ఒప్పో మరో కొత్త ఫోన్‌ .. మూడు వేరియంట్లలో | OPPO F5 smartphone to be launched in three variants, bezel-less display | Sakshi

ఒప్పో మరో కొత్త ఫోన్‌ .. మూడు వేరియంట్లలో

Published Tue, Oct 24 2017 2:22 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

OPPO F5 smartphone to be launched in three variants, bezel-less display - Sakshi

న్యూఢిల్లీ:  చైనీస్‌ టెక్‌ కంపెనీ ఒప్పో   త్వరలోనే మరో కొత్త హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోలాంచ్‌ చేయబోతోంది. ఈనేపథ్యంలో దీనికి  సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను  భారీగా నిర్వహిస్తోంది.
 తద్వారా నవంబర్‌2న లాంచ్‌ కానున్న ఈ ఫోన్‌పై  వరుస ట్వీట్లతో మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.  తమ కొత్త డివైస్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ తో స్టన్నింగ్‌ సెల్ఫీలను అందిస్తుందని ప్రకటించిన  ఒప్పో  ధర, స్పెసిఫికేషన్‌ తదితర వివరాలను మాత్రం   ఇంకా సస్పెన్స్‌లోనే పెట్టింది.

భారీ డిస్‌ ప్లేతో రానుందని భావిస్తున్న ఒప్పో 5 ఫోటోను   ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేసింది. అలాగే మూడు వేరియంట్లలో లాంచ్‌ చేస్తున్నట్టు హింట్‌ ఇచ్చింది.  6 అంగుళాల బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లే 4జీబీ, 6 జీబీ ర్యామ్‌తోపాటు,  64 జీబీ స్టోరేజ్‌ దీన్ని 256 జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే సామర్ధ్యంతోపాటు  20 ఎంపీ రియర్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కమెరా ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయని అంచనా. అలాగే మూడు వేరియంట్లలోనూ  అన్‌ లాకింగ్‌ కోసం ఫేషియల్‌ రికగ్నిషన్‌ , రియర్‌ ఫేసింగ్‌ ఫ్రింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ తో రూపొంచిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement