ప్రధాన వార్తలు

Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 26న జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే ఫైనల్‌కు చేరింది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు.ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్ మెండిస్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్ తొలి బంతికి ఔట్ కావడంతో సీన్ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో భారత్ శ్రీలంకపై విజయం సాధించింది.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జీవో విడుదల చేసింది. జీవో నెం.9ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది.బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. నూతన పీఆర్ చట్టానికి అసెంబ్లీ ఆమోదించిన సవరణలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఇలా అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్ సీట్లన్నీ కూడా ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా, మొత్తం సీట్లలో 50 శాతానికి తగ్గకుండా చేశారు. ఈ ఏరియాల్లోని మండల అధ్యక్షుల పదవులన్నీ కూడా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ల ఖరారును పంచాయతీరాజ్ కమిషనర్, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలను జిల్లా కలెక్టర్లు, మండలాల్లో ఎంపీటీసీ రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లను కులగణన (ఎస్ఈఈఈపీసీ) సర్వే 2024 ప్రకారం పూర్తి చేశారు.

దినకరన్ షాకింగ్ నిర్ణయం!
అసెంబ్లీ ఎన్నికలకు ఏడు నెలలే సమయం ఉండడంతో తమిళనాట రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రతిపక్ష అన్నాడీఎంకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టింది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) దాదాపు ఖరారయ్యారు. దీనికి తమిళ బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. అయితే తాను మాత్రం ఒప్పుకోనంటున్నారు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం చీఫ్ టీటీవీ దినకరన్ (TTV Dhinakaran).ఎన్డీఏ కూటమి నుంచి కొద్దిరోజుల క్రితం దినకరన్ బయటకు వెళ్లిపోయారు. ఆయనను మళ్లీ ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 21న స్వయంగా దినకరన్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. తమతో చేతులు కలపాలని కోరారు. భేటీ తర్వాత అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. ''మా భేటీలో రహస్యాలు ఏమీ లేవు. దినకరన్ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. హఠాత్తుగా బయటకు వెళ్లడంతో ఆయనను కలిసి మాట్లాడాను. ఎన్డీఏలోనే కొనసాగాల''ని కోరినట్టు వెల్లడించారు. నవంబర్ తర్వాత టీటీవీ దినకరన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.ఈపీఎస్‌ను ఓడిస్తాంఅయితే దినకరన్ మాత్రం మూడు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూటమిలోకి రానని తెగేసి చెప్పేశారు. అయితే దినకరన్ మాత్రం మూడు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూటమిలోకి రానని తెగేసి చెప్పేశారు. "నేను 2021లో కూడా ఆయనను వ్యతిరేకించాను. సీనియర్ నాయకులు నన్ను కోరినందున మాత్రమే నేను ఆయనను అంగీకరించాను. ఈసారి, మా పార్టీ ప్రత్యేకంగా ఈపీఎస్‌ను ఓడించడానికి పోరాడుతుంద"ని మీడియాతో చెప్పారాయన. తనను ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తీసుకురావడానికి మధ్యవర్తుల ద్వారా బీజేపీ ఢిల్లీ పెద్దలు చేసిన ప్రయత్నాలను తాను తిరస్కరించినట్టు వెల్లడించారు.బీజేపీకి ఎదురుదెబ్బతమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించేందుకు దృఢమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి దినకరన్ నిర్ణయం ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సన్నిహిత స్నేహితురాలు వీకే శశికళ (VK Sasikala) మేనల్లుడు దినకరన్‌కు తమిళనాడులో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. అన్నామలై చొరవతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిశారు. బీజేపీ పెద్దలు ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేయడంతో దినకరన్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దినకరన్ నిష్క్రమణ కమలనాథులకు సంకటంగా మారింది. ఆయనను ఎలాగైనా కూటమిలో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.పళనిస్వామి పంతంమరోవైపు జయలలిత (Jayalalithaa) మరణం తర్వాత అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకున్న పళనిస్వామి మాత్రం దినకరన్‌తో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం (ఓపీఎస్)ను మళ్లీ చేరదీయకూడదని భీష్మించుకుని కూర్చుకున్నారు. పార్టీని వదిలివెళ్లిన వారు, బహిష్కరణకు గురైన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ చేసిన ప్రతిపాదనపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. పార్టీ పదవుల నుంచి సెంగోట్టయన్, ఆయన మద్దతుదారులను పీకిపారేశారు. తనకు వ్యతిరేకంగా వ్యహరిస్తే చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. దీంతో పళనిస్వామిపై సెంగోట్టయన్ (Sengottaiyan) మద్దతురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు ఓపీఎస్, దినకరన్ కూడా సెంగోట్టయన్‌కు బాసటగా నిలిచారు.చదవండి: అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడులో డీఎంకేను ఓడించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. అటు చూస్తే అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు, ఇటు చూస్తే దినకరన్ నిష్క్రమణతో కాషాయ పార్టీకి కలవరం తప్పడం లేదు. అయితే దినకరన్ ఇదే మాట మీద ఉంటారా, దిగివస్తారా అనేది వేచిచూడాలి.

అదంతా అవాస్తవం.. నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ రియాక్షన్
ఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కాల్ చేశారన్న నాటో చీఫ్ మార్క్ రుటే వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. అవి పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. నాటో చీఫ్ వ్యాఖ్యలను ఖండించారు.ప్రధాని మోదీ.. పుతిన్‌తో ఆ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని.. అలాంటి సంభాషణ ఏదీ జరగలేదంటూ భారత్ స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు అంగీకార యోగ్యమైనవి కావన్న రణధీర్ జైస్వాల్.. నాటో చీఫ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా యుద్దం విషయమై పుతిన్‌తో భారత ప్రధాని మోదీ చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. ‘భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. రుటె వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.

IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. స్టార్ ఆటగాడి రికార్డు బద్దలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌పై కూడా హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్.. 6 మ్యాచ్‌ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్‌రేట్‌తో, 51.50 సగటున, 3 హాఫ్ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ మరో మ్యాచ్ (ఫైనల్) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్ ఓ ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేశాడు. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్‌లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్‌కు ముందు టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్ ఎడిషన్) చేసిన రికార్డు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (281) పేరిట ఉండేది. రోహిత్ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్ స్కోర్లు చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్ స్కోర్లు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్ (61), శుభ్‌మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12) ఔట్ కాగా.. తిలక్ వర్మ (27), సంజూ శాంసన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఇదివరకే ఫైనల్‌కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్. సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది.చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా

ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా: ముహూర్తం ఫిక్స్!
ఈపీఎఫ్ఓ (EPFO) డబ్బును ఏటీఎం (ATM) నుంచి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు.. కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ఏడాది ప్రారంభంలోనే పేర్కొన్నారు. ఇది జూన్ నుంచి అమలులోకి రానున్నట్లు గతంలో కొన్ని వార్తలు వినిపించినప్పటికీ.. ఈ సౌకర్యం 2026 జనవరికి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT), వచ్చే నెల మొదటి అర్ధభాగంలో ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేపట్టే అవకాశం ఉంది. ఆ తరువాత ఏటీఎం నుంచి పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా అందుబాటులోకి వస్తుంది.చందాదారులు తమ పీఎఫ్ డబ్బును తీసుకోవడం మరింత సులభతరం చేయడంలో భాగంగానే.. ఈపీఎఫ్ఓ 3.0 కింద ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ బ్యాంకులతో పాటు ఆర్బీఐతో కూడా మాట్లాడినట్లు సమాచారం.ఇదీ చదవండి: డిజిటల్ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలుప్రస్తుతం ఈపీఎఫ్ఓ కార్పస్ మొత్తం రూ. 28 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంది. మొత్తం సహకార సభ్యులు దాదాపు 78 మిలియన్లు. అత్యవసర సమయంలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ఓలో కొంత భాగాన్ని తీసుకోవాలంటే.. ఆన్లైన్లో అప్లై చేసి కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. ఇది కొంత ఆలస్యమైనా ప్రక్రియ. ఈ ఆలస్యానికి చెక్ పెట్టడానికే ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బును తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు.

తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం(సెప్టెంబర్ 26 వ తేదీ) ఉత్తర్వులు జారీ చేసింది. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీన తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. డీజీపీ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్‌ను కలిశారు శివధర్‌రెడ్డి. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు శివధర్‌రెడ్డి.

మెగా బ్రదర్స్ ఏమయ్యారు?
ఏపీ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు రాష్ట్రంలో.. ఇంకా చెప్పాలంటే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో చర్చకు తెర లేపాయి. చిరంజీవిని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమాత్రం గౌరవించలేదని.. సినీ పరిశ్రమ సమస్యలను కష్టాలను వైఎస్ జగన్ పట్టించుకోలేదని ఇంకా ఏవేవో మాట్లాడుతూ చిరంజీవి తన స్థాయి దిగి మరి వైఎస్ జగన్ వద్ద మోకరిల్లారు అన్నట్లుగా బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడి వివాదాలకు విద్వేషాలకు నిప్పు రాజేస్తుంటారు. ఈ అంశంపై నిన్ననే మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘమైన వివరణ ఇస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని విందుకు ఆహ్వానించి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ కూలకుషంగా విని వాటి పరిష్కారానికి తోడ్పాటును అందించారు అంటూ ఓ లేఖ విడుదల చేశారు. వాస్తవానికి చట్ట సభలో లేని వ్యక్తుల గురించి సభలో మాట్లాడకూడదు అన్నది నిబంధన. కానీ బాలకృష్ణ నోటి దురుసు, అహంకారంతో చిరంజీవిని మెగాస్టార్ అభిమానులు అందరిని గాయపరిచేలా నోటికి వచ్చినట్లు మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ అంశంపై మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియాలో అక్కడక్కడ పోస్టులు పెడుతున్నప్పటికీ చిరంజీవి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరు చట్టసభలో సభ్యులు అయినప్పటికీ ఎవరు దానిపై ఏమాత్రం స్పందించకపోవడం వారి బానిసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని కాపు సామాజిక వర్గం నుంచి ఆవేదన వెల్లువెత్తుతుంది. తన అన్నను ఎందుకు పనికిరాని వాడిగా బాలకృష్ణ కామెంట్ చేసినా... పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు ఇద్దరూ వినీ వినట్లు ఊరుకున్నారు. వాస్తవానికి గతంలో కూడా మెగాస్టార్ అభిమానులందరినీ బాలకృష్ణ అలగా జనం అంటూ కామెంట్ చేశారు.. దీనిపై కూడా అప్పట్లో మెగా ఫ్యాన్స్ స్పందించారు తప్పితే మెగా బ్రదర్స్ ఎవరు? కనీసం తమ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ సభల్లో మాట్లాడుతూ తన తల్లిని దూషించిన తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలుస్తానా అంటూ ప్రజలనే ప్రశ్నించారు. కానీ మళ్లీ అదే పార్టీతో చేతులు కలిపి ఇంకో 15 ఏళ్లపాటు తెలుగుదేశంతో పొత్తులో ఉంటాను అని ప్రకటన చేయడం పవన్ కళ్యాణ్ అసమర్థతను వ్యక్తం చేస్తుందని మెగా ఫ్యాన్స్ లోలోన ఆవేదన చెందుతున్నారు.తమ కుటుంబ పెద్ద అయినా మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలకృష్ణ చేసిన లేకి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ నాగబాబులను కనీసం కదిలించకపోవడం వారి దౌర్భాగ్యాన్ని సూచిస్తుందని కాపు యువతతో పాటు మెగా అభిమానులు సైతం లోలోన బాధపడుతున్నారు. ఇంత గోల జరుగుతున్న నాగబాబు కనీసం మాట్లాడకపోగా బిగ్ బాస్.. ఆట వంటి టీవీ కార్యక్రమాల గురించి కామెంట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని.. నాగబాబుకు పవన్ కళ్యాణ్‌కు ఈ పదవులు ఆటవిడుపు లాంటివి అనే భావన కలిగిస్తున్నారని ఫ్యాన్స్ లో వినిపిస్తోంది.రాజకీయంగా పదవులు వస్తే చాలు.. ప్రోటోకాల్ ఇతర సౌకర్యాలు వస్తే చాలు అనుకొని ఇద్దరు అన్నదమ్ములు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప పెద్దన్నయ్య చిరంజీవికి చట్టసభలో బాలకృష్ణ చేసిన అవమానం గురించి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం వారి రాజకీయ అవకాశవాదానికి నిర్వచనం అన్నట్లుగా అభిమానులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు నేతలు భావిస్తున్నారు. బాలకృష్ణకు మొదటి నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు.. చిరంజీవి కుటుంబం అంటే చిన్న చూపు ఉన్నది. పలు సందర్భాల్లో బాలకృష్ణ తన దుగ్ధను .. అహంకారాన్ని బయటకు వెలిబుచ్చారు. ఈసారి ఏకంగా చట్టసభలోనే బాలకృష్ణ అలా మాట్లాడడం మెగా అభిమానులను తీవ్రంగా కలిసి వేస్తుంది. కానీ దీనిపై మెగా కుటుంబం నుంచి కనీసం స్పందన రాకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. సిమ్మాదిరప్పన్నబాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్‌కు పవన్!

మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీల్లోకి వచ్చే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీస్ కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'హృదయపూర్వం'. గత నెలలో థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? చూడొచ్చా లేదా?కథేంటి?సందీప్ బాలకృష్ణన్(మోహన్ లాల్) కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఇతడికి గుండె సమస్య. ఓ రోజు పుణెలో ఉండే కర్నల్ రవీచంద్రన్ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో ఈయన గుండెని వైద్యులు.. సందీప్‌కి అమర్చుతారు. తర్వాత కొన్నిరోజులకు సందీప్ దగ్గరకు వచ్చిన కర్నల్ కూతురు హరిత(మాళవిక మోహనన్).. తన నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తుంది. అలా సందీప్.. పుణె వెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఎదురైన పరిస్థితులు ఏంటి? రెండు రోజులు అనుకున్నది కాస్త రెండు వారాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పుడొస్తున్న చాలా సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఈ చిత్రం ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. చెప్పుకోవాలంటే ఇందులో పెద్దగా కథేం ఉండదు కానీ పరిస్థితులకు తగ్గట్ల వచ్చే సింపుల్ కామెడీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్.. ఫెర్ఫెక్ట్ మూవీ చూశాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి.సాధారణంగా అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే మాటని అప్పుడప్పుడు వింటుంటాం. అలా ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి గుండెని హీరోకి అమర్చుతారు. చెప్పుకొంటే ఇది సీరియస్ సబ్జెక్ట్. కానీ దర్శకుడు దీన్ని ఓ అందమైన ప్రయాణంలా చూపించాలని ఫిక్సయ్యాడు. ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు.కర్నల్ గుండెని సందీప్‌కి అమర్చడంతో కథ నేరుగా మొదలవుతుంది. తర్వాత సందీప్ చుట్టూ ఉండే ప్రపంచాన్ని చూపిస్తారు. అనంతరం జెర్రీ అనే నర్స్‌తో కలిసి పుణె వెళ్లడం, అనుకోని పరిస్థితుల్లో హరిత నిశ్చితార్థం ఆగిపోవడం.. ఇలా స్టోరీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పటివరకు కామెడీగా వెళ్తున్నది కాస్త రొమాంటిక్ టర్న్ తీసుకుంటుంది. హరిత, అతడి తల్లి చూపించే కేరింగ్ హీరోకి మరోలా అర్థం కావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చివరకొచ్చేసరికి ఎమోషనల్‌గా ముగించిన తీరు ఆకట్టుకుంటుంది.ప్రారంభంలో మొహమాటం, కాస్తంత అమాయకత్వం ఉన్న సందీప్... గుండె అమర్చిన తర్వాత పరిస్థితుల కారణంగా ఎలా మారుతాడు. చివరకు ధైర్యం, ముక్కుసూటితనం లాంటివి ఎలా నేర్చుకుంటాడు అనే విషయాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇందులో హీరో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. మోహన్ లాల్ పాత్ర అతి సామాన్యంగా ఉంటుంది. హరిత, ఆమె తల్లి పాత్రలు కూడా మన చుట్టూ మనుషుల్లానే అనిపిస్తారు.సందీప్ బాలకృష్ణన్ పాత్రని మోహన్ లాల్ సటిల్డ్‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హరితగా మాళవిక మోహనన్ అందంగా ఉంది. జెర్రీగా సంగీత్ ప్రతాప్, సందీప్ బావగా సిద్ధిఖీ కామెడీ చేసే బాధ్యత తీసుకున్నారు. వీళ్లతో పాటు మిగతా పాత్రధారులందరూ ఏ మాత్రం అతి చేయకుండా చాలా సహజంగా నటించారు. చూస్తున్నంతసేపు ఓ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రానంత సహజంగా అనిపిస్తుంది. పాటలు, సెకండాఫ్‌లో వచ్చే మెలోడ్రామా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. తప్పితే ఓవరాల్‌గా మూవీ భలే అనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన

ప్రధాని మోదీకి సాదర స్వాగతం : ఎవరీ ఐఏఎస్ అధికారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సివిల్ సర్వీస్ అధికారి విశాఖా యాదవ్ (Vishakha Yadav) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాలో పర్యటన ఐఏఎస్ అధికారి విశాఖా యాదవ్ప్రధాని మోదీకి స్వాగతం పలికిన దృశ్యాలు నెట్టింటసందడిగా మారాయి. దీంతో ఆ ఆఫీసర్ ఎవరు? ఏంటి? అనే ఆసక్తి మొదలైంది.అరుణాచల్‌లోని పాపుమ్ పరే జిల్లాలో డిప్యూటీ కమీషనర్‌గా పనిచేస్తున్నారు విశాఖా యాదవ్. ప్రధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోదీకి వెల్కమ్ చెప్పడం గర్వంగా ఉందంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.ఎవరీ విశాఖా యాదవ్?విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేశారు.కానీ ఆమె కల IAS అధికారిణి కావడమే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించారు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించారు.UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు. 1994లో ఢిల్లీలో జన్మించిన ఆమె తండ్రి రాజ్‌కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ కాగా, ఆమె తల్లి గృహిణి.
ఒకే జట్టులో అర్జున్, గుకేశ్ ,హంపి, హారిక
క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందా: బోల్ట్
సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య
భారత్ ‘సూపర్’ విజయం
సాక్షి కార్టూన్ 27-09-2025
పర్యాటకం.. పెట్టుబడులు.. ఉపాధి
అసాధారణ ప్రయోగం
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎలా?
మా ప్రపంచం వేరు
మిషన్ మేకోవర్
They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ
స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి
బాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్‌కు పవన్!
పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్!
బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో లొల్లి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలలో పురోగతి
బలవంతంగా ఆర్మీకి.. మాతో కలిసి భోజనం కూడా చేయడు: పవన్ పేరెంట్స్
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
గాజాలో యుద్ధం ఆపితేనే ట్రంప్‌నకు నోబెల్ - ఫ్రాన్స్
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?
బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్!
ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు
బీహార్‌పై కేంద్రం వరాలు కురిపిస్తోంది సార్.. మనకూ ఎన్నికలుంటే బాగుండు!
ఆసియా కప్-2025: ఇది కరెక్ట్ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన
వాట్సాప్‌లో ఆధార్ డౌన్లోడ్.. ఈజీగా చేసుకోండిలా..
OG మూవీలో హీరోయిన్‌కు అన్యాయం
మహేశ్‌బాబు సినిమాలో..?
తెలుగు డైరెక్టర్ సినిమా.. నాలుగేళ్ల చిన్నారికి జాతీయ అవార్డ్
IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
ఒకే జట్టులో అర్జున్, గుకేశ్ ,హంపి, హారిక
క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందా: బోల్ట్
సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య
భారత్ ‘సూపర్’ విజయం
సాక్షి కార్టూన్ 27-09-2025
పర్యాటకం.. పెట్టుబడులు.. ఉపాధి
అసాధారణ ప్రయోగం
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎలా?
మా ప్రపంచం వేరు
మిషన్ మేకోవర్
They Call Him OG Review: ‘ఓజీ’ మూవీ రివ్యూ
స్టార్ హీరో ఇల్లు వేలం.. రోడ్డు మీదకు సతీమణి
బాలయ్య వ్యాఖ్యల వేళ.. హైదరాబాద్‌కు పవన్!
పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్!
బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో లొల్లి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలలో పురోగతి
బలవంతంగా ఆర్మీకి.. మాతో కలిసి భోజనం కూడా చేయడు: పవన్ పేరెంట్స్
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
గాజాలో యుద్ధం ఆపితేనే ట్రంప్‌నకు నోబెల్ - ఫ్రాన్స్
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?
బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్!
ఫ్రైడే ధమాకా: ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు
బీహార్‌పై కేంద్రం వరాలు కురిపిస్తోంది సార్.. మనకూ ఎన్నికలుంటే బాగుండు!
ఆసియా కప్-2025: ఇది కరెక్ట్ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన
వాట్సాప్‌లో ఆధార్ డౌన్లోడ్.. ఈజీగా చేసుకోండిలా..
OG మూవీలో హీరోయిన్‌కు అన్యాయం
మహేశ్‌బాబు సినిమాలో..?
తెలుగు డైరెక్టర్ సినిమా.. నాలుగేళ్ల చిన్నారికి జాతీయ అవార్డ్
IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
సినిమా

హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి మరోసారి షాక్!
తెలంగాణలో హైకోర్టులో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రాకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టికెట్ల పెంపుకు అంగీకరించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నెల 24న ఓజీ మూవీ టికెట్ ధరల పెంపు మొమోని హైకోర్టు సింగిల్ జడ్జి సస్పెండ్ చేసిని సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.‘ఓజీ’ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. టికెట్ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.కాగా, తెలంగాణలో ఓజీ సినిమా టికెట్ల పెంపుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న రాత్రి వేసిన ప్రీమియర్ టికెట్ ధరను రూ. 800గా నిర్ణయించారు. అక్టోబరు 4వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానం ఆదేశాలతో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.

అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?
అల్లు ఫ్యామిలీలో రాబోయే కొన్ని నెలల్లో పెళ్లి జరగబోతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. బన్నీ సోదరుడు శిరీష్.. ప్రస్తుతం కొత్తగా సినిమాలేం చేయట్లేదు. చివరగా గతేడాది 'బడ్డీ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తర్వాత నుంచి అటు ఇండస్ట్రీలో గానీ ఇటు సోషల్ మీడియాలో గానీ పెద్దగా యాక్టివ్‌గా లేడు. అలాంటిది ఇప్పుడు ఇతడు త్వరలో వివాహం చేసుకోనున్నాడని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))హైదరాబాద్‌కి చెందిన ఓ బిజినెస్‌మ్యాన్ కుమార్తెతో శిరీష్‌కి పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారని.. ఇంతలో అల్లు అరవింద్ తల్లి కనకరత్నం చనిపోవడంతో ఇది కాస్త వాయిదా పడిందని వినిపిస్తుంది. వెంటనే కానప్పటికీ రాబోయే కొన్ని నెలల్లో అల్లు ఫ్యామిలీ నుంచి శుభవార్త అయితే రానుందనే టాక్ వినిపిస్తుంది.మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. తండ్రులు కూడా అయిపోయారు. నిహారిక వివాహం చేసుకుంది కానీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నారు. వీళ్లలో ఇప్పుడు శిరీష్.. పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 11 ఏళ్లలో మూడే సినిమాలు.. అసలు ఎవరీ సుజిత్?)

'బాహుబలి' యూనివర్స్ నుంచి కొత్త సినిమా!
'బాహుబలి'.. టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే పాన్ ఇండియా అనే సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్, సీక్వెల్స్ అని ఎగబడుతున్నారంటే దానికి ఓ రకంగా ఈ మూవీనే కారణమని చెప్పొచ్చు. అయితే ఈ చిత్ర రెండు భాగాల్ని ఒక్కటిగా చేసి 'బాహుబలి: ద ఎపిక్' పేరుతో అక్టోబరు 31న రీ రిలీజ్ చేయనున్నారు. దీనికి కూడా ప్రమోషన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. సరే ఇవన్నీ పక్కనబెడితే 'బాహుబలి' యూనివర్స్ నుంచి ఓ కొత్త సినిమా రాబోతుందనే న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది.రాజమౌళి తండ్రి, 'బాహుబలి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం కట్టప్ప పాత్ర బ్యాక్ స్టోరీ స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. అసలు కట్టప్ప ఎవరు? మాహిష్మతి సామ్రాజ్యానికి అతడు కట్టు బానిసగా ఎందుకు మారాల్సి వచ్చింది? అసలు కట్టప్ప వంశం ఏంటి? అనే అంశాల చుట్టూ కథ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం చేస్తారా? లేదంటే వేరే ఎవరైనా వస్తారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడా?)ప్రస్తుతానికైతే ప్రీ విజువలైజేషన్ వర్క్ మొదలైందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన రానుందనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇదంతా నిజమేనా? లేదంటే 'బాహుబలి' రీ రిలీజ్లో భాగంగా ఈ రూమర్స్ వస్తున్నాయా అనేది చూడాలి? ఒకవేళ నిజమైతే మాత్రం దాన్ని ఏ మేరకు ఆసక్తికరంగా తెరకెక్కిస్తారా అనేది సస్పెన్స్.రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ మూవీ చేస్తున్నారు. అడ్వెంచర్ జానర్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా అడవుల్లో షూటింగ్ చేశారు. కొన్నాళ్ల క్రితం కెన్యా కూడా వెళ్లొచ్చారు. 'బాహుబలి' రీ రిలీజ్ తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))

జాన్వీ సొగసులు.. సమంత వెరైటీ లుక్
జాన్వీ కపూర్ సొగసు చూడతరమాపాత కాలం ఇంగ్లీష్ హీరోయిన్లా సమంతచెల్లితో బీచ్ ట్రిప్.. వీడియోతో సాయిపల్లవిబ్లాక్ మోడ్రన్ డ్రస్సులో రష్మిక ఇలాఅమెరికాలో అనన్య బతుకమ్మ సెలబ్రేషన్స్ఎర్ర చీరలో మెరిసిపోతున్న శ్రద్ధా కపూర్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)
న్యూస్ పాడ్‌కాస్ట్

మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతాం... పార్టీ శ్రేణులకు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా

హైకోర్టుకు ఆదేశాలు బేఖాతర్... ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కార్యకర్త సవేంద్రరెడ్డి అక్రమ నిర్బంధం, ఆపై అక్రమ కేసు

ఏపీ శాసనమండలిలో కొనసాగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు

నేటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి... 375 రకాల ఉత్పత్తులపై తగ్గనున్న ధరలు

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతిపై దుష్ప్రచారం... సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం

ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన

ప్రజల గొంతు వినిపించకూడదని వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు... చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

భారత్ ఎవరికీ తల వంచదు... పాకిస్తాన్ కోరితేనే కాల్పులు ఆపేశాం... హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ

సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో మెరిట్‌ను ఎలా విస్మరిస్తారు?
క్రీడలు

Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 26న జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే ఫైనల్‌కు చేరింది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు.ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్ మెండిస్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్ తొలి బంతికి ఔట్ కావడంతో సీన్ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో భారత్ శ్రీలంకపై విజయం సాధించింది.

IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. స్టార్ ఆటగాడి రికార్డు బద్దలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్‌పై కూడా హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్.. 6 మ్యాచ్‌ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్‌రేట్‌తో, 51.50 సగటున, 3 హాఫ్ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ మరో మ్యాచ్ (ఫైనల్) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్ ఓ ఆల్‌టైమ్ రికార్డును సెట్ చేశాడు. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్‌లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్‌కు ముందు టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్ ఎడిషన్) చేసిన రికార్డు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (281) పేరిట ఉండేది. రోహిత్ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్ స్కోర్లు చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్‌ల్లో 30 ప్లస్ స్కోర్లు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్ (61), శుభ్‌మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12) ఔట్ కాగా.. తిలక్ వర్మ (27), సంజూ శాంసన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఇదివరకే ఫైనల్‌కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్. సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది.చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా

కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్.. జైస్వాల్, శ్రేయస్‌కు నో ప్లేస్
2025-26 రంజీ సీజన్ (Ranji Trophy) కోసం 24 మంది ఆటగాళ్లతో కూడిన ముంబై ప్రాబబుల్స్ (Mumbai Ranji Team) జాబితాను ఇవాళ (సెప్టెంబర్ 26) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఎంపికయ్యాడు. అజింక్య రహానే (Ajinkya Rahane) స్థానాన్ని శార్దూల్ ఠాకూర్ భర్తీ చేయనున్నాడు. రహానే ఈ ఏడాది ఆరంభంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. రహానే ప్రస్తుతం ప్రకటించిన జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగనున్నాడు.ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్‌కు (Yashasvi Jaiswal) చోటు దక్కలేదు. శ్రేయస్ కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఇటీవలే బీసీసీఐకి తెలిపాడు. అందుకే అతన్ని ఎంపిక చేయలేదు. జైస్వాల్ విషయానికొస్తే.. అతను ఇటీవల ముంబై నుంచి గోవాకు మారాలని అనుకున్నాడు. ఆతర్వాత యూటర్న్ తీసుకున్నా ముంబై సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.ఈ జట్టులో అన్నదమ్ములు ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan0 చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2024–25 సీజన్ సెమీఫైనల్లో విదర్భ చేతిలో ఓడిన ముంబై.. ఈసారి బలమైన స్క్వాడ్‌తో బరిలోకి దిగనుంది.ముంబై ప్రాబబుల్స్ జాబితా: శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, ముషీర్ ఖాన్, అంగ్క్రిష్ రఘువంశీ, అఖిల్ హెర్వడ్కర్, అజింక్య రహానే, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేశ్ లాడ్, సువేద్ పార్కర్, సూర్యాంశ్ షెడ్జ్, ఆకాష్ పార్కర్, తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్, రాయ్స్టన్ డయాస్, ప్రతిక్ మిశ్రా, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోరే (వికెట్ కీపర్), ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), షామ్స్ ములాని, తనుష్ కోటియన్, హిమాంశు సింగ్, అథర్వ అంకోలేకర్, ఇషాన్ ముల్చందాని.చదవండి: Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు

Asia cup 2025: శ్రీలంకపై టీమిండియా గెలుపు
శ్రీలంకపై టీమిండియా గెలుపుశ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది.స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో తేలనున్న ఫలితంభారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. శ్రీలంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న శ్రీలంకశ్రీలంక టీమిండియాకు షాకిచ్చే దిశగా సాగుతోంది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 15 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టు 30 బంతుల్లో మరో 46 పరుగులు చేస్తే టీమిండియాపై సంచలన విజయం సాధిస్తుంది. నిస్సంక (93), అసలంక (5) క్రీజ్‌లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక12.2వ ఓవర్-వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కుసాల్ పెరీరా (58) స్టంపౌటయ్యాడు. దుమ్మురేపుతున్న నిస్సంక, పెరీరా.. లక్ష్యం దిశగా సాగుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు పథుమ్ నిస్సంక, కుసాల్ పెరీరా దుమ్మురేపుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శ్రీలంకను లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. పెరీరా 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 52.. నిస్సంక 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 114/1గా ఉంది. ఈ మ్యాచ్‌లో లంక గెలవాలంటే 60 బంతుల్లో 89 పరుగులు చేయాలి.భారీ లక్ష్య ఛేదన.. ధాటిగా ఆడుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ధాటిగా ఆడుతుంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా (కుసాల్ మెండిస్ డకౌట్).. పథుమ్ నిస్సంక (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుసాల్ పెరీరా (9 బంతుల్లో 14; 2 ఫోర్లు) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా శ్రీలంక 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అభిషేక్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.భారీ స్కోర్ దిశగా టీమిండియాటీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 179/5గా ఉంది. తిలక్ వర్మ (42), అక్షర్ పటేల్ (9) క్రీజ్‌లో ఉన్నారు. నిరాశపరిచిన హార్దిక్16.1వ ఓవర్- హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.3వ ఓవర్- 39 పరుగులు చేసి సంజూ శాంసన్ ఔటయ్యాడు. షనక బౌలింగ్‌లో అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (61) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 94/3గా ఉంది. తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (1) క్రీజ్‌లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా6.5వ ఓవర్- హసరంగ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్‌తో పాటు తిలక్ వర్మ (1) క్రీజ్‌లో ఉన్నాడు.వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ప్రస్తుత ఆసియా కప్‌లో అభిషేక్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 71/1గా ఉంది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్‌లో ఉన్నాడు.దుమ్మురేపుతున్న అభిషేక్ శర్మఆసియా కప్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకాండ కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లోనూ అతను దుమ్మురేపుతున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 59/1గా ఉంది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్‌లో ఉన్నాడు.టీమిండియాకు ఆదిలోనే షాక్1.3వ ఓవర్- టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. తీక్షణ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (4) ఔటయ్యాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బుమ్రా, శివమ్ దూబే స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక ఓ మార్పు చేసింది. చమిక కరుణరత్నే స్థానంలో లియనాగే జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇదివరకే ఫైనల్ బెర్త్‌లు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. ఆదివారం జరుగబోయే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), కుసల్ పెరెరా, చరిత్ అసలంక (c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, జనిత్ లియనాగే, దుష్మంత చమీర, మహీశ తీక్షణ, నువాన్ తుషార
బిజినెస్

స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగిన ఇన్వెస్టర్లు..
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్లను అధిగమించింది. గత 8 నెలల్లోనే కోటిమంది జత కలిసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. కాగా.. ప్రతీ నలుగురిలో ఒకరు మహిళా ఇన్వెస్టర్ అని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్లను దాటింది.నిజానికి ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభమైన 14ఏళ్ల తదుపరి ఇన్వెస్టర్ల సంఖ్య కోటికి చేరింది. తదుపరి కోటిమంది ఏడేళ్లలో జత కలవగా.. ఆపై మూడున్నరేళ్లలోనే ఈ సంఖ్యకు మరో కోటి జమయ్యింది. ఈ బాటలో ఆపై.. ఏడాదికి అటూఇటుగా మరో కోటిమంది జత కలిసినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. వెరసి ఎన్ఎస్ఈ ఆవిర్భవించిన 25ఏళ్లకు అంటే 2021 మార్చికల్లా ఇన్వెస్టర్ల (Stock market investors) సంఖ్య 4 కోట్ల మైలురాయిని తాకింది. ఆపై వేగం పెరిగి 6–7 నెలల్లోనే మరో కోటి మంది ఇన్వెస్టర్లు తోడయ్యారు.ఈ స్పీడుకు ప్రధానంగా డిజిటైజేషన్, ఫిన్‌టెక్ సేవల అందుబాటు, మధ్యతరగతి పెరగడం, ప్రభుత్వ పాలసీల మద్దతు సహకరించాయి. 2025 సెపె్టంబర్ 23కల్లా ఎన్ఎస్ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల సంఖ్య 23.5 కోట్లకు చేరింది. అన్ని రకాల క్లయింట్ రిజిస్ట్రేషన్లతో కలిపి ఈ సంఖ్యకాగా.. క్లయింట్లు ఒక సభ్యునికంటే అధికంగా కూడా రిజిస్టరయ్యేందుకు వీలుంది.రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లలో 12 కోట్లమంది సగటు వయసు 33 ఏళ్లుకాగా.. 1.9 కోట్లమంది ఇన్వెస్టర్లతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలుస్తోంది. 1.4 కోట్లమంది రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లరీత్యా ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకును పొందగా, 1.03 కోట్లతో గుజరాత్ తదుపరి స్థానాన్ని ఆక్రమించింది.

జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్: 310 మందికే ఈ బైక్!
బీఎండబ్ల్యూ మోటోరాడ్.. ఇండియన్ మార్కెట్లో తన జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ (BMW G 310 RR Limited Edition) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర స్టాండర్డ్ జీ 310 ఆర్ఆర్ కంటే కూడా రూ. 18000 తక్కువ. దీనిని 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే.. ఈ బైకును 310 మంది కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు.భారతదేశంలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ 1000 యూనిట్లు అమ్ముడైన సందర్భంగా.. కంపెనీ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. ఫ్యూయెల్ ట్యాంక్ మీద 1/310 బ్యాడ్జ్ ఉండటం చూడవచ్చు. ఇది రెండు బేస్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది.బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ 312 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9700 rpm వద్ద 34 bhp పవర్, 7700 rpm వద్ద 27.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. రైడ్-బై-వైర్ త్రాటిల్, రైడింగ్ మోడ్స్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కలర్ TFT డిస్ప్లే వంటివన్నీ ఈ బైకులో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్లు క్రాష్.. సూచీల భారీ పతనం
రిటైల్ పెట్టుబడిదారులలో భయాందోళనల అమ్మకం, విదేశీ పెట్టుబడిదారుల విపరీత ఆఫ్ లోడ్లతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అక్టోబర్ 1 నుండి తమ దేశంలోకి ప్రవేశించే "ఏదైనా బ్రాండెడ్ లేదా పేటెంట్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి" పై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో దలాల్ స్ట్రీట్ ‘బేరు’మన్నది.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఈరోజు 733 పాయింట్లు లేదా 0.9 శాతం క్షీణించి 80,426.5 వద్ద ముగిసింది. ఇది ఇంట్రాడే ట్రేడ్ లో 80,332 కనిష్టాన్ని తాకింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 236 పాయింట్లు లేదా 0.95 శాతం క్షీణించి 24,655 వద్ద ముగిసింది. ఇది 24,629 వద్ద పడిపోయింది. దీంతో, ఈ బెంచ్ మార్క్ ఏడు వారాలలో అత్యంత చెత్త వారపు క్షీణతను నమోదు చేసింది.ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, టెక్ ఎం, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, బీఈఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 1 శాతం నుంచి 3.6 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ మాత్రమే లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.05 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.3 శాతం, నిఫ్టీ ఫార్మా 2.2 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం నష్టపోయాయి.

జీఎస్టీ క్రమబద్ధీకరణతో విజయం చేకూరిందా?
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) హేతుబద్ధీకరణపై కొందరిలో ఆందోళనలు నెలకొంటుంటే, ఇంకొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచకుండా ఇటువంటి క్రమబద్ధీకరణకు పూనుకొని ఒకింత ప్రజల మన్ననలు పొందడంపై ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి.గందరగోళం నుంచి స్థిరత్వం వైపు..2017లో ప్రారంభించిన జీఎస్టీలో ప్రాథమికంగా సాంకేతిక లోపాలు, గందరగోళం, రాజకీయ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు చెల్లించే పరిహారంపై తీవ్ర దుమారమే రేగింది. కేంద్రం రాష్ట్రాల పన్ను వాటాను హరిస్తుందనే వాదనలొచ్చాయి. కానీ కాలక్రమేణా జీఎస్టీ వ్యవస్థ బలపడుతూ వారిని కట్టడి చేయగలిగింది. తాజాగా జీఎస్టీ నిర్మాణంపై కీలక సూచికలు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. ఏటా నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2018లో 1 కోటి(యాక్టివ్ రిజిస్ట్రేషన్స్) నుంచి 2025 నాటికి 1.5 కోట్లకు విస్తరించింది. ఈ-ఇన్వాయిసింగ్, ఈ-వే బిల్లులు, డిజిటల్ రిటర్న్ ఫైలింగ్స్.. వంటి వ్యవస్థల ద్వారా మద్దతు లభించింది.గృహ వినియోగదారులకు ఉపశమనంజీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణతో విస్తృతంగా వినియోగించే వస్తువులు, అవసరమైన సేవలపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తద్వారా గృహాలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగిస్తుంది. గృహ వినియోగ వ్యయ సర్వే అంచనాల ప్రకారం.. టాప్ 30 గృహ వినియోగ వస్తువులపై సాధారణ సగటు జీఎస్టీ రేటు 11% నుంచి 9%కి పడిపోయింది. ముఖ్యంగా పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. అదే సమయంలో లగ్జరీ వస్తువులు, సిన్‌గూడ్స్, ప్రీమియం ఉత్పత్తులు ఉపయోగించే వర్గాలకు అధిక జీఎస్టీ రేట్లను విధించింది.ఆదాయ నష్టం..రేట్ల తగ్గింపు ఆదాయ నష్టానికి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే గృహాలు, నిత్యావసరాలపై తక్కువ పన్ను ఉండడంతో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధిక వాల్యూమ్‌లు క్రియేట్ అవుతుండడంతో ద్రవ్యోల్బణం కూడా సానుకూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారీగా వినియోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా రిటైల్ ధరల సూచిక సానుకూలంగా స్పందిస్తుందనే అభిప్రాయలున్నాయి.అయినా కొందరు..ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయం మెజారిటీ వర్గానికి మేలు చేసేదైనప్పటికీ కొన్నిచోట్ల రిటైలర్లు, దుకాణాదారులు ఇంకా కొత్త రేట్లను వినియోగదారులకు అందించడం లేదు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు జీఎస్టీపై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థను పటిష్టపరచాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..!
ఫ్యామిలీ

ఇలా చేస్తే... ఉద్యోగం మీదే!
జాబ్ మార్కెట్లో విపరీతంగాపోటీ ఉండడం వల్ల ఉద్యోగం రావడం అంతా ఆషామాషీ విషయం కాదు. కాని కొందరికి మాత్రం ఇట్టే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారిలో షారన్ మెల్జర్ (Sharon Melzer) ఒకరు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఉద్యోగాన్ని సొంతం చేసుకొని ‘వావ్’ అనిపించింది. తన విజయరహస్యం (success secret) గురించి ‘లింక్డ్ ఇన్’లో పంచుకుంది.‘ఒక ఉద్యోగానికి మనం దరఖాస్తు చేసుకున్నామంటే ఈ ఉద్యోగం (Job) కచ్చితంగా నాదే’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటుంది షారన్ మెల్జర్.ఒక సోషల్ మీడియాలో కమ్యూనిటీ మేనేజర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకుంది షారన్. దరఖాస్తు చేసుకున్న వారిని కొత్త ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్‌కు సంబంధించి కంటెంట్ స్ట్రాటజీని సబ్మిట్ చేయాల్సిందిగా కంపెనీ అడిగింది. చాలామంది బేసిక్ డాక్యుమెంట్‌ను సమర్పించారు. షారన్ మాత్రం రెండు అడుగులు ముందు వేసింది. అత్యంత వివరంగా, సృజనాత్మకంగా కంటెంట్ ప్లాన్ తయారుచేసింది. తన ఐడియాలకు సంబంధించి వీడియో ప్రెజెంటేషన్‌ను రూ పొందించింది. మిగిలిన రెజ్యూమ్‌లతో పోల్చితే షారన్ రెజ్యూమ్ ప్రత్యేకంగా కనిపించింది. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేసింది. ‘ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది ఎప్పుడూ మంచిదే’ అంటుంది షారన్.చదవండి: ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ

చేనేతపై పెనుభారమే!
మన దేశంలో చేనేత పరిశ్రమ అత్యంత పురాతనమైన వృత్తి. దీనిని దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తిస్తారు. వ్యవసాయరంగం తరువాత దేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆధార పడ్డ రంగం చేనేత రంగం. కానీ ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా చేనేత, టెక్స్టైల్ రంగంపై ఏకంగా 18 శాతం జీఎస్టీని విధించడంతో ఆ రంగంపై పెను భారం పడనుంది. రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలపై 5 శాతం, ఆ ధర కంటే ఎక్కువ ధర ఉండే చేనేత వస్త్రాలపై 12 శాతం జీఎస్టీని ఇప్పటివరకు విధించారు. నూతన జీఎస్టీలో భాగంగా 2,500 రూపాయల కంటే తక్కువ ధర ఉండే వస్త్రాలపై 5 శాతం, 2,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే చేనేత, ఇతర వస్త్రాలపై ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు. గత కొన్నేళ్లుగా మార్కెట్లో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా వస్త్రాల ధరలు పెరిగి 5 శాతం స్లాబ్ నుండి 12 శాతం స్లాబ్‌లోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ లేకుండా పోతోంది. చదవండి: ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ఫలితంగా ఆదాయం కోల్పోయి చాలా కుటుంబాలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులను ఎంచు కుంటున్నాయి. ఇప్పుడు జీఎస్టీని కొన్ని దుస్తులకు పెంచడంతో రానున్న రోజుల్లో చేనేత పరిశ్రమ మరింత నష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు దేశంలో పేరొందిన పోచంపల్లి, కంచి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ చేనేత వస్త్రాలు కేవలం రూ. 2,500 లోపే మార్కెట్లో దొరుకుతాయా? ఎటు వంటి శారీరక శ్రమతో పనిలేకుండా కృత్రిమ దారాలతో, యంత్రాల సహాయంతో తయారు చేసే పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం నుండి5 శాతానికి తగ్గించడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ వస్త్రాలు తక్కువధర లకు లభించడంతో వినియోగదారులు వాటిపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా చేనేత పరిశ్రమకు మరింత నష్టాలు వచ్చే అవకాశంఉంది. నిజానికి చేనేత వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు కావు. అవి భార తీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులపై జీఎస్టీని తీసివేయాలి.లేదా ధరల సీలింగ్ లిమిట్‌ను హేతుబద్ధీకరించాలి. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’, స్వదేశంలోనే ప్రతి వస్తువును తయారు చేయాలంటూ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటున్న కేంద్ర ప్రభుత్వం... స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంపై పునఃసమీక్ష చేయాలి.ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ– డా.రామకృష్ణ బండారుకామర్స్ అధ్యాపకులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ

డ్రగ్స్ రహిత దేశం కోసం సైక్లింగ్..
ధ్యానంపై అవగాహన కల్పించడంతో పాటు భారత ప్రభుత్వ ‘నాషా ముక్త్ భారత్ అభియాన్’కు మద్దతు ఇవ్వడంలో భాగంగా సైక్లింగ్ ప్రయాణం చేపట్టిన తరుణ్ పర్మార్ నేడు హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీషనర్ తరుణ్ పర్మార్ సెపె్టంబర్ 13న నోయిడా నుంచి మొదలు పెట్టిన ఈ సైక్లింగ్ 7 రాష్ట్రాలు, ప్రముఖ నగరాల్లో అవగాహన కల్పిస్తూ రోజుకు దాదాపు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా నేడు హైదరాబాద్‌కు చేరుకుని రేపు నగరంలోని కన్హా శాంతి వనం – హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వేదికగా తన సైక్లింగ్ ప్రయాణాన్ని ముగించనున్నారు. తరుణ్ పర్మార్ ఈ అవగాహన సైక్లింగ్ ప్రయాణంలో భాగంగా మొత్తం 1700 కి.మీ సైక్లింగ్ చేసి ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా తరుణ్ తన అభిప్రాయాలు పంచుకుంటూ.. సైక్లింగ్, ధ్యానం తన జీవన గమ్యాలే తన సంతృప్తి అని పేర్కొన్నారు. ధ్యానం తన జీవితాన్ని మార్చేసిందని, మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. (చదవండి: రొమ్ము కేన్సర్ అవేర్నెస్ రన్.. ‘పింక్‌థాన్’)

రొమ్ము కేన్సర్ అవేర్నెస్ రన్.. ‘పింక్‌థాన్’
బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పిండమే లక్ష్యంగా హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో పింక్‌థాన్ రన్ నిర్వహించనున్నారు. జైడస్ లైఫ్‌సైన్సెస్ ఆధ్వర్యంలో డిసెంబరు 21న నిర్వహించనున్న ఈ రన్లో 30 వేల మందికి పైగా మహిళలు పాల్గోనున్నారని, ఇందులో అల్ట్రా రన్స్, రీలే రన్ ఉన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి నెల మూడు నిమిషాల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ మహిళల ప్రాణాలను రొమ్ము కేన్సర్ నుంచి కాపాడగలదని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శరి్వల్ పటేల్ తెలిపారు. పింక్‌థాన్‌తో మరింత మందిని చైతన్యపరచడమే లక్ష్యమన్నారు. దేశంలో యేటా రెండు లక్షల మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బాధితులు అవుతున్నారని ఫిట్నెస్ ఐకాన్ పింక్‌థాన్ ఫౌండర్ మిలింద్ సోమన్ అన్నారు.27న నేచర్ క్యాంప్ ఫారెస్ట్ ట్రెక్‌పార్కులో నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్‌పార్కులో 27 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం ఉదయం పది గంటల వరకూ నేచర్ క్యాంప్ ఉంటుందని తెలిపారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నోక్టర్నల్ వాక్, నైట్æ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్, బర్డ్ వాచింగ్ ఉంటాయన్నారు. సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ అందిస్తామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఫారెస్ట్ ట్రెక్ పార్కులో బర్డ్ వాక్‌లో పిల్లలు, పెద్దలు పక్షుల జాతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 73823–07476, 94935–49399లను సంప్రదించాలని సూచించారు. (చదవండి: 'గోల్డెన్ కేర్': పెద్దలకు భరోసా..!)
ఫొటోలు


ఇంద్రకీలాద్రి: శ్రీమహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)


షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌లో నాగచైతన్య-శోభిత (ఫొటోలు)


తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ నటుడు (ఫొటోలు)


'జాతిరత్నాలు' ఫరియా దుబాయి ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)


వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లాంచ్ ఈవెంట్లో కంగన (ఫొటోలు)


'దృశ్యం 3' సెట్స్‌లో మోహన్ లాల్‌కి సన్మానం (ఫొటోలు)


శ్రీవారి బ్రహ్మోత్సవాలు సింహ వాహనంపై స్వామివారు (ఫొటోలు)


నాలుగో రోజు నవరాత్రుల పూజలో యాంకర్ లాస్య.. (ఫొటోలు)


రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ బ్యూటీఫుల్ లుక్స్.. (ఫొటోలు)


కోఠి ఉమెన్స్ కాలేజీలో బతుకమ్మ వేడుకలు..అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)
అంతర్జాతీయం

అనుమానపు ట్రంప్.. రహస్య విచారణకు ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన.. జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు యాదృచ్ఛికమేమీ కాదని.. ఇందులో కుట్ర దాగి ఉందని అంటున్నారాయన. ఐక్యరాజ్య సమితిలో వరుస చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. అదేం యాదృచ్ఛికం కాదని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్, సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం.. ఈ మూడు ఘటనలు దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయన్నారు. మొదటిది.. ట్రంప్ తన సతీమణి మెలానియా, సిబ్బందితో ఎస్కలేటర్‌పై ఉన్న సమయంలో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. రెండోది.. ఆయన యూఎన్‌జీఏలో ప్రసంగించేటప్పుడు టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ప్రింటెడ్ కాపీ ద్వారా తన సందేశాన్ని చదివి వినిపించారు. మూడోది.. ప్రసంగ సమయంలో మైక్ పనిచేయకపోవడం. దీని వల్ల అక్కడున్నవాళ్లు(భార్య మెలానియాతో సహా) తన మాటలు వినలేకపోయారని.. ఇంటర్ప్రెటర్లు ద్వారా మాత్రమే వాళ్లకు వినిపించిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఆయన అక్కడికక్కడే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే..NEW: White House Press Secretary Karoline Leavitt calls for investigation after a UN escalator shut off as President Trump and First Lady Melania Trump stepped on.According to The Times, UN staff members had previously "joked" about turning off the escalator."To mark Trump’s… pic.twitter.com/UE1AFdCn2R— Collin Rugg (@CollinRugg) September 23, 2025ఇది తనపై జరిగిన కుట్రగా ఆయన భావిస్తున్నారట. వీటిపై విచారణకు రహస్య దర్యాప్తు సంస్థలను పురమాయించినట్లు, వీటి వెనుక ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు. అయితే.. ఐక్యరాజ్య సమితి(UNO) ట్రంప్ అనుమానాలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధుల బృందంలోకి ఓ వీడియోగ్రాఫర్ పొరపాటున స్టాప్ బటన్ నొక్కడంతో ఎస్కలేటర్ ఆగిపోయి ఉంటుందని యూఎన్ అధికార ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఇక.. టెలిప్రాంప్టర్ నిర్వహణ వైట్ హౌస్ బాధ్యత కాబట్టి తమపై ఆరోపణలు సరికావని అంటోంది. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్(New York City)లో ఉంది. ఇక్కడ నిర్వాహణ లోపాలు బయటపడడం తరచూ జరిగేదే. దీనికి తోడు నిధుల లేమితో ఈ అంతర్జాతీయ సంస్థ ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే హెడ్ ఆఫీస్‌తో పాటు జెనీవాలో ఉన్న కార్యాలయంలోనూ ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఏసీలు, లైట్లు ఆఫ్ చేయిస్తోంది కూడా. యూఎన్‌కు అత్యధికంగా ఆర్థిక సాయం అందించేది అమెరికానే. అలాంటి దేశం నుంచి ఫండింగ్ ఆగిపోవడంతో ఐరాసకు ఈ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: 150 దేశాలు.. ఐరాసను చీల్చి చెండాడిన ట్రంప్

జోక్యం చేసుకుంటే దీటుగా బదులిస్తాం.. ట్రంప్‌కు చైనా కౌంటర్
బీజింగ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్ యూనియన్‌తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్ చెప్పారు.

బ్యాంకాక్‌లో నడిరోడ్డుపై భారీ సింక్‌హోల్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నగరంలోని ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్‌స్టేషన్‌ను, ఆస్పత్రి ఔట్‌పేషెంట్ వార్డును మూసివేశారు. విద్యుత్, నీటి సరఫరాను ఆపారు. రోడ్డుపై పేద్ద సింక్‌హోల్ ఏర్పడటంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూగర్భ రైలు మార్గం నిర్మాణ పనుల వల్లే రహదారి కుంగినట్లుగా భావిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు నెమ్మదిగా కుంగిపోతుండటం, ఒరిగిపోతున్న విద్యుత్ స్తంభాలు, పగిలిపోతున్న నీళ్ల పైపు లైన్లు, గుంత పెద్దదైన కొద్దీ కార్లు, తదితర వాహనాలు వెనక్కి మళ్లడం, పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. గుంత ఒక అంచు సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదుట ఆగిపోయింది. భూగర్భ నిర్మాణం అందులో కనిపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున గుంత మరింత విస్తరించకుండా సాధ్యమైనంత త్వరగా పూడ్చివేసే చర్యలకు యంత్రాంగం ఉపక్రమించింది.

ఐరాసలో ఎర్డోగన్ ‘కశ్మీర్’ పాట
యునైటెడ్ నేషన్స్: తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి కశ్మీర్ అంశంలో వేలు పెట్టారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఉగ్రవా ద నిర్మూలనకు భారత్–పాకిస్తాన్ మధ్య సహకారం ఎంతో అవసరమని పేర్కొ న్నా రు. ‘కశ్మీర్‌లోని మా సోదర సోదరీ మణుల సంక్షేమం కోసం ఆ సమస్య ఐరాస తీర్మానం మేరకు శాంతియుతంగా చర్చల ద్వారా పరి ష్కరించబడుతుందని ఆశిస్తున్నా. దక్షిణాసి యాలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. గత ఏప్రిల్‌లో పాక్, భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల తర్వాత కాల్పుల విరమణ పాటించటాన్ని మేం స్వాగతిస్తు న్నాం’అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు సన్ని హిత దేశంగా ఉన్న తుర్కియే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది.
జాతీయం

ఆ మూడు రాష్ట్రాలపై బీజేపీ నజర్.. నూతన నియామకాలతో ఎన్నికల వ్యూహం
న్యూఢిల్లీ: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో రాబోయే ఎన్నికలకు పోల్ ఇన్‌చార్జ్‌లను నియమించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ నియామకాలు కీలక రాష్ట్రాలలో ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయుక్తమవుతాయని పార్టీ భావిస్తోంది.బీహార్‌లో ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడులో బైజయంత్ పాండా పశ్చిమ బెంగాల్లో భూపేంద్ర యాదవ్ పోల్ ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్య సహ ఇన్‌చార్జ్‌లుగా పనిచేయనున్నారు. ఈ బృందం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, రాష్ట్రంలో బలమైన బీజేపీ ఉనికిని చాటేందుకు వ్యూహాలను అమలు చేయడం తదితర బాధ్యతలను చేపడుతుంది. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను బైజయంత్ పాండాకు అప్పగించారు. మురళీధర్ మోహోల్ అతనికి సహ ఇన్చార్జ్గా వ్యవహరించనున్నారు.పశ్చిమ బెంగాల్‌కు పోల్ ఇన్చార్జ్గా భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమితులయ్యారు. బిప్లాబ్ కుమార్ దేబ్ ఆయనకు సహ ఇన్చార్జ్గా మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ భావిస్తోంది. అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రచార నిర్వహణ, ఓటర్ల సమీకరణకు సమన్వయ విధానాన్ని రూపొందించనుంది. ఈ నూతన నియామకాలు బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేసే దిశగా పార్టీలోని సీనియర్ నేతల సలహా, సంప్రదింపులను బీజేపీ తీసుకుంటున్నదని సమాచారం.

సోనమ్ వాంగ్చుక్పై సీబీఐ ఉచ్చు.. విదేశీ నిధుల సేకరణ, పాకిస్తాన్ పర్యటనపై దర్యాప్తు
లేహ్: లడఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ఒక గ్రూపును విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన ఒక సంస్థపై నిఘా సారించింది. ఈ సంస్థ విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టాన్ని ఉల్లంఘించిందనే అనుమానం వ్యక్తం చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దర్యాప్తు సంస్థ రెండు నెలల క్రితం హిమాలయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్ఐఏఎల్) సేకరించిన నిధులపై విచారణను ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటనపై కూడా సమీక్షిస్తున్నదని సమాచారం.వాంగ్‌చుక్ నిరాహార దీక్ష అనంతరం..కాగా లడఖ్ జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితుల్లో భద్రతా దళాలు, లడఖ్ ఉద్యమ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో నలుగురు మృతిచెందారు. 40 మంది పోలీసు సిబ్బందితో సహా 80 మంది గాయపడ్డారు. వాంగ్‌చుక్ తన పక్షం రోజుల నిరాహార దీక్షను ఉపసంహరించుకున్న తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఘర్షణల్లో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలించిన తర్వాత లేహ్ అపెక్స్ బాడీ యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది.రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే..దీంతో కొందరు యువకులు యువకులు గ్రూపులుగా బయలుదేరి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు పాల్పడ్డారు. లడఖ్ పట్టణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ దళాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రకటనల కారణంగానే హింస చెలరేగిందని కేంద్రం ఆరోపించింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఉద్దేశపూర్వక కాల్పులంటూ ఆరోపణలుసీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు.

Delhi Baba: ‘స్టీవ్ జాబ్స్, ఒబామా.. నా ముందు దిగదుడుపే’.. సరికొత్త వాదన
న్యూఢిల్లీ: పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు చైతన్యానంద సరస్వతి తనను తాను అర్హత కలిగిన మేనేజ్మెంట్ గురువునని, ప్రముఖ రచయితనంటూ చెబుతున్నాడు. పైగా ‘స్టీవ్ జాబ్స్, ఒబామా.. తన ముందు జుజుబీ’.. అటూ సరికొత్త వాదన వినిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అతని వ్యక్తిగత జీవితంపై పడింది.పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలుఅకడమిక్ రీసెర్చ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లోని చైతన్యానంద ప్రొఫైల్‌లో అతను చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ, పీహెచ్డీ చేసినట్లు చూపిస్తోంది. అలాగే అతను పోస్ట్-డాక్టోరల్ డిగ్రీలు, డీలిట్ పూర్తి చేసారని, భారతదేశంతో పాటు విదేశాలలోని పలు విశ్వవిద్యాలయాల నుండి ఏడు గౌరవ డిగ్రీలను కలిగి ఉన్నాడని ఆ సైట్లో పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న అతని పుస్తక రచయిత పేజీలలోనూ ఉన్నాయి. అతని విద్యాభ్యాస వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.స్టీవ్ జాబ్స్ ముందుమాటతన పుస్తకాలపై చైతన్యానంద తనను తాను ‘అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత’గా పరిచయం చేసుకుంటాడు. అతని పుస్తకాలలో ఒకటైన ‘ఫర్గెట్ క్లాస్రూమ్ లెర్నింగ్’లో యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ముందుమాటను రాసినట్లు ఉంది. పుస్తకం మొదటి పేజీలో ఈ చైతన్యానంద పుస్తకం.. ప్రపంచానికి అపూర్వమైన మార్గదర్శకాల మాన్యువల్’ అని జాబ్స్ చెప్పినట్లు ప్రచురితమయ్యింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైతన్యానంద పుస్తకం ‘ట్రాన్స్ఫార్మింగ్ పర్సనాలిటీ’ని పదేపదే ప్రస్తావించారనే అనే విషయం బయటకొచ్చింది. ఈ పుస్తకం 2007లో యూరోపియన్, ఉత్తర అమెరికా మార్కెట్లలో బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా నిలిచిందని సమాచారం.రెండు దశాబ్ధాలుగా మహిళలపై వేధింపులుఈ పుస్తకంలో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ-మూన్ పేరుతో ప్రశంసా సందేశం కూడా ఉంది. ఆయన ఆ పుస్తకంలో రచయిత గురించి చెబుతూ, ప్రముఖ ప్రొఫెసర్, ప్రముఖ రచయిత, వక్త, విద్యావేత్త, ఆధ్యాత్మిక తత్వవేత్త పరోపకారి, భారతదేశంతో పాటు విదేశాలలో మేనేజ్మెంట్ నిపుణునిగా పేర్కొన్నారు. కాగా చైతన్యానంద ఎడ్యుకేషన్ ప్రొఫైల్‌లోని చాలా సమాచారం నకిలీదని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. వసంత కుంజ్‌లోని శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో విద్యార్థులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా అతను అతను దేశం విడిచి పారిపోకుండా నిరోధించడానికి పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. చైతన్యానంద రెండు దశాబ్దాలుగా మహిళలను వేధిస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. కాగా జుజుబీ అంటే రేగిపండు.. దీని శాస్త్రీయ నామం జిజిఫస్ జుజుబా (Ziziphus jujuba). రేగిపండు చిన్నగా ఉంటుంది. దేన్నయినా జుజుబితో పోలిస్తే అది 'నా వెంట్రుకతో సమానం' అనే అర్థం వస్తుంది.

భారత్‌కు కొత్త అస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ: భారత రక్షణ వ్యవస్థ అరుదైన ఘనత సాధించింది. అగ్ని ప్రైమ్ (Agni-Prime) క్షిపణి ప్రయోగాన్నివిజయవంతంగా పూర్తి చేసుకుంది. రైల్వే నెట్వర్క్ నుంచి సైతం ప్రయోగించగలడం ఈ క్షిపణి ప్రత్యేకత. రైలు ఆధారిత మొబైల్ లాంఛర్ వ్యవస్థ నుంచి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఉదయం వెల్లడించారు. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. డీఆర్డీవో, Strategic Forces Command (SFC), భారత సైన్యం సంయుక్తంగా ఈ ప్రయోగం నిర్వహించాయి. దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించేలా ఈ అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని రూపొందించినట్లు రక్షణ శాఖ చెబుతోంది. రైలు నెట్‌వర్క్‌పై ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే ఈ క్షిపణిని ప్రయోగించవచ్చని చెబుతోంది. ‘‘ఈ ప్రయోగం భారతదేశాన్ని అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు కలిగిన దేశాల వర్గంలో నిలిపింది. ఈ సందర్భంగా డీఆర్డీవ, ఎస్ఎఫ్సీ, సైన్యానికి అభినందలు’’ అని రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. India has carried out the successful launch of Intermediate Range Agni-Prime Missile from a Rail based Mobile launcher system. This next generation missile is designed to cover a range up to 2000 km and is equipped with various advanced features. The first-of-its-kind launch… pic.twitter.com/00GpGSNOeE— Rajnath Singh (@rajnathsingh) September 25, 2025
ఎన్ఆర్ఐ

''నాకు సాయం చేయండి సార్'.. జైశంకర్‌కు హైదరాబాద్ యువతి అభ్యర్థన
హైదరాబాదీ యువతి భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాసిందిహైదరాబాదీ యువతి హనా అహ్మద్ ఖాన్ జూన్ 2022లో చికాగోలో పోలీస్‌గా పనిచేస్తున్న మహ్మద్ జైనుద్దీన్ ఖాన్ (అమెరికా పౌరుడు)ని వివాహం చేసుకుంది. అనంతరం ఫిబ్రవరి 2024లో ఆమె అమెరికాలోని చికాగోలో తన భర్తతో కలిసి నివసించేవారు. కొన్నాళ్లకు జైనుద్దీన్ ఖాన్ ఆమెను మానసిక వేధింపులు, శారీరక వేధింపులకు గురి చేశాడు. కొంతకాలం తరువాత హజ్ యాత్రకు తీసుకెళ్తానని చెప్పి జైనుద్దీన్ ప్రణాళికాబద్ధంగా ఫిబ్రవరి 7, 2025న ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఓ రూమ్ తీసుకున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళగా, ఆమె భర్త పాస్‌పోర్ట్, గ్రీన్ కార్డ్, ఆభరణాలు వంటి అన్ని వస్తువులతో హోటల్‌ను ఖాళీ చేసి అమెరికాకు తిరిగి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే హనా అహ్మద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తన భర్తను సంప్రదించడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆమె న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయాన్ని, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్ను సంప్రదించడానికి ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుని తన భర్తపై చట్టపరంగా పోరడడానికి, USAకి తిరిగి వెళ్లడానికి అవసరమైన వీసా మంజూరు చేయమంటుంది. న్యూఢిల్లీలోని USA రాయబార కార్యాలయం, హైదరాబాద్‌లోని USA కౌన్సెలేట్కు ఆదేశాలవ్వగలరని ఆమె అభ్యర్థించింది. ఈ విషయంలో తీసువాల్సిన అవసరమైన చర్యలను తెలియజేయగలరంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు తన లేఖలో పేర్కొంది.

గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్‌కు చెందిన రాహుల్‌రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్‌కు గురయ్యాడు. అతనికి బోన్‌మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్‌రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్‌లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్‌పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్‌లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్‌గౌడ్, ఎన్నారై, లండన్

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.డాక్టర్ రాఘవ రెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డి తోపాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.గత 15 సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలిచారు. ప్రజా శ్రేయస్సు కోసం మన వైస్సార్ అభిమానులు ముందుకు వచ్చి రక్త దానం చేయడం నిజంగా ప్రశంసనీయం. అదే మన రాజన్నకు ఇచ్చే ఘనమైన నివాళి అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు. ఇక ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు.. వైఎస్సార్ అభిమానులను, సమన్వయ కర్త డాక్టర్ రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి)

శంకర నేత్రాలయ యూఎస్ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి
శంకర నేత్రాలయ USA తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల దిగ్విజయాన్ని స్మరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోషకదాతల అమూల్యమైన అనుభవాలు, సూచనలను తెలుకునేందుకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శంకర నేత్రాలయం యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందూర్తి అధ్యక్షతన ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంతో దార్శనికులను, దాతల సముహాన్ని ఒకచోటుకి చేర్చింది. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో మెగా డోనార్లు, బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదార్లు, బోర్డు సభ్యులు ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్ తదితరలు ఉన్నారు. ఈ వేడుక గ్రామీణ భారతదేశం అంతటా జీవితాలను ప్రకాశవంతం చేసేలా అడాప్ల్ ఎ విలేజ్ పోషకదాత ఉనికిని ప్రతిధ్వనించేలా చేసింది. ఈ సందర్భంగా దత్తత గ్రామ పోషకులు కంటి శిబిరాలను తాము సందర్శించి వివరాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. అక్కడ వారు ప్రతి రోగికి లభించిన కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు గురించి తెలుసుకున్నారు. ఒక రకంగా ఇది సంస్థ అచంచలమైన ప్రమాణాలను, లోతుగా పాతుకుపోయిన సేవతత్వాన్ని ధృవీకరిస్తోంది. చాలామంది రోగులకు దృష్టిని పునరుద్ధరించి అత్యంత దుర్భలమైన వారి జీవితాలను మార్చింది. తరతరాలుగా కంటి సంరక్షణను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం, దాతృత్యంతో నడిచే నాయకత్వం శక్తిని పునరుద్ఘాటించింది. శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్.వి. ఆచార్య ప్రసంగంలో, సంస్థ దార్శనిక వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ అందించిన సహాయ సహకారాలు,వి లువలు గురించి వివరించారు. అలాగే అడాప్ట్-ఎ-విలేజ్ పోషకుల ఉదార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)
క్రైమ్

చిత్తూరులో దారుణం.. బాధితురాలిపై పోలీసుల లైంగిక దాడి?
సాక్షి, పలమనేరు: ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నిందితులుగా మారి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పలమనేరు పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన ఓ మహిళపై కానిస్టేబుల్ అడవిలో లైంగికదాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్, హోంగార్డు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే..గంటావూరుకు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేధింపులతో ఆమె నాలుగు నెలల క్రితం పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. బాధితురాలు అందంగా ఉందని సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు కిరణ్‌కుమార్.. ఆమెపై కన్నేసి ప్లాన్ చేశాడు. (కిరణ్ ప్రస్తుతం సోమలలో పనిచేస్తున్నాడు) ఫిర్యాదులోని ఫోన్ నంబరును తీసుకుని తాను న్యాయం చేస్తానంటూ బాధితురాలికి రాత్రుల్లో ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు తెలిసిన వారి ద్వారా పలమనేరులో పనిచేసే మరో హోంగార్డు ఉమాశంకర్‌కు (ఇప్పుడు పుంగనూరులో విధులు నిర్వహిస్తున్నాడు) తన బాధను తెలుపుకుంది.దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ కానిస్టేబుల్ కూడా నేరుగా బాధితురాలి ఇంటికెళ్లి ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటానంటూ నమ్మబలికాడు. ఆపై అతడు కూడా రాత్రుల్లో ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు దేవుడెరుగు ఆ ఇద్దరి వేధింపులతో ఏం చేయలేని బాధితురాలు తీవ్రంగా మనోవేదన అనుభవించింది.ఎస్పీని కలిసి న్యాయం చేయాలని..తనకు జరిగిన అన్యాయంపై స్థానిక పోలీసులు ఎలాగూ న్యాయం చేయరని భావించి తాజాగా జిల్లా ఎస్పీగా వచ్చిన తుషార్‌డూడిని ఇటీవలే కలిసి జరిగిన ఘోరంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆయన వెంటనే దీనిపై విచారణ చేయాలని పలమనేరు సీఐ మురళీమోహన్‌కు అప్పజెప్పారు. సంఘటన జరిగింది తన పరిధి కాదని బంగారుపాళెం సీఐని కలవాలని ఆయన చెప్పారు. దీంతో బాధితురాలు బంగారుపాళెం సీఐని కలిసింది. ఆ కానిస్టేబుల్‌కు అధికార పార్టీ అండదండలు ఉండడం, నిందితుడు పోలీసు కావడంతో అప్పట్లో ఎఫ్ఐఆర్ వేయకుండా కాలయాపన చేశారు. ఎస్పీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన చెందిన బాధితురాలు బుధవారం చిత్తూరులో ప్రెస్‌మీట్ పెట్టి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. విషయం మీడియాకు చేరడంతో వెంటనే స్పందించిన పోలీసులు బుధవారమే ఎఫ్ఐఆర్ వేశారు. బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని..భర్త వదిలేయడం, న్యాయం కోసం వెళ్తే ఇలా లైంగిక వేధింపులతో బతకడం ఇష్టంలేక రెండు నెలల కిందట మొగిలి సమీపంలోని దేవరకొండలో ఆలయం వద్ద ఆత్మహత్య చేసుకుందామని బాధితురాలు నిర్ణయించుకుంది. ఈ సమయంలో కొండపైకి గస్తీ కోసమెళ్లిన బంగారుపాళెం పీఎస్‌కు చెందిన ఇరువురు కానిస్టేబుళ్లు బాధితురాలిని చూసి అడవిలో ఎందుకున్నావని ఆరా తీశారు. తనది పలమనేరని చెప్పగా తెలిసినవారెవరైనా ఉన్నారా అనగానే.. ఆమెను వేధిస్తున్న కానిస్టేబుల్ నంబరు ఇచ్చింది.దీంతో వారు అతడికి కాల్ చేయగా ఆమె తనకు తెలుసునని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీన్ని అదునుగా భావించిన ఆ కానిస్టేబుల్ ఓ కారులో ఇక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని సముదాయించి పిల్లలతో పాటు బాధితురాలికి మద్యం కలిపిన కూల్‌డ్రింక్ బాటిళ్లను ఇచ్చి వారు మత్తులో ఉండగా పిల్లలను కారులో పడుకోబెట్టి బాధితురాలితో పాటు కొండపైనుంచి కిందికి వస్తూ అడవిలోని మరో దారిలోకి తీసుకెళ్లి అక్కడ బాధితురాలిపై లైంగిక దాడి చేసినట్టు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. జరిగిన విషయంపై ఎవరికై నా చెబితే ప్రాణాలతో ఉండరని బెదిరించడంతో బాధితురాలు ఏం చేయలేకపోయింది.అయితే, బాధితురాలు మీడియా సమావేశానికి ముందే ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వినిపిస్తోంది. పోలీసులకైతే ఓ న్యాయం సామాన్యులకైతే మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కొందరు కానిస్టేబుళ్ల కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే ప్రజల్లో నమ్మకం లేకుండా పోతోంది. దీనిపై జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ అయినా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సైబర్ నేరగాళ్లపై ‘హంటర్’
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు కీలక ఆధారం అవుతున్న మ్యూల్ ఖాతాలకు, లావాదేవీలకు చెక్ చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) రూపొందించిన ఏఐ టూల్ మ్యూల్‌హంటర్.ఏఐ వినియోగం తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని ఇప్పటికే దాదాపు 15 బ్యాంకులు వినియోగిస్తుండగా మిగిలిన వాటికీ విస్తరించనున్నారు. ఈ టూల్ ద్వారా అనుమానిత బ్యాంకు ఖాతాలతో పాటు లావాదేవీలను గుర్తించడం, బ్లాక్ చేయ డం తేలికవుతుంది. ఫలితంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఖాతాల ఆధారంగానే స్కామ్స్.. » కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి మరీ వివిధ రకాలైన సైబర్ నేరాలు చేయిస్తున్న సూత్రధారులు ఇటీవలి కాలంలో విదేశాల్లోనే ఉండి కథ నడుపుతున్నారు. వీళ్లు బా«ధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించుకోవడానికి తమ ఖాతాలు వినియోగించరు. వివిధ మార్గాల్లో దళారుల్ని గుర్తించి వారి ద్వారా చిరుద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారులకు ఎరవేస్తారు. వీరి కేవైసీ వివరాలతో, బోగస్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిపిస్తారు.వీటికి సంబంధించిన డెబిట్ కార్డులు, చెక్‌బుక్స్ తదితరాలు తీసుకునే దళారులు వాటిని సూత్రధారులకు పంపిస్తూ ఉంటారు. ఈ ఖాతాల (మ్యూల్) ద్వారా జరిగే లావాదేవీలపై కమీషన్లు తీసుకునే వారిని మనీ మ్యూల్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ మనీ మ్యూల్స్‌కు, వారి ఖాతాలకు చెక్ పెట్టడం ద్వారా సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని నిపుణులు ఎన్నో ఏళ్లుగా చెబుతున్నారు.95% కచ్చితత్వం.. ఆర్బీఐహెచ్ గత ఏడాది డిసెంబర్లో ఈ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఆయా బ్యాంకుల్లో ప్రభావవంతంగా పని చేస్తోందని అధికారులు చెప్తున్నారు. బ్యాంకు ఖాతాలు, వాటి ద్వారా జరిగే లావాదేవీలను ఈ టూల్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. నకిలీ గుర్తింపు పత్రాలతో తెరిచిన ఖాతాలను గుర్తించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ అంశంలో దీని కచ్చితత్వం 95 శాతం ఉన్నట్లు తేల్చారు. కొత్తగా తెరిచిన ఖాతాల్లో లేదా వినియోగంలో ఉన్న వాటిలో అకస్మాత్తుగా భారీ మొత్తాలతో లావాదేవీలు జరిగినా అప్రమత్తం చేస్తుంది. నగదు డిపాజిట్ అయినా, విత్‌డ్రా అయినా అలెర్ట్ చేయడంతో పాటు ఆ ఖాతాలను ఫ్రీజ్ చేస్తుంది. ఒకే చిరునామాతో అనేక బ్యాంకు ఖాతాలు తెరిచినా పసిగట్టడంతో పాటు ఈ–కేవైసీనీ పర్యవేక్షిస్తుంది. ఈ ఏఐ టూల్ ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ అథెంటిసిటీలను తనిఖీ చేయగలదు. నరేష్ మల్హోత్రా కేసు కలకలం ఇటీవలి కాలంలో తరచూ డిజిటల్ అరెస్టు మోసాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మహిళలు, వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని ఈ నేరాలు చేస్తున్నారు. డ్రగ్స్, మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందంటూ, పోలీసు, ఇతర ఏజెన్సీల అధికారులుగా ఫోన్లు, వీడియో కాల్స్ చేసి బెదిరిస్తున్నారు. వీరి మాయలో పడిన వాళ్లు తమ కష్టార్జితం రూ.లక్షల నుంచి రూ.కోట్లు కూడా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో చోటు చేసుకున్న నరేష్ మల్హోత్రా ఉదంతం అన్ని దర్యాప్తు ఏజెన్సీలను కదిలించింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి అయిన మల్హోత్రా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య ‘డిజిటల్ అరెస్టు’లో రూ.23 కోట్లు కోల్పోయారు. అన్ని బ్యాంకులు మ్యూల్ హంటర్‌ను వినియోగిస్తే ఈ నేరం జరిగేది కాదని, జరిగినా అత్యధిక మొత్తం ఫ్రీజ్ అయ్యేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని బ్యాంకులు ఈ టూల్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది.

తాతకు నివాళిగా పోస్ట్...హత్యకు దారి తీసిన ‘లాఫింగ్’ ఇమేజ్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఫేస్బుక్ పోస్ట్ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. బాధితుడిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌మీడియాలో పాటించాల్సిన కనీస మర్యాద, సభ్యత, సంస్కారాలకు నిదర్శనం ఈ ఘటన.20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ బీహార్‌కు చెందినవాడు. మరో ముగ్గురు బంధువులతో కలిసి గుజరాత్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం కాలం చేసిన తన తాత రూప్నారాయణ్ భింద్ను గుర్తుచేసుకుంటూ ఫేస్బుక్లో ఒక కథనాన్ని అప్లోడ్ చేశాడు ప్రిన్స్. అయితే బీహార్‌కు చెందిన ప్రిన్స్ పరిచయస్తుడు బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ అనుచితంగా రియాక్టయ్యాడు. ప్రిన్స్ పోస్ట్‌కు నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.మొల్లగా ఫోన్లోమొదలైనఘర్షణ ముదిరి భౌతిక దాడికి దారి తీసింది.ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి, 12:30 గంటల ప్రాంతంలో, ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ వెలుపల ఆటో రిక్షాలో కూర్చుని బిపిన్ దాడిచేశాడు. దీంతో ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి తిరిగి వెళ్లిపోయాడు. కానీ మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అడ్డుకున్నాడు. చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో, బిపిన్ ప్రిన్స్‌ను కత్తితో పొడిచాడు. ప్రిన్స్ అరుపులు విన్న అతని సహచరులు వెంటనే అతనికి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులకు పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సెప్టెంబర్ 22నకన్నుమూశాడు. చనిపోవడానికి ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.చదవండి: మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియాప్రిన్స్ వీపుపై అంగుళంన్నర, రెండు అంగుళాల లోతు గాయం ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు.

పబ్‌లో ఘర్షణ.. బౌన్సర్లకు గాయాలు
హైదరబాద్: మాదాపూర్‌లోని మ్యాడ్ పబ్‌లో కొంతమంది అతిగా మద్యం తాగి, బిల్లు ఎక్కువగా వచ్చిందని పబ్ సిబ్బందితో గొడవ పడ్డారు. బిల్లు తగ్గించాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అక్కడున్న సిబ్బంది, బౌన్సర్లపై ఖాళీ సీసాలు, చేతికి అందిన వస్తువులతో దాడి చేశారు. దీంతో బౌన్సర్లకు తీవ్ర గాయాలవగా..కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. పబ్ ఓనర్ ప్రశాంత్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బౌన్సర్లపై కస్టమర్ల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలుహైదరాబాద్ - కొండాపూర్ లోని మ్యాడ్ క్లబ్ అండ్ కిచెన్‌లో కస్టమర్లు, బౌన్సర్ల మధ్య ఘర్షణ..గొడవ ముదిరి దాడికి దిగిన కస్టమర్లు.. ముగ్గురికి తీవ్ర గాయాలు బిల్లు చెల్లించాలని మేనేజర్ కస్టమర్లను అడగడంతో మొదలైన గొడవ దీంతో ఆగ్రహానికి… pic.twitter.com/5cOP3Iqtsg— Telugu Scribe (@TeluguScribe) September 24, 2025
వీడియోలు


ప్రభాస్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్!


అరెస్ట్ చేసుకుంటారా.. ఏం చేసుకుంటారో చేసుకోండి: కేటీఆర్


చిరంజీవి కాలి గోటికి సరిపోవు బాలకృష్ణపై గుడివాడ ఫైర్


TS: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం


రాజ్యాంగానికి కూటమి తూట్ల... ప్రోటోకాల్‌పై బొత్స ఫైర్


నువ్వు జీరో కనుకనే నీ నెంబర్ 9.. కరణం ధర్మశ్రీ ఫైర్


Jogi: చంద్రబాబుకు వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు చేయడం అలవాటే


తెలంగాణలో OG టికెట్ ధరల పెంపునకు మరోసారి షాక్


నేను కూడా ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నా... ఈ రోజు నువ్వు బతుకుతున్న బతుకు YSR బిక్ష


సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగింత