Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Vallabhaneni Vamsi Mohan Met YS Jagan Convey Thanks1
వైఎస్‌ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్‌ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్‌ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

Sailaja Nath Takes On Chandrababu Naidu2
‘నిజం చెప్పినందుకు లోకేష్‌ మనుషులు బెదిరిస్తారా?’

తాడేప‌ల్లి: సత్తెనపల్లిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావ‌డం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల త‌న అస‌హ‌నాన్ని ప్ర‌దర్శించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. స‌త్తెన‌ప‌ల్లి లో జరిగిన సింగ‌య్య మ‌ర‌ణంపై చంద్ర‌బాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. కారు కింద సొంత పార్టీ కార్య‌క‌ర్త ప‌డితే కుక్క పిల్లలా లాగిప‌డేశారని నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైఎస్‌ జగన్‌పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.దళితులంటే అంత చులకనా బాబూసింగ‌య్య భార్య లూర్దు మేరి వైఎస్‌ జ‌గ‌న్‌ని క‌లిశారు. త‌మ కుటుంబానికి వైఎస్‌ జ‌గ‌న్ అంటే అభిమాన‌మ‌ని, ఆయ‌న్ను చూడ‌టానికి తాను, త‌న భ‌ర్త సింగ‌య్య బ‌య‌ట‌కు వ‌చ్చామ‌ని చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు త‌న భ‌ర్తే స్వ‌యంగా మా పేర్లు, ఫోన్ నెంబ‌ర్లు చెప్పార‌ని, అంబులెన్స్ లోకి చేరేవ‌ర‌కు బాగానే ఉన్నార‌ని, బాగానే మాట్లాడుతున్నార‌ని, త‌న‌కు కొద్దిపాటి దెబ్బ‌లే త‌గిలాయ‌ని చెప్పిన విష‌యం ఆమె గుర్తు చేశారు. ఆటోలో తీసుకెళ్తామ‌ని చెప్పినా విన‌కుండా అంబులెన్స్‌లో త‌ర‌లించారు. బాగా మాట్లాడుతున్న వ్య‌క్తి ఎలా చ‌నిపోయాడ‌ని ఆమె అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు స‌మాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్ర‌మాదం జ‌రిగిన్ప‌పుడు ఒక‌లా, ఆ త‌ర్వాత మ‌రోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని త‌న ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవ‌న్నీ సింగ‌య్య మ‌ర‌ణంపై ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయి. ద‌ళితుల ప‌ట్ల చంద్రబాబు ఎంత ప్రేమ ఉంద‌నేది మా అంద‌రికీ తెలుసు. మొన్న తెనాలిలో ద‌ళిత యువ‌కుల‌ను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విష‌ప్ర‌చారం చేశారు. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌ను ప‌క్క‌న పెడితే, ప్ర‌భుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ద‌ళితుల మీద దాడులు జ‌రుగుతున్నాయి. నిన్ననే చంద్ర‌గిరిలో ద‌ళిత మ‌హిళ‌ను బ‌ట్ట‌లు చించి కొట్టారు. జేమ్స్ అనే యువ‌కుడితే మూత్రం తాగించారు. ద‌ళితుల మీద సాంఘిక బ‌హిష్క‌ర‌ణ‌లు ఎక్కువైపోయాయి. సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలాకాలో ద‌ళితుల‌ను సాంఘిక బ‌హిష్క‌ర‌ణ చేసినా క‌నీసం దానిపై ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చారా? మ‌ంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితులు న‌డిచార‌ని రోడ్డు మైల‌ప‌డింద‌ని ప‌సుపు నీళ్ల‌తో క‌డిగిన దారుణం ఇప్ప‌టికీ మా క‌ళ్ల‌లో క‌దులుతూనే ఉంది. స‌త్య‌సాయి జిల్లా ఏడుగుర్రాల‌ప‌ల్లెలో ఒక ద‌ళిత బాలిక‌పై టీడీపీ యువ‌కులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా? ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్య‌క‌ర్త అని, మీ పార్టీ విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోక‌పోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘ‌ట‌న‌లోనూ నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారా? ఒక ద‌ళితుడిని కారులో ప‌క్క‌న కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన ద‌ళితుల‌ను ఉద్ద‌రించిన‌ట్టు ప్ర‌జ‌ల‌కు అనుకుంటార‌నే భ్ర‌మ‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చ‌దివితే మేం న‌మ్మేస్తామ‌ని ఎలా అనుకుంటారు? మీ హయాంలో జరిగిన వాటికి ఏం స‌మాధానం చెబుతారు?నాడు సీఎం చంద్ర‌బాబు పుష్క‌ర ఘాట్‌లో ఉండ‌గా గోదావ‌రి పుష్క‌రాల్లో జ‌రిగిన తొక్కిస‌లాట జ‌రిగి 29 మంది అమాయ‌క భ‌క్తులు చ‌నిపోయారు. చంద్ర‌బాబు నిర్వ‌హించిన కందుకూరు రోడ్ షోలో 7 మంది చనిపోయారు. గుంటూరులో చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ త‌ర్వాత‌ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. క‌నీస జాగ్ర‌త్త‌లు పాటించ‌ని కార‌ణంగా ముగ్గురు మ‌హిళ‌లు చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదాలు జ‌రిగిన అన్ని సంద‌ర్భాల్లో అక్క‌డ చంద్ర‌బాబు ఉన్నారు. వీట‌న్నింటికీ ఆయ‌న ఏం స‌మాధానం చెబుతారు. అన్ని వ‌ర్గాల్లోనూ కూటమి ప‌్ర‌భుత్వంపై రోజురోజుకీ వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జ‌లు గుర్తు చేసుకుని, ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నారు. వైఎస్‌ జగన్‌కి ఉన్న ప్ర‌జాభిమానాన్ని త‌క్కువ చూసి చూపించ‌డానికి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేయాల‌ని చూస్తున్నారు. ఆయ‌న బ‌య‌ట‌కు రాకుండా చేయాల‌నే కుట్ర‌తో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమతులు కూడా ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నారు. ప్ర‌జాస్వామ్యంలో స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రిగితేనే పాల‌న మెరుగువుతుంద‌న్న కీల‌క విష‌యాన్ని చంద్ర‌బాబు మ‌ర్చిపోతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే చంద్ర‌బాబు బెదిరింపుల‌కు దిగుతున్నారు. సూప‌ర్ సిక్స్ గురించి ప్ర‌శ్నిస్తే నాలుక మందం అన‌డం దేనికి సంకేతం? పోలీసుల‌ను కూడా పార్టీల వారీగా విభజించి వేధిస్తున్న ఘ‌న‌త చంద్ర‌బాబుది.ఇంత వికృతమైన రాజకీయాలు చేయటం చంద్రబాబుకే చెల్లింది. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారో చర్చించటానికి మేము సిద్ధం. మా హయాంలో జరిగిన అప్పుల గురించి తప్పుడు ప్రచారం చేశారు. లోకేష్ మనుషులు వచ్చి బెదిరించారని సింగయ్య భార్య చెప్పింది. దీనిపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?, ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై లైంగిక దాడి జరిగితే చంద్రబాబు ఏం చేశారు?, ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త. చంద్రబాబు మీటింగుకి వెళ్లి ఆయన చనిపోయారు. అలాంటి కుటుంబానికి చంద్రబాబు ఎందుకు న్యాయం చేయలేదు?, చంద్రబాబు గానీ ఆయన మంత్రులుగానీ కనీసం పరామర్శించకపోవటానికి కారణం ఏంటి?, లైంగికదాడి కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని శైలజానాత్‌ ప్రశ్నించారు.ఇదీ చదవండి: లోకేష్‌ మనుషులు మా ఇంటికొచ్చారు: సింగయ్య భార్య

Ranbir kapoor And Sai Pallavi Movie Ramayana The Introduction Out Now3
'రామాయణ' సినిమా నుంచి ఫస్ట్‌ వీడియో విడుదల

'రామాయణ' సినిమా నుంచి పాత్రల పేర్లను పరిచయం చేస్తూ ఒక వీడియోను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ప్రాజక్ట్‌ నుంచి విడుదలైన తొలి వీడియో ఇదే కావడం విశేషం. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో 'రామాయణ' పేరుతో అత్యంత భారీ బడ్జెట్‌ పేరుతో సినిమా వస్తుంది.దంగల్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్‌ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్‌ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్‌ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్‌, ఇంటర్‌ స్టెల్లర్‌, ది లయన్‌ కింగ్‌, డ్యూన్‌ వంటి టాప్‌ చిత్రాలకు సంగీతం అందించారు. ఏఆర్‌ రెహమాన్‌ కూడా రామయణ చిత్రానికి సంగీతంలో భాగం పంచుకోవడం విశేషం. రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 2026 దీపావళీ సందర్భంగా రామాయణ-1 విడుదల కానుంది. 2027 దీపావళీకి పార్ట్‌-2 రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు.

Ganguly And Gavaskar Slams Gambhir India XI vs England In 2nd Test4
ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్‌!.. గంగూలీ విమర్శలు

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత్‌ ఎంచుకున్న తుదిజట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. కీలక మ్యాచ్‌లో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినివ్వడంతో పాటు.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. కాగా టెండుల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే.తప్పని ఓటమిలీడ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఐదు శతకాలు సాధించినా.. లోయర్‌ ఆర్డర్‌, బౌలర్లు, ఫీల్డింగ్‌ వైఫల్యం కారణంగా పరాభవం తప్పలేదు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్‌ సేన 0-1తో వెనుకబడింది. అయితే, రెండో టెస్టులోనైనా పొరపాట్లు సరిచేసుకుంటుందని భావిస్తే.. తుదిజట్టు కూర్పే సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి.తొలి టెస్టులో ఆడిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. సాయి సుదర్శన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌ దీప్‌లను ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టుకు తీసుకుంది.ఇద్దరు బెస్ట్‌ స్పిన్నర్లు ఉన్నారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లతో ఆడుతుందని నాకు అనిపించడం లేదు. ఇంగ్లండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది.టీమిండియాకు ఇదే మంచి అవకాశం. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే సానుకూల ఫలితం రాబట్టగలము’’ అని పేర్కొన్నాడు ఇక భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ మాత్రం మేనేజ్‌మెంట్‌ తీరుపై ఘాటు విమర్శలు చేశాడు. ‘‘కుల్దీప్‌ యాదవ్‌ను తుదిజట్టుకు ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎడ్జ్‌బాస్టన్‌ లాంటి పిచ్‌పై బంతి కాస్త టర్న్‌ అవుతుందనీ తెలిసి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా?’’ అని ప్రశ్నించాడు.గిల్‌పై గావస్కర్‌ ఆగ్రహం!అంతేకాదు.. బ్యాటింగ్‌లో డెప్త్‌ కోసం ఆల్‌రౌండర్లు నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌లను తీసుకున్నామన్న కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సమర్థనను కూడా గావస్కర్‌ తప్పుబట్టాడు. ‘‘మీ జట్టులోని టాపార్డర్‌ విఫలమవుతుంటే.. వాషింగ్టన్‌ ఏడో స్థానంలో వచ్చి.. నితీశ్‌ రెడ్డి ఎనిమిదో స్థానంలో వచ్చి ఏం చేయగలరు?వాళ్లేమీ తొలి టెస్టులో విఫలమైన బ్యాటర్ల మాదిరి కాదు కదా!.. మీరు మొత్తంగా 830కి పైగా పరుగులు చేశారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 380 స్కోరు చేయలేక ప్రత్యర్థికి అవకాశం ఇచ్చారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పటిష్టం చేస్తున్నామని చెప్పడం కాదు.. వికెట్లు తీసే బౌలింగ్‌ విభాగాన్ని ఎంచుకోండి’’ అని గావస్క కెప్టెన్‌ గిల్‌, హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో స్పిన్‌ విభాగంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లు ఆడుతున్నారు. వీరిలో ఒకరికి బదులు స్పెషలిస్టు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేయాల్సిందని గావస్కర్‌ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (87), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (114 నాటౌట్‌)లతో పాటు రవీంద్ర జడేజా (41 నాటౌట్‌) రాణించాడు.ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ.చదవండి: గిల్‌.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గ‌ర్వ‌ప‌డుతుంటాడు: యువరాజ్‌

YSRCP Leaders Meets Election Commission At Delhi5
ఈసీతో వైఎస్సార్‌సీపీ నేతల భేటీ.. చివరి గంటలో పోలింగ్‌ శాతంపై చర్చ..

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ నేతల బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ బృందం ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ అంశాలపై వివరణ ఇచ్చేందకు వైఎస్సార్‌సీపీని ఈసీ ఆహ్వానించింది. దీంతో, ఈసీ దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లినట్టు పార్టీ నేతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డిల బృందం గురువారం ఉదయం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. అనంతరం, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్‌ అనుమానాలపై ఈసీకి వివరించాం. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్‌ శాతంపై వివరణ కోరాం. కేంద్ర ఎన్నికల సంఘం మమ్మల్ని ఆహ్వానించింది. ఓటర్ లిస్టు, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయి. 2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్లను పోల్చి చూడాలని చెప్పాం. ఈవీఎంలలో బ్యాటరీలపైన కూడా సందేహాలు ఉన్నాయి. ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఆరు తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయి. దీనిపై ఎంక్వైరీ చేయాలి.విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్‌ కంపారిజన్ చేయమని కోరాము. కానీ, వీవీప్యాట్ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదు. అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగింది. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరాము. దానికి ఈసీ ఒప్పుకుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌కు భిన్నమైన పోలింగ్ నమోదు అయ్యింది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరగాలి’ అని చెప్పుకొచ్చారు.

Building Collapses At Kottayam Govt Hospital6
కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం

కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు.

China's Silent Disruption of iPhone Production in India7
భారత్‌లో ‘యాపిల్‌’కు చెక్‌ పెట్టేలా చైనా కుతంత్రాలు

భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్‌ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్‌ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్‌ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్‌ గ్లోబల్ హబ్‌గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్‌ ఎగుమతులకు చెక్‌ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్‌ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్‌ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్‌ ఐఫోన్‌ 17ను లాంచ్‌ చేయనుంది. ఈమేరకు భారత్‌లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్‌కాన్‌పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్‌ సైట్‌ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.

India is not Just a Partner but co Traveler pm Modi8
‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ

అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్‌ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్‌ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్‌.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్‌టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్‌-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?

Zohran Mamdani Strong Reaction For Trump Deportation Comments9
అందుకే ట్రంప్‌ నన్ను టార్గెట్‌ చేశారు

ట్రంప్‌-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్‌ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్‌ ర్యాలీలో ట్రంప్‌ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్‌: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్‌ ట్రంప్‌పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్‌ క్లాస్‌ పీపుల్‌ను ట్రంప్‌ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్‌గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్‌ నగర మేయర్‌ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్‌ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్‌ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్‌ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్‌ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు.

Indian techie Soham Parekh accused by 5 US CEOs of scamming startups10
‘స్కామర్‌..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం

అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్‌, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్‌లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్‌ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్‌హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్‌ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్‌ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్‌ అయ్యాడు. బెస్ట్‌ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్‌ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్‌నిపుణురాలు ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement