
పాచిపెంట: ప్రచారం నిర్వహిస్తున్న సలాది అప్పలనాయుడు, మెంటాడ: గుర్లలో నవరత్నాల పథకాలను వివరిస్తున్న నాయకులు
సాక్షి, సాలూరు: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, జగనన్న సంక్షేమ పాలన తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కోరా రు. మంగళవారం రాత్రి పట్టణంలోని 8,9 వార్డులపరిధిలోని గాంధీనగర్, మెట్టువీధి, కొంకివీధి, మహంతివీధి, మత్రాసువీధులలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో ఇం టింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న నవరత్నాల పథకాలను వివరించారు.
చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీలలో ఏఒక్కటీ అమలు చేయలేదని, ఇంటికో ఉద్యోగంఇస్తానని నమ్మించి మోసం చేశారన్నా రు. యువత నిరుద్యోగులుగా కాలక్షేపం చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారని, పిల్లలను బడికి పంపించే తల్లులకు నెలకు రూ.500 నుంచి రూ.2వేల వరకు అందిస్తారన్నారు. మాటతప్పని రాజశేఖరరెడ్డి బిడ్డగా జగన్ కూడా ఇచ్చిన మాటను నిలుపుకుంటారని, అమలుచేయలేని హామీలను ఆయన ఇవ్వరన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
ప్రచారానికి వచ్చిన రాజన్నదొరకు మహిళలు హారతులు పట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు, అర్బన్‌బ్యాంక్ మాజీ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కొంకి అప్పారావు, గొర్లె జగం, హరి స్వామినాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కాకి రం గ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ గిరి రఘు, కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గన్నారు.
జగన్‌కి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి
పాచిపెంట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఆపార్టీ రాష్ట్ర బీసీసెల్ నాయకుడు సలాది అప్పలనాయుడు, నాయకుడు ఇజ్జాడ అప్పలనాయుడు ప్రజలను కోరారు. మండలంలోని కొటికిపెంట పంచాయతీ గోగాడవలస, కోడికాళ్లవలస, గరేళ్లవలస గ్రామాల్లో సలాది అప్పలనాయుడు, కొటికిపెంట,మోదుగ, గొట్టూ రు పంచాయతీల్లో ఇజ్జాడ అప్పలనాయుడు వేర్వేరుగా మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు.
రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
నవరత్నాలతో నవశకానికి నాంది
మెంటాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలకనున్నాయని ఆపార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండలంలోని గుర్ల గ్రామంలో పార్టీ నాయకులలో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించి..ప్యాన్‌గుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, ప్రచార కన్వీనర్ కనిమెరక త్రినాథ, తిరుపతి, ఎంపీటీసీ చింతకాశీనాయుడు, దాట్ల హనుమంతురాజు, పల్లి అప్పలనాయుడు, పల్లి కన్నమ్మ, సతీష్, పుర్నాన అప్పలనాయుడు, డి.దేముడుబాబు, పుర్నాన రామునాయుడు పాల్గొన్నారు.