
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది శ్రీవారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు జేఈవో తెలిపారు.
భక్తులు సౌకర్యార్థం గ్యాలరీలు విస్తరణ చేశామన్నారు. ఆగష్టు చివరికల్లా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఆగష్టు 26న పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడ సేవను బ్రహ్మోత్సవాల ట్రయల్‌గా నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం వాహన సేవలను 9 గంటలకు, రాత్రి వాహన సేవలును 8 గంటలకు, గరుడ సేవను రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.