Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Lok Sabha Election 2024: IT Department Seized Rs 1100 Crore Cash And Jewellery
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్‌ చేసిన ఐటీ శాఖ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 షెడ్యూల్‌లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్‌ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్‌ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్‌ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్‌ కోడ్‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఆదాయ‌ప‌న్ను శాఖ నిర్వ‌హించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల న‌గ‌దును సీజ్ చేశారు. మే 30వ తేదీ వ‌ర‌కు ఆదాయ‌ప‌న్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నిక‌ల‌తో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ 390 కోట్ల న‌గ‌దును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నిక‌ల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, త‌నిఖీల‌ను పెంచేసింది. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు వాడుతున్న డ‌బ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, క‌ర్నాట‌క, తమిళనాడు రాష్ట్రాల్లో అత్య‌ధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వంద‌ల కోట్ల‌కు పైగా న‌గ‌దు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వ‌ర‌కు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు.

'Gangs Of Godavari' Movie Review And Rating In Telugu
గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ

టైటిల్‌: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరినటీనటులు: విశ్వక్‌ సేన్‌, అంజలి, నేహా శెట్టి, నాజర్‌, హైపర్‌ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్‌ శంకర్‌ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్‌ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న(విశ్వక్‌ సేన్‌) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్‌) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్‌ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్‌ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్‌ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్‌ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్‌ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్‌ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్‌ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్‌ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్‌ రత్నాకర్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్‌ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్‌ సాంగ్‌లో ఆయేషా ఖాన్‌ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్‌, సాయి కుమార్‌ హైపర్‌ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్‌ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

AP Elections 2024: May 31th Political Updates In Telugu
May 31th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 31th AP Elections 2024 News Political Updates..12:30 PM, May 31st, 2024ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు..అమరావతి...ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటుపి. శ్రీలేఖపై ఒంగోలు పార్లమెంటు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బదిలీఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కలెక్టర్ కర్నూల్ ఏ.మురళి, డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ ఓ.రాంభూపాల్ రెడ్డి బదిలీ ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఆదేశంఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్‌ కేఎస్‌ జవహర్ రెడ్డిబదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జవహర్ రెడ్డివీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారంఎం.వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్‌కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీసి.విశ్వనాధ్‌ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీజే.శిరీషను అనంతపురం పిఏబిఆర్-2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ 11:45 AM, May 31st, 2024ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం..ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై వైఎస్సార్‌సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుంది.అంటే ఈసీ తప్పు చేసినట్లేగా? ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా? దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై వైయస్‌ఆర్‌సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుందంటే తప్పు చేసినట్లేగా?-మాజీ… pic.twitter.com/cVFjx2N25M— YSR Congress Party (@YSRCParty) May 31, 2024 11:00 AM, May 31st, 2024ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామ కొత్త డ్రామా.. విశాఖ ఆసుపత్రిలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామఈరోజు మండలి ఛైర్మన్‌ ఎదుట హాజరుకావాల్సిన రఘురామ. విచారణ నుంచి తప్పించకోవడానికి రఘురామ ఎత్తుగడ. 10:15 AM, May 31st, 2024అల్లరి మూకలకు పల్నాడు ఎస్పీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదురాజకీయ నేతల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం. ఒక్కసారి రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తే మీ జీవితం నాశనం అయినట్టే. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడు జిల్లా పేరు చెబితే దేశం ఉలిక్కి పడేలా చేశారు. 9:40 AM, May 31st, 2024పచ్చ బ్యాచ్‌ ఫేక్‌ బతుకు బట్టబయలు..టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీటీడీపీది ఫేక్‌ బతుకంటూ ప్రజల ఆగ్రహం. టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్‌తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.. కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్‌పై ఉమ్మేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్… https://t.co/2S5r92PmK1— YSR Congress Party (@YSRCParty) May 30, 2024 9:00 AM, May 31st, 2024స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌తిరుపతి జిల్లా..అర్థరాత్రి శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుహర్షవర్ధన్ రాజు కామెంట్స్..స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని వైపులా తనిఖీలు.కేంద్ర సాయుధ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్ చాలా భద్రంగా ఉంది.ఔటర్ కార్డెన్‌లో మూడు మొబైల్ పార్టీస్‌తో నిరంతర పహారా కొనసాగుతోంది.స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.స్ట్రాంగ్ రూమ్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది.. లోపలికి ఎవరూ రాలేరు. 8:40 AM, May 31st, 2024తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌అనంతపురం..తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శిరీషా నియామకంఇప్పటిదాకా ఆర్వోగా విధులు నిర్వహించిన రాంభూపాల్ రెడ్డికాగా, రాంభూపాల్‌ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శిరీషను నియమించిన ఎన్నికల సంఘం 8:00 AM, May 31st, 2024ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటవైఎస్సార్‌ జిల్లా..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటచాపాడులో ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యేపై నమోదైన కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓకే చెప్పిన కోర్టు.ఈనెల ఆరో తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరుఅరెస్టుతో సహా, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం 7:45 AM, May 31st, 2024విశాఖలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌..విశాఖపట్నం.. పీఎం పాలెం..ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు.సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం.రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసుల నిఘా వేసిన డీసీపీ లక్ష్మీ నారాయణ.జూన్ నాలుగో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు నగరంలో పలు సమస్యత్మాక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.కార్డన్ సెర్చ్‌లో నార్త్ ఏసీపీ సునీల్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. 7:30 AM, May 31st, 2024పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటంకేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్‌ అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదం ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్‌సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టుఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సవరణ పిటిషన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్‌లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం 7:00 AM, May 31st, 2024స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’! ఆ మేరకు టీడీపీ బేరసారాలు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడఅవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం

Naveen Patnaik responds on VK Pandian controlling BJD allegations
ఒడిశాలొ ‘పాండియన్‌’ పాలిటిక్స్‌.. నవీన్‌ పట్నాయక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భువనేశ్వర్‌: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ‌ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్‌ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్‌ పట్నాయక్‌కు పాండియన్‌ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ గురువారం స్పందించారు.ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా నవీన్‌ పట్నాయక్‌.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్‌ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024 ఇక.. వీకే పాండియన్‌ నన్ను కంట్రోల్‌ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్‌ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్‌ మాత్రమే నవీన్‌ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్‌ మైక్‌ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్‌ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఎవరీ వీకే పాండియన్‌..?తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్‌ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు. 2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్‌ తన బ్యూరోక్రాట్‌ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్‌ 27న సీఎం నవీన్‌ పట్నయాక్‌ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.

Virat Kohli leaves for the USA ahead of T20 World Cup 2024
T20 WC: ఎట్టకేలకు అమెరికాకు బయలు దేరిన విరాట్‌ కోహ్లి..

ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2024కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. జూన్‌ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు అమెరికాకు పయనమయ్యాడు. న్యూయర్క్‌ విమానం ఎక్కే ముందు కోహ్లి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కన్పించాడు. అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా భారత జట్టు ఇప్పటికే రెండు బ్యాచ్‌లగా యూఎస్‌కు చేరుకుంది. కానీ కోహ్లి మాత్రం జట్టుతో వెళ్లకుండా స్వదేశంలోనే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు ఈ మెగా టోర్నీకి సమయం అసన్నమవుతుండడంతో కోహ్లి అమెరికాకు బయలుదేరాడు. అయితే ఈ మెగా టోర్నీలో భాగంగా జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో జరిగే వార్మప్‌ మ్యాచ్‌కు కోహ్లి అందుబాటులో ఉంటాడా లేదన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌. Virat Kohli giving autograph to fans at the airport. 👏Nice Gesture by King Kohli 👑❤️ pic.twitter.com/FPRvP0FaBv— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 30, 2024

Prajwal returns from Germany arrested by SIT at bangalore airport
బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్‌ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్‌ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్‌ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్‌ గత ఏప్రిల్‌లో భారత్‌ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్‌ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్‌.. వెంటనే భారత్‌కు రావాలి

TDP Conspiracy with EC new rules on validity of postal ballot
కుట్రపూరితం! పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ విష­యంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్‌ నంబర్‌తో డిక్లరేషన్‌ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్‌ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్‌ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్‌ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్‌.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్‌ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్‌ అధికారి హోదా వివరాలు, సీల్‌ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్‌ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్‌ పిటీషన్‌ వేయడం ద్వారా పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్‌ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్‌ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్‌ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్‌ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్‌ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్‌ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంత మంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్‌) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్‌ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్‌ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సీల్‌ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్‌ వేయకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Mahesh Babu Emotional Post On Father Krishna 81st Birth Anniversary
కృష్ణ జయంతి.. మిస్‌ అవుతున్నా నాన్నా అంటూ మహేశ్‌ పోస్ట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.మిస్‌ అవుతున్నా..హ్యపీ బర్త్‌డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.అవి గుర్తు చేసుకుంటేమరోవైపు డైరెక్టర్‌ వివి వినాయక్‌.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్‌గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Forever in our hearts, forever a legend 💫 Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬 May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024

Donald Trump Found Guilty In Hush Money Trial Case
TRUMP: ‘హష్‌ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు

న్యూయార్క్‌: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్‌మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ న్యూయార్క్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్‌ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్‌ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్‌ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ హుష్‌మనీ కేసు ఫైల్‌ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్‌ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్‌ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్‌5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్‌ చేసే రిపబ్లికన్‌ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్‌ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్‌ మీడియాతో అన్నారు.

No Tobacco Day 2024: Expert Explains Quit Smoking With These Foods
Anti tobacco day: దున్నపోతు మాట దేవుడెరుగు.. పోతావుపైకి!

‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌’ అని అప్పుడెప్పుడో గిరీశం సెలవిచ్చాడు కానీ... అదెంత అబద్ధమో... పొగ ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇప్పుడు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకవైపు పొగాకు వినియోగంపై అవగాహన పెరుగుతున్నా... ఇంకా అజ్ఞానంలో ఉన్నవారూ కొనసాగుతున్నారు. ఒకరకంగా చూస్తే పెరిగిపోతున్నారు. ఇలాంటి వారిలోనూ ధూమపానం వ్యతిరేక ప్రభావాలపై అవగాహన పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ నాటి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ లక్ష్యాన్ని సాధించామనుకోండి... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 లక్షలుగా ఉన్న పొగాకు సంబంధిత మరణాలను గణనీయంగా తగ్గించవచ్చున్నమాట!ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే..1987లో, డబ్యూహెచ్‌ఓలోని సభ్య దేశాలు ఏప్రిల్ 7ని ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవంగా గుర్తించాయి. అయితే పొగాకు సంబంధిత సమస్యలన్నింటిపై అవగాహన పెంపొందించే ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని 1988లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి డబ్యూహెచ్‌ఓ దాని సభ్య దేశాలు ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.పొగాకు వినియోగ గణాంకాలు:వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గణాంకాల ప్రకారం ఏటా పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా దాదాపు 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నట్లు పేర్కొంది. అలాగే దాదాపు 1.3 మిలియన్ల మంది ధూమపానం చేయనివారు సెకండ్‌హ్యాండ్‌ స్మోక్‌కి గురయ్యి, అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు ప్రపంచంలోని దాదాపు 1.3 మిలియన్ల పోగాకు వినియోగదారుల్లో సుమారు 80% మంది మధ్య ఆదాయ దేశాల్లో నివశిస్తున్నారు. కేవలం 2020లో ప్రపంచ జనాభాలో 22.3% మంది పొగాకును ఉపయోగించినట్లు అంచనా. వారిలో 36.7% మంది పురుషులు, 7.8% మంది మహిళా వినియోగదారులు ఉన్నాట్లు వెల్లడయ్యింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మంది యువకులు ధూమాపానాన్ని సేవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది థీమ్‌:ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ “పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం”. ఈ థీమ్‌ని ఇతివృత్తంగా చేసుకుని పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన పెంచడం, ధూమపానం దూరంగా ఉండేలా ప్రజలను ప్రోత్సహించేలా చేయడం వంటివి చేస్తారు అధికారులు. అంతేగాదు ఈ పొగాకు అడిక్షన్‌ నుంచి ఎలా బయటపడాలి వంటి అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతారు. ఈ పొగాకులో దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల రసాయనాలు ఉంటాయి. అవి సుమారు 50 నుంచి 60 రకాల కేన్సర్‌ కారకాలని నిపుణులు చెబుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ అనే రసాయనం డోపమైన్, అసిటైల్‌కోలిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, సెరోటోనిన్ వంటి ఆనందకరమైన హార్మోన్‌లను విడుదల చేసి వ్యసపరుడిగా మారుస్తుంది. ఇది క్రమేణ అధిక రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు అడిక్షన్‌ నుంచి బయటపడాలంటే..మన వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..ధూమపానం సేవించాలనే కోరిక గలిగనప్పుడూ ప్రత్నామ్నాయ మార్గాలను ఎంచుకోండి. ఆ కోరికను అదుపులో పెట్టుకోలేనట్లు అనిపించనప్పుడూ ఈ క్రింది ఆహార పదార్థాలను పత్యామ్నాయంగా ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు.పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం. పండ్లు, పచ్చి కూరగాయలు తినడంనీళ్లు ఎక్కువగా తాగడందాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడంగోరు వెచ్చని పాలు తాగడంనిమ్మకాయ నీళ్లు వంటివి తాగాలిపైవాటిలో మీకు నచ్చినవి తాగేందుకు ప్రయత్నిస్తూ ఆ కోరికను నియంత్రించడం వంటివి చేస్తే సులభంగా పొగాకు అడిక్షన్‌ నుంచి బయటపడతారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. రాను మీకు తెలియకుండానే మంచి ఆహారపు అలవాట్లకు అలవాటు పడతారు. దీంతో పాటు చక్కటి వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్‌లతో మైండ్‌ని డైవర్ట్‌ చేస్తూ.. ఉంటే శారీకంగానూ, మానిసకంగానూ స్ట్రాంగ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అంతరిక్ష వ్యర్థాలకు చెక్‌ పెట్టేలా 'చెక్క ఉపగ్రహం'..ప్రపంచంలోనే..!)

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement