ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీష్ ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. హరీష కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కేసు విషయమై రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది. అయితే, గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా.. జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?
దేవుడ్ని మొక్కేటోళ్లు రోజూ చెప్పుకునే మంత్రాలు కొన్నుంటాయి. వోటిని నిత్యపారాయణం అంటారు. ఆ పెకారం జూసినప్పుడు.. ఏడాదికి రెండుమార్లు చెప్పుకునే మంత్రాలను ఏటనుకోవాల? అట్టాంటివి మామూలు పెజానీకానికి అలవాటు లేదు గాబట్టి.. ఆ పనిజేసే చంద్రబాబుగోరే ఆటికి పేరు గూడా పెట్టాల! ఎందుకంటే ఆయన తనకి పిల్లనిచ్చి పెళ్లిజేసిన మావగార్ని తలుసుకుంటా.. ఒకే మంత్రాన్ని ఏడాదికి రెండుసార్లు జపిస్తావుంటాడు గాబట్టి. అదేనండీ.. పాపం అల్లుడే తనకు గొయ్యి తవ్వగలడనే మర్మం తెలీకుండా చేరదీసిన పెద్దాయన ఎన్టీవోడి పుట్టిన్రోజు, కండ్లుమూసిన్రోజూ వచ్చినప్పుడెల్లా బాబుగారు పాట పాడతావుంటారు.అబ్బెబ్బే.. బాబు గారు పాట పాడతారనగానే.. చీటీపాటో.. టెండరు పాటో.. పీపీపీ పాటో.. అమరావతి పాటో అనుకోబాకండి సార్లూ. యిది యింకో పాటూ. ఎన్టీవోడికి బారతరత్న యిప్పించేస్తా అని కల్లమాటలు అల్లిన పాట!. బాబుగారంతటి పెద్దాయన, భీష్ముడి మాదిర్తో అంతలావు పెతిగ్న జేసింతర్వాత.. వోటిని కల్లమాటలంటావా? అని కోపగించుకోకండి సార్లూ. శానా మంది సెవులు గొరుక్కుంటా వుండే మాటలు యిన్నాక అట్టా అనిపించింది. సెప్పినానంతే. యింతకీ సెవులు గొరుక్కునే మాటేటంటారా? సెంద్రబాబు గోరి అత్తమ్మ.. అదేనండీ.. పిల్లనిచ్చిన మాంగోరు తాళిగట్టిన యిల్లాలు.. జీవించి ఉండగా, భారతరత్నాన్ని సెంట్రల్ గవుర్మెంటోళ్లు, ఎన్టీవోడి మీద పేమతో బతిమాలి యిచ్చినా గూడా.. సెంద్రబోబుగారు ‘ఠాట్’ అని అడ్డం పడతారేమో అనేది గుసగుసగా యినిపిస్తాందాండీ.సెంద్రబోబు గారు.. యెప్పుడు జూసినా నేను ఢిల్లీలో సెక్రం తిప్పినా, సెక్రం తిప్పతా.. అని సెప్తా వుంటారు గదండీ. సెక్రం గుర్తుండే పార్టీలోళ్లు గూడా అన్ని సార్లు సెక్రం తిప్పడం గురించి మాటాడరండీ బాబో! మరట్టాంటి సెక్రధారి సెంద్రబాబు గోరు.. సిటికేస్తే సాలు.. భారతరత్న ఏంది.. యింకేదైనా రత్నముండినా గూడా సటుక్కున వొచ్చేయాలి గదా!. మరి ఆపాటి పరపతి ఆయనకు వుండాలి గదా అనేది వొక డవుటు. అయినా, వొక్క సెంద్రబాబు గారిదేవుండాది లెండి. ఎన్టీవోడు కన్న పిలకాయిలేవైనా తక్కవోల్లా. ఎవురికి వారు రాజకీయాల్లో కొమ్ములు వంకర్లు దిరిగినోళ్లే గదా. సిన్నమ్మ అని అందురూ పిలుసుకుని ఆయన కూతురు పురందరేశ్వరమ్మ ఏవైనా తక్కవా? సెంటర్లో రాజ్యంజేసే పార్టీలో ఆమె శానాశానా పెద్ద పోస్టుల్లో వుండాది గదా? ఆమె గట్టిగా అడిగుంటే యీపాటికి యెప్పుడో యిచ్చేసేటోళ్లుగదా..!అయినా సార్లూ.. నాకో సంగతి తెలవక అడగతా. ఎన్టీవోడికి భారతరత్న అనిపించుకునే లెవిలు వుండాదో లేదో సెంటర్లో రాజ్జెంజేసేటోల్లకి తెలవదా అంట! ఆయనకి ఆ అవార్డు యిస్తే తమ పరపతే పెరిగిపోతాదని వోల్లకి తెలవదా అంట? యీనోటా ఆనోటా యినబడతా వుండేదేంటంటే.. గవుర్మెంటోల్లు యియ్యాలనుకున్నా గూడా.. బాబుగోరు అండ్ కో, అనగా ఎన్టీవోడి కన్నపిల్లలూ సైందవుల మాదిర్తో అడ్డం పడతా వుండారని గదా!. యీ యవ్వారం యెనకాల వుండేదేనండీ అసలు మతలబు! అవార్డే గనక వొస్తే.. ఢిల్లీకి బొయ్యి రాష్ట్రపతి చేతుల్లోంచి తీస్కోవాల్సింది యెవురు? కట్టుకున్న భార్య వుండగా.. ఎవురైనా సరే.. ఆమెనే గదా తొలీత పిలిసేది. ఆమెకే గదా ఆ మరేద దక్కేది. కడుపున బుట్టినోళ్లెవ్వరూ ఎన్టీవోడిని గెమనించుకోకుండా వొదిలేసినప్పుడు.. విలవిల్లాడిపోయిన పెద్దాయన యిష్టపడి కట్టుకున్నాడు గదబ్బా.. లక్ష్మిం పార్వతిని! సెంద్రబాబుకి ఆమె వరసకి అత్తమ్మే గదా కాబోతాది!!అక్కడే వుండాది అసలు పితలాటకం. సెంద్రబాబు సహా.. ఎన్టీవోడి పిలకాయిలంతా ఆమె మాటొస్తే సాలు అగ్గి మీద గుగ్గిలాల్లాగా ఎగిరెగిరి పడతా వుంటారు గదా. మరట్టంటాటిది.. ఆమె ఢిల్లీకి బొయ్యి భారతరత్న ఆమె చేతుల్తో అందుకుంటే యీల్లు తట్టుకుంటారా? అనేదే అసలు పెశ్న. అయినా సెక్రం దిప్పి.. ఎన్టీవోడికి భారతరత్న వొచ్చేలా చెయ్యడానికి సెంద్రబాబు పరపతి ఉపయోపడతాదో లేదో గానీ.. సెంట్రలు గవుర్మెంటోళ్లు పెద్దాయన మీద భక్తితో, ప్రేమతో యియ్యాలనుకున్నా గూడా.. సెంద్రబాబు సెక్రం అడ్డమేసి ఆపేయడం మాత్రం గ్యారంటీ అని అంతా అంటాండారు. కాబట్టి పైనలుగా అందరిలోనూ కొడతావుండే డౌటేందంటే.. అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?-రాజేశ్వరి.
మార్కెట్లో నకిలీ పోషక సప్లిమెంట్లు తయారీ
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
గుంటూరులో సంచలనం.. ఎస్ఐకి పదేళ్ల జైలు శిక్ష
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐ రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. ఎస్ఐ రవితేజ నగరంపాలెంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో, బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును గుంటూరు నాలుగో జిల్లా అదనపు న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో నిందితుడి చేసిన మోసం రుజువు కావడంతో అతడికి 10 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా, ఎస్ఐ రవితేజ ప్రస్తుతం అమృతలూరు పనిచేస్తున్నాడు. అయితే, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని.. బాధిత యువతికి న్యాయం జరిగిందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
చెలరేగిన గౌతమి నాయక్.. ఆర్సీబీ భారీ స్కోర్
హీరో స్ప్లెండర్ కొత్త ధరలు
మనశంకర వరప్రసాద్‌గారు.. ఆ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు నోటీసులు
ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్
ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్
సౌదీ కఠిన చట్టాలు.. వలస కార్మికుల బహిష్కరణ
'తను నా లక్కీ ఛార్మ్'.. పవిత్రా లోకేశ్‌పై నరేశ్ ప్రశంసలు..!
అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?
ఆస్ట్రేలియాకు భారీ షాక్
ఆ దేశంతో కలిసిపోతాం: మోల్డోవా
గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం.. ఇదీ అంతేగా సార్!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే సార్! మాటిమాటికీ హైదరాబాద్ పోవాల్సి వస్తోంది!!
ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు.. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
కాంగ్రేస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి
... ఆయనకు ఆ బహుమతి ఎందుకు చూపించారు మేడం!
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
మరో వారసురాలు వచ్చేస్తుంది
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు..: శర్వానంద్
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
చెలరేగిన గౌతమి నాయక్.. ఆర్సీబీ భారీ స్కోర్
హీరో స్ప్లెండర్ కొత్త ధరలు
మనశంకర వరప్రసాద్‌గారు.. ఆ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. హరీష్ రావుకు నోటీసులు
ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్
ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్
సౌదీ కఠిన చట్టాలు.. వలస కార్మికుల బహిష్కరణ
'తను నా లక్కీ ఛార్మ్'.. పవిత్రా లోకేశ్‌పై నరేశ్ ప్రశంసలు..!
అత్తమ్మ ఉండగా రత్నం వస్తుందా బాబుగోరూ..!?
ఆస్ట్రేలియాకు భారీ షాక్
ఆ దేశంతో కలిసిపోతాం: మోల్డోవా
గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం.. ఇదీ అంతేగా సార్!!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే సార్! మాటిమాటికీ హైదరాబాద్ పోవాల్సి వస్తోంది!!
ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు.. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
కాంగ్రేస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి
... ఆయనకు ఆ బహుమతి ఎందుకు చూపించారు మేడం!
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
మరో వారసురాలు వచ్చేస్తుంది
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు..: శర్వానంద్
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
పాకిస్తాన్లో పిండి సంక్షోభం.. రెండు పూటలా తిండికీ దరిద్రం!
ఈ రాశి వారికి భూ, గృహయోగాలు
ఫొటోలు
హీరోయిన్స్ నయనతార, త్రిషల స్నేహ బంధం... ఫోటోలు
రాతివనం.. అపురూపం
రెడ్ డ్రెస్ లో మెరిసిన ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (ఫొటోలు)
మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
జపాన్ లో పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్, రష్మిక (ఫొటోలు)
మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం (ఫొటోలు)
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
హీరోయిన్ హల్దీ వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
2016లో అనసూయ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
సినిమా
గోల్డెన్ ఛాన్స్ వదులుకున్న నాగార్జున?
మనది అని రాసుంటే ఎప్పటికైనా అది మన దగ్గరకే వస్తుంది. మనది కాకపోతే చేతుల వరకు వచ్చినా సరే దక్కకుండా చేజారిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.. ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఆ ఛాన్స్ నాగ్ అందుకుని ఉంటే ఎలా ఉండేదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్ టైంలో ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ కూడా కాదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. టికెట్ పెంపు లాంటివి అసలే లేవు. డిసెంబరు తొలివారంలో బిగ్ స్క్రీన్స్‌పైకి రాగా ఇప్పటికీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ప్రస్తుతానికైతే రూ.1300 కోట్ల మేర వసూలు చేసింది. ఇందులో హీరో పాత్ర కంటే రహమాన్ డకాయిత్ అనే విలన్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా.. టీజర్ రిలీజ్)రహమాన్ డకాయిత్‌గా అక్షయ్ ఖన్నా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే తొలుత ఈ పాత్ర కోసం నాగార్జునని అనుకున్నారట. స్క్రిప్ట్ కూడా నచ్చింది గానీ అదే సమయానికి కూలీ, కుబేర చిత్రాలతో నాగ్ బిజీగా ఉండటం వల్ల చేజేతులా ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ఆ పాత్రలో అక్షయ్ తప్ప మరొకరిని ఊహించుకోలేరు. అంతలా అదరగొట్టేశారు. అలాంటి పాత్ర నాగార్జున చేసుంటే ఎలా ఉండేదో మరి?రణ్వీర్ సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆదిత్య ధర్ దర్శకుడు. 1990ల్లో పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్, అక్కడికి వెళ్లిన ఓ భారత రహస్య ఏజెంట్.. తర్వాత ఏం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. జనవరి 30 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు 'ధురంధర్' సీక్వెల్.. ఈ మార్చి 19నే థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ హిందీ వరకే రిలీజ్ చేయగా.. సీక్వెల్ మాత్రం తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేయనున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)
ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.నవీన్ పొలిశెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026
అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను కూడా చంపేస్తారా?.. యాంకర్ రష్మీ గౌతమ్
టాలీవుడ్ యాంకర్ రష్మీ సైతం కుక్కల సంరక్షణపై మాట్లాడారు. ఇవాళ ప్రెస్‌క్లబ్‌లో ఆమె పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చుకున్నారు. మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు మిగిలిన ఆహారాన్ని బయట కుక్కలకు పెట్టేవారని తెలిపింది. ఆ సంప్రదాయాలన్నీ మేము మర్చిపోయామని వెల్లడించింది. ఒకప్పుడు ఆవు అనే మన కుటుంబంలో సభ్యురాలిగా ఉండేదని పేర్కొంది. ఇప్పుడు ఆవుపాలను కూడా కల్తీ చేశామని వాపోయింది.జున్ను పాలు అనేది ఆవు బిడ్డకే అందించాలి.. కానీ మనం మాత్రం జున్ను తింటున్నామని రష్మీ గౌతమ్ తెలిపింది. అది తిన్నా కూడా అరగదని వెల్లడించింది. ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో లెటర్స్ పంపడానికి పావురాలు పెంచుకున్నారు.. కానీ ఇప్పుడేమో అవసరం లేదని చంపేయండి అంటున్నారు. కుక్కలంటే ఒకప్పుడు డ్రైనేజీలో ఉండే ఎలుకలను తినేవి.. అప్పుడు ఎకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేదని తెలిపింది. డీ ఫారేస్టేషన్ వల్ల జింకలు కూడా రోడ్లమీదకు వస్తున్నాయని పేర్కొంది. పావురాలు , కుక్కలతో అవసరం లేదని వాటిని చంపుకుంటూ వెళ్తారా?.. అలాగే భవిష్యత్‌లో తల్లిదండ్రులు కూడా అడ్డంకిగా ఉన్నారని చంపేస్తారా? అంటూ రష్మీ ప్రశ్నించింది.ఇదంతా కేవలం కుక్కల గురించి మాత్రమే కాదని రష్మీ గౌతమ్ వెల్లడించింది. ఇదంతా సోషల్ కండీషనింగ్ అని తెలిపింది. మేము ఫారిన్ బ్రీడ్స్‌కు బానిసలా తయారయ్యామని యాంకర్ వివరించింది.
నాపై రూమర్స్ ఆపేయండి..నాకు ఆ ఉద్దేశమే లేదు: రేణు దేశాయ్
రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని వాపోయింది. తాను కుక్కల సంరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. కేవలం వాటి గురించే ఈ రోజు ప్రెస్మీట్లో మాట్లాడానని పేర్కొంది. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని రేణు దేశాయి వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ..'నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు. ముందు ఇలాంటి రూమర్స్‌ను ఆపేయండి. ప్రస్తుతం నేను చేస్తున్న సామాజిక సేవలో సంతృప్తిగా ఉన్నా. నాపై తప్పుడు థంబునెయిల్స్ రాస్తున్నారు. నేను ప్రెస్‌మీట్‌కు వచ్చేటప్పుడు చాలామంది గట్టిగా అరిచారు. నా పర్సనల్ లైఫ్‌పై ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ విడిచిపెట్టింది. ఇప్పుడు తనకు అర్థమైంది అంటూ నాపై ఎందుకు ఇలా ఏడుస్తున్నారని' ఆవేదన వ్యక్తం చేసింది.ఇంకా మాట్లాడుతూ..' నేను ఎవరి కోసం పోరాడుతున్నాను. నేను కుక్కల కోసం పోరాడటం లేదు. కేవలం మనుషుల ప్రాణాల కోసం పోరాడుతున్నా. అలాంటి నాపై నీచంగా కామెంట్స్ చేస్తున్నారు. నీ పిల్లలకు కుక్క కరిచి చనిపోతే మీకప్పుడు తెలుస్తుంది అంటున్నారు. నా బిడ్డ ప్రాణాలతో ఎందుకు ముడిపెడుతున్నారు. ఎవరి బిడ్డ ప్రాణాలైనా ఒక్కటే. అది చాలా తప్పు. మీకు ఎక్కడైనా కుక్కలతో సమస్య ఉంటే నా ఎన్జీవోకు లేదా జీహెచ్ఎంసీకి సమాచారం ఇవ్వండి. వచ్చి మేమే తీసుకెళ్లిపోతాం. అంతేకానీ నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు. నేను ఎలాంటి పాలిటిక్స్‌లోకి జాయిన్ అవ్వడం లేదు. నేను ప్రెస్ వాళ్ల మీద ఎక్కడా అరవలేదు. వంద కుక్కల్లో ఒక పది మెంటల్ కూడా ఉంటాయి. మనుషుల్లోనూ కొందరు మంచి వాళ్లు ఉంటారు. కొందరు చెడ్డవాళ్లు ఉంటారు. అవీ కూడా అంతే' అని రేణు దేశాయ్ వెల్లడించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
క్రీడలు
భారత్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 21 నుంచి 31 వరకు భారత్‌లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్‌షాహీ వారియర్స్ (నీషమ్ బీపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా, భారత్‌తో సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచకప్‌కు ముందు రిహార్సల్‌గా భావించబడుతోంది. ఈ సిరీస్‌కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులోనూ ఉంటారు. నీషమ్ కూడా న్యూజిలాండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీషమ్‌ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్‌కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్‌తో సిరీస్ అయినా, ప్రపంచకప్ అయినా నీషబ్ లేని లోటు న్యూజిలాండ్ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ 2025-26 ఎడిషన్‌లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్‌షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్‌షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చట్టోగ్రామ్ రాయల్స్‌తో (తొలి క్వాలిఫయర్) తలపడనుంది. ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం తప్పక ఉండేది.భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జేడన్ లెన్నాక్స్, మైఖేల్ రే
గౌతమ్ గంభీర్‌పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్‌ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సిరీస్‌కు ముందు వరకు గంభీర్‌ను టెస్ట్‌ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్ (న్యూజిలాండ్) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వాస్తవానికి గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్‌లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్‌కు భంగపాటే ఎదురైంది.అతడి పుణ్యమా అని భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే.గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్‌ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.గంభీర్ కోచ్‌గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. గంభీర్ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని టాక్. రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. సంజూ శాంసన్‌కు అన్యాయం చేసి గిల్‌ను టీ20ల్లోనూ ప్రమోట్ చేయాలని గంభీర్ ప్రణాళికలు రచించాడని సమాచారం.మహ్మద్ షమీ లాంటి సీనియర్‌ను అకారణంగా తప్పించి, హర్షిత్ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గంభీర్ రాజకీయాలకు బలైయ్యారనే టాక్ కూడా నడుస్తుంది. కోచ్‌గా తన పనితనంపై ఫోకస్ పెట్టకుండా గంభీర్ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్‌పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.గురువు ఎంతో శిష్యుడూ అంతే..!గంభీర్ ప్రమోట్ చేసిన శుభ్‌మన్ గిల్ సైతం భారత కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్ తొలిసారి న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. టెస్ట్‌ల్లోనూ గిల్ (కెప్టెన్‌గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్‌లో (ఇంగ్లండ్) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్ స్వీప్) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్ తన గురువు గంభీర్‌తో పోటీ పడుతున్నాడు.
టీమిండియా సిరీస్ ఓటమి.. ఆ ముగ్గురే విలన్లు
భారత క్రికెట్ జట్టుకు సొంతగడ్డపై మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుస షాకిలిస్తోంది. మొన్న టెస్టు సిరీస్.. నేడు వన్డే సిరీస్. స్వదేశంలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ అప్రతిష్టను మూటకట్టుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. విరాట్ కోహ్లి ఆఖరి వరకు పోరాడినప్పటికి.. మిగితా సీనియర్ ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్.. నోహిట్ సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఈ సిరీస్‌లో ముగబోయింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. త్వరగా ఔట్ కావడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ అన్నట్లుగా రోహిత్ మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.జడేజా అట్టర్ ప్లాప్రవీంద్ర జడేజా.. భారత జట్టు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ఘనత అతడిది. అటుంటి జడేజా ఈ సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బహుశా తన కెరీర్లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్‌లలో జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా అని బ్యాట్‌తో కూడా రాణించలేకపోయాడు. కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో ప్రధాన ఆల్‌రౌండర్‌గా జడేజా ప్రభావం చూపకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.శ్రేయస్ సైలెంట్..ఇక మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులతో రాణించిన అయ్యర్.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడో వన్డేలో అయ్యర్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్లో నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్‌కు పనిచెప్పకపోవడం భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.బౌలింగ్ ఫెయిల్ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది. భారత పేసర్లు తేలిపోయారు. హర్షిత్ రాణా, సిరాజ్ ఫర్వాలేదన్పించినప్పటికి.. ప్రసిద్ద్ కృష్ణ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తొలి వన్డేలో భారత బౌలర్లు ఏకంగా 300 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!
సంపాదనలేని భర్త వద్దు.. భార్యే నా ATM?.. అసలేం జరిగింది?
ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ, డాక్యుమెంట్లు పోయాయి.. ఇంతలో అతడు వచ్చాడు.. ఆమెకు సాయం చేశాడు.. ఇద్దరి మాటలు కలిశాయి.. మనసులు కలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఐదేళ్ల స్నేహం తర్వాత 2005లో ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.వారి దాంపత్యానికి గుర్తుగా 2007లో కవల కుమారులు జన్మించారు. 2013లో మరో కుమారుడు.. 2018లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. వారిద్దరు వారికి నలుగురు.. చక్కటి సంసారం. ఆమె భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్. అతడు కరుంగ్ ఓన్‌కోలర్.. ఫుట్‌బాల్ ఆటగాడు. న్యాయవాది కూడా!బాక్సర్‌గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టానంటాడు కరుంగ్. మేరీ సైతం గతంలో భర్త ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని చెప్పింది. అయితే, విధికి కన్నుకుట్టిందో ఏమో.. 2013 నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది.వివాహేతర సంబంధం మచ్చకోమ్ చట్టాల ప్రకారం తాము విడిపోయినట్లు మేరీ కోమ్ గతేడాది ఓ ప్రకటన విడుదల చేసింది. ఓన్కోలర్తో విడిపోయినట్లు తన న్యాయవాది ద్వారా ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మేరీ కోమ్ వ్యక్తిత్వంపై వివాహేతర సంబంధం మచ్చ పడింది.అయితే, ఈ విషయం గురించి ఓన్‌కోలర్ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తన గురించి మేరీ లోక్ అదాలత్‌లో మోసగాడు అని ముద్ర వేసిన తర్వాతే తాను అసలు విషయం చెప్పాల్సివస్తోందంటూ అతడు సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల మాట్లాడుతూ.. 2013లో ఓ జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు వివాహేతర సంబంధం ఉండేదని అతడు ఆరోపించాడు.సాక్ష్యంగా మెసేజ్లుఆ తర్వాత రాజీ పడినా.. 2017లో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని ఓన్‌కోలర్ ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరి సంబంధానికి సాక్ష్యంగా తన వద్ద వాట్సాప్ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపాడు. ఆమెను తాను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని మేరీ కోమ్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా అతడు ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.మేరీ కోమ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని.. అయితే, తనపై అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. ఆధారాలు ఉంటేనే తన గురించి మాట్లాడాలని మేరీ కోమ్కు హితవు పలికాడు. కాగా 2022లో తాను గాయపడినపుడు ఓన్‌కోలర్ నిజ స్వరూపం బయటపడిందని మేరీ కోమ్ ఇటీవల తెలిపింది. తాను పోటీలలో పాల్గొని సంపాదించినంత వరకు అంతా సజావుగా సాగిందని.. ఎప్పుడైతే తాను గాయపడ్డానో అప్పటి నుంచి తానొక భ్రమలో బతుకుతున్న విషయం స్పష్టంగా తెలిసిందని వాపోయింది.సంపాదన లేకుండా నాపై ఆధారపడిఅప్పుడే తనకు నిజం తెలిసిందని.. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మేరీ కోమ్ తెలిపింది. అంతేకాదు.. తన దగ్గర కోట్ల రూపాయలు కాజేసి.. భూమి కొనుకున్నాడని.. మణిపూర్‌లోని తన ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడని ఆరోపించింది. తాను ఇలా మాట్లాడినందుకు కొంతమంది తనను దురాశ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారని.. తనకు ఏడ్చే వెసలుబాటు కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.తాను కష్టపడి బాక్సింగ్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తే.. అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా తనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్ మాజీ భర్తపై మండిపడింది. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను ఖాళీ చేశాడని ఆరోపించింది. ఇందుకు ఓన్‌కోలర్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.పిల్లలకు తల్లినయ్యానుపెళ్లికి ముందు తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉండేవాడినని.. అయితే, మేరీ కోమ్ కోసం తాను తన కెరీర్‌నే వదులుకున్నానని పేర్కొన్నాడు. ఆమె బాక్సింగ్‌తో బిజీగా ఉంటే.. తానే పిల్లల్ని పెంచి పెద్ద చేశానని.. ఇంటి బాధ్యతలు చూసుకున్నానని చెప్పుకొచ్చాడు.పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ తానే చేసేవాడినని.. తల్లిలా వారిని పెంచానని గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనను కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. మేరీ కోమ్, పిల్లల మీద ప్రేమతో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు డబ్బు, పేరు అక్కర్లేదని పేర్కొన్నాడు.సంపాదనలేని భర్త వద్దా? భార్యే నా ATM?మేరీ కోమ్- ఓన్‌కోలర్ వివాదంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు అతడికి సపోర్టు చేస్తున్నారు. భార్యను ప్రోత్సహించిన భర్తకు సంపాదన లేదన్న కారణం చూపి అవమానించడం సరికాదని కొందరు అంటుంటే.. భార్యను ATMలా వాడుకునేవాళ్లు చాలా మందే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.ఏదేమైనా మేరీ కోమ్ వంటి దిగ్గజ బాక్సర్ రింగ్‌లో సత్తా చాటినా.. కారణం ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవడం బాధాకరమని ఇంకొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని.. పద్దెమినిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు ఇలా రచ్చకెక్కడం ఏమీ బాగాలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్‌కు పండుగ
ఆంధ్రప్రదేశ్‌లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు... వచ్చే నెల నుంచి పెంపు అమలు చేసేందుకు సన్నాహాలు... ఆదాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పండుగ లేనట్లే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామా. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చంద్రబాబు చిర్రుబుర్రు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా భారీగా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య... ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన చేరికలు
ఆంధ్రప్రదేశ్‌లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం...
బిజినెస్
సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి.
డిజిటల్ భారత్ ముంగిట కొత్త విప్లవం
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కేవలం అగ్రరాజ్యాల నమూనాలను అనుకరించకుండా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’(SLM) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ స్వదేశీ ఏఐ నమూనాల పట్ల కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.ఎల్ఎల్ఎం Vs ఎస్ఎల్ఎం.. భారత్‌కు ఏది ముఖ్యం?గత కొన్ని ఏళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ పారామీటర్లతో కూడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను అభివృద్ధి చేశాయి. ఇవి శక్తివంతమైనవి అయినప్పటికీ వీటి నిర్వహణకు భారీ ఖర్చు, అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి పౌరుడికి ఏఐ సేవలు అందాలంటే ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (SLMs)’ సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు.ఇవి అతి తక్కువ కంప్యూటింగ్ శక్తితో పని చేస్తాయి. ప్రాంతీయ భాషలు, మాండలికాలపై ప్రత్యేక శిక్షణ పొందుతాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ప్రత్యేకంగా వీటిని రూపొందించవచ్చు.భాషా వైవిధ్యానికి ఏఐ అండదేశంలో వందల సంఖ్యలో భాషలు, మాండలికాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ మోడల్స్ స్థానికంగా ఉన్న అన్ని భాషల్లో ప్రావీణ్యం సాధించాలంటే కష్టం. ఈ లోటును పూడ్చడానికి ‘సర్వం 1’ (Sarvam 1) వంటి మోడల్స్ ఇప్పటికే పునాది వేశాయి. ఇది 10 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే 2 బిలియన్ పారామీటర్ మోడల్. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ జెన్’ (BharatGen) వంటి కార్యక్రమాలు స్వదేశీ ఏఐ అభివృద్ధిలో వేగం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థాయుల్లోని వారి అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాలను నిర్మించడం కీలకం.బడ్జెట్ 2026లో ఆశించేవి..2026 బడ్జెట్లో ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) విస్తరణకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.1. క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా స్టార్టప్‌లకు, చిన్న సంస్థలకు ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం.2. వ్యవసాయం, గ్రామీణ పాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రాంతీయ లాంగ్వేజ్ డేటా సేకరణకు ప్రత్యేక నిధులు.3. ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడానికి విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు.దేశంలో 85.5 శాతం కుటుంబాల వద్ద స్మార్ట్ఫోన్లు, 86.3 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తరుణంలో స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ విప్లవం ఉత్పాదకతను పెంచడమే కాకుండా సామాన్యుడికి డిజిటల్ సేవలను చేరువ చేస్తుంది. స్వదేశీ ఏఐ ద్వారా భారతదేశం గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా ఎదగడమే కాకుండా, తన సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని సాంకేతికతతో అనుసంధానించనుంది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు
అమెరికా ఓవల్ ఆఫీస్‌లో రెండోసారి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్.. గడిచిన 365 రోజుల్లో తన ‘ట్రంపరితనాన్ని’ చూపిస్తూనే ఉన్నారు. అమెరికా ఫస్ట్ అనే మంత్రాన్ని జపిస్తూ శరవేగంగా వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చైనాతో టారిఫ్‌ల యుద్ధం, అక్రమ వలసలపై ఉక్కుపాదం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి డోజ్(DOGE) ద్వారా ప్రభుత్వ ప్రక్షాళన.. ఇలా ప్రతి అడుగులోనూ ట్రంప్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.ఈ ఏడాది పొడవునా సాగిన ఈ సంచలన నిర్ణయాల తుపాను ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ముద్ర వేసింది? జీడీపీ లెక్కలు, ఏఐ బూమ్ వెనుక దాగిన మార్కెట్ వాల్యుయేషన్లు ట్రంప్‌నకు విజయ కేతనం పడుతున్నాయా లేక 2026లో రాబోయే భారీ ఆర్థిక పరీక్షకు సంకేతాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై విశ్లేషణ..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి రేపటితో ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం కాలంలో సుంకాలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ(DOGE), కృత్రిమ మేధ (ఏఐ)లో భారీ పెట్టుబడుల వంటి నిర్ణయాలతో వైట్‌హౌస్ నిరంతరం వార్తల్లో నిలిచింది. రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్న ఈ ఏడాది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలను అందించింది.ఆరంభంలో సంకోచం.. ఆపై..ట్రంప్ పాలన 2025 ప్రారంభంలో కొంత ఒడిదుడుకులతో సాగింది. 2025 మొదటి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 0.6 శాతం క్షీణించింది. 2022 తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇలా వెనకబడటం ఇదే తొలిసారి. అయితే, ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. రెండో త్రైమాసికంలో 3.8 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదై ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కింది. వినియోగదారుల ఖర్చు పెరగడం, ఎగుమతులు పుంజుకోవడం, దిగుమతుల్లో తగ్గుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సవాలుద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. పీసీఈ (PCE) ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 2.8 శాతంగా ఉండగా, డిసెంబర్ నాటికి 2.7 శాతానికి తగ్గింది. సుంకాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అటువంటి నాటకీయ మార్పులు కనిపించలేదు. కానీ, ఉద్యోగ మార్కెట్ ఆందోళన కలిగిస్తోంది. యూఎస్‌లో నిరుద్యోగ రేటు 2025 నవంబర్‌లో 4.5 శాతానికి చేరింది. 2025లో నెలకు సగటున కేవలం 49 వేల ఉద్యోగాలు మాత్రమే జోడయ్యాయి. ఇది గడిచిన ఏడేళ్ల సగటు (1.41 లక్షలు) కంటే చాలా తక్కువ. బిగ్ టెక్ సంస్థల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ దీనికి ప్రధాన కారణం.అమెరికా కంటే ప్రపంచమే ముందంజట్రంప్ 2.0 తొలి ఏడాదిలో అమెరికా మార్కెట్లు లాభాలను పంచాయి. గడిచిన ఏడాదిలో..ఎస్ అండ్ పీ 500: +16%నాస్డాక్: +20%డౌ జోన్స్: +14%ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్ల జోరు తక్కువగానే ఉంది. జపాన్ నిక్కీ (40%), కొరియా కోస్పి (92%), హాంగ్ సెంగ్ (37%) వంటి అంతర్జాతీయ సూచీలు అమెరికాను మించిపోయాయి. డాలర్ ఇండెక్స్ 9.3 శాతం పడిపోవడం, బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం ఈ ఏడాది విశేషం.ఏఐ బూమ్ట్రంప్ హయాంలో ఏఐ రంగానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా ‘స్టార్గేట్’ వంటి 500 బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టులు టెక్ రంగాన్ని ఉత్సాహపరిచాయి. ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి ‘మాగ్-7’ స్టాక్స్ మార్కెట్ విలువలో 20 శాతం వృద్ధి సాధించాయి. ప్రస్తుతం ఎస్ అండ్ పీ 500లో 42 శాతం వాటా కేవలం ఏఐ అనుబంధ కంపెనీలదే ఉండటం గమనార్హం.అసలైన పరీక్ష ముందే?ప్రస్తుతం అమెరికా మార్కెట్లు 28 రెట్ల పీఈ(ప్రైస్ టు ఎర్నింగ్ - ఉదాహరణకు.. కంపెనీ రేషియో 20 ఉంటే ఆ కంపెనీ సంపాదించే 1 రూపాయి లాభం కోసం 20 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం) వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 2000 నాటి డాట్‌కామ్ బబుల్ స్థాయిని గుర్తుచేస్తోంది. 2026లో వడ్డీ రేట్ల నిర్ణయాలు, ఫెడ్ రిజర్వ్ వైఖరి, సుంకాల దీర్ఘకాలిక ప్రభావం అమెరికా ఆర్థిక స్థితిని నిర్ణయించనున్నాయి. రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్లపై ట్రంప్ గర్వపడుతున్నా పెరుగుతున్న రుణాలు, మార్కెట్ వాల్యుయేషన్ల మధ్య ఈ ఏఐ బూమ్ ఎంతకాలం నిలుస్తుందనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ
కథాకళి: టైమ్ ట్రావెల్
జయవర్మకి చిన్నప్పుడు చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడని తండ్రి చెప్పడం గుర్తుంది. ఏడేళ్ళ వయసులోనే అతను రాత్రుళ్ళు చంద్రుడి మీదకి దిగిన మనిషి కోసం డాబా మీంచి చంద్రుడిని చూసేవాడు. తండ్రి అమెరికన్స్ ఎంబసీకి ఉత్తరం రాసి తెప్పించిన ముగ్గురు ఆస్ట్రొనాట్స్ ఉన్న కలర్ ఫొటోని ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలించాడు. అతనిలో స్వతహాగా గల శాస్త్ర జిజ్ఞాసని ఆ ఫొటో బాగా ప్రభావితం చేసింది.అతని ఆసక్తిని గమనించిన జయవర్మ తండ్రి నండూరి రామ్మోహన్రావు రాసిన విశ్వ దర్శనం పుస్తకాన్ని కొనిచ్చాడు. పెద్దయ్యే కొద్దీ జయవర్మ చాలా సైన్స్ పుస్తకాలని చదివాడు. అతను హెచ్.జి.వెల్స్ 1895లో రాసిన ‘టైమ్ మెషీన్స్ ’ నవలని చదివాక టైమ్ ట్రావెల్ మీద ఆసక్తి కలిగింది. అంతకు మునుపు 1843లో చార్లెస్ డికెన్స్ రాసిన క్రిస్టమస్ కేరల్లో కూడా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళి తిరిగి రావడాన్ని చదివాడు. మరికొన్ని టైమ్ ట్రావెల్ పుస్తకాలని చదివాక అతను ఎలాగైనా దాన్ని సాధించాలని సంకల్పించాడు. వీసా ఇంటర్వ్యూలో టైమ్ ట్రావెల్ మీద జయవర్మ అభిప్రాయాలని విన్న అమెరికన్స్ కాన్సులేట్ ఆఫీసర్ అతను అమెరికాకి అవసరం అనుకుని, స్టూడెంట్ వీసాని మంజూరు చేసి నవ్వుతూ చెప్పాడు. ‘‘వెల్కం. 1967లో షికాగోకి వెళ్తే, మార్సెలో ఫెలినీని కలిస్తే వాళ్ళబ్బాయి హలో చెప్పాడని చెప్పు.’’ ‘‘కచ్చితంగా వెళ్తాను సర్. 1967ని, మార్సెలో ఫెలినీని గుర్తుంచుకుంటాను.’’ జయవర్మ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జయవర్మ కేలిఫోర్నియాలోని స్టా¯Œ ఫోర్డ్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్‌తో టైమ్ ట్రావెల్ గురించి తరచూ చర్చిస్తూండటంతో దాని మీద అంతదాకా జరిగిన రీసెర్చ్‌ని ఆయన జయవర్మకి ఇచ్చాడు. యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాల్లో దానిమీద ఎన్నో డయాగ్రమ్స్‌ని చూసి, థియరీలని చదివాక జయవర్మకి ఓ దారి దొరికింది. చివరకి అతను లేబరేటరీలో ఓ టైమ్ ట్రావెల్ మెషీన్స్ ని రూపొందించాడు. షికాగో నగరంలోకి, 1967కి వెళ్ళాడు. తను చూసిన ఆధునిక షికాగోలా లేదది. ప్రొహిబిషన్స్ సమయంలో ప్రసిద్ధ అమెరికన్స్ నేరస్తుడు అల్ కపోన్స్ తో సంబంధం గల ది గ్రీన్స్ మిల్ బార్కి చేరుకున్నాడు. లైవ్ జాజ్ మ్యూజిక్ జరుగుతోంది. జయవర్మని స్టీవార్డ్ మర్యాదగా ఆహ్వానించి అడిగాడు. ‘‘శుక్రవారం రాత్రి కాబట్టి బాగా బిజీగా ఉంది. దయచేసి ఇంకొకరితో టేబుల్ షేర్ చేస్తారా?’’ ‘‘అలాగే.’’ అతను జయవర్మని రెండు కుర్చీలున్న బల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఖాళీ కుర్చీని చూపించి, ఇంకో కుర్చీలోని అరవై పైబడ్డ వ్యక్తిని పరిచయం చేశాడు.‘‘ఇతను మిస్టర్ డేవ్.’’ జయవర్మ తన పేరు చెప్పి, బడ్వైజర్ బీర్ ఆర్డర్ చేశాడు. ‘‘మిమ్మల్ని ఈ బార్లో ఎన్నడూ చూడలేదు? ఊరికి కొత్తా?’’ విస్కీ తాగే డేవ్ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎక్కణ్ణుంచి వచ్చారు?’’ ‘‘స్టాన్స్ ఫోర్డ్, కాలిఫోర్నియా.’’ ‘‘ఓ. ఐతే మీరు మేధావి అన్నమాట?’’ బాగా తాగి ఉన్న ఆ బ్లూ కాలర్ ఉద్యోగి నవ్వుతూ అడిగాడు. ‘‘రీసెర్చ్ స్కాలర్ని.’’ జయవర్మ చెప్పాడు. ‘‘దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు?’’ ‘‘టైమ్ ట్రావెల్.’’‘‘అది ఎన్నటికీ మనిషికి సాధ్యం కాదు. సమయం అనేది ఓ ఆలోచన మాత్రమే. అది అసలు లేనేలేదని నా అభిప్రాయం.’’ ‘‘ఉంది. నేను 2016 నించి 1967కి వచ్చాను.’’ జయవర్మ చెప్పాడు.‘‘నేను దాన్ని నమ్మేంత ఇంకా తాగలేదు.’’ డేవ్ చెప్పాడు.‘‘నెల, తారీకు, సంవత్సరం చూడండి.’’ జయవర్మ తన డ్రైవింగ్ లైసెన్స్‌ని మౌనంగా ఆయనకి ఇచ్చి చెప్పాడు. దాన్ని చూడగానే ఆయన మొహం ఎర్రబడింది. ‘‘నీ పథకం ఏమిటి? నా నుంచి డబ్బు గుంజే స్కామ్ ఇది. అవునా?’’ కోపంగా అడిగాడు. ‘‘లేదు. ఇది నిజం. ఇది నా మొబైల్ ఫోన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. దీనికి వైర్లు ఉండవు. సాటిలైట్‌తో పనిచేస్తుంది. ఇంట్లోనే టీ.వీ.లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకు టీ.వీ. ప్రసారం చేయక్కర్లేదు...’’ ‘‘ఆపు. ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను.’’ తాగి ఉన్న డేవ్ అరిచాడు. ‘‘నిజం. ఓ నల్లజాతి వ్యక్తి మన ప్రెసిడెంట్.’’ జాతి విద్వేషం గల ఆయన వెంటనే బల్ల మీది మటన్ చాప్స్ కోసుకునే కత్తిని తీశాడు. బలాఢ్యుడైన జయవర్మ తనని పొడవబోయిన ఆయన చేతిని పట్టుకుని ఆపాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి ఆయన ఛాతీలో ఊపిరితిత్తుల్లో బలంగా దిగింది.‘‘ మై గాడ్. హత్య. పట్టుకోండి.’’ అరుపులు వినిపించాయి. ఓ మెరుపు మెరిసింది. వెంటనే జయవర్మ తనవైపు వచ్చేవారి వంక కత్తిని ఝుళిపిస్తూ తప్పించుకుని బయటపడ్డాడు. సరాసరి సమీపంలోని పార్క్‌లో ఆపిన తన వాహనం వైపు పరిగెత్తాడు. విరక్తితో అతను మళ్ళీ టైమ్ ట్రావెల్ చేయలేదు. 2025. జయవర్మ తనని అనుసరించే ముప్ఫై ఏళ్ళ యువకుడిని గమనించి అడిగాడు. ‘‘ఎందుకు నా వెంట పడ్డావు?’’ ‘‘ఇందుకు.’’ అతను వెంటనే బొడ్డులోంచి కత్తిని తీసి జయవర్మ ఊపిరితిత్తుల్లో దిగేలా క్రోధంగా పొడిచాడు. ‘‘ఎందుకు? ఎందుకు?’’ జయవర్మ బాధగా అడిగాడు. ‘‘నీ మొహం నాకు బాగా గుర్తు. 1967లో మా తాతని షికాగోలో గ్రీన్స్ మిల్ బార్లో పొడిచినప్పుడు అక్కడ ఒకరు తీసిన నీ ఫొటో మా ఇంట్లో వేలాడుతోంది.’’ అతను చెప్పాడు.
రామేశ్వర లింగ ప్రతిష్ఠాపన
రావణ వధానంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేనోళ్ల స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, ‘మునులారా! పులస్త్యబ్రహ్మ కుమారుడైన రావణుడు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే! యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే, ఏం చేయాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి’ అని అడిగాడు.‘పరమాత్మా! నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించటానికి అడిగావు. అయినా, పరిహారం చెబుతున్నాం విను! ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్ఠాపన చెయ్యి. శివలింగ ప్రతిష్ఠాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్టి కూడా స్తుతించలేడంటే, మా బోటివారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుడిని సందర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే, నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి వెయ్యిరెట్లు పుణ్యం వస్తుంది’ అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు.‘మరందుకు ముహూర్తాన్ని మీరే నిర్ణయించండి’ అన్నాడు రాముడు.‘మరో నాలుగు ఘడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది’ చెప్పారు మునులు.రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, ‘హనుమా! కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో నాలుగు ఘడియల్లోగా ఇక్కడకు తీసుకురావాలి. తేగలవా?’ అని అడిగాడు.‘స్వామీ! నువ్వు ఆజ్ఞాపించాలే గాని, అదెంత పని?’ అని అంటూ మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి, నింగిపైకి ఎగిశాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకెగిరే సరికి, నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు. హనుమంతుడి వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు, అతడు ఏకంగా కైలాస పర్వతాన్నే పెకలించుకుని వస్తాడేమోనని కలత చెందారు.హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరఘడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెదికాడు. ఎక్కడా శివలింగం అతడికి కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనే సరికే గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి, ఒంటికాలిపై నిలబడి, నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపునిలిపి, చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు.హనుమంతుడి దీక్షాదక్షతకు సంతోషించిన శివుడు కొద్దిసేపటికే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు.‘నాయనా! ఏం కావాలో కోరుకో! అని అడిగాడు.‘పరమేశ్వరా! శ్రీరాముడు నీ అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరిపోక ముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు. తీసుకుపోయి, శ్రీరాముడికి అందిస్తాను’ అన్నాడు.శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి, అంతర్ధానమయ్యాడు.హనుమంతుడు వెనువెంటనే ఆ లింగాన్ని తీసుకుని, ఆకాశ మార్గాన దక్షిణ సముద్రతీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈలోగా వేళ మించిపోతూ ఉండటంతో, మునులందరూ ‘రామా! ముహూర్తం సమీపించింది. హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది. వేళ మించిపోకుండానే సైకత లింగాన్ని ప్రతిష్ఠించు’ అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్రంలో స్నానాలు ఆచరించి, సైకత లింగ ప్రతిష్ఠాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతుండగా, రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్ఠాపన జరుపుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడకు చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమం కనిపించింది. ‘స్వామి శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి, ఇక్కడ అన్యలింగ ప్రతిష్ఠాపన చేయడమేమిటి’ అనుకుంటూ లోలోపల కలత చెందాడు. రాముడికి సమీపంలోనే నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్నవారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. ‘స్వామీ! నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మవ్యర్థం’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుని పలికాడు.రాముడు అతడిని అనునయించాడు. ‘హనుమా! నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైతబుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతోందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను. అంతమాత్రానికే శోకించడం తగునా! నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మరాక్షసులను సంహరించావు కదా! శివుడు అనుగ్రహించిన అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు’ అని పలికాడు.హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించాడు.∙సాంఖ్యాయన
బయట ఆడకపోతే... నాలుగు నష్టాలు
ఒకప్పుడు బాల్యం ఇంట్లో కంటే, ఇంటి బయటే ఎక్కువ ఉండేది. పరుగులాట, కోతికొమ్మచ్చి, బిళ్లంగోడు, గాలిపటాలు, దొంగాట... ఇలా పిల్లలు ఇంటి బయటే ఎక్కువగా ఉండేవారు. చెమటలు కారుతున్నా ఆటలు ఆపకపోవడం, అమ్మ పిలుస్తున్నా పట్టించుకోకపోవడం, ఆకలయ్యేంత వరకు ఇల్లు గుర్తురాకపోవడం, ఒక్కోసారి ఆకలి కూడా మరచిపోయి ఆడుకోవడం... ఇవన్నీ సర్వసాధారణం. ఆ బాల్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈరోజు పిల్లల బాల్యం ఒక చిన్న స్క్రీన్‌లో మొదలై, అదే స్క్రీన్‌లో ముగుస్తోంది. ఇది అభివృద్ధి కాదు, ఒక తరం మౌనంగా కోల్పోతున్న జీవితం.ఇప్పటికీ ఆలస్యం కాలేదు. గేటు తెరవండి. ఫోన్ పక్కన పెట్టండి. పిల్లల బాల్యాన్ని మళ్లీ బయటకు తీసుకురండి. బాల్యం ఎందుకు బయటే ఎదగాలి?పిల్లల మెదడు పుస్తకాలతో కాదు, అనుభవాలతో ఎదుగుతుంది. ఆ అనుభవాలు ఎక్కువగా బయట ప్రపంచం నుంచే వస్తాయి. బయట ఆడే ఆటల్లో పిల్లలు కేవలం శరీరాన్ని కాదు, మెదడును కూడా ఉపయోగిస్తారు.ఎక్కడ పరుగెత్తాలి? ఎక్కడ ఆగాలి? ఎవరితో కలిసి ఆడాలి? ఎవరితో తగువుపడాలి? ఎప్పుడు ఒప్పుకోవాలి? ఎప్పుడు ఎదురు నిలవాలి?... ఇవన్నీ ప్లానింగ్, నిర్ణయాలు, స్వీయ నియంత్రణకు మూలాలు. వీటినే సైకాలజీలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్’ ప్రకారం, పిల్లలు బయట ఆడే ఆటలు మెదడులో న్యూరల్ కనెక్షన్లను సహజంగా బలపరుస్తాయి. కాని ఇప్పుడా అనుభవాలన్నీ స్క్రీన్కు అతుక్కుపోయియి. స్క్రీన్ ఎందుకు ప్రమాదకరం?స్మార్ట్‌ఫోన్ సమస్య అది చూపే కంటెంట్ కాదు, అది పనిచేసే విధానం. స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ల ఉద్దేశం ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉంచడమే, పిల్లలకు ఉపయోగపడాలని కాదు. ఈ యాప్‌లు డోపమైన్ రసాయనాన్ని చిన్న చిన్న మోతాదుల్లో విడుదల చేస్తూ, పిల్లల మెదడును నిరంతర ఉత్సాహంలో ఉంచుతాయి.బయట ఆటల్లో ఆనందం రావాలంటే శ్రమ అవసరం. స్క్రీన్‌లో ఆనందం రావాలంటే ఒక టచ్ చాలు. మెదడు ఈ తేడాను త్వరగా నేర్చుకుంటుంది. దీనివల్ల పిల్లలు తక్షణ ఆనందానికి అలవాటుపడతారు. ఓర్పు తగ్గిపోతుంది. బోర్డమ్ను భరించలేని మనస్తత్వం, అసహనం, చిరాకు పెరుగుతాయి. బోర్ కూడా అవసరం.. ‘మా పిల్లాడు త్వరగా బోర్ అవుతున్నాడు సర్. అందుకే ఫోన్ ఇస్తుంటాం’ అని చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు. వాస్తవానికి బోర్ అవ్వడం పిల్లలకు ఒక అవసరం. బోర్ అవ్వడం అంటే ఖాళీగా ఉండడం కాదు. అది మెదడుకు ఒక విరామం. ఆ విరామంలోనే ఊహాశక్తి పుడుతుంది, కొత్త ఆటలు పుట్టుకొస్తాయి, సృజనాత్మకత మేల్కొంటుంది. స్మార్ట్‌ఫోన్ పిల్లల జీవితంలో బోర్డమ్ను పూర్తిగా తొలగించింది.ప్రతి నిమిషం ఏదో ఒకటి చూపిస్తూ, పిల్లల మెదడును వినోదానికి బానిసగా మార్చేసింది. పరిష్కారాలు... → రోజుకు కనీసం గంట బయట ఆట తప్పనిసరి చేయండి. చలిగా ఉందని, ఎండగా ఉందని సాకులు చెప్పొద్దు. ఆటకు వాతావరణ అడ్డుకాకూడదు. → స్క్రీన్‌ను హక్కుగా కాదు, రివార్డుగా మార్చాలి → డైనింగ్ టేబుల్, స్టడీ టేబుల్, పడకగదిలో ఫోన్ అనుమతించకూడదు → పిల్లలతో కలిసి బయటకి వెళ్లండి. ఆడకపోయినా, అక్కడ ఉండండి → పిల్లలు బోర్ అయితే వెంటనే స్క్రీన్ ఇవ్వకండి. ఆ బోర్లోనే ఎదుగుదల ఉంటుందిబయట ఆటలు లేకపోతే... పిల్లలు బయట ఆటలు ఆడకపోతే నాలుగు ముఖ్యమైన సామర్థ్యాలు కోల్పోతారు. → రిస్క్ అంచనా వేసే సామర్థ్యం: ఎక్కితే పడిపోతామో లేదో తెలుసుకోవడం → సోషల్ నెగోషియేషన్: ఆటలో గొడవలు, ఒప్పందాలు, రాజీలు → శరీర అవగాహన: బ్యాలెన్స్, కోఆర్డినేషన్, స్థల జ్ఞానం → నిజమైన విజయ భావన: కష్టపడి సాధించిన ఆనందం ఈ నాలుగు అంశాలను ఏ స్క్రీన్ ఇవ్వలేదు.భయపెట్టే గణాంకాలుప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకుస్క్రీన్ పూర్తిగా నిషిద్ధం. ఐదేళ్ల పిల్లలకు రోజుకు గంట కంటే ఎక్కువ స్క్రీన్ ఉండకూడదు. కాని, మనదేశంలో 3–6 ఏళ్ల పిల్లలు సగటునరోజుకు 3–5 గంటలుస్క్రీన్ చూస్తున్నారు. నగరాల్లో 60 శాతానికి పైగా పిల్లలు రోజుకు 30 నిమిషాలు కూడా బయట ఆడటంలేదు. 1990లతో పోలిస్తే పిల్లల ఔట్‌డోర్ ఆటల సమయం 70 శాతం తగ్గింది.
ఆహార్యమే ఆధారమై!
నేరస్థలంలో దొరికే ఆధారాలు నిందితులను పట్టించడానికే కాదు, ఒక్కోసారి అమాయకులను రక్షించడానికీ ఉపయోగపడతాయి. నగరంలో నమోదైన హైప్రొఫైల్ కేసులో ఒకటి రికార్డుల్లో నిలిచిపోయే జగదాంబ జ్యూలర్స్ యజమాని ప్రహ్లాద్ అగర్వాల్ భార్య పుష్పాబాయి హత్యకేసు దర్యాప్తులో తొలుత అనుమానితుల జాబితా భారీగా ఉంది. అనేకమందిని విచారించారు. ఎట్టకేలకు సంఘటనా స్థలంలో నిందితుడు వదిలి వెళ్లిన దుస్తులు, జేబులో లభించిన వస్తువుల ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది.బషీర్‌బాగ్‌లో జగదాంబ జ్యూలర్స్ నిర్వహించే ప్రహ్లాద్ అగర్వాల్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.14లో నివసించేవారు. వీరిది ఉమ్మడి కుటుంబం. అగర్వాల్ భార్య పుష్పాబాయితో పాటు ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనుమలు ఒకే ఇంట్లో ఉండేవారు. అగర్వాల్, ఆయన కుమారులు 2005 అక్టోబర్ 5 ఎప్పటిలాగే వారి బంగారం దుకాణానికి వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడలు రాధిక నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్ వారందరూ హడావుడిగా ఇంటికి పరిగెత్తేలా చేసింది. అప్పటికే ఆ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు డాక్టర్లును పిలిపించారు. వాళ్లు వచ్చి రక్తపు మడుగులో ఉన్న పుష్పాబాయిని నిశితంగా పరీక్షించి, చనిపోయినట్లు నిర్ధారించారు. దీన్ని హత్యగా తేల్చారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా హత్యాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో లభించిన ఓ చొక్కా గుండీ, ప్యాంటు–షర్టు, ఆడవారి చెప్పులు, కుర్తా–పైజామాలతో పాటు హతురాలు పుష్పాబాయి చేతిలో ఉన్న పొడువాటి వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ పాదముద్రనూ గుర్తించి, దాన్ని కెమెరాలో బంధించారు. ఇంటి చుట్టూ క్షుణ్ణంగా పరిశీలించగా, హత్య జరిగిన గది నుంచి వంటింటి మీదుగా బయట వరకు పడిన రక్తపు మరకలు కనిపించాయి. వీటి నమూనాలు సేకరించి, సాంకేతికంగా పరిశీలించిన దర్యాప్తు అధికారులు– అవి హతురాలివి కావని, హంతకుడికి అయిన గాయం నుంచి కారినవని నిర్ధారించారు. తన భార్య ప్రతిరోజూ ధరించే రెండు బంగారు గాజులు కనిపించట్లేదంటూ ప్రహ్లాద్ పోలీసులకు తెలిపారు. ఎక్కువ సొత్తు చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దోపిడీ దొంగల పని కాదని భావించారు. కేవలం పరిచయస్తుల పనిగా అనుమానించి, ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన అధికారులు తొలుత ఒక అనుమానితుల జాబితా రూపొందించి, కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరి పూర్వాపరాలు తెలుసుకుని ఒక్కోక్కరికీ క్లీన్చిట్ ఇస్తూ పోయారు. ఇదిలా ఉండగా, హతురాలి చేతిలో లభించిన వెంట్రుకలను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు కొందరి అనుమానితుల నుంచి సేకరించిన వాటితో పోల్చారు. అవి ఎవరి వాటితోనూ సరిపోలలేదు. దీంతో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో పుష్పాబాయి నమూనాలతోనూ పరీక్షించి ఆమెవే అని తేల్చారు. హత్య జరిగిన గది బయట స్వాధీనం చేసుకున్న చెప్పులు పుష్పాబాయి కోడలివిగా తేలాయి. ఘటనా స్థలిలో పడి ఉన్న కుర్తా–పైజామా ఆ ఇంట్లో వారివే అని స్పష్టం కావడంతో దానిపై ఉన్న రక్తపు మరకల కోణంలో ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే హత్యానంతరం నిందితులు తమకు అంటిన రక్తపు మరకలు తుడుచుకోవడానికి ఆ దుస్తులు వినియోగించారని వెల్లడైంది. అంతకంతకూ కేసు జటిలంగా మారుతుండటంతో అధికారులు మరింత లోతుగా, సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఆ ఇంట్లో పని చేస్తున్న ఒడిశా యువకుడిని, అతడి కుటుంబీకులు, సన్నిహితులను అనుమానితుల జాబితాలో చేర్చారు. హత్యాస్థలిలో లభించిన నమూనాలు వీరిలో ఎవరి వాటితోనూ సరిపోలేదు. దీంతో దర్యాప్తు అధికారులు వారందరికీ క్లీన్ చిట్ ఇస్తూ వదిలేశారు. ఘటనాస్థలిలో లభించిన ఆధారాలుల్లో ఉన్న చొక్కా బటన్, ప్యాంటు–షర్టులపై పోలీసులు దృష్టి పడింది. రక్తపు మరకలు అంటిన ఆ ప్యాంట్, షర్ట్ విప్పే క్రమంలోనే దాని గుండీ తెగిపడి ఉంటుందని తేల్చారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఓ జత బట్టలు కనిపించట్లేదంటూ యజమాని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో హత్య చేస్తున్నప్పుడు ధరించిన దుస్తులను అక్కడ వదిలేసిన నిందితుడు– యజమాని దుస్తులను వేసుకు వెళ్లాడని వెల్లడైంది. నిందితుడు వదిలేసిన ప్యాంట్ కాళ్ల దగ్గర మడిచి ఉండటం, జేబులో కాల్చిన చింత గింజలు వంటివి లభించడంతో హత్య చేసిన వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితిగతులను పోలీసులు అంచనా వేశారు. ఆ ఆహార్యంతో ఉండే వ్యక్తులు ఎవరంటూ హతురాలి సంబంధీకులను పోలీసులు ప్రశ్నించగా, వెలుగులోకి వచ్చిన పేరే నర్సింహ. హతురాలి కుమార్తె వద్ద గతంలో పనిమనిషిగా ఉండి మానేసినట్లు వెల్లడైంది. మరోపక్క హత్యకు ముందు ఆ ఇంటికి రాకపోకలు సాగించిన వారి వివరాలు ఆరా తీసిన పోలీసులు ఆ జాబితాలో నర్సింహతో పాటు నారాయణ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తేల్చారు. హత్య తర్వాత అతడు ఆ చుట్టుపక్కలకు రాకపోవడంతో అనుమానం నిజమైంది. దీంతో అతడి ఇంటి అడ్రస్ తీసుకున్న పోలీసులు గగన్‌మహల్ వద్ద ఉన్న గదిపై దాడి చేశారు. అప్పటికే అది తాళం వేసి ఉండటం, స్వస్థలమైన మెదక్ జిల్లా చిన శంకరంపేటలోనూ అతడి ఆచూకీ లేకపోవడంతో ఈ హత్య నర్సింహ పనిగా నిర్ధారించారు. నర్సింహ కోసం తాము వెతుకుతుంటే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పోలీలుసు భావించారు. గగన్‌మహల్‌లో అతడు అద్దెకు తీసుకున్న గదిలో సామాను అలానే ఉందా? లేదా? అనేది గమనించారు. అవన్నీ అక్కడే ఉండటంతో ఎప్పటికైనా తిరిగి వస్తాడని, ముందు అతడి కోసం పోలీసులు గాలించట్లేదని అనుకునేలా చేద్దామని దర్యాప్తు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు గగన్‌మహల్‌లో ఉన్న గదిపై నిఘా ఉంచిన మఫ్టీ పోలీసులు ఎట్టకేలకు నర్సింహ రాకను గుర్తించి పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా, నారాయణ అనే వ్యక్తిని పనిలో చేర్చే ఉద్దేశంతోనే ప్రహ్లాద్ అగర్వాల్ ఇంటికి అతడితో కలిసి వెళ్లానని, అయితే పుష్పాబాయి వద్ద ఉన్న సొత్తు చూసి దాని కోసం నారాయణతో కలిసి ఈ హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత భయం వేయడంతో కేవలం గాజులు మాత్రమే పట్టుకుని పారిపోయామని బయటపెట్టాడు. దీంతో గాలింపు కొనసాగించిన అధికారులు నారాయణను కూడా అరెస్టు చేయగలిగారు. శ్రీరంగం కామేష్
అంతర్జాతీయం
మిన్నెపొలిస్‌లో ‘వలస’ల రగడ
మిన్నెపొలిస్: ట్రంప్ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది. వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్ డౌన్టౌన్లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్లాంగ్ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్ ఉన్నారు. ఆయన బేస్‌బాల్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్.. ఫ్లోరిడాలోని యూఎస్ సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. మిన్నెపొలిస్, సెయింట్ పాల్ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్ సిటీస్‌లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పి చంపారు. దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ అన్నారు.
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన ఓ హైస్పీడ్ రైలు.. మరో రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో వంద మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుపై స్పెయిన్ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.సౌత్ స్పెయిన్‌లోని అడముజ్ సమీపంలోని ఆండలూసియా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది. మాలాగా–మాడ్రిడ్ మధ్య నడిచే హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి.. ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఆ ధాటికి బోగీలు గాల్లోకి ఎగిరి కింద పడ్డాయి. ఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి.. సైనికుల సాయంతో గాయపడ్డ వారిని బయటకు తీసి సమీప స్టేషన్లు మాడ్రిడ్, సెవిల్లే, కార్డోబా, మాలాగా, హువెల్వా స్టేషన్లలో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు తరలించింది. గాయపడ్డ వాళ్లలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాద సమయంలో హైస్పీడ్ రైలులో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరగొచ్చని ఎమర్జెన్సీ వింగ్ ఆఫీసర్ ఆంటోనియో సాంజ్ తెలిపారు. ఘటనపై ప్రధాని పెడ్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దేశానికి బాధాకరమైన రాత్రి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనపై రాజు ఫిలిప్ VI, రాణి లెటిజియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విచిత్రమైన రైలు ప్రమాదంప్రత్యక్ష సాక్షులు ఈ రైలు ప్రమాదాన్ని.. హారర్ సినిమాను తలపించిందని చెబుతున్నారు. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ అంతా చీకటి. ఈలోపు మరో రైలు ఢీ కొట్టింది. గాజు ముక్కలు గుచ్చుకునే చాలామంది గాయపడ్డారు అని గాయపడ్డ పలువురు తెలిపారు.ఈ రైలు ప్రమాదాన్ని అత్యంత విచిత్రమైన ప్రమాదంగా స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే ట్రాక్‌పై ఎక్కడా పట్టాలు దెబ్బ తినలేదు. పైగా అది సూటి మార్గం కూడా. అలాగే ప్రయాణించిన రైలు కూడా కొత్తదే. అయినా ప్రమాదం జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటోంది. ‘‘సాధారణంగా ట్రాక్‌ల్లో మలుపు ఉండడం, రైలు పాతది కావడం లేదంటో నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఈ ప్రమాదం ఆశ్చర్యం కలిగిస్తోంది. కుట్ర కోణం ఏదైనా ఉందా? అనేది సమగ్ర దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తాం’’ అని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ పుయెంటే అన్నారు.యూరప్లోకెళ్లా అతిపెద్ద హైస్పీడ్ రైలు నెట్వర్క్ కలిగిన దేశం స్పెయిన్. దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగా ఈ నెట్వర్క్ విస్తరించింది ఉంది. 1944లో స్పెయిన్‌లో జరిగిన టోర్రే డెల్ బియెర్జో (Torre del Bierzo) ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత 2013లో సాంటియాగో డి కంపోస్టెలా వద్ద జరిగిన ప్రమాదంలో 80 మంది మృతి చెందారు.
చాబహర్ పోర్టుపై రాజకీయ రగడ
ఇరాన్‌లోని చాబహర్ ఓడ రేవు భారత్‌లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్‌హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్‌పై పెత్తనం చేయడానికి ట్రంప్‌ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. గ్వాదర్ పోర్టుకు పోటీగా.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్‌కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్‌పై సెప్టెంబర్‌లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్‌కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్‌కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది. ఎందుకంత కీలకం? చాబహర్ ఓడ రేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్‌లోని గ్వాదర్ పోర్ట్‌కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్‌పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్‌లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహర్లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది. సుంకాలతో భారత్‌కు నష్టమే చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్‌కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్‌కు అందించింది. చాబహర్‌పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్‌పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు. పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్‌పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్‌కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్
పాక్ మాజీ ప్రధాని ఇంట పెళ్లి.. భారతీయ దుస్తులపై దుమారం
భారత్–పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ సున్నితంగానే ఉంటాయి. దేశ విభజన నాటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025 ఏప్రిల్‌లో పహల్గాం దాడి తర్వాత ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగి, రెండు దేశాలు యుద్ధానికి చేరువయ్యాయన్న భావన కూడా నెలకొంది.ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబంలో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి కారణం వధువు భారతీయ ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించడం.ఎవరిదీ వివాహం?నవాజ్ షరీఫ్ మనవడు జునైద్ సఫ్దర్, లాహోర్‌లో షాంజే అలీ రోహైల్ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించినప్పటికీ, వధువు దుస్తులు రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్రబిందువయ్యాయి. జునైద్ సఫ్దర్‌కు ఇది రెండో వివాహం. ఆయన 2021లో అయేషా సైఫ్ ఖాన్‌ను వివాహం చేసుకోగా, ఇద్దరూ 2023 అక్టోబర్‌లో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.ఆకర్షణగా నిలిచిన పెళ్లి దుస్తులుమెహెందీ వేడుకలో షాంజే అలీ, భారతీయ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూపొందించిన బంగారు జరీ వర్క్‌తో కూడిన ఆకుపచ్చ లెహంగా, డబుల్ దుపట్టాతో మెరిశారు. ప్రధాన వివాహ వేడుకలో ఆమె తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఎరుపు చీరను ధరించారు. తలపై ఎరుపు ముసుగు, జుట్టులో సొగసైన బన్ ఆమె లుక్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ ఫొటోలను పాకిస్తాన్ సిటిజన్ మీడియా పోర్టల్ ‘డైలాగ్ పాకిస్తాన్’ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర స్పందన మొదలైంది. పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది నెటిజన్లు, ఇంతటి రాజకీయ కుటుంబానికి చెందిన కోడలు పాకిస్తాన్ డిజైనర్లను పక్కన పెట్టి భారతీయ డిజైన్లను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. కొందరు పాకిస్తాన్ నేతలు భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు.అయితే మరికొందరు వధువును సమర్థిస్తూ, ఇది వివాహం పూర్తిగా వ్యక్తిగత అంశమని, తనకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు ఆమెకు ఉందని వ్యాఖ్యానించారు. అలాగే పాకిస్తాన్ డిజైనర్లు కూడా అంతే స్థాయిలో ప్రతిభావంతులేనని కొందరు అభిప్రాయపడ్డారు.
జాతీయం
కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తులు!
ఇండోర్: మూడు ఇళ్లు, కార్లు, ఆటోలు, వడ్డీ వ్యాపారం. ఈ ఆస్తులు.. వడ్డీ వ్యాపారం ఇవన్నీ చూస్తుంటే ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఆస్తులేనని అనుకుంటున్నారా? అయితే, మీరు పొరబడినట్లే. మీరనుకుంటున్నట్లు ఈ ఆస్తులన్నీ కోటీశ్వరుడివి కావు. ఓ సాదాసీదా బెగ్గర్వి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్’లో వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం వీధుల్లో భిక్షాటన జీవితాలను మార్చడం. భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి వారికి పునరావాసం కల్పించడం. ఈక్యాంపెయిన్లో ఓ ప్రాంతంలో బిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే వ్యక్తి గురించి ఫిర్యాదులు రావడంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పునరావాసం కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో అధికారులు సైతం కళ్లు బైర్లు కమ్మేలా అతని ఆస్తులు కోట్లలో ఉన్నట్లు నిర్ధారించారు.బిక్షమెత్తుతూ కోట్లకు పడగనెత్తిన గీలాల్ ఘటన చర్చాంశనీయంగా మారింది. భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బుతో అతను కోట్ల రూపాయల ఆస్తిని కూడబెట్టాడని అధికారులు వెల్లడించారు. తమ దర్యాప్తులో మంగీలాల్ వద్ద 600ఎస్ఫ్టీలలో భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ ప్రాంతాల్లో మూడు ఇళ్లు, మూడు ఆటోలు,స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి. స్విప్ట్ డిజైర్ కోసం ఓడ్రైవర్ను పెట్టుకున్నాడు. తాను బిక్షాటనకు ఎక్కడికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా అదే కారులో వచ్చేవాడు. ఖాళీ సమయాల్లో అద్దెకు తిప్పేవాడు. అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు.రాష్ట్ర ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంయుక్తంగా చేపట్టిన పథకం ద్వారా మంగీలాల్‌కు ఒక వన్ బీహెచ్‌కే ఇల్లు కూడా కేటాయించింది. అయినప్పటికీ, అతను భిక్షాటనను ఆపలేదు. చెక్కతో చేసిన కార్డు పట్టుకుని ఇండోర్ వీధుల్లో భిక్షాటన కొనసాగిస్తున్నాడు. భిక్షాటనతో పాటు సరాఫా బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ.. ప్రతిరోజూ రూ.400–500 వరకు వసూలు చేస్తున్నాడని సమాచారం.జిల్లా నోడల్ అధికారి మాట్లాడుతూ, మంగీలాల్‌పై పలువురు ఫిర్యాదులు వచ్చినందున మహిళా శిశు అభివృద్ధి శాఖ అతని గురించి ఆరా తీసినట్లు తెలిపాడు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి రాజీష్ సిన్హా మాట్లాడుతూ..భిక్షాటనను ప్రోత్సహించే లేదా దానిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొత్త మలుపు తిరిగిన ‘ముంబై మేయర్’ పంచాయితీ
బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో ఇంకా తేలలేదు. ఒకవైపు మహాయుతి కూటమిలో ఏ పార్టీ తరపు ఎవరిని ఆ అదృష్టం వరిస్తుందో? అనే సస్పెన్స్ కొనసాగుతుండగా.. మరోవైపు ఏదైనా అద్భుతంగా జరిగి అనూహ్యంగా విపక్ష కూటమికి వెళ్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార కూటమిలో చర్చలు కొనసాగుతుండగానే.. ఈలోపు షిండే శివసేన హోటల్ రాజకీయాలకు తెర తీసింది.ఏకనాథ్ శిండే నేతృత్వంలోని శివసేన ఒకవైపు తమ కార్పొరేటర్లను చేజారిపోకుండా(హార్స్ ట్రేడింగ్‌కు దూరంగా) హోటల్లో దాచింది. పేపర్ వర్క్ ద్వారా అఫీషియల్ ఫార్మాలిటీస్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. తద్వారా జంపింగ్‌లకు(ఫిరాయింపులకు) చెక్ పెట్టాలని చూస్తోంది. అదే సమయంలో.. 29 సీట్లతో మేయర్ పదవి కోసం మిత్రపక్షం బీజేపీతో చర్చలు జరుపుతూనే ఉంది.మొన్నటిదాకా పవర్ షేరింగ్ ఫార్ములాను ప్రస్తావిస్తూ చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవి కోసం డిమాండ్ చేసిన షిండే సేన.. ఇప్పుడు స్వరం మార్చింది. మేయర్ పదవి మొదటి సంవత్సరం మాత్రం కచ్చితంగా తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 23న బాలాసాహెబ్ థాక్రే శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని షిండే సేన భావిస్తోంది. ఈ క్రమంలో కూటమి తరఫున తొలి ఏడాది మేయర్ పదవి దక్కించుకోవడం ద్వారా థాక్రేకు ఘనంగా నివాళి సమర్పించాలని బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.ఇప్పటికే రేసులో యామిని జాధవ్, తృష్ణా విశ్వస్రావో, అమేయ్ ఘోలే వంటి యువ, అనుభవజ్ఞుల పేర్లను మేయర్ రేసు కోసం పరిశీలిస్తోంది. బీఎంసీలో దశాబ్దాలుగా శివసేన మేయర్ ఉన్నందున.. తమ వర్గమే అసలు శివసేన అని నిరూపించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఏక్నాథ్ షిండే భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..ఇప్పటివరకు తమ పార్టీ తరఫున దేశ వాణిజ్య నగరానికి మేయర్ లేని కారణంగా.. రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని చూపించడానికి దక్కిన అవకాశాన్ని(మేయర్ పదవి) చేజార్చుకోవాలని బీజేపీ అనుకోవడం లేదు. ఈ పాయింట్ మీద షిండే సేనపై ఒత్తిడి పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో.. కార్పొరేటర్లు చేజారిపోకుండా వ్యూహాన్ని అమలు చేస్తోంది. మేయర్ ఎన్నికలు 8–10 రోజుల్లో జరిగే అవకాశం ఉండటంతో తమ కార్పొరేటర్లను నగరం వీడరాదని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం అవసరమైతే ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచింది.ఇక.. విపక్షం కూడా మేయర్ పదవి కోసం తన వంతు ప్రయత్నాల్ని ఉధృతం చేసింది. 277 సభ్యులున్న ముంబై కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 114. అధికార మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన కలయితోనే 118 అవుతుంది. అంటే నాలుగు సీట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇక విపక్ష కూటమిలో.. ఉద్ధవ్ శివసేన, MNS, NCP (శరద్ పవార్), కాంగ్రెస్, AIMIM, SP కలయికతో మొత్తం కలిపినా 106 సీట్లు అవుతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు 8 తక్కువగా ఉంది. ఈ క్రమంలోనే షిండే వర్గానికి గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.‘‘ఒకసారి పార్టీని వదిలిన వారు.. మళ్లీ హ్యాండ్ ఇవ్వొచ్చు’’ అంటూ ఉద్దవ్ శివసేన వర్గం అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యానించడం.. ‘‘ఎంత హోటల్లో దాచినా చేరాల్సిన సందేశాలు చేరాల్సిన వాళ్లకు టైంకి చేరతాయి. దేవుడు తల్చుకుంటే మేయర్ మనదే అవుతుంది’’ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ముంబై ఎన్నికల ఫలితాలు:బీజేపీ - 89 సీట్లుషిండే శివసేన – 29 సీట్లుఉద్ధవ్ శివసేన(యూబీటీ) 65 + NCP (శరద్ పవార్)1+ఎంఎన్ఎస్ (MNS) 6 సీట్లు మొత్తం 72 సీట్లుకాంగ్రెస్ – 24, ఎంఐఎం – 8, సమాజ్‌వాదీ పార్టీ – 2మొత్తం హౌస్: 227 సభ్యులుమెజారిటీ మార్క్: 114బీజేపీ+షిండే సేన: 118 (మెజారిటీ కంటే 4 ఎక్కువ).. అజిత్ పవార్ NCP మద్దతు గనుక కలిపితే ముగ్గురు కార్పొరేటర్లు కలిస్తే సంఖ్య 121అయితే.. షిండే సేన వర్గం కార్పొరేటర్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడమంటూ చెబుతున్నారు. మేం ఎన్నికలు సక్రమంగా గెలిచాం. మాపై ఎవరూ ఒత్తిడి చేయకూడదు. ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదు అంటూ రాజు వాఘ్మారే అనే కార్పొరేటర్ వ్యాఖ్యలు చేశారు. అయితే రకరకాల ఊహాగానాలు, ప్రచారాల వేళ.. మేయర్ పదవి కూటమిదేనని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, తాను, షిండే, ఇతరులు కూర్చుని నిర్ణయం తీసుకుంటామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు.
2017 మణిమండపం పునర్నిర్మాణంలో ఉన్నికృష్ణన్ పొట్టి పాత్ర ఉందా?
పతనంతిట్ట: శబరిమల బంగారం దొంగతనం కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి, గతంలో శబరిమల ఆలయంలో స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అడ్వకేట్ కమిషనర్ హైకోర్టుకు సమర్పించిన పత్రాలలో ఈ వివరాలు బయటపడ్డాయి.ద్వారపాలక ఫలకాలను ఏర్పాటు చేయడానికి ముందు, పొట్టి మాలమండపం (ప్రస్తుతం మణిమండపం) నిర్మాణానికి స్పాన్సర్‌గా ఉన్నారని నివేదికలో తేటతెల్లమైంది. 2017లో మణిమండపంలోని స్తంభాలు, గంటలు పునర్నిర్మించబడ్డాయి. పవిత్రమైన పతినేట్టం పడి (పద్దెనిమిది మెట్లు) సమీపంలోని రెండు స్తంభాలు, గంటల పునరుద్ధరణలో ఆయన సహకారం అందించినట్లు సమాచారం.ఉల్లాటన్ యోధునితో సంబంధం ఉన్న ఈ మండపం అసలు పేరు ‘మాల’ కాగా, మొదట మాలమండపం అని పిలిచేవారు. తరువాత దీనిని మణిమండపం అని పిలవడం ప్రారంభమైంది. ఈ ఏర్పాటుకు స్పాన్సర్ కోఆర్డినేటర్‌గా పరుమల అంతన్ ఆచారి వ్యవహరించారు. నివేదిక ప్రకారం, పొట్టి తన సొంత డబ్బు ఖర్చు చేయలేదు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ఈ నిధులను అందించారని, స్పాన్సర్షిప్ కోసం అడ్వకేట్ కమిషనర్‌కు ఇమెయిల్ పంపినట్లు పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, శ్రీ అయ్యప్ప తిడంబులో చేసిన మార్పులపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత జనాభా లెక్కల్లో ఇది పురాతన తిడంబుగా పరిగణించబడుతున్నప్పటికీ, ప్రస్తుతం కనిపిస్తున్నది కొత్తగా ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. దేవస్వం అధికారులకు ఈ మార్పుల గురించి సమాచారం ఉందా అనే అంశంపై భక్తులు సమాధానాలు కోరుతున్నారు.
ముగిసిన విజయ్ సీబీఐ విచారణ.. ఆరు గంటల పాటు ప్రశ్నలు..
కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో.. కోలీవుడ్ అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు దాదాపు ఆరు గంటల పాటు విజయ్ను ప్రశ్నించారు. ర్యాలీ అనుమతులు, ఆలస్యంగా రాక, ఇతర విషయాలపై ఆయన్ని అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. కరూర్‌లో ప్రచారంలో భాగంగా వాహనంలో నిలుచొని మాట్లాడేటప్పుడు రద్దీని గమనించలేదా? తొక్కిసలాట సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?తొక్కిసలాటలోనూ వాహనాన్ని ఎందుకు ముందుకు నడిపారు?.. తదితర ప్రశ్నలు విజయ్ను అడిగినట్లు తెలుస్తోంది. అందులో పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చిన విజయ్.. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు గడువు కోరినట్లు సమాచారం. విజయ్ ఇచ్చిన కొన్ని సమాధానాలకు సీబీఐ అధికారులు ఆధారాలు సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. ఇక, విజయ్ విచారణ నేపథ్యంలో.. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో సాక్షిగా ఆయన్ని ఇదివరకే దర్యాప్తు సంస్థ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని.. విజయ్ ఆలస్యంగా రావడమూ ఒక కారణమంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గంటలపాటు ఎదురుచూసి కనీస మంచినీరు లేక డీహైడ్రేషన్‌కు గురై తొక్కిసలాటలో చనిపోయారని అభియోగాల్లో పేర్కొన్నారు. ఈ కేసులో టీవీకే నేతలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే.. విజయ్‌పై మాత్రం నేరారోపణలు నమోదు కాలేదు. పలు నాటకీయ పరిణామాల తర్వాత ఈ ఘటనపై సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీం కోర్టు. కరూర్ ఘటనకు సంబంధించి టీవీకే నేతలను ప్రశ్నించిన సీబీఐ.. విజయ్ కరూర్ర్యాలీ కోసం ఉపయోగించిన ప్రచార రథాన్ని కూడా సీజ్ చేసింది. అలాగే విచారణలో భాగంగా.. జనవరి 12వ తేదీన సాక్షి హోదాలో విజయ్ను ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌లో ఆరున్నర గంటలపాటు ప్రశ్నించింది. మొత్తం 90 ప్రశ్నలను ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తోంది. సభ ఏర్పాట్లతో మొదలు.. పలు విషయాలు అందులో ఉన్నాయి. అయితే పోలీసుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే.. మరికొన్ని ప్రశ్నలకు స్పష్టత కావాలని.. ఇందుకు మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ విజయ్‌కు తేల్చి చెప్పింది. అయితే పొంగల్ తర్వాత వస్తానని ఆయన చేసిన విజ్ఞప్తిని ఏజెన్సీ పరిగణనలోకి తీసుకుంది. ఇవాళ్టి విచారణ నేపథ్యంలో ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు ఉన్నారు. ఇవాళ్టితో విజయ్ విచారణ ముగిస్తారా? లేదంటే మళ్లీ పిలుస్తారా? చూడాలి.
ఎన్ఆర్ఐ
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.తదుపరి కార్యక్రమానికి హాల్‌ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
ఇరాన్‌ను ఈసీఆర్ కేటగిరీలో చేర్చిన భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం గత ఏడాది ఆగస్టున సర్కులర్‌ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్‌పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్‌కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్‌లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్‌పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.ఇవే 19 ఈసీఆర్ దేశాలుఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.ఈసీఆర్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్‌పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.వలస కార్మికుని పాస్‌పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు అవుతాయి.అలాగే, ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ అంటే?ఈసీఎన్ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.ఈసీఎన్ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:* 10వ తరగతి ఉత్తీర్ణులు* విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు* 50 సంవత్సరాల పైబడిన వారువీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదుఏ పాస్‌పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.–మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.హృతిక్ స్వస్థలం తెలంగాణ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. ఉన్నత విద్య కోసం అతను జర్మనీకి వెళ్లాడు. అయితే.. బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకి గాయాలతో మరణించాడని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హృతిక్ కుటుంబం బోరున విలపిస్తోంది. తమ బిడ్డ మృతదేహాన్ని రప్పించాలని ప్రభుత్వాల్ని వేడుకుంటోంది. ఈ ఘటనతో మల్కాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్‌లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది.
క్రైమ్
తాంత్రికుడు మాటలు నమ్మి.. స్నేహితుణ్ని బలిచ్చారు!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌లో దారుణం జరిగింది. డబ్బులు, దైవానుగ్రహం కోసం ఇద్దరు యువకులు తన స్నేహితుణ్ని హత్య చేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వివరాల మేరకు.. ఘాజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన నందు అలియాస్ నవీన్ అనే యువకుడు జనవరి 13వ తేదీ రాత్రి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. నిందితులు పవన్ (25), సాగర్ అలియాస్ పండిట్ (24) తమ స్నేహితుడిని గ్యాస్ సిలిండర్‌తో దాడి చేసి చంపారు. అనంతరం శవాన్ని దాచిపెట్టేందుకు దాన్ని దుప్పట్లో చుట్టి బ్యాటరీతో నడిచే ఆటోలో పెట్టి, ఆ ఆటోను కాల్చివేశారు. ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి ప్రమాదానికి గురైందని నమ్మించే ప్రయత్నించాడు. అయితే, బాధితుడి సోదరుడు ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడు నసీమ్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారు ఒక తాంత్రికుడిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఆ తాంత్రికుడు మానవ బలి ఇస్తే సంపద, దైవానుగ్రహం లభిస్తుందని చెప్పాడు. ఈ మాటలకు ప్రభావితులైన నిందితులు తమ స్నేహితుడినే బలిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధంగా నందును హత్య చేసి, శవాన్ని కాల్చివేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులిద్దరికీ గతంలోనే హత్య, దోపిడీ, ఆయుధాల చట్టం ఉల్లంఘన కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
కాళ్ల పారాణి ఆరకముందే..
విశాఖపట్నం: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. పండగ ఆనందాలు మిగలాల్సిన ఆ కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎంవీపీ కాలనీకి చెందిన మువ్వ నారాయణ రావు కుమార్తె రమా హిమజ (27)కు, గత ఏడాది నవంబర్‌లో ఎంవీవీ వినీష్‌తో వివాహం జరిగింది. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఈ నూతన దంపతులు తొలి పండగ కోసం విశాఖ వచ్చారు. నాలుగు రోజులు కుటుంబంతో సంతోషంగా గడిపిన వీరు, శుక్రవారం కారులో అన్నవరం వెళ్లారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని, అదే రోజు రాత్రి తిరిగి విశాఖ బయలుదేరారు. మరో పావు గంటలో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో.. ఎన్ఏడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌పై కారు ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి రోటరీ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ప్రమాద తీవ్రతకు భయపడి తీవ్ర ఆందోళనకు గురైన హిమజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆమెను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. మృతురాలి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శంకర నారాయణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య
ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నారు.. సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు.. ఆటుపోట్లకు నిలదొక్కుకోలేకపోతున్నారు.. అనుకున్నది జరక్కపోతే తట్టుకోలేకపోతున్నారు.. అత్తారింట్లో ఇమడలేకపోతున్నారు.. ఆడపడుచుల పోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. తల్లిదండ్రుల చాటు బిడ్డలుగానే మెలుగుతున్నారు.. తెలిసీతెలియని వయస్సు పెళ్లిళ్లతో నలిగిపోతున్నారు.. కోపం వస్తే అణచుకోలేకపోతున్నారు.. అణకువను అలవర్చుకోలేకపోతున్నారు.. మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు.. సమయస్ఫూర్తితో వ్యవహరించలేకపోతున్నారు.. నలుగురితో చర్చించలేకపోతున్నారు.. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. నూరేళ్ల జీవితాన్ని కాలరాసుకుంటున్నారు.. కంటిపాపలను నిర్దయగా చిదిమేస్తున్నారు.. నంద్యాల: ఆర్థిక, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నారు. ఏం పాపం చేయని చిన్న పిల్లలకు రంగుల లోకంలో చోటు లేకుండా చేస్తున్నారు. విషమిచ్చి, కాల్వలో తోసేసి చిన్నారులను తమతోపాటు తీసుకెళ్తున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయాలతో కుటుంబసభ్యులకు రోదనే మిగులుతోంది. నంద్యాల జిల్లాలో కొన్ని రోజులుగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. 20 రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మీ(23) గతేడాది డిసెంబర్ 28న మంచాలకట్ట సమీపంలో తన పిల్లలు వైష్ణవి(3), మూడు నెలల చిన్నారి సంగీతను ఎస్సార్బీసీ కాల్వలో తోసి తాను కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడవకముందే ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర(34) ఆర్థిక సమస్యలతో తట్టుకోలేక సురేంద్ర కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి (4), సూర్యగగన్ (1.5)కు పాలలో విషం కలిపి తాపించి తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపులు భరించలేక మల్లిక(27) అనే మహిళ శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు ఇషాంత్(7), పరిణతి(9నెలలు)కి పురుగుల మందు తాపి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత 20 రోజుల్లో జిల్లాలో వరుసగా జరిగిన ఘటనల్లో అభం శుభం తెలియని ఏడుగురు చిన్నారులు నిండు జీవితాలను కోల్పోయారు. జీవితాలను బలి చేసుకోవద్దు సమస్య చిన్నదే అయినా కొందరు తీవ్రంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము లేకపోతే పిల్లలకు భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడతూ తమతోపాటు తీసుకెళ్తున్నారు. వారు తీసుకొనే నిర్ణయమే తప్పు అయితే పిల్లలను చంపి మరో తప్పు చేస్తుండటం విస్మయానికి గురి చేస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని, తీవ్ర నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలి చేసుకోద్దని సూచిస్తున్నారు.
ప్రియురాలి కోసం భార్యను చంపి..
కృష్ణా జిల్లా: తల్లిని తమ తండ్రి చంపటం జీర్ణించుకోలేక పోతున్నామని, తమ తండ్రికి కచ్చితంగా శిక్ష పడాలని మృతురాలు రేణుకాదేవి కుమార్తె, కుమారుడు ముక్కామల తేజశ్రీ, ముక్కామల నాగేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోరంకిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ తండ్రి ముక్కామల ప్రసాద్ చౌదరి ఆకునూరు ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తమ తల్లి అడ్డుగా ఉందని పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. తమ పట్ల తండ్రి కపటప్రేమ చూపాడని, తల్లి పేరున ఉన్న ఇంటిని నమ్మకంగా తన పేరున రాయించుకున్నాడని అన్నారు. తమ తండ్రి ఇంత దారుణానికి ఒడికడతాడని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగానే తల్లి హత్య ఉదంతం వెలుగు చూసిందని అన్నారు. హత్య వెనుక పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు ఉన్నాయని దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు. నన్ను కూడా చంపాలని చూశారు... తన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఆయనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఝాన్సీ తనను కూడా హత్య చేయాలని చూశారని మృతురాలి కుమారుడు నాగేష్ ఆరోపించారు. తనకు ఇష్టం లేకపోయినా తనను యూకేకు బలవంతంగా పంపారని, తనను యూకేలోనే చంపాలని పథకం వేశారని అన్నారు. తాను యూకేకు వెళ్లిన 25 రోజుల్లోనే తల్లిని హత్య చేశారని చెప్పారు. దీంతో తాను ఇండియాకు వచ్చానన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన తండ్రి ప్రసాద్‌చౌదరి, ఝాన్సీలకు శిక్షపడాలని అన్నారు.
వీడియోలు
Ravi Teja: ప్రేమ పేరుతో యువతిని మోసం 10 ఏళ్ల జైలు శిక్ష
Palnadu: సిగ్గులేకుండా రికార్డింగ్ డ్యాన్స్ లు పైగా లోకేష్, పవన్ ఫోటోలు
Jada Sravan: మీరు టీడీపీకే హోం మంత్రి, డిప్యూటీ సీఎంలా
Karanguda : రోడ్లు వేయడం లేదంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు
Karnataka : ఆఫీస్ లోనే ముద్దులు, కౌగిలింతలు అడ్డంగా దొరికిన DGP..
Sakshi Special: ఇన్ఫ్లుయెన్సర్ల కొత్త దందా
Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..
తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్
Kannababu : మెడికల్ కాలేజీలకు డబ్బులేవ్ కానీ NTR విగ్రహం కోసం రూ. 1750 కోట్లు
బలవంతపు భూసేకరణ ఆపాలి హిందూపురంలో రైతుల ధర్నా

