ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.
ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శివారులోని చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి.. ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.