Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Asia cup 2025: India beat Sri lanka in super over 1
Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్‌ ఓవర్‌లో శ్రీలంకపై టీమిండియా గెలుపు

ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్‌ 26న జరిగిన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం​ భారత్‌ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరింది. సెప్టెంబర్‌ 28న జరిగే ఫైనల్లో భారత్‌, పాకిస్తాన్‌ తలపడనున్నాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. అభిషేక్‌ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), సంజూ శాంసన్‌ (23 బంతుల్లో 39; ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించారు.ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (15 బంతుల్లో 21 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12), హార్దిక్‌ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్‌ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్‌ మెండిస్‌ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్‌ తొలి బంతికి ఔట్‌ కావడంతో సీన్‌ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇందులో భారత్‌ శ్రీలంకపై విజయం సాధించింది.

Bc Reservation Go Released In Telangana2
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జీవో విడుదల చేసింది. జీవో నెం.9ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్టికల్‌ 40 ప్రకారం స్టేట్‌ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది.బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. నూతన పీఆర్‌ చట్టానికి అసెంబ్లీ ఆమోదించిన సవరణలకు అనుగుణంగా డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్‌పీటీసీలు, జెడ్పీ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఇలా అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్‌ చేశారు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో రిజర్వేషన్‌ సీట్లన్నీ కూడా ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా, మొత్తం సీట్లలో 50 శాతానికి తగ్గకుండా చేశారు. ఈ ఏరియాల్లోని మండల అధ్యక్షుల పదవులన్నీ కూడా ఎస్టీలకే రిజర్వ్‌ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్ల ఖరారును పంచాయతీరాజ్‌ కమిషనర్, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలను జిల్లా కలెక్టర్లు, మండలాల్లో ఎంపీటీసీ రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లను కులగణన (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే 2024 ప్రకారం పూర్తి చేశారు.

Dhinakaran NDA snub upsets BJP alliance math in Tamil Nadu3
దిన‌క‌ర‌న్ షాకింగ్ నిర్ణ‌యం!

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడు నెల‌లే స‌మ‌యం ఉండ‌డంతో త‌మిళ‌నాట రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అధికార డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్ర‌తిప‌క్ష‌ అన్నాడీఎంకే అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జ‌ట్టు క‌ట్టింది. ఎన్డీఏ కూట‌మి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్‌) దాదాపు ఖరార‌య్యారు. దీనికి త‌మిళ బీజేపీ నాయ‌కులు కూడా ఒప్పుకున్నారు. అయితే తాను మాత్రం ఒప్పుకోనంటున్నారు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం చీఫ్ టీటీవీ దినకరన్ (TTV Dhinakaran).ఎన్డీఏ కూట‌మి నుంచి కొద్దిరోజుల క్రితం దిన‌క‌ర‌న్ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఆయ‌న‌ను మ‌ళ్లీ ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందుకోసం సెప్టెంబ‌ర్ 21న స్వ‌యంగా దిన‌క‌ర‌న్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. త‌మ‌తో చేతులు క‌ల‌పాల‌ని కోరారు. భేటీ త‌ర్వాత అన్నామ‌లై మీడియాతో మాట్లాడుతూ.. ''మా భేటీలో రహస్యాలు ఏమీ లేవు. దిన‌క‌ర‌న్ ఎన్డీఏ కూట‌మిలోనే ఉన్నారు. హఠాత్తుగా బయటకు వెళ్లడంతో ఆయ‌న‌ను క‌లిసి మాట్లాడాను. ఎన్డీఏలోనే కొన‌సాగాల‌''ని కోరిన‌ట్టు వెల్ల‌డించారు. నవంబర్‌ తర్వాత టీటీవీ దినకరన్‌ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయ‌న చెప్పారు.ఈపీఎస్‌ను ఓడిస్తాంఅయితే దిన‌క‌ర‌న్ మాత్రం మూడు రోజుల్లోనే త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఎన్డీఏ కూట‌మి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూట‌మిలోకి రానని తెగేసి చెప్పేశారు. అయితే దిన‌క‌ర‌న్ మాత్రం మూడు రోజుల్లోనే త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఎన్డీఏ కూట‌మి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూట‌మిలోకి రానని తెగేసి చెప్పేశారు. "నేను 2021లో కూడా ఆయనను వ్యతిరేకించాను. సీనియర్ నాయకులు నన్ను కోరినందున మాత్రమే నేను ఆయనను అంగీకరించాను. ఈసారి, మా పార్టీ ప్రత్యేకంగా ఈపీఎస్‌ను ఓడించడానికి పోరాడుతుంద"ని మీడియాతో చెప్పారాయ‌న‌. త‌న‌ను ఎన్డీఏ కూట‌మిలోకి తిరిగి తీసుకురావ‌డానికి మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు చేసిన ప్ర‌య‌త్నాల‌ను తాను తిర‌స్క‌రించిన‌ట్టు వెల్ల‌డించారు.బీజేపీకి ఎదురుదెబ్బ‌తమిళనాడులో డీఎంకే ప్ర‌భుత్వాన్ని ఓడించేందుకు దృఢమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ బీజేపీకి దిన‌క‌ర‌న్ నిర్ణ‌యం ఎదురుదెబ్బ‌గా విశ్లేష‌కులు భావిస్తున్నారు. దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స‌న్నిహిత స్నేహితురాలు వీకే శశికళ (VK Sasikala) మేనల్లుడు దినకర‌న్‌కు త‌మిళ‌నాడులో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. అన్నామ‌లై చొర‌వ‌తో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో క‌లిశారు. బీజేపీ పెద్ద‌లు ఈపీఎస్‌ను సీఎం అభ్య‌ర్థిగా దాదాపు ఖ‌రారు చేయ‌డంతో దిన‌క‌ర‌న్ జీర్ణించుకోలేక‌పోయారు. దీంతో ఎన్డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో దిన‌క‌ర‌న్ నిష్క్ర‌మ‌ణ క‌మ‌ల‌నాథుల‌కు సంక‌టంగా మారింది. ఆయ‌న‌ను ఎలాగైనా కూట‌మిలో కొన‌సాగేలా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ప‌ళ‌నిస్వామి పంతంమరోవైపు జయలలిత (Jayalalithaa) మరణం తర్వాత అన్నాడీఎంకేను త‌న గుప్పిట్లో పెట్టుకున్న ప‌ళ‌నిస్వామి మాత్రం దిన‌క‌ర‌న్‌తో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం (ఓపీఎస్‌)ను మ‌ళ్లీ చేర‌దీయ‌కూడ‌ద‌ని భీష్మించుకుని కూర్చుకున్నారు. పార్టీని వ‌దిలివెళ్లిన వారు, బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన వారిని మ‌ళ్లీ అక్కున చేర్చుకోవాల‌ని అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత సెంగోట్ట‌య‌న్ చేసిన ప్ర‌తిపాద‌నపై ప‌ళ‌నిస్వామి తీవ్రంగా స్పందించారు. పార్టీ ప‌ద‌వుల‌ నుంచి సెంగోట్ట‌య‌న్, ఆయన మ‌ద్ద‌తుదారుల‌ను పీకిపారేశారు. త‌న‌కు వ్య‌తిరేకంగా వ్యహ‌రిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు పంపారు. దీంతో ప‌ళ‌నిస్వామిపై సెంగోట్ట‌య‌న్ (Sengottaiyan) మ‌ద్ద‌తురాలు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అటు ఓపీఎస్‌, దిన‌క‌ర‌న్ కూడా సెంగోట్ట‌య‌న్‌కు బాస‌ట‌గా నిలిచారు.చ‌ద‌వండి: అన్నాడీఎంకేలో క‌ల‌క‌లం.. రంగంలోకి అమిత్ షా!ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో దిన‌క‌ర‌న్ ప్ర‌క‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. త‌మిళ‌నాడులో డీఎంకేను ఓడించ‌డానికి ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకోకూడ‌ద‌ని బీజేపీ భావిస్తోంది. అటు చూస్తే అన్నాడీఎంకే పార్టీలో లుక‌లుక‌లు, ఇటు చూస్తే దిన‌క‌ర‌న్ నిష్క్ర‌మ‌ణతో కాషాయ పార్టీకి క‌ల‌వ‌రం త‌ప్ప‌డం లేదు. అయితే దిన‌క‌ర‌న్ ఇదే మాట మీద ఉంటారా, దిగివ‌స్తారా అనేది వేచిచూడాలి.

Mea Says Pm Modi Didnt Call Putin After Us Tariff Move4
అదంతా అవాస్తవం.. నాటో చీఫ్‌ వ్యాఖ్యలపై భారత్‌ రియాక్షన్‌

ఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కాల్ చేశారన్న నాటో చీఫ్ మార్క్ రుటే వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అవి పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. నాటో చీఫ్‌ వ్యాఖ్యలను ఖండించారు.ప్రధాని మోదీ.. పుతిన్‌తో ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. అలాంటి సంభాషణ ఏదీ జరగలేదంటూ భారత్‌ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు అంగీకార యోగ్యమైనవి కావన్న రణధీర్ జైస్వాల్.. నాటో చీఫ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా యుద్దం విషయమై పుతిన్‌తో భారత ప్రధాని మోదీ చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ విధించిన సుంకాల ఎఫెక్ట్‌ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. ‘భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రుటె వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

Abhishek Sharma becomes the first batter in T20I Asia Cup history to complete 300 runs in a single Edition5
IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. స్టార్‌ ఆటగాడి రికార్డు బద్దలు

ఆసియా కప్‌ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ​ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్‌ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌పై కూడా హాఫ్‌ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్‌ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్‌.. 6 మ్యాచ్‌ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్‌రేట్‌తో, 51.50 సగటున, 3 హాఫ్‌ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్‌ మరో మ్యాచ్‌ (ఫైనల్‌) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్‌ ఓ ఆల్‌టైమ్‌ రికార్డును సెట్‌ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌ చరిత్రలో ఓ సింగిల్‌ ఎడిషన్‌లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్‌కు ముందు టీ20 ఆసియా కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్‌ ఎడిషన్‌) చేసిన రికార్డు పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (281) పేరిట ఉండేది. రోహిత్‌ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు చేసిన అభిషేక్‌ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్‌ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్‌ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్‌ స్కోర్లు చేశాడు. మ్యాచ్‌ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్‌ (61), శుభ్‌మన్‌ గిల్‌ (4), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) ఔట్‌ కాగా.. తిలక్‌ వర్మ (27), సంజూ శాంసన్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్‌. సెప్టెంబర్‌ 28న ఫైనల్‌ జరుగుతుంది.చదవండి: వైభవ్‌ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా

EPFO ATM Withdrawals Start From January 20266
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా: ముహూర్తం ఫిక్స్!

ఈపీఎఫ్ఓ (EPFO) డబ్బును ఏటీఎం (ATM) నుంచి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు.. కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ఏడాది ప్రారంభంలోనే పేర్కొన్నారు. ఇది జూన్ నుంచి అమలులోకి రానున్నట్లు గతంలో కొన్ని వార్తలు వినిపించినప్పటికీ.. ఈ సౌకర్యం 2026 జనవరికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), వచ్చే నెల మొదటి అర్ధభాగంలో ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేపట్టే అవకాశం ఉంది. ఆ తరువాత ఏటీఎం నుంచి పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా అందుబాటులోకి వస్తుంది.చందాదారులు తమ పీఎఫ్ డబ్బును తీసుకోవడం మరింత సులభతరం చేయడంలో భాగంగానే.. ఈపీఎఫ్ఓ 3.0 కింద ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ బ్యాంకులతో పాటు ఆర్‌బీఐతో కూడా మాట్లాడినట్లు సమాచారం.ఇదీ చదవండి: డిజిటల్‌ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలుప్రస్తుతం ఈపీఎఫ్ఓ ​​కార్పస్ మొత్తం రూ. 28 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంది. మొత్తం సహకార సభ్యులు దాదాపు 78 మిలియన్లు. అత్యవసర సమయంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓలో కొంత భాగాన్ని తీసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. ఇది కొంత ఆలస్యమైనా ప్రక్రియ. ఈ ఆలస్యానికి చెక్ పెట్టడానికే ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బును తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు.

Shivadhar Reddy To Take Over As DGP Of Telangana7
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం(సెప్టెంబర్‌ 26 వ తేదీ) ఉత్తర్వులు జారీ చేసింది. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్‌ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. డీజీపీ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్‌ను కలిశారు శివధర్‌రెడ్డి. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు శివధర్‌రెడ్డి.

Story On Balakrishna Comments On Chiranjeevi8
మెగా బ్రదర్స్ ఏమయ్యారు?

ఏపీ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు రాష్ట్రంలో.. ఇంకా చెప్పాలంటే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో చర్చకు తెర లేపాయి. చిరంజీవిని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఏమాత్రం గౌరవించలేదని.. సినీ పరిశ్రమ సమస్యలను కష్టాలను వైఎస్‌ జగన్ పట్టించుకోలేదని ఇంకా ఏవేవో మాట్లాడుతూ చిరంజీవి తన స్థాయి దిగి మరి వైఎస్ జగన్ వద్ద మోకరిల్లారు అన్నట్లుగా బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి వివాదాలకు విద్వేషాలకు నిప్పు రాజేస్తుంటారు. ఈ అంశంపై నిన్ననే మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని విందుకు ఆహ్వానించి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూలకుషంగా విని వాటి పరిష్కారానికి తోడ్పాటును అందించారు అంటూ ఓ లేఖ విడుదల చేశారు. వాస్తవానికి చట్ట సభలో లేని వ్యక్తుల గురించి సభలో మాట్లాడకూడదు అన్నది నిబంధన. కానీ బాలకృష్ణ నోటి దురుసు, అహంకారంతో చిరంజీవిని మెగాస్టార్ అభిమానులు అందరిని గాయపరిచేలా నోటికి వచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నప్పటికీ చిరంజీవి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరు చట్టసభలో సభ్యులు అయినప్పటికీ ఎవరు దానిపై ఏమాత్రం స్పందించకపోవడం వారి బానిసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని కాపు సామాజిక వర్గం నుంచి ఆవేదన వెల్లువెత్తుతుంది. తన అన్నను ఎందుకు పనికిరాని వాడిగా బాలకృష్ణ కామెంట్ చేసినా... పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరూ వినీ వినట్లు ఊరుకున్నారు. వాస్తవానికి గతంలో కూడా మెగాస్టార్ అభిమానులందరినీ బాలకృష్ణ అలగా జనం అంటూ కామెంట్ చేశారు.. దీనిపై కూడా అప్పట్లో మెగా ఫ్యాన్స్ స్పందించారు తప్పితే మెగా బ్రదర్స్ ఎవరు? కనీసం తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతూ తన తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలుస్తానా అంటూ ప్రజలనే ప్రశ్నించారు. కానీ మళ్లీ అదే పార్టీతో చేతులు కలిపి ఇంకో 15 ఏళ్లపాటు తెలుగుదేశంతో పొత్తులో ఉంటాను అని ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ అసమర్థతను వ్యక్తం చేస్తుందని మెగా ఫ్యాన్స్ లోలోన ఆవేదన చెందుతున్నారు.తమ కుటుంబ పెద్ద అయినా మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలకృష్ణ చేసిన లేకి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాగబాబులను కనీసం కదిలించకపోవడం వారి దౌర్భాగ్యాన్ని సూచిస్తుందని కాపు యువతతో పాటు మెగా అభిమానులు సైతం లోలోన బాధపడుతున్నారు. ఇంత గోల జరుగుతున్న నాగబాబు కనీసం మాట్లాడకపోగా బిగ్ బాస్.. ఆట వంటి టీవీ కార్యక్రమాల గురించి కామెంట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని.. నాగబాబుకు పవన్ కళ్యాణ్‌కు ఈ పదవులు ఆటవిడుపు లాంటివి అనే భావన కలిగిస్తున్నారని ఫ్యాన్స్ లో వినిపిస్తోంది.రాజకీయంగా పదవులు వస్తే చాలు.. ప్రోటోకాల్ ఇతర సౌకర్యాలు వస్తే చాలు అనుకొని ఇద్దరు అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పెద్దన్నయ్య చిరంజీవికి చట్టసభలో బాలకృష్ణ చేసిన అవమానం గురించి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం వారి రాజకీయ అవకాశవాదానికి నిర్వచనం అన్నట్లుగా అభిమానులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు నేతలు భావిస్తున్నారు. బాలకృష్ణకు మొదటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు.. చిరంజీవి కుటుంబం అంటే చిన్న చూపు ఉన్నది. పలు సందర్భాల్లో బాలకృష్ణ తన దుగ్ధను .. అహంకారాన్ని బయటకు వెలిబుచ్చారు. ఈసారి ఏకంగా చట్టసభలోనే బాలకృష్ణ అలా మాట్లాడడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తుంది. కానీ దీనిపై మెగా కుటుంబం నుంచి కనీసం స్పందన రాకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. సిమ్మాదిరప్పన్నబాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్‌కు పవన్‌!

Hridayapoorvam Movie Telugu Reveiw9
మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)

ఓటీటీల్లోకి వచ్చే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'హృదయపూర్వం'. గత నెలలో థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా?కథేంటి?సందీప్ బాలకృష్ణన్(మోహన్ లాల్) కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఇతడికి గుండె సమస్య. ఓ రోజు పుణెలో ఉండే కర్నల్ రవీచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఈయన గుండెని వైద్యులు.. సందీప్‌కి అమర్చుతారు. తర్వాత కొన్నిరోజులకు సందీప్ దగ్గరకు వచ్చిన కర్నల్ కూతురు హరిత(మాళవిక మోహనన్).. తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్.. పుణె వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి? రెండు రోజులు అనుకున్నది కాస్త రెండు వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేం ఉండదు కానీ పరిస్థితులకు తగ్గట్ల వచ్చే సింపుల్ కామెడీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్.. ఫెర్ఫెక్ట్ మూవీ చూశాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి.సాధారణంగా అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెని హీరోకి అమర్చుతారు. చెప్పుకొంటే ఇది సీరియస్ సబ్జెక్ట్. కానీ దర్శకుడు దీన్ని ఓ అందమైన ప్రయాణంలా చూపించాలని ఫిక్సయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.కర్నల్ గుండెని సందీప్‌కి అమర్చడంతో కథ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్స్‌తో కలిసి పుణె వెళ్లడం, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం.. ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటివరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతడి తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చివరకొచ్చేసరికి ఎమోషనల్‌గా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.ప్రారంభంలో మొహమాటం, కాస్తంత అమాయకత్వం ఉన్న సందీప్... గుండె అమర్చిన తర్వాత పరిస్థితుల కారణంగా ఎలా మారుతాడు. చివరకు ధైర్యం, ముక్కుసూటితనం లాంటివి ఎలా నేర్చుకుంటాడు అనే విషయాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. మోహన్ లాల్ పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత, ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లానే అనిపిస్తారు.సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ సటిల్డ్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హరితగా మాళవిక మోహనన్ అందంగా ఉంది. జెర్రీగా సంగీత్ ప్రతాప్, సందీప్ బావగా సిద్ధిఖీ కామెడీ చేసే బాధ్యత తీసుకున్నారు. వీళ్లతో పాటు మిగతా పాత్రధారులందరూ ఏ మాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే మెలోడ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. తప్పితే ఓవరాల్‪‍‌గా మూవీ భలే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన

PM Modi Arunachal Tour  All About IAS Officer Who Welcomed him10
ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్‌ అధికారి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మ‌హిళా సివిల్ స‌ర్వీస్ అధికారి విశాఖా యాద‌వ్ (Vishakha Yadav) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ ప‌రే జిల్లాలో ప‌ర్య‌టన ఐఏఎస్‌ అధికారి విశాఖా యాద‌వ్ప్ర‌ధాని మోదీకి స్వాగ‌తం పలికిన దృశ్యాలు నెట్టింటసందడిగా మారాయి. దీంతో ఆ ఆఫీస‌ర్ ఎవ‌రు? ఏంటి? అనే ఆసక్తి మొదలైంది.అరుణాచ‌ల్‌లోని పాపుమ్ ప‌రే జిల్లాలో డిప్యూటీ క‌మీష‌న‌ర్‌గా పనిచేస్తున్నారు విశాఖా యాదవ్‌. ప్ర‌ధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోదీకి వెల్క‌మ్ చెప్ప‌డం గ‌ర్వంగా ఉందంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.ఎవరీ విశాఖా యాదవ్‌?విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేశారు.కానీ ఆమె కల IAS అధికారిణి కావడమే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించారు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించారు.UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు. 1994లో ఢిల్లీలో జన్మించిన ఆమె తండ్రి రాజ్‌కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాగా, ఆమె తల్లి గృహిణి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement