Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Chittoor Bangarupalyam Tour Live Updates1
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్‌ జగన్‌

సాక్షి,చిత్తూరు: కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డు సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు మామిడి రైతులను నిరంకుశంగా నియంత్రించారుమామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చాను. జగన్‌ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు. రైతులు ఇక్కడికి రాకుండా బెదిరించారు. చివరకు టూవీలర్లపై వచ్చిన వారిని కూడా అడ్డుకున్నారు. ఇక్కడికి కేవలం 500 మంది మాత్రమే రావాలని ఎందుకు అన్నారు. ఎందుకీ ఆంక్షలు? అయినా ఇక్కడికి వేల మంది రైతులు వచ్చి, వారి ఆవేదన చెప్పుకున్నారు.ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర లేదువరికి కూడా ధర లేదు. కనీసం రూ.300కు తక్కువకు అమ్ముకుంటున్నారు. వరి, పెసర, జొన్న.. చివరకు మామిడి రైతులకు కూడా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు.ఒక్క మన రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో అయినా కిలో మామిడి రూ.2కి దొరుకుతుందా?. ఈ ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న. ఎందుకు ధర లేదు? ఇదే మామిడికి మా ప్రభుత్వ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29 వరకు అమ్ముకున్నారు.కొనుగోళ్లలో ఎందుకంత జాప్యం?చంద్రబాబు ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న.. ఏటా మామిడి కొనుగోలు ఉంటుంది. దాన్ని మే మొదటి వారంలో మొదలుపెట్టాలి. కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? జూన్‌ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు.నిజంగా ఆ ధరకు ఎంత పంట కొన్నారు?కానీ, ఈ ప్రభుత్వం కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తుంటే, ప్రభుత్వం మరో రూ.4 చొప్పున ఇస్తోందని చెబుతున్నారు. మరి ఇక్కడ ఆ ధరకు ఎంత పంట అమ్ముడుపోయింది. అదే పొరుగున్న ఉన్న కర్ణాటకలో కుమారస్వామి కేంద్రానికి లేఖ రాస్తే.. కిలో మామిడి రూ.16 చొప్పున కొన్నారు.ఇక్కడ 76 వేల మంది రైతులు మామిడి సాగుమీద బతుకున్నారు. 6.45 లక్షల టన్నుల పంట పండింది. ఇక్కడ 2.20 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు.నాడు కిలో రూ.29. మరి నేడు?మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు. ఇంకా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది. ఇవాళ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.ప్రభుత్వమే కొనుగోలు చేయాలిఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇదే నా హెచ్చరిక.అసలు మీరు మనుషులేనా?ప్రభుత్వం ఇంత క్రూరంగా వ్యవహరిస్తోంది. ఎందుకు రైతులను రానీయకుండా అడ్డుకుంటోంది? దాదాపు 1200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఒకరి తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్‌ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్‌ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్‌ ముందు ఉంటున్నాడు.వచ్చేది జగన్‌ ప్రభుత్వమే. ఇది గుర్తు పెట్టుకొండి’అని ముగించారుమార్కెట్‌ యార్డు వద్దకు చేరుకున్న వైఎస్‌ జగన్‌బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ యార్డుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌మామిడి రైతుల సమస్యలను తెలుసుకోనున్న వైఎస్‌ జగన్‌జనసందోహంగా మారిన మార్కెట్‌ యార్డ్‌. పోలీసుల వలయం దాటుకుని మార్కెట్‌ యార్డుకు రైతులు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు రైతులు తరలివచ్చారు. వేలాది సంఖ్యలో రైతులు అక్కడికి వచ్చారు. మామిడి రైతుల ఆవేదనమామిడి మార్కెట్‌ యార్డ్‌కు రాకుండా 25 చెక్‌పోస్టులు పెట్టారు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.అడ్డదారుల్లోపరుగులు పెట్టుకుంటూ యార్డుకు వచ్చాం.కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదు.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయ్యింది. వైఎస్‌ జగన్‌ పర్యటనపై కూటమి కుట్రలు.. వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనపై ప్రభుత్వం కుట్రలు.వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నం.వైఎస్‌ జగన్‌ పర్యటనకు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌.పోలీసుల లాఠీచార్జ్‌లో​ కార్యకర్తకు గాయాలు.గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లకుండా జగన్‌ను అడ్డుకున్న ఎస్పీ.కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా వాహనాలు అడ్డగింత.రైతులు కూడా బంగారుపాళ్యం రాకుండా బారికేడ్లు.రైతుల సమస్యలు జగన్‌కు చెప్పుకోకుండా చేయాలని కుట్ర. చిత్తూరు జిల్లా పోలీసుల ఓవరాక్షన్అడుగడుగునా పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలుహెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా పోలీసులు, చెక్ పోస్టులుచివరికి వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్న పోలీసులుఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా ఆపేసిన పోలీసులుYSRCP నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేతహైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయంచిత్తూరు-బెంగుళూరు వైవే మీద ప్రయాణీకులకు ఇబ్బందులుపోలీసులు లాఠీచార్జ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యక‍ర్త తలకు గాయం.వెంటనే ఆసుప్రతికి తరలించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు. వైఎస్‌ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం: రైతులుజగన్‌ మా దగ్గరికి వస్తే ప్రభుత్వానికి ఎందుకంత ఉలికిపాటు.బంగారుపాళ్యం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు చేరుకున్నాం.ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు.వైఎస్‌ జగన్‌కు మా సమస్యలు చెప్పుకుంటాం.జగన్‌ పాలనలో మాకు గిట్టుబాటు ధర వచ్చింది. యార్డుకు వచ్చిన రైతులు..వైఎస్‌ జగన్‌ కోసం భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలుపోలీసులు చెక్‌పోస్టులు పెట్టినప్పటికీ రైతులు యార్డ్‌కు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌ కోసమే యార్డ్‌కు వచ్చినట్టు పలువురు కార్యకర్తలు, ‍ప్రజలు తెలిపారు వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొనకుండా రైతులకు ఆటంకాలు.సమీప ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు.ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్‌పోలీసుల ఆంక్షలను ఛేదించి యార్డుకు తరలివచ్చిన రైతులు. బంగారుపాళ్యం చేరుకున్న వైఎస్‌ జగన్‌ కాసేపట్లో మార్కెట్‌ యార్డ్‌కు వైఎస్‌ జగన్‌కూటమి సర్కార్‌ కుట్రలు, పోలీసులను చేధించిన రైతులుమామిడి మార్కెట్‌కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, ప్రజలువైఎస్‌ జగన్‌ కోసం తరలిన అభిమానులు..వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలుఅడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులువైఎస్‌ జగన్ పర్యటనకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి, చార్జ్‌షీట్‌ ఓపెన్ చేస్తామంటూ పోలీసుల బెదిరింపులుఅయినా తగ్గిన అభిమానులునడుచుకుంటూ వైఎస్‌ జగన్‌ని చూడటానికి వెళ్తున్న ప్రజలుబంగారుపాళ్యం వచ్చే రహదారులలో చెక్ పోస్టులు ఏర్పాటువైఎస్సార్‌సీపీ నేతలతో పోలీసులు వాగ్వాదం.కొన్నిచోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్. బంగారుపాళ్యం బయలుదేరిన వైఎస్‌ జగన్‌కాసేపట్లో మామిడి మార్కెట్‌ యార్డ్‌కు వైఎస్‌ జగన్‌గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్న రైతులు మామిడి రైతులను పరామర్శించనున్న వైఎస్‌ జగన్‌ చెక్‌పోస్టుల ఏర్పాటు.. తిరుపతి, కర్ణాటక ప్రధాన రహదారి నాలుగు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ఏర్పాటుకర్వేటినగరం, చిత్తూరు మార్గమధ్యంలో రెండు చోట్ల చెక్‌పోస్టులుకొత్తపల్లి మిట్ట, గంగాధర నెల్లూరులో రెండు చెక్ పోస్టులు ఏర్పాటువాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు.వైఎస్ జగన్ పర్యటన వచ్చే వాహనాలను సీజ్ చేస్తామంటున్న పోలీసులుఉదయం నుండి వాహనాలలో వస్తున్న అభిమానులు, పార్టీ నాయకులుప్రధాన నాయకులను అనుమతించి, ఇతర నాయకులను దింపేస్తున్న పోలీసులుభారీగా పోలీసుల మోహరింపువైఎస్ జగన్ పర్యటనపై ప్రభుత్వ కుట్రలుబంగారుపాళ్యం మామిడి యార్డును ఖాళీ చేయించిన అధికారులురైతులను రానివ్వకుండా యార్డుకు తాళాలురైతులను జగన్ పర్యటనలో పాల్గొననీయకుండా అడుగడుగునా ఆటంకాలుసమీప గ్రామాల్లో భారీగా పోలీసుల మోహరింపుఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులుప్రభుత్వ చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహంపోలీసుల ఓవరాక్షన్‌బంగారుపాళ్యం చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల ఓవరాక్షన్‌వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే రైతులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులువాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులుకూటమి ప్రభుత్వం, పోలీసుల వ్యవస్థతో నిరంకుశ పాలన కొనసాగిస్తుందని రైతుల ఆగ్రహంటోల్ గేట్ వద్దకు చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామినారాయణ స్వామి కామెంట్స్‌..జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుందివైఎస్ జగన్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం.అందుకే అడుగడుగునా అడ్డుకుంటున్నారుచిత్తూరు జిల్లా బంగారుపాళ్యం రహదారుల్లో అడుగడుగునా ఆంక్షలుపోలీసులు ఆంక్షలు..బంగారుపాళ్యంలో ఆటంకాలు సృష్టిస్తున్న పోలీసులుబంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డుబైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలుబంగారుపాళ్యం మండలం మిట్టపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డింగ్ చేసిన తర్వాతనే అనుమతి చిత్తూరు..వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పర్యటనలో పాల్గొనకూ­డ­దని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం జరుగుతోంది.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపా­ళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్‌ జగన్‌ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు.ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్‌ జగన్‌ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మంది, మార్కెట్‌ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు.వైఎస్‌ జగన్‌ పర్యటన ఇలా... వైఎస్‌ జగన్‌ బుధవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరుతారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.

England Playing XI 3rd Test: Jofra Archer returns to Test after 52 months2
టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జ‌ట్టు ప్ర‌కట‌న‌

ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదిక‌గా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో లార్డ్స్ టెస్టు కోసం త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఇంగ్లండ్ బుధ‌వారం ప్ర‌క‌టించింది.స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో క‌న్పించ‌నున్నాడు. యువ పేస‌ర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చ‌ర్‌ను తుది జ‌ట్టులోకి ఇంగ్లీష్ జ‌ట్టు మెనెజ్‌మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికి ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా బెంచ్‌కే ప‌రిమితమ్యాడు.ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్‌స్టార్ సిద్ద‌మ‌య్యాడు. ఆర్చ‌ర్ చివ‌ర‌గా 2021లో ఇంగ్లండ్ త‌ర‌పున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మిన‌హా రెండో టెస్టులో ఆడినే జ‌ట్టును ఇంగ్లండ్ కొన‌సాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫ‌ల‌మైన ఓపెన‌ర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ మ‌రో ఛాన్స్ ఇచ్చింది.ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేట‌ర్స్ పచ్చికతో కూడిన పిచ్‌ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్‌పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా‍ మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జ‌ట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జామీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.

Ys Jagan Expresses Serious Over Police Action Against Farmers In Bangarupalyam3
పోలీసుల్లారా.. చంద్రబాబు రేపు మిమ్మల్ని మోసం చేయొచ్చు

సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. రేపు రాబోయేది జగన్‌ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన.

Amid Gujarat Gambhira bridge Incident Morbi Comes Spotlight Details4
అప్పుడు మోర్బీ.. ఇప్పుడు గాంభీరా!

గుజరాత్‌లో జరిగిన ఘోర బ్రిడ్జి ప్రమాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బ్రిడ్జి చీలిపోయి కుప్పకూలిపోవడంతో.. ఐదు వాహనాలు మహీసాగర్‌ నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. 40 ఏళ్ల కిందట ప్రారంభమైన ఈ వంతెనకు మరమ్మత్తులు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తుండడం విశేషం. గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోరం జరిగింది. పాడ్రా తాలుకాలో ఆనంద్‌-వడోదర జిల్లాలను కలిపే గాంభీరా వంతెనలో ఓ స్లాబ్‌ బుధవారం ఉదయం విరిగిపడింది. ఈ హఠాత్‌ పరిణామంతో రెండు ట్రక్కులు, రెండు వ్యానులు, ఓ ఆటో కింద ఉన్న మహీసాగర్‌ నదిలో పడిపోయాయి. ప్రమాదం ఉదయం వేళ ట్రాఫిక్‌ రద్దీ ఉన్న సమయంలోనే జరిగింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. పిల్లర్స్‌ మధ్య భాగం పూర్తిగా కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన సమయంలో ఓ ట్యాంకర్‌ బ్రిడ్జి అంచునకు వచ్చి ఆగిపోయింది. ఆ ట్యాంకరే అడ్డు లేకుంటే మరికొన్ని వాహనాలు పడిపోయి మరింత నష్టమే జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు, వడోదర జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వడోదర కలెక్టర్‌ను సంప్రదించి.. గాయపడినవాళ్లకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు & భవనాల శాఖను ఈ ప్రమాదంపై తక్షణ విచారణ చేపట్టాలని ఆదేశించారాయన. ఫైర్ బ్రిగేడ్, బోట్లు, డైవర్స్, NDRF బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టాయి. క్రేన్ల సహాయంతో వాహనాల్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు.. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడినవారికి ₹50,000 నష్ట పరిహారాన్ని పీఎంవో ప్రకటించింది. గాంభీరా బ్రిడ్జ్.. గుజరాత్-సౌరాష్ట్రను కలిపే కీలక మార్గం. 1985లో దీనిని ప్రారంభించారు. ఇది ఆనంద్, వడోదర, భరూచ్, అంక్లేశ్వర్ మధ్య ప్రయాణించే వారికీ ప్రధాన రూట్ కావడంతో నిత్యం వాహన రద్దీ ఉంటుంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జి పాడైపోయిన స్థితిలో ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. తరచూ ఈ వంతెన సూసైడ్‌ స్పాట్‌గా మారిందని, పోలీసులు కూడా ఇక్కడ నిఘా వహించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే.. How this happened ? “The Gambhira Bridge connecting Vadodara and Anand has collapsed in the middle. Several vehicles are feared to have fallen into the river; rescue operations are ongoing.”The middle portion just vanished. #Vadodara pic.twitter.com/t2yZSoXexz— Kumar Manish (@kumarmanish9) July 9, 2025ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బ్రిడ్జికి అవసరమైనప్పుడు మరమ్మతులు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం దర్యాప్తులోనే బయటపడుతుందని గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్‌ పటేల్‌ అంటున్నారు. తాజా గాంభీరా బ్రిడ్జి ప్రమాద నేపథ్యంలో.. మూడేళ్ల కిందట జరిగిన గుజరాత్‌ మోర్బీ బ్రిడ్జి ప్రమాదం తెర మీదకు వచ్చింది. మోర్బీ బ్రిడ్జ్ ప్రమాదం.. భారతదేశంలో అత్యంత ఘోరమైన ఘటనలలో ఒకటి. 2022 అక్టోబర్‌ 30వ తేదీన మోర్బీ జిల్లా కేంద్రంలో మచ్చు నదిపై ఉన్న జూల్తో పుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో 141 మంది మరణించారు. 19వ శతాబ్దంలో నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్.. మరమ్మత్తుల తర్వాత అక్టోబర్ 26న తిరిగి ప్రారంభమైంది, అయితే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండానే ఈ బ్రిడ్జిని తెరిచినట్టు తేలింది. కేబుల్స్ తుప్పుపట్టినవి, బోల్టులు సడలిపోయినవి, అధిక బరువు ఉన్న ఫ్లోరింగ్ వేశారని ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. ఓరేవా గ్రూప్ అనే ప్రైవేట్ సంస్థ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యత తీసుకుంది, కానీ సరైన అనుమతులు లేకుండానే తెరిచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. #Gujarat Sad news coming, of a Cable Bridge collapse in Morbi of Gujarat, reports of many injuries as per initial reports.PM @narendramodi ji seeks urgent mobilisation of teams for rescue ops after cable bridge collapse in Gujarat's Morbi#PMModi #Gujarat #Morbi #Cablebridge pic.twitter.com/RyTA7nXeVm— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) October 30, 2022 ప్రమాదం జరిగిన సమయంలో 500 మందికి పైగా బ్రిడ్జ్‌పై ఉన్నారు, కానీ దాని సామర్థ్యం 125 మంది మాత్రమే. బ్రిడ్జ్ సడెన్‌గా విరిగిపడి, ప్రజలు మచ్చ్ఛు నదిలో పడిపోయారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఈ ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ వేయించి దర్యాప్తు చేయించింది. ఈ కేసులో ఓరేవా సంస్థ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు.. మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేశారు. ప్రధానమంత్రి మోదీ సంఘటన స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలకు పరామర్శ తెలిపారు కూడా.

IMDB Releases Most Popular Indian Movie 2025 First Off5
2025లో టాప్‌ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ

కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్‌లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్‌ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్‌డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్‌- మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ చిత్రాల జాబితాను రిలీజ్‌ చేసింది.ఫస్టాఫ్‌లో టాప్‌ 102025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్‌ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్‌ 10లో అత్యధికంగా బాలీవుడ్‌ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్‌ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. టాప్‌ 5లో ఏమున్నాయ్‌?మరాఠా యోధుడు శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్‌ కుమార్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్‌ రెండో స్థానంలో ఉంది. కోలీవుడ్‌ నుంచి 2 సినిమాలుబాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచిన షాహిద్‌ కపూర్‌ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్‌ దేవ్‌గణ్‌ రైడ్‌ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్‌, ఎల్‌ 2: ఎంపురాన్‌, సితారే జమీన్‌ పర్‌, కేసరి చాప్టర్‌ 2, విడాముయర్చి టాప్‌ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్‌ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్‌ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) చదవండి: సినిమాలు మానేసి సెలూన్‌లో పని చేశా.. 10th ఫెయిలైనా..

Vizianagaram student Rajapu Siddu builds e cycle to ride to college6
ఏపీ యువకుడి టెక్ టాలెంట్‌కు హ్యాట్సాఫ్ .. టైంకు కాలేజీకి వెళ్లాలనే..

మనలో చాలామంది వ్యయప్రయాసలు ఓర్చి కాలేజీలకు వెళ్తుంటారు. అందరికీ ఏం కాలేజ్‌లు దగ్గరగా ఉండవు. బస్సు పాస్‌లు తీసుకోవడం లేక సైకిల్‌పైనో తిప్పలు పడి వెళ్తాం. కానీ టాలెంట్‌ ఉన్నోడు ఆ ఇబ్బందికే చెక్‌పెట్టేలా ఏదైనా చేయాలనుకుంటాడు. కాస్త టెక్నాలజీ తెలిస్తే..ఏ అత్యాధునిక సైకిల్‌నో లేక బైక్‌నో తయారు చేస్తాడు. అలాంటి సూపర్‌ టాలెంటెడ్‌ ఈ స్టూడెంట్‌. అతడే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన రాజపు సిద్ధు. అతడి తల్లిదండ్రులు వృత్తిరీత్యా చెన్నై ఉంటారు. అందువల్ల సిద్ధూ తన సోదరితో కలిసి అమ్మమ్మ ఇంటిలో ఉండి చదువుకుంటున్నాడు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న సిద్ధూకి తన గ్రామం నుంచి కాలేజ్‌కి దాదాపు 17 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అందుకోసం సిద్ధు ప్రధాన రహదారికి సుమారు 3 కి.మీ దూరం నడిచి, ఆపై మరో 14 కిలోమీటర్లు బస్సు లేదా ఆటోపై ఆధారపడి వెళ్లాల్సిందే కాలేజ్‌కి. అందుకు రోజుకు దాదాపు రూ. 60ల దాక ఖర్చు అవుతుంది. పోనీ ఇంత వ్యయప్రయాసలు పడ్డా..సమయానికి కాలేజ్‌కి చేరుకోవడం దాదాపు అసాధ్యంగానే ఉండేది. ఎలా చేసినా సిద్ధుకి సమయాపాలన పాటించడం అస్సలు సాధ్యమయ్యేది కాదు. అప్పుడే బ్రెయిన్‌లో బ్యాటరీతో నడిచే సైకిల్‌ని తయారుచేస్తే అనే ఆలోచన తట్టింది. అందుకోసం వేసకి కాలం సెలవులే బెస్ట్‌ అని నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్నట్లుగానే ఈ వేసవి సెలవుల్లో తన ఆలోచనకు రూపం ఇచ్చాడు. అందుకోసం తన పాకెట్‌ మనీ రూ. 35,000 ఖర్చు చేసి ఢిల్లీ, రాజస్థాన్‌ నుంచి విడి భాగాలు తెప్పించుకున్నాడు. తన పాఠశాల రోజుల్లో అటల్ టింకరింగ్ లాబొరేటరీ (ATL)లో నేర్చుకున్న రోబోటిక్స్‌ సాంకేతికతకు పదును పెట్టి మరి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ని రూపొందించాలనుకున్నాడు. అందుకోసం తన ఏటీఎల్‌(ATL) గురువు వై ఈశ్వరరావు మార్గదర్శకత్వం, తన స్నేహితుడు జగ్గుపల్లి రాజేష్‌ల సాయం తీసుకుని మరీ చివరికి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ని రూపొందించాడు. హబ్ మోటార్, యాక్సిలరేటర్, మూడు గేర్‌లు కలిగి ఉన్న ఈ-సైకిల్‌ని అసెంబుల్‌ చేశాడు. ఈ సైకిల్‌ దాదాపు 12 కిలోమీటర్లు బరువు మోయగలదు. అలాగే 25 నుంచి 50 కి.మీల స్పీడ్‌లో పోగల సామర్థ్యం ఉంది. పూర్తి ఛార్జ్‌తో దాదాపు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ వస్తుంది. అది కూడా మూడున్నర గంటల్లో తీసుకుపోగలదు. ఇప్పుడు ఈ-సైకిల్‌తో సిద్ధూకి కేవలం రూ. 6లే ఖర్చు అవుతోంది. పైగా కళాశాలకు టైంకి చేరుకుంటున్నా అని సగర్వంగా చెబుతున్నాడు సిద్ధు. అయితే ఈ సైకిల్‌లో పిలియన్ సీటు(రైడర్‌ వెనుక సీటు) కూడా ఉండటం విశేషం. అలాగే సిద్ధూ ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ని మరింత మెరుగైన డిజైన్‌లో రూపొందించే యత్నం చేస్తున్నట్లు వివరించాడు. నేర్చుకున్న విద్య అవసరానికి ఉపయోగపడటం అంటే ఇదే కదూ..!. ఏదో చదివేశామా..! మార్కులు వచ్చేశాయా.. అని కాదు..అది అప్లికేషన్‌లో కనిపించాలి. మన మనుగడకు లేదా రక్షణకు ఉపయోగపడాలి. అదే నిజమైన విద్య అని తన చేతల ద్వారా చూపించాడు ఈ విజయనగరం కుర్రాడు.(చదవండి: పానీపూరి అమ్మే వ్యక్తి కొడుకు ఘనత..! ఇంటర్‌ ఫెయిల్‌ నుంచి ఏకంగా ఐఐటీలో..)

Maharashtra CM Fadnavis Reacts On Sena MLA Slap Row7
కరెక్ట్‌ కాదు.. గైక్వాడ్‌ వీడియోపై ఫడ్నవిస్‌ స్పందన

శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌ తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అసహనం వ్యక్తం చేశారు. పప్పు బాగోలేదంటూ క్యాంటీన్‌ ఆపరేటర్‌ను గైక్వాడ్‌ చితకబాదిన సంగతి తెలిసిందే. రాజకీయ విమర్శల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫడ్నవిస్‌ స్పందించారు. ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌(Sanjay Gaikwad) తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అన్నారాయన. ‘‘ఆయన వీడియో చూశాను. ఇలాంటి ప్రవర్తన సరికాదు. ప్రజాప్రతినిధుల ప్రతిష్టను మసకబార్చేదిగా ఉంది. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు భావించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఫిర్యాదుల ద్వారా పరిష్కరించాలే తప్ప.. ఇలా దాడులతో కాదు’’ అని ఫడ్నవిస్‌ మీడియాతో అన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌.. ముంబైలోని ఆకాశవాణి ఎమ్మెల్యే హాస్టల్‌లో పప్పు బాగోలేదంటూ క్యాంటీన్‌ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గైక్వాడ్‌ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. పాడైపోయిన ఆహారం పెడుతున్నారంటూ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రావడం లేదని, అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారాయాన. అంతేకాదు.. వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని చెబుతున్నారాయన.Shiv Sena (Shinde group) MLA Sanjay Gaikwad allegedly assaulted staff at the MLA canteen near the State Secretariat in Mumbai. #SanjayGaikwad #MLACanteen #MaharashtraPolitics #Shivsena #bjp pic.twitter.com/NCXaf1rdgJ— YourDailyNews (@yourdailynews9) July 9, 2025మరోవైపు సంజయ్‌ గైక్వాడ్‌ దాడి వీడియోపై ఉద్దశ్‌ శివసేన వర్గం భగ్గుమంది. అయితే.. సంజయ్‌ గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేం కాదు. కిందటి ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి షిండే శివసేన తరఫున కేవలం 841 ఓట్ల తేడాతో గైక్వాడ్‌ గెలుపొందారు.2024 సెప్టెంబర్‌లో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఆయన నాలుక కోసిన వారికి ₹11 లక్షల బహుమతి ప్రకటించారు. రాహుల్‌ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు బీసీలకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయంటూ గైక్వాడ్‌ ఈ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.2024 ఏప్రిల్‌లో.. మహారాష్ట్ర పోలీసులను ప్రపంచంలోనే అత్యంత అసమర్థమైన అధికారులుగా అభివర్ణించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవిస్‌ అసహనం వ్యక్తం చేస్తూ ఏక్‌నాథ్‌ షిండేకు ఫోన్‌ చేశారు. ఆపైన గైక్వాడ్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.2023 మార్చిలో.. ఒక యువకుడిని పోలీస్ లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయింది.2021లో.. అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కరోనాను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. కరోనా గనుక తన చేతికి దొరికితే ఫడ్నవిస్‌ నోట కుక్కి కథ ముగిస్తానంటూ వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకుగానూ బీజేపీ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 1987లో పులిని వేటాడానని చెబుతూ.. దాని పళ్లను లాకెట్‌గా ధరించానని చెప్పడంతో వన్యప్రాణుల చట్టం ఉల్లంఘన కింద సంజయ్‌ గైక్వాడ్‌ మీద కేసు నమోదైంది.తాజాగా: ముంబయిలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పాడైపోయిన పప్పు ఇచ్చారన్న కారణంతో కాంటీన్ సిబ్బందిని చెంపదెబ్బతో కొట్టిన వీడియో వైరల్ అయింది.

Man Fearlessly Holding Giant King Cobra Goes Viral On Socialmedia8
ఏం గుండె సామీ నీది..? కింగ్‌ కోబ్రా రియల్‌గా..

పాముల్లో రాజు..కాటేసిందో అంతే మటాష్‌ అంత భయంకరమైన పాయిజినస్‌ పాము కింగ్‌ కోబ్రా. దాన్ని చూస్తేనే భయం. అవి చాలా భయంకరమైన కారడవుల్లో ఉంటాయని విన్నాం, పలు వీడియోల్లో చూశాం. కానీ రియల్‌గా దాని సైజు ఎంత ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూస్తే..వామ్మో అని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ అందుకు సంబంధించిన 11 సెకన్ల క్లిప్‌ని నెట్టింట షేర్‌ చేశారు. అందులో ఒక వ్యక్తి చాలా నిర్భయంగా భారీ కింగ్‌ కోబ్రాని ఉత్తిచేతులతో పట్టుకుని నిలబడినట్లు కనిపిస్తుంది. ఆ భారీ కింగ్‌ కోబ్రాని పట్టుకున్నానన్న భయం, బెరుకు లేకుండా చాలా ప్రశాంతంగా పట్టుకుని నిల్చున్న తీరు చూస్తే..వామ్మో ఏం గుండె రా నీది అని అనిపించక మానదు. ఈ వీడియోకి పర్వీన్‌ ఈ పాములు భారతదేశంలో ఎక్కడుంటాయో తెలుసా అనే క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!.వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..(చదవండి: చీర ధరించడం బాగానే ఉంది..! కానీ ఇలానా..?: వీడియో వైరల్‌)

SP Manikanta Over At YS Jagan Convoy In Bangarupalyam9
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌.. పోలీసులపై వైఎస్‌ జగన్‌ సీరియస్‌

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌, లాఠీచార్జ్‌పై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్జ్‌లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌పై వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్‌సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.

SIT Hand Over Phone Tapping case Prabhakar Rao laptop And Phone10
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటా కీలకంగా మారనుంది. వీటి నుంచి డేటాను సేకరించి పనిలో అధికారులు ఉన్నారు.వివరాల ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్ చేశారు. అనంతరం, ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రభాకర్‌ రావు.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలతో, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్టు సిట్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఇక, ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్‌ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. రేపు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను సిట్‌ గుర్తించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ధ్వంసమైన హార్డ్ డిస్కులలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం. దీంతో, సిట్‌ అధికారులు.. హార్డ్ డిస్కులపైన ఆశలు పెట్టుకున్నారు. డేటా రిట్రైవ్, హార్డ్‌ డిస్కులోని రహస్యాలపై సిట్ ఆరా తీస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement