Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Cyclone Montha Threatens AP : YS Jagan Alerts Party Cadre1
ఏపీకి‘మోంథా’ముప్పు.. పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేసిన వైఎస్ జగన్

సాక్షి,తాడేపల్లి: రాష్ట్రానికి మోంథా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేశారు.మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 28న తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన ర్యాలీలు వాయిదా వేశారు. నవంబర్ 4 న ర్యాలీలను నిర్వహించాలని పేర్కొన్నారు.

Larry Ellison reveals single mindset that made him richer than Elon Musk2
ఆ ‘సింగిల్‌ మైండ్‌సెట్‌’ మస్క్‌ కంటే ధనవంతున్ని చేసింది!

బిలియనీర్, ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ (Larry Ellison) గురించి కొత్తగా వెలుగులోకి వచ్చిన వీడియో.. ఆయన విజయానికి మూలమైన వ్యక్తిత్వ లక్షణాన్ని బయటపెట్టింది. అదే “సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రశ్నించే ధోరణి.” ఈ ధోరణి ఆయన్ను మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది. చివరికి ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌ (Elon Musk) సంపదను కూడా అధిగమించే స్థితికి చేర్చింది.ఎల్లిసన్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “సాంప్రదాయ ఆలోచనలకు అనుగుణంగా ఉండకండి” అని సలహా ఇచ్చారు. నిపుణుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకూడదని, అధికారాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. “నిపుణులు కాబట్టి వారిని అనుమానించకూడదు అనే భావన తప్పు” అని చెప్పిన ఎల్లిసన్, ఈ ఆలోచన పద్ధతి కొంత మందికి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో సంబంధాలను “చాలా బాధాకరంగా” మార్చవచ్చని కూడా అంగీకరించారు. అయినప్పటికీ, ఆయన దృష్టిలో ఉత్సుకత మానవ స్వభావంలోని అత్యంత విలువైన లక్షణం.సెయిల్‌ బోట్‌ల రేసింగ్‌ పట్ల ఆసక్తిని ప్రస్తావిస్తూ, ఎల్లిసన్‌ దాన్ని స్వీయ-ఆవిష్కరణకు ఒక రూపంగా వివరించారు. తన కెరీర్‌పై మాట్లాడిన ఎల్లిసన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్‌ (Microsoft) మధ్య పోటీ రోజులు తనకు స్వీయ అవగాహనను పెంచాయని తెలిపారు. “ప్రతిరోజూ నా గురించి కొత్త విషయాలు నేర్చుకుంటాను” అని చెప్పారు. ఎల్లిసన్‌ చివరగా చెప్పిన మాటలు ఆయన తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబించాయి. “నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను. వాటికి జీతం లభించింది. కానీ ఆ పనులన్నీ ఒకే లక్ష్యానికి, స్వీయ ఆవిష్కరణకు దారితీశాయి” అన్నారు.ఇదీ చదవండి: కొడుకుతో వాచ్‌మెన్‌కు క్షమాపణ చెప్పించిన ముకేశ్‌ అంబానీLarry Ellison on success being directly correlated to questioning limits and conventional wisdom pic.twitter.com/gD87fTVxP8— prayingforexits 🏴‍☠️ (@mrexits) October 24, 2025

Assam, Services play out shortest match in Ranji history3
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం

రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్‌లో అద్భుతం జరిగింది. అస్సాం​, సర్వీసస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్‌ ఇదే.గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్‌లో ఢిల్లీ, రైల్వేస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్‌ మ్యాచ్‌ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.అస్సామ్‌లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్‌లో నిన్న (అక్టోబర్‌ 25) మొదలైన ఈ మ్యాచ్‌ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్‌) ముగిసింది. ఎలైట్‌ గ్రూప్‌-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అస్సాంపై సర్వీసస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్‌), రెండో ఇన్నింగ్స్‌లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్‌) ఆడగా.. సర్వీసస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్‌), రెండో ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.మ్యాచ్‌ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు రియాన్‌ పరాగ్‌ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు.చరిత్రాత్మక హ్యాట్రిక్స్ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం ​కూడా చోటు చేసుకుంది. సర్వీసస్‌ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్‌లో (అస్సాం తొలి ఇన్నింగ్స్‌) హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో డబుల్‌ హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇన్నింగ్స్ విశ్లేషణ:- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు) టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52 - సర్వీసస్‌ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు) అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25 - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు) అర్జున్ శర్మ: 4/20 అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు - సర్వీసస్‌ లక్ష్యం- 71 పరుగులు 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిందిచదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!

Poll body to announce pan-India SIR dates tomorrow4
దేశ వ్యాప్త ‘SIR’కు సీఈసీ సన్నద్ధం.. రేపు కీలక మీడియా సమావేశం

ఢిల్లీ: ఇప్పటికే బిహార్‌ రాష్ట్రంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యక సమగ్ర సవరణ-SIR(Special Intensive Revision) ను దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సిద్ధమవుతుంది.. దీనిలో రేపు(సోమవారం, అక్టోబర్‌ 27వ తేదీ) రాష్ట్రాల ‘SIR’ నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశాలు కనబుడుతున్నాయి. సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు సర్‌ నిర్వహించే తదీలను ఖరారు చేయనుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాలు కూడా ఉండనున్నాయి. ఈ మేరకు సీఈసీ రేపు కీలక మీడియా సమావేశంలో ‘సర్‌’ నిర్వహణ రాష్ట్రాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మీడియా సమావేశానికి సీఈసీ ఆహ్వారం పంపిన దరిమిలా ‘సర్‌’పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉండవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న లేదా జరగబోయే రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను ఇప్పుడే ప్రారంభించవద్దని నిర్ణయించింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తలమునకలై ఉంటారు కనుక వాటికి జోలికి వెళ్లకుండా మిగతా రాష్ట్రాల్లో సర్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Narrow escape for passengers as UP AC sleeper bus catches fir5
మరో ప్రైవేటు స్లీపర్‌ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

లక్నో: యూపీకి చెందిన ఓ ప్రైవేటు బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డబుల్‌ డెక్కర్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో మంటలు వ్యాపించినప్పటికీ డ్రైవర్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం(అక్టోబర్‌ 26వ తేదీ) ఉదయం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై వెళుతున్న సమయంలో ఓ ఏసీ స్లీపర్‌ బస్సు టైర్ల కింద నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపేసి ప్రయాణికుల్ని కిందకు దించేశాడు. అదే సమయంలో పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మంటల్ని అదుపు చేశారు. డ్రైవర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం కానీ, గాయాల బారిన పడటం కానీ జరగలేదన్నారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా వస్తున్న సమయంలో జరిగినట్లు తెలిపారు. ఆ సమయంలో 39 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. టోల్‌ ప్లాజాకు 500 మీటర్ల దూరంగా ఉండగా బస్సులో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు. బస్సు టైర్ల కింద నుంచి మంటలు రావడంతో దాన్ని రోడ్డుపైనే నిలిపేసిన డ్రైవర్‌ జగత్‌ సింగ్‌ చాలా చాక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు ప్రశంసించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌ వేపై చాలా సేపు ట్రాఫిక్‌ స్తంభించిందని, బస్సును అక్కడ నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్‌ మళ్లీ యథావిధికి వచ్చినట్లు పేర్కొన్నారు పోలీసులు. लखनऊ आगरा एक्सप्रेस वे पर दिल्ली से आ रही डबल डेकर बस के पिछले पहिए में रेवरी टोल प्लाजा से पहले आग लग गई । जिससे पूरी बस धू धू कर जल गई। हालांकि बस में सवार 39 सवारी सुरक्षित रही। pic.twitter.com/jTkFQvdztM— Ajay Srivastav (@ajaysridj) October 26, 2025 A major accident was averted on the Lucknow-Agra Expressway early Sunday morning. A double-decker bus from #Delhi to Gonda caught fire after a tyre burst, but all passengers were safely evacuated before the flames engulfed the vehicle.(Video/Picture Courtesy : X) pic.twitter.com/wPERgIbV84— Deccan Chronicle (@DeccanChronicle) October 26, 2025

Cyclone Montha Updates: Heavy Rainfall In Andhra Pradesh6
AP: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను

ప.గో, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలుఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌తుపాను నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విజయవాడ: మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశంవాతావరణ హెచ్చరికల నేపధ్యంలో రేపట్నుంచి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రెండు జిల్లాల కలెక్టర్లుజిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుకలెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లోని హాస్టల్స్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్ధులువిద్యార్ధులను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులుగుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో మోంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి సిసోడియా,జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాస్పెషల్ ఆఫీసర్ సిసోడియా కామెంట్స్రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఅధికారులను అప్రమత్తం చేసాంలోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాంప్రభుత్వ పాఠశాల ల్లో 16 పునరావాస కేంద్రాల్లో అధికారులు వుంటారుతుఫాన్ కి ఎక్కువ నష్టం జరగకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా కామెంట్స్27,28,29 తేదీలలో భారీ వర్షం ఈదురుగాలులు ఉంటాయిగుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు18 మండలాల్లో అధికారులు దగ్గరనుండి పర్యవేక్షణ చేస్తున్నారుప్రజల కోసం కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాంవ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలిరూరల్ ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాంఅత్యాసవసర పరిస్థితి ఉంటేనే ప్రజలు బయటకు రావాలికాలేజీ స్కూల్స్ అంగన్ వాడి కేంద్రాలు 3 రోజులు సెలవలు ప్రకటించాంప్రజలకు సమస్య ఉంటే తప్పకుండా కాల్ సెంటర్ కి కాల్ చేయండినగరంలో 12 లోతట్టు ప్రాంతాల ను తెలుసుకున్నాంప్రధానంగా ఉన్న పీకల వాగు పొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏలూరు జిల్లా:ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం..ఈనెల27, 28న జిల్లాలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశంజిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు 27, 28 తేదీలలో సెలవువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులుగోదావరి నదిలోనికి పర్యాటక లాంచీలను నిలిపివేతజిల్లా, అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుఏలూరు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077ప్రజలకు అందుబాటులో గ్రామానికి ఒక నోడల్ అధికారి*తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విపశ్చిమ గోదావరి జిల్లామోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు.జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219,భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315,నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874,తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358కాకినాడ:మోంథా తుపాన్‌ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ాకాకినాడలో 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేతకాకినాడలో బీచ్‌లు మూసివేత విశాఖ:విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవుసోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవుబాపట్లమోంథా తుపాన్‌ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించిన కలెక్టర్‌తుపాన్‌ ాకారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్‌లు మూసివేతయాత్రికులు, భక్తులు బీచ్‌లకు రావొద్దని పోలీసుల హెచ్చరికలువిశాఖ:మోంథా తుపాన్‌ నేపథ్యంలో రైల్వే జోన్‌ హై అలెర్ట్‌రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్‌ వ్యవస్థపై నిఘాఅత్యవసర సేవల కోసం రైళ్లు ిసిద్ధం చేసిన అధికారులుట్రాక్‌, సిగ్నలింగ్‌, విద్యుత్‌ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలువిశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుతుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న వాల్తేరు డీఆర్‌ఎమ్‌ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్‌ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్‌పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మోంథా తుఫాన్‌.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్‌ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్‌లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు.విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.

21 Maoist cadres surrender in Chhattisgarh 7
లొంగిపోయిన మరో 21 మంది మావోలు

రాయ్‌పూర్‌: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఆదివారం మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్‌ రేంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్‌కాల్‌ డివిజన్‌ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్‌కాల్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి ముకేష్‌, మావోయిస్టులు కుయెమారి/కిస్కోడో ఏరియా కమిటీ, కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కు చెందినవారు. వీరిలో డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేశ్ ఉన్నారు. ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల్లో నాలుగు మంది డివిజన్ స్థాయి కమాండర్లు, తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు ,ఎనిమిది మంది పార్టీ సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 21 మంది మావోయిస్టుల్లో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మూడు ఏకే-47 రైఫిళ్లు,నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు, ఆరోనంబర్ 303 రైఫిళ్లు, రెండు సింగిల్ షాట్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ ఆయుధాన్ని సరెండర్‌ చేసినట్లు బస్తర్‌రేంజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు.

Kurukshetra Season 2 Review Telugu8
మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ

ఇప్పటి జనరేషన్‌లో ఎంతమందికి 'మహాభారతం' గురించి తెలుసు? కచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. ప్రభాస్ 'కల్కి'లో కర్ణుడు, అశ్వద్ధామ పాత్రల్నిచూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు. అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్దం ఆధారంగా 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు. అక్టోబరు 10న తొమ్మిది ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌ని రెండో సీజన్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఇది ఎలా ఉంది? ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ సర్వైవల్ థ్రిల్లర్.. డోంట్ మిస్)కథేంటి?'కురుక్షేత్ర' సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు. అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది. మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కౌరవులు పక్షాన ఉన్న ధుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, దుశ్శాసన.. పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు, ధర్మరాజు, భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది? అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది? ఎలా అంతమైంది? శ్రీకృష్ణుడు బోధించిన ధర్మ మార్గం, కర్మ ఫలితం ఏంటి? యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని.. ఈ సిరీస్ మేకర్స్ 18 ఎపిసోడ్స్‌గా తీశారు. తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తొలి సీజన్‌లో దాదాపు 15 రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు. రెండో సీజన్‌లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది. కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్‌లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.కుంతి, కర్ణుడు, దుశ్శాసన, భీమ, అశ్వత్థామ, దుర్యోధన.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు. అసలు వీళ్లు ఎవరు? ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది? 'కురుక్షేత్ర'లో వీళ్ల పాత్ర ఏంటి? అనేది చక్కగా చూపించారు. పేరుకే యానిమేటెట్ సిరీస్ గానీ చూస్తున్నంతసేపు మహాభారతం కళ్లముందు కనిపిస్తుంది. నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు. 16వ ఎపిసోడ్‌లోనే యుద్ధం పూర్తయిపోతుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు. 'స్త్రీ పర్వ' ఎపిసోడ్, అందులో వచ్చే డ్రామా, డైలాగ్స్ బాగుంటాయి. చివరి ఎపిసోడ్‌లో శ్రీ కృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్.. సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్ ఇస్తాయి.ఇదివరకే మహాభారతం చూసినవాళ్లకు, తెలిసినవాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు. కానీ మహాభారతం, కురుక్షేత్రం గురించి ఏ మాత్రం తెలియనవాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కర్ణుడు, అశ్వత్థామ, దృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి, ద్రౌపతి, దుర్యోధనుడు, దుశ్శానస.. ఇలా లెక్కలేనన్ని పాత్రలు ఉన్నాసరే అన్నింటి మధ్య కనెక్షన్స్, ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.రీసెంట్ టైంలో 'మహావతార్ నరసింహా' అనే యానిమేటెడ్ సినిమా.. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే 'కురుక్షేత్ర' సిరీస్‌ని అస్సలు మిస్ చేయొద్దు. పేరుకే 18 ఎపిసోడ్స్ గానీ ఒక్కొక్కటి 25-30 నిమిషాల నిడివితోనే ఉంటాయి. ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే 'మహాభారతం' గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్!)

Dgp Shivadhar Reddy And Cp Sajjanar Visited Dcp Chaitanya9
చాదర్‌ఘాట్‌ ఘటన.. డీసీపీ చైతన్యను పరామర్శించిన డీజీపీ, సీపీ

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున నిన్న(శనివారం అక్టోబర్‌ 25) తుపాకీ కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. చాదర్‌ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ జరిగిన ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, ఆయన గన్‌మెన్ వీఎస్‌ఎన్‌ మూర్తిలను డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో వారిని పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.డీసీపీ, గన్‌మెన్‌ ధైర్య సాహసాలు కనబరిచారు : డీజీపీ శివధర్ రెడ్డినిన్న చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్‌ స్నాచర్లు దాడులు జరిపారు. సెల్ ఫోన్ స్నాచింగ్‌కి పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారు. డీసీపీ చైతన్య కుమార్, గన్‌మెన్ మూర్తి 750 మీటర్లు నిందితులను చేజ్ చేశారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారు. నిందితుడు ఒమర్ అన్సారీ పై 22 కేసులు ఉన్నాయి. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీషీట్ ఉంది. ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్‌మెన్ ఆర్యోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. డీసీపీ, కానిస్టేబుల్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాం. నిందితుడు ఒమర్ అన్సారీకి ఆపరేషన్ జరిగింది. నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.రౌడీ షీటర్‌లు, దొంగలపై ఉక్కుపాదం: సీపీ సజ్జనార్ఈ ఘటనలో ఇవోల్వ్ అయినా ఆటో డ్రైవర్, ఇంకో వ్యక్తిని పట్టుకోవడానికి డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో టీమ్స్ పని చేస్తున్నాయి. కొన్ని క్లూస్ కూడా లభించాయి. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నాము. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచాం. నగర ప్రజలు ఎవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్‌లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్‌పై కూడా నిఘా పటిష్టం చేశాం డీసీపీకి మెడ భాగంలో గాయమైంది. గన్ మెన్ మూర్తికి కాలు గాయం అయ్యింది. డ్రైవర్ సందీప్ అలర్ట్‌గా ఉండి కీలక పాత్ర పోషించారు. డీసీపీ చైతన్య, మూర్తి, డ్రైవర్ సందీప్ ముగ్గురు ధైర్యసాహసాలు చూపారు. ఐదు బృందాలు నిందితుల కోసం గలిస్తున్నాయి.అసలేం జరిగిందంటే..కరడుగట్టిన దొంగ అన్సారీ సెల్‌ ఫోన్‌ చోరీ చేసి పారిపోతుండగా డీసీపీ చైతన్య గమనించి తన గన్‌మ్యాన్‌తో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నించగా అన్సారీ తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఆత్మ రక్షణ కోసం చైతన్యకుమార్‌ తన గన్‌ మ్యాన్‌ వద్ద ఉన్న తుపాకీని తీసుకొని కాల్పులు జరపడంతో అన్సారీ తీవ్రంగా గాయపడ్డాడు.డీసీపీ, గన్‌మ్యాన్‌లకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్పించారు. ఘటనాస్థలిని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనార్‌ సందర్శించారు. తన కంట పడిన నేరగాడిని పట్టుకోవడానికి ఓ ఐపీఎస్‌ అధికారి ఛేజింగ్‌ చేయడం, కాల్పులు జరపడం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి.

Rs 20 samosa vs Rs 3 lakh angioplasty: Delhi heart doctors blunt warning10
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్‌ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్‌ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్‌ "అనారోగ్యకరమైన ఆఫీస్‌ స్నాక్స్‌ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్‌ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్‌ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్‌ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్‌. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్‌ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్‌లో రోటీన్‌గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్‌! స్పెషల్‌ హైడ్రేషన్‌ స్టయిల్‌..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement