టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాల చేసేవారి సంఖ్య కూడా ఎక్కువవుతోంది. ఇటీవల కొంతమంది కేటుగాళ్లు పోలీసుల పేరుతో.. పార్శిల్ స్కామ్ / ఫేక్ డిజిటల్ అరెస్ట్ అనే కొత్త స్కామ్‌కు తెరలేపారు. దీనికి బలైన ఓ హదరాబాద్ వాసి 20 రోజుల్లో ఏకంగా రూ. 1.2 కోట్లు పోగొట్టుకున్నారు.
మే 7న ఊహించని ఫోన్ కాల్‌తో హైదరాబాద్ వాసి కష్టాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి పోలీస్ అధికారినని నమ్మించి.. అతని పేరు మీద ఉన్న పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని.. దానిని స్వాధీనం చేసుకున్నట్లు ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. హైదరాబాద్ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నీ కూడా ఎలాంటి తప్పు లేకుండా చెప్పడంతో.. బాధితుడు నకిలీ వ్యక్తిని పూర్తిగా నమ్మేశాడు.
పోలీసుగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. బాధితున్ని 24/7 ఆన్‌లైన్‌లో ఉండాలని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి 20 రోజులు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆ 20 రోజులు సరిగ్గా తిండి లేదు, సరిగ్గా నిద్ర కూడా పోలేదని ఆ వ్యక్తి మీడియాతో చెప్పుకున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండటానికి రూ. 30 లక్షలు పంపాలని నకిలీ పోలీస్ చెప్పాడు. ఇలా వారి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. మొత్తం మీద బాధితుడు రూ.1.2 కోట్లు నష్టపోయినట్లు పేర్కొన్నాడు.
డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అంటే..
డిజిటల్ అరెస్ట్ స్కామ్ లేదా పార్శిల్ స్కామ్ అని పిలువబడే ఈ స్కామ్‌లో నేరస్థులు చట్టాన్ని అమలు చేసేవారిగా నటించి, అనుమానాస్పద వ్యక్తుల నుంచి డబ్బును దోచుకుంటారు. అనుమానాస్పద పార్శిల్ ఆధారంగా బాధితుడు పెద్ద నేరంలో చిక్కుకున్నట్లు నమ్మించి వారిని భయాందోళనలకు గురి చేస్తుంటారు.
ఇలాంటి మోసాల నుంచి బయటపడే మార్గం..
కాలర్ ఐడెంటిటీ ద్రువీకరించుకోవాలి: తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా ద్రువీకరించుకోవాలి. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ లేదా డాక్యుమెంట్స్ ద్వారా సమాచారం తెలుసుకుని అధికారిక సంస్థను నేరుగా సంప్రదించాలి.
వ్యక్తి సమాచారం చెప్పకూడదు: మీకు తెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు.. మీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఇది మీకు చాలా ప్రమాదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది.
అత్యవసర అభ్యర్థనలు: నిజానికి స్కామర్లు ఎప్పుడూ.. అత్యవసర పరిస్థితులను సృష్టిస్తారు. ఇలాంటి సమయంలో బాధితులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.
అనుమానాస్పద కార్యకలాపాలు: గుర్తు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ లేదా మెసేజస్ వస్తే.. వెంటనే పోలీసులను సంప్రదించాలి. బ్యాంకులకు సంబంధించినవైతే.. నేరుగా బ్యాంకుకు వెళ్లి సమాచారం తెలుసుకోవాలి.
ప్రస్తుతం ఇలాంటి స్కామ్‌లు ఎక్కువైపోతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. కాబట్టి ఇలాంటి స్కామ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment