కుటుంబ కలహాలతో తల్లిదండ్రుల ఎడబాటును తట్టుకోలేని తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మండల కేంద్రంలోని చింతవనం కొట్టాలకు చెందిన వ్యవసాయ కూలీ హుస్సేన్, బాబావలి దంపతులు. కుటుంబ కలహాలతో వీరి మధ్య దూరం పెరిగింది....
నార్పల: కుటుంబ కలహాలతో తల్లిదండ్రుల ఎడబాటును తట్టుకోలేని తనయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని చింతవనం కొట్టాలకు చెందిన వ్యవసాయ కూలీ హుస్సేన్, బాబావలి దంపతులు. కుటుంబ కలహాలతో వీరి మధ్య దూరం పెరిగింది. బాబావలి ధర్మవరం వెళ్లిపోయాడు. ఎన్నాళ్లయినా తమను చూసేందుకు తండ్రి తిరిగి రాకపోవడంతో కుమారుడు రజాక్ (18) మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం తల్లి హుస్సేన్ బీ వ్యవసాయ పనులకు వెళ్లగానే రజాక్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు.