
అనంతపురం, రామగిరి: మండల కేంద్రం రామగిరిలోని శివాలయం గర్భగుడిలో సోమవారం నాగుపాము కలకలం రేపింది. ఉదయాన్నే అర్చకులు ఆలయ తలుపులు తెరచి గర్భగుడిలోకి ప్రవేశించగానే శివలింగంపై నాగుపాము కనిపించింది. అక్కడకు వచ్చిన భక్తులు శివలింగంపై ఉన్న పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనం తాకిడి పెరగడంతో పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.