్‌ను ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన తానేమీ మీ మేయర్ అభిమానిని కాదని, అతను చేయకూడని పనిచేశాడని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.సోమవారం స్కాట్లాండ్‌లో యూకే ప్రధానితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై మాటల దాడి చేశారు. కాగా యునైటెడ్ కింగ్‌డమ్‌లో అత్యధిక జనాభా కలిగిన లండన్‌కు మొదటి ముస్లిం మేయర్‌గా సాదిక్ ఖాన్ గుర్తింపు పొందారు. రాజకీయ ప్రత్యర్థులు తన మతాన్ని విమర్శించిన సందర్బాల్లో సాదిక్‌ ఖాన్‌ ఎదురుదాడికి దిగుతుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాదిక్‌ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. Trump Calls London Mayor A ‘Nasty Person’ Right To Keir Starmer’s Face https://t.co/ZmdNmIEzzh via @dailycaller— But Not This Day (@butnotthisday) July 29, 2025అయితే సాదిక్‌ ఖాన్‌ తాను ఇటువంటి విమర్శలను పట్టించుకోనని గతంలోనే స్పష్టం చేశారు. 2016, మే 9న ఖాన్ లండన్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అధ్యక్ష అభ్యర్థి ట్రంప్.. సాదిక్‌ ఖాన్‌పై పలు విమర్శలు చేశారు. ‘గుడ్ మార్నింగ్’ బ్రిటన్‌’లో ఖాన్‌ను మెరటు వ్యక్తి అని, అజ్ఞాని అని ట్రంప్ సంబోధించారు.

The partnership Rahul and I had ignited the spark: Shubman gill4
వారిద్దరూ అద్భుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్‌మన్‌ గిల్‌

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్య‌ర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.మాది ఒక గొప్ప జట్టు..ఈ విషయాన్ని భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్‌ వ్యాఖ్యానించాడు.సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి గిల్ నెల‌కొల్పిన‌ భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్‌నర్‌షిప్‌తోనే తాము మ్యాచ్‌ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్‌ చెప్పాడు. ‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్‌ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్‌ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్‌ పేర్కొన్నాడు.భారత్‌ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్‌లపై కూడా కెప్టెన్‌ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్‌ క్రీజ్‌లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్‌కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్‌ అన్నాడు.చదవండి: IND vs PAK: ‘పాక్‌తో మ్యాచ్‌ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం

4 Killed in Shooting at Manhattan Office Building5
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారితో సహా నలుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్‌ఎస్‌ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్‌ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లకు సమీపంలోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలోని ఒక భవనంపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటళ్లు, కోల్గేట్-పామోలివ్, ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నాయి. మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.4 people, including NYPD officer, killed in shooting at Manhattan office building. https://t.co/7Fj8zQKr5b— Ground News (@Ground_app) July 29, 2025పోలీసులు ‘ఎక్స్‌’లో పార్క్ అవెన్యూలో జరిగిన ఘటనలో నిందితుడు మృతి చెందాడని, అతని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఘటన జరిగిన అనంతరం ఆ స్థలాన్ని తమ స్వాధీనంలోనికి తీసుకున్నామని, ఒంటరి షూటర్‌ను చుట్టుముట్టామని పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ ‘ఎక్స్‌’ లో రాశారు. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో సహా కనీసం ఆరుగురిపై కాల్పులు జరిగాయని, ఆ అధికారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. సాయంత్రం రద్దీ సమయంలో పార్క్ అవెన్యూ సమీపంలో అధికారులు ఉన్న సమయంలో కొందరు సాయుధులు, బాలిస్టిక్ షర్టులను ధరించి కాల్పులు జరిపారని సమాచారం.

AP Govt Restrictions Over YS Jagan Nellore Tour On 31st July6
జగన్‌ నెల్లూరు పర్యటనపైనా ఆంక్షలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈనెల 31న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైన నేపథ్యంలో పోలీసులు మరోమారు కఠిన ఆంక్షలు విధించారు. ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. హెలిప్యాడ్‌ వద్దకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీగా వెళ్లొద్దని, అభిమానులు తరలిరావడానికి వీల్లేదంటూ వివిధ ఆంక్షలతో వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.మాజీమంత్రి కాకాణితో ములాఖత్‌.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దాదాపు 13 అక్రమ కేసులు బనాయించి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ కాకాణితో ములాఖత్‌ కానున్నారు. అక్కడ నుంచి.. టీడీపీ రౌడీమూకలు ఇటీవల ధ్వంసం చేసిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు.ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి రెండు నోటీసులు అందించారు.హెలిప్యాడ్‌ వద్దకు పది మందే వెళ్లాలంట..ఇక వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్‌ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతిచ్చిన హెలిప్యాడ్‌ వద్దకు కేవలం పదిమంది మాత్రమే వెళ్లాలని, అంతకుమించి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, జైలు ఆవరణలోకి ఎవరూ రాకూడదని, కేవలం ముగ్గురితోనే వెళ్లి కాకాణితో ములాఖత్‌ కావాలని స్పష్టంచేశారు.అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి కేవలం మూడు వాహనాల్లోనే వెళ్లాలని ఈనెల 27న నోటీసు ఇ చ్చిన పోలీసులు సోమవారం దానిని సవరించి 15 వాహనాలతో వెళ్లొచ్చని మరో నోటీసు జారీచేశారు. అయితే, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్దకు ఎవరూ వెళ్లకూడదని, ఒక్క వైఎస్‌ జగన్‌ మాత్రమే వెళ్లాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.గతంలో హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా.. నిజానికి.. ఈనెల 3న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనప్పటికీ హెలిప్యాడ్‌కు స్థల అనుమతులు కూడా ఇవ్వకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డంకులు సృష్టించారు. ప్రైవేటు స్థలంలో హెలికాప్టర్‌ దిగేందుకు స్థల యజమాని ఒప్పుకున్నా.. కూటమి నేతలు వారిని భయపెట్టి స్థలం ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు.పోలీసులు సైతం హెలిప్యాడ్‌కు అనుమతులివ్వకుండా ఇబ్బందిపెట్టారు. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి హెలిప్యాడ్‌ను అనుమతివ్వాలని న్యాయస్థానానికి వెళ్లడంతో అప్పట్లో జగన్‌ పర్యటన వాయిదా పడింది. ఈసారి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పర్యటన ఆపేదిలేదని తెగేసి చెప్పడంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి అనుమతులిచ్చారు.ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకే.. ఇదిలా ఉంటే.. ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించకుండా తప్పుచేశామన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడడంతో ఆయన ఎక్కడకెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఊహించని స్థాయిలో జనం రావడాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకే ఆ ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు జగన్‌ పర్యటనలకు ఇలా ఆంక్షలు విధిస్తూ.. కుట్రలు పన్నుతోంది.

Rasi Phalalu: Daily Horoscope On 29-07-2025 In Telugu7
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.పంచమి రా.12.43 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర రా.8.33 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: తె.5.38 నుండి 7.12 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు,అమృతఘడియలు: ప.12.55 నుండి 2.36 వరకు, నాగ పంచమిసూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం..... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.వృషభం.... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు.మిథునం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.సింహం... అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య....పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. పరిచయాలు పెరుగుతాయి. సన్మానయోగం. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.తుల... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.వృశ్చికం... పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ధనుస్సు.. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.కుంభం... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఏ పని కూడా ముందుకు సాగదు. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మీనం... సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

YSRCP fires on Nara Lokesh8
నిలువెత్తు అబద్ధాలకు అసలైన వారసుడు లోకేశ్‌

సాక్షి, అమరావతి: ‘బాబూ.. లోకేశ్‌..! మీ తండ్రి చంద్రబాబు 100కు 100 శాతం అబద్ధాలు చెప్తే మీరు 100కు 200 శాతం అబద్ధాలు చెప్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నిలువెత్తు అబద్ధాలకు అసలైన, సిసలైన వారసుడు మీరే. ‘సాక్షి’ పత్రిక వాస్తవాలు రాస్తే తట్టుకోలేక అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పార్టీ ట్వీట్‌ చేసింది. ‘ఎన్టీఆర్‌గారిని మీ నాన్న వెన్నుపోటు పొడిచిన దగ్గర్నుంచి, అత్యంత చెత్త పాలన చేస్తున్న మీకు జాకీలుగా పనిచేయడమే ఎల్లో మీడియా పని. నాణేనికి రెండోవైపు చూపిస్తున్న ‘సాక్షి’పై మీ దుగ్ధ కొత్త విషయమేమీ కాదు’ అని స్పష్టం చేసింది. ట్వీట్‌ ద్వారా ఇంకా వైఎస్సార్‌సీపీ ఏమన్నదంటే...?⇒ లోకేశ్‌ గారూ... తమ ఏలుబడిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం ధ్వంసమైందన్న సంగతి ప్రజలకు తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పడిపోకపోతే ఇప్పుడు పనిచేస్తున్న లెక్చరర్లలో మిగులు ఎందుకు ప్రకటించినట్లు? ఆయా కాలేజీల్లో 455 పోస్టులను ఎందుకు రద్దు చేశారు? మరో 150 మంది లెక్చరర్లను మిగులుగా ప్రకటించడానికి ఎందుకు ఫైల్‌ సిద్ధం చేసినట్టు? ⇒ గత ఏడాది కన్నా అడ్మిషన్లు పెరిగితే లెక్చరర్ల సంఖ్య పెరగాలి కదా? ఏప్రిల్‌ 23న టెన్త్, జూన్‌ 12న సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ జూని­యర్‌ కాలేజీలు జూన్‌ 2 నుంచి ప్రారంభమయ్యాయి. జూలై పూర్తి కావొస్తోంది. అయినా, ఇంకా అడ్మిషన్లు పెరుగుతున్నాయని చెప్పడం వాస్తవాలను మరుగునపరచడమే కదా? ⇒ మీ తింగరి చర్యల కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పడిపోయిన మాట వాస్తవం కాదా? ‘సాక్షి’ పత్రిక ఆ విషయాన్ని జూలై 9న వెలుగులోకి తీసుకురాలేదా? ఇప్పుడు కూడా ‘సాక్షి’ వాస్తవాలను రాసేసరికి అంకెల గారడీ చేయడానికి మీరు సాగిస్తున్న ప్ర­యత్నాలపై మీ శాఖ సిబ్బందిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నమాట వాస్తవం కాదా? ⇒ విద్యా సంస్కరణల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచి్చన హైసూ్కల్‌ ప్లస్‌ ఎందుకు రద్దు చేశారు? ⇒ బాలికలకు మండలానికో జూనియర్‌ కాలేజీ ఎందుకు రద్దైంది? ⇒ సీబీఎస్‌ఈని ఎందుకు రద్దు చేశారు? ⇒ ఐబీ దాకా ప్రయాణాన్ని ఎందుకు ఆపేశారు? ⇒ టోఫెల్‌ క్లాసులను ఎందుకు నిలిపేశారు? ⇒ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను ఎందుకు ఇవ్వడంలేదు? ⇒ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌పై పెట్టిన సిలబస్‌ను ఎందుకు రద్దు చేశారు? ⇒ గోరు ముద్దను ఎందుకు దెబ్బతీశారు? ఇప్పుడు ఎందుకు ఆ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు? రోజుకో మెనూను ఎందుకు తీసేశారు? ⇒ నాడు–నేడు పనులను ఎందుకు నిలిపేశారు? ⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.6,400 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు? వీటికి సమాధానాలు చెప్పగలరా లోకేశ్‌..? అని వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా నిలదీసింది.

Donald Trump told Israel to allow every ounce of food into Gaza9
గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్‌

స్కాట్లాండ్‌: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్‌లో పర్యటిస్తున్న ట్రంప్‌ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్‌ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్‌ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్‌ హమాస్‌తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్‌ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్‌ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్‌ ఫిలిప్‌ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్‌ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్‌కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్‌తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్‌ తాజా హెచ్చరికఉక్రెయన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుదించారు. అధ్యక్షుడు పుతిన్‌ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్‌తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్‌లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్‌ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్‌కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్‌ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్‌తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు.

Earthquake tremor warning on Android phones10
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!

ఫోన్‌ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉంది. మొబైల్‌లోని యాక్సిలరేషన్‌ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ 2020 నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్‌), ద్వితీయ (సెకండరీ వేవ్స్‌) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్‌ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్‌ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్‌తోపాటు పారాహుషార్‌ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్‌లోని యాక్సిలెరోమీటర్‌ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్‌ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్‌ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్‌ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్‌తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్‌లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్‌లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్‌ (6.7), నేపాల్‌ (5.7), 2025 ఏప్రిల్‌లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్‌ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్‌లో ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజు­లు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్‌ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్‌లో నేపాల్‌లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్‌లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్‌ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్‌ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్‌ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్, లొకేషన్‌ సెట్టింగ్స్‌ రెండూ ఆన్‌లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్‌తోపాటు పారాహుషార్‌ అంటూ హెచ్చరిస్తుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement